Friday, October 31

పిల్లల పాటలు - అమ్మకొక ముద్ద

ఆకేసి ఉప్పేసి
పప్పేసి అన్నం పెట్టి
చారేసి నెయ్యివోసి
అమ్మకొక ముద్ద

చెల్లికొక ముద్ద
అక్కకొక ముద్ద
అవ్వకొక ముద్ద
తాతకొక ముద్ద [ఇంకా... ]

వంటలు - అటుకుల పోణీ

కావలసిన వస్తువులు:

గోభీ పువ్వు (చిన్నది) - 1
ఆలు - 2
లావు అటుకులు - 250 గ్రా
పచ్చి మిర్చి (తరిగినవి) - 6
కరివేపాకు - 2 రెమ్మలు
కొత్తిమీర - 2 రెమ్మలు
ఆవాలు - 5గ్రా
జీలకర్ర - 5 గ్రా
ఎండుమిర్చి - 3
పసుపు - అర టీ స్పూను
ఉప్పు, రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత
పచ్చి కొబ్బరి తురుము - కొద్దిగా

తయారు చేసే విధానం:
కడాయిలో నూనె వేడి చేసి పప్పు దినుసులు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు వరసగా కాక గోభీ, ఆలు ముక్కలు వేసి కలిపి సన్నని సెగపై ఉడికించాలి. [ఇంకా... ]

నీతి కథలు - పుట్టినరోజు

ఉదయం ఆరు గంటలు కావొస్తోంది. రవి ఇంకా నిద్రలేవలేదు. "ఒరేయ్ రవి! లేవరా! ఈరోజు నీ పుట్టినరోజు, మరచిపోయావా"? అంటూ సునీత గదిలోకి వచ్చింది. మగతనిద్రలో వున్న రవి, తల్లి పిలుపుతో లేచికూర్చున్నాడు. అది చూసి సునీత "హ్యపీ బర్తడే" అంటు శుభాకాంక్షలు తెలిపింది. "ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా! మీ డాడీ హాల్లో ఎదురచూస్తున్నారు" అంటూ వెళ్ళిపోయింది.

రవి తండ్రి రాఘవ పట్టణంలో పెద్ద వ్యాపారస్ధుడు. రవి వారికి ఒక్కగానొక్క కొడుకు. ఆ ఊరి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. కలవారి బిడ్డయినా క్రమశిక్షణతో పెరిగాడు. మాష్టార్లకు రవి అంటే చాలా యిష్టం. చదువుల్లోను, ఆటల్లోను ఫస్టు. తోటి పిల్లలతో స్నేహంగా ఉంటాడు. పేదపిల్లలను అవసరాల్లో ఆదుకొంటాడు. రవి స్నానం చేసి వచ్చి తల్లిదండ్రుల ఆశీస్సులందుకొన్నాడు. రాఘవ వందరూపాయల నోటును రవి చేతికిచ్చి "నీ కిష్టమైన వస్తువు కొనక్కో" అని చెప్పి వెళ్ళి పోయాడు. [ఇంకా... ]

వ్యక్తిత్వ వికాసం - ఏకాగ్రత

"వింటే భారతం వినాలి. తింటే గారెలే తినాల". అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా? తినటానికి గారెలు ఎంత రుచిగా ఉంటాయో, వినటానికి భారతం అంత బాగా ఉంటుందని దాని భావం. భారతంలో కౌరవులు, పాండవుల కథ ఉన్నది.

ధృతరాష్ట్రుడు పుట్టడమే గుడ్దివాడుగా పుట్టాడు. ఆయనకు నూరుగురు కొడుకులు. వాళ్ళందరినీ కలిపి "కౌరవులు" అంటారు. పాండు రాజుకు అయిదుగురు కొడుకులు. వాళ్ళందరిని కలిపి "పాండవులు" అంటారు. పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. మిగిలిన వాళ్ల పేర్లు వరుసగా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. పాండవులు చిన్నవాళ్లగా ఉన్నప్పుడే వాళ్ల తండ్రి చనిపోయినాడు. అందువల్ల వాళ్ళు కూడ కౌరవులతో కలసి ధృతరాష్ట్రుని వద్దనే పెరుగుతున్నారు. ద్రోణాచార్యుడు అనే అయన వాళ్లకు విలువిద్యను నేర్పుతున్నాడు. విలువిద్య అంటే బాణాలు ఎట్లా వేయాలో నేర్పే విద్య. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా - బల్బు

ఒక బల్బును లోహపు తీగతో ఒక బ్యాటరీకి కలిపితే బల్బు వెలుగుతుంది. ఎందుకంటే ఆ విద్యుత్తు వలయంలో కరెంటు ప్రవహిస్తుంది కాబట్టి. కరెంటు అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహమేకదా. మరి ఆ ఎలక్ట్రాన్లు బ్యాటరీకి సంబంధించినవా? ఒకవేళ బ్యాటరీవి అయితే బల్బును దారపు పోగుతో కలిపినా వెలగాలి కదా. ఎలక్ట్రాన్లు లోహపు తీగవే అయితే ఇక బ్యాటరీ అవసరం ఏముంది? వలయంలో కరెంటు ప్రవహిస్తే బల్బు ఎందుకు వెలగాలి?

అన్ని రకాల పదార్థాల్లోను, మనుషుల్లోను ఉండే ఎలక్ట్రాన్లను పక్కకు తీసి ఏది దేని నుంచి వచ్చిందో చెప్పమంటే ఎవరికీ సాధ్యం కాదు. బల్బు ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్లనే వెలుగుతుంది. బల్బులో వెలుగునిచ్చేది కాంతి శక్తి. ఏ శక్తినీ శూన్యం నుంచి పుట్టించలేము. ఎలక్ట్రాన్ల ప్రవాహంలో ఉండే గతిజశక్తి మొదట ఉష్ణశక్తిగాను, తిరిగి కాంతి శక్తిగాను మారి వెలుగునిస్తుంది. [ఇంకా... ]

Thursday, October 30

వ్యాయామ శిక్షణ - పరీక్షలకు చదివేటప్పుడు ఎలా...

ఏకాగ్రతగా చదివితేనే, ఒత్తిడికిగురికాకుండా చదివిందంతా ఒక పద్ధతిప్రకారం సమీక్షించుకోగలిగితేనే పరీక్షలలో మంచి ఫలితాలు పొందవచ్చు. తేలికగా వుండే శ్వాస వ్యాయామాలు...చాలాసేపు కదలకుండా కూర్చుని చదవగలిగే ఏకాగ్రతనిస్తాయి. రిలాక్సేషన్ వ్యాయామాలు మనసు మీద వత్తిడి పడకుండా చూస్తాయి. అసలే పరీక్షల హడావుడిలోవుంటే ఈ గొడవేంటని విసుక్కోకుండా ఈ చిన్నచిన్న వ్యాయామాలు చేసి చూడండి ఎంత తేడా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఏమేమి చేయవచ్చంటే...

1. దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలే...బ్రీతింగ్ ఎక్సర్ సైజులు ఎంతో హాయినిస్తాయి.
2. సూర్యనమస్కారాలు అలవాటుంటే క్రమంతప్పకుండా చేయండి.
3. ఒక అరగంట సేపు వేగంగా నడవండి.
4. బాల్ బ్యాట్మెంటెన్ గానీ, టెన్నీస్ గాని కాసేపు ఆడండి.
5. పదినిముషాలు అలా సైకిల్ మీద ఒక రౌండ్ కొట్టిరండి. [ఇంకా... ]

ఆధ్యాత్మికం - పరమేశ్వరుని ఆరాధన

సృష్టి మొత్తం ఒక నియమ పూర్వకమైన సువ్యవస్తతకు లోబడి నడుస్తోంది. గ్రహాలు, నక్షత్రాలు తమ తమ కక్ష్యలలో ఇరుసుమీద ఈమాత్రం అటూఇటూ దారి తప్పకుండా పరిభ్రమిస్తాయి. దివారాత్రులు, ఋతువులు మొదలగు వాటిలో ఒక నియమం ఏర్పడి ఉన్నది. కర్మ ఫలాలు ఒక దైవవ్యవస్తకు సంబంధించినవే. పాలు పెరుగుగా మారటానికి, విత్తనం మొక్కగామారటానికీ కొంతసమయం పడుతుంది. అదే విధంగా కర్మలననుసరించి మంచిచెడుల ఫలితం కొంతసమయం వెనుకా ముందుగానైనా నిశ్చితరూపంలో అందుతుంది. అలాకాని పక్షంలో ప్రపంచమంతా ఆటవిక న్యాయం రాజ్యమేలేది. నోరున్నవాడిమాటే చెల్లుబాటవుతూ, బలమున్నవాడిమాటే సాగుతూ వుండేది. కానీ అలాజరగటంలేదు.

విధ్వాంసులు, ధనవంతులు కళాకారులూ పహిల్వానులు కాగలగాలి అనుకొంటే కృషిసాధన చేసి తీరాలి. కృషికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది. ఏజాతి విత్తనాలు నాటుతామో ఆ జాతి పంటనే కోరుకుంటాము. మధ్యం తాగినవాడికే నిషా తలకెక్కుతుంది. విషంతాగినవాడు ప్రాణాలు పోగొట్టుకొంటాడు. ఇదే కర్మఫలం యొక్క సునిశ్చిత వ్యవస్తకు ప్రత్యక్ష ప్రమాణం. [ఇంకా... ]

వంటలు - ఆలూ చిప్స్

కావలసిన వస్తువులు:

బంగాళ దుంపలు (ఆలూ) చెక్కు తీసినవి - 1/2 కిలో.

తయారు చేసే విధానం:

బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి తీసి సన్నని ముక్కలుగా నిలువుగా కోసుకోవాలి. ఆ ముక్కల్ని నీళ్లలో ఐదు నిముషాల పాటు నానపెట్టాలి. తరువాత వడకట్టి పొడి బట్టలో వేసి వాటిలో ఉన్న పిండి పోయేవరకు మెత్తగా ఒత్తాలి. ఇలా చెయ్యడం వల్ల ముక్కలు ఒకదానికొకటి అతుక్కోవు, వేగించినప్పుడు కళాయికి అంటుకుపోవు. [ఇంకా... ]

లాలి పాటలు - లాలి పాట

లాలనుచు నూచేరు లలనలిరుగడల
బాల గండవర గోపాల నినుజాల లాలీ లాలీ

ఉదుటు గుబ్బల సరము లుయ్యాలలూగ
పదరి కంకణరవము బహుగతుల మ్రోగ

ఒదిగి చెంపలకొప్పు లొక్కింత వీగ
ముదురు చెమటల నళికములు తొప్పదోగ ||లాలీ||

మలయ మారుతగతులు మాటికి చెలంగ
పలుకు కపురపుతావి పైపై మెలంగ ||లాలీ|| [ఇంకా... ]

జానపద కళారూపాలు - కలాపాలు

జానపద కళారూపాలలో కలాపం చాలా ప్రసిద్ధమూ, ప్రాచీనమూ అయినది. భామా కలాపం, గొల్ల కలాపం, చోడిగాని కలాపం - ఇలా కలాపాలన్న పేరున చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే యక్షగాన ప్రబంధాలకు రూపాంతరాలే కలాపం, బుర్రకథ, హరికథ. ఏదో ఒక నాయిక పాత్రను ధరించి ఆడుతూ, పాడుతూ తన కథను తానే మనకు చెప్పే యక్షగాన రూపమే కలాపం. భామాకలాపం, గొల్లకలాపం వంటివి దేశీకిందకు రావు. మార్గశాఖకు చెందినవి. అయితే చోడిగాని కలాపం మొదలయినవి దేశీ శాఖకు చెందినవి. కలాపం అన్నది, కలాప రచనలు అనేది వ్యవహారంలో ఉన్న పేరు. [ఇంకా... ]

Wednesday, October 29

భరతమాత బిడ్డలు - పొట్టి శ్రీరాములు

పేరు - పొట్టి శ్రీరాములు
తండ్రి పేరు - గురవయ్య
తల్లి పేరు - శ్రీమతి మహాలక్ష్మమ్మ
పుట్టిన తేది - 1901
పుట్టిన ప్రదేశం - మద్రాసు
చదివిన ప్రదేశం - నెల్లూరు
రచనలు - 'ఎ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ ', 'డిస్కవరీ ఆఫ్ ఇండియా', 'గ్లింపెస్స్ ఆఫ్ వర్డ్ హిస్టరీ'
స్వర్గస్తుడైన తేది - డిసెంబర్ 15
గొప్పదనం - నిరాహారదీక్ష చేసి మద్రాసు రాష్ట్రాం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేసినారు.

