Monday, December 31

సూక్తులు - మహాత్ముని బంగారు పలుకులు

ఆత్మార్పణకు,స్వచ్చతకు నిలయం కానప్పుడు స్త్రీకి విలువ లేదు.హక్కులకు వాస్తవమైన మూలాధారం-కర్తవ్య నిర్వహణం.మనం మన కర్తవ్య నిర్వహణ చేసినట్లయితే హక్కులు పొందేందుకు ఎంతో దూరంలో ఉండము.మన విధులు నిర్వర్తించకుండా హక్కుల కోసం పరుగెత్తినట్లయితే అవి మనల్ని దాటి పోతాయి.మనం ఎంతగా వాటిని వెంబడిస్తే అవి అంత త్వరితంగా ఎగిరిపోతాయి.
మీరు పుస్తకాలు పఠించవచ్చు.కానీ అవి మిమ్మల్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేవు.మీలోని ఉత్తమత్వాన్ని బయటికి తేవటమే నిజమైన విద్య అనిపించుకుంటుంది.మానవత్వం అనే పుస్తకం కంటే వేరొక ఉత్తమ గ్రంధం ఏమి ఉంటుంది.ప్రపంచం ఆధిపత్యం వహించిన పటిష్టవంతమైన శక్తి-ప్రేమ.మరియు అది వినయం గల కల్పనా రూపము.ప్రేమ ఎక్కడ ఉంటుందో,దేవుడు కూడా అక్కడే ఉంటాడు. [ఇంకా... ]

చిన్నపిల్లల కోసం - మంచి అలవాట్లు

మనిషికి మాటే అలంకారం.
మాట వెండి, మౌనం బంగారం.
గురువుల మాట వినాలి.
పరనింద పనికిరాదు.
తొందరపడి ఏ పనీ చేయరాదు.
ఆటలాడుచోట, అలుక పూనరాదు.
మంచిని మించిన గుణం లేదు.
ఆడిన మాట తప్పరాదు.
పెద్దలను గౌరవించాలి. [ఇంకా... ]

మీకు తెలుసా - వింత అలవాట్లు

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. అంటే ఒకరి గుణం మరొకరికి ఉండదు. ఒకరికి నచ్చిన వంటకం మరొకరికి నచ్చదు. మరి కొందరిలో ఏదో ఓ వింత గుణం కనిపిస్తుంది. అది ఎదుటి వారికి విచిత్రంగా అనిపిస్తుంటుంది. అయినా వారు తమ అలవాట్లు మానుకోడానికి ఏమాత్రం ఇష్టపడరు. కొందరికి మాట్లాడుతూ అనవసరంగా నవ్వడం, మరికొందరికి ఊరికే ఉమ్ముతుండడం అలవాట్లుగా ఉంటే మరికొందరికి ఊరికే జుట్టు సవరించుకొవడంలాంటి అలవాట్లు ఉంటాయి. ఇంతవరకైతే పరవాలేదు. ఈ అలవాట్లు విపరీత ధోరణికొస్తేనే ప్రమాదం. [ఇంకా... ]

Saturday, December 29

మీకు తెలుసా - ఫొటోగ్రఫీ

ఆంగ్లంలో ఫొటోగ్రఫీ అనే మాటకు 'వెలుతురుతో రాయడం' అనే రెండు గ్రీకు పదాలు మూలమయ్యాయి. చాయా చిత్రానికి రెండు ప్రక్రియలు ఉన్నాయి. మొదటిది ప్రతిబింబాన్ని ఉత్పన్నం చేయడం, రెండవ ప్రక్రియలో ప్రతిబింబాన్ని నమోదు చేయడం. ఈ మొదటి ప్రక్రియ అనేక శతాబ్దాలకు ముందే అంటే ఈ చాయా చిత్ర గ్రహణాన్ని కనుగొనడానికి పూర్వమే మానవాళికి తెలిసింది. 1000, 1267 సం. ప్రాంతంలో అరబ్, ఖగోళ శాస్త్రవేత్తలు సూర్య గ్రహణాన్ని చూడడానికి కెమెరా ఆబ్‌స్క్యూరా అనే విచిత్రమైన ప్రభావాన్ని వాడుకున్నారు. నెమ్మదిగా ఈ కెమెరా ఆబ్‌స్క్యూరా సహాయంతో విభిన్న రీతులలో చిత్రలేఖకులు ప్రతిబింబాన్ని కల్పించుకోసాగారు. కాంతి సూక్ష్మగ్రాహక ద్రవ్యాలు కూడా ఫొటోగ్రఫీని కనుగొనడానికి ముఖ్యాధారమయ్యాయి. [ఇంకా... ]

