Friday, November 28

పండుగలు - దీపావళి

భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు. వరలక్ష్మీ వ్రతం, అట్లతద్ది, నాగుల చవితి వంటి పండుగలను స్త్రీలు ఇష్టపడితే, ఉగాది, వినాయక చవితి వంటివి ఎక్కువ శాతం పురుషులు ఇష్టపడడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఐతే వయసుతో నిమిత్తం లేకుండా, స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ ఇష్టపడే ఏకైక పండుగ మాత్రం దీపావళి ఒక్కటే. [ఇంకా... ]

కవితలు - వట్టివేళ్ళు (నానీలు)

మెరిసే మెరుపు
చటుక్కున
ఆగిపోయింది
ఆ మెరుపు తీగను చూసి

తప్పు
వాడు చేశాడు
ఆమె పంచుకొంది
చివరకు ఆమే పతితా!

"ఓహో! ఉప్ప తొట్టెలు
వెలుగుతున్నాయి
చెత్తలేకున్నా
పసిగుడ్డులతో" [ఇంకా... ]

వంటలు - కొబ్బరి పూర్ణాలు

కావలసిన వస్తువులు:

కొబ్బరి కాయ - 1.
మైదా - 1/4 కిలో.
నూనె - 1/2 కిలో.
బెల్లం - 1/4 కిలో.
యాలుకలు - 5.

తయారు చేసే విధానం :

కొబ్బరికాయ కొట్టి తురుముకోవాలి. బెల్లం కూడా తురమాలి. ఇవి రెండూ కలిపి పొయ్యి మీద వేడి చేయాలి. ఇది ముద్దలాగ అవుతుంది. దీనిలో యాలుకల పొడి వేసి కలపాలి. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఉయ్యాల...

లాల ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల
ఊగేటి మా పాప తూగుటూయ్యాల

చిల్లి ఉయ్యాలమ్మ పొట్టి ఉయ్యాల
పట్టి ముద్దులపాప పసిడి ఉయ్యాల

పాల ఉయ్యాలమ్మ గాలి ఉయ్యాల
ఆకాశవీధిలో కెగురు ఉయ్యాల [ఇంకా... ]

మీకు తెలుసా - ప్రభుత్వ పధకాలు

1. ప్రధాని రోజ్‌గార్ యోజన:

ఈ పధకంలో పరిశ్రమలు, సేవా సంస్ధలకే కాకుండా, వ్యాపారం చేసుకోవటానికి కూడా ఆర్ధిక సహాయం అందించబడుతుంది. ఒక్కరు గానీ లేక 5గురు గానీ సమ్యుక్త భాగస్వామ్యంతో ఋణం పొందవచ్చు. ఎటువంటి హామీ అవసరం లేకుండా, రూ. 1.00లక్ష వరకు ఋణపరిమితి కల్గి ఉంటుంది. ఈ పధకం. మొత్తం ప్రాజెక్టు విలువలో అభ్యర్ధి / అభ్యర్ధిని 5% మార్జిన్ మనీని భరించాలి. 'మార్జిన్ మనీ' అంటే పరిశ్రమ ప్రారంభించే వ్యక్తి పెట్టే పెట్టుబడి. సదరు ప్రాజెక్టు విలువలో 15% రు. 7,500/- లు మించకుండా రాయితీ ఇవ్వబడుతుంది. బ్యాంకు నిర్దేశము మేరకు ఋణమును 3 నుండి 7 సంవత్సరాల కాల పరిమితిలో వాయిదాల పద్ధతిన చెల్లింపవచ్చును.

ఈ పధకంలో లోన్ మంజూరు అయిన తరువాత ఆయా అభ్యర్ధులకు వారు ఎంచుకున్న పరిశ్రమ/ వ్యాపారానికి అవసరమయ్యే స్వల్పకాలిక శిక్షణ యివ్వబడుతుంది. అందులో వ్యాపారము, సేవా సంస్ధల వారికి రూ. 150/- లు మరియు పరిశ్రమ వారికి రూ. 300/- లు స్టైఫండ్‌గా ఇవ్వబడుతుంది. [ఇంకా... ]

Wednesday, November 26

వ్యక్తిత్వ వికాసం - సర్దుకుపోదాం

తమ దైనిక చర్యకు భంగం వాటిల్లితే కొంతమంది పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారవుతుంది. తాము అనుకున్నట్లు లేదా తమ ప్రణాళిక ప్రకారం జీవితం ముందుకు సాగకపోతే కొంతమంది తమ సమతౌల్యాన్ని కోల్పోతారు. అయినా మన జీవితపు జయం - అపజయం ఈ రెండూ, మనం కఠినమైన దాన్ని మృదువుగా మార్చుకోగలిగి జీవితం నుండి ఉత్తమమైన దాన్ని ఎలా రాబట్టుకోగలమన్న విషయంపైనే ఆధారపడి వుంటాయి.

ఈ క్రింద ఇవ్వబడిన పరీక్షను చేయడానికి ప్రయత్నించండి. చివరిలో ఇవ్వబడిన జవాబులను చూసేందుకు ముందు "అవును", "కాదు" అని జవాబులు వ్రాసుకుంటూపొండి.

1. వాతావరణం ఉత్సాహవంతంగా లేనప్పుడు మీరు సంతోషంగా, ఆనందంగా ఉండగలరా?

2. కుటుంబ సభ్యులు - భార్యాపిల్లలు - బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు బాగా చూసుకోవడంలో ఆనందాన్ని అనుభవిస్తారా?

3. మీరు చిన్న పిల్లలతో, వయసు మళ్ళినవారితో, మీ తరం వారితో సర్దుకుపోగల సామర్ధ్యం కల అతిధులా? [ఇంకా... ]

పిల్లల పాటలు - చిన్నోడమ్మా చిన్నోడు

చిన్నోడమ్మా చిన్నోడు
చిన్ని సైకిలు కొన్నాడు

రాళ్ళ మీద తిప్పాడు
కాలు జారి పడ్డాడు

ఆసుపత్రిలో చేరాడు
మందు బిళ్ళలు మింగాడు

మళ్ళీ ఇంటికి వచ్చాడు
మంచం ఎక్కి పన్నాడు [ఇంకా... ]

వంటలు - కొబ్బరి ఉప్మా

కావలసిన వస్తువులు:

కొబ్బరికాయ - 1.
రవ్వ - 1కిలో.
పచ్చిమిరపకాయలు - 6.
పల్లీలు - 1/2 కప్పు.
పచ్చి శనగపప్పు - 1/2 కప్పు.
తాలింపు గింజలు - 2 స్పూన్లు.
నూనె - 2 కప్పులు.
కరివేపాకు - 2 రెబ్బలు.
ఎండు మిర్చి - 4.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

రవ్వను దోరగా వేయించి ఉంచుకోవాలి. కొబ్బరి కోరి సిద్ధంచేసుకోవాలి. మూకుట్లో నూనె వేసి పచ్చి శనగపప్పు, పల్లీలు, తాలింపు గింజలు వేసి వేయించి, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరికోరు వేసి వేగనివ్వాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - క్రికెట్

క్రికెట్ ఆట నిబంధనలు

1. క్రికెట్ మ్యాచ్ రెండు జట్ల మధ్య ఆడబడును. ఒక్కొక్క జట్టులో పదకొండు మంది ఆడతారు.

2. జట్టుకు సారధ్యము వహించుటకు కెప్టెను ఉన్నా కెప్టెన్ హాజరుకాని పక్షములో వైస్ కెప్టెన్ ఆతని స్థానములో వ్యవహరించును.

3. ఆటగాడు గాయపడినా, అనారోగ్యమైనా ప్రత్యామ్నాయ ఆటగానిని అనుమతించవచ్చును. ప్రత్యామ్నాయ ఆటగాడు ఫీల్డింగ్ చేయుట లేక వికెట్ల మధ్య పరుగెత్తుటకు అనుమతించబడును. అతను బౌలింగ్, బ్యాటింగ్ చేయుటకు అనుమతించరాదు.

4. ఇన్నింగ్స్ ప్రారంభమునకు ముందు రెండు చివర్లు, ఆట పర్యవేక్షణకు ఇద్దరూ 'అంపైర్లు' నియమించబడతారు. ఆట ప్రారంభ సమయానికి 30నిమిషాలు ముందుగా అంపైర్లు తమ స్థానాలలో ఉండాలి. ఆట పూర్తి అగు వరకు వారు తమ విధి నిర్వహణలో ఆట స్థలంలో ఉండాలి.

5. పరుగులు, బౌలింగ్ వివరములు, 'స్కోరు షీట్' లో రికార్డు చేయుడానికి 'స్కోరర్లు' నియమించబడతారు. వారు అంపైర్లు యిచ్చు తాఖీదులు (Instructions) , సంజ్ఞలు (Signals) ప్రకారం స్కోరు రికార్డు చేయాలి. అంపైర్ల సిగ్నల్స్ కు అందినట్లుగా జవాబు చెప్పవచ్చును. [ఇంకా... ]

సాహిత్యం - మన కవులు

కావ్యాలు తాము పుట్టిన కాలం యొక్క సామాజిక పరిస్థితులను తెలియజేస్తాయి. నాటి ఆచార వ్యవహారాల గురించి సమగ్రంగా వివరిస్తాయి. జాతి జీవన పురోగతికి ఇవి దిశా నిర్దేశాలు కావడంతో వాటిని ప్రజలు అనుసరిస్తుంటారు. ఆచారాలు ఎప్పటివైనా, వాటిలోని మంచి చెడులను విశ్లేషించుకుంటూ, కొత్త పోకడలను రూపుదిద్దుకుంటూ సాగుతారు. ఇది చరిత్రలో ఓ అంతర్భాగం. ఆ చరిత్ర గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే కావ్య పఠనం తప్పనిసరి. అందుకే జాతి నిర్మాణంలో కీలక పాత్ర వహించే కావ్యాల గురించి తెలుసుకున్నట్టే కావ్య రచనా కర్తలైన కవుల గురించి కూడా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఆ ఉద్దేశంతోనే ఆంధ్ర జాతికి అక్షర రూపంలో అంతులేని విజ్ఞానాన్ని అందించిన కవుల వివరాలను అందిస్తున్నాం.

