Friday, February 29

పిల్లల పాటలు - గణితం ఘనత

అద్భుతమైనది ఈ గణితం
ఇది చేసే సేవలు మహోన్నతం
అందు, ఇందు ఎందైనా గలదని

సకల శాస్త్రాల దిశనిర్దేశం
కాంటరు కృషితో పుట్టెను సమితి
ఏనాటికి మరువం ఆయన ఖ్యాతి
గణిత సాధనే లక్ష్యంగా గల ఎబెల్ [ఇంకా... ]

Wednesday, February 27

నీతి కథలు - ఊరికోసం బావి

వేసవి సెలవులు వచ్చాయి. రాము పదవ తరగతి పరీక్షలు రాశాడు. రామూ నాన్నగారికి పల్లెలో ఉద్యోగం. అందుచేత అందరూ ఆ పల్లెలోనే ఉంటున్నారు. తెలంగాణాలోని ఒక చోటు వారికి వాన నీరే ఆధారం. నీరు తెచ్చుకోవడానికి రెండు మైళ్ళు పోవాలి. అక్కడ ఒక చెరువు ఉంది. ఆ నీరు తెచ్చుకుని వాడుకోవాలి. బిందె అయిదు రూపాయలకు నీరు కొనుక్కోవాలి. ఈ బాధలన్నీ కళ్ళారా చూస్తున్నాడు రాము. ఏదైనా చేయాలి? అనుకున్నాడు. రామూ మామయ్య ఇంజనీరు. ఆయన పట్నంలో ఉంటాడు. [ఇంకా... ]

Monday, February 25

పిల్లల పాటలు - వరిచేలు పండాలి

వానలు కురవాలి - వానదేముడా
వరిచేలు పండాలి - వానదేముడా
నల్లని మేఘాలు -వానదేముడా
చల్లగా కురవాలి - వానదేముడా
మావూరి చెరువంతా - వానదేముడా
ముంచెత్తి పోవాలి - వానదేముడా
కప్పలకు పెండ్లిండ్లు - వానదేముడా
గొప్పగా చేస్తాము - వానదేముడా [ఇంకా... ]

నీతి కథలు - మోసానికి శిక్ష

ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న రాజయ్య స్కూలుకు సెలవుదినమైతే ఇంట్లో నుంచి కదలడు. ఏదో పుస్తకమో, పేపరో చదువుతూ కాలక్షేపం చేయడం ఆయనకలవాటు. ఒకరోజు ఉదయంపూట మార్కెట్టుకు వచ్చాడు. మామూలుగా అతను మార్కెట్టుకు రాడు. ఆ పని భార్య నిర్మలే చేస్తుంది. అయితే ఇంట్లో నిమ్మకాయ పచ్చడి పెట్టాలనుకున్నారు. నిమ్మకాయ పచ్చడి అంటే రాజయ్యకు ప్రాణం. నిమ్మకాయలు మీరు తెచ్చేపక్షంలో నిమ్మకాయ పచ్చడి పెడతానంది భార్య నిర్మల. దానితో ఇక లాభం లేదనుకొని ఆ కాయలు కొనడం కోసమే రాజయ్య మార్కెట్టుకు రావడం జరిగింది. ఆదివారం కావడంవల్ల ఆ రోజు మార్కెట్టు చాలా రద్దీగా ఉంది. రాజయ్య నాలుగు దుకాణాలు తిరిగాడు. ఈ చివరగా ఉన్న బండిని సమీపించాడు. [ఇంకా... ]

Thursday, February 21

పిల్లల పాటలు - వానదేవుడా!

వానల్లు కురవాలి వానదేవుడా
వరిచేలు పండాలి వానదేవుడా!
నల్లనల్ల మేఘాలు వానదేవుడా
మెల్లంగ కురవాలి వానదేవుడా!

