Wednesday, January 30

పిల్లల పాటలు - పూ, చిలుకలు

రంగు రంగుల పూవులోయ్
కమ్మ కమ్మని తావులోయ్
వన్నెవన్నెల చిలుకలోయ్,
సీతాకోక చిలుకలోయ్.
అందమంటే వానిదే,
స్నేహమంటే వానిదే. [ఇంకా... ]

Monday, January 28

వ్యక్తిత్వ వికాసం - సారాంశం

ప్రతికూలతే నా గురువు - అందమే నా ఆభరణం
అంతరాత్మ నా మార్గదర్శి - కష్టమే నా ఉత్తేజం
అనుభవమే నా పాఠశాల - నమ్మకం నా పునాది
దేవుడు నా తండ్రి - ఆరోగ్యం నా భాగ్యం

ఆత్మావలోకనం నా ప్రోత్సాహం - ఆనందం నా మందు
విద్య నా సంపద - ప్రేమ నా చట్టం
తల్లి నా దైవం - ప్రకృతి నా సహచరుడు
అవరోధాలు నా పాఠాలు - ప్రార్థన స్వర్గానికి నా బాట [ఇంకా... ]

పిల్లల పాటలు - చుక్ చుక్ రైలు

చుక్ చుక్ రైలు వస్తోంది.
దూరం దూరం జరగండి.
ఆగగానే ఎక్కండి.

జోజో పాపా ఏడవకు
నాన్నగారు వస్తారు
లడ్డు మిఠాయి తెస్తారు
నీకు నాకు ఇస్తారు. [ఇంకా... ]

Friday, January 25

వంటలు - పండు మిరపకాయల పచ్చడి

కావలసిన వస్తువులు:
పండు మిరపకాయలు - 1 కిలో.
ఉప్పు - డబా మీద కొంచెం.
చింతపండు - 1/4 కిలో.

తయారు చేసే విధానం :
పండుమిరపకాయలు శుభ్రంగా తుడిచి ఉప్పు, చింతపండు, పండుమిరపకాయలు కలిపి గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బవలెను, దీనిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. [ఇంకా... ]

నీతి కథలు - గాండ్రించిన కప్ప

పుట్టలు, గుట్టలు దాటుకొంటూ సింహం హడిలి పోతూ తన గుహలోకి వచ్చేసింది. సింహం గాబరాను గమనించిన నక్క, గబగబా వచ్చి సింహం అంతగా భయపడడానికి కారణం ఏమిటని అడిగింది. సింహం, ఆయాసంతో వొణుకుతూ చెప్పింది.
"మామూలుగా కొలనులో మంచి నీళ్ళు తాగి గట్టు ఎక్కాను. అంతలో పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. గుర్, గుర్...పువ్వాం పువ్వాం... బెకా బెకా మంటూ హొరెత్తిన ఆ అరుపులు వింటే ఎంతో భయం వేసింది, అటూ ఇటూ చూశాను...ఎవ్వరూ కనపడలేదు సరిగదా! ఆ అరుపులు ఇంకా భయంకరంగా పెరిగి పోతున్నాయి. [ఇంకా... ]

వంటలు - పాపిడి

కావలసిన వస్తువులు:
పంచదార - 1 కిలో.
మైదా - 1/2 కిలో.
నెయ్యి - పావు కిలో.
నిమ్మకాయ - అర చెక్క.
నీళ్ళు - 2 కప్పులు.

తయారుచేసే విధానం:
బాగా మందం గల గిన్నెలో పంచదార, నీళ్ళు, నిమ్మరసం పిండి పొయ్యి మీద పెట్టి పాకం వచ్చేదాకా ఉంచి గిన్నెను దించి పాకాన్ని గరిటెతో చల్లార్చాలి. ఇలా పాకం చల్లారేటప్పుడు ముద్దలా అవుతూ సాగే గుణం కలిగి ఉంటుంది. [ఇంకా... ]

తెలుగు బిడ్డలు - అల్లూరి సీతారామ రాజు

పేరు
అల్లూరి సీతారామరాజు.

తండ్రి పేరు
శ్రీ వెంకట రామరాజు.

తల్లి పేరు
శ్రీమతి సూర్యనారాయణమ్మ.

పుట్టిన తేది
4-7-1897.

పుట్టిన ప్రదేశం
కృష్ణా జిల్లాలోని భీమవరంకు ఆరు మైళ్ళ దూరంలో మోగల్లు అనే గ్రామంలో జన్మించాడు.

చదివిన ప్రదేశం
రాజమండ్రి, నర్సాపురం, కాకినాడ.

చదువు
నాల్గవ ఫారం.

గొప్పదనం
బ్రిటీషు వారిని ఎదిరించి దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు.

స్వర్గస్తుడైన తేది
7-5-1924.

