Tuesday, March 31

ఆహార పోషణ సూచిక - గుప్పెడన్నం గొప్పమేలు

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మన పెద్దలు. వారన్నందుకే కాదు నిజానికి పోషకాల విషయంలోనూ అన్నం ప్రత్యేకతే వేరు. అందుకే ఎన్ని వెరైటీలు తిన్నా చివరికి ఒక ముద్ద పెరుగన్నం తినందే తృప్తిగా ఉండదు చాలా మందికి. నిజానికి అది మంచి అలవాటు కూడా ఎందుకంటే బియ్యంలో అధికంగా ఉండే గంజిశరీరానికి చలువచేస్తుంది. చలికాలంలో ఎక్కువగా సూప్స్ తాగడానికి ఇష్టపడే వాళ్ళు ఎండాకాలంలో గంజిలో మజ్జిగ కలుపుకొని తాగుతుంటారు.

గోధుమలు ఇతర ధాన్యాలతో పోలిస్తే బియ్యంలో ఎక్కువ ప్రొటీన్లు దాదాపు 7 శాతం ఉంటాయి. విటమిన్ బి, (ధయామిన్) ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పాలిష్ చేసిన, కడిగిన బియ్యాన్ని వండేటప్పుడు దాదాపు 75 శాతం ధయామిన్ తగ్గిపోతుంది. దీనివల్ల శరీరంలో విటమిన్ బి లోపిస్తుంది. [ఇంకా... ]

వంటలు - కో కో సిరప్

కావలసిన వస్తువులు:

కో కో - 1 కప్పు.

పంచదార - 2 కప్పులు.

చన్నీళ్ళు - 3 కప్పులు.

తయారు చేసే విధానం:

ముందుగా కోకో, పంచదార, చన్నీళ్ళు కలిపి 20 నిమిషాల పాటు ఉడికించి గట్టి పాకం పట్టాలి. సన్నని సెగ పై ఆపకుండా కలియబెడుతూ ఉండాలి. పాకం తయారు అవ్వగానే చల్లార్చి పొడి సీసాలో పోసుకోవాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - చుక్కలాట

ఈ ఆట ఇద్దరు ఆడవచ్చు. ముందుగా అడ్డంగా నిలువుగా కలిపి పైన చూపినట్టు 100 చుక్కలు పెట్టుకోవాలి. తరువాత ఒక ఆటగాడు ఒక చుక్క నుండి ఇంకొక చుక్కకు ఒక గీతను గీయాలి. తరువాత మరొక ఆటగాడు తన ఇష్టమొచ్చిన దగ్గర గీత గీస్తాడు. ఇవి నిలువుగానైనా, అడ్డంగానైనా ఎలా అయినా గీయవచ్చు. అయితే ఏ ఆటగాడు వాటిని (స్క్వేర్) చతురస్త్రంలాగా గీస్తాడో, ఆ చతురస్త్రం (బాక్స్)లో అతని పేరు మొదటి అక్షరాన్ని వేయాలి. [ఇంకా... ]

జానపద గీతాలు - కోడలా కోడలా కొడుకు పెళ్ళామా

"కోడలా కోడలా కొడుకు పెళ్ళామా
పచ్చిపాల మీద మీగడలేవి?
వేడిపాల మీద వెన్నల్లు యేవి?
నూనెముంతల మీద నురగల్లుయేవు?"

"అత్తరో ఓయత్త ఆరళ్ళయత్త
పచ్చిపాలమీద మీగడుంటుందా?
వేడిపాల మీద వెన్నలుంటాయా?
నూనె ముంతల మీద నురగలుంటాయా?"

"ఇరుగు పొరుగులార! ఓ చెలియలార
అత్తగారి ఆరళ్ళు చిత్తగించరా? [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - శ్రీరంగపట్నం

మైసూరుకు 12 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశం టిప్పుసుల్తాను ప్రాసాదంలో అత్యంత చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నది. కావేరినది రెండు పాయల మధ్యన ఉన్న దివిలాంటి దానిలో అమరియున్నది. మహిమాన్విత కావేరి పట్టణం చుట్టూ ప్రవహిస్తున్నది. టిప్పుసుల్తాన్ వారి కోట వేసవి మకాము యిక్కడ వున్నదంటారు. గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్లుగా పురాణ ప్రశస్తి వుంది. క్రీ.శ 894 సంవత్సరంలో శ్రీ తిరుమలనాయుడు రంగనాధుని ఆలయం నిర్మించి రంగపురంగా వెలయింపచేశాడు. శ్రీరంగపట్నం 1120లో విష్ణువర్ణనుని సోదరులు ఉదయాదిత్యుడు కట్టించాడని ప్రతీతి. 1495 శ్రీరంగపట్నం విజయనగర రాజుల ఆధీనంలోకి వచ్చి, 1610లో మైసూరు రాజు ఒడయారు చేసుకున్నారు. తరువాత మహమ్మదీయులైన హైదర్ ఆలీ, టిప్పు సుల్తానుల కాలంలో వారి ఆధీనంలో ఉండి తరువాత 1799 లో బ్రిటీషు వారి హస్తగతమయింది. ఇక్కడ మూఖ్యంగా చూడదగినవి- 'టిప్పుసుల్తాన్ వారి వేసవి విశ్రాంతి భవనం, చిత్రకళ అందంగా పొందుపరచబడి వుంది. హైదర్ ఆలీ, ఆయన్ భార్య సమాధులున్నాయి. [ఇంకా... ]

Thursday, March 26

లాలి పాటలు - ఊయలూగుమా కృష్ణ

ఊయలూగుమా కృష్ణ ఊయలూగుమా
హాయిగా వినిపింతు జోల ఊయలూగుమా ||ఊ||

లాలీ గోపాలకృష్ణ లాలీ గోవింద కృష్ణ
లాలీ మా పాలి దైవమ లాలీ లాలీ
రేపల్లియే ఊయలై వూగగా

గోపెమ్మ యెద జోలలే పాడగా
ఆనందమూ నందునీ యింట విరిసే
జగమందు కనువిందగు లీల వెలిసే ||లా|| [ఇంకా... ]

