Monday, November 30

నృత్యం - జానపద నృత్యాలు

అసంఖ్యాక జాతులతోనూ పతిస్థితులతోనూ కూడి ఉన్న భారతదేశం అనేక శతాబ్దాలుగా రకరకాల జానపద నృత్యాలకు నిలయంగా ఉంది. భారతదేశంలోని నేటి శాస్త్రీయ నృత్య విధానాలు చాలా కట్టుబాట్లకు లోబడి ఉండటంతోపాటు ఎంతో నాజూకుతనాన్ని చూపుతున్నది. ఆటవికుల గూడెములోనూ కర్షకుల కుటీరాలలోనూ నేటికి తమ పాటవాన్ని కోల్పోకుండా బ్రతికి ఉన్న సామాన్య ప్రజా నృత్యాలనుండి మన శాస్త్రీయ నృత్యాలు పుట్టాయి. భారతీయ జానపద నృత్యాలలో నిరాడంబరమైన సరళత ఉంది. వాటి సరళత వెనుక మహత్తర కళాభావాలు రెండు ఉన్నాయి. సహజమైన భావగాంభీర్యం, విస్పష్టమైన వ్యక్తీకరణ ఉన్నాయి. జానపద నృత్యానికి, దానినుండి ప్రధానంగా ఉధ్భవించిన శాస్త్రీయ నృత్యానికి ఉన్న భేదం రీతిలోనే. జానపద నృత్యంలో కళారీతిని ప్రయత్నం పూర్వకంగా తెచ్చుకోవటం అంటూ ఉండదు. ఇందుచేతనే జానపద నృత్యంలో చిరకాలం నుంచి వస్తున్న ప్రబలమైన సంప్రదాయాలు ఉన్నప్పటికీ అది స్వయం ప్రేరణతో... [ఇంకా... ]

Thursday, November 26

విజ్ఞానం - న్యాయ వ్యవస్థ

1. సుప్రీం కోర్ట్
2. హైకోర్ట్
3. సబార్డినేట్ కోర్ట్
4. మేజిస్ట్రేట్ కోర్ట్
5. ఫ్యామిలీ కోర్ట్
6. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్
భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది హైకోర్టులపై నియంత్రణాధికారం కల్గిఉన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను... [ఇంకా... ]

Tuesday, November 24

సౌందర్య పోషణ - ఆకర్షించే గలగల గాజులు

. చేతులకు ధగధగమని మెరిసే బంగారు గాజులు ఎన్ని వున్నా వాటి మధ్యలో మట్టిగాజులు వేసుకుంటేనే వాటికి మరింత నిగారింపు వస్తుంది.
. పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు రెండు చేతులకూ రంగురంగుల మట్టిగాజులు వేసుకుంటే మహిళల చేతులు కళకళలాడుతూ ఆకర్షణీయంగా వుంటాయి.
. చిన్నపిల్లలకైతే మట్టి, పింగాణీతో చేసిన గాజులు వేయడం కన్నా ప్లాస్టిక్, రబ్బరు, మెటల్, బంగారంతో చేసిన గాజులే భద్రంగానూ, చూడముచ్చటగానూ వుంటాయి.
. చిన్నపిల్లలకు సన్నటి గాజులు నాలుగైదు వేయడంకన్నా... [ఇంకా... ]

Monday, November 23

సాహిత్యం - జాతీయాలు

తెలుగు నేర్చుకోవాలనుకునేవారు వాడుక భాషలోని కొన్ని పదాల అర్ధాలను తెలుసుకోవడం అవసరమని భావిస్తూ మనం నిత్యం మట్లాడే కొన్ని పదాల వివరణలను ఇప్పుడు ఇస్తున్నాం. ఈ మాటలు ఏ సందర్భంలో అనాలో తెలిసినప్పటికీ గమ్మత్తైన ఈ పదాలు అసలు ఎలా పుట్టాయో తెలుసుకోవడం విఙాఞనదాయకంగానూ, వినోదాత్మకంగానూ ఉంటుంది. తెలుగు భాషకు మాత్రమే సొత్తైన ఈ పదాలను, పదబంధాలను జాతీయాలు అంటారు. మీక్కూడా తెలీకుండా అలవోకగా మీరు అనే ఈ జాతీయాల వివరణలోకి ఇప్పుడు వెళ్దాం.
జాతీయం అంటే?
ఒక జాతి ప్రజ ఒకభావాన్ని ప్రకటించడంలో వ్యక్తం చేసే భాషాపరమైన విలక్షణత. దీన్నే పలుకుబడి అని కూడా అంటారు. "ఓరంతపొద్దు, ఓడలు బండ్లు బండ్లోడలు, గుండెరాయి చేసుకొను, చెవిలో ఇల్లుగట్టుకొనె పోరు, కాలికి... [ఇంకా... ]

Saturday, November 21

జానపద కళారూపాలు - ఉపోద్ఘాతం

తెలుగు నాటక రంగం ఆవిర్భవించి నూరేళ్ళు దాటింది.ఈ నూరేళ్ళుగా వినోదాన్ని నాటకాలనుండి పొందుతున్నాం. సినిమా రాకముందూ, సినిమా వచ్చాకా కూడా సగటు మానవుడి దృష్టి నుంచి నాటక రంగం ఏనాడూ దూరం కాలేదు. ప్రజల అంతరాంతరాల్లో నాటుకు పోయిన ఈ జీవ కళ ఆవిర్భవించకముందు అంటే వంద సంవత్సరాలకు పూర్వం మానవుడు విజ్ఞానం, వినోదాలకోసం ఏం చేసేవాడు? అని ప్రశ్న ఉదయిస్తే దానికి సమాధానం ఎవరో కొద్ది మంది దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ కొద్దిమంది కూడా మేధావులేమీ కాదు. సామాన్య మానవులు మాత్రమే వాళ్ళు. ఆ సామాన్య మానవులు కూడా గ్రామీణ నేపధ్యం కలవారు లేక గ్రామీణ సంప్రదాయం పట్ల అభిమానం కలవారు మాత్రమే. వారిని పలకరిస్తే... [ఇంకా... ]

