Thursday, October 18

ఆధ్యాత్మికం - వరాహవాతరం

శ్రీ మహావిష్ణువు జలప్రళయంలో మునిగిపోయిన భూమిని ఉధ్ధరించటానికి వరాహరూపాన్ని దాల్చాడు. ఒకసారి మనువు వినయంతో చేతులు జోడించి పితృదేవులైన బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. "ఓ పితృవర్యా! సమస్త ప్రాణుల సృష్టికర్త మీరే, మేము ఏపనులు చేసి మిమ్ములను సేవించగలమో సెలవీయండి" అన్నాడు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు "కుమారా! నీకు శుభమగుగాక! నీమాటలతో సంతృప్తి చెందాను నీవు నాఆఙ్ఞతో ఆత్మసమర్పణం చేసుకున్నావు. [ ఇంకా...]

వంటలు - మాంగో ఖీర్

కావలసినవి:
తియ్య మామిడి గుజ్జు
చక్కెర పాకం
కొబ్బరి పాలు
ఎండు ద్రాక్ష - తగినన్ని

చేసే విధానం:
తియ్య మామిడి గుజ్జు తీసి వడగట్టండి. తరువాత దీన్ని ఒక స్టైన్‌లెస్ పాత్రలో పోసి, దానితో సమానమైన నీటిని కలపండి. [ ఇంకా...]

Wednesday, October 17

వంటలు - పులావ్

కావలసినవి:
బసుమతి బియ్యం - 3 కప్పులు
మామిడి పండ్ల రసం - 1కిలో
పాలు - 1 లీటర్
జున్ను - 1 కప్పు
చక్కెర - 2 కప్పులు
నెయ్యి - 3 చెంచాలు
రోజ్‌వాటర్ - 2 నిండు చెంచాలు
కుంకుమ పువ్వు - 11/2 చెంచా
బాదంకాయలు - 25
ఏలకకాయలు - 10
లవంగాలు - 6
దాల్చిన చెక్కలు - 4
ఉప్పు - చిటికెడు

చేసే విధానం:
పాలను, మామిడి రసాన్ని కలిపి రెండు సమభాగాలుగా ఉడికించండి. మూడు సార్లు బియ్యాన్ని కడిగి శుభ్రం చేసి వడబోయాలి. [ ఇంకా
...]

వంటలు - బర్ఫీ

కావలసినవి:
కొబ్బరి - ఒక కప్పు
మామిడి పండు రసం - ఒక కప్పు
నెయ్యి - ఒక చెంచాడు
పాలు - ఒక కప్పు
చక్కెర - ఒక చెంచాడు

చేసే విధానం:
మిక్సర్లో చూర్ణమయిన ఒక పూర్తి కప్పు కొబ్బరిని తీసుకోండి. [ ఇంకా
...]

పర్యాటకం - మధుర

మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించిన నేల మధుర. మువ్వగోపాలుని మృదుపద మంజీరాలు ఘల్లు ఘల్లున నడయాడిన "బృందావనమే" అది. అక్కడ అణువణువునా వినిపించే కృష్ణనామ స్మరణ భక్తుల హృదయాలను పులకింపజేస్తుంది. పరమ పవిత్రమైన ఆ పట్టణంలోని ప్రతి వీథిలోనూ కృష్ణుడు కొలువుదీరి ఉన్నాడనడానికి అక్కడి అనేక ఆలయాలే నిదర్శనం. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - పూర్ణ పురుషుడు

బుద్ధ భగవానుని సమకాలికుడైన మహావీరుడు - బుద్ధుని మహా పరిత్యాగం, బుద్ధుని తపస్సు, మానవాళిపట్ల బుద్ధుని ప్రేమను పదే పదే గుర్తుకు తెస్తాడు. బీహార్‌లోని పాట్నాకు సమీపంలోగల ఒక పట్టణంలో మహావీరుడు 599 బిసిలో జన్మించాడు. అతని తండ్రి ఒక ప్రముఖుడు. వజ్జీ రాజ్యధిపతి అయిన చేతకుని కుమార్తి ప్రియకరణి లేక త్రిశల - మహావీరుని తల్లి. బాల్యదశలో మహావీరుడు పాఠశాలకు పంపబడ్డాడు. పాఠశాలలో అధ్యాపకుల అవసరం అతనికి లేదని వివేకాన్ని అతడు మనస్సులోనే నెలకొల్పుకున్నాడు. [ఇంకా...]