నేటి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం తాలూకా, నాడు కృష్ణాజిల్లా లోనిది. భీమవరంకు ఆరు మైళ్ళ దూరంలో మోగల్లు అనే గ్రామం వుంది. ఆ గ్రామమే రామరాజు స్వగ్రామం. సీతారామరాజు ముత్తాత గోపాల కృష్ణం రాజు. తాత వెంకట కృష్ణం రాజు. సూర్యనారాయణమ్మ పూర్వీకులు అనకాపల్లి దగ్గర "పాండ్రంకి"లో స్థిరపడిపోయారు.[ఇంకా... ]

Thursday, January 24

వంటలు - బాదుషా

కావలసిన వస్తువులు:
మైదా - 500 గ్రా.
డాల్డా - 200 గ్రా.
తినేసోడా - అర టీ స్పూను.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
చక్కెర - 750 గ్రా.
యాలుకల పొడి - 1 టీ స్పూను.
నెయ్యి - 10 గ్రా.
నీళ్లు - అర లీటరు.

తయారు చేసే విధానం:
గిన్నెలో మైదా, సోడా, డాల్డా, తగినన్ని నీళ్లు వరుసగా కలిపి మిశ్రమాన్ని ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండ తీసుకుని దాన్ని గుండ్రంగా చేసి మధ్యలోకి నొక్కి బాండీలోని నూనెలో దోరగా వేయించి పెట్టుకోవాలి. [ఇంకా... ]

శతకాలు - నారాయణ శతకము

నమామి నారాయణ పాద పంకజం
వదామి నారాయణ నామనిర్మలం
భజామి నారాయణ తత్త్వమవ్యయం
కరోమి నారాయణ పూజనం సదా

ఆలోక్య సర్వ శాస్త్రాణి
విచార్యచ పునః పునః
ఇదమేకం సునిశ్హ్పన్నం
ధ్యాయేన్నారాయణం సదా

శ్రీ రమా హృదయేశ్వరా
భక్త జన చిత్త జలరుహ భాస్కరా
కారుణ్య రత్నాకరా
నీవె గతి కావవే నారాయణా [ఇంకా... ]

Tuesday, January 22

ఆహార పోషణ - కండ్లను కాపాడుకోండి

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మంచినీటితో కండ్లను శుభ్రం చేసుకోవాలి.
ముఖం కడుక్కునేటప్పుడు ఎవరి తువ్వాలును వారే ఉపయోగించాలి.
మండుటెండ, దుమ్ము, పొగనుండీ కళ్ళను కాపాడుకోవాలి. సూర్య గ్రహణాన్ని చూడాలనుకునేవారు నల్లటి కళ్ళజోడును తప్పనిసరిగా ధరించాలి.
పుస్తకం చదువుతున్నప్పుడు పుస్తకాన్ని కంటి నుండి ఒకటిన్నర అడుగు దూరం ఉంచి చదవాలి. ఎడమచేతి పక్కనుండి వెలుతురు పడేలా చూడాలి.
మసక వెలుతురులోనూ, జారగిలపడినప్పుడు, ఆనుకున్నప్పుడు పుస్తకం చదవరాదు.[ఇంకా... ]

భరతమాత బిడ్డలు - అంబేద్కర్

పేరు
డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్.
తండ్రి పేరు
రాంజీ శక్ పాల్.
తల్లి పేరు
(తెలియదు).
పుట్టిన తేది
14-4-1891.
పుట్టిన ప్రదేశం
"మే" అనే గ్రామంలో (మహరాష్ట్రం) లో జన్మించాడు.
చదివిన ప్రదేశం
బొంబాయి.
చదువు
న్యాయశాస్త్రంలో డిగ్రీ.
గొప్పదనం
అస్పృశ్యలతో సహ నిమ్నజాతుల వారందరి నిమిత్తం కృషి చేశారు.
ప్రారంభించిన పత్రిక
మూక్ నాయక్.
స్వర్గస్తుడైన తేది
1956.
భారత జాతీయ సాంఘీకోద్యమ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్ కి విశిష్టమైన స్థానం ఉంది. భారత రాజ్యంగ నిర్మాతగా ఆయన చేసిన కృషి అభినందనీయం. మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి సర్వసమానత్వం కొరకు కృషిచేసిన కారణజన్ముడు అంబేద్కర్. అస్పృశ్యతా నిర్మూలనలను ఒక మహోద్యమాన్నిగా నిర్వహించి, దేశవ్యాప్తంగా దళితులలో సాంఘిక,రాజకీయ, విద్యా చైతన్యాన్ని కలిగించిన ఘనత ఒకే ఒక వ్యక్తికి దక్కింది.[ఇంకా... ]

Monday, January 21

వంటలు - వెజిటబుల్ స్టెప్ బిర్యాని

కావలసిన వస్తువులు:
బాసుమతి బియ్యం - 500 గ్రా.
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 30 గ్రా.
ఉల్లిపాయలు (వేయించినవి) - 1 కప్పు.
గరంమసాలా పొడి - 1 టీ స్పూను.
యాలుకుల పొడి - 1 టీ స్పూను.
ఉప్పు - సరిపడినంత.
మిర్చి పొడి - 1 టేబుల్ స్పూను.
పచ్చిమిర్చి పేస్ట్ - 1 టేబుల్ స్పూను.
పెరుగు - 200 గ్రా.
పుదీనా - పావుకప్పు.
కొత్తిమీర (తరిగినది) - 1 కట్ట.
పసుపు - అర టీ స్పూను.
పాలు - పావు లీటరు.
నెయ్యి - 100 గ్రా.
రిఫైండ్ ఆయిల్ - 100 గ్రా.
క్యారెట్ (స్లైసులు) - 1.
టమోటా (స్లైసులు) - 1.
దోసకాయ (స్లైసులు) - 1.
ఖాజూ - 50 గ్రా.
గరంమసాలా పొడి చేయనివి - 5 గ్రా.