ఒకప్పుడు మన ఆంధ్రాప్రాంతం మద్రాసులో అంతర్భాగంగా ఉండేది. తమిళ సోదరులు, మనం ఎంతో ఐకమత్యంగా, అన్యోన్యంగా ఉన్నప్పటికీ, పరిపాలనా పరంగా, భాషాపరంగా కొన్ని ఇబ్బందులు ఉండేవి! మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మద్రాసు రాష్ట్రంలో జనాభా ఎక్కువైయింది. వైశాల్యం కూడా ఎక్కువే. అందుచేత ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలుగువారు కోరుకునేవారు. కానీ అందుకు పాలకులు అంగీకరించలేదు. అనేక ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. చివరికి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. యుద్దాలతో సాధించలేని కార్యాన్ని శాంతియుత పోరాటంతో సాధించిన శ్రీరాములు చిరస్మరణీయులు. ఆయన గురించి తెలుసుకుందాం. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఉయ్యాల...

లాల ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల
ఊగేటి మా పాప తూగుటూయ్యాల

చిల్లి ఉయ్యాలమ్మ పొట్టి ఉయ్యాల
పట్టి ముద్దులపాప పసిడి ఉయ్యాల

పాల ఉయ్యాలమ్మ గాలి ఉయ్యాల
ఆకాశవీధిలో కెగురు ఉయ్యాల [ఇంకా... ]

వ్రతములు - నందికేశ్వర వ్రతము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒకనాడు పార్వతి శివుని పాదములు పట్టుచుండగా నతడామె చేతులు కఠినముగ నున్నందున తన పాదములను పట్టవలదనెను. పార్వతి తన చేతులెందుకు కఠినముగ నున్నవో తెలుపవలసినదని యడుగగా హరుడామె పరోపకారము చేయకపోవుటచే నట్టి కాఠిన్యము హస్తములకు వచ్చెననియు, అవి మృదుత్వమునందుటకు నీళ్ళాటిరేవున వేడి నీళ్ళతో వచ్చుపోవువారికి తలంటి నీళ్ళు పోయవలయుననియు చెప్పెను. పార్వతి భర్త ఆఙ్ఞతో అట్లు చేయుచుండగా నొక పేదరాలు వచ్చి, ఆమెతో తలంటినీళ్ళు పోయించుకొని వెల్లుచుండగా ఆమెపై దయ తలచి పార్వతి సంపదనిచ్చెను. నాటి నుండి ఆ పేదరాలు ధనవంతురాలయి గుమ్మం లోకి వచ్చువారికి పని చెప్పుచుండెను. ఆ సంగతి పార్వతికి తెలిసి గర్విష్టురాలగు ఆమె భాగ్యమును తీసివేయుటకు విఘ్నేశ్వరుని పంపగా అతనికామె ఉండ్రాళ్ళ నైవేద్యము పెట్టెను. [ఇంకా... ]

మీకు తెలుసా - పాస్‌వర్డ్ గుర్తుండాలంటే...

మెయిల్ ఓపెన్ చేసేటప్పుడు చాలా మంది ఎవ్వరూ కనుక్కోలేని విధంగా పాస్‌వర్డ్ ఇవ్వాలని పప్పులో కాలేస్తుంటారు. ఒక్కోసారి పాస్‌వర్డ్ గుర్తురాక నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే...

పాస్‌వర్డ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ కారునెంబర్లు, లేదా బైక్ నెంబర్లతో వారికి ఇష్టమైన పువ్వుల నెంబర్లు మిళితం చేసి ఇవ్వవచ్చు.

ఉదా: మీ కారు నెంబర్ AP04 అనుకోండి. మీకిష్టమైన పువ్వు లిల్లీ (lily) అనుకోండి. అప్పుడు మీ పాస్‌వర్డ్ నెంబర్ alpi014y ఇవ్వవచ్చు. [ఇంకా... ]

Thursday, October 23

జానపద గీతాలు - ఓ చిన్నదానా విడవనె చెంగు

ఓ చిన్నదానా విడవనె చెంగు
ఓ చిన్నదానా వదలనె కొంగు
బందారు చిన్నదాన బాజాబందూలదాన
బాజాబందూల మీద మోజేల లేదే ..ఓ చిన్నదానా..

గుంటూరు చిన్నదాన గుళ్ళా పేరులదానా
గుళ్ళాపేరుల మీద కళ్ళూపోలేదే .. ఓ చిన్నదానా..

కాకినాడ చిన్నదానా కాసూల్ కంటేలదానా
కాసూల్ కంటేల మీద మనసేలలేదే .. ఓ చిన్నదానా.. [ఇంకా... ]

వ్యక్తిత్వ వికాసం - ఆందోళనను అరికడదాం

సగటు మానవుడి సాధారణ స్పందనలలో ఆందోళన ఒకటి. వాస్తవానికి ఇది సర్వసాధారణంగా ప్రతి వ్యక్తిలోనూ ఎదో ఒకనాడు కలిగేదే. ఆందోళన చెందని మనిషి ఉండడం అంటూ జరగదు. ఐతే ఆందోళన చెందే పర్సెంటేజిలోనే ఉన్నది అసలు కథంతా. చిన్నా, పెద్దా ప్రతి సంఘటనకీ స్పందించే మనిషికే ఎన్నో తలనొప్పులు. ప్రతి సంఘటన సంఘర్షణ కాబోదు. అలా అవుతుందేమోనన్న ఆలోచనే ఆందోళనకు గురిచేస్తుంది ఎవరినైనా.ఆందోళన అనేది ఒక మానసిక వ్యాధి. మెదడును తొలుచుకుతినే క్రిమిలాంటిది. శరీరంలోని జీవ శక్తిని ఇది పీల్చేస్తుంది. మనస్సు నీరసపడిపోయి, అంతర్దృష్టి లోపించినప్పుడు మనస్సు అంతే మబ్బులు క్రమ్మేస్తాయి. మనస్సు గాబరాపడిపోతుంది. దుఖంతోనూ, విచారంతోనూ మునిగిపోతుంది. కాబట్టి, ఆందోళన, ఆదుర్దా, దుఖం అన్నీ ఏకమవుతాయి. ప్రతి నిత్యం ఎన్నో అవసరాలు,కోరికలు మనను చుట్టేస్తుంటాయి. ప్రతిదీ అవసరంగానే కనిపిస్తుంటుంది. ఆ అవసరాన్ని సాధించుకోవడంకోసం తీవ్రంగా ప్రయత్నించడం, అది సాధ్యం కాకపోయినప్పుడు తీవ్ర నిరాశకు గురికావడం జరుగుతుంటుంది. [ఇంకా... ]

పిల్లల ఆటలు - మెదడుకు పదును

ఎంతమంది ఆడవచ్చు : పది మంది
కావలసిన వస్తువులు : 20 రకాల చిన్నచిన్న వస్తువులు, పేపర్లు, పెన్సిళ్ళు, దుప్పటి
ఆడే స్థలం : గదిలో ఆడవచ్చు
ఆటగాళ్ళ వయస్సు : 5 నుండి 7 సం||రాల మధ్య
పోటీ సమయం : 10 నిమిషాలు
ముందుగా 20 రకాల చిన్న చిన్న వస్తువులను ఒక గదిలో ఉంచాలి. పిల్లలందరిని కూర్చోబెట్టి వస్తువులను పరిశీలించమని చెప్పాలి. [ఇంకా... ]

కథలు - మరో ఉప్పెన

"వీణ్ణి చూస్తూంటే చాలా అసూయగా ఉందే నాకు!" తల్లిని కరుచుకొని ఒదిగి పడుకున్న కొడుకును చూస్తూ అన్నాడు వెంకటరమణ. ఆ దగ్గరితనాన్ని తాను కోల్పోయిన భావం కనిపించింది అతడి గొంతులో. మంచాన్ని ఆనుకొని తనకు దగ్గరగా కూర్చున్న భర్త బుగ్గ మీద కొంటెగా పొడిచింది అమృత. కొడుకు తలను నిమురుతూ "వీడు అసలు నాకు పుట్టిన వాడేనా అమృతా!" అన్నాడు వెంకటరమణ. అతడి పెదాల మీద చిరు మందహసం. వెంకటరమణ చెవిని ఒక గుంజు గుంజింది అమృత. "పరాచికమా?". "అది కాదు. ఎప్పుడూ అమ్మా అమ్మా అంటూ నీ ఊసేగాని నాన్న అంటూ ఒక వెధవ ఉన్నాడని వీడికి తెలియదే !". గాలికి కొట్టుకుంటున్న కిటికీ రెక్కలకేసి చూసింది అమృత . ఇంటి పైకప్పు పెంకుల పగ్గుళ్ళలోంచి మెరుపులు స్పష్టంగా కనిపిస్తూంటే ఉరుముల శబ్దానికి కదిలిన చెట్టుకొమ్మల గలగలలు వింతగా వినిపిస్తున్నాయి. "నిన్నా మొన్నా లేదు. ఇప్పుడు గాలికూడా మొదలయినట్లుంది. "కిటికి తలుపులు వేయడానికి లేచాడు వెంకటరమణ. ఆ పెంకుటిల్లు మధ్యతరగతికి స్థితిగతులకు నిలువుట్టదంలా ఉంది. [ఇంకా... ]