Tuesday, October 16

నీతికథలు - తల్లి ప్రేమ

తల్లి ప్రేమ సాటిలేనిది. దక్షిణ భారతంలోని ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు. తల్లి వృద్ధాప్యం వల్ల కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు. అదృష్టవశాత్తూ ఇద్దరూ భాగ్యవంతులే కాకుండా తల్లి మంచి ఆరోగ్యంతోనే ఉండడం జరిగింది.
ఒక రోజు కుమారుడు తల్లితో తాను ఆమెను వదలి వెళ్ళేందుకు నిర్ణయించుకుని, మరోచోట గృహం ఏర్పర్చుకున్నానని చెప్పాడు. తాము విడిపోయేలోగా లెక్కలన్నీ తేల్చుకునే అభిలాషను కూడా తెలియచేశాడు. [ ఇంకా...]

నాటికలు - వద్దంటే పెళ్ళి

శానయ్య : తలుపేసుకోండి, ఇక్కడున్నట్టు వస్తాను.ఇల్లు పదిలం. ఇంతలో అపసవ్యాలు ఎమి జరగనియ్యవద్దు. డబ్బుకి చాటు రోజులు. నాదగ్గిర బాకీ వసూలు చేసుగోడానికని చెబుతూ కొదరూ నాకోసం రావచ్చు. వాళ్ళతోటి నేను ఊళ్ళోలేననీ, ఎక్కడ కెళ్ళానో ఎప్పుడొస్తానో తెలియదనీ, చెప్పండి. మరికొందరు నా బాకీలు వసూళ్ళు ఇవ్వడానికొస్తారు. వాళ్ళతోటిమాత్రం నేను సరయ్య ఇంట్లో ఉంటానని చెప్పండి. ( అని, కుడివేపుకి నిష్క్రమించబోయేసరికి, సరయ్య వస్తాడు). [ ఇంకా...]

పండుగలు - అంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం

మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు" అంటూ తెలుగు నేలను తల్లిగా కీర్తించిన శంకరంబాడి సుందరాచారి, "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా" అంటూ తెలుగు తేజాన్ని ఉద్వేగంతో గొంతెత్తిన వేములపల్లి శ్రీకృష్ణ, తెలుగు తల్లి సాంస్కృతిక దర్పాన్ని తమ రచనల ద్వారా తెలియజెప్పిన అనేక వేల యువ సాహితీ కుసుమాల కల్పవృక్షం ఆంధ్ర ప్రదేశ్. ఈ వృక్షానికి సాహితీ సుమాలే కాదు సంప్రదాయ సిద్ధాంతాలు కూడ వాడని పువ్వులై విరబూస్తుంటాయి. [ ఇంకా...]

వంటలు - మునగాకు చట్నీ

కావలసినవి :
మునగాకులు : కప్పు
నూనె : 2 టీస్పూన్లు
ఎండుమిర్చి : 6
సెనగపప్పు : టేబుల్ స్పూను
మినపప్పు : టేబుల్ స్పూను
చింతపండు : నిమ్మకాయంత (నీళ్ళల్లో నానబెట్టాలి)
ఉప్పు : ముప్పావు టీస్పూను
కొబ్బరి తురుము : 2టేబుల్ స్పూన్లు
ఆవాలు : అర టీస్పూను
ఇంగువ : చిటికెడు

తయారుచేసే విధానం:

పాన్లో టీస్పూను నూనె వేసి వేడిచేయాలి. ఎండుమిర్చి, సెనగపప్పు వేయించి తీయాలి. [ ఇంకా...]

వంటలు - రాజ్‌కప్స్

కావలసినవి( కప్స్ కోసం ):
మైదా - ఒకటిన్నరకప్పు
మెత్తగా రుబ్బిన బఠాణీలు -సగం కప్పు
ఉప్పు - సగం చెంచా
నూనె - రెండుచెంచాలు వేపడానికి సరిపడా నూనె
నింపడానికి
ఉడకబెట్టి ముక్కల్లా కోసిన బంగాళదుంపలు - ఆరు
ఉడకబెట్టిన శనగలు - రెండు చెంచాలు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు
ఉడకబెట్టిన బఠాణీలు - ఆరు చెంచాలు
చాట్ మసాలా - ఒక చెంచా
చిలికిన పెరుగు - ఒక కప్పు
కారం - సగం చెంచా
వేయించిన జీలకర్ర పొడి - ఒక చెంచా
ఉప్పు - తగినంత
పైన అలంకరించడానికి సన్న కారప్పూస, కొత్తిమీర కొద్దిగా, పుదీన పచ్చడి అల్లం పచ్చడి.

తయారుచేసే విధానం:
మైదాపిండిలో రుబ్బిన బఠాణీ, ఉప్పు, నూనె కొద్దిగా నీరువేసి మెత్తగా కలపాలి. [ ఇంకా...]