తొలితరం కవులు :

నన్నయ:

నన్నయ 11వ శతాబ్దానికి చెందిన చాళుక్య కాలమునాటి కవి. రాజమహేంద్రవరములోని రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు అతడు సంస్కృత భారతాన్ని తెనిగించ పూనుకున్నాడు. తెలుగు భాషలో కావ్య రచనకు తగిన భాష లేని ఆ కాలంలో నన్నయ ప్రజల వాడుకలో ఉన్న తెలుగు భాషా పదాలను సమీకరించి ఆ పదాలను కావ్య భాషకు సరిపోయేట్టు చేయడానికి "ఆంధ్ర శబ్ద చింతామణి" అను తెలుగు వ్యాకరణ గ్రంధాన్ని సంస్కృతంలో రచించాడు. కావ్య రచనకు కావలసిన భాషను తయారుచేసుకుని మహాభారత అనువాదానికి పూనుకున్నాడు. [ఇంకా... ]

Tuesday, November 25

జానపద గీతాలు - ఏడవకు ఏడవకు!

"ఏడవకు కుశలవుడ రామకుమార,
ఏడిస్తె నిన్నెవ్వ రెత్తుకుందూరు;

ఉంగరమ్ములు గొనుచు ఉయ్యాల గొనుచు,
ఊర్మిళా పినతల్లి వచ్చె నేడవకు;

పట్టు టంగీ గొనుచు పులిగోరు గొనుచు,
భూదేవి అమ్మమ్మ వెచ్చె నేడవకు;

రావిరేకలు గొనుచు రత్నాలు గొనుచు,
లక్ష్మన్న పినతండ్రి వచ్చె నేడవకు; [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - జంషెడ్జీ టాటా

పేరు : జంషెడ్ జీ టాటా.
తండ్రి పేరు : నసెర్ వాంజీ టాటా.
తల్లి పేరు : (తెలియదు)
పుట్టిన తేది : 3-3-1839.
పుట్టిన ప్రదేశం : గుజరాత్‌లోని బరోడా దగ్గరున్న నవ్‌సారి పట్టణంలో జన్మించాడు.
చదివిన ప్రదేశం : బొంబాయి.
చదువు : (తెలియదు)
గొప్పదనం : బెంగుళూరులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్థాపించి విదేశాల్లోని అనేక యూనివర్శిటీలలో "టాటా" అవార్డులను ప్రకటించాడు. ఆయన 1909 మే 19న స్వర్గస్థుడయ్యాడు.
స్వర్గస్తుడైన తేది : 19-5-1904.

భారతదేశం నేడు పారిశ్రామిక రంగంలో ఎంతో ప్రగతిని సాధించింది. ఇంకా వేగంగా మున్ముదుకు వెళ్తోంది. అయితే ఈ పురోభివృద్దికి కారకులైన మహనీయుల్ని మనం మరచిపోకూడదు. ఒకప్పుడు మన భారతదేశం ఆంగ్లేయుల దాస్యశృంఖాలలో వున్నప్పుడు మన దేశంలో లభించే సహజ జల, లోహ వనరులను వారు ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటూ లాభాలు చేసుకుంటూ పారిశ్రామికంగా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలూ చేపట్టక ఎంతో స్వార్ధంతో వ్యవహరించేవారు. [ఇంకా... ]

నీతి కథలు - దేశభక్తి

మన ప్రధమ స్వాతంత్రోద్యమ రోజులు. 1857 వ సంవత్సరంలో మహారాష్ట్రుల పీష్వా నానా సాహెబ్ స్వాతంత్ర్య సంగ్రామంలో నాయకత్వం వహించిన ఆయనను పట్టి ఇచ్చిన వారికి బ్రిటీషు ప్రభుత్వం అర్థలక్షరూపాయలు బహుమతి ప్రకటించింది. నానాసాహెబ్ ఎవరికీ అందకుండా రహస్యంగా తిరుగుతుండేవారు. ఓ రోజు ఆయనకు ఆకలిగా ఉంది. ఆయనకు తెలిసిన దేశభక్తురాలి ఇంటికి వెళ్ళాడు. నానాసాహెబ్‌కు ఆమె భోజనం పెట్టింది. నానాసాహెబ్ అంటే ఆమెకు చాలా గౌరవం. ఆ సమయంలో తలుపు చప్పుడయింది. ఆమె లేచి వచ్చి తలుపులు తీసింది. ఎదురుగా ఆమె భర్త. ఆమె భర్త పోలీస్ ఇన్‌స్పెక్టర్. భయంతో దిక్కులు చూస్తున్న భార్యతో మనింటివైపు నానాసాహెబ్ వచ్చినట్లు సూచన అందింది. నానాసాహెబ్ ఎక్కడున్నాడో నీకు తెలుసా? అరెస్టు చేసి ప్రభుత్వానికి అప్పజెబితే యాభైవేలు మన స్వంతమవుతాయి. అంటూ ఇంటిలోనికి నడవబోయాడు ఇన్‌స్పెక్టర్. ఆమె భయంతో వణికిపోతూ కోపంగా భర్త వైపు చూసి మీరు నానాసాహెబ్ గారిని పట్టిస్తారా? దేశం కోసం పోరాడుతున్న ఆయనను పట్టిస్తే మీకు పాపం చుట్టుకుంటుంది. ఇదే దేశ ద్రోహం ఆ పాపపు డబ్బు మనకొద్దు అంది ఆ దేశభక్తురాలు. [ఇంకా... ]

వంటలు - కేసరి ఖీర్

కావలసిన వస్తువులు:

పాలు - 1 లీటరు.
బియ్యపు పిండి - 60 గ్రాములు.
నెయ్యి - 2 స్పూన్లు.
పంచదార - 125 గ్రాములు.
పాల మీగడ - 1/2 కప్పు.
బాదం పప్పులు - 20.
పిస్తా - 1 స్పూను.
కేసరి - 1 స్పూను.
వేడి పాలు - 1/2 స్పూను.

తయారు చేసే విధానం:

ముందుగా ఒక గంటసేపు బాదం పప్పులు నీటిలో నానబెట్టాలి. కేసరి గుళికలు తీసుకొని 1/2 స్పూను వేడి పాలల్లో నానబెట్టాలి. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - పట్టు బట్టల కధ

అందరం సుబ్బారావు కూతురు పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి అంటే వేరే చెప్పాలా? ఆడవాళ్ళు అందరూ రంగురంగుల పట్టుచీరెలు కట్టుకుని వచ్చారు. అందరూ సీతాకోక చిలుకల్లా మెరిసిపోతున్నారు. పట్టుబట్టలకు మనదేశంలో వున్నంత గిరాకీ యింక ఏ దేశంలోనూ లేదు. అసలు ఈ పట్టు విశేషాలు ఏమిటో చూద్దాం.

పట్టుబట్టలు ఎలా తయారు అవుతాయి?

పట్టు దారంతో పట్టు బట్టలు నేస్తారు. అయితే పత్తిలాగా పట్టు ఒక చెట్టుకాదు. పట్టు పురుగు అనే ఒక రకం కీటకం ఉంటుంది. ఇది రక్షణ కోసం తన చుట్టూ గూడు అల్లుకుంటుంది. ఈ గూడు బలమైన సన్నని దారాలు దారాలుగా వుంటుంది. ఈ సన్నని దారాలే పట్టుదారాలు. ఈ దారాలనే సాగదీసి మగ్గం మీద బట్టలుగా నేస్తారు.

పట్టు - పరిశ్రమగా ఎలా ఎదిగింది?

మన దేశంలో పట్టుతో బట్టలు నేయడం ఈనాటిది కాదు! 4,5 వేల ఏళ్ళ పై నుంచే అమలులో వుంది. రెండో ప్రపంచ యుద్ధంలో పారాచూట్‌ల తయారీలో పట్టును వాడారు. ఇవి సన్నగా గట్టిగా వుండడమే కారణం. మన దేశమే యితర దేశాలకు పట్టును సరఫరా చేసేది. తర్వాత పట్టుకు గిరాకీ పెరిగింది.

ఆ గిరాకీ తట్టుకోవడం కోసం పట్టును ఎక్కువగా తయారు చేయాలి. అందుకు పట్టు పురుగుల్ని పెంచడం ఎక్కువ చేశారు. ఇదే పరిశ్రమగా ఎదిగింది. [ఇంకా... ]

Monday, November 24

మీకు తెలుసా - సైన్స్ సంగతులు

1. బొగ్గు: బొగ్గును చూర్ణం చేసి వేడి వేయటం ద్వారా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్‌లో సల్ఫర్ ఏమీ ఉండనంత వరకూ సాంద్రీకరించి ద్రవస్థితికి తీసుకొస్తారు.

