Wednesday, August 22

పిల్లల పాటలు - తప్పెట్లోయ్ తాళాలోయ్

తప్పెట్లోయ్ తాళాలోయ్
దేవుడి గుళ్ళో బాజాలోయ్
పప్పు బెల్లం దేవుడికోయ్
పాలు నెయ్యి పాపడికోయ్. [ ఇంకా
...]

Tuesday, August 21

కవితలు - నేను సముద్రం ఒడ్డున నిల్చోని

నేను సముద్రం ఒడ్డున నిల్చోని,
అలలు చూస్తూ, ఉప్పు గాలి పీలుస్తూ
నెమరు వేస్తుంటే ఒకడొచ్చి,
?అచ్చు నీలాటివాడిని ఆ ఒడ్డున చూశా? అన్నాడు
. [ ఇంకా...]

వంటలు - మిల్క్ కేక్

కావలసిన వస్తువులు:
పాలు - 5 కప్పులు.
పంచదార - 4 కప్పులు.
బొంబాయి రవ్వ - 1 కప్పు.
నెయ్యి - 11/2 కప్పు.

తయారు చేసే విధానం:
పాలు, పంచదార, బొంబాయిరవ్వ, నెయ్యి అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి సన్నని సెగపై పెట్టి పాకం వచ్చేవరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. [ ఇంకా
...]

వంటలు - జొన్న రైస్

కావలసిన వస్తువులు:
జొన్న నూక - 500 గ్రా.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:
జొన్న నూకను శుభ్రం చేసి ఉంచుకోవాలి. [ ఇంకా...]

భక్తి గీతాలు - జయ శ్రీరామా!

జయ శ్రీరామా!
రఘురామ శుభకర శ్రీరామా!
త్రిభువన జన నయనాభిరామా జయ [ ఇంకా...]

పిల్లల పాటలు - లేవరా మా బాబు

తొలిపొద్దు పొడిచింది, లేవరాబాబు
మొద్దు నిద్దుర వీడి మేలుకోవాలి
తూరుపుదిక్కున సూరీడు లేచాడు
పక్కపై నినుజూసి ఎర్రబడినాడు [ ఇంకా...]

Monday, August 20

వంటలు - ధనియాలపొడి

కావలసిన వస్తువులు:
ధనియాలు - 200 గ్రా.
ఎండుమిర్చి- 200 గ్రా.
నూనె - 100 గ్రా.
మినపప్పు - 50 గ్రా.
శనగపప్పు - 50 గ్రా.
చింతపండు - కొంచెం.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం :
నూనె కాచి ధనియాలు, ఎండుమిర్చి, పప్పులు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించాలి. [ ఇంకా
...]

నీతి కథలు - తోడేలు - ఒంటె

అనగా అనగా ఒక అడవి ఉంది. ఆ అడవి పక్కన ఒకపల్లె ఉంది. ఆ అడవిలో ఒక తోడేలు ఉంది. అది బాగా జిత్తులమారిది. అది ఎప్పుడూ ఎదుటి జంతువులని మోసం చేస్తూ ఉండేది. పెద్ద జంతువులు కూడా దాని వలన మోసగింపబడేవి. అది జిత్తులమారిది అని అన్నిటికీ తెలుసు. తోడేలుతో అందుకనే జంతువులన్నీ కూడా జాగ్రత్తగా ఉండేవి. "ఆ పల్లెలో ఒక ఒంటె ఉండేది. తోడేలు ఒంటెను ఒకసారి చూసింది. ఒంటెను ఎలాగైనా మోసం చేయాలనుకుంది. ఒకరోజు తోడేలు ఒంటె దగ్గరకు చేరింది. ఒంటెతో ఇలా అంది. మామా నన్ను ఎవరూ నమ్మటంలేదు. నన్ను దగ్గరకు రానీయటంలేదు. నేను ఒంటరి దానను అయినాను మన ఇద్దరం కలిసి స్నేహంగా ఉందాం" అని అంది. ఆ మాటలకు ఒంటె తనలో తాను ఇలా అనుకుంది. [ ఇంకా...]

భక్తి గీతాలు - చంచలంబగు జగతిలోపల శాశ్వతం బొకటేదిరా

చంచలంబగు జగతిలోపల శాశ్వతం బొకటేదిరా
కన్నుమూసి తెర్చులోపల కవిమిలేములు మారురా.
మాయసంసారంబురాయిది మనసునిలుకడ లేదురా
నాదినీదియనుచు నరుడా వాదులాడబోకురా [ ఇంకా...]