నీతి కథలు - దేశసేవ

శౌరికి చిన్నతనం నుంచి దేశసేవ చేయాలని కోరిక, వాడు కూడలి దగ్గర పిల్లలకు దేశసేవ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. 'స్వయంగా సంపాదించే మార్గం చూసుకో! నాతో పొలం పనులకు రా!' అంటూ వాడిని కోప్పడేవాడు తండ్రి.. అయితే శౌరికి తండ్రి స్వార్థపరుడిలా కనిపించాడు. ప్రతివాడు దేశం గురించి కూడా ఆలోచించాలి! స్వార్థం మానుకోవాలి! అనేవాడు. కొందరు ఊరి పెద్దలు 'ఇక్కడి మూర్ఖులకు నీ ఉపన్యాసాలు అర్థంకావు'. రాజధానికి వెళ్ళి రాజుగారిని కలుసుకో! అక్కడ నీ శ్రమకి గుర్తింపు లభిస్తుంది! అన్నారు. [ఇంకా... ]

పర్యాటకం - పవిత్ర త్రివేణి సంగమం ప్రయాగ

నదీ నగరికతకు పెట్టింది పేరు భారతదేశం."నది" అంటేనే భారతీయుల్లో ఒక గొప్ప భక్తిభావం ఉంది. అలాంటిది మూడు నదులు సంగమించే త్రివేణి సంగమానికి ఉండే పవిత్రత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరాలు, అధ్యాత్మిక క్షేత్రాలలో అలాంటి విశిష్ట వేడుకలు వచ్చినప్పుడు ఇంక లక్షలాది మంది ఆనందానికి అవధులు ఉండవు. పరమ పవిత్రమైన ప్రయాగ పేరు చెబితే తనువు, మనసు పులకించిపో తాయి. [ఇంకా... ]

Friday, December 28

అందరికోసం - హాస్య సంపద

మాష్టారు: వెయ్యిలోనుండి ఒకటి తీస్తే ఎంత సుశీలా ?
సుశీల:'మూడు సున్నాలు సార్'.

డాక్టర్:
మావారికి పిచ్చికుక్క కరిచింది. మీరు వెంటనే రావాలి.
ఆంది తాయారు కంగారుగా.
మీరేం గాభరా పడకండి నేవచ్చేదాకా మంచం మీదే
పడుకోబెట్టండి అన్నాడు డాక్టర్.
చీ--చీ-- పిచ్చికుక్కని మంచం మీదెలా పడుకోబెడతాం ఆంది తాయారు. [ఇంకా... ]

వ్యక్తిత్వ వికాసం - సంకల్ప శక్తి

ఒట్టు పెట్టటంలోనూ, క్షణమైనా గడవకముందే ఆ ఒట్టును తీసి గట్టుమీద పెట్టడం లోనూ మనం గొప్ప ప్రావిణ్యాన్ని సాధిచాం!! ఒట్టు పెట్టటం సులభమే కానీ దానిని నిలబెట్టుకోవడం చాలా కష్టం. భీష్ముడికి ఉన్నటువంటి సంకల్పశక్తి మనకు కావాలి. ఆయని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిఙ్ఞ చేసి, దానిని శ్రద్దతో ఆచరించి చూపాడు. బలహీనమైన మనస్సు ఉండేవాల్లు ఏదోవక సాకు చెప్పడానికి చూస్తారు. మనస్సు చంచలమైనది, స్వాభావికంగా అశాంతిగా ఉంటుంది. ఎప్పుడూ ఊగిసలాడుతూ క్షణానికి ఒక ఆలోచన చేస్తుంది.  [ఇంకా... ]