పచ్చనీ పైరులే వానదేవుడా
ఏపుగా ఎదగాలి వానదేవుడా!
చెరువులన్నీ నిండాలి వానదేవుడా
ఏరులై పారాలి వానదేవుడా! [ఇంకా... ]

నీతి కథలు - పావురాళ్ళు-రాళ్ళు

పావురాలంటే వెంకయ్యకు ఎంతో ఇష్టం. రకరకాల పావురాలను తెచ్చి పెంచుతూ ఉంటాడు!అరలు అరలుగా గూళ్ళతో నిండిన పెట్టెలు ఇంటి వసారాలో చూడ ముచ్చటగా అమర్చి పెట్టాడు. పప్పులు, పళ్ళు పెట్టి సరదాగా పెంచడం వల్ల, ఆ పావురాలు బాగా బలిసి, నవనవలాడుతూ ఎంతో అందంగా ఉంటాయి.
ఓ నాడు, గూళ్ళల్లోని పావురాలనన్నిటినీ విడిచి పెట్టి వెంకయ్య వాటికేసి సరదాగా చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు. వయ్యారంగా అడుగులు వేస్తూ, ఆ పావురాలు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే హంసల్లా ఉన్నాయని అనుకొంటూ వెంకయ్య మురిసి పోతున్నాడు! [ఇంకా... ]

Wednesday, February 20

నీతి కథలు - చేతకాని పని హాని

అది ఒక పెద్ద చెరువు. కొంతమంది పల్లె కారులు, చెరువులో వలలు విసురుతూ చేపలు పట్టు కొంటున్నారు. మధ్యాహ్నం దాకా చేపలు పట్టి, భోజనం వేళ అయినందున, వలలను గట్టు మీద ఆర బెట్టి ఇళ్ళకు వెళ్ళిపోయారు.
ఆ చెరువు గట్టు మీద ఓ చెట్టు వుంది. కొమ్మల్లో కూర్చుని వున్న కోతి పల్లె కారులు వలలు విసరడం చూసింది. పల్లెకారులు వలలను విసురుతూ వుంటే, చక్రాల్లా విచ్చుకొని ఆ వలలు నీళ్ళ మీద పడుతూ వుండడం కోతికి ఎంతో ముచ్చట కలిగింది. తాను కూడా అలా వలలను విసరాలని సరదా పుట్టింది. చెట్టు దిగి, అందులో ఒక వలను తీసి చెరువులోకి విసిరితే అది తన కాళ్ళకే చుట్టుకుంది. [ఇంకా... ]

వంటలు - పన్నీర్ చట్ పట్

కావలసిన వస్తువులు:
పన్నీర్ - 400 గ్రా.
ఉల్లిపాయలు - 100 గ్రా.
టమోటా - 125 గ్రా.
జీలకర్ర - 5 గ్రా.
జీలకర్ర పొడి - 5 గ్రా.
ధనియాల పొడి - 5 గ్రా.
మిర్చి పొడి - 10 గ్రా.
పెరుగు - 150 గ్రా.
గరం మసాల - అర టీ స్పూన్.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
కొత్తిమీర - 1 రెమ్మ.
ఉప్పుకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. [ఇంకా... ]

Tuesday, February 19

పిల్లల పాటలు - చేత వెన్న ముద్ద...

చేత వెన్న ముద్ద - చెంగల్వ పూదండ
బంగారు మొలత్రాడు - పట్టుదట్టి
సందిట తాయత్తులు - సిరిమువ్వ గజ్జలు
చిన్ని కృష్ణా నిన్ను - చేరి కొలుతు [ఇంకా... ]

Monday, February 18

వంటలు - సోయా బాసుంతి

కావలసిన వస్తువులు:
సోయా ఫ్లేక్స్ - 100 గ్రా.
పాలు - 1 లీ.
చక్కెర - 100 గ్రా.
నెస్లే మిల్క్ మెయిడ్ - 2 టీ స్పూన్లు.
యాలుకలు - 3.
బాదం, కిస్ మిస్, జీడిపప్పు - 100 గ్రా.

తయారు చేసే విధానం:
సోయా ఫ్లేక్స్ ను సరిపడినన్ని నీళ్ళతో కలిపి అయిదు నిమిషాలు మరిగించి ఆపై నీటిని వడగట్టాలి. [ఇంకా... ]