ఇతిహాసాలు - రామాయణము - పాత్రలు - ముఖ్యాంశాలు

రామాయణము మహాకావ్యము. ఇందులో 24,000 శ్లోకాలు సంస్కృత భాషలో వాల్మీకి మహర్షిచే రచించబడ్డాయి. ఇందులో సీతారాముల పవిత్ర చరిత్ర, కొడుకు తండ్రిని ఏవిధంగా గౌరవించాలీ, సోదురులు ఒకరిపట్ల మరొకరు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి, మిత్రుల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి, రాజు ప్రజలనెలా పాలించాలి మొదలైన వివరాలుంటాయి. శ్రీరామచంద్రుడు సాక్షాత్ నారాయణుడే అయినప్పటికీ దైవశక్తిని వినియోగించకుండా మానవ శక్తితోనే దుష్ట శిక్షణ చేయడమే కాకుండా ఒక సాధారణ మానవుడుగా జీవించాడు. అరణ్యవాసం, భార్యావియోగం వంటి కష్టాలన్నీ అనుభవించాడు. రావణ సంహారం మాత్రమే రామాయణ పరమార్ధం కాదు. ఆ త్రేతాయుగాన చెలరేగిన అధర్మాన్ని, బహుభార్యత్వాన్నీ, అసత్యాన్నీ కూడా నిర్మూలించడం,మనిషిలోని దుర్గుణాలన్నీ తొలగించడమే రామావతారం ఉద్దేశం. ఈ సత్కార్యాలవల్ల సాధారణ ప్రజలు ఆయన బాటలోనే నడిచి సుఖ జీవనం సాగించే అవకాశం కలిగింది. అందుకే ఏ యుగానికైనా ఆయనే ఆదర్శ పురుషుడు. [ఇంకా... ]

Wednesday, October 22

నీతి కథలు - ఆటో డ్రైవర్ నిజాయితీ

ఏలూరు పట్టణములో నరేష్ అనే అతడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి తల్లి, తండ్రి, భార్య, ఒక కుమార్తె ఉన్నారు. సంపాదన చాలక అవస్థలు పడుతుండేవారు.తల్లికి అనారోగ్యంగా ఉండేది, తండ్రి సంపాదన అంతంతమాత్రమే. అయినా నీతి తప్పక వచ్చే సంపాదనతో తృప్తిగా జీవిస్తున్నారు. ఒక రోజున ఇద్దరు దంపతులు అతని ఆటోలో అశోక్‌నగర్‌కి స్టేషన్ నుండి ఎక్కారు. వారు ధనవంతులు. నగలుగల బ్యాగ్ ఆటో వెనుక భాగములో పెట్టి దిగిపోయారు. ఇంటికి వచ్చి భోజనము చేస్తుండగా కూతురు ఆటో ఎక్కి ఆడుకుంటూ ఆ బ్యాగ్‌ను చూసి ఇంటిలోకి తెచ్చింది. బ్యాగ్‌లో తినే ఆహారపదార్థములేమైనా వున్నాయేమో అని జిప్ వూడదీసి చూస్తే దాంట్లో బంగారు ఆభరణాలు, డబ్బు వున్నాయి. వెంటనే తల్లిదండ్రులకి చెప్పింది. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - బాలగంగాధర్ తిలక్

పేరు - బాలగంగాధర్ తిలక్
పుట్టిన తేది - 23-7-1856
పుట్టిన ప్రదేశం - రత్నగిరిలో
చదువు - న్యాయశాస్త్రం
గొప్పదనం - బ్రిటీషుపరిపాలనపై ప్రజలలో చైతన్యమును పెంపొందించెను. భారతీయులలో విద్యాభివృద్దికి అతడు పాటుపడెను. తిలక్ రచించిన గ్రంథాలు ('గీతారహస్యం', 'ఆర్కిటిక్ హొం ఆఫ్ వేదాస్') ; స్థాపించిన పత్రికలు ('కేసరి', 'మరాటా')
స్వర్గస్తుడైన తేది - 1-8-1920

బాలగంగాధర్ తిలక్ 1856 వ సంవత్సరం జులై 23న రత్నగిరిలో జన్మించాడు. తండ్రి ఒక సామాన్య బడిపంతులు. తల్లి మహాభక్తురాలు. చిన్నతనంలోనే తిలక్ తండ్రి అతనికి సంస్కృతంలోనూ, గణిత శాస్త్రంలోనూ గట్టిశిక్షణ ఇచ్చాడు. తిలక్ కూడా చదువు పట్ల ఎంతో ఆసక్తి చూపుతూ మెట్రిక్యులేషన్ దాకా ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడవుతూ వచ్చాడు. అతనికి పదహరేళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులిద్దరూ మరణించటం, అతని వివాహం జరగటం అన్ని జరిగిపోయాయి. [ఇంకా... ]

పర్యాటకం - ఉడిపి

కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాకు పశ్చిమంగా మంగళూరుకు 60 కి.మీ. దూరంలో ఉన్న ఉడిపి ఒక పుణ్యక్షేత్రం. అనేక దేవాలయాలతో, ప్రతినిత్యం లక్షలాది మముక్షువులైన యాత్రికులతో, నిత్యనూతనోత్సవాలతో కళకళాలాడుతుంటుంది. ఇచ్చటి వాతావరణం ఎప్పుడూ అనుక్షణ ప్రవర్ధమానమైన దివ్య చైతన్యంతో స్పందిస్తూ ఉంటుంది. 'ఉడుప ' (చంద్రుడు) అనే పదాన్ని అనుసరించి 'ఉడిపి' అనే పేరు ఏర్పడింది. చారిత్రక ప్రసిద్దమైన ఈ పవిత్ర యాత్రాస్ధలం పరిశుభ్రంగా చంద్రుడిలా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడక్కడ పెద్ద పెద్ద అందమైన మామిడి తోటలతో, పనస తోటలతో సువిశాలమైన వరి పొలాలగుండా ప్రయాణంచేసే యాత్రికులకు ఇచ్చటి కొబ్బరి చెట్లు, పోకచెట్లు స్వాగతం పలుకుతుంటాయి. 13వ శతాబ్దానికి చెందిన శ్రీ మధ్యచార్యులు శ్రీ శంకరుల అద్వై తమతాన్ని, శ్రీ రామానుజుల విశిష్టాద్వైత మతాన్ని పూర్తిగా ఖండించి కొత్తగా ద్వైత మతాన్ని (మద్వ మతం) ప్రతిపాదించిన అవతారమూర్తి - వాయుదేవుడు, హనుమంతుడు, భీమసేనుల అవతారం అని ప్రతీతి. గొప్ప పండితుడైన అచ్యుత ప్రేక్షుల ఆశ్రయంలో వేదవేదాంతంగాలు అధ్యయనం చేసిన మధ్వచార్యు (వాసుదేవుడు) ల ధారణాశక్తి సునిశితమైనది. వీరి శరీరం దార్ధ్యం అసాధారణ, అపారం. [ఇంకా... ]

వంటలు - కంది పచ్చడి

కావలసిన వస్తువులు:

కందిపప్పు - పావుకిలో.
ఎండు మిర్చీ - పది.
జీలకర్ర - ఒక చెంచా.
ఉప్పు - సరిపడినంత.
తయారు చేసే విధానం :

కందిపప్పుని మాడనీయకుండా మంచి సువాసన వచ్చేలా వేయించాలి. అది వేగుతుండగానే ఎండుమిర్చి తొడిమలు లేకుండా అందులో వేయాలి. బాగా వేయించి ఈ పప్పుమిరపకాయల్తో తగుపాటి ఉప్పువేసి కొంచెం నీళ్ళు చిలకరిస్తూ మెత్తగా పచ్చడి రుబ్బుకోవాలి. [ఇంకా... ]

జానపద కళారూపాలు - తోలుబొమ్మలు

దీర్ఘ కాలంగా ఆంధ్ర దేశంలోని ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న కళారూపం తోలుబొమ్మలాట. ప్రేక్షకులకు కన్నులపండుగ కల్పించే కళారూపమిది. బొమ్మలతో నాట్యం చేయించడమే తొలుబొమ్మలాట కళారూపం.తోలుబొమ్మలాటల గురించి అనేక శాసనాల్లో కూడా లిఖించబడి ఉంది.

మన ప్రాచీన కళారూపలలో తోలుబొమ్మలు ఒకటి. ఇవి క్రీస్తు పూర్వం 3వ శతాబ్ధినాటికే చాలా ప్రచారంలో ఉన్నాయని తెలుస్తూంది. తెనుగువారి ప్రాచీన కళా వైదగ్ద్యాన్ని ఖండాంతరాలకు వ్యాపించి పెట్టిన కళ ఇది. నేడు పాశ్చాత్య దేశాలలో గొప్పగా చెప్పుకొనే ఛాయా ప్రదర్శనాలకు మూలం ఈ తోలుబొమ్మలే. ఖండాంతరాలకు - జావా, బోర్నియా, సుమిత్ర, బలి, సయాం, కంబోడియా, బర్మా మొదలయిన దేశాలలో - మన దేశంనుంచీ వలస వెళ్ళినవారు తోలుబొమ్మలను ప్రదర్శిస్తూ, రామాయణం, భారతం మొదలయిన కథలను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. [ఇంకా... ]

Tuesday, October 21

పుణ్యక్షేత్రాలు - మంత్రాలయం

కర్నూలు నుండి ఎమ్మిగనూరు ద్వారా తుంగభద్రానదీ తీరంలో పెద్ద సన్యాసులైన శ్రీరాఘవేంద్రస్వామి సమాధి నొందిన బృందావనం ముఖ్య విశేషం మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి సమాధి దేవాలయం మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషనుకు సుమారు 15కి.మీ. దూరం వుంది. ఇక్కడకు రాష్ట్రంలో పలుచోట్ల నుండి టూరిస్టు బస్సులు, R.T.C. బస్సులు నడపబడుతున్నాయి. భారతీయాత్మ, ఆధ్యాత్మిక విద్య 'ద్వైతవేదాంతము' నకు విశిష్టసేవ చేసిన మహామహులు, ఉపనిషత్తులకు ఖండార్ధలు, అనేక ఆధ్యాత్మిక గ్రంధాలకు వ్యాఖ్యానములు వ్రాసి జ్ఞానభక్తిని ప్రభోధించిన సద్గురువు శ్రీమంత్రాలయ రాఘవేంద్రస్వామి వారు. వారు ఇక్కడనే జీవసమాధి పొందారు. [ఇంకా... ]

మీకు తెలుసా - పెన్సిల్ పుట్టిందిలా...

పిల్లలూ! మీకు బొమ్మలు గీయడం వచ్చునా? సరే, బొమ్మలు గీయటానికి ఏమేంకావాలో చెబుతారా? పెన్సిల్, రబ్బర్, కాగితమూ.. అంటున్నారా, సరిగానే చెప్పారు. ఈ రోజు మనం పెన్సిల్ పుట్టుక గురించి తెలుసుకుందాం.