2. కార్బన్ ఉద్గారాలు: బొగ్గు, సహజవాయువు ఆధారంగా నడిచే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కార్బన్ ఉద్గారాలు ఉంటాయి. వీటిని భూగర్భంలోకి పంపే టెక్నాలజీలు అవసరం.

3. హైడ్రోజన్: ఫ్యూయల్‌సెల్‌లో హైడ్రోజన్‌ను ప్రాసెస్ చేసినప్పుడు విద్యుత్ విడుదలవుతుంది. నీరు ఉప ఉత్పత్తిగా వెలుపలికి వస్తుంది.

4. మీధేన్: చెత్తాచెదారం, కుళ్లిపోయిన పదార్ధాలు, మృతకళేబరాలు ఇటువంటి వాటితో నిండి ఉండే స్థలాల నుంచి మీధేన్ ఉత్పత్తి అవుతుంది. దీనిని సేకరించే టెక్నాలజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటిని మరింత సమర్ధవంతంగా ఎలా వినియోగించుకోవాలన్నదే ఇప్పుడున్న ప్రశ్న.

5. గ్యాసు నుంచి ద్రవం: కార్బన్, హైడ్రోజన్ మూలకాలను సహజవాయువులో కలిపి కృత్రిమ పెట్రో సంబంధ ద్రవాలను తయారుచేస్తారు. డీజిల్ తయారయ్యేది ఈ పద్ధతిలోనే. [ఇంకా... ]

వంటలు - ఈస్టర్‌కు బన్నీకేక్

కావలసిన పదార్థాలు :

మైదాపిండి - 200 గ్రాములు.
పంచదారపొడి - 200 గ్రాములు.
నెయ్యి - 200 గ్రాములు.
గుడ్లు - నాలుగు.
బేకింగ్ పౌడర్ - 1 టేబుల్ స్పూన్.
వెనీల టేబుల్ - 1 టేబుల్ స్పూన్.

ఐసింగ్ కోసం..
వెన్న 100 గ్రాములు, ఐసింగ్ సుగర్ 200 గ్రాములు.

తయారీవిధానం:

మైదాపిండి జల్లించండి. ఈ పిండిని ఓ గిన్నెలోని తీసుకుని అందులో గుడ్లు, పంచదార, వెన్న, బేకింగ్ పౌడర్, ఎసెన్స్ వేయండి. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - ఫోన్

ఈ రోజుల్లో ఫోను వాడకం తప్పనిసరి అయ్యింది. కొన్ని కుటుంబాల్లో మూడు నాలుగు రకాల ఫోన్లు ఉంటాయి. సాధారణంగా ల్యాండ్ లైన్ ఒకటి ఇంట్లో ఉంటుంది. ఇది కాకుండా కొందరి ఇళ్ళల్లో పిల్లల దగ్గరకూడా ఫోన్లు ఉంటున్నాయి. ఒకే మనిషి రెండూ, మూడు ఫోన్లు కూడా మెయింటెయిన్ చేస్తున్నాడు. సెల్‌ఫోను కంపెనీలు రకరకాల ఆఫర్లలో ముందుకు వస్తున్నాయి. దీనితో కొందరు ఫోన్లని కూడా మార్చేస్తున్నారు. కొత్త ఫోన్లు కొంటున్నారు. ఆఫర్ల ఆకర్షణకు లోనయి అవసరమున్నా లేకున్నా మరో సెల్ కొంటున్నవారి సంఖ్య బాగానే పెరుగుతుంది. దీనితో నెలవారీ ఫోను బిల్లులు బాగానే చెల్లించాల్సి వస్తుంది. మధ్యతరగతి కుటుంబాల వారికి ఈ బిల్లులు కొన్నిసార్లు భారంగా తయారవుతున్నాయి. అలాగే ఫోన్లు కొనడంలో, వాడకంలో, నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే నెల తిరిగేసరికి ఫోను బిల్లు తడిసి మోపెడు అవుతుంది. పర్సు బరువు తగ్గుతుంది.

1. ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటుంది. బయట భర్త లేదా భార్య దగ్గర ఉన్న సెల్‌కు ఫోను చేస్తుంటారు. అయితే ల్యాండ్ లైన్ నుంచి సెల్‌ఫోనుకు ఫోను చేస్తే చార్జి ఎక్కువ పడుతుంది. కనుక సెల్ టు సెల్ చేయటమే ఉత్తమం. లేదంటే అవసరమున్నంతవరకే మాట్లాడాలి. మాట్లాడటం అయిన తరువాత నువ్వు పెట్టు అంటే నువ్వు పెట్టు అని భార్యాభర్తలు వంతులకు పోతే బిల్లు ఎక్కువవుతుంది. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - పాలు

సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ప్రతి ఇంటిలోనూ అత్యంతావశ్యకత కలిగిన ఏకైక ఆహారం పాలు. పాలతో అవసరం ఉండని మనిషి ఉండడు. పసి బిడ్డ మొదలు పండు ముదుసలి వరకు టీ, కాఫీ రూపాలలో పాలు తీసుకోకుండా ఉండరు. సగటు మానవుడికి అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారమైన పాలు జన జీవన సామాన్యంలో ఓ అంతర్భాగం. ఇది ప్రకృతి ప్రసాదించిన ప్రసాదం. పాలు సేవించకుండా జీవించే క్షీరదం ఉండదు. మానవుడు తీసుకునే మొట్టమొదటి ఆహారం పాలు. ఈ ఆహారం చివరి వరకు మానవుడిని అంటిపెట్టుకునే ఉంటుంది. అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఈ ఆహారం ఆరోగ్యాన్నివ్వడమే కాకుండా ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. అందుకే పాలు నిత్య సంజీవని. ప్రకృతిలో లభించే ఉత్కృష్టమైన ఆహారం పాలు. [ఇంకా... ]

వ్రతములు - పోలి స్వర్గమనకు వెళ్ళు వ్రతము

కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడే లేచి మిగిల రోజులు చేసినట్టుగా (నెల రోజులు చేసి నట్టుగా) స్నానం చేసి అరటి డొప్పలో ఒత్తిని వెలిగించి చెరువులో కాని ఒక బేసిన్‌లో నీళ్ళు పొసి కాని దీని వొదులుతూ ఈ కథను చదువుకోవాలి.

ఒక చాకలిముసలికి ఐదుగురు కోడుకులువున్నారు. ఆ చాకలిది ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు తెల్లవారుజామునలేచి, యేటిలో స్నానముచేసి దీపములు పెట్టు కొనుచుండెడిది. అట్లొక నెల చేసిన పిమ్మట నదికార్తీక బహుళ అమావాస్యనాడు చిన్నకోడలిని యింటికి కాపలాగనుంచి, పెద్దకోడండ్లను ముగ్గురును వెంటబెట్టుకొని నదియొడ్డునకు వెళ్ళెను. ఆ చిన్న కోడలు చల్ల చేసి కవ్వమునంటియున్న వెన్న తీసి, ప్రత్తి చెట్టుకింద రాలిన ప్రత్తి గింజలతో వత్తిచేసి, ప్రమిదలో పెట్టుకొని నూతి దగ్గర స్నానము చేసి జ్యోతి వెలిగించుకొనెను. కాని అత్తగారువచ్చి తిట్టునను భయముతో ఆ దీపముమీద చాకలిబాన కప్పెను. దేవతలు దానిభక్తికి మెచ్చి విమానము బంపి, దానిని బొందెతో స్వర్గమునకు రప్పించుచుండిరి. ఆ విమానములోనున్న చాకలిదాని చిన్న కోడలును చూచి దగ్గర నున్న వారందరు "చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్న" దని ఆశ్చర్య పడసాగిరి. [ఇంకా... ]

Thursday, November 20

వ్యక్తిత్వ వికాసం - మనసారా నవ్వండి

మానవ జీవితాన్ని నేడు ప్రభావితం చేస్తున్న అనేక అంశాల్లో జాతి రత్నాలు ధరించడం ఒకటి. ఒక్కో రత్నం ఒక్కో అంశంపై ప్రభావితం చూపుతుందనేది ఓ నమ్మకం. ఆరోగ్యానికి ఒక రత్నం, ఆర్ధిక స్థితిగతులకు మరోటి ... ఇలా ఒక్కో ఒక్కో రత్నం ఒక్కో విధమైన ప్రభావితం చూపుతుందనే నమ్మకం ఉండబట్టే ఎవరి పరిధిలో వారు ఈ జాతి రత్నాలను ఉంగరాల రూపంలోనో, మాలల రూపంలోనో నేడు ధరిస్తుండడం సర్వసాధారణం అయిపోయింది. నవరత్నాలనూ ఒకే ఒక్క ఉంగరంలో కూర్చి ధరించే వారు కూడా నేడు అనేకమంది. ఇన్ని రత్నాలను ఒకసారి కొని, ధరించడం అనేది ఆర్ధికంగా ఎంతో భారమైన విషయం. అందుకే ఎంతకంటే విలువైన రత్నాలను పైసా ఖర్చు లేకుండా ధరించే అవకాశమున్నా మేలు జాతి రత్నాలంటూ వాటివైపే మొగ్గు చూపుతున్నాడు సగటు మానవుడు. పైసా ఖర్చు లేకుండా ధరించగలిగే రత్నాల గురించి సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్లనే వాటి గురించి తెలుసుకోలేకపోతున్నాడు. అసలు పబ్లిసిటీ అవసరం ఎంతమాత్రమూ లేని ఆ నవరత్నాలను పైసా ఖర్చులేకుండా అందించే ఒకే ఒక్క సూత్రమే "నవ్వు". ఎంత అనారోగ్యమున్నా, ఎన్నెన్ని బాధలున్నా నవ్వుతూ కొన్నిటిని మరచిపోవచ్చు. కొన్ని అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. [ఇంకా... ]

