Monday, August 13

పిల్లల పాటలు - చెన్నాపట్నం చెరుకుముక్క

చెన్నాపట్నం - చెరుకూముక్క
నీకో ముక్క - నాకో ముక్క
భీమునిపట్నం - బిందెల జోడు
నీకో బిందె - నాకో బిందె
కాశీపట్నం - కాసుల పేరు
నీకో కాసు - నాకోకాసు [ ఇంకా...]

వ్రతములు - సంపద శుక్రవారపు వ్రతము

ఒక బ్రాహ్మణునకు ఏడుగురు కొడుకులు గలరు. వారందరకు వివాహములయి భార్యలు కాపురమునకు వచ్చుటచే, వేరింట కాపురములు చేయుచుండిరి. ఒకనాడు ప్రొద్దుట శుక్రవారము మహాలక్ష్మీ సంచారముచేయుచు ఆ బ్రాహ్మణుని కోడండ్ర యిళ్ళకు వెళ్లెను. ఒక కోడలు ప్రొద్దుటనే పిల్లలకు భోజనముపెట్టి తానుగూడ తినుచుండెను.ఇంకొక ఆమె పాచి వాకిలో పేడవేసుకొనుచుండెను. వేరొక కోడలు పాతగుడ్డలను కుట్టుచుండెను. మరొక కోడలు పాచి వాకిలిలో వడ్లు దంపుచుండెను. ఇంకనొక్కకోడలు కటికచీకటియందే తలదువ్వుకొనుచుండెను. [ ఇంకా... ]

Saturday, August 11

వ్రతములు - గాజుల గౌరి వ్రతము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
ఒక బ్రాహ్మణపడుచు అడవిలో కూర్చుని యేడ్చుచుండెను. భూమిపరిపాలనకు వచ్చిన పార్వతీపరమేశ్వరులా చిన్నదానిని "ఎందుకమ్మా ఏడ్చుచున్నావు?" అని అడిగి అందుకామె "నాకష్టము నేమని చెప్పను? ఇంతవరకు నాతో నింతతియ్యగా మీరుతప్ప నెవ్వరును మాట్లాడలేదు. నేను పుట్టినది మొదలు నాతల్లిదండ్రులు నన్ను చూచి చిటపటలాడెడివారు. [ ఇంకా...]

వంటలు - కొబ్బరి చెక్కలు

కావలసిన వస్తువులు:
కొబ్బరి చిప్పలు - 2.
బియ్యం - 1/2 కేజి.
నెయ్యి - 1/4 కేజి.
శనగపప్పు - 1/2 కప్పు.
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్.
కరివేపాకు - 1 కట్ట.
కొత్తిమీర - 1 కట్ట.
పచ్చిమిర్చి - 10.
ఉప్పు - తగినంత.
పసుపు - చిటికెడు.
నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం:
ముందుగా బియ్యాన్ని ఓ నాలుగు గంటలపాటు నీళ్ళల్లో నానబెట్టి తీసి జల్లెడ పళ్ళెం సాయంతో నీరు తీసేసి మిక్సీలో వేసి పిండి చేసుకోవాలి. [ ఇంకా
...]

వంటలు - కాలీఫ్లవర్‌ పకోడి

కావలసిన వస్తువులు:
కాలీఫ్లవర్ - ఒకటి (చిన్న చిన్న ముక్కలుగా విడదీయాలి).
అల్లం - చిన్నముక్క (సన్నగా తరగాలి).
కొత్తిమీర తురుము - 1 టేబుల్‌ స్పూను.
ఉప్పు - తగినంత.
ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరగాలి).
పచ్చిమిర్చి - 6 (సన్నగా తరగాలి).
గరం మసాలా - అర టీ స్పూను.
నూనె వేయించడానికి - సరిపడా.
శనగపిండి - పావు కిలో.

తయారుచేసే విధానం:
శనగపిండిలో కొత్తిమీర తురుము, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా అన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుగా కాకుండా గట్టిగా కలపాలి. [ ఇంకా
...]

పిల్లల పాటలు - అ ఆ ల పాట..