తయారు చేసే విధానం :
ఒక గిన్నెలో పెరుగు, అన్ని మసాలాలు (గరం మసాలా కు ఉపయోగించే పదార్ధాలు పొడి చేయనివి తప్ప) వేసి పాలు పోసి కలుపుకోవాలి. దాంట్లో కొద్దిగా నూనె వేసి కలిపి పక్కనే పెట్టి దానిపై కట్ చేసి ఉంచిన కూరగాయముక్కలు పర్వాలి.[ఇంకా... ]

ఆధ్యాత్మికం - ఆంజనేయ నామమహిమ

ఆంజనేయుని జనన మెప్పుడు?
వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే!
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే||
ఆంజనేయులవారు వసంతఋతువు, వైశాఖ మాసంబు కృష్ణపక్షంలో దశమి తిధీ, శనివారము నాడూ, పూర్వాభాధ్రా నక్షత్రమున, వైధృతౌ మధ్యాహ్న కాలమున అంజనీదేవికి ఉదయించెను.
రామాయణ రసాత్మక కావ్యమునకు రమణీయ మంత్రం ఆంజనేయుడు. ఈతడు అంజనాదేవి కేసరుల ముద్దుబిడ్డ. సదా రామనామామృతపాలన సేవితుడై గంధమాధశైలి యందు వసించు చిరంజీవి, ఆంజనేయ నామమహిమ అనితరమైనది. అంజనాదేవి అనునామమున ఆద్యాంతా దక్షరములు గ్రహించిన 'ఆన" అగును. [ఇంకా... ]

Saturday, January 19

వంటలు - బనానా పుడ్డింగ్

కావలసిన వస్తువులు:
వెన్న - 60 గ్రా.
పంచదార - 60 గ్రా.
గోధుమపిండి - 60 గ్రా.
అరటి పండ్లు - 2.
పాలు - 3/4 కప్పు.
గ్రుడ్లు - 2.

తయారు చేసే విధానం:
ముందుగా వెన్న, గోధుమపిండి, పాలు, బాగా చిలకాలి. సన్నని సెగపై బాగా చిక్కగా ఉడకనివ్వాలి. గ్రుడ్లు పగులగొట్టి పచ్చ సొనను ఉడికిన పిండిలో దించిన తరువాత కలపాలి. మరల బాగా చిలకాలి. [ఇంకా... ]

నీతి కథలు - కట్టెలు కొట్టువాడు - బంగారు గొడ్డలి

కట్టెలు కొట్టువాడు కట్టెలు కొట్టుచుండగా వాని గొడ్డలి జారి ప్రక్కనే వున్న నదిలో పడిపోయెను. తన జీవనాధారమైన గొడ్డలి పోయినదని అతడు వల వల ఏడ్చుచూ నది ఒడ్డున కూర్చుండెను.
అతని దు:ఖమును చూచి ఆ నది దేవత ప్రత్యక్షమై ఏమి జరిగినదని అడిగి తెలుసుకొని నది దేవత వెంటనే నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చిచూపెను. ఇది నాదికాదనెను. దేవత తిరిగి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చెను. [ఇంకా... ]

వ్యక్తిత్వ వికాసం - కఠోర పరిశ్రమతోనే కలల సాఫల్యం సాధ్యం

మనము పని చేస్తేనే తప్ప ఏ విశిష్టతనీ సాధించలేము. కఠోరమైన పరిశ్రమ లేకుండా కలలు ఎన్నటికీ నిజంకావు. మనశేస్త్రాలలో ఇలాచెప్పబడినది. "కష్టపడి పనిచేసే వాణ్ణీ అద్రుష్టం వరిస్తుంది.బలహీన మైన మనస్సు కలవాళ్ళు మాత్రమే 'విధి తెచ్చిపెడుతుంది ' అని అనుకొంటారు. వట్టికోరికలే పనులను సాధించవు. ఒళ్ళు దగ్గరపెట్టుకొని, కష్టపడి పని చేయడం వల్లనేపనులు జరుగుతాయి, లక్ష్యాలు సాధించబడతాయి. నిద్రపోతున్న సిం హం నోటిలోకి జింక వచ్చిదూరదుకదా! [ఇంకా... ]

Friday, January 18

పిల్లల ఆటలు - మెమరీ గేమ్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమంది అయినా.
ఆడే స్థలం : గదిలో గాని, ఆరుబయట గాని.