జోసెఫ్ డిక్సన్ ఇంగ్లాండ్‌లో పుట్టాడు. చాలా పేదవాడు. ఇల్లు గడవటానిక ఒకచిన్న దుకాణంలో పనికి చేరాడు. యజమాని చెప్పింది గుర్తుపెట్టుకోవటానికి ఏం చెయ్యాలో తెలియక ఒకరోజు బయటపడి ఉన్న ఓ నల్లరాయితో గోడమీద రాశాడు. అంతే! ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద ఆ నల్లరాయితో రాసేవాడు. ఆ రాయే 'గ్రాఫైట్'. [ఇంకా... ]

ఆధ్యాత్మికం - భగవద్గీత సారం

నీవు అనవసరంగా ఎందుకు దిగులుపడుతున్నావు? నీవు ఎవర్ని చూసి భయపడుతున్నావు? నిన్ను ఎవరు చంపగలరు? ఆత్మకు పుట్టుక గిట్టుకలు లేవు. జరిగినది మంచికోసమే జరిగింది. జరుగుతున్నదేదో మంచికోసమే జరుగుతోంది. జరగబోయేది మంచి కోసమే జరగబోతుంది. గతాన్ని గురించి మనస్సు పాడుచేసుకోవద్దు. భవిష్యత్తును గురించి దిగులుపడవద్దు. ఏమి నష్టపోయావని నీవు బాధపడుతున్నావు? నీతో కూడా నీవు ఏమి తెచ్చావు? ఏమి పోగొట్టుకున్నావు? నీవు ఏమి తయారుచేసావు? ఆ చేసినదేదో నాశనం అయింది. నీవు ఏమీ తీసుకురాలేదు. నీ దగ్గరున్న దాన్ని నీవు ఇక్కడే పొందావు. [ఇంకా... ]

లాలి పాటలు - కృష్ణ లాలీ యశోదమ్మ

కృష్ణలాలీ నందుని కృష్ణలాలీ యశోదమ్మ

నోముల పంట కృష్ణలాలీ || కృ ||

పాలు పెరుగు వెన్నతిని గోల చేసేవు

రవ్వలేల నీతో కృష్ణ వేగలేనురా || కృ ||

గోపకాంతలంతవచ్చి చాడీ చెప్పేరు

నీకు కరువ ఇంట పెరుగు పాల కెపుడైన || కృ || [ఇంకా... ]

పిల్లల ఆటలు - ఉల్టాపుల్టా గేమ్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
కావలసిన వస్తువులు : పేపరు, పెన్ను.
ఆడే స్థలం : గదిలో ఆడవచ్చు

ఈ గేమ్ కి ముందుగానే అన్ని రడీ చేసుకోవాలి. ఒక పేపర్ కింది విధంగా రాసుకోవాలి.

ఉదాహరణకు:

వ త్రి న రా - నవరాత్రి
ప సం ఉ వా - ఉపవాసం
నం రం అ త - అనంతరం
ణి ది మ వ్య - దివ్యమణి [ఇంకా... ]

Monday, October 20

పెద్దల ఆటలు - అష్టాదశా శక్తిపీఠాల ఆట

అష్టాదశ శక్తిపీఠాలు పేర్లు

ఈ ఆట లో పాల్గొనే వారందరికీ ఆట నిర్వహించేవారు పేపరు పెన్ను ఇవ్వాలి. ఆట ఏమిటంటే ఒక్క నిముషంలో అష్టాదశ శక్తిపీటాల పేర్లు వ్రాయాలి. ఎవరైతే ఎక్కువ రాస్తారో వారే విన్నరు.

నిర్వహించేవారి కోసము:

అష్టాదశ శక్తిపీఠాలు:

శ్రీ శాంకరీ దేవి - శ్రీలంక
శ్రీ కామాక్షి దేవి - కంచి
శ్రీ సింహళ దేవి - ప్రద్యుమ్నం
శ్రీ చాముండీ దేవి - కంసపట్టణం [ఇంకా... ]

వంటలు - కాకరకాయ చిప్స్

కావలసిన వస్తువులు:

కాకరకాయలు - 1 కిలో.
కార్న్‌ఫ్లోర్ - 50 గ్రా.
మైదా - 70 గ్రా.
అల్లం, వెల్లుల్లి - ఒకటిన్నర టీ స్పూన్.
ధనియాలపొడి - 1 టీ స్పూన్.
కారం - అర టీ స్పూన్.
జీలకర్ర పొడి - అర టీ స్పూన్.
కొత్తిమీర - 2 కట్టలు.
ఉప్పు - తగినంత.
నిమ్మ ఉప్పు - అర టీ స్పూన్.
రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి సరిపడా.
రెడ్ఆరెంజ్ కలర్ - చిటికెడు.

తయారు చేసే విధానం :

పొడవుగా ఉన్న కాకరకాయల్ని ఎంచుకోండి. శుభ్రం చేశాక చాకుతో పొడవుగా సన్నగా తరగండి. ఈ ముక్కల్ని మరుగుతున్న నీళ్లలో వేయండి. ఈ నీళ్లలో ఉప్పు, నిమ్మ ఉప్పు కలపండి. అయిదు నిమిషాల పాటు కాకరకాయ ముక్కల్ని ఉంచి నీళ్లను వడగట్టండి. [ఇంకా... ]

పిల్లల పాటలు - అమ్మ

అమ్మ కన్న మంచిదీ
ఆమె వంటి పెన్నిధీ
ఎంత వెదకి చూచినా
లేదు లేదు ఎందునా.

అమ్మ కంటి వెలుగుతో
ఆమె చేతి చలువతో
బ్రతుకు పూలు పూయదా?
సతము ఫలము లీయదా? [ఇంకా... ]

కవితలు - గాంధీ కవిత్వం

ఒకరోజు ఒక బక్క పద్యం
గాంధీని చూద్దామని
గాంధీ ఆశ్రమానికి వచ్చింది.
గాంధీ రామ నామం స్మరిస్తూ

నూలు వడకుతూనే ఉన్నాడు
వాకిలి దగ్గర వేచి ఉన్న పద్యాన్ని చూడనేలేదు.
తాను భజన అయినా కానందుకు సిగ్గుపడుతూ
పద్యం గొంతు సవరించుకొంది. [ఇంకా... ]

భక్తి సుధ - శ్రీ సాయి చాలీసా

షిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి కాపాడోయి
దరిశన మియ్యగ రావయ్య ముక్తికి మార్గం చూపుమయా ||షిరిడి||

కఫిని వస్త్రము ధరియించి భుజముకు జోలి తగిలించి
నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో
కలియుగ మందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
షిరిడి గ్రామం నీ నివాసం భక్తుల మదిలో నీ రూపం ||షిరిడి|| [ఇంకా... ]

Saturday, October 18

జానపద కళారూపాలు - బుర్రకథలు

మన జానపద కళాసంపదకు లోటులేదు. కావలసినన్ని జానపద కళారూపాలు మనకు ఉన్నాయి. బుర్రకథలు ఎప్పటినుంచీ ప్రచారంలో ఉన్నాయో సరిగా తెలియదు కాని రామాయణ కాలానికే - ఇవి ఉన్నట్టు తెలుస్తూంది. బుఱ్ఱ కథ ఇవి బొబ్బిలి వరస కథలనుండి, జంగం కథలనుండి రాజకీయ ప్రబోధం ప్రధానోద్దేశంగా సుమారు 1942 ప్రాంతాల్లో అవతరించాయని కొందరి అభిప్రాయం. గుంటురు జిల్లా వీటి జన్మస్థలము. తంత్రి మరియు బుర్ర అనే శబ్దాలు కలిసి తంబుర శబ్దం ఏర్పడింది. ఈ తంబురతో చెప్పే కథలు కనుక ఇవి తంబుర కథలై రానురాను ఆ రూపం మారి బుర్రకథలు అనే రూపం ఏర్పడింది. గుమ్మెటలను బుర్రలు అని గుంటూరు జిల్లాలో వ్యవహరిస్తారు కనుక బుర్రలు కొడుతూ చెప్పే కథలు బుర్రకథలు అని రూపం ఏర్పడి ఉండొచ్చని విమర్శకుల అభిప్రాయం. [ఇంకా... ]

కథలు - నింగినీడలు

'అది అంతే' ఒకింత స్వరాన్ని పెంచుతూ అన్నాడు కమలాకరం. సిరిమల్లికి మొదట్లో అర్ధం కాలేదు. చూస్తుంటే అసలు ఆ మనిషే అర్ధం కాకుండా ఉన్నాడు.

'నా చేతిలో ఏముంది చెప్పండి. అన్నింటికీ ఆ పైవాడి మీద భారం వేయడం తప్ప'

'భారాలు, తులాభారాలు సరే, అసలు ఎవరి భారాలు వారికి ఉంటాయ్ కమలాకరం మాటల్లో ఒకింత అసహనం కనిపిస్తోంది.

'దానికి నేను చేసేదేముంది' ఎడం వైపు ఒత్తిగిల్లుతూ అంది సిరిమల్లి.

'ఇవిగో బలానికి ఇంజక్షన్లు, టానిక్‌లు. ఈ పళ్ళు తీసుకుంటే కడుపులో బేబీగ్రోత్ బాగుంటుంది. ఆరోగ్యం బాగా చూసుకోవలసిన భాద్యత నీదే! బ్యాగ్‌ని ప్రక్కనే ఉన్న టీపాయ్ మీద పెడుతూ అంది దాక్షిణ్య.

సిరిమల్లె వాటి వైపు చూసుకుంది. కొంతకాలమైనా తనను గురించి పట్టించుకునే మనుషులు. కానీ అదే మనుషుల్లో కొంత స్వార్థం, అవసరం తాలూకు ఉద్దేశాలు. వారంతా గత తొమ్మిది మాసాలుగా అంతకు ముందు కొన్నినెలలుగా తన ఇంటిచుట్టూ, తన పేదరికం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. [ఇంకా... ]

తెలుగు బిడ్డలు - త్యాగయ్య

పేరు - త్యాగయ్య.
తండ్రి పేరు - రామబ్రహ్మం.
తల్లి పేరు - సీతమ్మ.
పుట్టిన తేది - 4-5-1767.
పుట్టిన ప్రదేశం - తిరువారూర్.

కాకర్ల త్యాగయ్య 1767వ సంవత్సరం మే నెల నాలుగవ తారీఖున తంజావూరు జిల్లాలోని కావేరీ నదీ తీరంలోని తిరువారూర్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి రామబ్రహ్మం మహాభక్తుడు. తంజావూరును పాలించిన రాజుల అభిమానాన్ని పొందిన రామభక్తుడు. తల్లి సీతమ్మ త్యాగయ్యను ఎంతో ప్రేమతో తన కీర్తనలలో 'సీతమ్మ మాయమ్మ... శ్రీరాముడు మాతండ్రి' అని గానం చేశాడు. తన ఆరాధ్య దైవాలైన సీతారాముల పేర్లు తన తల్లిదండ్రుల పేర్లు కావటం అతనికి ఎంతో ఆనందం కలిగించింది. తల్లి పేరును కొంతమంది రచయితలు శాంతమ్మగా రాశారు, కానీ అది నిజంకాదు. ఆయన రచించిన 'ప్రహ్లాద భక్తి విజయం' అనే రూపకంలో తండ్రిపై ప్రేమతో తండ్రి రామబ్రహ్మం గురించి ప్రస్తావించాడు. [ఇంకా... ]

వ్రతములు - అట్లతద్దె

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక రాచ చిన్నది తోడి చెలికత్తెలతో కలసి అట్ల తద్దె నోమును నోచుటకు వుపవాసముండెను, మూడు జాములు దాటు సరికి రాచ బిడ్డ సుకుమారి యగుటచే శోషవచ్చి పడిపోయెను. అంతట నామె అన్నలు వచ్చి ఆమె అట్లు పడి పోవుటకు కారణమును తల్లి వలన గ్రహించిరి, వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చు వరకు నుండ లేదని అనుకొని ఒక చింతచెట్టు కొమ్మకు అద్దము కట్టి దానికి యెదుట అరికె కుప్పకు అగ్గిని పెట్టి చెల్లిని లేపి "అడుగో చంద్రుడు వచ్చెను. భోజనమును చేయు" మనిరి. అద్దములో నిప్పు చూచి చంద్రుడే వచ్చెననుకొని, ఆమె భోజనము జేసెను. [ఇంకా... ]