అ ఆ లు దిద్దుదాము... అమ్మమాట విందాము
ఇ ఈ లు చదువుదాము - ఈశ్వరుని కొలుద్దాము
ఉ ఊ లు దిద్దుదాము - ఉడతలను చూద్దాము
ఎ ఏ ఐ అంటూ అందరినీ పిలుద్దాము [ ఇంకా
...]

పుణ్యక్షేత్రాలు - బదరీనాధ్

బస్సు ప్రయాణములో మేఘములు మన శరీరానికి తగులుతూ, ఊర్ద్వలోక విహారానుభూతిని కలిగిస్తాయి. ఉత్సాహముతో ఎంతో ఆనందముతో ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ బదరీ చెరుకోవాలి. ఇచ్చట వాతావరణం అతి శీతలముగా ఉండును. మంచుతో నిండియున్న ఆ ప్రదేశంలో చలికి తట్టుకోవడం చాలా కష్టం.
బదరీ గద్వాల్ దేశములో ఉన్నది. బదరీని 'విశాలపురం' అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశము రేగువనముతో నిండి ఉన్నందున బదరీ అని పేరు వచ్చెను "బదరీ విశాల్ కి జై" అని భక్తులు అంటూ ఉంటారు. ఇచ్చట భగీరధుడు వేయి సంవత్సరములు తపమాచరించినాడు. నగరు చక్రవర్తి తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములు చేసి, నూరవ యాగాశ్వాన్ని విడ్డిచిపెట్టినాడు. అది సఫలీకృతమైతే, అతనికి దేవేంద్రపదవి లభిస్తుంది. [ ఇంకా
...]

Friday, August 10

పండుగలు - వినాయక చవితి

పూజా విధానం
ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినమిది. మహా గణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు ఇది. ప్రతి ఏటా భాద్రపద చవితి రోజున వచ్చే పండుగ ఇది. మధ్యాహ్నం చవితి (చతుర్థి) ఉన్న రోజునే 'వినాయక చవితి'ని జరుపుకోవాలి.
శాస్త్రోక్తంగా, మట్టితోగానీ లేదా వెండి వంటి లోహాలతోగానీ తయారు చేసిన గణపతి ప్రతిమని అర్చించాలి. దూర్వాలు, బిల్వాలు (మారేడు) గణపతికి ప్రీతికరాలు. కనుక వాటితో అర్చించాలి. అవేకాక, శాస్త్రంలో చెప్పబడ్డ 21 పత్రులతో పూజించాలి. ఇవన్నీ ఔషధీయ విలువలున్న పత్రులు. [ ఇంకా
...]

సౌందర్య పోషణ - ఆరోగ్యం

  • తేనెతో కలిపి నిమ్మకాయ రసం పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
  • దాహంగా అనిపించకపోయినా తరచుగా నీరు తాగుతూ ఉండాలి. అప్పుడే శరీరానికి అవసరమైన ద్రవపదార్ధాలు అందుతాయి. కూల్‌డ్రింకుల కన్నా కొబ్బరి నీరు, పండ్లరసాలు మంచిది. [ ఇంకా...]

భక్తి గీతాలు - తిరుమల గిరువాస

తిరుమల గిరివాసా దివ్యమందహాస 2
వరదాభయ లీలావిలాసా నవ్యచిద్విలాసా తిరు
మాకనుబొమ్మలే ఆలయమనుకోని మామనసే నీమందిరమనుకొని
మందార సుజన మందార నీదాసులందరిలో మమ్మధికులజేసేవా
సిరిగలవాడవు నీవని సరసుడవని దరిజేరగా [ ఇంకా
...]

వంటలు - ఇడ్లీ ఉప్మా

కావలసిన వస్తువులు:
సాద ఇడ్లీలు - 10.
తాజా కొబ్బరి - అర కప్పు.
మినపప్పు - 2 టీ స్పూన్లు.
ఎండుమిర్చి - 4.
కరివేపాకు - 2 రెమ్మలు.
పసుపు - పావు టీ స్పూను.
జీడిపప్పు - పది.
ఉప్పు - తగినంత.
ఆవాలు - అర టీ స్పూను.
నూనె - 4 టీ స్పూన్లు.

తయారు చేసే విధానం :
ఇడ్లీల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. [ ఇంకా
...]