కావలసిన వస్తువులు : 15 వస్తువులు, పేపరు ప్లేట్లు, కర్చీఫ్‌లు.
ఆటగాళ్ల వయస్సు : ఏ వయసు వారైనా.

ఈ గేమ్‌కి మొదట 10 మంది 15 వస్తువులను రెండు చొప్పున తీసుకోవాలి. ఒక్కొక్క పేపర్ ప్లేట్‌లో ఒక్కొక్క వస్తువు చొప్పున పెట్టి టేబుల్ మీద పెట్టి ఎరేంజ్ చేసి వాటిమీద కర్చీఫ్ కప్పి ఉంచాలి. ఇప్పుడు అన్ని వస్తువులు రెండింటిలో ఒకటి ప్లేట్స్‌లో ఉన్నాయి. మిగిలిన వాటిని ఒక బౌల్‌లో వేసి ప్రక్కన చైర్‌లో పెట్టండి. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచి టేబుల్ దగ్గర నుంచోమనండి. వారిని కర్చీఫ్స్‌ని తీసి అన్ని వస్తువులను ఒక్కసారి చూపించి మళ్ళీ యధావిధిగా కర్చీఫ్స్ కప్పేయండి. వారు చేయవలసినది బౌల్‌లో ఒక వస్తువు తీసుకొని ఏ ప్లేటులో అయితే ఆ వస్తువు ఉందో గుర్తుంచుకొని ఆ ప్లేట్‌లో కర్చీఫ్ మీద పెట్టాలి. [ఇంకా... ]

లాలి పాటలు - మా పాప మామల్లు

మా పాప మామల్లు మత్స్యావతారం
కూర్చున్న తాతల్లు కూర్మావతారం
వరసైన బావలు వరాహవతారం
నట్టింట నాయత్త నరశింహావతారం
వాసిగల బొట్టెల్లు వామనావతారం
పరమ గురుదేవ పరశురామావతారం
రక్షించు రామయ్య రామావతారం
బంటైన బంధువులు బలభధ్రావతారం[ఇంకా... ]

Thursday, January 17

అందరి కోసం - జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు

బారసాల
బారసాల అంటే
దీనిని అసలు బాల సారె అంటారు. అది వాడుకలోకి వచ్చే సరికి బారసాల అయినది. అసలు బారసాల అంటే పేరు పెట్టటం లేదా నామకరణం చేయటం అని అర్థం.

ఎందుకు చేస్తారు
పుట్టిన బాబుకో లేదా పాపకో పేరు పెట్టటానికి చేస్తారు.

ఎప్పుడు చేస్తారుపుట్టిన 11 వ రోజు నుండి 27 వ రోజు లోపల చేస్తారు. ఈ రోజులలో 11, 21, 27 రోజులలో చాలా మంది చేస్తారు, అలానే బేసి సంఖ్యలు వచ్చే ఏ రోజైనా చేసుకోవచ్చు. ఈ రోజులలో చేసేటట్లైతే మంచి రోజులు చూసుకో నవసరం లేదు. అప్పుడు కుదరక పోతే పాపో, బాబో పుట్టిన 3 నెలల్లో చేస్తారు కానీ వీలుంటే నెలలోపల చేస్తేనే మంచిది.[ఇంకా... ]

Wednesday, January 16

అందరికోసం - హాస్య సంపద

గాడిదెక్కాలని
చూశావే సుబ్బులూ వీడికి గాడిదెక్కాలని వుందట అన్నాడు కొడుకును ఆడిస్తూ సత్యం.
"అలాగా అయితే మీ వీపుమీద కూర్చొబెట్టుకోండి వంట గదిలోంచి చెప్పింది సుబ్బులు".

మొక్కు
ఏమిట్రా హరి అంతలా జుట్టు పెంచుతున్నావు? మొక్కా! సందేహంగా అడిగాడు సురేంద్ర.
మొక్కా పాడా? మా ఆవిడ సవరం కట్టించుకుంటదట తాపీగా చెప్పాడు.

క్రమశిక్షణ
ఏరా రవీంద్రా క్రమశిక్షణ అంటే ఏమిట్రా?
ఒక్కొక్కరిని శిక్షించడం సార్. [ఇంకా... ]

ఆధ్యాత్మికం - బ్రహ్మచర్యం

బ్రహ్మచర్యం వల్ల అమృతత్వాన్ని పొందవచ్చని విష్ణుపురాణం చెబుతుంది. బ్రహ్మచర్యం గొప్ప సాధన. ఈ లోకంలో ఆత్మగౌరవంతో జీవించాలన్నా బ్రహ్మచర్యం చాలా అవసరం. గోవిందాలయ అర్చకులు మొదట్లో బ్రహ్మచారులుగా ఉండినారట. ఒకరోజు వాళ్ళకు రాజునుంచి పిలుపు వచ్చిందట. "రాజి పిలిస్తే రావడానికి మేమేమైనా ఆయన కింకరులమా? మాతో ఏమైనా పని వుంటే ఆయన్నే ఇక్కడికి రమ్మనండి" అని వారు చాలా ధీటుగా జవాబిచ్చారట. [ఇంకా... ]