పిల్లల పాటలు - అల్లి బిల్లి పాట...

కొండాపల్లీ కొయ్యా బొమ్మా
నీకో బొమ్మా నాకో బొమ్మా
నక్కపల్లీ లక్కా పిడతలు
నీకో పిడత నాకో పిడత [ ఇంకా...]

Saturday, August 18

నీతి కథలు - జీతము ఇవ్వని యజమాని

పూర్వము ఒక పట్టణములో వినాయకరావు అనే వ్యాపారి వుండేవాడు. ఆయన పనివాళ్ళను పెట్టుకోవటం వారికి జీతము ఇవ్వకుండా ఏవో సాకులు చెప్పి పంపేవాడు. ఆయన జీవితంలో ఎవ్వరికీ జీతం ఇవ్వలేదు. ఒకసారి వినాయకరావు వద్దకు చిరంజీవి అనే కుర్రవాడు వచ్చాడు. పని కావాలంటూ అడిగాడు. పనివాడులేక ఇబ్బందిగానే వుంది వినాయకరావుకి. తాను చెప్పిన పని చెయ్యాలనీ, చెయ్యకపోతే జీతం ఇవ్వననీ ముందే చెప్పాడు వినాయకరావు. [ ఇంకా...]

భక్తి గీతాలు - దేవదేవ ధవళాచల మందిర

దేవదేవ ధవళాచల మందిర
గంగాథరా హర నమో నమో
దైవతలోక సుధాకర హిమకర
లోకశుభంకర నమో నమో దేవ [ ఇంకా
...]

వంటలు - పుచ్చకాయ జ్యూస్

కావలసిన వస్తువులు:
పుచ్చకాయ - 1.
పంచదార - 150 గ్రా.
నిమ్మకాయ - 1.
అల్లం - చిన్న ముక్క.
చాట్ మసాల - 5 గ్రా.

తయారు చేసే విధానం :
ముందుగా పుచ్చకాయ చెక్కు తీసి, విత్తనాలు కూడా తీసివేయాలి. [ ఇంకా
...]

పిల్లల పాటలు - ఉయ్యాల జంపాల...

ఉయ్యాల జంపాలలూగరారమ్మ
వెలలేని బంగారుటుయ్యాల ఉయ్యాల
కమలమందున బుట్టీ కమలాక్షుని చేపట్టి
కాముని కన్నట్టి కంజదళనేత్రి ఉయ్యాల [ ఇంకా
...]

Friday, August 17

సంస్కృతి - పురాణాలు

"పురాపినవం పురాణం" అన్నారు. అంటే ఎంత ప్రాచీనమైనదైనా కొత్తగా అనిపిస్తుందని దీని భావన. పురాణాలలో భారతీయ ఆత్మ ఉందంటారు. వేద ధర్మాలను ప్రచారం చేయడానికే పురాణాలు వెలువడ్డాయి.
పురాణాలు ప్రాచీన విజ్ఞాన సంపుటాలు. ప్రప్రంచం పుట్టుక దగ్గర్నుంచి ప్రపంచంలో మానవుడు నడుచుకోవలసిన విధానందాకా ఎన్నెన్నో విషయాలను పురాణాలు మనకు వివరిస్తాయి. చరిత్ర, భౌగోళికం, పౌర విజ్ఞానం...ఒక్కటేమిటి? ప్రపంచంలో ఎన్ని విభాగాల విజ్ఞానముందో అన్నీ పురాణాలలో కనిపిస్తాయి.
[ ఇంకా...]

సాహిత్యం - మాతృ భాష

సాహిత్యం లోకి ప్రవేశించేముందు భాష అంటే ఏంటి? అది ఎలా పుట్టింది? వంటి విషయాలు కూడా తెలుసుకుని ఆ తర్వాత సాహిత్యంలోకి ప్రవేశించడం ఎంతైనా అవసరం. దాంతోపాటు మన మాతృభాష పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత కూడా మనకుంది కాబట్టి తెలుగు భాష ఎలా ఆవిర్భవించిందీ వంటి విషయాలను కూడ తెలుసుకుని ఆ తర్వాత అసలైన సాహిత్యంలోకి అడుగుపెడదాం. [ ఇంకా...]