Monday, October 15

వంటలు - మాంగో ఐస్‌క్రీం

కావలసినవి పదార్ధాలు :
మామిడి పండ్లు - 1 కిలో
చక్కెర - 5 చెంచాలు
పాలు - 11/2 లీటర్లు
మీగడ - 4 ఔన్సులు
రోజ్ వాటర్ - ఒక ఔన్స్
తయారు చేసే విధానం:
మామిడి పండ్లను తోలు ఒలిచి, గుజ్జును ఒక మిక్సర్లో వేసుకోండి. [ ఇంకా
...]

ఆధ్యాత్మికం - రామ శబ్దము

బ్రహ్మదేవుడు 'నారాయణ' శబ్దం లోని రెండవ అక్షరమైన 'రా'ను నమశ్శివాయ శబ్దములోని రెండవ అక్షరమైన 'మ ' ను తీసుకొని రామ అను శబ్దమును సృష్టించి, సరస్వతీదేవికి చెప్పాడు. ఈ రామనామము మహా మహిమాన్వితమైనదనీ, రామనామం ఉఛ్ఛరిస్తే ఎంతో ఫలితం కలుగుతుందనీ, ముక్తిదాయకమని చెప్పాడు. ప్రక్కనే కుమారుడైన నారదుడు ఉన్నాడు. [ ఇంకా...]

వంటలు - బఠాణీ బోండా

కావలసిన పదార్థాలు:
బంగాళదుంపలు - రెండు కప్పులు( మెత్తగా ఉడికించి చిదమాలి )
బోండాల మధ్యలో పెట్టడానికి ఉడకబెట్టిన బఠాణీలు - ఒక కప్పు
నూనె - ఒక చెంచా
తరిగిన అల్లం ముక్కలు - ఒక చెంచా
కారం - సగం చెంచా
ధనియాల పొడి - ఒక చెంచా
గరం మసాలా - సగం చెంచా
సన్నగా తరిగిన కొత్తిమీర - ఒక చెంచా
ఉప్పు - రుచికి తగినంత
బోండాల పైకి
శనగపిండి - సగం కప్పు
కారం - సగం చెంచా
వాము - సగంచెంచా
సోడా - చిటికిడు
నునె - వేయించడానికి సరిపడినంత
ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం:
ఉడకబెట్టి చిదిమిన బంగాళ దుంపలకు కొద్దిగా ఉప్పుకలిపి పక్కన పెట్టుకోండి. [ ఇంకా...]

Saturday, October 13

నీతి కథలు - చీమ యుక్తి

అది ఒక పెద్ద చీమల బారు. పప్పు బద్దలను నోట కరుచుకొని, ఆ చీమలు వాటి కలుగులోకి పోతున్నాయి. చీమలు పట్టుకొని వస్తున్న ఆ పప్పులను చూడగానే ఓ తొండకు నోరు వూరింది. మెల్లిగా చీమల బారు పక్కగా చేరి చీమల నోట్లో వున్న పప్పు బద్దలను లాగుకొని తినడం మొదలు పెట్టింది. చీమలకు భయం వేసి, చెల్లా చెదురుగా తిరుగుతున్నాయి కంగారుగా! చీమల నాయకురాలు పెద్ద కండ చీమ, చీమల కంగారు చూసింది. గబగబా చీమల దగ్గరకు వచ్చి వాటికి సంజ్ఞ చేసి, దగ్గరలో వున్న ఓ కలుగు దగ్గరకు వెళ్ళి కూర్చుంది. [ఇంకా... ]

Friday, October 12

పండుగలు - రంజాన్

పవిత్రతే పరమపదసోపానంగా ముస్లిం సోదరులు భావించే మాసం రంజాన్. రంజాన్ మాసంలో పసిపిల్లలనుంచి పెద్దవారి వరకు హృదయాలు పవిత్ర భావనతో నిండిపోతాయి. మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు దైవం పంపిన పరమ పవిత్రమైన "ఖురాన్" గ్రంధం అవతరించిన మాసమిది. అందుకే ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. [ ఇంకా...]