Thursday, November 19

వ్యక్తిత్వ వికాసం - అతివ - ఆత్మవిశ్వాసం

అతివల్లో ఆత్మవిశ్వాసం పెరగాలంటే ముందుగా వాళ్ళని వారు విశ్వసించాలి. ఆత్మ విశ్వాసం పెరగాలంటే అందుకు అనేక బలాలు దోహదం చెయ్యాలి. ముందుగా వారిలో ఆలోచనా జ్ఞానం పెంపొందాలి. స్వతంత్రంగా ఆలోచించడం అలవరుచుకోవాలి. అందుకు కొన్ని సూచనలు పాటించాలి... మిమ్మల్ని గురించి మీరు బాగా తెలుసుకోండి. మీ సంపదలను లెక్కవేయండి. మీ ఇల్లు, మీ కుటుంబం, స్నేహితులు, మీ సక్రమ ఆలోచనలు, భగవంతునితో మీకున్న విశ్వాసం మొదలైన వాటిని... [ఇంకా... ]

Wednesday, November 18

జానపద గీతాలు - చల్ మోహనరంగా...

నీకు నీవారు లేరు నాకూ నా వారు లేరు
ఏటి ఒడ్డున ఇల్లు కడదము పదరా చల్ మోహనరంగా
నీకు నాకు జోడు కలసెను గదరా
మల్లె తోటలోన మంచినీళ్ళ బావికాడ
ఉంగరాలు మరచి వస్తిని కదరా || చల్ ||... [ఇంకా... ]

Tuesday, November 17

ఆహార పోషణ - ఏ విటమిన్ ఎక్కడ దొరుకుతుంది?

నీటిలో కరిగే విటమిన్లు
విటమిన్--రసాయనిక నామము------లభించే పదార్ధాలు------ నూన్యత వలన కలిగే వ్యాధులు
బి 1--- ధయామిన్--- గోధుమ వంటి ధాన్యాలు, వేరుశనగ...--- బెరి బెరి, ఆకలి మందగించటం
బి 2--- రైబోఫ్లేవిన్--- పాలు, గుడ్లు, కాలేయము....--- నోటిపూత, నోటి మూలల్లో పగలటం
బి 6--- పైరిడాక్సిన్--- పాలు, కాలేయము, మాంసము...--- రక్తహీనత, ఉద్వేగము, నాడి మండలంలో... [ఇంకా... ]

Monday, November 16

నీతి కథలు - పేదరాశి పెద్దమ్మ కథ

అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉందట. పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచి మనువులు చూసింది. తను దాచుకున్నవి తలోకాస్త ఇచ్చి వేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కదా! కనుక ఒక్కో కూతురి ఇంట మూడు మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పు పని లేదు. హాయిగా గడచిపోతూంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒక రోజు రెండవ కూతురు ఇంటికి బయలు దేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో... [ఇంకా... ]

Thursday, November 12

వంటలు - బందర్ హల్వా

కావలసిన వస్తువులు:
గోధుమపిండి - 1 కిలో.
జీడిపప్పు - 100 గ్రా.
బెల్లం - 1 కిలో.
నెయ్యి - 700 గ్రా.
యాలుకల పొడి - 30 గ్రా.
రెడ్ కలర్ - చిటికెడు.
చాక్లెట్ కలర్ - చిటికెడు.

తయారు చేసే విధానం :
గోధుమపిండిని సరిపడినన్ని నీళ్ళతో ముద్దలా చేసి ఒక గిన్నెలో... [ఇంకా... ]

Wednesday, November 11

భరతమాత బిడ్డలు - మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌

మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్ భారత స్వాతంత్ర్యం కోసం పరితపించిన వ్యక్తిగా, మత ప్రాతిపదికన భారతదేశం విడిపోవటాన్ని వ్యతిరేకించిన నిజమైన భారతీయునిగా, స్వాతంత్ర్యానంతర భారతదేశంలో సాహిత్యం, విద్యా వికాసాలకొరకు కృషి చేసిన వ్యక్తిగా, దేశభక్తికి మతాలు అడ్డురావని నిరూపించిన వ్యక్తి మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్.

సౌదీ అరేబియా దేశంలోని 'మక్కా' లో 1888 సంవత్సరంలో భారతీయ వ్యక్తి, అరబ్ యువతిల సంతానంగా మౌలానా అబుల్ కలామ్‌ జన్మించారు. మహమ్మదీయ సాంప్రదాయ పద్దతిలో విద్యాభ్యాసం జరిపినప్పటికి మౌలానా రహస్యంగా... [ఇంకా... ]

Monday, November 2

భక్తి సుధ - శ్రీ శివపంచాక్షరీ స్తోత్రమ్

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ|
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ|
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ|
తస్మై మకారాయ నమశ్శివాయ|
మందాకీని సలిల చందన చర్చితాయ|
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ|
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ|
తస్మై మకారాయ మకారాయ నమశ్శివాయ|... [ఇంకా... ]