లాలి పాటలు - పవళింపు పాట

పవళింప వేంచేయు సమయము స్వామీ ||ప||
పసిడి పాదుకలూని పడతి సీత కేలూని ||ప||

రసిక జనుల గొల్వ రత్న పాదుకలూని
వసియింప వేంచేయి సమయము స్వామీ ||ప||

ముసిముసి నగవుల మోహనకారుడై
ముదమున వేంచేయు సమయము స్వామీ ||ప||

దశరధాత్మజుడిదె దయతోడ నరసింహ
దాసుని ప్రార్ధన సకలము చేకొని ||ప|| [ఇంకా... ]

Friday, October 17

జానపద గీతాలు - మొక్కజొన్న తోటలో

సుక్కలన్ని కొండమీద - సోకుజేసుకునే వేళ,
పంటబోది వరమడితో - పకపక నవ్వే వేళ,
సల్లగాలి తోటకంత - సక్కలగిల్లి పెట్టువేళ,
మొక్కజొన్న తోటలో - ముసిరిన సీకట్లలో,
మంచెకాడ కలుసుకో, - మరువకు మామయ్య,

చీకటి మిణుగురు జోతుల - చిటిల చిల్లులడక మునే,
సుద్దులరాగాలు చెవుల - నిద్దరతీయక మునుపే,
ఆకాశపుటొడిని తోట - ఆవలింత గొనక మునే,
పొద్దువాలుగంటనే - పుంతదారి వెంటనే,
సద్దుమణగనిచ్చిరా - ముద్దులమామయ్య! [ఇంకా... ]

మీకు తెలుసా - కాగితం కథ

క్రీ.పూ. 3500 సంవత్సరం ప్రాంతంలో పురాతన ప్రపంచంలో రాయడం కోసం వాడబడిన వస్తువు "పేపిరస్" అనే పదం నుండి "పేపర్" వచ్చింది. ప్రాచీన ఈజిప్టులోని ప్రజలు రాయడానికి ఒక కాడ నుండి ఈ పేపిరస్ తయారుచేయబడేది. దృఢత్వానికీ, ఎడారిలోని పొడిగాలికీ అనువైన పేపిరస్ పైన నమోదైన పాత రికార్డులు యింకా లభిస్తున్నాయి. వాటి వల్ల మనం గత నాగరికతల గురించి చక్కగా తెలుసుకోగలుగుతున్నాము. పురాతన కాలంలో గొర్రె లేక మేక తోలునుండి తయారుచేసిన తోలు కాగితం కూడా రాయడానికి ఉపకరించేది. తోలు కాగితంగానీ రాసే పేపరస్‌గానీ ఖరీదైనవి. చాలా తరచుగా తక్కువ ఖరీదైన చిన్న మైనపు పలకలకు అవి భర్తీ చేయవడ్డాయి. చాలాసార్లు శుభ్రంగా గీకివేసి మళ్ళీ రాతకు వాడుకునేలాగ జంతువుల తోళ్ళు ఉపకరించాయి. [ఇంకా... ]

వంటలు - ఉప్పిడి పిండి

కావలసిన వస్తువులు:

పాలు - 5 లీటర్లు.
చక్కెర - 600 గ్రా.
కేసరి (కుంకుమపువ్వు) - 3 గ్రా.
బాదంపప్పు - 100 గ్రా.

తయారు చేసే విధానం :

పాలు బాగా చిక్కబడేంతవరకు సన్నని సెగపై మరిగించి, ఆపై ట్రేలో పోయాలి. ఫ్యాను గాలికింద ఆరబెట్టి కోవ సిద్ధంచేసుకోవాలి. కోవా గట్టిపడ్డ తర్వాత కొద్దిగా తీసుకుని దానిలో కుంకుమపువ్వు వేసి కొంచెం వేడిపాలు పోయాలి. [ఇంకా... ]

ముఖ్యమైన ఘట్టాలు - బారసాల

బారసాల అంటే

దీనిని అసలు బాల సారె అంటారు. అది వాడుకలోకి వచ్చే సరికి బారసాల అయినది. అసలు బారసాల అంటే పేరు పెట్టటం లేదా నామకరణం చేయటం అని అర్థం.

ఎందుకు చేస్తారు

పుట్టిన బాబుకో లేదా పాపకో పేరు పెట్టటానికి చేస్తారు.

ఎప్పుడు చేస్తారు

పుట్టిన 11 వ రోజు నుండి 27 వ రోజు లోపల చేస్తారు. ఈ రోజులలో 11, 21, 27 రోజులలో చాలా మంది చేస్తారు, అలానే బేసి సంఖ్యలు వచ్చే ఏ రోజైనా చేసుకోవచ్చు. ఈ రోజులలో చేసేటట్లైతే మంచి రోజులు చూసుకో నవసరం లేదు. అప్పుడు కుదరక పోతే పాపో, బాబో పుట్టిన 3 నెలల్లో చేస్తారు కానీ వీలుంటే నెలలోపల చేస్తేనే మంచిది.

ఎవరు చేస్తారు

అమ్మాయి పుట్టింటి వాళ్ళు చేస్తారు. [ఇంకా... ]

ఇతిహాసాలు - కంసుడు

కంసుడు ఉగ్రసేనుని కుమారుడు. రాక్షసాంశచే పుట్టుటవలన క్షత్రియుడైనా నిర్ధాక్షిణ్యము, కఠినత్వం, దుర్మార్గం మొదలైన అంశములు బంధించి మధురా నగరానికి రాజయినాడు. జరాసంధుడు తన కుమారులైన ఆస్తి పాస్తిలను ఇతనికిచ్చి వివాహం జరిపించాడు. శిశుపాల దంత వక్ర్తులు, రుక్మి మొదలైన వారు ఈతని మిత్రులు. తన సోదరిని వసుదేవునికిచ్చి వైభవంగా వివాహము జరిపించి బావతో నగరంలోకి వస్తున్నాడు. ఆనందంగా రధం నడుపుతూ, మార్గమధ్యంలో ఆకాశవాణి మెరుపులా మెరుస్తూ "ఈనీ చెల్లెలు దేవకీ గర్భవాసాన జన్మించిన 8వ శిశువు వలన నీకు మరణం తప్పదు" అని హెచ్చరించెను. ఆ హెచ్చరిక వింటూనే ఆవేశంతో రధం నుండి కిందకు దూకి చెల్లెలిని క్రిందకీడ్చి కత్తితో ఆమెను నరకబోయెను. కానీ వసుదేవుడు "బావా! శాంతించు! ఈమె గర్భమునందు జన్మించిన ఎనిమిదవ శిశువు వల్లనే గదా! నీకు ప్రాణగండము! ఈమె ఏమిచేసింది? స్త్రీని, అబలను, పైగా నీ చెల్లెలిని చంపటం భావ్యంకాదు విడువు" అంటూ బ్రతిమిలాడెను. [ఇంకా... ]

Thursday, October 16

వ్యక్తిత్వ వికాసం - విద్యార్థుల అద్భుత ఙ్ఞాపకశక్తికి 35 టెక్నిక్‌లు

విద్యార్థుల అద్భుత ఙ్ఞాపకశక్తికి 35 టెక్నిక్‌లు

1. మీ ఙ్ఞాపకశక్తి మీద అంచలమైన నమ్మకం, ఆశావహ దృక్పథం.
2. ఙ్ఞాపకశక్తి పెంపొందించాలంటే ఇంట్లో పరిస్థితులు సజావుగా ఉండాలి.
3. ఙ్ఞాపకశక్తి వృద్ధి కోసం పరిశీలన, ఆలోచన అవసరం.
4. మీకు సులభంగా అర్థమయ్యే పాఠ్యపుస్తకాలనే ఎన్నుకోండి.
5. సరైన ఙ్ఞాపకశక్తి కోసం చక్కటి ఆహారం.
6. ఒక చిన్న ధ్యానపు టెక్నిక్ ద్వారా ఙ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం.
7. ఇంగ్లీషు అక్షరాలను అన్వయించి ఫార్ములాలని, లెక్కలను కనుగొనుట.
8. లింకు పద్థతి ద్వారా జ్ఞాపకం వుంచుకోవడం (Acronym method).
9. ఫార్ములాలని గుర్తు పెట్టుకోవడం.
10. ఇంగ్లీషులో పదాలను గుర్తు పెట్టుకోవడం. [ఇంకా... ]

కవితలు - తేనెకన్న మధురం మన తెలుగు

తేనెకన్న మధురం రా, తెలుగు ఆ

తెలుగుదనం మా కంటి వెలుగు

తెలుగుగడ్డ పోతుగడ్డ ఎంత పచ్చన, మా

తెలుగు గుండెలో స్నేహము ఎంతను!

మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లన, మన

తరతరాల కథను పాడు గుండె ఝల్లన [ఇంకా... ]

భక్తి సుధ - శ్రీ దశావతార స్తుతి

1. వేదోధారవిచారమతే ! సోమకదానవసమ్హరణ!
మీనాకారశరీర! నమో భక్తంతే పరిపాలయ మాం.
నామస్మరణా ధన్యోపాయం న హిపశ్యామో భవతరణే !
రామ ! హరే ! కృష్ణ ! హరే తవ నామ పదామి సదా నృహరే !

