Sunday, October 17

పండుగలు - దుర్గాష్టమి, మహర్నవమి, దసరా/విజయదశమి

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది. [ఇంకా... ]

Saturday, October 2

పండుగలు - గాంధి జయంతి

గాంధి! ఈ పేరు స్ఫురణకు రాగానే చంటి పిల్లలనుంచి చరమాంకానికి చేరువవుతున్న వృద్ధుల వరకు ఒకే భావన ఉప్పొంగుతుంది. మన "బాపు" అంటూ ప్రతి ఇంటా ఆ పేరు జేగంటై మ్రోగుతుంది. ఆయన గురించి అందరి అభిప్రాయం ఒక్కటే. ఆయన మహాత్ముడు. మహా వైశాల్యంగల ఒక దేశ ప్రజానీకాన్ని ఒకే తాటిపై నడిపించగలిగిన మహిమాన్వితుడు. తనపట్ల ఏకైక భావనను ఏక కాలంలో కలిగేట్లు చేయగలిగిన సమ్మోహన శక్తి కలిగిన గాంధి ప్రపంచ దేశాల్లోనూ అదే విధమైన అభిమానాన్ని పొందినవాడు కావడం ఒక చారిత్రక విప్లవం. ఇది మరే ఇతర నాయకుడికీ సాధ్యంకాని మహాద్భుత విశేషం. ఒక సాధారణ మనిషి అసాధారణ స్థాయికి ఎలా ఎదగగలిగాడు? ఏ ప్రతిఫలాపేక్షను ఆశించి తెల్ల దొరతనాన్ని ప్రశ్నించాడు? ఏ లక్ష్యం కోసం వారిని ప్రతిఘటించాడు? అని ప్రతి భారతీయుడూ ఈ ప్రశ్న కోసం సమాధానం వెదుక్కుంటే తాను తన దేశానికి ఏం చెయ్యాలో బోధపడుతుంది. [ఇంకా... ]