Sunday, October 17

పండుగలు - దుర్గాష్టమి, మహర్నవమి, దసరా/విజయదశమి

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది. [ఇంకా... ]

Saturday, October 2

పండుగలు - గాంధి జయంతి

గాంధి! ఈ పేరు స్ఫురణకు రాగానే చంటి పిల్లలనుంచి చరమాంకానికి చేరువవుతున్న వృద్ధుల వరకు ఒకే భావన ఉప్పొంగుతుంది. మన "బాపు" అంటూ ప్రతి ఇంటా ఆ పేరు జేగంటై మ్రోగుతుంది. ఆయన గురించి అందరి అభిప్రాయం ఒక్కటే. ఆయన మహాత్ముడు. మహా వైశాల్యంగల ఒక దేశ ప్రజానీకాన్ని ఒకే తాటిపై నడిపించగలిగిన మహిమాన్వితుడు. తనపట్ల ఏకైక భావనను ఏక కాలంలో కలిగేట్లు చేయగలిగిన సమ్మోహన శక్తి కలిగిన గాంధి ప్రపంచ దేశాల్లోనూ అదే విధమైన అభిమానాన్ని పొందినవాడు కావడం ఒక చారిత్రక విప్లవం. ఇది మరే ఇతర నాయకుడికీ సాధ్యంకాని మహాద్భుత విశేషం. ఒక సాధారణ మనిషి అసాధారణ స్థాయికి ఎలా ఎదగగలిగాడు? ఏ ప్రతిఫలాపేక్షను ఆశించి తెల్ల దొరతనాన్ని ప్రశ్నించాడు? ఏ లక్ష్యం కోసం వారిని ప్రతిఘటించాడు? అని ప్రతి భారతీయుడూ ఈ ప్రశ్న కోసం సమాధానం వెదుక్కుంటే తాను తన దేశానికి ఏం చెయ్యాలో బోధపడుతుంది. [ఇంకా... ]

Friday, September 10

పండుగలు - రంజాన్

పవిత్రతే పరమపదసోపానంగా ముస్లిం సోదరులు భావించే మాసం రంజాన్. రంజాన్ మాసంలో పసిపిల్లలనుంచి పెద్దవారి వరకు హృదయాలు పవిత్ర భావనతో నిండిపోతాయి. మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు దైవం పంపిన పరమ పవిత్రమైన "ఖురాన్" గ్రంధం అవతరించిన మాసమిది. అందుకే ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.

ఆత్మ ప్రక్షాళనకు త్రికరణశుద్ధితో ఉపవాసం ఉండడమే ఎకైక మార్గమని బోధించిన దేవుని ఆదేశానుసారం గురువారం సాయంత్రం నెల పొడుపును చూసిన తరువాత శుక్రవారం సూర్యోదయ సమయంలో జరుపుకునే 'సహరీ'తో ఉపవాసాలు ప్రారంభమవుతాయి. [ఇంకా... ]

పండుగలు - వినాయక చవితి

శ్రీ వినాయక వ్రతకల్పము:

మన దేశంలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయనన్నే. పూర్ణకుంభంలాంటి ఆ దేహం, బాన వంటి కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే ఆత్మలోని చమత్కారం. ఆ పొట్టను చుట్టి ఉండే నాగము (పాము) శక్తికి సంకేతం. నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశములు బుద్ధి, మనసులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే. [ఇంకా... ]

Saturday, September 4

పండుగలు - ఉపాధ్యాయ దినోత్సవం

నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి

ఐనా ఆదియుగంనుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి

జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు

సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు

అతడు... ఉపాధ్యాయుడు - సృష్టి స్థితి లయల నిర్దేశకుడు !

పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠశాలకూ, పాఠ్య బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయుడికీ సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టకూడదు. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలేదు. బ్రతుకుతెరువుకోసం పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది. అనిర్వచనీయమైనది. ఆయన తరగతిలో చెప్పే ప్రతి పాఠమూ ఒక సూక్తి వంటిది. [ఇంకా... ]

Wednesday, September 1

పండుగలు - కృష్ణాష్టమి

శ్రీ ముఖనమ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు. అంటే! (క్రీస్తు పూర్వం 3228వ సం||)

జయతు జయతు దేవో దేవకీ నందనోయం

జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః

జయతు జయతు మేఘ శ్యామలః

కోమలాంగో జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః|| [ఇంకా... ]

Saturday, August 14

సంస్కృతి, సాంప్రదాయాలు - స్వాతంత్ర్య దినోత్సవం

"దెబ్బతీయడం గొప్ప కాదు, దెబ్బను సహించడం గొప్ప. అందుకు ఎంతో ఆత్మస్థైర్యం కావాలి" అని నిరూపించిన మహాత్మా గాంధి అడుగుజాడలు ప్రతి భారతీయునికీ మార్గదర్శకాలు. దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి ఒక స్థిరమైన ఆశయంతో వచ్చిన ఆయన అడుగు వెంట జాతి యావత్తూ అడుగులేసింది. అప్పటివరకు స్వతంత్ర భారతదేశం కోసం ఓ ప్రణాళిక అంటూ ఏదీ లేక అస్తవ్యస్తంగా చిత్తమొచ్చినట్లు నడిచిన భారత ప్రజలకి ఆయన అడుగుజాడలే దిశా, నిర్దేశాలయ్యాయి. అవే ఆదర్శనీయాలయ్యాయి. ప్రజాగ్రహం స్థానంలో సత్యాగ్రహం; ఆక్రోశం, ఆవేశాల స్థానంలో అహింసను ఆయుధాలుగా ఆయన మలచిన తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యచకితుల్ని చేసింది. అప్పటివరకు తాము ఆడిందే ఆటగా భావించిన బ్రిటిష్ ప్రభుత్వానికి ఆట కట్టించినట్లయ్యింది. అది వ్యక్తి సత్యాగ్రహం కావచ్చు, దండి సత్యాగ్రహం కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, క్విట్ ఇండియా కావచ్చు ... ఆయన చేపట్టిన ఏ ఉద్యమానికైనా ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. వందే మాతరం అంటూ ముక్తకంఠంతో సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. [ఇంకా... ]