హాస్య కధలు - రుబ్బుగుండు

అనగనగా ఒక ఊరు. ఆ వూళ్ళో ఒక్కటే బ్రాహ్మలిల్లు. ఆ ఇంటాయన చాలా మంచివాడు. భార్య మాత్రం చాలా కఠినురాలు.
ఒకరోజు మిట్టమధ్యాహ్నం వేళ ముసలి బ్రాహ్మణుడొకడు బాటసారియైపోతూ ఎండదెబ్బకు భయపడి ఇంటివారు బోజనమేమైనా పెడతారేమో? అనిఆశగా అరుగుపై చతికిలపడ్డాడు. బయటకు వచ్చిన ఆ ఇంటాయన ' అయ్యో! పాపం! ముసలి బ్రాహ్మణుడు. ఎండకు భయపడుతున్నాడని జాలిపడి " అయ్యా మీరు బోజనం చేసి విశ్రాంతి తిసుకొని తరువాత ప్రయాణం చేద్దురుగాని. స్నానానికి రండి ' అంటూ లోపలకు పిలిచాడతనిని. [ ఇంకా
...]

వేదాలు - వేదకాల విశిష్టత

వేదాలు అపౌరుషేయాలు. అంటే ఇతర గ్రంధములవలె అవి ఋషులచే రచించబడినవికావు. వేదాలలో చెప్పబడిన విషయాలనే స్మ్రుతులు, ఇతిహాసాలు, పురాణాను మున్నగునవి పలు విధాలుగా విశదీకరిస్తున్నాయి. ఉపనిషత్తులను వేదాంతమంటారు. హిందూ మతములోని మహోన్నత సిద్ధాంతములన్నీ ఉపనిషత్తులలోనే ఉన్నాయి. ప్రపంచ సాహిత్యంలో వేదములకంటే అత్యంత పురాతనమైన సాహిత్యం మరోటి లేదు. [ ఇంకా...]

Thursday, August 16

అందరి కోసం - ఆంధ్రులు

ఆంధ్రులు ఎవరు? ఎక్కడి వారు?
మహాభారతంలో ఆంధ్రులు రాజ్యాధిపతులనీ, ధర్మరాజును సేవించారనీ ఒక సందర్భంలో ప్రస్తావనకు వస్తుంది. మయ సభలో అంగ, వంగ, పుండ్రక, పాండ్య, ఓఢ్ర రాజులతోపాటు ఆంధ్ర రాజులు కూడా ధర్మరాజుని కొలిచారని సభా పర్వంలో చెప్పబడింది.
క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందిన భరతుని నాట్య శాస్త్ర గ్రంధంలో పాత్రోచిత భాష గురించిన సందర్భంలో ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తూ నబర్బర కిరాతాంధ్ర దమిలాది జాతుల విషయంలో ప్రాక్రుతాలను వాడరాదనీ, వారి వారి మాండలికాలనే వాడాలని తెలిపాడు. [ ఇంకా
...]

సాహిత్యం - సామెతలు

సామెత
ఈ మాట వినని తెలుగు వ్యక్తి ఉండడు. మన తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఈ మాట వింటున్నాం. ఆనాటికీ, ఈనాటికీ సామెతలు ఎవరు చెప్పినా ఆనందిస్తున్నాం. సామెతలు చెప్పేవారిని అభిమానిస్తున్నాం. సందర్భానికి తగ్గట్లుగా సామెతలు చెప్పేవారంటె మనకు అపరిమితమైన ప్రేమ. అదొక గొప్ప విద్యని మన భావన. అది నిజం కూడ. దానికి సమయస్ఫూర్తి ఎంతో అవసరం. [ ఇంకా
...]

హాస్య కధలు - పండగ అల్లుడు

పండక్కి అల్లుడుగారొస్తున్నారని ఉత్తరం రాంగానే గుండెల్లో గుఱ్ఱాలు పరుగెట్టాయి నాకు! బోలెడంత ఖర్చు! అష్టకష్టాలుపడి పిండివంటలు చేయటం, అవి తిని హరించుకోలేక నానా అవస్థా పడటం అంతా వేస్టనీ విడప్పుడే రోజుకు ఒక రకం పిండివంట చేసుకుని, తీరిగ్గా తిని, తాపీగా హరించుకోవటమే బెస్టనీ నా అభిప్రాయం. దీనితో మా ఆవిడ ఏకీభవించదు. నూటికి తొంభై పాళ్ళు నాతో వక్రీభవించటమే ఆవిడ సహజలక్షణం! [ ఇంకా...]