మీకు తెలుసా - చీర కథ

చీర అంటే వస్త్రము. వాడుకలో స్త్రీలు మాత్రం కట్టుకునే బట్టకు పర్యాయపదంగా చీర వాడబడుతూంది. చరిత్రకు పూర్వం ఇండస్ వేలీ ప్రాతపు స్త్రీలు ప్రత్తి నూలుతో నేయబడిన బట్టలు ధరించేవారు. ప్రత్తి మరియు పట్టుబట్టల గురించి వేదాలలోను, రామాయణ, మహాభారత కథలలోనూ కూడా చెప్పబడింది. చంద్రగుప్తుని కాలంలో పాటలీపుత్రానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీసు భారత స్త్రీలు ధరించిన వస్త్రాలను గురించి "బంగారు జరీతో విలువైన రాళ్ళు పొదగబడినవి" అని వ్రాశాడు. ప్రాచీన కాలపు చిత్రాలలోను, రాతి విగ్రహాలలోను పలచని చీర మడతలు సూచించబడ్డాయి. [ఇంకా... ]

Thursday, December 27

మీకు తెలుసా - కలంకారీ అద్దకాలు

ఆంధ్ర ప్రదేశ్‌లోని ముఖ్యమైన పరిశ్రమలలో అద్దక పరిశ్రమ చాలా పురాతనమైనది. రాష్ట్రమంతటా వివిధ సాంకేతిక విధానాలను ఉపయోగించి స్థానిక సంప్రదాయానుగుణంగా ఇండిగో ప్రాసెస్ లేక రేసిస్టు స్టైల్, మార్డెంట్ లేక డైడ్ స్టైల్, మొదట చెప్పిన టై అండ్ డై స్టైల్ అని మూడు రకాలుగా ఉంది. గుడారాలకు ఉపయోగించే గుడ్డలపై లైనింగులు, గుమ్మాలకు, కిటికీలకు తెరలు, కిషన్ కవరింగులు మొదలైన వాటిపై అద్దకానికి మార్డెంట్ లేక డైడ్ స్టైల్ ఉపయోగిస్తారు. ఇండిగో రేసిస్ట్ స్టైల్‌నే కలంకారీ అద్దకం అంటారు. కలంకారీ అద్దకాలలో అందమైన అద్దకపు చీరలు, పడక దుప్పట్లు, కర్టెన్లు, బల్లగుడ్డలు అనేక అందమైన డిజైన్లలో లభిస్తున్నాయి. [ఇంకా... ]

సాహిత్యం - ప్రాచీన విద్య

ఆధునిక విద్యాలయాలు ఉన్నత చదువులకంటే ఉన్నతోద్యాగాల దిశగా మాత్రమే విద్య బోధిస్తున్న విషయం తేటతెల్లమైనదే. ముఖ్యంగా టెక్నికల్ విద్య ఈనాడు చూపిస్తున్న ప్రభావానికి ప్రభావితం కాని విద్యార్ధి లేడు. టెక్నికల్ విద్య మాత్రమే తెలివైన విద్య అనే భావన విద్యా వ్యవస్థలో వేళ్ళూనుకుపోవడంతో విద్యార్ధులు ఆ విద్యపట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. తల్లితండ్రులు కూడా తమ బిడ్డలను ఈ విద్యలపట్లే ఆసక్తి పెరిగేట్లు చిన్నతనంనుంచే బోధిస్తున్నారు. టెక్నికల్ విద్య ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు తెచ్చుకోవచ్చనే ఆశ వారిని ఈ విద్యపట్ల ఆసక్తిని పెంపొందింపజేస్తోంది. [ఇంకా... ]

పిల్లల ఆటలు - గెస్ ది లాస్ట్ నెంబర్

ఎంతమంది ఆడవచ్చు : ఆరుగురు.
కావలసిన వస్తువు : న్యూస్ పేపర్లు (ఇంగ్లీషు).
పోటి సమయం : అవసరాన్ని బట్టి.
ఆటగాళ్ల వయస్సు : 6 నుండి 8 సం|| రాల మధ్య .
పిల్లలు దూరం నుంచి వాహనాలను చూసి దాని రిజిస్ట్రేషన్ నంబర్ చివర అంకె సరి సంఖ్యో, బేసి సంఖ్యో చెప్పగలగాలి.  [ఇంకా... ]