నీతి కథలు - పారిన పథకం

గౌరీపురంలో వుండే సూరమ్మకు గయ్యాళితనము, ధనాశ ఒక పాలు ఎక్కువగానూ, పొదుపరితనము, సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగానూ వుండేవి. ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్ళు చిన్నవాళ్ళుగా వుండగానే భర్తపోగా, ఉన్న ఆస్తినే కర్పూరంలా కరిగిస్తూ వాళ్ళను పెంచుకొచ్చింది. ఈ మధ్యనే కూతురు లక్ష్మికి పెళ్ళి చేసింది. ఇక పెళ్ళికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - దివ్యప్రార్ధన

నిజ క్రైస్తవునికి ప్రతిదినం ప్రార్థనే ఊపిరి. ఒక భక్తుడు "నేను ఉదయం పూట ప్రార్థించని దినమున తల గొరిగించుకున్న సంసోను వలె ఉంటాను అన్నాడు. పరి.పౌలు మనము సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతికే నిమిత్తం - అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం, రాజులు, అధికారులకోసం విజ్ఞాపనలు, ప్రార్థనలు యాచనలను, కృతజ్ఞతా స్తుతులను చేయవలెను;(1.తిమోతి-2:1,2) అని రాసెను. ఈ భూగోళము పాపంతో భారమైనను ఇంకనూ వేడితో దహించకుండా ఉండడానికి పరిశుద్దుల ప్రార్థనలే కారణం. [ ఇంకా...]

పిల్లల పాటలు - చక్కిలిగింత పాట

ఇల్లు అలికీ - ముగ్గూ వేసి
పీటవేసి - ఆకువేసి
పప్పువేసి - పాయసం వేసి
అన్నంపెట్టి - అప్పచ్చీ పెట్టి
పాలు పెట్టీ - పెరుగు వేసి
కూరవేసి - చారు వేసి [ ఇంకా
...]

ఆధ్యాత్మికం - బిల్వాష్టకం

1. త్రిదళం త్రిగుణాకారం - త్రినేత్రంచ త్రియాయుధం!
త్రిజన్మ పాపసమ్హారం - ఏకబిల్వం శివార్పణం.
2. త్రిశాఖై ర్భిల్వపత్రైశ్చ - హ్యచ్చిద్రైతహ కోమలై శ్శుభై:!
శివపూజాం కరిష్యామి - ఏకబిల్వం శివార్పణం. [ ఇంకా
...]

Thursday, October 11

ఆహార పోషణ - ఆకులో ఏముంది?

  • పప్పు, కూర, పులుసు, బజ్జీలు, పాలక్ పన్నీర్...రకరకాలుగా తినే పాలకూరల్లో అమినోయాసిడ్స్, ఐరన్, విటమిన్ ఎ, మెగ్నీషియం, సల్ఫర్, పోటాషియం, పోలిక్ యాసిడ్ పుష్కలం. ఒక్కమాటలో చెప్పమంటే
  • టమిన్లూ లభిస్తాయందులోపరిమళభరిత పుదీనాలోనూ విటమిన్లకు, ఖనిజలవణలకు కొదవేమీలేదు. ఐరన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - భద్రాచల రామదాసు

'అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ' అని చూపిస్తూ భద్రాచల వైభవాన్ని, సౌందర్యాన్ని వేనోళ్ళ పొగడుతూ అక్కడ రామచంద్రమూర్తి లక్షణునితో కూడి స్వర్ణప్రాకారాలతో గోపురాలతో విలసిల్లే దేవాలయంలో కొలువై భూలోక వైకుంఠంగా భద్రగిరిని శోభింపజేస్తున్నాడని, అక్కడ వెల్లువలై ప్రవహించే పవిత్రమైన గౌతమిలో స్నానంచేసి శ్రీరాముని కళ్లారా చూసి తరించమంటూ, స్థావర జంగమ రూపాలతో మన కళ్ళకు కనిపించేదంతా రామమయం అని, అంతరంగంలో ఆత్మారాముడు అనంతరూపుడై వింతలు సలుపుతున్నాడు అని, భద్రాచలంలో నెలకొన్న శ్రీరామచంద్రుని సృష్టిలో అంతటా చూచి, ఆ మహాత్ముని కొనియాడి, తరించడమే ముక్తిమార్గమని బోధించే 'అంతా రామమయం బీజగమంతా రామమయం ' అనే కీర్తనలు వినని వారుండరు. [ ఇంకా...]

Wednesday, October 10

పిల్లలపాటలు - మా మంచి అమ్మ

మా అమ్మ చెప్పేది మా మంచి మాటలు
మా అమ్మ పాడేవి ఇంపైన పాటలు
మా అమ్మ చేతివి కమ్మనీ వంటలు
మా అమ్మ తినిపించు గోరుముద్దలు [ ఇంకా
...]