2. మంథాచలధారణ హేతో దేవాసుర పరిపాల విభో
కూర్మాకార శరీరా నమో భక్తం తే పరిపాలయమాం.
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే

3. భూచోరక హర పుణ్యమతే క్రీడోధ్ధఋతభూ
క్రోడాకార శరీర నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామే భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే [ఇంకా... ]

పిల్లల ఆటలు - పదంతో పదం గేమ్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
కావలసిన వస్తువులు : పేపరు, పెన్ను.
ఆడే స్థలం : హాలు లాంటి ప్రదేశంలో

ఈ గేమ్‌కి ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. గేమ్ ఏమిటంటే మనం తెలుగులో రెండు ఇంగ్లీషు పదాల అర్థం వచ్చేటట్లు సెంటెన్స్ ఇస్తే గేమ్ ఆడేవారు ఆ రెండు ఇంగ్లీషు పదాలను వ్రాయాలి సుమా. అది కూడా హోస్ట్ ఇచ్చే సెంటెన్స్‌లోని రెండు ఇంగ్లీషు పదాలు ఒక దాంట్లో ఒకటి ఉంటాయి. అదే పదంలో పదం. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా - కరాటే

పూర్వం చదువుల్లో యుద్ద విద్యలు కూడా ఒక భాగంగా ఉండేవి. కేవలం టెక్స్ట్ బుక్కులను బట్టీ కొట్టడమే కాకుండా, శరీర ధారుఢ్యం పెంచుకోవడానికి, శత్రువు నుంచి కాపాడుకోవడానికి కూడా యుద్ద విద్యలు అక్కరకొచ్చేవి. కర్రసాము, కత్తిసాము, మల్లయుద్దము, విలువిద్య... ఇవన్నీ మన యుద్దవిద్యలు, అయితే కాలక్రమంలో ఈ 'కరాటే' విద్య మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. నిరాయుధంగా శత్రువు ఎదిరించడంలో కరాటే మించింది లేదు. 'కరాటే' అనే మాటకు అర్థమే 'ఖాళీ చేతులు' అని అర్థం. [ఇంకా... ]

Wednesday, October 15

వ్రతములు - ధైర్యలక్ష్మి నోము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక బ్రాహ్మణస్త్రీకి అయిదుగురు తమ్ములుండిరి. ఆ తమ్ముల పెండ్లినాటికి ఆమె భర్తకు ప్రాణముమీదికి వచ్చెడిది. అందుచే నామె పెండ్లికి వెళ్ళెడిది కాదు. ఆ విధముగా నలుగురు పెండ్లిండ్లు అయినవి అయిదవ తమ్ముని పెండ్లి కూడా జరుగుచున్నది. అప్పుడుకూడా యెప్పటి వలెనే ఆమె భర్తకు ప్రాణముమీదికి వచ్చెను. [ఇంకా... ]

ఆధ్యాత్మికం - దైవాలు నైవేద్యాలు

మనము పూజించే దైవాలు - అర్పించే నైవేద్యాలు

మనము సకల దేవతారాధనలు చేస్తున్నాము. ఇష్టదైవాల్ని ఎన్నుకోవడం ఆయా భక్తుల అనుభూతులపై, మహిమలపై ఆధారపడి ఉంటుంది. అష్టోత్తర సహస్రనామ అర్చనలు, షోడశోపచార పూజలు చేసిన తర్వాత ఇష్టదైవాలకు అవసర నైవేద్యం, మహానైవేద్యం, తాంబూల సమర్పణ, హారతి (నీరాజనం) మంత్రపుష్పం, తీర్ధస్వీకారం, ఫలశ్రుతి అనంతరం పూజ సమాప్తమగును. ఐతే సకల దేవతా పూజా విధనం గురించి తెలుసుకుని, నైవేద్యాల వివరణలోకి వెళ్దాం.

సకల దేవతా పూజా విధానము

శ్రీ గురుభ్యోనమహా గురువులందరూ సన్నిహితులుగా నున్నట్లు భావించి వారికి నమస్కరించి "హరిహ్ ఓం" అని దేవుని ధ్యానించాలి. పూజకుముందు రాగిగ్లాసులో నీరు, రాగి ఉద్దరిణె, రాగి పళ్ళెము, తీర్ధపాత్ర, పుష్పములు, గంధము, ఘంట, అక్షతలు, పంచామృతము, గోక్షీరము నైవేద్యానికి పటికబెల్లము, ద్రాక్షగానీ, పండ్లుగానీ, వండిన మహానైవేద్యము, దీపములు, ధూపము, హారతి కర్పూరము అన్నీ ముందుగా సిధ్ధంగా ఉంచుకొనవలెను. [ఇంకా... ]

హాస్య కధలు - కంప్లయింట్

తిరుగుదామా, వద్దా అనుకుంటూ బద్ధకంగా కాలాన్ని చూపిస్తున్న రిస్టు వాచీకేసి చిరాగా చూశాడు మూర్తి. చేతినుంచి కసిగా లాగి, దాన్ని గట్టిగా నాలుగుసార్లు విదిలించాడు. ఇంక బాగుండదన్నట్లు మొహమాటంగా అడుగులేయసాగింది సెకన్ల ముల్లు. ఇంక ఆ వాచీని నమ్ముకోవడం అనవసరమనే నిర్ణయానికొచ్చి విచారణాలయానికి చేరి "ఎక్స్యూజ్ మీ" అన్నాడు. కునికుపాట్లు పడుతున్న ఆమె ఉలిక్కిపడి "యస్" అని వెంటనే "కాకినాడకు పోయే సెమి లగ్జరి ఎక్స్‌ప్రెస్ ఒంటిగంటకు ఒకటో నంబరు ప్లాట్‌ఫాం మీదకి వస్తుంది" అని వెంటనే కళ్ళు మూసేసుకుంది. ఏమీ అడక్కుండానే ఠక్కున సమాధానం చెప్పేసి చప్పున నిద్రలోకి జారుకున్న ఆమెకేసి ఓ క్షణం అయోమయంగా చూశాడు మూర్తి. మళ్ళీ "ఎక్స్యూజ్ మీ మేడం" అన్నాడు. [ఇంకా... ]

గృహాలంకరణ - లోగిలి అందాన్నిచ్చే అలంకరణ

మీ ఇంట్లో మీ బెడ్‌రూం ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ పిల్లల రూమ్‌ ఎలా అలంకరిస్తే వారు సంతోషంగా ఉంటారు ఆలోచించండి.

1. మీ డ్రాయంగ్ రూమ్‌లో ‌కళాకాంతులు తెచ్చే ఇత్తడి ఫర్నిచర్, ఉడ్ ఫర్నిచర్‌ను అమర్చండి. సోఫాలు, మంచి కళాత్మకమైన పెయింటింగ్స్, చక్కటి క్రోటన్ మొక్కలు, ప్లవర్ వాజ్‌లు ఏవిధంగా ఉంటే మీ పక్కింటివారికి అసూయ కలుగుతుందో అలా అమర్చండి.

2. మీ హాలులో ఏవిధమైన సిటింగ్ ఏర్పాట్లు ఉంటే బావుంటుందో చూపండి. ఏ మ్యూజిక్ సిస్టం, టివి., వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్ సిస్టం, సోఫాల దగ్గర నేలమీద సుతిమెత్తని తివాచీలు ఎలా ఏర్పాటుచేస్తే అందంగా ఉంటుందో చూడండి.

3. మీ ఇంటికి వచ్చిన అతిధులకు మీరు గోడలకు అమర్చిన పెయింటింగ్స్ చూసి విస్మయపడేలా ఉండాలి. వాటిని ఎక్కడ కొన్నారు అని అడిగి, మాకు కూడా ఇటువంటివి కొనిపెట్టండి అనేలా ఉండాలి. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - మహత్మా గాంధీ

పేరు : మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( మహాత్మా గాంధీ )
తండ్రి పేరు : కరంచంద్ గాంధీ
తల్లి పేరు : పుత్లీబాయి
పుట్టిన తేది : 2-10-1869
పుట్టిన ప్రదేశం : పోరుబందర్
చదివిన ప్రదేశం : లండన్
చదువు : లాయర్
గొప్పదనం : శాంతియుతంగా అనేక సత్యాగ్రహాలు చేసి ఆంధ్ర దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు
స్వర్గస్తుడైన తేది : 31-1-1948

మహాత్మా గాంధీ గుజరాత్ లోని ఖయిత్వాద్ ప్రాంతంలోని పోరుబందర్ లో కరంచంద్ గాంధీ, పుత్లీబాయి దంపతులకు 1869వ సంవత్సరం అక్టోబర్ 2న జన్మించాడు. నీతి నిజాయితీలకు కట్టుబడిన కుటుంబంలో జన్మించిన గాంధీ చిన్నతనం నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరుగుతూ, తల్లి దండ్రుల యెడల గురువుల యెడల ఎంతో వినయ విధేయతలతో ఉంటూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. మోహన్ దాస్ కి పన్నెండవ సంవత్సరంలోనే కస్తుర్భాతో వివాహమయింది. [ఇంకా... ]

Tuesday, October 14

సైన్స్ - రక్తము

18 మరియు 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి సగటున 45 కి.గ్రా.లు భారంతూగే ప్రతీ ఆరోగ్యవంతమైన వ్యక్తి పురుషుడు మూడేసి మాసాలకొకసారి, స్త్రీ నాల్గేసి మాసాల కొకసారి నిర్భయంగా రక్తదానం చేయవచ్చు. మన శరీరంలో 4.5 మొదలు 5.5 లీటర్లు రక్తం ప్రవహిస్తుంది. దీంట్లో ప్రతీసారీ 10 శాతం అంటే (450-550సిసి) రక్తం దానం చేయవచ్చు.

దానం చేసిన రక్తంలో ద్రవరూపమైన పదార్ధాలు శరీరంలో 10 లేక 12 గంటలలో ఉండే కణాలు మాత్రం 4 మొదలు 14 రోజులలో భర్తీ అవుతాయి. ఈ కాలవధిలో దీనివల్ల శరీరానికి ఎటువంటి బాధ కలుగదు. రక్తదానం చేసిన తరువాత ఒక రోజు అధికంగా నీరు తాగమంటారు. రక్తదానం వల్ల మీ ఆయువు క్షీణించదు. ఇతర బాధలు ఉండవు. [ఇంకా... ]

పుణ్యక్షేత్రాలు - ద్రాక్షారామం

భీమేశ్వర స్వామి లింగము స్ఫటిక లింగము. సుమారు 15 అడుగుల పైగా ఎత్తుంటుంది. అభిషేకాదులు చేయటానికి పైన రెండవ అంతస్తునుంచి చేయవలసిందే. పంచారామాల్లో ఒకటిగాను, జ్యోతిర్లింగాల్లో ఆఖరిదిగాను చెప్పబడే ఈ శైవక్షేత్రం చాల మహిమమాన్వితమైనదని చెప్పకోవచ్చు. 12వ శతాబ్దం చివరన వేములవాడ భీమకవి స్వామి నారాధించి వాక్శుద్ధి కలిగిన వాడయ్యాడని ప్రతీతి. 15వ శతాబ్దంలోని ప్రౌఢ కవి మల్లన, రుక్మాంగద చరిత్రమును, కవిసార్వభౌముడు, ఆంధ్ర నైషధకర్త శ్రీ నాధుడు తన భీమేశ్వర పురాణమును, మరి యింకా మల్లి ఖార్జున పండితుడు, సూరన కవి మొదలగు ప్రాచీన కవులెందరో స్వామి మహత్యమును వేనోళ్ళ ప్రశంసించటం జరిగింది. [ఇంకా... ]

పిల్లల ఆటలు - గాలిపటాలు

కావలసిన వస్తువులు : రంగు కాగితాలు, జిగురు, చీపురుపుల్లలు, గాలిపటాలకు వాడే దారం ఇవన్ని పచారి షాపులో అమ్ముతారు.