పిల్లల ఆటలు - ఫేస్ ప్రేమ్

ఎంతమంది ఆడవచ్చు : అయిదుగురు
కావలసిన వస్తువులు : ఖాళీ ఫోటోఫ్రేమ్‌లు లేదా కార్డ్‌బోర్డ్ అట్టముక్కలు
ఆడే స్థలం : గదిలోగాని, బయటగాని
ఆటగాళ్ళ వయస్సు : 6 సం|| నుండి 8 సం||లలోపు
పోటీ సమయం : 1 నిముషం
ఆడే విధానం:
ముందుగా ఖళీ ఫోటోఫ్రేమ్‌ను సంపాదించాలి. లేకపోతే అట్టపెట్టెలను సేకరించి వాటిని నలుచదరంగా కట్‌చేసి ఫోటోఫ్రేమ్‌లా ఉపయోగించవచ్చు. [ఇంకా... ]

వంటలు - కరివేపాకు పొడి

కావలసిన వస్తువులు:

కరివేపాకు - 4 కట్టలు.
చింతపండు - 150 గ్రా.
జీలకర్ర - 15 గ్రా.
ధనియాలు - దోసెడు.
శనగపప్పు - 50 గ్రా.
మినపప్పు - 50 గ్రా.
ఎండుమిర్చి - 200 గ్రా.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం :

ఖాళీ మూకుట్లో పప్పుల్ని ఎర్రగా వేయించి తీసుకోవాలి, అలాగే జీలకర్రా, ధనియాలు కూడా వేయించి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఓ చెంచాడు నూనె మరిగించి ఎండుమిరపకాయలు కరివేపాకులు కలిపి వేయించాలి. [ఇంకా... ]

కథలు - తేలు కుట్టిన దొంగ

అదేపనిగా మోగుతున్న ఫోన్‌వైపు అదేపనిగా అలా చూశాడు వటపత్రశాయి. అలా మోగిమోగి ఆగిపోవటం... ఒక్కసారి అలుముకున్న నిశ్శబ్దం.
పెద్దశబ్దంతో గట్టిగా నిట్టుర్చాడు వటపత్రశాయి. ఆశబ్దాన్ని ఆలకించిన తటిల్లత " ఏమయ్యిందండీ?" అనడిగింది కంగారుగా.
భార్య తటిల్లతకు తటాలున జవాబు చెప్పేంతలో ఫోన్‌ మళ్ళీరింగయ్యింది.
ఆ ఫోన్‌కాల్‌ తప్పకుండా బంగార్రాజు నుంచే అయివుంటుందనుకున్నాడు.
రిసీవర్‌ తీసి "హలో" అన్నాడు.
బంగార్రాజు ఫెళ్ళున నవ్వాడు.
" ఏమిటింత ఆలస్యం? అవునూ... చెప్పడం మరిచాను. స్టేజిమీద అటువైపు ఎమ్మేల్యే కటకం కంటకమూర్తి, ఇటు వైపు చైర్మన్‌ కురాకుల సకల కళావతి. ఇహ మధ్యలో సకల కళానిధి ఈ బంగార్రాజు ఉండాలి... తెల్సిందా?"... అనడిగాడు.
" తప్పకుండా సార్‌... అంతా మీరు చెప్పినట్టే మరి నా సంగతి" గుటకలు మింగాడు వటపత్రశాయి. [ఇంకా... ]

జానపద గీతాలు - జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
అర్జునుడు తిన్న అరటిపండ్లరిగి
భీముడు తిన్న పిండివంటలరిగి
గణపతి తిన్న ఖజ్జాలరిగి
అబ్బాయి తిన్న పాలు, ఆముదము అరిగి
పామల్లెపాకి కుందల్లె కూర్చుండి
నందల్లె నడిచి గుఱ్ఱమంత పరుగు [ఇంకా... ]

Wednesday, November 19

వ్యాయామ శిక్షణ - ఇల్లే జిమ్ లా...

సన్నగా మెరుపుతీగలా మెరవాలని జిమ్‌లో చేరారు మీరు. రోజూ ఉత్సాహంగా వెళుతున్నారు... ఉన్నట్టుండి ఒక రోజు 'అబ్బా బద్దకంగా ఉన్నది ఇవ్వాళ్ళొద్దులే రేపు చూద్దామంటూ డుమ్మా కొట్టారు. రెండో రోజు వెళ్ళలేక పోయారు. అటువంటప్పుడు నేనైతే ఇలా చేస్తానంటున్నారు ఓ పేరొందిన ఫిట్ నెస్ నిపుణురాలు.

1. జిమ్ కు వెళ్ళాలనిపించనప్పుడు ఇంట్లోనే నచ్చిన మెచ్చిన పనిని చేయాలి. ఒక గదిలో నచ్చిన సంగీతాన్ని పెట్టుకొని డాన్స్ చేయాలి. కనీసం ఒక అరగంటైనా ఇలా గడపాలి.

2. ప్రశాంతంగా ఎటువంటి శబ్దాలు లేకుండా ఉండటం నచ్చుతుందా! అయితే యోగా చేస్తే సరి.

3. ప్రతిరోజూ ఒకే రకమైన పనులు కాకుండా కొంచెం వైవిద్యం ఉండే వాటిని ఎంచుకోవాలి. [ఇంకా... ]

లాలి పాటలు - ముద్దుగారే

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకి సుతుడు ||ముద్దుగారే||

అంత నింత గొల్లెతల అరచేత మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చబూ
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ||ముద్దుగారే||

రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖు చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు ||ముద్దుగారే|| [ఇంకా... ]

మీకు తెలుసా - వాడుక భాష

ప్రజలు తమ నిత్య జీవితంలో మట్లాడుకునే భాష వాడుక భాష. సనాతన భావాలను సమర్ధిస్తూ గ్రాంధిక భాషలో రచనలు చేయడమేగాక బిచ్చగాడితో సైతం గ్రాంధిక భాషలోనే మట్లాడేవారు కోక్కొండ వెంకటరత్నం (1852-1915)గారు. ఇంట్లో భార్యతో కూడా గ్రాంధికంలోనే సంభాషించేవారు. వాడుక భాషలో గ్రంధ రచన సాగాలని గురజాడ పిలుపునిచ్చారు. వాడుక భాషను 'కులట' అని గేలి చేసే పండితులు దానిని దూరంగా విసర్జించక యేల వాడుక చేతురు? వారు యాంటీ నాచ్ కాదు కాబోలు? అంటూ ఒక చురక తగిలించి ఆ పండితులు చేసే తప్పులను ఆయన ఎత్తి చూపారు. 1917లో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వాడుక భాషను రాసే విధానంలో కొత్త దారులు తొక్కారు. "మండలాల్లో మాటలు మారినాయని భాష చెడ్డ భాష అవుతుందా? కొత్త గ్రంధాలు చదువుకోని, కొత్త మాటలు నేర్చుకొన్నట్లు అన్య మాండలిక గ్రంధాలు చదువుకోని ఆ పదాలు నేర్చుకోవాలి. ఆ మాటలు తెలియని ఆ భాష చెడ్డదనడం మంచిది కాదు. మారడం భాషకు సహజం" అన్నారు. [ఇంకా... ]

భక్తి సుధ - శ్రీభావన్నారాయణ స్వామి అష్టోత్తర శతనామావళిః

1. ఓం శ్రీ భావనారాయణాయ నమః
2. ఓం శ్రీ భద్రలక్ష్మీనాథాయ నమః
3. ఓం శ్రీ మార్కండ యజ్ఞ సుపుత్రాయ నమః
4. ఓం శ్రీ మృకండ పౌత్రాయ నమః
5. ఓం ధృతయజ్ఞోపవీతాయ నమః
6. ఓం చతుర్దశభువన మానరక్షణాయ నమః
7. ఓం వస్త్రనిర్మితాయ నమః
8. ఓం ఏకోత్తర శతాత్మజాయ నమః
9. ఓం విజ్ఞానఘనాయ నమః
10. ఓం వీరపరాక్రమాయ నమః [ఇంకా... ]

పిల్లల పాటలు - మా వూరి ఏరు

పేరొకటి వున్నదని నా కెరుకలేదు
నీరు కూడ నిరంతర ముండబోదు
పేరు, నీరును లేని ఏరైన నేమి!
మా యూరి కీయేరే గంగాభవాని!