పండుగలు - మంగళగౌరీ వ్రతం

మన భారతీయ సంస్కృతిలో మహోన్నతమైనది వివాహసంస్కారం. అన్ని ఆశ్రమాలలోను గృహస్థాశ్రమము చాలా శ్రేష్ఠమైనదని మన వేదములు, స్మృతులు ఘోషిస్తున్నాయి. ఇందు భార్య, భర్త ఇరువురు ఒకరిపై నొకరు ప్రేమానురాగాలతో జీవించుటతోపాటుగా భర్థ ఏకపత్నీవ్రతుడుగా భార్య ప్రతివ్రతామ తల్లిగా వెలుగొందుతుంటారు. అట్టి గృహము ఎల్లప్పుడు నిత్యకళ్యాణము - పచ్చతోరణముతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈ గృహస్థాశ్రమ నిర్వహణకు మన మహర్షులు మంచి సంస్కారాలను ఏర్పరిచారు. అలా ఈ గృహస్థాశ్రమ నిర్వహణ ఆచరించుటకూడ ా ఒక మహాయజ్ఞముతో సమానమైనది అని ' మను ' మహర్షియొక్క అభిప్రాయం. అటువంటి గృహస్థాశ్రమమున సౌశీల్యవతియైన స్త్రీ గృహకృత్యములు, గృహస్థధర్మములు నిర్వహించుకుంటూ అనేక రూపాలలో ఇలా గృహస్థునకు తోడ్పడుతూ ఉంటుంది. [ఇంకా... ]

తెలుగు బిడ్డలు - కందుకూరి వీరేశలింగం

పేరు : కందుకూరి వీరేశలింగం.
పుట్టిన తేది : 16-4-1848.
పుట్టిన ప్రదేశం : రాజమండ్రి.
చదివిన ప్రదేశం : రాజమండ్రి.
గొప్పదనం : బాల్యవివాహాలను అరికట్టి, వితంతువుల పునర్వివాహలను ప్రోత్సహించారు.
స్వర్గస్తుడైన తేది : 27-5-1919.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ సాంఘీక సంస్కర్త కందుకూరి వీరేశలింగం. 1848 ఏప్రిల్ 16 న రాజమండ్రిలో ఒక సంపన్న కుటుంబంలో ఇతడు జన్మించెను. పాఠశాలలో చాలా చురుకుగా ఉండేవాడు. ఇతడు నాలుగోతరగతి చదువుతుండగా, ఉత్తమ విద్యార్ధి ఎవరు ఆనే ప్రస్తావన వచ్చినప్పుడు, విద్యార్ధుల్లో చాలా మంది ఇతని పేరును సూచించారు.
[ఇంకా... ]

నీతి కథలు - తెలివిగల బాలుడు

ఒక నగరంలో ఒక నవాబు ఉన్నాడు. అతడు గొప్ప ధనవంతుడు. అతనికి పెద్ద భవనం ఉంది. చాలామంది పనివారున్నారు. కాని చాలా క్రూరుడు. ఇతరులను హింసించడం, ఇతరులను బాధించడం అతనికి ఆనందం. అలా చాలామందిని బాధపెట్టాడు. ఒక రోజున ఆ భవనం వద్దకు పేద బాలుడు వచ్చాడు. సలాం చేశాడు. ఆకలిగా ఉంది. తినటానికి ఏమన్నా పెట్టించమన్నాడు. వెంటనే నవాబు లేచి ఆ బాలుణ్ణి పెద్ద హాల్లో కూర్చోబెట్టాడు. తను ఎదురుగా కూర్చున్నాడు. పనివాళ్ళను పిలిచాడు. నీళ్ళు, పళ్ళు తెమ్మన్నాడు. భోజనం వడ్డించమన్నాడు. పనివారు లోపలికి వెళ్ళారు. ఉత్త చేతులతో వచ్చారు. ఇద్దరికి వడ్డించినట్లు నటించారు. ఆ నవాబు తిన్నట్లు నటించాడు. పేద బాలుడిని తినమన్నాడు. కాని ఎదురుగా తినడానికి ఏమిలేదు. బాలుడికి అర్థం కాలేదు. నవాబు చేతులు కడిగినట్లు నటించాడు. పనివారితో మిఠాయిలు తెమ్మన్నాడు. వారు తెచ్చినట్లు నటించారు. నవాబు తిన్నట్లు నటించాడు. మధు పానీయాలు తెమ్మన్నాడు. పనివారు తెచ్చినట్లు నటించారు. నవాబు తాగుతున్నట్లు నటించాడు. [ఇంకా... ]

వంటలు - కోవా కేసర్ ఖైన్

కావలసిన వస్తువులు:
పాలు - 5 లీటర్లు.
చక్కెర - 600 గ్రా.
కేసరి (కుంకుమపువ్వు) - 3 గ్రా.
బాదంపప్పు - 100 గ్రా.


తయారు చేసే విధానం :
పాలు బాగా చిక్కబడేంతవరకు సన్నని సెగపై మరిగించి, ఆపై ట్రేలో పోయాలి. ఫ్యాను గాలికింద ఆరబెట్టి కోవ సిద్ధంచేసుకోవాలి. కోవా గట్టిపడ్డ తర్వాత కొద్దిగా తీసుకుని దానిలో కుంకుమపువ్వు వేసి కొంచెం వేడిపాలు పోయాలి. పది నిముషాలసేపు నాననివ్వాలి. [ఇంకా... ]