Friday, June 11

ఎందుకు, ఏమిటి, ఎలా ... - పిల్లి - పులి కళ్ళు

రాత్రి వేళల్లో కాంతి పడితే పిల్లి - పులి కళ్ళు లాంటి జంతువుల కళ్ళు మెరుస్తాయెందుకు అనే విషయం మీకు తెలుసా ! తెలియకపోతో ఇది ఓక సారి చదవండి.
పిల్లి, పులి లాంటి జంతువుల కను గుడ్డు పై భాగంలో... [ఇంకా... ]

వంటలు - బాదంపాక్

కావలసిన వస్తువులు:
బాదంపప్పులు - అరకిలో.
నెయ్యి - 300 గ్రాములు.
పంచదార - 400... [ఇంకా... ]

Thursday, June 10

భరతమాత బిడ్డలు - దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

స్వాతంత్ర యోధులలో ఇతడొక ప్రముఖ ఆంద్రుడు. ఇతనిని "ఆంద్రరత్న" అని అంటారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 1889లో కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు అనే గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే ఇతని తల్లిదండ్రులు మరణించారు. అందుకని ఇతని పినతండ్రి పోషణలో విద్యావంతుడైనాడు. ఇతనికి "దుర్గాభవానమ్మ"తో చిన్న వయస్సులోనే... [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక -  సెలవుల్లో నాజూకు పొందటం కోసం...

సెలవులు వస్తే పెద్దా చిన్నా అందరికీ ఆటవిడుపే. విందులు, వినోదాలకు హద్దు ఉండదు. ముఖ్యంగా తినే చిరుతిళ్ళకు లెక్కలేదు. డైట్ గురించి అస్సలు పట్టించుకోరు. దాంతో లావవుతారు. ఆరోగ్యకరమైన ఆహారప్రణాళిక లేకుండా తినడం వల్ల పెరిగిన లావు కాస్తా ముందు ముందు భారీ కాయంగా మారే ప్రమాదం వుంది. ఈ టైములో... [ఇంకా... ]

Wednesday, June 9

దేశభక్తి గీతాలు - కోహినూరు

తెనుగు తల్లీ! నీకు జోహారు
దేశమాతా! నీకు జేజేలు
నిను జూచి నిను బాడి నిను గొల్పు వేళ నా
కను లాణిముత్యాల గనులుగా నగు నహొ! ||తెనుగు తల్లీ!||
నీ పాలు జుంటి తేనియల తేటలో... [ఇంకా... ]

వంటలు - కాకరకాయ వేపుడు

కావలసిన వస్తువులు:
కాకరకాయలు - పావు కిలో.
కారం - తగినంత.
ఉప్పు - తగినంత.
నూనె - వేయించడానికి ... [ఇంకా... ]

Monday, June 7

సంస్కృతి, సాంప్రదాయాలు - భక్తి గీతాలు

రామరామ రఘురామ అని పాడుతున్న హనుమా...

భక్తి సుధ - హనుమాన్ చాలీసా

ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం ||
తరుణార్క ప్రభోశాన్తం రామదూతం నమామ్యహం ||
శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం... [ఇంకా... ]

దేవుళ్ళ చిత్రపటాలు

ఆంజనేయ స్వామి

పండుగలు - హనుమజ్జయంతి

మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత విశేషాలు ఏమిటో సమీక్షగా తెలుసుకుందాం! వీటిలోను అనేక విభిన్న గాధలు కానవసన్నాయి.
ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట... [ఇంకా... ]

Saturday, June 5

వ్యాయామ శిక్షణ - బరువు తగ్గించేందుకు పంచసూత్రాలు

కళ్లెదురుగా ఘుమఘుమ వాసనల వేపుళ్లు... సమోసాలు... కాని తింటే బరువు పెరుగుతామన్న బాధ... అయినా సరే తినాలన్న కోరికకు కళ్లెం వేయలేక కేలరీలు పెంచుకునేవాళ్లు ఎంతోమంది ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అలాంటి పదార్థాలు కనిపించకుండా జాగ్రత్త తీసుకోవడం మేలు కదూ. అతిగా తినడాన్ని ప్రోత్సహించే పరిసరాలు లేకుండా చూస్తే చాలావరకుబరువు తగ్గించుకునేందుకు వీలవుతుంది. కేలరీలు పెంచే ఆహరం తీసుకోవాలనే కోరికను అదుపులో ఉంచడానికి సహయపడేందుకే ఈ అయిదు చిట్కాలు...
కేలరీలను పెంచేవి, మీకు బాగా ఇష్టమైనవి అయిన పదార్థాలను అన్నింటికన్నా... [ఇంకా... ]

Friday, June 4

పిల్లల ఆటలు - అయిస్ - బాయ్

ఎంతమంది ఆడవచ్చు : పది మందిలోపు పాల్గొనవచ్చు.
ఈ ఆటలో ముందుగా పంటలేసి దొంగైన బాలుడు 15 లేదా 20 అడుగుల దూరం... [ఇంకా... ]

లాలి పాటలు - జో అచ్యుతానంద

జో అచ్యుతానంద జోజో ముకుందా
రార పరమానంద రామ గోవిందా ||జోజో||
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగా
నందముగ వారిండ్ల నాడుచుండగ
మందలకు దొంగ మా ముద్దురంగ ||జోజో||... [ఇంకా... ]