పర్యాటకం - వన్యలోకం

అక్కడికి వెళితే నిజంగానే ప్రకృతి ఒడిలో ఉన్నట్లే. చుట్టూ ఆకుపచ్చని గడ్డి మైదానాలు, అగాధాల వంటి లోయలు, నీలాకాశం, ఎత్తయిన కొండలు, వాటిపైన చిక్కటి దుప్పటిలాంటి వనం, దానినిండా దట్టమైన ఫల ,పూల ఫృక్షాలు, చ ల్ల గాలి, ఆ వాతావరణం మనసును వశపరచుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అది ప్రసిద్దిగాంచిన బి.ఆర్.కొండల మాటున ఉన్న ప్రముఖ అభయారణ్యం, బి.ఆర్.కొండలు, అక్కడి అరణ్యం ఒకప్పుడు అడవిదొంగ వీరప్పన్ రహస్య స్థావరాలుగా ఉండేవి. కాబట్టి పర్యాటకుల పెద్దగా అటుకేసి దృష్టి సారించలేదు. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - శరణుఘోష ప్రియుడు

'ఓంస్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవునే శరణమయ్యప్ప!' అంటూ అయ్యప్ప భక్తులు భగవంతుని శరణుకోరే విధానాన్నే శరణు ఘోష అని వ్యవహరిస్తారు. అడవులలో కొండలలో నడచి వెళ్ళే స్వాములకు (భక్తులకు) శరణు ఘోష రక్ష. యాత్రచేసే బృందం అందరూ ఒక్కసారి స్వామివారి శరణు ఘోష చెప్పి అడవిని దద్దరిల్లజేస్తారు. [ ఇంకా...]

Tuesday, October 9

ఆహార పోషణ - అమ్మలాంటి నిమ్మ

  • రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
  • నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, జీర్ణశక్తిబాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది.
  • కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా పళ్ళు తోముకుంటే పలువర మెరవడమే కాకుండా, చిగుళ్ళవ్యాధులు ఉన్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. [ ఇంకా...]

పర్యాటకం - బాహుబలి

రెండు కొండల మధ్య ప్రకృతి సిద్దంగా ఏర్పడిన సరోవరమే "బెళగొళ" కన్నడంలో బెళ్ళి అంటే తెల్లని అని, గొళ అంటే నీటిగుండం అని అర్థం. జైన సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయులైన వారిని శ్రమణులు అంటారు.అలాంటి శ్రమణులు చాలామంది ధ్యానంలో శేషజీవితం గడిపి నిర్వాణం పొందడానికి ఈ కొండలలో, పరిసర ప్రాంతాలలో నివసించారు. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - విగ్రహారాధన

విగ్రహారాధనను కొంతమంది ప్రముఖులే ఖండించారు. అంటే విగ్రహారాధన పనికిరాదనా దాని అర్ధం. కాదు ఎందుకంటే పెద్దలు పెట్టిన ఏ పద్దతి, శాస్త్రం తప్పు కాదు. అందులో ఏదో అర్ధం నిగూఢంగా దాగి ఉంటుంది. దానిని గ్రహించి మనం దాని ప్రయోజనాన్ని ఉపయోగించుకోవాలి. అంతేకాని 'తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు ' అన్న వ్యక్తుల మాటలు పట్టించుకోరాదు. [ ఇంకా...]

Monday, October 8

ఆహార పోషణ - తులసి టీ

ఇంటి పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చని పెద్దలు చెబుతారు.ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. దీంట్లో ఉండే ఔషధ విలువలు అలాంటివి మరి. ఆరోగ్య పరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో తులసిని ఆరోగ్యప్రదాయినిగా కొనియాడారు. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలుగా ఉంటుంది. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - గురూచిష్టం

నిర్గుణుడు, నిరాకారుడు అయిన భగవంతునికి ఎలాంటి రూపము, గుణములు లేవు కనుక ఆయన మన ఇంద్రియాలకు, మనస్సుకూ గోచరించడు. అన్ని ఆరాధనలకంటే నిర్గుణోపాసనే అత్యుత్తమమైనదని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అయితే ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వారికి మాత్రమే అది సాధ్యం, సామాన్య మానవులకు సగుణోపాసనే అతి సులువైన మార్గం. [ ఇంకా...]

పర్యాటకం - కూర్గ్

దేశంలో పేరన్నిక గన్న హిల్ స్టేషన్‌లలో కూర్గ్ ఒకటి. కళ్లను, మనసును మైమరిపించే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఇది స్వర్గధామం. కర్ణాటకలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రం మైసూర్‌కు ఇది 100 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1170 అడుగుల ఎత్తున గల కూర్గ్ కోడగు జిల్లా కేంద్రం. ప్రతి సంవత్సరం అక్టోబరు నుండి మార్చి నెలాకరు దాకా కూర్గ్‌ను సందర్శించడానికి అనువైన కాలంగా చెబుతారు. [ ఇంకా...]