Wednesday, December 26

సాహిత్యం - తిట్టు కవిత్వం

లలిత కళలలో అత్యంత విశిష్టమైనది కవిత్వం. ఇది అనేక విధాలుగా రంజింపజేస్తుంది. ఆశుకవిత్వం, చిత్ర కవిత్వం, మధుర కవిత్వం, విస్తర కవిత్వం, శాస్త్ర కవిత్వం, తిట్టు కవిత్వం అను అనేక రూపాల్లో కవిత్వం చెప్పబడుతున్నది. వీటిలో తిట్టు కవిత్వం యొక్క స్థానం ప్రత్యేకమైనది. ఆదికవి వాల్మీకి వాక్కు నుంచి ఆవిర్భవించిన మొట్టమొదటి కవిత్వం తిట్టు కవిత్వం కవిత్వమంటే ఆశ్చర్యం కలగకమానదు.

"మానిషాద ప్రతిష్ఠాం త్వ, మగమ శ్శాశ్వతీ స్సమా:
యత్క్రౌచ మిథునా దేక, మవధీ: కామ మోహితం"  [ఇంకా... ]

నీతి కథలు - అనుభవించని ఐశ్వర్యం

కనకయ్య వొట్టి లోభి, ఎంతో ఐశ్వర్యం వుంది. అయినా తను తినేవాడు గాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. కనకయ్య పీనాసి అని అందరికీ తెలుసు. అయినా ఊరిలోని వారు - ఏ కొంచెమైనా సహాయం చేయక పోతాడా? అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు. సహాయం చేయమని కోరేవారు. కాని కనకయ్య వాళ్ళకు, ఏవేవో సాకులు చెప్పి పంపించేసే వాడు. గడ్డి పరక అంత సాయం కూడా చేసేవాడు గాదు.  [ఇంకా...]

సంస్కృతి, సంప్రదాయాలు - పురాణాలు & ఇతిహాసాలు

"పురాపినవం పురాణం" అన్నారు. అంటే ఎంత ప్రాచీనమైనదైనా కొత్తగా అనిపిస్తుందని దీని భావన. పురాణాలలో భారతీయ ఆత్మ ఉందంటారు. వేద ధర్మాలను ప్రచారం చేయడానికే పురాణాలు వెలువడ్డాయి.
రాణాలు ప్రాచీన విజ్ఞాన సంపుటాలు. ప్రప్రంచం పుట్టుక దగ్గర్నుంచి ప్రపంచంలో మానవుడు నడుచుకోవలసిన విధానందాకా ఎన్నెన్నో విషయాలను పురాణాలు మనకు వివరిస్తాయి. చరిత్ర, భౌగోళికం, పౌర విజ్ఞానం...ఒక్కటేమిటి? ప్రపంచంలో ఎన్ని విభాగాల విజ్ఞానముందో అన్నీ పురాణాలలో కనిపిస్తాయి. ఇక కథలైతే...భారతీయ సాహిత్యంలోని ప్రాచీన గ్రంధాలన్నిటికీ పురాణ గాధలే ఆధారం. [ఇంకా... ]

Monday, December 24

నాటికలు - కిడ్నాప్

{తెర తీయగానే విశాలమైన హాల్ ఉంటుంది. హాల్ మధ్యలో 4 కుర్చీలు, వాటి ముందు ఒక టీపాయ్, దాని మీద కొన్ని పత్రికలు, న్యూస్ పేపర్లు ఉంటాయి. రూంకి ఒక మూల స్టూల్ మీద మంచి నీళ్ళ కూజా ఉంటుంది. హాలుకి కుడి, ఎడమ ద్వారాలుంటాయిధ్ : (కుడి వైపు ద్వారం నుండి నీరసంగా ప్రవేశిస్తాడు. అతని మొహం అలసటగా, బాధగా ఉంటుంది. నీరసంగా వచ్చి ఒక చెయిర్‌లో కూర్చుంటాడు. జేబులోనుంచి కర్చీఫ్ తీసి మొహం తుడుచుకుంటాడు. సెల్ ఫోన్ తీసి ఏదో నంబర్ నొక్కుతాడు.) ఏంటీ, కనిపించలేదా? వాళ్ళ ఇంటికి రాలేదా? ఆ..ఆ.. సరే! సరే! (ఫోన్ జేబులో పెట్టుకుని బాధగా తల పట్టుకుంటాడు) [ఇంకా... ]

వంటలు - నిమ్మ ఉప్పుతో షర్బత్

కావలసిన వస్తువులు:
నిమ్మ ఉప్పు, పంచదార - 2 కప్పులు.
నీరు - 3/4 కప్పు.
మిఠాయి రంగు - 1 స్పూను.
ఎస్సెన్సు (ఏవైన) - 1 స్పూను.