వంటలు - ఉల్లి దోసె

కావలసిన వస్తువులు:
మినపప్పు - అర కిలో.
బియ్యం - 1 కిలో.
నూనె - పావు కిలో.
ఉప్పు - తగినంత.
ఉల్లిపాయలు - తగినన్ని.

తయారుచేసే విధానం:
దోసెల్ని రేపొద్దున వేసుకోవాలి అంటే ఈ రోజు ఉదయమే పప్పు బియ్యం విడివిడిగా నానేయాలి. [ ఇంకా
...]

వంటలు - అలూతో చక్రాలు

కావలసిన వస్తువులు:
బియ్యపు పిండి - 1 కిలో.
బంగాళదుంపలు - 1/2 కిలో.
వాము - 50 గ్రాములు.
కారం - తగినంత.
ఉప్పు - తగినంత.
డాల్డా లేక నెయ్యి- 100 గ్రాములు.
నువ్వులు - 50 గ్రాములు.
నూనె - 1 కిలో.

తయారు చేసే విధానం :
బంగాళదుంపలను బాగా ఉడికించుకోవాలి. తొక్కలు తీసివేసి మెత్తగా చేయాలి. [ ఇంకా...]

పిల్లల పాటలు - వాన పాట

వానా వచ్చి వంకలు సాగె
గువ్వా వచ్చి గుడ్లూ పెట్టె
తాతా వచ్చి తొంగి చూసె
అవ్వా వచ్చి గుడ్డూ తీసె
అమ్మా వచ్చి అట్టు వేసె
నాన్నా వచ్చి గుటుక్కుమింగె [ ఇంకా...]

Thursday, August 9

వంటలు - తీపి కాజాలు

కావలసిన వస్తువులు:
మైదా - 500 గ్రా.
డాల్డా - 200 గ్రా.
తినేసోడా - 1 టీ స్పూను.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
బెల్లం - 300 గ్రా.
యాలుకల పొడి - 1 టీ స్పూను
నెయ్యి -50 గ్రా.

తయారు చేసే విధానం:
మైదా, సోడా, డాల్డాలను సరిపడినన్ని నీళ్లలో చక్కగా కలిపి ముద్దగా చేసుకోవాలి. [ ఇంకా
...]

వంటలు - జొన్న మురుకులు

కావలసిన వస్తువులు:
జొన్నపిండి - 500 గ్రా.
శనగపిండి - 250 గ్రా.
నువ్వులు - 25 గ్రా.
వాము - 5 గ్రా.
జీలకర్ర - 10 గ్రా.
మిర్చి పొడి - 25 గ్రా.
ఉప్పు - సరిపడినంత
రిఫైండ్ ఆయిల్ - 500 గ్రా.

తయారు చేసే విధానం :
గిన్నెలో జొన్నపిండి, శనగపిండి, నువ్వులు, జీలకర్ర, వాము, ఉప్పు, మిర్చిపొడి వరుసగా కలపాలి. [ ఇంకా
...]

భక్తి గీతాలు - కొలనిదోపరికి గొబ్బిళ్ళో

కొలనిదోపరికి గొబ్బిళ్ళో
యదుకులస్వామికి గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవుల గాచిన
కొండొక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యుల కెల్లను తల
గొండు గండనికి గొబ్బిళ్ళో కొలని [ ఇంకా
...]

పిల్లల పాటలు - సంక్రాంతి

సంక్రాంతి పండక్కి సంబరాలెన్నో;
సందళ్ళు, సరదాలు, సయాట లెన్నో,
సాతాని పాడితే సంక్రాంతి మొదలు;
గంగిరెద్దాడితే పొంగళ్ళు మొదలు.
ముత్యాల ముగ్గులతో ముంగిళ్ళు మెఱయు;
కొలువుండి ఆ నడుమ గొబ్బిళ్ళు మురియు. [ ఇంకా
...]

Wednesday, August 8

భక్తి గీతాలు - రామకీర్తన

జగదభిరామా రఘుకులసోమా
శరణము నీయవయ్యా కరుణ జపవయ్యా
కాశికు యాగము కాచితివయ్యా
రాతిని నాతిగ జేసితివయ్యా
హరువిల్లు విరచి మురిపించి సీతను
వరిణయ మాడిన కళ్యాణరామా శరణము [ ఇంకా...]