Saturday, October 6

ఆధ్యాత్మికం - మహాకాళి

"అర్థేందు మకుటాం దేవీం వందే వారిధి సంభవాం
అంతర్‌జ్వాలా స్వరూపాం తాం జగచ్చైతన్య విగ్రహాం"
ఈ స్తోత్రం ముగురమ్మలను, వారికంటే ఆతీతమైన ఆద్యాశక్తిని ప్రస్తుతిస్తున్నది. భక్తులకు దర్శనం ఇచ్చే మూర్తిమత్త్వము, ధ్యానంలో గోచరించే తత్త్వస్ఫూర్తి, యోగ దీప్తిలో కలిగే అద్భుతానుభవం.. సర్వాతీత గుణాతీతయైన పరాంబా లక్షణము... అనీ దీనిలో స్పష్టంగా వర్ణింపబడ్డాయి. దశ మహావిద్యలు ఆమె శక్తి యొక్క ఒక్కొక్క ఆవిష్కార స్థానం. [ ఇంకా
...]

ఆధ్యాత్మికం - కాబాగృహం

ఇస్లామ్ ధార్మిక భవనానికి అతి ముఖ్యమైన మూలస్తంభం హజ్. మనిషి మనస్సును దుర్నడతల నుండి కట్టడి చేసేందుకు, ప్రక్షాళన చేసేందుకు నిర్ణయింపబడ్డ అతి ముఖ్య ఆరాధనయే హజ్. ఇస్లాం లోని వేరువేరు ఆరాధనలన్నింటికీ ప్రాణం ఈ హజ్. వివిధ ఆరాధనలన్నీ హజ్ అనే ఈ చట్రంలో బిగించ బడ్డాయి. ఇవన్నీ సరియైన రీతిలో అమలు చేసినప్పుడే హజ్ పరమార్థం సఫలీకృతమవుతుంది. [ ఇంకా...]

ఆహార పోషణ - సామర్ధ్యాన్ని పెంచే సరైన ఆహారం

జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి వల్ల గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఈ రోజుల్లో వంధ్యత్వ సమస్యలు తలెత్తుతున్నాయి.ఆడవాళ్లలో హార్మోన్ల అసమతుల్యత, అండం విడుదలకు సంధించిన సమస్యలు,శరీర బరువులో తేడాలు, అధిక శారీరక శ్రమ, ఒత్తిడి, ధైరాయిడ్ వ్యాధులు సంతానలేమికి దారి తీస్తున్నాయి. [ ఇంకా...]

పర్యాటకం - జైసల్మేర్

"తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు"-అన్న సూక్తిని తలపించేలా, ఒకనాటి భారతీయ కళాకారుల నిర్మాణ చాతుర్యానికి నిలువెత్తు ప్రతీకగా రాజస్థాన్‌లోని జైసల్మేర్ దేశంలోని ప్రధాన పర్యాటక కేంధ్రాలలో ఒకటైంది. అక్కడి "సోనార్ ఖిల్లా"నే జైసల్మేర్ కోట"గా పిలుస్తున్నారు. ప్రపంచంలోని ఏకైక "సజీవ కోట"ఇదే. ప్రసిద్ధ థార్ ఎడారిలోని మరుభూమిలో నిర్మితమైన సుందర పట్టణమే జైసల్మేర్. [ ఇంకా...]

Friday, October 5

ఆహార పోషణ - నీటి పండు

  • ఆఫ్రికా దేశంలోని కలహారి ఎడారి ప్రాంతంనుంచి పుచ్చకాయ ప్రపంచదేశాలకు చేరిందని చరిత్రకారులు భావిస్తున్నారు.
  • ఐదువేల సంవత్సరాల క్రితం ఈజిప్టులో పుచ్చకాయను పండించినట్టు ఆధారాలున్నాయి. ప్రస్తుతం చైనా దేశం ప్రపంచంలో అత్యధికంగా పుచ్చ కాయను పండిస్తోంది.
  • దీంట్లో 92 శాతం నీరు ఉండడం వల్ల దీన్ని వాటర్ మిలన్ అని అంటారు. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - స్తుతి వైభవం

"మీరు శ్రమలో ఉంటే ప్రార్థించండి, సంతోషంలో ఉంటే కీర్తనలు పాడండి" అని యాకోబు తన పత్రికలో రాశాడు. దేవుడిని ఎప్పుడు స్తుతించగలం? మనకు ఎలాంటి సమస్యలు, కష్టాలు, భాధలు లేనప్పుడు మాత్రమే ఆరాధించగలం.ఈ మూడు మన జీవితాలతో పెనవేసుకొని మనతో నడిచేవే. మరి దేవుడిని ఆరాధించలేమా?నిజం చెప్పాలంటే వీటిలో నుంచే మనం దేవుడిని స్తుతించగలం.ఒక వ్యక్తి తనకున్న సమస్యను బట్టే దేవుడికి దగ్గర కాగలడు. [ ఇంకా...]