Tuesday, March 24

ఎందుకు, ఏమిటి, ఎలా ... - ఐస్ క్రీం

వేసవి కాలం వచ్చిందంటే మనం అంతా లొట్టలు వేస్తూ ఎగబడి తినేది ఐస్ క్రీంనే. అవునా? ఈ ఐస్ క్రీం ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలుసా? ఐస్ క్రీం తినడమే మనకు తెలుసు. కాని దానిని ఎవరు కనిపెట్టారు అనే ప్రశ్న వేసుకున్నా అది మనకు తెలియదు కాబట్టి దానిని గురించి వదిలేసి మన ముందున్న ఐస్ క్రీంను ఓ పట్టుపడతాం. ఐస్ క్రీం ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం చైనా వంటవాళ్ళు రకరకాల పండ్ల నుంచి గుజ్జును, రసాన్ని తీసి చల్లగా ఉండటం కోసమని దానిలో మంచు ముక్కలు కలిపి నిల్వచేసేవారట. అది ఐస్‌క్రీం తొలి రూపం అన్నమాట. నాలుగువేల ఏళ్ళ క్రితం ఒక చైనా చక్రవర్తి ఇంట్లో పని చేసే వంటవాడు చక్రవర్తిని మెప్పించడానికి పండ్ల గుజ్జులో మంచు ముక్కలు కలిపి వడ్డించాడు. అది చక్రవర్తికి బాగా నచ్చింది. రోజూ ఈ వంటకమే వడ్డించమన్నాడు. అలా ఐస్‌క్రీం క్రమంగా ఆదరణ పొందింది. నీరో చక్రవర్తి పండ్లను తేనెతో కలిపి మంచు ముక్కలతో పాటు తినేవాడట. అదీ ఒక ఐస్‌క్రీం లాంటిదే. [ఇంకా... ]

పిల్లల పాటలు - అంతా ఒక్కటే

అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే
ఆంధ్రులమైన తమిళులమైనా
ఉత్కళులైనా కన్నడులైనా
మరాఠి అయినా గుజరాత్ అయినా
పంజాబ్ అయినా బంగ్లా అయినా || అంతా ||

వందనమండీ వందనం (తెలుగు)
వణక్కమమ్మా వణక్కం (తమిళం)
నమస్కార్ నమస్కార్ (హిందీ)
ఇస్సలాం ఇస్సలాం (అస్సామీ) [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - బాబూ రాజేంద్రప్రసాద్

పేరు : బాబూ రాజేంద్రప్రసాద్.
తండ్రి పేరు : మహదేవ్ సహాయ.
పుట్టిన తేది : 3-12-1884.
పుట్టిన ప్రదేశం : బీహార్.
చదివిన ప్రదేశం : బీహార్.
చదువు : న్యాయశాస్త్రం.
గొప్పదనం : రైతుల రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించటానికి పాటు పడ్డారు.

రాజేంద్రప్రసాద్ 1884 డిసెంబరు 3న జన్మించారు. తండ్రి మహదేవ్ సహాయ ఆయుర్వేద వైద్యం చేస్తుండేవాడు. రాజేంద్రప్రసాద్ తాతగారు బీహార్ జిల్లాలోని హధువా సంస్థానంలో దివానుగా ఉండేవారు. వారి పూర్వికులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. ఉద్యోగాల అన్వేషణలో తలోకవైపు చెదిరిపోయారు. రాజేంద్రప్రసాద్‌కి చిన్నతనము నుంచి బీదల యెడల ఎంతో సానుభూతి ఉండేది. అతని తండ్రి వైద్యం చేస్తున్నప్పుడు ఆయన ఒళ్ళో కూర్చోని రోగులను పరిశీలిస్తూ ఉండేవాడు. [ఇంకా... ]

పెద్దల ఆటలు - దాడి

ఈ ఆటను ఇద్దరు ఆడతారు. ఒకరు 11 చింతపిక్కలు, మరొకరు 11 చిన్న గులకరాళ్ళు లేదా పుల్లతో ఈ ఆట ఆడాలి. ఎలాగైనా 3 జంక్క్షన్లలో గులకరాళ్ళు గానీ చింతపిక్కెలుగానీ పెట్టగలిగితే అతనికి ఒక 'దాడీ అవుతుంది. ఎదుటఆటగాడికి చెందిన పిక్కలను ఇతను తీసేయవచ్చు. ఇలా ఎన్ని 'దాడీ లైతే వారికి ఎడ్వాంటేజ్ ఉంటుంది'. జంట దాడిలు కనక పెట్టుకోగలిగితే అవతల ఆటగాడు తన పిక్కలను కోల్పోయినట్టే. [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - ద్వారకా తిరుమల

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుకు 42 కిలోమీటర్ల దూరంలో ఉందీ దివ్యక్షేత్రం. విజయవాడ నుండి ఏలూరు బస్సులోగాని, రైలులోగాని వెళ్ళవచ్చును. మద్రాసు, హౌరా రైలు మార్గంలో ఏలూరు ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు మొదటి స్టాపింగు అవుతుంది. నిరంతరం ఏలూరుకు విజయవాడ నుండి నాన్ స్టాపు బస్సులు గలవు. ఏలూరు నుండి భీమడోలు, తడికలపూడి ద్వారా ద్వారకా తిరుమల చేరవచ్చును.

ఇక్కడ ఒక చిన్న గుట్ట మీద శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. గుట్ట కింద గ్రామాన్ని తిరుపతి అంటారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరునికి చెల్లించాలనుకున్న మొక్కుబడులు కూడా ఒక్కో సమయంలో అంతదూరం వెళ్ళలేని భక్తులు ఇక్కడనే స్వామివారికి మొక్కుబడులు తీర్చుకొంటూంటారు. భక్తులు విశేషంగా వస్తారు. దీనినే చిన్న తిరుపతి అని కూడా అంటుంటారు. ఇక్కడ వివాహ, ఉపనయనాది కార్యక్రమములు, అన్న ప్రాశనలు, వగైరాలు, తలనీలాల మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. [ఇంకా... ]

Friday, March 20

మీకు తెలుసా - పిల్లల్లో ఊబకాయం

ఇటీవల కాలంలో పిల్లల్లో ఊబకాయ సమస్య బాగా కనిపిస్తోంది. మారిన ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి, శీతలపానీయాలు బాగా తీసుకవడం వంటివి లావెక్కడానికి ప్రధాన కారణాలు. భారీ శరీరం వల్ల పిల్లలు వారి వయసుకు మించి కనిపిస్తారు. ఆరోగ్యానికి కూడా ఊబకాయం మంచిది కాదు. పిల్లల్లోని ఈ భారీకాయ సమస్యని ఒక్కసారి తగ్గించడం సాధ్యమయ్యే విషయం కాదు. కింద పేర్కొన్న అంశాలను పరిగణనలో పెట్టుకుని, ఇచ్చిన వ్యాయామాలను క్రమం తప్పకుండా పిల్లల చేత చేయించాలి.