పిల్లల పాటలు - సాయంత్రం

స్కూలు నుండి వచ్చాము
బుక్సు బ్యాగులో సర్దాము
స్నానం చక్కగ చేశాము
వెచ్చని పాలు తాగాము [ ఇంకా
]

వంటలు - దోసకాయ పప్పు

కావలసిన వస్తువులు:
దోసకాయలు - పావు కిలో.
కందిపప్పు - 250 గ్రా.
నూనె - 25 గ్రా.
చింతపండు - సరిపడినంత.
కరివేపాకు - 2 రెబ్బలు.
కొత్తిమీర - 1/4 కట్ట.
పచ్చిమిర్చి - 6.
ఎండుమిర్చి - 1.
ఇంగువ - చిటికెడు
పోపు గింజలు - తగినన్ని.
ఉప్పు - సరిపడినంత.
కారం - అర టీ స్పూన్.
ఉల్లిపాయలు - 2

తయారు చేసే విధానం :
చింతపండు నానేయాలి. దోసకాయ చెక్కుతీసి ముక్కలు కోసుకోవాలి. కందిపప్పును ఉడికించి దోసకాయ ముక్కల్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో కుమ్మరించాలి. [ ఇంకా ]

వంటలు - పునుగులు

కావలసిన వస్తువులు:
బియ్యం - అర కిలో.
మినపప్పు - పావు కిలో.
పచ్చి శనగపప్పు - 100 గ్రా.
నూనె - తగినంత.
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి).
పచ్చిమిర్చి - పది.
అల్లం - చిన్నముక్క.
జీలకర్ర - 1 టీ స్పూను.
ఉప్పు - తగినంత.
వంట సోడా - పావు టీ స్పూను.

తయారుచేసే విధానం:
మినపప్పు, బియ్యం విడివిడిగా ఓ పూట ముందుగా నానబెట్టి ఉంచాలి. నాన బెట్టిన మినపప్పును, బియ్యంను కడిగి మెత్తగా రుబ్బాలి. పచ్చిశనగపప్పును ఓ గంట ముందుగానే నానబెట్టాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం సన్నని ముక్కలుగా కోయాలి. [ ఇంకా
]

పుణ్యక్షేత్రాలు - సింహాచలం

విశాఖకు ఉత్తరంగా సుమారు 20కి.మీ, దూరంలో సముద్రమట్టానికి 243 మీటర్ల ఎత్తులో సమున్నతంగా ఒక కొండమీద వెలసిన శ్రీమహావిష్ణువు యొక్క అవతారమైన వరాహ నృసింహస్వామి క్షేత్రం. ఈ ప్రాంతంవారికి ఈ స్వామి అంటే ఎంతో గురి. విశాఖజిల్లాలోని వారంతా ఈ స్వామిని భక్తితో, ఆప్యాయంగా సింహాద్రి అప్పన్నగా పిలుచుకుంటూ ఈ స్వామిపేరే ఎక్కడచూచినా పెట్టుకుంటూ వుంటారు. ఇక్కడి సుప్రసిద్దుల నుండి పూరిపాకల్లో వుండేవారు సైతం ఈ స్వామి వారి పేరులేకుండా వుండరు. [ ఇంకా ]

Tuesday, August 7

వ్రతములు - కన్నె తులసమ్మ వ్రతము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
ఒక చిన్నది సవతితల్లి పోరుపడలేక తన అమ్మమ్మగారి యింటికి వెళ్ళిపోయెరు. సవతి తల్లి ఆపిల్లను తీసుకునిరమ్మని భర్తను వేధించెను. కాని యతడందులకంగీకరింపక ఆమెనేవెళ్ళి పిల్లను తీసుకుని రమ్మని చెప్పెను. ఇంకచేయునదిలేక ఆమె సవతి పిల్లను తీసుకొనివచ్చుటకాపిల్ల అమ్మమ్మగారింటికి వెళ్ళి పిల్లను పంపుమని ఆమె తాత నడిగెను. ఎంతో నిష్టూరంమీద ఆమె పిల్లనుతీసుకొనివచ్చెను. [ ఇంకా
]