చూడచక్కని ఏరు మావూరి ఏరు!
ఏడాది కొకసారి ముచ్చటగా పారు!
తెల్లవారక ముందె చలిచెలమచేరి
చల్లన్ని నీటితో తబిలె నాడించి [ఇంకా... ]

Tuesday, November 18

మీకు తెలుసా - పచ్చబొట్టు

అత్యంత పురాతనమైన కళ ఇది. ఒక వ్యక్తి శరీరంలోని చర్మాన్ని సూదితో గుచ్చి రంగులను, వర్ణాలను దానిపై వేయటమనే ఈ కళ కొన్ని తెగలకు సంప్రదాయంగా వస్తున్నది. నేడు పశ్చిమ దేశాల్లో ఫేషన్. భారత దేశానికి కూడా ఈ ఫేషన్ విస్తరించింది. మానవ శరీరాన్ని ఒక నారగుడ్డగా ఉపయోగించుకోవటమే పచ్చబొట్టు పొడిపించుకోవడం అనవచ్చు. ఈ ప్రక్రియకు స్ఫూర్తి ప్రాచీన కాలపు పచ్చబొట్లే. గతంలో ఈ రంగు నల్లగా (నూనెను కాల్చినపుడు వచ్చే మసి) ఉండేది. దీన్ని అవిసె నూనెలో కానీ లేదా పసుపు ముద్దలో కానీ మూలికలతో సహా కలిపి వేసేవారు. ప్రస్తుతం ఈ రంగుల ప్రత్యామ్నాయాలకు బదులు మాసిపోని సిరా వచ్చింది. ఇవి రుద్దినా పోదు. రంధ్రాలలో రంగులను చొప్పించేందుకు ఉపయోగించిన బాధాకరమైన ముల్లుకు బదులుగా విద్యుత్ శక్తిసంపన్నమైన సూది వచ్చింది. ప్రాచీన ఈజిప్టు నాగరికతంత పురాతనమైనది ఈ పచ్చబొట్టు. 4000 ఏళ్ళనాటి ఈజిప్టియన్ మమ్మీలకు నైట్ దేవత చిహ్నాలైన పచ్చబొట్లు ఉన్నాయి. ప్రాచీన గ్రీకులలో పచ్చబొట్టు కులీనులకు మాత్రమే ప్రత్యేకించబడింది. వార్తాహరుల నున్నటి బోడిగుండ్లపైన పచ్చబొట్లు చెక్కి సంకేత సందేశాలు గ్రీకులు పంపేవారు. ప్రాచీన రోమన్లు బానిసలకు, నేరస్థులకు పచ్చబొట్లు గుర్తులుగా చేసేవారు. [ఇంకా... ]

వంటలు - కొబ్బరి పాలతో పాయసం

కావలసిన వస్తువులు:

కొబ్బరికాయ - 1.
బియ్యం - 1/4 కిలో.
బెల్లం - 1/4 కిలో.
జీడిపప్పు - 10 గ్రాములు.
నెయ్యి - 50 గ్రాములు.
యాలుకలు - 5.
కిస్‌మిస్ - 5 గ్రాములు.
పచ్చ కర్పూరం - కొంచెం.

తయారుచేసే విధానం:

కొబ్బరి తురుముకోవాలి. ఈ తురుమును మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి మెత్తగా చేయాలి. దీనిని పలుచని బట్టలో వడకట్టాలి. మరల కొద్దిగా నీళ్ళు పోసి ఈ పిప్పి వేసి మరలా మిక్సీ పట్టాలి. మరలా వడకట్టాలి. ఈ పాలను కొద్దిసేపు కదల్చకుండా గిన్నెలో పోసి ఉంచాలి. పైన నీరు తేరుకుంటుంది. పై నీరు వంచి వేయాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టాలి. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - స్వామి వివేకానంద

పేరు : స్వామి వివేకానంద ( నరేంద్రనాథ్ దత్తా ).
తండ్రి పేరు : విశ్వనాథ్ దత్తా.
తల్లి పేరు : భువనేశ్వరి దేవి.
పుట్టిన తేది : 12-1-1863.
పుట్టిన ప్రదేశం : కలకత్తా.
చదివిన ప్రదేశం : కలకత్తాలో.
స్వర్గస్తుడైన తేది : 4-7-1902.

స్వామివివేకానంద మన దేశానికి నిజంగా ఒక వెలుగు. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. 1863 జనవరి 12 వ తేదీన కలకత్తాలో జన్మించాడు. తండ్రి విశ్వనాథ్ దత్తా ప్రముఖ న్యాయవాది. తల్లి భువనేశ్వరి దేవి. యువతకు ఆదర్శంగా నిలిచినందుకు ఆయన పుట్టినరోజునే 'జాతీయ యువజన దినోత్సవంగా' కూడా జరుపుకుంటారు. కన్నతల్లి ఒడిలోనే వేదాలు, పురాణాలలో ఉన్న నీతిని నేర్చుకున్నాడు వివేకానంద. రామకృష్ణ పరమహంస శిష్యునిగా మంచి పేరును సంపాదించుకోవడమే కాకుండా గురుశిష్యుల బంధానికి ఒక ప్రతీకగా నిలిచాడు ఆయన. గురువు పేరు మీదుగా 'రామకృష్ణ మఠం' స్థాపించాడు. ఈ మఠం ద్వారా నేడు ఆనేక మంది యువకులు వివిధ భాషల పరిజ్ఞానాన్ని ఉచితంగా నేర్చుకుంటున్నారు. [ఇంకా... ]

పెద్దల ఆటలు - ట్రాన్సులేషన్ ఆట (అనువదించటం)

ఈ ఆట నిర్వహించేవాళ్ళు ఒక పేపర్లో టీ పౌడర్ పేర్లను తెలుగులోకి అనువదించి వ్రాసుకోవాలి. వాటిని జిరాక్స్ తీసి అందరికీ ఇచ్చి వాటి పేర్లు వ్రాయమని చెప్పి వారికి సమయము ఒక్క నిముషం ఇవ్వాలి.

ఉదా: టీ పేర్లు

ఒక స్మారక చిహ్నం - తాజ్ మహల్ టీ
మూడు గులాబీలు - త్రీ రోజస్
బంగారుచక్రం - చక్రా గోల్డ్ [ఇంకా... ]

జానపద కళారూపాలు - యక్ష గానం

ప్రాచీనమైన దేశీ సారస్వత శాఖలో సంగీత రూపక ప్రధానమయిన యక్షగానాలను యక్షులు పాడే గీతాలు కనుక యక్ష గానాలు అనే పేరు వచ్చిందనీ, జక్కు జాతివారు వీటిని ఎంతో మక్కువతో ప్రదర్శిస్తారు కనుక యక్ష శబ్దం జక్కు శబ్దంగా మారిందనీ పలు వ్యాఖ్యానాలున్నాయి. 16వ శతాబ్దంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

యక్షగానం అనగా దేశీయ చందోబద్ధమయిన నాటకము. దీనినే పాటగా కూడా పేర్కొనక పోలేదు. యక్షగానాల గురించి బ్రౌణ్య నిఘంటువులో పాటగా పేర్కొనబడింది. అయితే అప్పకవి దృష్టిలో యక్షగానం పాటలుగల ప్రబంధం అయివుండవచ్చునని తోస్తుంది. ఎందుచేతనంటే అప్పకవీయంలో యక్షగాన ప్రశస్తి ఉంది. అందులో అర్ధచంద్రికలూ, త్రిపుట, జంపె, ఆటతాళము, 'వీనయక్షగాన ప్రబంధంబులతుకవచ్చు ' అని పేర్కొన్నాడు. [ఇంకా... ]

Monday, November 10

లాలి పాటలు - చిట్టిపాప

చిన్ని మా అమ్మాయి శ్రీ ముఖము చూసి
సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెఱుచు
పందిట్లో అమ్మాయి పాకుతూ వుంటే
పనసపండని జనులు పరుగులెత్తేరు

దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటే
దోసపండని జనులు దోసిలొగ్గేరు
నీలాలు కెంపులూ నిలువు వజ్రాలు
నిత్యమూ అమ్మాయి నీళ్ళాడుచోట [ఇంకా... ]

పెద్దల ఆటలు - మాచ్ అవుట్ ఆట

ఈ ఆటలో ముందుగా చిన్న చిన్న కాగితాల మీద జనరల్ గా ఆడవారు పెట్టుకొనే వస్తువుల పేర్లు వ్రాయాలి.

ఉదా: మట్టిగాజులు, స్టిక్కర్, తిలకం, కుంకుమ, నల్ల పూసలు, లిప్ స్టిక్, ముత్యాలదండ, పగడపు ఉంగరం, ముత్యపు ఉంగరం, మాటీలు, వెడల్పు గాజులు, సన్న గాజులు, లక్ష్మీదేవి ఉంగరము, చీరల రంగులు రాసుకోవచ్చు. ఇలాంటి కాగితం ముక్కలపైన రాసి మడత పెట్టి ఉంచాలి. ఆట ఏమిటంటే ఒక్కొక్కరి చేత ఆ పేపర్ స్లిప్ తీయించాలి. ఆ స్లిప్ లో రాసినది కనక వారు వేసుకొని వుంటే వారు అవుట్. అలా ఒక్కరు ‌మిగిలేంత వరకు తీయించి చివరగా మిగిలిన వారిని‌ విన్నర్స్ గా ప్రకటించటమే. [ఇంకా... ]

భక్తి సుధ - విష్ణు సహస్రనామం

పూర్వపీఠిక:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం|
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే||

వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం|
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్||

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః||

అవికారాయ శుద్ధాయ నిత్యాయపరమాత్మనే|
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే||

యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్|
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే|| [ఇంకా... ]