1. పిల్లలు తమ ఫాస్ట్‌ఫుడ్ జీవనశైలిని మార్చుకునేలా ప్రోత్సహించాలి. శారీరకంగా ఉస్తాహంగా ఉండేట్టు వారిని తీర్చిదిద్దాలి. ఆరోగ్యకరమైన అహారాన్ని వాళ్లకి అలవాటు చేయాలి.
2. టీవి ముందర గంటల తరబడి కూర్చోనివ్వద్దు. ఈ అలవాటు వల్లే పిల్లల్లో ఊబకాయ సమస్య ఎక్కువవుతోంది. [ఇంకా... ]

వంటలు - పల్లీ పకోడీలు

కావలసిన వస్తువులు:
వేరుశనగపప్పు(పల్లీలు) - 2 కప్పులు.
శనగ పిండి - 2 కప్పులు.
బియ్యపు పిండి - 1/2 కప్పు.
అల్లంవెల్లుల్లి పేస్టు - 1 స్పూను.
పచ్చిమిర్చి - 1/4 కప్పు (తరిగినవి).
వనస్పతి - 1/4 కప్పు.
కారం - 1/2 స్పూను.
ఉప్పు - తగినంత.
పసుపు - చిటికెడు.
నూనె - సరిపడినంత.

తయారు చేసే విధానం:
ఓ గిన్నెలోకి శనగపిండి, బియ్యపు పిండిలను తీసుకోవాలి. వనస్పతి కరిగించి దీనిలో వేయాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్ధాలన్నీ వేయాలి. తగినంత నీటితో పకోడీ పిండిలా కలుపుకోవాలి. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - యాసిడ్

మలినాలను తొలగించే శక్తి యాసిడ్‌కు ఎలా వచ్చిందో, ఎందుకు దానిని ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా జిడ్డులాగా పేరుకునే మురికికి కారణం ప్రొటీన్లు లేదా కార్బోహైడ్రేటు మలినాలే. చాలా బండలు, నేల మీద పై పొరలో ఉండే రసాయనిక పదార్థం కాల్షియం కార్బనేటు మనం మురికిని వదిలించడానికి వాడే యాసిడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంకు కాల్షియం కార్బనేట్‌తో చర్య జరిపి కార్బన్‌డయాక్సైడును, కాల్షియం క్లోరైడును, నీటిని ఇచ్చే ధర్మం ఉంది. కొద్దిగా పొరలాగా ఆసిడ్ ను వేసినప్పుడు అది వెంటనే పై పొరతో రసాయనిక చర్య జరిపి ఆ పొరను తొలగిస్తుంది. ఆ పొరతో పాటే దానికి అంటుకొనివున్న మలినాలు కూడా తొలగిపోతాయి. [ఇంకా... ]

పండుగలు - బుద్ధ జయంతి

నేటికి రెండున్నర వేల సంవత్సరములకు పూర్వము భూమిపై ధర్మము పేరుతో పశువులను వధించు చుండిరి. అప్పుడు జీవ హత్య నిలుపుటకు మాయాదేవి గర్భమున భగవానుడు బుద్ధునిగా అవతరించెను. ఇతని తండ్రి శుద్ధోదనుడు. వీని రాజధాని కపిల వస్తు నగరము. బాల్యమున బుద్ధుని నామము సిద్ధార్ధుడు. జ్యోతిష్కులు "ఈ బాలుడు రాజగును. కాని విరక్తుడై లోకకళ్యాణ కారుడగు"నని చెప్పిరి. అప్పుడు శుద్ధోదన రాజు పెద్ద భవనము నిర్మించి రాకుమారుని అందులో ఉంచెను. రోగములు, దుఃఖములు, మృత్యువులు యేమి తెలియ నివ్వక పెంచెను. ఇతనికి యశోధరతో వివాహము జరిగెను. వీరికొక పుత్రుడు కలిగెను. వారి పేరు రాహులుడు. సిద్ధార్ధుడు ఒకమారు నగరము చూచుటకై తండ్రి ఆజ్ఞ తీసికొని వెలుపలకు వచ్చెను. నగరము నందు తిరుగు సమయమున ఒక వృద్ధుడు కనిపించెను. మరొక మారు నగరము సందర్శించునప్పుడు ఒకరోగి కనిపించెను. మూడవమారు దర్శించునప్పుడు చనిపోయినవాడు కనిపించెను. [ఇంకా... ]

పిల్లల ఆటలు - కాళ్ళ గజ్జా కంకాళమ్మ

ఎంత మంది పాల్గొనవచ్చు : నలుగురు.

ఎక్కువగా ఆడపిల్లలు ఈ ఆటను ఆడతారు. ముందుగా పిల్లలు కింద కూర్చుని తమ కాళ్ళను బారచాపాలి. అనంతరం గ్రూప్ లీడర్ మొదట కూర్చున్న ఆటగాడు ఆటగత్తెల మోకాళ్ళ మీద చెయ్యి వేసి దాన్ని వరుసగా అందరి కాళ్ళ మీదకు జరుపుతూ ఇలా పాట పాడతారు. కాళ్ళ గజ్జ కంకాళమ్మ, వేకువ చుక్క వెలగ మొగ్గ, కాళ్ళూ తీసి పక్కన పెట్టు" ఇలా చివరి పదం ఏ కాలు వద్ద ఆగిందో ఆ కాలుని ఆ ఆటగాడు మడిచేయాలి. మరలా పాట ప్రారంభించి పైన చెప్పినట్టు పాడాలి. చివరి పదం ఏ కాలి వద్ద ఆగితే ఆ కాలుని మడిచేయాలి. [ఇంకా... ]