Monday, January 14

వంటలు - మసాల బీన్స్

కావలసిన వస్తువులు:
సోయా చిక్కుళ్ళు - 150 గ్రా.
ఉల్లిపాయలు - 80 గ్రా.
టమాట - 40 గ్రా.
వెల్లుల్లి - 20 గ్రా.
అల్లం - 10 గ్రా.
పచ్చి మిర్చి - 5 గ్రా.
పసుపు - 5 గ్రా.
ఛాట్ మసాలా - 5 గ్రా.
రిఫైండ్ ఆయిల్ - 5 మి.లీ.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:
సోయా చిక్కుళ్ళను శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా నానబెట్టి ఆపై కుక్కర్ లో పది నిమిషాలు ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, టమాట, ఉల్లిపాయలు, పచ్చి మిర్చిలను సన్నగా తరిగిపెట్టుకోవాలి.[ఇంకా... ]

వ్యక్తిత్వ వికాసం - ఈ ఘనులందరూ వికలాంగులే

అన్ని అవయవాలూ సక్రమంగా ఉంటే అన్నీ సాధించవచ్చు, ఆకాశపు అంచులను అలవోకగా స్పృశించవచ్చు అనుకునే వారితో చాలెంజ్ చేస్తూ మేమూ తక్కువ వారివేమీ కాదు, మీతో పోటీ పడతాం, మిమ్మల్ని అధిగమిస్తాం అంటూ ముందుకు దూసుకుపోతున్నారు వికలాంగులు. వైకల్యాన్ని అధిగమిస్తూ వివేకంతోనూ, తీవ్ర శ్రమతోనూ అత్యధిక విజయాలను సాధిస్తున్న వీరు తాము వికలాంగులమే అన్న విషయాన్నే మరచిపోతున్నారు. స్వేచ్చగా, సంతోషంగా జీవితపు ఆనందపు రుచులను ఆస్వాదిస్తున్నారు. మనోబలమే మహాశక్తిగా చరిత్ర సృష్టించిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరి గురించి తెలుసుకుందాం. [ఇంకా... ]

Saturday, January 12

పిల్లల ఆటలు - చికు చికు పుల్లాట

ఆడేవారు : ఇద్దరు.
ఆటస్థలం : ఆరుబయట ఇసుక ఉన్న చోట.
ఇసుక ఉన్న చోట కూర్చొని ఆడే ఆట ఇది. చిన్న చీపురు పుల్లని విరచి దాన్ని అరచేతిలో పెట్టుకొని ఇసుకలో దాచేయ్యాలి. పుల్ల ఇసుకలో పెడుతూ ఇలా పాడాలి. "చికు చికు పుల్లా చికారు పుల్ల దానిమ్మ చెట్లో దాక్కో పుల్ల". [ఇంకా... ]

నీతి కథలు - సాధువుగామారిన దొంగ

ఒక రోజు రాత్రి ధనవంతునికి చెందిన తోటలో కాయలు దొంగిలించడానికి దొంగ వచ్చాడు. తోటలోని కొన్ని కాయలు కోసాడు. ఆ అలికిడికి తోటలో నౌకర్లు లేచి దివిటీలు వెలిగించి తోటంతా వెతికారు. దొంగతనానికి వచ్చిన ఆ దొంగ పట్టుబడకుండా తప్పించుకోవాలని ఒంటికి విభూది రాసుకొని చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక చెట్టు కింద కూర్చొని సాధువులాగా కొంగ జపం చేయసాగాడు. నౌకర్లు దొంగను పట్టుకోలేక పోయారు. కానీ ఆ తోటలో జపం చేసుకుంటున్న ఆ సన్యాసిని చూసి వారు చాలాచాలా సంతోష పడ్డారు. [ఇంకా... ]

Friday, January 11

పిల్లల పాటలు - పప్పు పెట్టి పాయసం పెట్టి.....

పప్పు పెట్టి పాయసం పెట్టి
అన్నం పెట్టి అప్పచ్చి పెట్టి
కూర పెట్టి ఊరగాయ పెట్టి
నెయ్యి పోసి ముద్ద చేసి
ముద్దు చేసి తినిపించి
చేయి కడిగి న్మూతి కడిగి
తాతగారింటికీ దారేదండి
అత్తారింటికి దారేదండి [ఇంకా... ]

వంటలు - కోకోనట్ ఖీర్

కావలసిన వస్తువులు:
పాలు - 3 లీటర్లు.
పాలకోవా - 150 గ్రా.
పచ్చి కొబ్బరి చిప్పలు - 2.
పంచదార - 6 స్పూన్లు.
బాదం పప్పు, జీడి పప్పు , పిస్తా పప్పు.