తయారు చేసే విధానం:
ముందుగా 2 కప్పుల పంచదారకు ముప్పావు కప్పు నీరు పోసి తీగ పాకం పట్టాలి. టీ స్పూను నిమ్మ ఉప్పు వేరే గిన్నెలో నీళ్ళు కలిపి, లేతపాకంలో పోసి రెండు మూడు సార్లు కలియబెట్టి దించాలి.  [ఇంకా... ]

సాహిత్యం - నీతి పద్యాలు

తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
తవిలి మృగ తృష్ణ లో నీరు త్రావ వచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు!

చెలిమియు, పగయును, తెలివియు
కలకయు, ధర్మంబు, పాపగతియును, పెంపున్
తులువతనంబును వచ్చును
పలుకుబడిన కాన, పొసగ పలుకగ వలయున్! [ఇంకా... ]

Saturday, December 22

వంటలు - కొబ్బరి పాయసం

కావలసిన వస్తువులు:
కొబ్బరికాయ - ఒకటి.
బియ్యం - ఒక కప్పు.
పంచదార లేదా బెల్లం తురుము - రెండు కప్పులు.
యాలకులు - పది.
జీడిపప్పు - పది.
కిస్‌మిస్ - పది.
నెయ్యి - రెండు స్పూన్లు.

తయారు చేసే విధానం :
బియ్యం కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి. తరవాత కొబ్బరితో కలిపి మెత్తగా పలుచగా దోసెల పిండిలా రుబ్బాలి. [ఇంకా... ]

నీతి కథలు - పిశాచాలు చేసిన సహాయము

అనగనగా అవంతీపురం సమీపములో గల గ్రామములో ఒక ముసలి అవ్వ, మనుమడు ఉన్నారు. అవ్వ అమాయకురాలు. ఇరుగు పొరుగు అవ్వకి మాయమాటలు చెప్పి ఉప్పు, పప్పు తీసుకువెళ్ళేవారు. అవ్వను సుఖపెడదామంటే అవ్వచేసే పనికి మనుమడికి కోపం వచ్చేది. పై పెచ్చు గుట్టుగా సంసారము చేయాలని తెలియదు అనేది. ఒక రోజున అవ్వ ఇల్లు ఊడుస్తూ ఉంటే చిన్న తాళము చెవి దొరికింది. అది తన మనుమడి పెట్టెదని తీసి పెట్టె తాళము తీసి పెట్టెలోపల డబ్బు చూసి అందరిని పిలిచి చెప్పింది. [ఇంకా... ]

వంటలు - క్యాప్సికమ్ బజ్జి

కావలసిన వస్తువులు:
కాప్సికమ్ - అర కేజి.
నూనె - పావు కేజి.
శనగపిండి - పావు కేజి.
మిరప్పొడి - ఒక స్పూను.
జీలకర్ర - ఒక స్పూను.
వంటసోడా - చిటికెడు.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం :
కాప్సికమ్‌లను కడిగిన తర్వాత చాకు తీసుకుని ఒక్కొక్క దాన్ని నాలుగైదు ముక్కలుగా నిలువుగా తరుక్కోవాలి.  [ఇంకా... ]

పొడుపు కథలు - అ నుంచి అః వరకు

అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటిపువ్వులు, అన్ని పువ్వుల్లో రెండేకాయలు?
ఆకాశం, చుక్కలు, సూర్యుడు
అందరాని వస్త్రంపై అన్నీ వడియాలు
నక్షత్రాలు
అంద చందాల వాడు రోజుకో ఆకారం చివరికి నిరాకారం లేదా నిండు సున్న
చందమామ
అక్కడిక్కడబండి, అంతరాలబండి మద్దూరి సంతలో మాయమైన బండి.
సూర్యుడు
అక్కాచెల్లెలి అనుబంధం - ఇరుగూ పొరుగూ సంబంధం దగ్గర వున్నా చేరువ కాలేరు.
కళ్ళు [ఇంకా... ]