Tuesday, March 17

ఆహార పోషణ సూచిక - దంత రక్షణే దేహ రక్షణ

సాధారణంగా ప్రతి మానవుడు తన ఆరోగ్యంపట్ల కాస్తో కూస్తో శ్రద్ధ వహిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా సౌందర్య పోషణకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంటాడు. బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా మరింత శక్తివంతంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు. శరీరంలోని ప్రతి భాగంపట్ల ఎంతో జాగ్రత్తలుపడుతుంటాడు. శిరోజాలకూ అంతే ప్రాధాన్యమిస్తాడు. అయితే మన దేహ అంతర్భాగాలు ఆరోగ్యం ఉండాలంటే వాటికి మించిన పరిశుభ్రంగా ఉంచుకోవాలసిన దంతాలపట్ల మాత్రం పెద్దగా శ్రద్ధ చూపడు. ఇది దాదాపు ప్రతి మనవుడి నైజం. దంత పరిరక్షణ లేకపోతే జీర్ణవ్యవస్థ పరిశుభ్రంగా ఉండదన్న కనీస జ్ఞాన్ని విస్మరిస్తుంటాడు. దంత క్షయం ద్వారా వచ్చే వ్యాధుల గురించి సరైన అవగాహన లేక వాటిపట్ల ఏమరపాటుగా ఉంటాడు. గుండె, ఊపిరితుత్తులలాగానే దంతాలను పరిరక్షించుకోవలసిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని ప్రతి మనిషీ గుర్తించాలని తెలిపేందుకే ఈ వ్యాసం. [ఇంకా... ]

వంటలు - హనీ డేట్

కావలసిన వస్తువులు:
మైదాపిండి - పావుకిలో.
ఖర్జూరాలు - పావుకిలో.
తేనె - 100 గ్రాములు.
నూనె - వేయించడానకి సరిపడా.

తయారు చేసే విధానం:
మైదాపిండిని చపాతీ పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఖర్జూరాల్లోని గింజలు తొలగించి మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నునే వేడి చేయండి. కలిపి పెట్టుకున్న మైదాపిండిని చతురస్త్రాకారంలో కాస్త మందంగా వత్తాలి. దీనిపై సరిపడా ఖర్జూరాల ముద్దను తీసుకుని ఒక పక్కన మందంగా వేయాలి. మిగతా భాగంతో ఈ మిశ్రమాన్ని మూసేయాలి. వేలితో నొక్కి అతికించాలి. ఇప్పుడది కజ్జికాయలాగా తయారౌతుంది. [ఇంకా... ]

లాలి పాటలు - జో జో జో జో శ్రీ కృష్ణ

జో జో జో జో శ్రీ కృష్ణ

జో జో యని పాడెదాను జో జో జో జో శ్రీ కృష్ణ

పొంగుచూను లాలబోసి అంగరక్ష బెట్టి నీకు

అద్దాల తొట్టెలోన ముద్దుగా పవళింపజేతూ ||జో||

ముంగురులు దువ్వి నీకు ముత్యాల హారమేసి

మొలకును గజ్జాలు కట్టి మురళినీ చేతికిత్తు ||జో|| [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - మధర్ థెరిసా

పేరు : మదర్ థెరిసా.
తండ్రి పేరు : నికలస్ బొజాక్సియొ.
తల్లి పేరు : డ్రానా ఫైల్ బెర్నయ్.
పుట్టిన తేది : 27-8-1910.
పుట్టిన ప్రదేశం : యుగోస్లేవియా.
చదివిన ప్రదేశం : యుగోస్లేవియా.
గొప్పదనం : దరిద్రులకు, రోగులకు, కుష్టురోగులకు తల్లిలా ఆలనా పాలనా చూస్తూ వారి హృదయంలో చెరగని స్థానం సంపాదించినది. ముంబాయిలోని మురికి వాడలను శుభ్రపరచడానికి శ్రమించింది.
స్వర్గస్థురాలైన తేది : 5-9-1997.

'స్కోప్ జీ' పట్టణంలో అల్బేనియా దంపతులు ఉండేవారు.ఆగ్నేస్ తండ్రి పేరు 'నికలస్ బొజాక్సియొ'భవనాలు నిర్మించే కాంట్రాక్టరు. ఆయన భార్య పేరు డ్రానా ఫైల్ బెర్నయ్' వెనిస్ ఫ్రాంతానికి చెందిన స్త్రీ. ఆ దంపతులకు 1910 ఆగస్టు 27వ తేదీన మూడవ బిడ్డ జన్మించింది. [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - హరిద్వార్

భారతదేశంలో అతి పవిత్రస్థలాల్లో ఒకటిగా పేర్కొనబడింది. శివాలిక్ పర్వత పాదాలవద్ద పావనగంగా కుడివైపు తీరంలో అమరియున్న పుణ్యస్థలం. సప్తమోక్షదాయక పురాణాల్లో ఒకటి. దీనినే మాయాపురి, గంగాద్వారం అనే నామంతరాలతో పిలుస్తారు. శైవులు హరద్వారమనీ, వైష్ణవులు హరిద్వారమనీ, వైష్ణవులు హరిద్వారమనీ, భక్తిమేర పిలుచుకొంటూ ఉంటారు. మొత్తం మీద హిందువులకు అతి పవిత్రస్థలం-ముఖ్య యాత్రాస్థలం. సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో గొప్ప సుందర నగరంగా ప్రశస్తిని పొందింది. మహామహుడైన కపిలస్థాన్ పురాతన ప్రసిద్ది. ఒకప్పుడు ఎంతో విశాలమై మైళ్ళ పొడవున వ్యాపించియున్న మహా పట్టణంగా కీర్తించబడి ఉన్నది. ఈ విషయ అబుల్‌ఫజల్ తన గ్రంధములో వ్రాసారు. ఈయన అక్బరు కాలంలో ఈ పట్టణ సందర్శనం చేశారు. [ఇంకా... ]

Monday, March 16

ఎందుకు, ఏమిటి, ఎలా ... - హిప్నాటిజం

హిప్నాటిజం అంటే ఏమిటి, దీనిని ఎవరు కల్పించారు, ఎలా పని చేస్తుంది, ఎందుకు ఉపయోగిస్తారు అనేది మనం తెలుసుకుందాం.