తయారు చేసే విధానం:
ముందుగా కొబ్బరి తురుము కోవాలి. పాలు తీసుకోవాలి. మందపాటి గిన్నెలో పాలు పోసి, కొబ్బరి పాలు పోసి చక్కగా ఉడికించాలి. [ఇంకా... ]

మీకు తెలుసా - సాలగ్రామము

సాలగ్రామము విష్ణుప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వ్యావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. [ఇంకా... ]

Thursday, January 10

నీతి కథలు - సత్యమేవ జయతే

బోధిసత్వుడు సేరివనే రాష్ట్రంలో సేరివ అనే పేరుతో వర్తకుడిగా ఉంటున్నాడు. అదే పేరుకల మరొక వర్తకుడితో కలసి వ్యాపారానికి బయలుదేరి ఆంధ్రపురానికి చేరుకున్నాడు. వాళ్ళిద్దరిదీ ఒకటే వ్యాపారం కనుక వారి మధ్య ఘర్షణ ఉండకుండా యిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. నగర వీధులలో సగం ఒకరివి, మిగిలిన సగం వీధులు రెండో వారివి. ఒకరొక వీధికొకసారి వెళ్తే తరువాత రెండవ వారు ఆ వీధిలో తాను కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఇదీ ఒప్పందం. [ఇంకా... ]

వంటలు - మామిడితో రుచికరమైన పదార్ధం

కావలసినవి:
మామిడి పండ్లు - 1/2 కిలో
పాలు - 200 గ్రాములు
నారింజ పండ్ల పానీయం లేక నిమ్మరసపు బొట్లు - 2
మీగడ మరియు చక్కెర - 6 ఔన్సులు

చేసే విధానం:
మామిడి పండ్ల రసాన్ని ఒక మిక్చ్సర్‌లో పోయండి. చక్కెర మరియు నారింజ, నిమ్మ రసాలను వేడినీటిలో చేర్చండి. [ఇంకా... ]

మీకు తెలుసా - కల్తీలను కనిపెట్టండి

ఆహార వస్తువులను కల్తీ చేయడం నేరం. కల్తీ పదార్ధాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఖనిజ తైలంతో కల్తీ చేసిన ఆవ నూనును ఉపయోగించిన వ్యక్తికి కంటిదృష్టి పోవచ్చు లేక గుండె జబ్బు రావచ్చు. సున్నితమైన రంపపు పొట్టుతో కల్తీ చేసిన మిరపకాయల పొడి తిన్న వారికి ఆరోగ్యం చెడిపోతుంది. అదేవిధంగా కల్మషమైన నీటితో కల్తీ చేసిన పాలు త్రాగిన బిడ్డ బాధపడుతుంది. ఈ కల్తీలను ఇంట్లో పరీక్షల ద్వారా సులభంగానే కనిపెట్టవచ్చు. [ఇంకా... ]

Wednesday, January 9

నీతి కథలు - ప్రజ్ఞాశాలి

అనగనగా ఒక రాజు. అతని దగ్గర బాగా డబ్బుంది. దాచడం కోసం ఒక శిల్పిని పిలిచి, రహస్య ధనాగారం ఏర్పాటు చేయించాడు. దానికున్న రహస్యద్వారం కూడా ఇతరులకు తెలియనివ్వలేదు. దీనిని నిర్మించిన శిల్పి మాత్రం తక్కువ వాడా? పిసినారి రాజుకు తగ్గవాడే! రాజుకు తెలీయకుండా గోడకు అమర్చిన రాతి పలకల్లో ఇంకో రహస్య మార్గం ఏర్పాటు చేసి, పోయే ముందు కొడుకులిద్దరికీ దాని సంగతి చెప్పి కన్ను మూశాడు. డబ్బు కావలసినప్పుడు. వాళ్ళిద్దరూ, ఆ మార్గం వాడుకొనేవారు. అసలే పీనాసి రాజు. రోజూ డబ్బును తనివి తీరా చూచుకొనే గుణం ఉండడంవలన ధనం మాయం కావడం గమనించాడు. [ఇంకా... ]

మీకు తెలుసా - సంధ్యా వందనం

సంధ్యా వందనమనగా సంధియందు (పగలు రాత్రియు కలసియున్న సంధికాలము) చేయదగినది. సంద్యావందనము చేయకూండా యితర కర్మలను చేయరాదు. సంధ్యా వందనము రోజునకు మూడుసార్లు చేయవలెను. రోజులో మొదటిసారి సంధ్యా వందనము రాత్రి యెక్క చివరిభాగము నక్షత్రములు ఉండగా చేయుట. నక్షత్రములు లేకుండా చేయుట మధ్యమము. సూర్యోదయమైన తరువాత చేయుట అధమము. కాని మనము సూర్యోదయమైన తరువాత చేయుట ఆచారముగా వచ్చుచున్నది. [ఇంకా.. ]

Tuesday, January 8

వంటలు - తొక్కుడు లడ్డు

కావలసిన వస్తువులు:
శనగపిండి - 1/2 కిలో
పంచదార - 2 గిద్దలు
డాల్డా - 1/2 గిద్ద
షోడా ఉప్పు - చిటికెడు
నూనె - వేయించడానికి సరిపడినంత.
యాలుకల పొడి - పావు స్పూన్.
జీడి పప్పు (కాజు) - సరిపడినన్ని.