భక్తి గీతాలు - లలితగీతం

ఏడుకొండలస్వామీ ఎక్కడున్నావయ్యా
ఎన్ని మెట్లెక్కినా కాన రావేమయ్యా ఏడు
ఆకాశామందూ ఈ కొండా శిఖరమ్ముపై
మనుజులకు దూరంగా మసలుతున్నావా ఏడు [ ఇంకా ]

వంటలు - డ్రైఫ్రూట్స్ హల్వా

కావలసిన వస్తువులు:
బాదం - 250 గ్రా.
పిస్తా - 250 గ్రా.
ఖాజు - 250 గ్రా.
అంజూర్ - 250 గ్రా.
హల్వా పౌడర్ - 250 గ్రా.
నెయ్యి - 200 గ్రా.
చక్కెర - 200 గ్రా.
ఖర్జూర - 400 గ్రా.

తయారు చేసే విధానం :
డ్రైఫ్రూట్స్ అన్నింటిని నెయ్యిలో దోరగా వేయించాలి ఆరబెట్టాలి. [ ఇంకా
]

వంటలు - టమోటా పప్పు

కావలసిన వస్తువులు:
టమోటాలు - పావు కిలో.
కందిపప్పు - 250 గ్రా.
నూనె - 25 గ్రా.
పచ్చిమిర్చి - 4.
కరివేపాకు - 2 రెబ్బలు.
వెల్లుల్లి - 1 రేక.
చింతపండు - సరిపడినంత.
ఉప్పు - సరిపడినంత.
కారం - అర టీ స్పూన్.
పసుపు - 1 చిటికెడు.
పోపులు - సరిపడినంత.
ఉల్లిపాయలు - 2.
ఇంగువ - చిటికెడు.
కొత్తిమీర - కొంచెం.
ఎండుమిర్చి- 1.

తయారు చేసే విధానం :
కందిపప్పు బాగా కడిగి ఉడక బెట్టాలి, సగానికి పైగా ఉడికిన తరువాత, టమోటా ముక్కలు, ఉల్లిపాయలు కోసి వెయ్యాలి, ఉప్పు, పసుపు, కారం, చింతపండు పులుసు పోసి ఉల్లిపాయ ఉడికేంతవరకు ఉంచి, అనంతరం బాండిలో నూనె కాచి పోపుగింజలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బ,ఇంగువ, కొత్తిమీర వేసి వేయించి పప్పులో వేసి బాగా కలిపి దించుకోవాలి. [ ఇంకా ]

పిల్లల పాటలు - సిరిమల్లె

సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
చెట్టు కదలకుండా కొమ్మ వంచండి
కొమ్మ విరగకుండా పూలు కోయండి [ ఇంకా
]

Monday, August 6

వంటలు - పెసరట్టు

కావలసిన వస్తువులు:
పెసలు (పొట్టు పెసర పప్పు) - అర కిలో.
చిన్న అల్లం ముక్క - 1.
ఉల్లి పాయలు - 4
పచ్చిమిర్చి - 15 - 16.
ఉప్పు - తగినంత.
నూనె - తగినంత.

తయారుచేసే విధానం:
పెసలు లేక పొట్టు పెసర పప్పును 3 గంటలు నాన బెట్టలి, నానిన తరువాత వాటిని శుభ్రంగా కడగాలి. పచ్చిపెసల్ని లేక పొట్టు పెసర పప్పును నీళ్ళు చిలకరించుకుంటూ మెత్తగా పిండి రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి. [ ఇంకా ]

భక్తి సుధ - అష్టలక్ష్మి స్తోత్రము

శ్రీ మహాలక్ష్మీ మంత్రము అష్టలక్ష్మీ స్తోత్రము లందిమిడియున్నది, గాన అద్దానిని ప్రతిదినము పఠించు వారలకు అష్టైశ్వర్యములు, సకల ఆయురారోగ్యములు కలుగును, ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, స్వరూపిణియైన శ్రీ మహాలక్ష్మి దేవిని ఈ స్తోత్రముచే పారాయణ చేయువారు దేవి కృపకు పాత్రులగుదురు. [ ఇంకా ]