హిప్నాటిజం అంటే సమ్మోహనపరిచే విద్య. ఇంగ్లాండ్ దేశపు డాక్టర్ జేమ్స్ బ్రెయిడ్ దీనికి శాస్త్రీయస్థాయిని కల్పించాడు. మాటల ద్వారా, కంఠస్వరం ద్వారా, ఎదుటివారి మనస్సుపై ప్రభావాన్ని కలుగజేసి, వారి మనస్సులపైన శరీరంపైన వారికి ఆధీనం తప్పింపజేయడమే హిప్నాటిజం అంటే. అలా ఆదీనం తప్పిన వ్యక్తులు నిద్రావస్థలోకి వెళ్ళి తమకు తెలియకుండానే హిప్నాటిస్ట్ ఏం చేయమంటే అది చేస్తారు. హిప్నాటిజం ద్వారా వ్యాధులను నయం చేసే పద్దతిని జర్మన్ దేశస్తుడైన 'ఫెడరిక్ ఆంటోన్ మెస్మర్' కనిపెట్టాడు. దీన్నే 'మెస్మరిజం' అంటారు. శారీరక, మానసిక వ్యాధులను నయం చేయడానికి 'హిప్నోథెరఫీ' ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. [ఇంకా... ]

భక్తి గీతాలు - శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి

శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి
సరోజాలతోనే పూజచేతు ఆ...
గులాబీలతోనే పూజసేతు "శి"

శంభుని రాణి చల్లని చూపు
భక్తావాళి భాధలు బాపు

ప్రార్ధింతుము రేపూ మాపు
గ్రహ బాధలు రూపు మాపు

స్తుతింతును రోజు రోజు
వెన్నెల కాంతులు మాపై నిలుపు [ఇంకా... ]

నీతి కథలు - లంచగొండికి శిక్ష తప్పదు

హేలాపురికి రాజు నవనీత వర్మ. ఆయన జనరంజకంగా పరిపాలన చేసేవాడు. ఆయన పేదలకు ఎంతో సహాయం చేసేవాడు. ఒక రోజున ఒక పేద బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అతని పేరు పుండరీక శర్మ. 'బ్రాహ్మణుడా! నీవు ఏ పని మీద వచ్చావు?' అని అడిగాడు రాజు. అందుకు బ్రాహ్మణుడు ఎంతో వినయంగా చెప్పాడు. 'మహారాజా! నేను కటిక బీదవాడిని. ఆ బాధ భరించలేకుండా ఉన్నాను. దయతో నాకు సహాయం చేయండి' అని వేడుకున్నాడు. రాజుగారు అతని బాధ తెలుసుకున్నారు. అతని వంక పరిశీలనగా చూశారు. అతని బట్టలు చిరిగి ఉన్నాయి. అతని శరీరం సన్నగా ఎముకలు కనిపించేలా ఉంది. రాజు కొంతసేపు ఆలోచించాడు. 'ఇక మీద మీరు రోజూ ఉదయం రండి. నన్ను కలవండి' అని చెప్పాడు మహారాజు. రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు శర్మ. మరుసటి రోజు ఉదయం మహారాజును కలిశాడు శర్మ. 'ఈ ఉత్తరం తీసుకువెళ్ళండి. మా కోశాధికారికి యివ్వండి' అన్నాడు మహారాజు. శర్మ ఆ ఉత్తరం తీసుకుని కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఉత్తరం చూసుకొని కోశాధికారి రెండు వరహాలు శర్మకు ఇచ్చాడు. శర్మకు ఎంతో ఆనందం కలిగింది. [ఇంకా... ]

వంటలు - క్యాప్సికంతో కచోరీలు

కావలసిన వస్తువులు:
కాప్సికమ్ మధ్య సైజువి - అర కేజి.
పుట్నాల పప్పు - 100 గ్రా.
ఎండుమిర్చి - నాలుగు.
ఎండు కొబ్బరి - 25 గ్రా.
ఉప్పు - తగినంత.
వెల్లుల్లి - నాలుగు రెబ్బలు.
నూనె - తగినంత.

తయారు చేసే విధానం :
మొదట పుట్నాలు శుభ్రం చేసుకుని ఎండుమిర్చి కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ కలిపి మిక్సీలో పొడిచేసి ఉంచుకోవాలి. కాప్సికమ్ కడిగి తొడిమల దగ్గర చాకుతో గుండ్రంగా కోసి తొడిమను తీసేసి గింజలన్నిటినీ విదిలించేయాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - క్విజ్

ఈ పోటీలో కనీసం అయిదుగురు పిల్లలు పాల్గొనవచ్చు. తేలికగా అర్ధం చేసుకోగలిగే తేలికపాటి ప్రశ్నలు వేయాలి. వాటి ఉపయోగం చెప్పాలి. లేదా కాగితం పై రాయాలి. అందరికి పలక బలపం లేదా పుస్తకం - పెన్సిల్ ఇవ్వాలి..

ఉదా :ప్రశ్న - సమాధానం
అన్నం - తింటారు
రామ్మా చిలకమ్మ - చూడాలని వుందిలో పాట
పాలు - తాగుతాం
కొబ్బరి నూనె - రాసుకుంటాం
టీ.వీ - చూస్తాం

ఈ ప్రశ్నలకు ఎవరు ఎక్కువ సమాధానాలు చెప్పగలరో వారు విజేత. [ఇంకా... ]

Monday, March 9

పండుగలు - దత్తాత్రేయ స్వామి జయంతి

ఒకసారి లోకకళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికిలోనైన లక్ష్మీ, సర్వస్వతి, పార్వతిమాతలు, మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుతున్నారు. ఈ ఈర్ష్య అసూయ ద్వేషమనే దుర్గుణలకు లోనయితే! దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియచెప్పుటకో: లేక శ్రీదత్తుని అవతారానికి నాంది పలుకుటకో! మరి నారదుని ఆంతర్యమేమిటో?