Saturday, February 16

మీకు తెలుసా - ఐస్ క్రీం

నోరూరించే ఐస్ క్రీంను ఇష్టపడని వారెవరూ ఉండరు. ముఖ్యంగా వేసవి కాలంలో ఐస్ క్రీం సెంటర్లవైపు మొగ్గుచూపడం సాధారణంగా జరుగుతుంటుంది. ఇటీవల శీతాకాలంలోనూ, వర్షాకాలంలోనూ ఐస్ క్రీములను తినడం ఓ ఫాషన్ అయ్యింది. దానికున్న క్రేజ్ అటువంటిది. తీవ్రమైన ఎండల ప్రభావం వల్ల కలిగిన అలసటనుండి విముక్తి పొందడానికి జనం ఆశ్రయించే ఈ ఐస్ క్రీములు నేడు సర్వకాల సర్వ్యావస్థలయందు మానవుడి ఆహార అంతర్భాగాలలో ఒకటి కావడం విచిత్రమైన పరిణామం. మారుతున్న మనుషుల మానసిక ప్రవృత్తికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఏదేమైనా ఒకే ఒక్క స్పూన్‌తో అమ్మలా సేదతీర్చే ఐస్ క్రీం అంటే అందరికీ ప్రాణమే. [ఇంకా... ]

Friday, February 15

వంటలు - అరిసెలు

బియ్యం - 1 కిలో.
బెల్లం - 800 గ్రాములు.
నూనె లేక నెయ్యి - 1/2 కిలో.
నువ్వులు - 100 గ్రాములు.

తయారు చేసే విధానం:
బియ్యాన్ని రెండు రోజులు నానబెట్టాలి. ప్రతి పూటా బియ్యంలో నీళ్ళు మార్చి కొత్త నీళ్ళు పోస్తూ ఉండాలి. రెండవ రోజు సాయంత్రం బియ్యాన్ని పిండి కొట్టుకోవాలి. పిండిని రెండు సార్లు జల్లిస్తే అరిసెలు బాగుంటాయి. తరువాత బెల్లాన్ని మెత్తగా దంచి అడుగు మందం ఉన్న గిన్నెలో వేసి ఓ కప్పు నీళ్ళుపోసి పొయ్యి మీద పెట్టాలి. బెల్లం కరిగి పాకం అయ్యేటప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేటులో కొంచెం నీళ్ళు పోసి పాకం కొంచెం అందులో వెయ్యాలి. [ఇంకా... ]

Thursday, February 14

వ్యక్తిత్వ వికాసం - స్నేహం

అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. ఆ పద ధ్వనే అలౌకికానందాన్ని ఇస్తుంది. మండుటెండలో చలచల్లని ఐస్ క్రీం తింటున్న అనుభూతినిస్తుంది స్నేహం అనే భావన. చల్లని చలిలో వెచ్చని జ్ఞాపకాలను అందించే గతమే స్నేహం. నిర్వచనానికి అందని అతి సున్నితమైన ఫీలింగ్ స్నేహం. అందుకే మన తెలుగు కవి ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి "సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ" అన్నారు.చాలా కాలం క్రితం ఒక ఆంగ్ల పత్రిక "స్నేహం" అనే మాటకు ఉత్తమ నిర్వచనం చేసిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించింది. [ఇంకా... ]

మీకు తెలుసా - కల్తీలను కనిపెట్టండి

ఆహార వస్తువులను కల్తీ చేయడం నేరం. కల్తీ పదార్ధాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఖనిజ తైలంతో కల్తీ చేసిన ఆవ నూనును ఉపయోగించిన వ్యక్తికి కంటిదృష్టి పోవచ్చు లేక గుండె జబ్బు రావచ్చు. సున్నితమైన రంపపు పొట్టుతో కల్తీ చేసిన మిరపకాయల పొడి తిన్న వారికి ఆరోగ్యం చెడిపోతుంది. అదేవిధంగా కల్మషమైన నీటితో కల్తీ చేసిన పాలు త్రాగిన బిడ్డ బాధపడుతుంది. ఈ కల్తీలను ఇంట్లో పరీక్షల ద్వారా సులభంగానే కనిపెట్టవచ్చు. [ఇంకా... ]

Wednesday, February 13

నీతి కథలు - ఏడు కూజాల కథ

అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి, అయినా రాజుకు తెలీని అసంతృప్తి. ఒక రోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు, వేటకు వెళ్ళి జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు, వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల వచ్చింది.ఆ కలలో ఒక పురుషుడు కనపడి రాజా నీకు నేను అమూల్యమైన ధనం ఇస్తున్నాను. చక్కగా ఆనందించు అని చెప్పినాడు, కానీ దేనికైనా పైన నక్షత్రపు గుర్తు ఉండాలి కదా, అలాగే ఓ కండీషను కూడా పెట్టినాడు. నేను నీకు ఏడు పెద్ద కూజాలు ఇస్తాను వాటిలో ఆరు కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు అమూల్య రత్నాలు మొదలగునవి ఉంటాయి. [ఇంకా... ]