నీతి కథలు - పిసినారి పేరయ్య 

చాలా మందికి సంతకాలు చేయడం వచ్చింది. పేపరు చదువుతున్నారు. మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. పంతులుగారిపైన అందరికీ గౌరవం, ప్రేమ. రాగానే పాదాలంటేవారు. ఆయన ఆశీర్వదించేవారు. రాత్రి బడికి పంతులుగారు వచ్చారు. చేతిలో వేమన శతకం ఉంది. వారంతా ఆ కథలు వినాలని అడిగారు. ఆయన అంగీకరించారు. అందరూ పుస్తకాలు చదువుతారు. వేమన జీవితం చదివాడు. ఎదుటివారిని చదివాడు. అనుభవం గడించాడు. యోగిగా మారాడు. చెప్పడం ప్రారంబించారు పంతులుగారు. నా చిన్నతనంలోని ఒక సంఘటన చెపుతాను. మా గ్రామంలో ఒక దుకాణం ఉండేది. ఆ దుకాణంలో సరుకులు అన్నీ దొరికేవి. యజమాని పేరు పేరయ్య. పేరయ్యకు పేరాశ. మంచి మాటకారి. అందరితో కలుపుగోలుతనంగా ఉండేవాడు. అప్పులు ఇచ్చేవాడు. బేరం అధికంగా ఉండేది. అందరూ ఆ దుకాణంలోనే కొనేవారు. అయితే అతను పరమలోభి. కడుపునిండా తినేవాడు కాడు. పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాడు. భార్య పేరు లీల. మంచి మనిషి. అయినా మొగుడికి భయపడేది. సొంతంగా ఏమీ చేసేది కాదు. ఆమెనూ కడుపు నిండా తిననిచ్చేవాడు కాదు. కొడుకు పేరు బాలరాజు. పదకొండు సంవత్సరాల వయస్సు. అక్షరం రాదు. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలి. చొక్కా ధరించడు. నిక్కరుతో ఉండేవాడు. ఇది తండ్రికి నచ్చదు. బాదుతూ ఉండేవాడు. బాలరాజు ఏడిచి గోలచేసేవాడు. [ఇంకా... ]

సౌందర్య పోషణ - చెరకుతో అందం

చెరకు గడనుండి తయారయ్యే గ్లైకోలిక్ యాసిడ్ తో ఫేషియల్ చేసుకోవడం వల్ల మొహం మీద మచ్చలు, మొటిమలు మాయమై కాంతివంతంగా తయారుకావచ్చు. అయితే యాసిడ్ అనగానే భయపడక్కరలేదని ఇది చాలా సహజమైనదని, హానికరమైనది కాదని వైద్యనిపుణులు అంటున్నారు.

ఇది ఎలా పని చేస్తుందంటే అలిసిపోయిన చర్మానికి తిరిగి శక్తిని అందిస్తుంది. చర్మంలో సమతూకం ఉండేలా చూస్తుంది. మొహం మీద గీతలు, ముడతలు పడకుండా చేస్తుంది. మృతకణజాలాన్ని నశింపచేసి కొత్త కణజాలం తొందరగా రావడానికి సహాయపడుతుంది. పిగ్మెంటేషన్ వల్లఏర్పడిన మచ్చలను తొలగించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది. వీటన్నిటికీ ప్రత్యేకమైన బ్రెషింగ్‌లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ బ్యూటీపార్లర్‌తో తీసుకోవాల్సిన చికిత్సలు. [ఇంకా... ]

Friday, November 7

వ్యక్తిత్వ వికాసం - విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మెళకువలు

విశ్వాసం విజయావకాశాలను మెరుగు పర్చుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, సుఖ సంతోషాలతో జీవించడానికి, ఆనందాన్ని అందరికీ పంచి ఇవ్వడానికి కీలకమైన వనరు. ఇది ఆలోచనలనుంచి ఉధ్భవించినది కాబట్టి ఎవరికి వారు స్వయం కృషితో వృధ్ధి చేసుకోవచ్చు.విశ్వాసం తీగ లాంటిది. అది పాకడానికి స్థిరమైన పట్టుకొమ్మ కావాలి. విశ్వాసాన్ని వికసింపచేయడానికి బలమైన ధ్యేయం ఉండాలి. అందువల్ల ప్రతిఒక్కరికీ నిర్ధిష్టమైన జీవిత లక్ష్యం అవసరం. జీవిత లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ స్పష్టంగా నిర్వచించుకోవాలి. లక్ష్యం అందుకోగలదిగా ఉండాలి.

ఒక లక్ష్యాన్ని సాధించిన తరువాత ఇంకొక లక్ష్యాన్ని నిర్ణయించుకోవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాన్ని స్వల్పకాల లక్ష్యాలుగా విభజించుకోవాలి. ఎప్పటికప్పుడు అందుకోగల లక్ష్యాన్ని నిర్ణయించుకుంటూ అంతిమ లక్ష్యం వైపు అంచెలవారీగా సాగిపోవాలి. స్వల్పకాల లక్ష్యాలను ముందుగా నిర్ణయించిన కొలమానాలతో సమీక్షించుకోవాలి. అంచనాలు వేసేటప్పుడే కాలాన్ని కూడా అందులో అంతర్భాగం చేయాలి. అంచనాలకు, సాధించిన ప్రగతికి మధ్య ఉన్న తేడాను ఎప్పటికప్పుడు ఆచరణాత్మకంగా సరిచూసుకొని సవరించుకోవాలి. [ఇంకా... ]

పెద్దల ఆటలు - గుర్తించే ఆట

ఈ ఆటకు గిన్నెలలో రకరకాల పప్పులు, జీలకర్ర, రవ్వ, బియ్యం ఇలాంటి ఐటంస్ గిన్నెలలో పోసి టేబుల్ మీద పెట్టాలి. ఒక్కొక్కరికి ‌కళ్ళకి గంతలుకట్టి ఒక్కొక్కగిన్నెలోని వస్తువులను వారు తాకి ఆ వస్తువు పేరు చెప్పమనాలి. ఇదికూడా ఒక్కనిముషము సమయంలో చెప్పమనాలి. ఈ ఆటకి ఆడేవారు మాత్రమే అక్కడవుండాలి.

ఆడాల్సినవారు దూరంగా ఉండాలి. వారు గనక వాటిని చూస్తే సులభంగా గుర్తిస్తారు. [ఇంకా... ]

వంటలు - కొబ్బరి, పాలు పుడ్డింగ్

కావలసిన వస్తువులు:

కొబ్బరి కాయలు - 2.
బెల్లం - 200 గ్రా.
బియ్యం - 100 గ్రా.
పాలు - 1 లీ.
నెయ్యి - 1 కప్పు.
కిస్మిస్ - 2 స్పూన్లు.
జీడిపప్పు - 2 స్పూన్లు.
యాలుకలు - 1 స్పూను.

తయారు చేసే విధానం:

ముందుగా కొబ్బరి తురిమి పల్చటి గుడ్డలో ఒడగట్టి పాలు తీయాలి. తరువాత నీళ్ళు కలిపి పల్చగా కొబ్బరి పాలు తీయాలి. రెండూ విడివిడిగా ఉంచుకోవాలి. [ఇంకా... ]

నీతి కథలు - తెలివి

పూర్వం ఒకప్పుడు ఒక నక్క గబ్బిలాన్ని పట్టుకుంది. దానిని చంపడానికి ప్రయత్నించింది. అప్పుడు గబ్బిలం దీనాలాపంతో తనను చంపకుండా విడిచిపెడితే ఎంతైనా పుణ్యం ఉంటుందని వేడుకుంది. నక్క పట్టిన పట్టు వీడకుండా "పక్షులంటే నాకు ఎంతో ఇష్టం. నేను పక్షులను అస్సలు విడిచిపెట్టను" అంది. అప్పుడు గబ్బిలం "నక్క బావా! నేను పక్షిని కాదు. కావాలంటే నా వంటి మీద ఒక్క ఈక కూడా లేదు చూదు" అని తన శరీరం చూపించింది. నిజమేననుకుని నక్క గబ్బిలాన్ని వదిలివేసింది. గబ్బిలం బ్రతుకు జీవుడా అని చెట్టుపైకి వెళ్ళి చెట్టు కొమ్మను పట్టుకుని వ్రేలాడుతూంది. [ఇంకా... ]

జానపద కళారూపాలు - వీధి నాటకాలు

ఇప్పుడంటే రంగ స్థలం హాలు, కర్టెన్లు - ఇలా ఎన్నో విధాల అభివృద్ది చెందిందిగాని, ఒకనాడు వినోద ప్రదర్శనలు అన్నీ వీథిల్లోనే జరిగేవి. ఒకనాడు వీధులకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. పాఠశాలలన్నీ వీధుల్లోనే ఉండవి. అందుకే వాటిని వీధి బడులు అనే వారు. నడి వీధిలోనే దేవదాసి నృత్యాలు, మేజువాణీలు జరిగేవి. పురాణ గాధలను కూడా పండితులు వీధులలోనే చెప్పేవారు. వీధికి అంతటి ప్రాముఖ్యత ఉండేదానాడు. అలాగే నాటకాలు కూడా. నాటకాలను వీధుల్లో ఆడేవారు గనుక వాటిని వీధి నాటకాలు అనేవారు. వాటిని ప్రదర్శించేవారిని భాగవతులు అనేవారు. అసలు ఒకనాడు గ్రామ పంచాయితీల పాలనా వ్యవహారాలన్నీ వీథుల్లోనే ఏ వేప చెట్టుక్రిందో, ఏ రావి చెట్టు క్రిందో జరిగేవి. ప్రధానంగా రామాయణం, భారతం, భాగవత, గాథలూ, బసవపురాణ కథలూ వీథి నాటకాలుగా ప్రదర్శిస్తూండడం పరిపాటి. వీటిని దేశి నాటక ప్రదర్శనలు అంటే సరిపోతుందనుకుంటాను. ఈ దేశి నాటకాల పురోగతి శివకవుల ఆద్వర్యంలోనే జరిగింది. [ఇంకా... ]

Wednesday, November 5

మీకు తెలుసా - జిగురు కధ

చ్యూయింగ్ గం నమిలేవారిని ఎవరిని అడిగినా అది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతారు. చ్యూయింగ్ గంకి శతాబ్దాల చరిత్ర ఉందంటె మీకు ఆశ్చర్యం కలుగవచ్చు. ప్రాచీన గ్రీకులు, మెక్సికోకు చెందిన మాయెన్స్, చెట్లనుంచి తీసిన రకరకాల జిగటపదార్ధాలను గంలాగా నమిలేవారు.