భక్తి గీతాలు - అదివో అల్లదివో

అదిగో అల్లదిగో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదిగో బ్రహ్మాదుల కపురూపము
అదిగో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడు అదె మ్రొక్కు ఆనందమయము అదిగో
[ ఇంకా ]

వ్రతములు - పదహారు ఫలముల వ్రతము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
రాజుభార్యయు, మంత్రిభార్యయు పదహారుఫలముల నోమునోచిరి. కొంతకాలమునకు వారిరువురకు సంతానము కలిగెను. మంత్రిభార్యకు మాణిక్యముల వంటి బిడ్డలుపుట్టిరి. రాజు భార్యకు గ్రుడ్డివారు కుంటివారు పుట్టిరి. అప్పుడామె మంత్రిభార్యను పిలిపించి తనకిట్టిబిడ్డలు పుట్టుటకు కారణమేమని యడిగెను. [ ఇంకా
]

Saturday, August 4

వంటలు - బంగాళదుంప వేపుడు

కావలసిన వస్తువులు:
బంగాళదుంపలు - 4.
కారం - తగినంత.
ఉప్పు - తగినంత.
నూనె - వేయించడానికి సరిపడినంత.

తయారు చేసే విధానం :
బంగాళదుంపలు పొట్టు తీసి సన్నగా తరగాలి. తరువాత నీటిలో కడగాలి. [ ఇంకా
]

వంటలు - పొంగలి

కావలసిన వస్తువులు:
బియ్యం -1కప్పు.
పాలు - ఒక లీటరు.
బెల్లం లేదా పంచదార - 1/4 కిలో.
యాలకుల పొడి - 1/2 చెంచా.
జీడిపప్పులు - 10.
నెయ్యి - 1గరిటెడు.

తయారు చేసే విధానం :
బియ్యం బాగా కడిగి పెట్టుకోవాలి. రెండు కప్పుల నీళ్ళు మరిగించి బియ్యం అందులో వేసి ఉడికించాలి. [ ఇంకా
]

భక్తి గీతాలు - గౌరమ్మ పాట

వరమివ్వు తల్లి అభయమివ్వు తల్లి
బాలాద్రి గౌరమ్మ భాగ్యమివ్వు తల్లి వ
పసుపు కుంకుమ తెచ్చి పూజ చేసేను
పచ్చాని ఐదవతనము మాకివ్వవే వ
[ ఇంకా ]

సౌందర్య పోషణ - శరీరానికి

  • ఆలివ్ ఆయిల్‌లో కాస్త కర్పూరం కలిపి రోజూ పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే మొటిమల తగ్గిపోతాయి.
  • ఏడాది పొడవునా ఒకే విధమైన పర్‌ఫ్యూమ్ వాడకూడదు. ఋతువులను బట్టి పర్‌ఫ్యూమ్ తీక్షణత గుణధర్మాలు మారుతుంటాయి.
  • కొద్ది నీళ్లలో పుదీనాకు వేసి ఉడికించి ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి. చంకల్లో, లోపలి భాగాల్లో పూసుకునేందుకు కొద్దిగా పుదీనా ద్రవాన్ని పక్కకు పెట్టుకోండి.
  • నీటిలో పటిక వేసి స్నానం చేస్తే శరీరం తాజాదనంతో ఉంటుంది. [ ఇంకా ]

పండుగలు - మథర్స్ డే

అమ్మ:
'మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ' అంటూ మనము మొదట అమ్మకు ప్రణామం చేసిన తరువాతనే తండ్రికి, గురువుకి ప్రణామం చేస్తాం. పుట్టిన ప్రతి వ్యక్తికి మొదటి గురువు అమ్మే. అసలు ఈ సృష్టిలో అతి తీయనైన, కమ్మనైన పదం అంటూ ఉంటే అది 'అమ్మే'. ఈ 'అమ్మ' అనే రెండు అక్షరాల పదం లేకపోతే ఈ జగత్తు లేదు. మన ప్రతి ఒక్కరి బలం, బలహీనత అమ్మే, అమ్మ లేకపోతే మనము లేము, ఈ సృష్టి లేదు. మనల్ని నవ మాసాలు మోసి కని, పెంచేది అమ్మే, పెరిగి పెద్ద వాళ్ళమైన తరువాత ఎన్నో తప్పులు చేస్తే వాటిని ఓర్పుతో క్షమించి, మన తప్పులను సరిదిద్దుతుంది అమ్మ. అమ్మ మనసంత స్వచ్ఛమైన, నిర్మలమైన మనస్సు ఎవరకీ ఉండదు. [ ఇంకా ]