రంగురంగుల కాగితాలను చతురస్త్రాకారంగా చేసి వాటిని ఒక సూత్రం ప్రకారం కట్టాలి. అప్పుడే ఈ గాలి పటాలు చక్కగా ఎగురుతాయి. వీటికి తోకలు కూడా ఉంటాయి. ఆటగాళ్ళంతా ఈ గాలి పటాలకు దారాలను కట్టి గాల్లో ఎగురవేస్తారు. ఎవరు ఎక్కువ దూరం ఎగుర వేస్తారో వారు గెలిచినట్లు. [ఇంకా... ]

వంటలు - కందులతో కచోరీలు

కావలసిన వస్తువులు:

పచ్చికంది గింజలు - ఒక కప్పు.
గోధుమపిండి - ఒక కప్పు.
మైదాపిండి - ఒక కప్పు.
బంగాళదుంప - ఒకటి.
పచ్చిమిరపకాయలు - నాలుగు.
కారంపొడి - అర టీ స్పూను.
కొత్తిమీర తరుగు - పావు కప్పు.
నెయ్యి లేక డాల్డా - ఒక టీ స్పూను.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం :

ముందుగా గోధుమపిండి, మైదా పిండిలలో నెయ్యి లేక డాల్డా, తగినంత ఉప్పు వేసి పూరీల పిండిలా కలిపి పెట్టుకోవాలి. [ఇంకా... ]

వ్యక్తిత్వ వికాసం - వివేకానందుడు

1893 సెప్టెంబర్ 11వ తేది - పశ్చిమ దేశాలతో ముఖ్యంగా అమెరికాతో ఇండియా యొక్క సాంస్కృతిక బంధంలో ఒక కొత్త ఘట్టానికి ప్రారంభ చిహ్నంగా నిలుస్తుంది. ఆరోజు చికాగో (అమెరికా)లోని పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్‌లో జరిగిన సమావేశానికి ప్రపంచమంతటి నుండీ ఖ్యాతినొందిన ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో 30 సంవత్సరాల వయసుగల భారతీయుడు శ్రీరామకృష్ణుని శిష్యుడు అయిన స్వామి వివేకానంద ఉన్నారు. పసుపు రంగు దుస్తులు ధరించిన వివేకానంద తన పేరుతోసహా అన్ని భౌతిక సంపదలను పరిత్యజించారు. కేవలం సన్యాసి చిహ్నాలు, భగవద్గీత మరియు థామస్ ఏ. కెంపిస్ రచించిన "ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్" అనే రెండు గ్ర్రంధాలు తప్ప స్వంతమనేదేదీ లేకుండా సర్వం విసర్జించారు. [ఇంకా... ]

Monday, October 13

జానపద గీతాలు - బావా! బావా! పన్నీరు

బావా! బావా! పన్నీరు బావను పట్టుకు తన్నేరు
మూడు గుద్దులు గుద్దేరు
మూలన మంచం వేసేరు
ముంతెడు గంజి యిచ్చేరు

బావా! బావా! పన్నీరు బావను పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు వీశెడు గంధం పూసేరు
చావిడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు [ఇంకా... ]

పెద్దల ఆటలు - వైకుంఠ పాళి

ఎంతమంది ఆడవచ్చు : ఇద్దరు

కావలసిన వస్తువులు : పరమపద సోపానం ఇది జనరల్ షాపులో లభిస్తుంది, చింతపిక్కలుగాని, గవ్వలుగాని

పరమపద సోపానం ఈ చార్టు నిండా గడులుంటాయి. పాములు, నిచ్చెనలు ఉంటాయి. ఆటగాళ్ళకు సంబంధించిన పిక్క పాము గళ్ళలోకి వేళ్తే చనిపోయి, ఆ పాములు ఏ గదిలోకి జారివుందో ఆ గడికి దిగిపోతుంది. [ఇంకా... ]

ఆధ్యాత్మికం - పంచభూత లింగాలు

పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

పృథ్విలింగం: ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

ఆకాశలింగం: ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. [ఇంకా... ]

లాలి పాటలు - రామా లాలీ

రామా లాలీ మేఘశ్యామా లాలీ
తామరసనయన దశరథతనయా లాలీ ||రా||

అబ్జవదన ఆటలాడి అలసినావురా నీ
బొజ్జలో పాలరుగగానే నిదురబోవరా ||రా||

అద్దాల తొట్టెలో నేమో అనుమానించేవూ
ముద్దులపాపలున్నారని మురిసి చూచేవూ ||రా|| [ఇంకా... ]

పిల్లల ఆటలు - డైలాగ్స్ గేమ్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
కావలసిన వస్తువులు : పేపరు, పెన్ను.
ఆడే స్థలం : ఎక్కడైనా.

ఈ గేమ్‌కి అన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గేమ్‌కి తెల్లపేపర్ మీద సినిమాలలో ఊతపదంలా వాడే పదము లేదా సెంటెన్స్ రాయాలి. ఆ వాక్యాన్ని ఎవరు ఉపయోగించారో ఏ సినిమాలోదో వ్రాయమనాలి. [ఇంకా... ]

Friday, October 10

లాలి పాటలు - చిట్టిపాప

చిన్ని మా అమ్మాయి శ్రీ ముఖము చూసి
సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెఱుచు
పందిట్లో అమ్మాయి పాకుతూ వుంటే
పనసపండని జనులు పరుగులెత్తేరు
దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటే
దోసపండని జనులు దోసిలొగ్గేరు [ఇంకా... ]

తెలుగు బిడ్డలు - సరోజినీ నాయుడు

పేరు : సరోజినీ నాయుడు.
తండ్రి పేరు : అఘోరనాధ ఛటోపాధ్యాయ.
తల్లి పేరు : శ్రీమతి వరద సుందరీదేవీ.
పుట్టిన తేది : 1879 వ సంవత్సరంలో జన్మించెను.
పుట్టిన ప్రదేశం : హైదరాబాద్‌.
చదివిన ప్రదేశం : ఇటలీ, స్విట్జర్లాండ్.
చదువు : మెట్రిక్యులేషన్.
గొప్పదనం : ఈమె భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనటమేగాక, స్రీ విమోచన కోసమూ, అస్పృశ్యతా నివారణ కోసమూ కృషి చేశారు.
స్వర్గస్తురాలైన తేది : 2-3-1949.
రచించిన రచనలు : 'గోల్డెన్ త్రెషోల్డు', 'బర్డ్సు ఆఫ్ టైం', 'ఫెదరర్ ఆఫ్ ది డాన్'.

హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో సభల్లోనూ, సమావేశాల్లోనూ ప్రసంగాలు ఇచ్చి ప్రజల్లో సహజీవనం చేసిన మహనీయ మహిళ సరోజినీ నాయుడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనిన ఆధునిక భారతదేశ ప్రముఖ స్త్రీలలో ఈమె ఒకరు. [ఇంకా... ]

వ్రతములు - ఉండ్రాళ్ళతద్దె

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక ఊరిలో స్త్రీలందరు భాద్రపద బహుళ తదియనాడు వుండ్రాళ్ళ తద్దె నోమును నోచు కొనుచుండిరి. అప్పుడావూరి రాజు గారి వేశ్య కూడా నోము నోచు కొనెదనని రాజుతో చెప్పెను. రాజు "నీకు కావలసిన వస్తువులేవో చెప్పు" మనెను. ఆభోగముది చమత్కారముగ తనకు ఆకూ, గీకూ, కోకా, గీకా, కూరా, గీరా కావలయునని చెప్పెను. అదియెంతపని యని రాజు వాటిని తెచ్చుటకు నౌకరులనుబంపెను. వారన్నింటిని తెచ్చిరిగాని 'గీ'యను పేరుతో నున్న వాటిని తేలేక పోయిరి. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఇంతింత దీపం

ఇంతింత దీపమ్ము ఇల్లెల్ల వెలుగు

మాడంత దీపమ్ము మేడలకు వెలుగు

గోరంత దీపమ్ము కొండంత వెలుగు

గోపాలకృష్ణయ్య గోకులము వెలుగు [ఇంకా... ]

మీకు తెలుసా - రుద్రాక్ష

ఆధ్యాత్మికతతో, ప్రేమపూరకమైన భక్తితో, భక్తి వైరాగ్యంతో నిండిపోయుండే భారతీయుడి హృదయానికీ, రుద్రాక్షకూ అవినాభావ సంబంధం ఉంది. ఈ సంబంధం భక్తుడికీ, భగవంతునికీ ఉన్న సంబంధంవంటిది. రుద్రాక్షను భగవంతునికి ప్రతిరూపంగా భావించే సంప్రదాయం ఆది కాలంనుండీ మనకు వస్తూనే ఉంది. ఇది కేవలం సంప్రదాయంగానే కాక అనేక విశ్వాసాలకు ప్రతిరూపంగా కూడా ఉండడంతో కుల మత ప్రమేయం లేకుండా వీటిని భారతీయులు ధరిస్తుంటారు. ఇవి అత్యంత శక్తివంతమైనవనీ, వీటిని ధరిస్తే ఎటువంటి చెడు ప్రభావం తమపై పడదనే భావన ఉండడంతో వీటికి గిరాకీ ఎక్కువ. చాలా అరుదుగా లభించే రుద్రాక్షలంటే ఎవరైనా ఆరాటపడుతూనే వుంటారు. [ఇంకా... ]

Thursday, October 9

సంగీతం - జయదేవుడు

12వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి జయదేవుడు. పశ్చిమ బెంగాలుకు చెందిన బిర్‌భూం జిల్లాలోని అడ్‌జై నదీ తీరంపైన వెలసిన ఒక చిన్న గ్రామమ్మైన కౌండుభి (అప్పట్లో దీన్ని కెండుబిల్వ అని పిలిచేవారు)లో జయదేవుడు జన్మించాడు. "గీత గోవిందం" అనే తన ఉతృష్టమైన సంస్కృత కావ్యాన్ని జయదేవుడు ఈ కెండులి గ్రామంలోనే వ్రాసాడు. అప్పట్లో గౌడ్‌గా పిలువబడే బెంగాలును కళల సాహిత్యాభిమానులైన సేన రాజులు పాలించేవారు. గౌడ్ రాజ్యాన్ని పాలించిన ఆఖరి గొప్ప హిందూ రాజు లక్ష్మణసేన (క్రీ.శ.1178-1205) కొలువులొ వెలసిన మాణిక్యాలలో ఒక మణిగా జయదేవుడు ఉండేవాడు. [ఇంకా... ]

జానపద గీతాలు - చల్ మోహనరంగా...

నీకు నీవారు లేరు నాకూ నా వారు లేరు
ఏటి ఒడ్డున ఇల్లు కడదము పదరా చల్ మోహనరంగా

నీకు నాకు జోడు కలసెను గదరా
మల్లె తోటలోన మంచినీళ్ళ బావికాడ
ఉంగరాలు మరచి వస్తిని కదరా || చల్ || [ఇంకా... ]

నీతి కథలు - ఎత్తుకు పై ఎత్తు

ఒక ఊరిలో ఒక వర్తకుడున్నాడు. అతడు గొప్ప జిత్తుల మారి. అతనొక నాడు మరొక వూరి సంతకు బయలుదేరాడు. దారిలో అతను చాలా విచారంగా వున్నాడు. అతని విచారానికి కారణం ఆనాడు తనింకా లాభసాటి పని ఏదీ చెయ్యలేదు అన్న ఆలోచనే. ఎలాగో లాభం దారిలోనే సంపాదించాలనే దురాలోచన ప్రారంభమయిందతనికి. ఇంతలో దారిలో ఒక మనిషి తారసపడినాడు. ఆ రైతు మరొక గ్రామం నుండి షావుకారు వెళుతున్న గ్రామానికే సంతపని మీద వెళుతున్నాడు. అతన్ని చూడగానే షావుకారికి పల్లెటూరి రైతు అంటే బైతు అని షావుకారు నమ్మకం. ఆ నమ్మకంతో సునాయాసమైన లాభం సంపాదించడానికి షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. రైతుని చూసి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. రైతు సంతకు వెడుతున్నానని జవాబు చెప్పాడు. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఆటలంటే మాకిష్టం...