Tuesday, February 12

నీతి కథలు - స్వార్ధం తెచ్చిన అనర్ధం

గ్రామాధికారి పరంధామయ్యకు సుస్తీచేసి మంచాన పడ్డాడు. ఒకరోజు ఆయన తన ముగ్గురు కొడుకుల్నీ పిలిచి "ఒరేయ్ అబ్బాయిలూ, ఇక నేను ఎంతోకాలం బతుకుతానని నమ్మకం లేదు. కాబట్టి నా దగ్గరున్న డబ్బు, బంగారం, పొలం మీకు పంపకం చెయ్యాలనుకుంటున్నాను. మీకు ఎవరెవరికి ఏమి కావాలో నిర్ణయించుకుని నాకు చెప్పండి" అన్నాడు.

వెంటనే మూడో కొడుకు సుందరం భార్య, భర్తను గదిలోకి పిలిచి, "చూడండీ! మీరు బంగారం తీసుకోండి. అది పాతకాలం బంగారం. మేలైన రకం, ఎప్పటికైనా మంచి ధర పలుకుతుంది" అని చెప్పింది. సుందరం భార్య మాటకు ఎదురు చెప్పలేక, "అలాగే" అని తల ఊపుతూ, తండ్రి దగ్గర కెళ్లి తనకు బంగారం కావాలనుకున్నాడు. [ఇంకా... ]

Saturday, February 9

పిల్లల పాటలు - బడినుంచి అమ్మ ఒడికి

బావా బావా పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
వీధీ వీధీ తిప్పేరు
వీసెడు గంధం పూసేరు
పట్టె మంచం వేసేరు
పాతిక గుద్దులు గుద్దేరు
నులక మంచం వేసేరు
నూరు గుద్దులు గుద్దేరు
బావా బావా పన్నీరు
బావకు మరదలు బంగారు [ఇంకా... ]

నీతి కథలు - దొంగలో మార్పు

రాంబాబు అయిదో తరగతి చదువుతున్నాడు. చిన్నతనం నుంచి ఇతరుల వస్తువులు దొంగతనం చేయడం అలవాటు. స్కూలులో తన తోటి పిల్లలకి చెందిన పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు, కూడా ఎవరికీ తెలియకుండా తీసుకువస్తుంటాడు. స్కూల్లో ఇంటర్‌వెల్ ఇచ్చిన సమయంలో పిల్లలందరూ బైటికి వెళ్ళిపోతే వారి స్కూలు బ్యాగులను పరిశీలన చేస్తుంటాడు. ఒకసారి ధీరజ్ అనే కుర్రవాడు రంగురంగుల బొమ్మల పుస్తకం తెస్తే దానిని మాయం చేసాడు. వాడు ఏడుస్తూ రెండురోజులు బడికి కూడా రాలేదు. స్కూల్లో అమ్మే నోటుపుస్తకాలు కొనుక్కోవడానికి కృష్ణప్రసాద్ అనే కుర్రవాడు నోటుపుస్తకంలో అయిదు, పది రూపాయల నోట్లు పెట్టుకుని బడికి తీసుకువస్తే ఎవరికీ తెలియకుండా వాటిని తస్కరించాడు. [ఇంకా... ]

వంటలు - ఆరెంజ్ స్క్వాష్

కావలసిన వస్తువులు:
బత్తాకాయలు - 12.
సిట్రిక్ ఆసిడ్ - 7 స్పూన్లు (నిమ్మ ఉప్పు).
ఆరెంజ్ ఎసెన్స్ - 1 స్పూను.
ఆరెంజ్ కలర్ - 1/2 స్పూను.
పంచదార - 6 కప్పులు.
పొటాషియం మెటాబైసల్ఫేట్ - 1/2 స్పూను.
నీరు - 3 కప్పులు.

తయారు చేసే విధానం:
ముందుగా నీళ్ళలో పంచదార కలిపి తీగపాకం పట్టాలి. [ఇంకా... ]

Friday, February 8

వంటలు - బొబ్బట్టు

కావలసిన వస్తువులు:
మైదాపిండి - 1/2 కిలో.
పూర్ణంకోసం: -
పచ్చి శనగపప్పు - 2 కప్పులు.
బెల్లం తురుము - 2 కప్పులు.
యాలుకుల పొడి - 1 చెంచా.
నెయ్యి - తగినంత.