అయితే ప్రపంచంలో వ్యాపారరిత్యా 'స్టేట్ ఆఫ్ మైన్ ప్యూర్ స్ప్రూస్ గమ్ము ' అనే గమ్మును 1848 లో జాన్ బి. కర్టీస్ తయారు చేశాడు. ధామస్ ఆడంస్ చాక్లేటును కనుగొన్నాడు. ఒకనాడు వాళ్ళ ఇంటికి జనరల్ ఆంటోనియా డీ అన్నా అతిధిగా వచ్చాడు. చికిల్ను ఉపయోగించి చౌక సింధెటిక్ రబ్బరును తయారు చేయమని సలహా ఇచ్చాడు. ఆయన ఫాక్టరీ స్థాపించి ప్రయోగాలు స్తాపించాడు. ఆయన ఒక షాపు వద్ద ఉండగా ఒక చిన్నమ్మాయి వచ్చి, . చ్యూయింగ్ గమ్‌ కొనడం చూశాడు. [ఇంకా... ]

వంటలు - కొబ్బరి ఖర్జూరం

కావలసిన వస్తువులు:

ఖర్జూరం పళ్లు - 12.
జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా ముక్కలు చేసి).
బాదంపప్పు - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా ముక్కలు చేసి).
పిస్తా ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా ముక్కలు చేసి).
యాలకుల పొడి - పావు టీ స్పూన్.
పాలపొడి - రెండు టేబుల్ స్పూన్లు.
రోజ్ ఎసెన్స్ - కొన్ని చుక్కలు.
కొబ్బరి పొడి - రెండు టేబుల్ స్పూన్లు.

తయారు చేసే విధానం:

ఖర్జూరాలను మధ్యలో కొద్దిగా చీల్చి గింజలు తీసేయండి.అన్ని పప్పుల్ని, పాలపొడి, యాలకుల పొడి, రోజ్ ఎసెన్స్‌ని ఒక బౌల్లో కలుపుకుని ఖర్జూరాల్లో కొంచెం కొంచెం కూరి పెట్టండి. [ఇంకా... ]

పెద్దల ఆటలు - మూడు భాషల ఆట

ఈ ఆటలో పాల్గొనేవారందరినీ రౌండ్ గా కూర్చోమని చెప్పాలి.

ఆట ఏమిటంటే ఎవరో ఒక మెంబరు దగ్గర నుంచి మొదలు పెట్టి వారిని ఒకటి, తరువాత వారిని టు, మూడో వారిని తీన్ అని చెప్పుతూ 20 నెంబర్స్ చెప్పించి మళ్ళీ మొదటినుంచి నెంబర్స్ మొదలుపెట్టి కంటిన్యూ చేయమనాలి. ఈ విధంగా అందరి చేతా చెప్పించేటప్పుదు గనక ఎవరైనా అంకె తప్పు చెప్పినా, భాష తప్పు చెప్పినా వారు ఓడిపోయినట్లే అలా కంటిన్యూ చేసి చివరగా మిగిలిన వారిని గెలిచినట్లుగా ప్రకటించాలి. [ఇంకా... ]

నీతి కథలు - ఎవరు గొప్ప?

ఒక అందమైన నగరం. దాన్ని దేవతలు పాలిస్తుండేవారు. తమ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉండేవారు. అందుచేత ఆ నగరంలో అందరూ సంతోషంగా ఉండేవారు. కొంతకాలానికి ఈ దేవతలకు అమితంగా గర్వం ఏర్పడింది. ఎవరికి వారే తామే గొప్ప అని, తమవల్లే నగరంలో సంక్షేమం ఏర్పడిందని, తాము లేకపోతే అంతా చిద్రం అయిపోతుందని గర్విస్తూండేవారు. ఈ దేవతల నగరం ఏదోకాదు - మానవ శరీరం. దేవతలు జ్ఞానేంద్రియాలు, అవయవాలన్నీ తమ తమ పనులు సక్రమంగా నెరవేర్చేవి. అందుచేత శరీరం ఎప్పుడూ ఆరోగ్యంతో సుఖంగా ఉండేది. అవయవాలలో అహంకారం ఆవిర్భవించినప్పుడు ప్రతీదీ తనకు తానే గొప్ప అని మిట్టిపడుతూండేది. ప్రతీదీ తాను లోపిస్తే శరీరంలో పనులు ఆగిపోతాయని, అప్పుడు శరీరం క్షీణించిపోతుందని అనుకుంది. అందుచేత వారిలో తగాదా బయల్దేరింది. [ఇంకా... ]

భక్తి సుధ - శ్రీ విష్ణ్వష్టోత్తర శతనామావాళిః

శ్రీ విష్ణ్వష్టోత్తర శతనామావాళిః

1. ఓం విష్ణవే నమః
2. ఓం జిష్ణవే నమః
3. ఓం వషట్కారాయ నమః
4. ఓం దేవదేవాయ నమః
5. ఓం వృషాకపయే నమః
6. ఓం దామోదరాయ నమః
7. ఓం దీనబన్ధనే నమః
8. ఓం ఆదిదేవాయ నమః
9. ఓం దితిస్తుతాయ నమః
10. ఓం పుండరీకాయ నమః [ఇంకా... ]

Tuesday, November 4

చిట్కాలు - పిల్లలకు సంబంధిచినవి

పసిపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు, పాలుపట్టించేటప్పుడు, అన్నం తినిపించేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో పిల్లలకు అన్నం పెట్టడానికి వాడే వస్తువుల విషయంలోనూ అంతే అప్రమత్తతతో వ్యవహరించాలి. అందుకే పిల్లల అహార వేళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాం.

1. పిల్లలకి తినిపించడానికి ఉపయోగించే వస్తువులు అన్ బ్రేకబుల్ అయ్యుండాలి. ప్లాస్టిక్ వస్తువులైతే అందులో అన్నం పెట్టి తినిపించడం మంచిదో కాదో తెలుసుకోవాలి.

2. మైక్రోవేవ్‌లో ఆహారం వేడిచేస్తే మొదట కొద్దిగా మీరు రుచి చూసిన తర్వాతే పిల్లలకు పెట్టాలి. అలాగే ఇందులో ఆహారపదార్ధాలను వేడి చేసేటప్పుడు వాడే వస్తువుల విషయంలోనూ జాగ్రత్త వహించాలి.

3. పసిపిల్లలకు స్పూన్లు అలవాటు చేయాలంటే గుండ్రని ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ స్పూన్లనిచ్చి తినమనాలి. ప్లాస్టిక్ ఫోర్కులు కూడా ఇవ్వొచ్చు.

4. గిన్నెలు, కప్పుల అడుగుబాగం వెడల్పుగా ఉంటే అందులోని పదార్ధాలు తొందరగా నేలపై చిందవు. [ఇంకా... ]

మీకు తెలుసా - చిన్నతరహా పరిశ్రమలు

చిన్నతరహా పరిశ్రమల నిర్వచనం మారిన తరువాత కొన్నిసూచనలు జారీ అయినవి - అవి:

నిర్వచనం మారకముందే చిన్న పరిశ్రమలు గానీ వాటికి నిర్దేశించిన పెట్టుబడి పరిమితులను దాటి ఉంటే, అలాంటి పరిశ్రమలను సవరించిన నిర్వచనం ప్రకారం సవరించిన పెట్టుబడి పరిమితుల్లో ఉంటే వాటిని చిన్న పరిశ్రమలుగా, అనుబంధ పరిశ్రమలుగా గుర్తిస్తారు.