పర్యాటకం - మహాబలి పురం

భారతీయ ప్రాచీన శిల్పకళా నైపుణ్యాన్ని, నాటి పల్లవ రాజుల ఘనమైన చారిత్రక సంపదను తరతరాలుగా పర్యాటక లోకానికి పంచిపెడుతున్న గొప్ప గోపురాల సముద్ర తీర పట్టణమే మహాబలిపురం. బంగాళాఖాతపు నీలి అలల సవ్వడుల నుండి రాతి కట్టడపు విశేషాల దాకా ఇక్కడ చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. మహాబలిపురం డాన్స్ ఫెస్టివల్‌గా పిలిచే వార్షిక వేడుకకు అంతర్జాతీయంగా ఖ్యాతి ఉంది. [ ఇంకా...]

సంస్కృతి - రామాయణం ముఖ్యాంశాలు

రామాయణము మహాకావ్యము. ఇందులో 24,000 శ్లోకాలు సంస్కృత భాషలో వాల్మీకి మహర్షిచే రచించబడ్డాయి. ఇందులో సీతారాముల పవిత్ర చరిత్ర, కొడుకు తండ్రిని ఏవిధంగా గౌరవించాలీ, సోదురులు ఒకరిపట్ల మరొకరు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి, మిత్రుల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి, రాజు ప్రజలనెలా పాలించాలి మొదలైన వివరాలుంటాయి. [ ఇంకా...]

అందరి కోసం - ఉత్తరాంధ్ర విశ్వేశ్వరుడు

శ్రీముఖలింగేశ్వరుని దేవాలయం శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో ఉంది. ఈ గ్రామం మామిడి తోటలు, శోభాయమానంగా అగుపించే కొబ్బరి తోటలకు ఆలవాలం. దేవాలయ పరిసరాలలో ఉన్నంతసేపూ భగవంతునిపై భక్తిప్రవత్తులతోపాటు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. 'శ్రీముఖలింగం ' పేరులోనే చక్కని అర్ధం ఉంది. "పరమేశ్వరుడు లింగంలో కనిపించుట" అని దీని అర్ధం. [ ఇంకా...]

Thursday, October 4

సంస్కృతి - మహాభారతం ముఖ్యాంశాలు

మహాభారతం ఒక ఉద్గ్రంధం. ఇది ధర్మశాస్త్రం. అంతేకాక ఇది చారిత్రక గ్రంధం కూడా. కాబట్టే ఆనాటి సామాజిక, రాజకీయ లక్షణాలు ఈ గ్రంధంలో లిఖించబడ్డాయి. సర్వ లక్షణ సమన్వితమైన మహాభారతాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించినవారే. అందులోని పాత్రల స్వభావాలను ఆకళింపుచేసుకున్నవారే. ఆ ధర్మశాస్త్రాన్నీ అనుసరించేవారే. లౌకికములు, అలౌకికములు అగు విషయములెన్నో ఇందులో చెప్పబడ్డాయి. [ ఇంకా...]

సంస్కృతి - భాగవతం ముఖ్యాంశాలు

శ్రీకృష్ణుని నిర్యాణమనంతరం కలి ప్రవేశించిన కాలమది. బదరికాశ్రమమంలో వ్యాకులచిత్తుడై ఉన్నాడు వ్యాస మహర్షి. నారాయణ మంత్రాలాపాన చేసుకుంటూ ఆశ్రమానికొచ్చిన నారద మహర్షి వ్యాసుడు వ్యధాభరితుడై ఉండటాన్ని గమనించి ధర్మాన్ని నిలబెట్టిన శ్రీ కృష్ణ భగవానుని లీలా వర్ణన గావించమని, భాగవత పఠనం, స్మరణం ముక్తి మార్గమనీ, దాన్ని రచిస్తే అది అతని మనో వ్యాకులతను పోగొట్టడమేగాక ప్రజల్లో భక్తి భావన పెంపొందుతుందనీ ఉపదేశించడంతో వ్యాసుడు భాగవత రచనకు పూనుకున్నాడు. [ ఇంకా...]