ఆటలంటే మాకిష్టం - పాటలంటే మాకిష్టం
ఆటల కన్నా పాటల కన్నా - అల్లరి పనులే మాకిష్టం
సినిమాలంటే మాకిష్టం - మిఠాయిలంటే మాకిష్టం
సినిమా కన్నా మిఠాయి కన్నా - షికార్లు కొట్టుట మాకిష్టం
పిట్టలంటే మాకిష్టం - పువ్వులంటే మాకిష్టం
పిట్టల కన్నా పువ్వుల కన్నా - చెట్లు ఎక్కడం మాకిష్టం [ఇంకా... ]

వంటలు - ఎర్ర క్యాప్సికం దోసె

కావలసిన వస్తువులు:
ఎర్ర క్యాప్సికం (సన్నగా తరగినవి) - ఒకటి.
వెన్న - అరకప్పు.
కోడిగుడ్లు (తెల్లసొన మాత్రమే తీసుకోవాలి) - రెండు.
మొక్కజొన్నపిండి - పావుకప్పు.
మిరియాల పొడి - అరస్పూను.
ఉప్పు - తగినంత.
ఉల్లిపాయలు (సన్నగా తరగినవి) - ఒకటి.
ఉల్లికాడలు (వీటిని పొడుగ్గా నిలువుగా కోసుకోవాలి)- ఎనిమిది.

తయారు చేసే విధానం:

క్యాప్సికం ముక్కలు, కొద్దిగా వెన్న, కోడిగుడ్ల సొన, మొక్కజొన్న పిండి, మిరియాలు పొడి, ఉల్లిపాయల తరుగు, కొద్దిగా ఉప్పు అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని మిశ్రమం చేసుకోవాలి. [ఇంకా... ]

Wednesday, October 8

వ్యక్తిత్వ వికాసం - సమయ పాలన (టైమ్ మేనేజ్‌మెంట్)

ఏ మనిషికైన తాను అనుకున్న దానిని సాధించటానికి ముఖ్యంగా కావాలసినది సమయ పాలన. లోకంలో ఏ మనిషికైన రోజుకు ఉండేది 24 గంటలే. ఎటొచ్చీ ఆ 24 గంటలు సమర్థవంతంగా నిర్వహించుకోవడమే 'టైమ్ మేనేజ్‌మెంట్' అంటారు. ఒక సారి సమయాన్ని పోగొట్టుకుంటే అంటే వృధా చేసుకుంటే మళ్ళీ మనం దానిని ఎప్పటికీ పొందలేము. అందుకే అలాంటి సమయాన్ని ఎంత సమర్థవంతంగా ప్లాన్ వేసుకోవాలో, తద్వారా మన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ మనిషికైనా విజయం వరించాలి అంటే ప్లానింగ్ అవసరం. ప్లానింగ్ లేని మనిషి గమ్యం అగమ్యగోచరంలా ఉంటుంది. ఒక క్రమ పద్దతిలో ప్లాన్ వేసుకుంటే జీవితం నందనభరితం అవుతుంది. కొద్ది పాటి ప్లానింగ్‌తో జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవచ్చునో తెలుసుకుందాం. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా - స్వెటర్లు

చలికాలం రాగానే మూలనపడి వున్న స్వెటర్లను వెతుక్కొని మరీ వేసుకుంటాం. అవి ఎందుకు మనం వాడుతున్నాము, ఎలా తయారయ్యాయి అనేది మనం తెలుసుకుందాము.

ఆదిమానవుడు ఆధునికుడై కనిపెట్టినా అల్లిక సూదుల ద్వారా ఉన్ని వస్త్రాలను అల్లడం అతడు చాలా కాలం పాటు నేర్చుకోలేదు. మొదట ఈ పనిని మొదలెట్టింది అరబ్బులు. వాళ్ళే రాగితో అల్లిక సూదులను తయారు చేసి వాటితో సాక్సులు అల్లడం మొదలెట్టారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఈజిప్టు నుంచి యూరప్‌కు ఉలెన్ సాక్సులు చేరాయి. అక్కడి నుంచి యూరప్ అంతా ఉన్ని వస్త్రాల అల్లిక మొదలయ్యింది. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - రవీంద్రనాథ్ ఠాగూర్

పేరు : రవీంద్రనాధ్ ఠాగూర్
తండ్రి పేరు : దేవేంద్రనాధ్ ఠాగూర్
తల్లి పేరు : శ్రీమతి శారదాదేవి
పుట్టిన తేది : 7-5-161
గొప్పదనం : దేశభక్తి గేయాల ద్వారా తెల్లదొరల పాలన అంతమొందించడానికి కారకుడయ్యారు. "ఈనాటి మన జాతీయగీతం "జనగణమణ" ఆయన కలం నుంచి వచ్చింది."

మంచి అలవాట్లు అలవరచుకొని, పేరు ప్రతిష్టలను ఆర్జించిన ప్రముఖులలో ఒకరు రవీంద్రనాధ్ ఠాగూర్. వారు ఎన్నుకున్న బాట "కవిత్వం" తన దేశభక్తి గేయాల ద్వారా తెల్లదొరల పాలన అంతమొందించడానికి కారకుడయ్యారు. "ఈనాటి మన జాతీయగీతం "జనగణమణ" ఆయన కలం నుంచి వచ్చింది." [ఇంకా... ]

కవితలు - ఆ నవ్వులో

నిన్నటి దిగులు లేదు
రేపటి బాధ లేదు
ఆ నవ్వు

హిమానీనదం అంత స్వచ్ఛంగా
హిమాలయాలంత అందంగా
ఆ నవ్వు

నిన్నని మరిపిస్తూ
రేపటిని తలపకు రానీకుండా
నేడు నా ముందు నిలచింది సాకారమై [ఇంకా... ]

సంస్కృతి - కూచిపూడి కళాక్షేత్రం

ఈ పేరు వినని తెలుగు కళాకారుడు ఉండడు. కూచిపూడి భాగవతుల ప్రదర్శనలకు నోచుకోని గ్రామం తెలుగునాట లేదు. తమ ప్రదర్శనల ద్వారా విశ్వ విఖ్యాతినొందిన కూచిపూడి గ్రామం కృష్ణా జిల్లాలో మచిలీపట్నంకు 15 మైళ్ళ దూరంలో ఉంది. తన పదాలతో దక్షిణ దేశాన్నంతా సుసంపన్నం చేసిన క్షేత్రయ్య స్వగ్రామమైన మువ్వ గ్రామంలో 500 సంవత్సరాలకు పూర్వమే నాట్య కళకు అంకురార్పణ జరిగినట్లు చారిత్రాకాధారాలున్నాయి.

కూచిపూడి భాగాతుల ప్రదర్శనానికి మూలపురుషుడు సిదేంద్ర యోగి. ఈయన తన నాత్య గీతాభినయాలను కూచిపూడి కళాకారులకు అంకితం చేశాడు. ఆనాటినుంచీ ఈనాటివరకూ కూచిపూడి నాట్య ప్రదర్శనలు, వారి భాగవతాలూ, వంశపారంపర్యంగా ప్రచారం పొందాయి. [ఇంకా... ]

Tuesday, October 7

కధలు - సంభవామి

మూడు చక్రాల బండి... లాగుతూనే ఉన్నాడు బికారి. కడలి పోటుకు ఎరుపెక్కిన ఎర్రనీరెండ బికారిని చుట్టుముట్టి చెమటను ఆవిరుల రూపంలో హరించివేస్తోంది.
లాగుతున్నాడు... ఊపిరిని బిగబెట్టి ఒక చేతిని రిక్షా హాండిల్ బార్ మీద, మరో చేతిని బండికి కట్టిన టైరు పంజామీద...
మనసును, దృష్టిని మమేకం చేసి మరీ లాగుతున్నాడు. మూడు చక్రాల చెక్కరిక్షా... బికారి రెండు కాళ్ళతో కలిపి ఐదు చక్రాలయ్యాయి.
'ఊహు ....' కదలనని మొరాయిస్తోంది.
ఇసుకలో కూరుకుపోయిన రిక్షాబండి... మోటుపల్లి రేవు మోటుగా అన్పిచింది బికారికి.
నానావిధాల తంటాలు పడుతున్నాడు. [ఇంకా... ]

లాలి పాటలు - ఉయ్యాల జంపాల

ఉయ్యాల జంపాలలూగరావమ్మ
వెలలేని బంగారుటూగుటుయ్యాల ||ఉ||
కమలమందున బుట్టి కమలాక్షుని చేపట్టి
కామూని కన్నట్టి కంజదళనేత్రి ||ఉ|| [ఇంకా... ]

పిల్లల ఆటలు - భాషలో తమాషా

ఎంతమంది ఆడవచ్చు : పది మంది
కావలసిన వస్తువులు : పేపర్లు, పెన్సిళ్ళు లేదా పలకలు, బలపాలు
ఆడే స్థలం :గదిలో ఆడవచ్చు
ఆటగాళ్ళ వయస్సు : 7 సం||రాల వయస్సు వాళ్ళు
పోటీ సమయం : 2 నిమిషాలు

ఎటు నుంచి చదివినా ఒకే అక్షరం వచ్చే పదాలు రాయడం ఇక్కడ పోటీ. [ఇంకా... ]

నీతి కధలు - స్వశక్తి

కేశవాపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి రాము, సోము అనే ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరిగాయి. ఇల్లు పెద్దది కావటము వలన అందరూ కలసే ఉన్నారు. రాము పెద్దవాడు. ఉదయమేలేచి పొలము పనికి వెళ్ళి తండ్రికి సాయపడుతూ ఉండేవాడు. సోము సోమరిగా ఉంటూ పగటి పనికి వెళ్ళి కలలు కంటూ కాలక్షేపము చేసేవాడు. ఎవరు చెప్పినా ఏ పని చేయక పడుకొని ఉండేవాడు. కొంతకాలము గడిచింది. ఆ ఊరికి ఒక మెజీషియన్ వచ్చాడు. అనేక విద్యలు ప్రదర్శించాడు. చివరగా ధాన్యమును బంగారముగా మార్చాడు. సోమూకి ఆశ్చర్యము కలిగింది. [ఇంకా... ]

వంటలు - గోధుమపిండితో పూర్ణాలు

కావలసిన వస్తువులు:
గోధుమ పిండి - 1/4 కిలో
పచ్చి శనగపప్పు - 1/4 కిలో
బెల్లం - 1/4 కిలో
పచ్చికొబ్బరి - 1 చిప్ప
యాలుకలు - 10
నూనె - 1/2 కిలో

తయారు చేసే విధానం:

పచ్చి శనగపప్పు రాళ్ళు లేకుండా చేసుకోవాలి. బెల్లం తరగాలి. యాలుకలను పొడి కొట్టుకొని ఉంచుకోవాలి. పచ్చికొబ్బరి తురమాలి. గోధుమ పిండి జల్లించుకోవాలి. పచ్చి శనగపప్పును రెండు గంటలు నానబెట్టి నీళ్ళన్నీ ఒంపేసి కుక్కర్‌లో ఉడక బెట్టాలి. [ఇంకా... ]