ఏది అయితేనేమి! ఈ గుణాలూ వారి మనస్సునిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తూలు ఎంతవారించినా, పెడచెవిని పెట్టారు ససేమిరా! అన్నారు. దానికి తోడు ఆ ముగ్గురమ్మలకు ఇంద్రాది దేవతల భార్యలు కూడా వంతపాడారు. [ఇంకా... ]

వంటలు - సోయాబాల్స్

కావలసిన వస్తువులు:
మీల్ మేకర్(సోయా బాల్స్)ఉడికించినవి - ఒక కప్పు .
కార్న్‌ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్‌ .
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూన్‌.
గరం మసాలా - ఒక టీ స్పూన్‌.
సోయాసాస్ - రెండు టీ స్పూన్లు.
మిర్చి - రెండు.
అల్లం, వెల్లుల్లి ముక్కలు - తగినంత .
నూనె - వేయించడానికి తగినంత.
పుదీన, జీడిపప్పు, కొత్తిమీర - తగినంత.

తయారు చేసే విధానం:
మూకుడులో నూనె కాగిన తరువాత చీల్చిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేగించాలి. అందులోనే పుదీనా కూడా వేసి కొద్దిగ వేగిన తరువాత మీల్‌ మేకరు వేయాలి. [ఇంకా... ]

కథలు - మనసు మూలాల్లోకి...

'ఎం.జె.ధన్' అది అక్కడి పేరు. మనకు మేడిచర్ల జగన్నాధం భారతదేశంలో అందులోనూ సంస్కృతికి పట్టుకొమ్మ అయిన ఆంధ్రదేశంలో ఓ పల్లెటూరిలో పుట్టి, డాక్టరుగా ఎదిగిన జగన్నాధం... ముప్పై సంవత్సరాలకు పైబడి మక్కువతో అక్కున చేర్చుకున్న వైద్యవృత్తి కోసం దేశాన్ని, ఊరును వదిలి, తన వైద్య ప్రస్థానంలో జిల్లా రాజధాని నుండి రాష్ట్ర రాజధాని మీదుగా దేశ రాజధానికి ఎదిగి.. ఇంతింతై ఎదిగిన వాడు జగన్నాధం. పేరొందిన డాక్టరై అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇంగ్లండ్‌లను సందర్శించి చివరకు డాక్టర్ ఎం.జె.ధన్ గా లండన్‌లో స్థిరపడ్డాడు.

ఓ రకమైన వేగవంతమైన జీవితానికి అలవాటు పడ్డ జగన్నాధం, అక్కడి సంస్కృతిలోని వాడినీ, వేగాన్నీ బాగానే ఒంట పట్టించుకున్నాడని చెప్పొచ్చు. డాక్టర్‌గా ఓ విధమైన యాంత్రిక జీవితంలో బాగానే ఒదిగిపోయాడు. జనరల్ సర్జన్‌గా రోగులకు తన వంతు సేవ చేస్తూ మంచి డాక్టరుగా పేరు సంపాదించాడు. చొచ్చుకుపోయే నైజం గల జగన్నాధం, లండన్‌లో ఈనాడు ఓ పేరు మోసిన సర్జన్. [ఇంకా... ]

పిల్లల ఆటలు - న్యూస్ పేపర్ క్విజ్

ఎంతమంది ఆడవచ్చు : 8మంది (నలుగురు ఒక బ్యాచ్ చొప్పున).
ఆడే స్థలం : గదిలో గాని, ఆరుబయట గాని.
కావలసిన వస్తువులు : న్యూస్ పేపర్లు 2.
ఆటగాళ్ల వయస్సు : 7 నుండి 8 సం||రాలు మధ్య.

ఈ ఆటలో రెండు టీమ్‌లను ఎంపికచేయాలి. రెండు ఒక దిన పత్రికలను (ఒకే రోజున) రెండు టీమ్‌ల ఆటగాళ్ళతో చదివించాలి. అనంతరం ఆ పేపర్లలో ఆ రోజు వచ్చిన వార్తలపై ప్రశ్నలు వేయాలి. ఏ టీమ్ సరైన సమాధానం చెపితే వారికి మార్కు వస్తుంది. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - హ్యాండ్ బ్యాగ్

నేటి ఆధునిక కాలంలో మహిళల హ్యండ్ బ్యాగ్ వాడకం చాలా పెరిగింది. అన్నిరకాల స్ధాయిల వారికి, చిన్న వారి దగ్గర నుంచి పెద్ద వారి వరకు అందరికీ హ్యండ్ బ్యాగ్ కానీ, పర్సు కానీ వుండాలి. చేతిలో అవి వుంటే వారికి ఇక నిశ్చింత. హ్యాండ్ బ్యాగ్ చేతిలో వుంటే ఒక తోడు వుందన్న అనుభూతి కలుగుతుంది. మహిళల అన్నిటా ఉపయొగపడుతూ నిత్య జీవన వ్యవహారాలలో ప్రముఖ స్ధానంలో నిలుస్తుంది.హ్యండ్ బ్యాగ్, మహిళల వ్యక్తిత్వాన్ని ఇనుమడించే హ్యాండ్ బ్యాగ్ కొనుగోలు గురించి కొన్ని సూచనలు.

. మార్కెట్‌లో రకరకాల మెటీరియల్స్ తో తయారైన వివిధ మోడల్స్‌లో వుండే అందమైన బ్యాగ్‌లు అనేకం లభిస్తున్నాయి. వాటిలో మీ పర్సనాలిటీకి సరిపడే బ్యాగ్‌ను ఎంచుకోవాలి.

. కొంచెం ధర ఎక్కువైనా మంచి మెటీరియల్‌తో తయారైన బ్యాగ్‌లు కొనడం మంచిది. నిత్యవాడకానికి మంచి లెదర్‌బ్యాగ్‌లు అయితే ఎక్కువ కాలం మన్నుతాయి. [ఇంకా... ]

Wednesday, March 4

వ్యాయామ శిక్షణ - నాజూగ్గా ఉండడంకోసం

బాపు బొమ్మలాంటి సన్నని నడుము, తీరైన అవయవ సౌష్టవం ఇప్పుడు అపురూపమైపోయాయి. మారిన పరిస్థితులు, ఆహారపు అలవాట్లలో వచ్చిన పెను మార్పులు నాజూకు శరీరాన్ని దూరం చేస్తున్నాయి. సన్నబడాలంటే తినడం తగ్గించాలి కానీ, కడుపునిండా తినమంటున్నారేమిటి? అని ఆశ్చర్యపోతున్నారా! నచ్చింది తిన్నా నాజూగ్గా ఎలా ఉండవచ్చో చూద్దామా.