సంస్కృతి - మన ఆచార వ్యవహారాలు

ప్రపంచ సామాజిక చరిత్రలో భారతదేశానికున్న ప్రాముఖ్యత మరే ఇతర దేశానికీ లేదన్నది ప్రపంచ దేశాల ఉమ్మడి అభిప్రాయం. ఇందుకు కారణం ఇక్కడి ఆచార వ్యవహారాలే. ప్రతి దెశానికీ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. ఐతే భారతదేశంతో పోలిస్తే ఆయా సంప్రదాయాలు ఒక్కో ప్రాంతాన్నిబట్టి మారుతూ ఉంటాయి. [ ఇంకా...]

Tuesday, August 14

దేశభక్తి గీతాలు - తెలుగునేల

ప్రాచీన సంస్కృతీ పరిఢవిల్లిన నేల
పౌరుషాగ్నికి పేరుపడిన నేల
జాతీయ స్పూర్తికి జయకేతమౌనేల
జాగృతీ క్రతువులన్ జరుపునేల [ ఇంకా...]

దేశభక్తి గీతాలు - పాడనా తెలుగుపాట

పాడనా తెలుగుపాట పరవశమై నే
పరవశమై మీ ఎదుట మీ పాట
కోవెలగంటల గణగణలో గోదావరి
తరంగాల గలగలలో మావులతోపుల
మూపులపైన మసలేగాలుల గుసగుసలో
మంచిముత్యాల పేట
మధురామృతాల తేట ఒకపాట పాడానా [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - గాంధీ పుట్టిన దేశం

గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం గాంధీ [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - ఈ గాలీ ఈ నేలా

ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు 2
నను గన్న నా వాళ్ళూ ఆ... నా కళ్ళ లోగిళ్ళూ2
ఈ గాలి ఈ నేల...
చిన్నారి గోరవంక కూసేను ఆవంక 2 [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - తెలుగు జాతి మనది

తెలుగు జాతి మనది - నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది - రాయలసీమ నాది
సర్కారు నాది - నెల్లూరు నాది
అన్నీ కలసిన తెలుగునాడు - మనదే మనదే మనదేరా! తెలుగు [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - తల్లీ భారతి వందనము

తల్లీ భారతి వందనము - తల్లీ భారతి వందనము
నీ ఇల్లే మా నందనము - మేమంతా నీ పిల్లలము
నీ చల్లని ఒడిలో మల్లెలము - తల్లి తండ్రులను గురువులను
ఎల్లవేళల కొలిచెదమమ్మ - చదువులు బాగాచదివెదమమ్మ [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - పాడవోయి భారతీయుడా

పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా
నేడే స్వాతంత్ర్యదినం - వీరుల త్యాగఫలం 2
నేడే నవోదయం - నేడే ఆనందం పాడవోయి
స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయీ 2 [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - నా జన్మభూమి

నా జన్మభూమి... భూమి... భూమి...
నా జన్మభూమి ఎంత అందమయిన దేశము
నా యిల్లు అందులోని కమ్మని ప్రదేశము
నా సామిరంగ హొయ్ హొయ్ నా సామిరంగ నా జన్మభూమి [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - ఏ దేశమేగినా ఎందు కాలిడినా

ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీతల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము [ ఇంకా...]

దేశభక్తి గీతాలు - జననీ జన్మ భూమిశ్చ

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి
ఏ తల్లి నిను కన్నదో ఆతల్లినే కన్నభూమి గొప్పదిరా 2 జననీ
నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా
ఆ రుణం తలకొరివితో తీరేనురా ఈ రుణం మరి ఏ రూపాన తీరేను
ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - తెలుగువీర లేవరా

తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా
దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా తెలుగు
దారుణ మారణ కాండకు తల్లడిల్లవద్దురా2
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా 2 [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - త్రిలింగ దేశం

త్రిలింగ దేశం మనదేనోయ్,
తెలుంగులంటే మనమేనోయ్
మధురం మధురం మధురం మధురం
ఆంధ్రమ్మంటే అతిమధురం [ ఇంకా...]

దేశభక్తి గీతాలు - భారత దేశం మనదేర

ప భారత దేశం మనదేర
భారతీయులం మనమంత
భారతదేశం మనదేర [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - దేశభాషలందు తెలుగు లెస్స

ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి
అమ్మపాట పాడినట్టి భాష
తేనె వంటి మందు వీనులకును విందు
దేశభాషలందు తెలుగులెస్స! [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - చేయెత్తి జైకొట్టు తెలుగోడా

చేయెత్తి జైకొట్టుతెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
సాటిలేని జాతి - ఓటమెరుగని కోట
నివురుగప్పి నేడు - నిదురపోతుండాది
జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి గలవోడా! చేయెత్తి [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - భారత మాతకు జేజేలు

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవ ధాత్రికి జేజేలు భారత
త్రివేణి సంగమ పవిత్ర భూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి భారత [ ఇంకా...]

