Friday, October 26

ముఖ్యమైన ఘట్టాలు - ఉపనయనం

కుమారునికి తండ్రి ఉపనయనం చేస్తాడు. తండ్రి దేశాంతరమందుంటే తాత (తండ్రి యొక్క తండ్రి), అతను లేకుంటే తండ్రి సోదరులు వారుకూడా లేకపోతే వటుడి అన్న దానికి అధికారి అవుతాడు. ఒకవేళ అతను కూడా లేకపతే సగోత్రమునందు పుట్టినవారు చేయాల్సిఉంటుంది.

ఏ వయసులో చెయ్యాలి?
బ్రాహ్మణ కులంలో 8వ సంవత్సరాన, క్షత్రియులకు 11వ ఏడున, వైశ్యులకు 12వ ఏడున ఉపనయనం చేయాలి. బ్రాహ్మణులకు చైత్ర మరియు వైశాఖ మాసాలు, క్షత్రియులకు జ్యేష్ట, ఆషాఢ మాసాలూ, వైశ్యులకు ఆశ్వయుజ కార్తీక మాసాలు మంచిది. [ ఇంకా
...]

Thursday, October 25

ముఖ్యమైన ఘట్టాలు - యజ్ఞోపవీతం

'యజ్ఞ+ఉపవీత ' అను రెండుపదాలలో ఈ యజ్ఞోపవీతశబ్దం ఏర్పడుతుంది. యజ్ఞ = యజ్ఞార్థము- అనగా ఉత్తమ కర్మలాచరించుటకు చిహ్నంగా ధరింపబడు, ఉపవీతం = దారం. కనుక దీనిని యజ్ఞోపవీతమంటారు. "యజ్ఞో వై శ్రేష్ఠతమం కర్మ"- శ్రేష్ఠమైన (సత్) కర్మలన్నీ యజ్ఞపదంతో చెప్పబడుతాయి. కావున యజ్ఞోపవీత శబ్ధంలోని యజ్ఞ పదం మానవుడు పురుషార్థ సాధనకు చేయునుత్తమకర్మల కన్నింటికి బోధకంగా- సూచకంగా- ఉంటుంది. [ ఇంకా...]

అందరి కోసం - జానపదనృత్యాలు

అసంఖ్యాక జాతులతోనూ పతిస్థితులతోనూ కూడి ఉన్న భారతదేశం అనేక శతాబ్దాలుగా రకరకాల జానపద నృత్యాలకు నిలయంగా ఉంది. భారతదేశంలోని నేటి శాస్త్రీయ నృత్య విధానాలు చాలా కట్టుబాట్లకు లోబడి ఉండటంతోపాటు ఎంతో నాజూకుతనాన్ని చూపుతున్నది. ఆటవికుల గూడెములోనూ కర్షకుల కుటీరాలలోనూ నేటికి తమ పాటవాన్ని కోల్పోకుండా బ్రతికి ఉన్న సామాన్య ప్రజా నృత్యాలనుండి మన శాస్త్రీయ నృత్యాలు పుట్టాయి. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - విఘ్నేశ్వరుడు

ఈ విధంగా విఘ్నేశ్వరుని సర్వకార్యాలకు విఘ్నములు తొలగిపోయి అనుకున్న కార్యము జయప్రదంగా నెరవేరవలెనని షోడశోపచారములతో పూజించి పూజా అక్షతలు శిరస్సున ధరిస్తారు.
గణపతి పుట్టుక అందరికీ తెలిసిందే, వివిధయుగాలలో 'గణపతి ' లీలను పరిసీలించినచో 'కృతయుగం' లో 'మహోత్కట వినాయక ' అనుపేరుతో ఉధ్భవించి దేవాంతక నరాంతక అను రాక్షసులను సం హరించెను. [ ఇంకా
...]

Wednesday, October 24

పండుగలు - మాఘ మాసము

మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి "శుక్ల పక్ష చవితి" దీనిని "తిల చతుర్థి"అంటారు. దీన్నే "కుంద చతుర్థి" అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు. [ ఇంకా...]

మీకుతెలుసా - ఫూల్స్ డే

ఒకప్పుడు ఫ్రాన్స్‌లో ఏప్రిల్ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. 1582లో రాజైన చార్లెస్-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. [ ఇంకా...]

అందరి కోసం - నాట్యం

నాట్య శబ్దము నృత్యమునకు పర్యాయపదము. భరతుని నాట్య శాస్త్రంలో నృత్యం అనే పదం లేదు. నృత్తము, నాట్యము అను పదములే కలవు. నృత్తము నాట్యముకంటే చాలా ప్రాచీనమైనది. ఈ రెండు కళలు వేర్వేరుగ జన్మించి, వేర్వేరుగ అభివృద్ధి చెందాయి. భరతుడే ప్రధమంగా నృత్తమును నాట్యంలో చేర్చాడు. కరణ-అంగహార సంపన్నమైనది నృత్తము. ఇది అర్ధాన్ని బోధించదు. కేవలం అవయవ విన్యాసములతో కూడి ఉండును. [ ఇంకా...]