Friday, August 3

వ్రతములు - శ్రావణ మంగళవారపు వ్రతము

ఒక బ్రాహ్మణుడు సంతానము లేక పోవుటచే మిగుల పరితపించి సంతానము బడయుటకుగాను పరమేశ్వరుని గూర్చి ఘో(గో)రతపము చేసెను. అంతట కొంత కాలమునకు పార్వతీపరమేశ్వరులతనికి ప్రత్యక్షమై కోరికను తెలుపవలసినదనిరి. అతడు సంతానవరము నొసగవలెనని ప్రార్ధించెను. వారు నీకాయువు లేని కొడుకు కావలయునా? లేక అయిదవతనములేని కుమార్తెకావలెనా? అని ప్రశ్నించిరి. అందుకతడు బదులు చెప్పలేక ఆవిషయమును భార్యనడిగి తెలుసుకొనెదనని చెప్పి వారి ఆజ్ఞ నొంది, ఇంటికివచ్చి భార్యనుజూచి - "మనకు ఆయువు లేని అబ్బాయి కావలెనా? లేక అయిదవతనముచాలని అమ్మాయి కావలెనా?" అని ప్రశ్నించెను. ఆమె "పుట్టిచచ్చినను పుత్రుడే కావలయును. ఆడుబిడ్డతో ఆపదలుపడలేమని" చెప్పెను. [ ఇంకా ]

భక్తి సుధ - లింగాష్టకమ్

బ్రహ్మమురారి సురార్చిత లింగం,
నిర్మల భాసిత శోభిత లింగం,
జన్మజదుఃఖ వినాశక లింగం,
తత్ప్రణమామి సదాశివలింగమ్. [ ఇంకా ]

వంటలు - కారంచెక్కలు

కావలసిన వస్తువులు:
బియ్యపు పిండి -1 కిలో
పెసరపప్పు - 1/4 కిలో (పొట్టు లేనివి)
డాల్డా లేదా వెన్న - 200 గ్రాములు
అల్లం - 50 గ్రాములు
పచ్చి మిరపకాయలు - 6.
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - 3/4 కిలో

తయారు చేసే విధానం:
బియ్యపు పిండిని ముందుగా జల్లించుకోవాలి. పెసర పప్పును ఒక గంట నానబెట్టాలి. అల్లం, మిరపకాయలను మెత్తని పేస్టులా చేసుకోవాలి. [ ఇంకా ]

పిల్లల పాటలు - సూరీడు

వానలూ తగ్గాలి!
చలిగాలి పోవాలి!
చల్లనైన చలిని
దూరంగ తరమాలి! [ ఇంకా
]

Thursday, August 2

పుణ్యక్షేత్రాలు - శ్రీశైలం

కర్నూలు జిల్లాలో నల్లమల అడవులు - నల్లమల కొండలు. ప్రకృతి అందాలన్నింటినీ ఈ మహారణ్యంలో దాచుకున్నది. పర్వతారణ్య ప్రాంతంలో పదిలంగా సముద్రపు మట్టానికి 458 మీ. ఎత్తున కొండ కొమ్మన వెలసిన, పురాణ ప్రసిద్ధమైన అనాది శివక్షేత్రము. శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి ఆలయం. ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల నుండి బస్సులు నడుస్తూవున్నాయి. కొన్నాళ్ళ క్రిందట వరకు జీర్ణావస్థలోనున్నా ఇటీవల ఆలయం పునరుద్ధరించబడింది. [ ఇంకా ]

పిల్లల పాటలు - ఇల్లు

ఎండ వేడిమి
సోక నీయదు
వాన నీటను
తడువ నీయదు.
గాలి తాకిడి
కలుగ నీయదు [ ఇంకా
]