తయారు చేసే విధానం:
మైదాపిండి నూనె, కొద్దిగా నెయ్యివేసి చపాతీ పిండిలా కలిపి నానబెట్టుకోవాలి.
శనగపప్పును ఉడికించి నీళ్ళు వంపుకోవాలి. తర్వాత గ్రైండర్‌వేసి మెత్తగా రుబ్బాలి. [ఇంకా... ]

వంటలు - వర్మిసెల్లి పుడ్డింగ్

కావలసిన వస్తువులు:
వెర్మిసెల్లి - 200 గ్రా.
పాలు - 1 లీ.
పంచదార - 100 గ్రా.
నెయ్యి - 1/2 కప్పు .
యాలుకలు - 3
కిస్మిస్ - 1 స్పూను.
జీడిపప్పు - 1 స్పూను.

తయారు చేసే విధానం:
ముందుగా వెర్మిసెల్లిని 4 స్పూన్ల నెయ్యితో వేయించాలి. అందులో 1.5 కప్పుల నీరు పోసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. అందులో పాలు పోసి సన్నని సెగపై చిక్కబడేంత వరకు ఉడికించాలి. [ఇంకా... ]

మీకు తెలుసా - రత్నాలు

అన్ని విషయాల్లోనూ ఎప్పుడూ ఉత్సాగంగా ఉల్లాసంగా ఉండే వ్యక్తిని "జెం" అంటారు సాధరణంగా. "జెం" అంటే "రత్నం" లేదా "జాతి రాయి" అని తెలుగులో అర్ధం. రత్నం అంటే గొప్పదని కూడా మరో అర్ధం. మంచి వాళ్ళని కూడా రత్నాలతో పోలుస్తారు. విశ్వవిఖ్యాత ఎన్.టి.రామారావు గారికి "నట రత్న" అనే బిరుదు ఉంది. అంటే నటులలో రత్నంలా ప్రకాశించేవాడని అర్ధం. ఇంకా ముఖ్యంగా మన దేశ అత్యున్నత పురస్కారమైన అవార్డు "భారతరత్న". అంటే భారతదేశానికే రత్నం వంటివాడని అర్ధం. రత్నానికి ఎంత ప్రాముఖ్యముందో ఈ అవార్డులనుబట్టి తెలుస్తోంది. ఈ రత్నాల గురించి తెలిపే శాస్త్రాన్ని "జెమాలజి" అంటారు. [ఇంకా... ]

Thursday, February 7

ఆధ్యాత్మికం - నిస్సహాయులను బలపరుస్తాడు

సర్వం కోల్పోయిన వ్యక్తి అలోచనా విధానం ఎలా ఉంటుంది? తాను బ్రతికి ఉండటం వేస్ట్ అనుకుంటాడు.ఆ బాధనుండి విముక్తి అయ్యేందుకు తనకుతానే మరణశాసనాన్ని రాసుకునే వారు ఎందరో ఉన్నారు. కానీ వీటన్నింటినుండి తప్పించే దేవుడు ఉన్నాడని గ్రహించలేరు. ఒక నిస్సహాయ స్థితి దేవుడి వైపుకు తిప్పగలదు. ఆయనపై ఆధారపడేలా చేస్తుంది. దేవుడి శక్తి ఏమిటో ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అర్థం అవుతుంది. అందుకేనేమో తనకుతానుగా ఎలాంటి విమోచనా పొందలేని వ్యక్తి దయనీయ స్థితిని చూసిన దేవుడు తన ఒక్కడైన క్రీస్తును పంపేందుకు వెనుకంజ వేయలేదు. [ఇంకా... ]

Wednesday, February 6

వంటలు - ముక్కల పచ్చడి

కావలసిన వస్తువులు:
మామిడికాయలు - మీడియం సైజువి 25. (పది కాయలు చెక్కు తీసి, మిగిలిన కాయలు చెక్కుతో సన్నగా పొడుగ్గా కోయాలి).
కారం - 1 కిలో.
ఉప్పు - 1 కిలో.
పసుపు - ఒక చెంచా.
నూనె - 1 కిలో.
నువ్వులనూనె - పావు కిలో(పోపులోకి).
మెంతులు - పావు కిలో (వేయించి పొడిచేయాలి).
జీలకర్ర పొడి - ఒక స్పూను (వేయించి పొడి చేయాలి).
ఆవపిండి - ఒక స్పూను (పచ్చిది).
పోపులోకి - ఒక్కొక్క చెంచా చొప్పున జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇంగువ వేసి పోపు వేయాలి.