దేశభక్తి గీతాలు - మూడు రంగుల జెండా

మూడు రంగుల జెండా
ముచ్చటైన జెండా
భారతీయుల జెండా
బహు గొప్ప జెండా [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - దేశమును ప్రేమించుమన్నా

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్ ! [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - సారే జహాసె అచ్ఛా

సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా
హమ్ బుల్ బులే హై ఇస్‌కే, యే గుల్ సితా హమారా
పరబత్ వో సబ్ సే ఊంఛా హమ్‌సాయా ఆస్‌మాన్ కా
వో సంతరీ హమారా ! వో పాస్‌బా హమారా [ ఇంకా...]

దేశభక్తి గీతాలు - మా తెలుగు తల్లికి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - జయ జయ జయ ప్రియ భారత

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ సస్యశ్యామల సుశ్యామ చలాంచ్చేలాంచల!
జయ వసంత కుసుమ లతా - చలిత లలిత చూర్ణకుంతల! [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - ఝండా ఊంఛా రహే హమారా

సదా శక్తి బర్సానే వాలా
ప్రేమ సుధా సర్సానే వాలా
వీరోంకో హర్షానే వాలా
మాతృభూమికా తన్ మన్ సారా ఝండా [ ఇంకా...]

దేశభక్తి గీతాలు - జాతీయ గీతం

జన గణ మన అధినాయక జయహే!
భారత భాగ్య విధాతా!
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా,
ద్రావిడ, ఉత్కళ, వంగ! [ ఇంకా
...]

దేశభక్తి గీతాలు - వందేమాతరం

వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం...1
శుభ్రజ్యోత్స్నం పులకిత యామినీమ్
పుల్లకు సుమిత ద్రుమదల శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషినీం [ ఇంకా...]

వ్రతములు - మునికార్తీక వ్రతము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
ఒక బ్రాహ్మణి కడు పేదయై, దానిని భరించలేక బ్రహ్మ లోకమునకు వెళ్ళి వరము తెచ్చుకొనవలెనని ప్రయాణమై వెళ్ళుచుండెను. దారిలో ఒక బ్రహ్మణుడు కనిపించి, తన గతి బ్రహ్మతో చెప్పవలెనని ఆమెను కోరెను. అట్లే యని కొంతదూరము వెళ్ళగా, నక్కడ ఒక ముంతమామిడి చెట్టు కనిపించెను. తన ఫలము లెవరూ తినకుండుటకు కారణము బ్రహ్మనడుగుమని ఆమెను కోరెను. [ ఇంకా
...]

భక్తి గీతాలు - కొండలలో నెలకొన్న...

కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు
కుమ్మరదాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల నిచ్చిన వాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న
చోటికి వచ్చి నమ్మినవాడు కొండ [ ఇంకా...]

Monday, August 13

వంటలు - కొబ్బరి స్వీట్

కావలసిన వస్తువులు:
పచ్చికొబ్బరి తురుము - 4 కప్పులు.
పంచదార - 2 కప్పులు.
యాలుకల పొడి - 1/4 స్పూన్.
నెయ్యి - 1/2 కప్పు.
జీడిపప్పు - 1/4 కప్పు.
కిస్‌మిస్ - 1/4 కప్పు.

తయారు చేసే విధానం:
ఓ గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీరు పోసి పొయ్యి మీద పెట్టి పాకం పట్టుకోవాలి. తరువాత కొబ్బరి తురుమును అందులోవేసి బాగా ఉడికించాలి. [ ఇంకా
...]

వంటలు - కిస్‌మిస్ కలాకండ్

కావలసిన వస్తువులు:
పాలు - 5 లీటర్లు.
చక్కెర - 300 గ్రా.
నెయ్యి - 250 గ్రా.
జీడిపప్పు - కావలసినన్ని.
కిస్‌మిస్ - కావలసినన్ని.

తయారు చేసే విధానం:
గిన్నెలో పాలు, చక్కెర మిశ్రమాన్ని తీసుకుని సన్నని సెగపై పాలు చిక్కబడేవరకు మరిగిస్తూ ఉండాలి. [ ఇంకా...]