Friday, December 21

వంటలు - ఎగ్ పరోటా

కావలసిన వస్తువులు:
గుడ్లు - 2.
ఉల్లిపాయ సన్నగా తరిగినది - 1.
టమోటా - 1.
పరోటా - 2.
మిర్చిపొడి - సరిపడినంత.
ఉప్పు - సరిపడినంత.
జీరా - సరిపడినంత.
మిరియాల పొడి - అర టీ స్పూను.
ధనియాల పొడి - అర టీ స్పూను.
పసుపు - పావు టీ స్పూను.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
కొత్తిమీర తురుము - 1 రెమ్మ.

తయారు చేసే విధానం:
కడాయిలో నూనె వేడి చేసి జీరా, ఉల్లిపాయలు, టమోటాలు వరుసగా వేసి వేగనివ్వాలి.  [ ఇంకా...]

వంటలు - పొట్లకాయ పెరుగుపచ్చడి

కావలసిన వస్తువులు:
పొట్లకాయ (మీడియం సైజు) - 1.
పెరుగు - 100 గ్రా.
పచ్చిమిర్చి - 7.
కందిపప్పు - 1 టీ స్పూను.
మినపప్పు - 1 టీ స్పూను.
చింతపండు - కొద్దిగా.
ఉప్పు - సరిపడినంత.
పసుపు - అర టీ స్పూను.
జీలకర్ర - అర టీ స్పూను.
వెల్లుల్లి - 4 రెమ్మలు.
రిఫైండ్ ఆయిల్ - కొద్దిగా.
పోపు దినుసులు - కొద్దిగా.

తయారు చేసే విధానం :
పచ్చిమిర్చి, కందిపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిలను కళాయిలో దోరగా వేయించి చింతపండుతో సహా మిక్సీ వేయాలి.  [ ఇంకా...]

నీతి కథలు - తగని గర్వం

చీమలు దూరని చిట్టడవిలో ఓ సింహం ఉంటూ ఉండేది. సహజంగానే బలపరాక్రమాలున్న జంతువు. మంటకు గాలి తోడైనట్లు సింహానికి అంతులేని అహంకారము ఉంది. అడవిలో బ్రతికే తదితర మృగాలన్నిటి చేతా అడ్డమైన చాకిరీ చేయించేది. సింహం ఆడిందే ఆట, పాడిందే పాట. ఇలా ఉండగా చిట్టడవికి చెప్పలేనంత కరువొచ్చింది. ఆ కరువుకి తట్టుకోలేక మృగాలన్నీ తలో దోవా పారిపోయాయి. మృగాలకి రాజయితే మాత్రం సింహానికి తిండితిప్పలు ఎక్కడివి? బెట్టుగా అక్కడే కొన్నాళ్ళ పాటు నీల్గుతూ ఉంది. కాని, అది ఆఖరికి కాకులు దూరని కారడవికి ప్రయాణమై వెళ్ళింది.  [ ఇంకా...]

పర్యాటకం - సెవెన్ వండర్స్ - గ్రేట్ వాల్ ఆఫ్ చైనా

ప్రపంచ వ్యాప్తంగా శుభదినంగా భావించిన 07-07-07 నాడు ఏడు ప్రపంచ వింతలను అనధికారికంగా ప్రకటించారు. ఓటింగ్ ద్వారా జరిగిన ఎంపికలో పాతవాటిలో ఉన్న మన 'వాహ్ తాజ్ 'తో పాటు 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ', రోమన్ కలోసియంకు మళ్ళీ స్థానం దక్కింది. ఈ కొత్త ఏడు వింతలు ఇలా ఉన్నాయి.
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా
పెట్రా(జోర్డాన్)
ద స్టాట్యూ ఆఫ్ క్రైస్ట్ రిడీమర్(బ్రెజిల్)   [ ఇంకా...]