అందరి కోసం - బృహదీశ్వరాలయం

తమిళనాడు దేవాలయాలకు ప్రసిద్ధి. ఆ దేవాలయాల్లో బృహదీశ్వరాలయం పెద్దది, ప్రముఖమైనది. ఈ ఆలయాన్ని మొదటి రాజ రాజ చోళుడు (క్రీ.శ985-1014) నిర్మించాడు. ఈ ఆలయం దక్షిణాదిన దేఎవాలయ విమాన నిర్మాణానికి, తమిళ శిల్ప కళా నైపుణ్యానికి పరాకాష్టగా చెప్పవచ్చు. ద్రవిడుల నిర్మాణాల విమానాల్లో అతి పెద్దది. అప్పట్లో ఈ ఆలయాన్ని మొదటి రాజరాజ చోళుని పేరున రాజరాజేశ్వరాలయంగా పిలిచేవారు. కాలక్రమాన తరువాతి రాజుల పాలన కాలంలో పలు మార్పులు చెంది నేడు బృహదీశ్వరాలయంగా పేరుగాంచింది. [ ఇంకా...]

నీతి కథలు - మంచి మిత్రుడు (పావురం - ఎలుక)

పూర్వం గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆకాశమును తాకుచున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి. ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న 'లఘుపతనక' అనే కాకి నిద్రలేస్తూనే కిందకు చూచింది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది. [ ఇంకా...]

Wednesday, October 3

వంటలు - వాంగీ బాత్

కావలసిన వస్తువులు:
వంకాయలు - 1/2 కిలో.
ఉల్లిపాయలు - 1/4 కిలో.
పచ్చి మిరపకాయలు - 4.
బియ్యం - 1/2 కిలో (2 డబ్బాలు).
నూనె - వేయించటానికి సరిపడినంత ( 200 గ్రా.).
ఉప్పు - తగినంత.
మసాలా కారం తయారు చేయడానికి కావలసినవి:
పచ్చి పప్పు - 50 గ్రా.
సాయి మినపప్పు - 50 గ్రా.
ధనియాలు - 50 గ్రా.
ఎండు మిరపకాయలు - 6.

తయారు చేసే విధానం:
ముందుగా మసాలా కారం తయారు చేయటం చూద్దాం:
పచ్చిపప్పు, ధనియాలు, సాయి మినపప్పు, ఎండుమిరపకాయలు తీసుకొని బాండిలో ఒక స్పూను నూనె వేసి వీటిని దోరగా వేయించాలి. [ ఇంకా
...]

వంటలు - బేసన్ లడ్డు

కావలసిన వస్తువులు:
శనగపిండి - 600 గ్రా.
నెయ్యి - 500 గ్రా.
పంచదార - 300 గ్రా.
యాలుకలపొడి - 10 గ్రా.

తయారుచేసే విధానం:
శనగపిండి, నెయ్యి మిశ్రమాన్ని చక్కగా కలిపి సన్నటి సెగపై దోరగా వేయించి పెట్టుకోవాలి. [ ఇంకా...]

పిల్లల పాటలు - బడాయి పిల్లి... 

బడాయి పిల్లి లడాయికెళ్ళి
ఎలుకను చంపి ఏనుగె అంది
పులినే తానని పొంగిన పిల్లి
కుక్కను చూసి ఒక్కటే పరుగు [ ఇంకా
...]

Tuesday, October 2

భక్తి గీతాలు - విశ్వరూపమిదివో

కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
పండిన వృక్షములే కల్పతరువులు
నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు
మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము [ ఇంకా...]

నీతి కథలు - గురువును మించిన శిష్యుడు

ఆ రోజు సోమవారం. సూరిబాబు ఎంతో ఉత్సాహంగా బడికి బయలుదేరాడు. దారిలో స్నేహితులు కలిశారు. మాటల సందర్భంలో ఆదివారం నాడు తాము ఎలా గడిపామో ఒక్కొక్కరు సంతోషంగా చెప్పడం ప్రారంభించారు. నిఖిల్ తాను తన అభిమాన హీరో సినిమా చూశానన్నాడు. చంద్రం తానెంతో ఇష్టపడే క్రికెట్ ఆడినట్లు చెప్పాడు. లోకేష్ తాను గీసిన డ్రాయింగ్ గురించి వర్ణించాడు. [ ఇంకా...]

Monday, October 1

పిల్లల పాటలు - రింగు రింగు బిళ్ళ

రింగు రింగు బిళ్ళ - రూపాయి దండ
దండ కాదురా! - తామర మొగ్గ
మొగ్గ కాదురా! - మోదుగ నీడ
నీడ కాదురా! - నిమ్మల బావి [ ఇంకా...]