భక్తి సుధ - శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్

పూర్వపీఠిక:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ [ ఇంకా
]

వంటలు - కందిపొడి

కావలసిన వస్తువులు:
కందిపప్పు - అర కిలో.
పెసరపప్పు - పావు కిలో.
తెల్ల (పొట్టులేని) మినపప్పు - పావు కిలో.
శనగపప్పు - పావు కిలో.
జీలకర్ర - 25 గ్రా.
కారం - 50 గ్రా.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం :
ఖాళీ మూకుడును వేడిచేసి పప్పులన్నిటిని నూనె లేకుండానే ఘుమఘుమ వాసనవచ్చేలా విడివిడిగా వేయించాలి. [ ఇంకా
]

శతకాలు - భాస్కర శతకము

అడిగిన యట్టి యాచకుల యాశ లెఱుంగక లోభవర్తియై
కడపిన ధర్మ దేవత యొకానొకయప్పుడు నీదువాని కె
య్యెడల నదెట్లు పాలు తమికిచ్చునెయెచ్చటనైన లేగలన్
గుడువంగ నీనిచో గెరలి గోవులు తన్నునుగాక భాస్కరా.
[ ఇంకా ]

Wednesday, August 1

వంటలు - అరటి కాయ మామిడి ఇగురు

కావలసిన వస్తువులు:
అరటికాయలు - 3.
పచ్చిమామిడి - 2.
ఉల్లిపాయ - 1.
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూను.
పోపు దినుసులు - 1/2 టీ స్పూను.
మిర్చి పొడి - 2 టీ స్పూన్లు.
ధనియాల పొడి - 1/2 టీ స్పూను.
గరం మసాల - 1/4 టీ స్పూను.
పర్చి మిర్చి (సన్నగా తరిగినవి) - 10.
పసుపు - 1/2 టీ స్పూను.
కొత్తిమేర - 2 కట్టలు.
కరివేపాకు - 2 రెమ్మలు.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.

తయారు చేసే విధానం:
ముందుగా అరటి కాయను కొద్ది సేపు వేడి నీళ్ళలో ఉడికించి ఆపై పై తోలు తీసివేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. [ ఇంకా
]

పుణ్య క్షేత్రాలు - కేదారీనాధ్

రిషీకేశ్ నుండి 250 కి.మీ దూరం ఉంటుంది. సోన్ ప్రయాగ వరకు బస్సు వుంటుంది. సోన్ ప్రయాగ నుండి తప్పనిసరిగా నడక సాగించవలసిందే. శ్రమకు ఓర్చుకొనగలిగేవారు, ప్రకృతి సౌందర్యాధకులు కఠినమైనా, దూరమైనా పర్వతాలు ఎక్కుతూ, దిగుతూ పర్వత గ్రామీణ ప్రాంతాలను స్పృశిస్తూ ఉత్సాహంగా నడిచి వెళ్లగోరేవారు, గంగోత్రి నుండి కేదార్ నాధ్‌కు వెళ్ళవచ్చు. ఉత్తరానికి 20 కి.మీ అవతలగా ఉన్న మాలా నుండి నడక మార్గం ప్రారంభమవుతుంది. లంకా, గంగోత్రిల ద్వారా వెళ్ళవచ్చు. దానికి ఈ క్రింది మార్గంగా వెళ్ళడానికి తయారయి వెళ్ళాల్సి వుంటుంది. [ ఇంకా ]

శతకాలు - శ్రీ కృష్ణ శతకము

శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీతలోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా.
[ ఇంకా ]

భక్తి సుధ - శ్రీ కనకధారా స్తవము

వన్దే వన్దారుమన్దారమిందిరానందకందలమ్
అమన్దానంద సందోహ బన్ధురమ్ సిన్ధురాననమ్
అజ్ఞం హరే: పులకభూషణమాశ్రయన్తీ
భృంగాజ్గనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతా ఖిలవిభూతి రపాజ్గలీలా!
మాఙ్గల్వదాస్తు మమ మంఙ్గళదేవతాయా:
[ ఇంకా ]