సన్నగా కనబడడానికి, సన్నపడడానికి చాలా మంది టీనేజర్స్ పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్‌ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. ఇన్ని తిప్పలు పడినా ఫలితం ఆవగింజలో అరభాగం కూడా వుండడంలేదు. వీరి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కొన్ని రోజుల పాటు కొన్ని రకాల జబ్బులు కూడా వచ్చి పడుతున్నాయి. రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది. [ఇంకా... ]

ఆధ్యాత్మికం - భక్తులను సదా రక్షించే శ్రీ సాయినాధుడు

ఈ భూమిపై ధర్మాచరణకు తీవ్ర విఘాతం కలిగినప్పుడు, ఆధర్మం అవధులు దాటి చెలరేగినప్పుడు, దుష్టశిక్షణ శిష్టరక్షణ, ధర్మసంస్థాపనలను తన సంకల్పంగా చేసుకొని ప్రతీయుగంలోను అవతరిస్తానని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో వివరించాడు. ఆప్రకారంగానే వివిధ యుగాలలో, వివిధ అవతారాలలో, రూపాలలో ఆ పరమాత్మ దివి నుండి భువికి తిరిగివచ్చి తన అవతార కార్యం చేసాడు. అట్లా అవతరించిన పుణ్యపురుషులు, సాధుసత్పురుషులలోకెల్లా అగ్రగణ్యుడు, మహిమాన్విత శక్తివంతుడు, రాజాధిరాజా, యోగులందరికీ సామ్రాట్ వంటివారు. మన సమర్ధ సద్గురువు శ్రీసాయినాధులు. ఈ పవిత్ర భారతావనిలో పంతొమ్మిదవ శతాబ్ధంలో అవతరించి, ఒక పాడుబడిన మశీదును తన నివాసంగా చేసుకోని అనేక లీలలను గావించి, లక్షలాది మందికి జ్ఞానమార్గం చూపించి వారికి చివరికంతా తోడు నీడగా నిలిచిన పరిశుద్ధ పరబ్రహ్మ అవతారం శ్రీసాయి. మనసా, వాచా, కర్మణా తనకు సర్వస్వం శరణాగతి ఒనరించిన భక్తుల లలాట లిఖితాన్ని సైతం తిరగ వ్రాసి వారికి ఇహపరాలను ప్రసాదించిన విశిష్ట గురుదేవులు శ్రీసాయినాధులు. అటువంటి శ్రీసాయి చేసిన కొన్ని లీలలను ఇప్పుడు స్మరించుకుందాం! [ఇంకా... ]

లాలి పాటలు - లాలి పాట

లాలనుచు నూచేరు లలనలిరుగడల
బాల గండవర గోపాల నినుజాల లాలీ లాలీ
ఉదుటు గుబ్బల సరము లుయ్యాలలూగ
పదరి కంకణరవము బహుగతుల మ్రోగ

ఒదిగి చెంపలకొప్పు లొక్కింత వీగ
ముదురు చెమటల నళికములు తొప్పదోగ ||లాలీ||

మలయ మారుతగతులు మాటికి చెలంగ
పలుకు కపురపుతావి పైపై మెలంగ ||లాలీ|| [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - కాశి

పావన గంగాతీరంలో గంగకు ఉపనదులైన వరుణ - అసి నదుల మధ్య ఒద్దికగా అమరియున్న, అమరధామమే బెనారస్, లేక వారణాశి లేక కాశి. "అంతర్ నేత్రాలు తెరిచే వారణాశి 4000 సంవత్సరాల నాటిది". హైందవ సంస్కృతి ప్రచారంలో, వైజ్ఞానికంగాను, చారిత్రకంగాను అనాది నుండి పేరెన్నిక గన్న పట్టణం, కాశీ మహా పుణ్యక్షేత్రము. ఉత్తరప్రదశ్‌లో ఉన్నది. గంగానదికి ఆవలివైపు బెనారస్, వారణాశి అని, ఈవలివైపు కాశి అని పిలువబడుచున్నది. వరుణ ఘట్టమునకు వాసి ఘట్టమునకు మధ్యనున్నది గనుక, దానికి వారణాశి అని పేరు వచ్చినది.

కాశ్యాంతు మరణాన్ముక్తి అను ఆర్యోక్తి ఉన్నది. కాశీలో మరణిస్తే ముక్తి తప్పక లభిస్తుంది అని దీని అర్ధము. ఎటు చూచినా అయిదు క్రోసులున్న ఈ పట్టణంలో, ఏజీవి మరణించినా ఆ సమయమున కుడిచెవి పైకి ఉంటుంది. ఈశ్వరుడు తారక మంత్రోపదేశము చేసి మోక్షము ప్రసాదిస్తాడు. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - బాబూ రాజేంద్రప్రసాద్

పేరు : బాబూ రాజేంద్రప్రసాద్.
తండ్రి పేరు : మహదేవ్ సహాయ.
పుట్టిన తేది : 3-12-1884.
పుట్టిన ప్రదేశం : బీహార్.
చదివిన ప్రదేశం : బీహార్.
చదువు : న్యాయశాస్త్రం.
గొప్పదనం : రైతుల రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించటానికి పాటు పడ్డారు.

రాజేంద్రప్రసాద్ 1884 డిసెంబరు 3న జన్మించారు. తండ్రి మహదేవ్ సహాయ ఆయుర్వేద వైద్యం చేస్తుండేవాడు. రాజేంద్రప్రసాద్ తాతగారు బీహార్ జిల్లాలోని హధువా సంస్థానంలో దివానుగా ఉండేవారు. వారి పూర్వికులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. ఉద్యోగాల అన్వేషణలో తలోకవైపు చెదిరిపోయారు. రాజేంద్రప్రసాద్‌కి చిన్నతనము నుంచి బీదల యెడల ఎంతో సానుభూతి ఉండేది. అతని తండ్రి వైద్యం చేస్తున్నప్పుడు ఆయన ఒళ్ళో కూర్చోని రోగులను పరిశీలిస్తూ ఉండేవాడు. [ఇంకా... ]