తయారు చేసే విధానం :
మామిడికాయల్ని శుభ్రంగా కడిగి, తుడిచి ఆరబెట్టి సన్నగా తరిగి ఉంచుకోవాలి. [ఇంకా... ]

పిల్లల పాటలు - వచ్చిపోవే పిచ్చుకమ్మా

వచ్చిపోవే, వచ్చిపోవే
పిచ్చుకమ్మా వచ్చిపోవే
కొయ్య ముక్కలు గూడు చేశా
రేకు ముక్కను తలుపు చేశా
మెత్త మెత్తని ఈకలెన్నో
గూటి నిండా పరచి ఉంచా.
గ్రుడ్ల నిక్కడ పెట్టుకుంటే
పొదిగి పిల్లల చేసుకుంటే
కాకి పోరూ గ్రద్ద పోరూ
పిల్లి పోరూ ఉండ వింకా [ఇంకా... ]

Monday, February 4

వంటలు - నువ్వుల లడ్డు (చిమ్మిరి ముద్ద)

కావలసిన వస్తువులు:
నువ్వులు - 1 కిలో.
పల్లీలు - 100 గ్రా.
యాలుకల పొడి - 1 టీ స్పూను.
బెల్లం - 1 కిలో.
జీడిపప్పు - 100 గ్రా.
నెయ్యి - 100 గ్రా.

తయారు చేసే విధానం:
ముందుగా నువ్వులు, పల్లీలు, జీడీపప్పులను విడివిడీగా కడాయిలో ఆయిల్ లేకుండా దోరగా వేయించి పెట్టుకోవాలి.[ఇంకా... ]

Saturday, February 2

చిట్కాలు - చుండ్రు-చిట్కాలు

ఏఏ కాలంలో అయినా ఎల్లప్పుడూ అందరినీ వేధించే సమస్య తలలో చుండ్రు, వయసుతో సంబంధం లేకుండా పెద్దవారికి, చిన్నవారికి అందరికీ తలలో చుండ్రు రావడం సాధారణం. చుండ్రు రావడానికి కారణాలు అనేకం. చుండ్రు వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అధిక వత్తిడికి గురయినా తలలో చుండ్రు వస్తుంది. నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయానికి వత్తిడికి గురి కావడం సహజం. అలాగే ఎక్కువ సమయం ఎసి గదుల్లో గడపడం వల్ల, ఫోన్ కింద కూర్చున్నా తల మీది చర్మం పొడిగా అయిపోయి పొట్టులా లేస్తుంది. షాపూతో తలస్నానం చేసినప్పుడు చర్మానికి అంటిన షాంపూ పూర్తిగా వదలపోయినా కూడా చుండ్రు వచ్చే అవకాశం వుంది. తలకు రాసుకునే షాంపూలో మినరల్స్, ఐరన్ ఎక్కువైనా చుండ్రు పెరగడానికి అవకాశం ఎక్కువ. కలుషిత వాతావరణం కూడా చుండ్రును పెంచుతుంది. ఏ వాతావరణంలో నివసించే వారికైనా చుండ్రు వస్తుంది.సముద్ర తీరప్రాంతాల్లో నివసించినా పర్వత ప్రాంతాల్లో నివసించినా తప్పించుకోలేకపోతున్నారు. [ఇంకా... ]

Friday, February 1

వంటలు - చెగోడి

కావలసిన వస్తువులు:
బియ్యం పిండి - 700 గ్రా.
మైదా - 150 గ్రా.
పెసరపప్పు - 150 గ్రా.
జీలకర్ర - 10గ్రా.
ఉప్పు - సరిపడినంత.
డాల్డా - 20 గ్రా.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.

తయారు చేసే విధానం :
సరిపడినన్ని వేడినీళ్లలో మైదా, బియ్యంపిండి, డాల్డా, ఉప్పు వరుసగా వేసి మిశ్రమాన్ని బాగా కలిపి, జీలకర్ర వేసి కావలసిన సైజులో వుండలు చేసుకోవాలి. [ఇంకా... ]