Saturday, August 14

సంస్కృతి, సాంప్రదాయాలు - స్వాతంత్ర్య దినోత్సవం

"దెబ్బతీయడం గొప్ప కాదు, దెబ్బను సహించడం గొప్ప. అందుకు ఎంతో ఆత్మస్థైర్యం కావాలి" అని నిరూపించిన మహాత్మా గాంధి అడుగుజాడలు ప్రతి భారతీయునికీ మార్గదర్శకాలు. దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి ఒక స్థిరమైన ఆశయంతో వచ్చిన ఆయన అడుగు వెంట జాతి యావత్తూ అడుగులేసింది. అప్పటివరకు స్వతంత్ర భారతదేశం కోసం ఓ ప్రణాళిక అంటూ ఏదీ లేక అస్తవ్యస్తంగా చిత్తమొచ్చినట్లు నడిచిన భారత ప్రజలకి ఆయన అడుగుజాడలే దిశా, నిర్దేశాలయ్యాయి. అవే ఆదర్శనీయాలయ్యాయి. ప్రజాగ్రహం స్థానంలో సత్యాగ్రహం; ఆక్రోశం, ఆవేశాల స్థానంలో అహింసను ఆయుధాలుగా ఆయన మలచిన తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యచకితుల్ని చేసింది. అప్పటివరకు తాము ఆడిందే ఆటగా భావించిన బ్రిటిష్ ప్రభుత్వానికి ఆట కట్టించినట్లయ్యింది. అది వ్యక్తి సత్యాగ్రహం కావచ్చు, దండి సత్యాగ్రహం కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, క్విట్ ఇండియా కావచ్చు ... ఆయన చేపట్టిన ఏ ఉద్యమానికైనా ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. వందే మాతరం అంటూ ముక్తకంఠంతో సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. [ఇంకా... ]