తయారు చేసే విధానం:
శనగపిండిలో షోడా ఉప్పు, కొంచెం నూనె, నీళ్ళు పోసి చక్రాల పిండిలా కలపాలి, తరువాత వాటిని చక్రాలులా వండాలి. అవి లేత రంగులో ఉండేలా చూడాలి. వీటిని తరువాత మిక్సీలో వేసి మెత్తగా పిండిలా చేసుకోవాలి. తరువాత ఒక డబ్బా పంచదారలో కొద్దిగా నీరు పోసి తీగపాకం వచ్చిన తరువాత ఈ పిండి పోసి కలపెట్టాలి. [ఇంకా... ]

మీకు తెలుసా - కానుకలు

ఆప్తులకు కానుకలివ్వడం అనాదిగా వస్తున్న సంప్రదాయమే. దీని పుట్టుపూర్వోత్తరాలకు ప్రత్యేక కథ ఏమీ లేదనే చెప్పవచ్చు. వస్తు మార్పిడి విధానం నాటినుండే ఈ కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం అనే సంప్రదాయం ఉండిఉండొచ్చు. కరెన్సీ చెలామణీ లేని రోజుల్లో బార్టర్ సిస్టం (వస్తు మార్పిడి విధానం) ద్వారా ఒకరికొకరు వస్తువులను ఇచ్చిపుచ్చుకునేవారు. ఒకరి ఇంటిలోని వస్తువూల్ను వేరొకరికి ఇవ్వడం ద్వారా ఈ ఇతరులనుండి తమకు కావలసిన వస్తువూలను పొందేవారు. ఆ వస్తు మార్పిడే కానుకగా రూపాంతరం చెందిందనవచ్చు. [ఇంకా... ]

Monday, January 7

మీకు తెలుసా - ఫ్లారెన్స్ నైటింగేల్

19వ శతాబ్దపు మహిళలల్లో ఫ్లారెన్స్ నైటింగేల్ పేరు అత్యంత ప్రసిద్ధమైంది. ఒక నీచమైన పనిగా భావించబడే రోగి సంరక్షణను (నర్సింగ్) గౌరవప్రదమైన వృత్తి స్థాయికి మార్చిన విఖ్యాతురాలు ఆమె. ఫ్లారెన్స్ నైటింగేల్ దక్షిణ ఐరోపాలోని ఇటలీలో ఒక సంపన్న కుటుంబంలో 1820 మే 12న పుట్టింది. కేంబ్రిడ్జి విద్వాంసుడైన తండ్రి వద్ద ఈమె విద్యను అభ్యసించింది. ఫ్లారెన్స్ నైటింగేల్ చురుకుగా, ఆకర్షణీయమైన మహిళగా పెరిగింది. 1850లో ఐరోపాలో చాలా ఆసుపత్రులను చూసే అవకాశం ఆమెకు కలిగింది. [ఇంకా... ]

Saturday, January 5

వంటలు - పూరి

కావలసిన వస్తువులు:
గోధుమపిండి - అరకిలో
వెన్న - 10 - 15 గ్రా||
పాలు - 25 మిల్లీ
నూనె - కిలో
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం :
పూరీలు కూడా చపాతీల మాదిరే చేసుకోవాలి. చపాతీల పిండికన్నా పూరీపిండి యొక్కువసేపు నానాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - ఇసుకలో పోటీ

ఎంతమంది పాల్గొనవచ్చు : 5
ఆడే స్థలం : నదీతీరాలలో, ఆరుబయట
కావలసిన వస్తువులు : ఇసుక
ఆటగాళ్ళవయస్సు : 4 నుండి 6 సంవత్సరాలు
పోటీ సమయం : 2 నిమిషాలు
ఆటగాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి చిన్న చిన్న పనులు చేయిద్దాం. [ఇంకా... ]

Friday, January 4

వంటలు - జింజర్ షర్బత్

కావలసిన వస్తువులు:
అల్లం - 3/4 కేజి.
నిమ్మ కాయలు - 20.
పంచదార - 1 కేజి.
ఉప్పు - 1 స్పూను.

తయారు చేసే విధానం:
ముందుగా అల్లం కడిగి మెత్తగా తొక్కాలి. మధ్యలో నీళ్ళు చల్లుకుంటూ ఉండాలి. ఈ విధంగా తొక్కుతూ సుమారు 1 కప్పు అల్లం రసం పిండుకోవాలి. తొక్కు ఉండకూడదు. [ఇంకా... ]