నోటిఫికేషన్ తేదికి ముందుగానే అప్పటి పెట్టుబడి పరిధి అధిగమించి, క్యార్ ఆర్ బిజినెస్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసినా ప్రస్తుతం హెచ్చించిన పెట్టుబడి పరిమితి లోపల ఉంటే ఆ లైసెన్సు అవసరం లేదు. వారి సి.ఒ.బి. దరఖాస్తులపై ఎటువంటి చర్య తీసుకోరు. వారిని చిన్నతరహా అనుబంధ పరిశ్రమలుగానే పరిగణిస్తారు. [ఇంకా... ]

పిల్లల పాటలు - చిలకమ్మ పెండ్లి

చిలకమ్మ పెండ్లి - చెలికత్తెలందరూ
చెట్లు సింగారించి - చేరి కూర్చున్నారు
పందిట పిచ్చుకలు - సందడి చేయగ
కాకుల మూకలు - బాకాలూదగ
కప్పలు బెకబెక - డప్పులు కొట్టగ

కొక్కొరోకోయని - కోడి కూయగా
ఘుమ్మని తుమ్మెద - తంబుర మీటగ
కుహూ కుహూ యని - కోయిల పాడగా
పిల్ల తెమ్మరలు - వేణువూదగా
నెమలి సొగసుగా - నాట్యం చేయగా [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - మొరార్జీ దేశాయ్

పేరు : మొరార్జీ దేశాయ్
తండ్రి పేరు : రంచోడ్డి దేశాయ్
పుట్టిన తేది : 29-2-1896
పుట్టిన ప్రదేశం : గుజరాత్
చదివిన ప్రదేశం : గుజరాత్
చదువు : బి.ఏ.
గొప్పదనం : పేదవారి విషయంలో అత్యంత శ్రద్ద చూపి వారి అభివృద్దికి ఎంతో పాటుపడ్డారు
స్వర్గస్థుడైన తేది : 7-5-1924

రంచోడ్డి మురార్జీ దేశాయ్ 1896 ఫిబ్రవరి 29న గుజరాత్ లో జన్మించాడు. తండ్రి రంచోడ్డి దేశాయ్ బడిపంతులు. ఆయన ఏడుగురి సంతానంలో మురార్జీ మొదటివాడు. బతకలేక బడిపంతులు అన్నట్లు ఆ రోజుల్లో మురార్జీ తండ్రి సంపాదన ఇంటికి ఏ మాత్రం సరిపోయేది కాదు. ఆయన చిన్నతనంలో కడుపునిండా భోజనం తిన్న రోజులు వేళ్ళమీద లెక్క పెట్టవచ్చునని మురార్జీ ఒక పత్రికా సమావేశంలో అన్నారు. మురార్జీ తెలివైన విద్యార్థి కావటం వలన భావనగర్ మహారాజు నెలకు పది రూపాయలు స్కాలర్ షిప్పు ఇవ్వడానికి అంగీకరించారు. ఆ పదిరూపాయలతో తల్లి, ఏడుగురు పిల్లలు ఎంతో గుంభనంగా సంసారం సాగించేవారు. మురార్జీ ఎంతో క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా పెరిగాడు. [ఇంకా... ]

కవితలు - దూరతీరాలు

కన్నదేశం వదలి, ఉన్న దేశానికి వస్తే
ఉన్నవాళ్ళంతా కానివాళ్ళే!

కారు వున్నా, కాసు వున్నా,
ఊరు గాని ఊరులోన సుఖం సున్న!

కారు ఏసి, ఇల్లు ఏసి,
వళ్ళు మాత్రం వేడివేడి

ఊరు గొప్పది, పేరు గొప్పది,
ఉనికి మాత్రం ఉత్తది!

సంవత్సరాలుగా సహచరులే
సంబంధాలు మాత్రం అరకొరలే!

ముఖం చూడ సుపరిచతమే
మనిషి మాత్రం అపరిచితుడే! [ఇంకా... ]

Monday, November 3

సంగీతం - మన సంగీతం

"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి:" అని ఆర్యోక్తి. అనగా గాన రసాన్ని శిశువులు పశువులతో పాటు పాములు కూడా విని ఆనందిస్తాయని అర్థం.

మన పురాణ కాలంలో శ్రీ కృష్ణుడు అద్భుతంగా వేణునాదం ఆలపించేవాడని దానికి గోవులు, గోపికలు, మునులు సైతం తాదాత్మ్యం పొదేవారిని చెబుతారు.అంతే కాదు నారద తుంబురులు, హనుమంతుడు గొప్ప నాదోపాసకులుగా కీర్తి పొందారు. రాజస్థాన్ ఎడారి మరు భూమిలో మిరాబాయి కృష్ణ భక్తి గాగాన ప్రవాహాన్ని ప్రవహింప చేశారు.ఆమె గానాన్ని అక్బర్ చక్రవర్తి సైతం మారువేషంలో వచ్చి వినేవాడని చెబుతూ ఉంటారు. నాదబ్రహ్మను ఉపాసించి ఇహపరాలను సాధించిన మహానీయులు ఎంతో మంది ఉన్నారు. సంగీతం వల్ల వ్యాధులు త్వరగా నయమవుతాయని, పశువులు పాలు ఎక్కువుగా ఇవ్వగల్గుతాయని, పంటలు ఎక్కువుగా పండుతాయని ఆధునిక పరిశోధకుల భావన. [ఇంకా... ]

ఆధ్యాత్మికం - అద్వైత త్రయం

దేవుడు ఉన్నాడని అంగీకరించే మతం ఆస్తిక మతం. ఆస్తికులలో జీవులు చేతులు, కాళ్ళు మొదలైన వివిధ శరీరావయవాలులాగా దేవుని చేరి ఉంటారని చెప్పేవారు విశిష్టాద్వైతులు. జీవుడికీ, దేవుడికీ అన్ని కాలాల్లోనూ, అన్ని అవస్థలలోనూ భేదం ఉంటుందని వాదించేవారు ద్వైతులు. రెండు విధాలు కానిది, భేదం లేదని వాదించేవారు అద్వైతులు. ఈ వాదాన్ని ప్రతిపాదించినవారు శ్రీ శంకరాచార్యులు. అద్వైత వాదాన్నే "మాయా వాదం" అంటారు. దీనినే ప్రచ్చన్న బౌద్ధం అని కూడా అంటారు. ఈ దేహమే దేవాలయం. అందులో జీవుడే దేవుడు. దేహం పోయినా జీవుడు ఉంటాడని అద్వైతుల వాదన. దేహం నశించాక జీవుడు వేరే శరీరంలో ప్రవేశిస్తాడు. లేకపోతే ప్రకృతితో అంతర్లీనమైపోతాడు. పాలలో ఉండే వెన్నను తీసేస్తే ఆ వెన్న తిరిగి పాలలో కలవదు. అలాగే దేవుడు నుండి జీవుడుని వేరుచేస్తే ఆ జీవుడు తిరిగి దేవుడులో కలవడు. కాబట్టి జగత్తు సత్యం, జీవుడు సత్యం అంటుంది విశిష్టాద్వైతం. విశిష్టాద్వైత వాదాన్ని ప్రతిపాదించినవారు శ్రీరామానుజాచార్యులవారు.

అద్వైత విశిష్టాద్వైతాల తరువాత ద్వైతమతం ఆవిర్భవించింది. ఈ మతాన్ని స్థాపించింది ఆనందతీర్ధులు. వీరినే మధ్వాచార్యులు అని కూడా అంటారు. వీరు జగత్తు సత్యం, దేవుడు సత్యం, జీవుడు సత్యం అంటారు. జీవుడూ, దేవుడూ ఎప్పటికీ ఒక్కటి కాజాలరు. [ఇంకా... ]

పిల్లల ఆటలు - అవ్వా - అప్పచ్చా

ఎంతమంది ఆడాలి : ముగ్గురు ఆడాలి.

ముగ్గురు పంటలెయ్యాలి. ముందుగా ఎవరు పండితే వారు అతన్ని ఏనుగు మీద ఎక్కించాలి. మరి ఏనుగేది. మిగతా ఇద్దరూ ఏనుగుగా మారతారన్నమాట. ఎలాగంటే - ఇద్దరూ ఎదురెదురుగా నిలుచుని తమ కుడి అరచేతులను పైకి లేపి నిచ్చెన కట్టాలి. ఎదురు బాలుడు కూడా అలాగే కట్టాక ఇద్దరు చేతులు కలుపుతారు. ఇప్పుడు ఆ నిచ్చెన ఏనుగు అన్నమాట. పండిన బాలుడు చేతుల మధ్య కూర్చుండ బెట్టుకొని పైకి లేపి, వూరేగించాలి. అప్పుడు ఇలా పాడాలి. [ఇంకా... ]

భక్తి గీతాలు - సీతా కళ్యాణ వైభోగమే

సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే ||సీ||

పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవిసోమ నవనేత్ర రమణీయ గాత్ర ||సీ||

భక్త జన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల
పామరా సురభీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేతధామ ||సీ| [ఇంకా... ]

వ్రతములు - కైలాస గౌరి వ్రతము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక రాజునకొక్కతే కుమార్తె గలదు. అతడామెకొక వన్నెల విసనకర్ర వంటి వయ్యారి మగని యేరి తెచ్చి పెండ్లి చేసెను. కాని ఆమె భర్త యెల్లప్పుడు వేశ్యాలోలుడై భార్య ముఖమైనను చూడకుండెను. అందుచేత ఆ రాచ చిన్నది మిక్కిలి బాధపడి, పార్వతీదేవిని ప్ర్రతిదినము పూజించుచు, తన పతిని తనతో కలుపమని ప్రార్ధించుచుండెడిది. అట్లు కొంతకాలము జరిగిన తర్వాత పార్వతీదేవి ఆమె యందు కరుణించి ఒకనాటి రాత్రి ఆమె స్వప్నములో కనిపించి, కైలాసగౌరి నోము నోచినచో భర్తతో యెడబాటు లేకుండునని తెలిపెను. తెల్లవారిన తర్వాత నామె ముందురోజు రాత్రి స్వప్న వృత్తాంతమును తన తండ్రికి తెలిపి, ఆ నోమును నోచుకొనెను. [ఇంకా... ]