మీకు తెలుసా - గులాబీలు

ప్రేమ, వాత్సల్యం, స్నేహం లాంటి సున్నితమైన భావాలతో గులాబీలు కొన్ని వేల సంవత్సరాలుగా ముడిపడి ఉన్నాయి. అలోచనలపరంగా గులాబీలు సౌందర్య దేవతతోనూ, ప్రేమ దేవతతోనూ సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవి. ఆ తరువాత ఈరాస్ అనే ప్రేమ దేవతతో చేర్చబడి గులాబీల పేరు అల్లుకపోయింది.
గులాబీ పేరులను సమాధులపై పరచడానికీ ఉత్సవ సమయాలలో అలంకరణకు రోమన్లు ఉపయోగించేవారు. యుద్ధ భూమి నుండీ విజయాన్ని సాధించి వెనుతిరిగి వస్తున్న సేనానుల రధాలను అలంకరించేందుకు కూడా గులాబీలను వారు వాడేవారు.
క్రెస్తవ మత ప్రచారం విస్తృతంగా జరగడంతో గులాబీ ' వర్జిన్ మేరీ ' పువ్వుగా మారింది. ప్రార్థనా సమయంలో కాథలిక్కులు వాడే రోసరి పూసలమాలకు ఆ పేరు వర్జిన్ మేరీ సెయింట్ డోమినిక్కు ఇవ్వబడిన మాల కారణంగా వచ్చింది. [ఇంకా... ]

నీతి కథలు - దురాశ దుఖమునకు చేటు

ఒక ఊరిలో నలుగురు స్నేహితులు చేరి ఉండేవారు. సమాన లక్షణాలున్న వారందరూ ఒకే చోట చేరటం సహజం. వీరందరూ గర్భ దరిద్రులు. నిలవడానికి నీడ లేకుండా ఒక పూట తింటే మరోపూట పస్తుండేవారు. నలుగురూ ధనం సంపాదిద్దామనే ఆశయంతో విశాల ప్రపంచంలోకి బయలుదేరారు. ఊరు వదిలి కృష్ణా నది గట్టు మీద ప్రయాణం సాగించారు. కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత ఒక చోట జడలుకట్టుకు పోయిన జుట్టుతో ఒక సన్యాసి వీరి కంటబడ్డాడు. ఆ సన్యాసికి వారు సాష్టాంగ దండ ప్రణామంచేసి తమ కోరికను అతడితో విన్నవించుకున్నారు. యోగ శక్తితో తమకు సహకరించమని వేడుకున్నప్పుడు ఆ సన్యాసి వారికొక జ్యోతిని ఇచ్చి "ఈ జ్యోతిని మీ చేతులలో పెట్టుకుని మీరు హిమాలయ పర్వతాల వైపుకు బయల్దేరి వెళ్ళండి. [ఇంకా... ]

Wednesday, January 2

మీకు తెలుసా - కొబ్బరి

కొబ్బరి చెట్లు కోస్తా ప్రాంతాలలోనూ, ఇసుక ప్రాంతాలలోను ఎక్కువగా పెరుగుతాయి. సారవంతం కాని నేలలో కూడా ఇవి పెరుగుతాయి. ఈ చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇవి సుమారు 100 సంవత్సరాలపాటు జీవించి వుంటాయి. 7 సంవత్సరాల వయసు రాగానే ఈ చెట్టు నెలనెలా చిగురిస్తూ, పూతపూస్తూ ఉంటుంది. భారతదేశపు సాంస్కృతిక జీవనంలో కొబ్బరి చెట్టుకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. దీనిని కల్పవృక్షం - స్వర్గానికి చెందిన చెట్టు అంటారు. [ఇంకా... ]

Tuesday, January 1

పిల్లల ఆటలు - అక్షరంతో ప్రయోగం

ఎంతమంది ఆడవచ్చు : ఐదుగురు
కావలసిన వస్తువులు : పెన్ను, పేపరు
ఆడే స్థలం : ఆరు బయట, గదిలోగాని
ఆటగాళ్ళ వయస్సు : 8 సం|| నుండి 10 సం||లలోపు
లీడర్ ఏదో ఒక అక్షరం చెప్పి ఆ అక్షరంతో పదాలను కూర్చమని ఒక్కొక్క ఆటగాడిని కోరాలి. అంటే ఒక తెలుగు అక్షరంతో మనిషి పేరును, జంతువు పేరును, మొక్కల పేరును, వస్తువుల పేరును రాయాలి. అదికూడా 30 సెకండ్ల వ్యవధిలో. [ఇంకా... ]

మీకు తెలుసా - కోడి రామమూర్తి

ఆంధ్ర ప్రదేశ్ విజయనగరం దగ్గర నాగావళి నది గట్టు మీద వీరఘట్టము అనే గ్రామంలో జన్మించిన కోడి రామమూర్తి (1885-1942) శరీర దారుఢ్యము, సౌష్టవముతో మూర్తీభవించిన బలము. మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్ర ప్రదేశంలో ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది. ఇతడు చిన్ననాటి నుంచి తాలింఖానాలలో చేరి ఎక్కువగా శరీర వ్యాయామమును అభ్యసించి మంచి శరీర బలాన్ని ఆర్జించాడు. మద్రాసు సైదాపేట కాలేజిలో శరీర వ్యాయామాన్ని అభ్యసించి వ్యాయామ శిక్షణోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ పొందాడు. తరువాత విజయనగరం ప్రొవిన్షియల్ లోయర్ సెకండరీ పాఠశాలలో వ్యాయామ అధ్యాపకుడుగా చేరాడు. [ఇంకా... ]