సంగీతం - సామగానం

'వేదానాం సామవేదోస్మి ' అంటాడు కృష్ణ పరమాత్మ. భగవధ్గీత విభూతి యోగంలో. రుక్ వేదం- రుక్కులతో కూడినది. ఎవరైనా కంఠోపాఠం చేశారు అనడానికి 'రుక్కు పెట్టేశాడు ' అంటారు. రుగ్వేద అధ్యయనం చేసినప్పుడు అనేమాట ఈనాటికీ వాడుకలో ఉన్నది. రెండవది యజు: -యజుర్వేదము, యజు: అంటే యాగం యాగంచేసేటప్పుడు వల్లెవేసేదే యజుర్వేదం. పై రెండువేదాలకూ కృష్ణ పరమాత్మ ప్రాధాన్యం ఇవ్వలేదు. [ ఇంకా...]

Tuesday, October 23

హాస్య సంపద - జోక్స్

ఒక పేటకు చెందిన చర్చి అధికారి ఆ పేట గుండా నడిచి వెళ్ళ్తున్నాడు.దారిలో ఆ చర్చికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ ఫాదరుకు కనపడ్డాడు. అతన్ని చూసి "ఏవయ్యా నీ జలుబు ఎలా వుంది?" అని అడిగాడు.
" చాలా మొండిగా వుంది ఫాదర్."
" నీ భార్య ఎలా వుంది?"
" ఆమె అట్లాగే వుంది " అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. [ ఇంకా
...]

పర్యాటకం - శైవక్షేత్రాలు

ప్రతి సంవత్సరం శివరాత్రి మహా పర్వదినం వచ్చిందంటే చాలు ఊరూర వెలసిన శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి. వందలు, వేల సంఖ్యలో భక్తులు పొద్దంతా ఉపవాసాలు ఉండి, సాయంకాలం నుండి రాత్రిళ్లు పొద్దు పోయేదాకా ఈశ్వరుని ఆరాధనలలో మునిగిపోతారు. రాత్రంత జాగారం చేసే వారు మరెందరో. దేశవ్యాప్తంగా ఆ రోజు శైవ దేవాలయాలన్నీ ప్రత్యేక అర్చనలు, సేవలు, అభిషేకాలతో కన్నులపండువ చేస్తాయి. [ ఇంకా...]

Monday, October 22

ఆధ్యాత్మికం - వామనావతారం

సృష్టి, స్థితి, లయలకు కారకులు త్రిమూర్తులు. వీరు తమ భక్తులకు ఇచ్చు వరాలకు ఏదేని విపరీతాలు సంభవిస్తే, దాని వలన మానవాళికి హాని కలిగితే, తిరిగి వీరే ఏదో ఒక అవతారాన్ని ఎత్తి వారిని హతమార్చి సర్వమానవ సౌబ్రాత్రుత్వానికి మేలు చేస్తారు. అందులో భాగంగానే ఈ 'దశావతారాలు' అనగా పది అవతారములు. మొదటిది మత్స్యావతారం, రెండవది కూర్మావతారం, మూడవది వరాహావతారం, నాల్గవది నరశిం హావతారం, అయిదవది వామనావతారం, ఆరవది పరశురామావతారం, ఏడవది రామావతారం, ఎనిమిదవది కృష్ణావతారం, తొమ్మిదవది బుధ్ధావతారం, పదవది కల్కి అవతారం. [ ఇంకా...]

వంటలు - గోధుమరవ్వ గంజి

కావలసినవి పదార్థాలు:
సన్నటి గోధుమరవ్వ - ఒక గ్లాసు
పంచదార - ఆరు స్పూన్లు
పాలు - మూడు గ్లాసులు
యాలుకల పొడి - కొద్దిగా

తయారుచేసేవిధానం:
ఒక వంతు గోధుమరవ్వకు మూడు వంతు నీళ్ళు తీసుకొని ముందుగా నీళ్ళను బాగా మరిగించాలి. [ ఇంకా...]

వంటలు - శనగ గుగ్గిళ్ళు

కావలసినవి పదార్థాలు:
సెనగలు - అరకిలో
పోపుదినుసులు - సరిపడా
కొత్తిమీర - రెండు కట్టలు
కరివేపాకు - ఒక కట్ట
పచ్చి మిరపకాయలు - ఆరు, ఏడు
మంచి నూనె - కొద్దిగా
నిమ్మరసం - మూడు చెంచాలు
ఉప్పు - సరిపడా

తయారుచేసే విధానం:
అరకిలో సెనగలను శుభ్రం చేసి ఉదయమే నూళ్లలో నానబెట్టాలి.బాగా నానిన సెనగలను నీళ్లు లేకుండా చక్కగా వడకట్టాలి.
[ ఇంకా...]

వ్యాయామ శిక్షణ - మీరు-మీపాదాలు

మీపాదాలతో మీరెంత దూరం నడుస్తున్నారో తెలుసా? సుమారు 1,60,000కి.మీ.లకు పై బడిన దూరం భూతలం మీద, కొండలమీద, కోనలలో, మైదానాలలో,తోటలలో, పోలాలలో నడుస్తున్నారు. 26 ఎముకలతో, 33 కీళ్ళతో, 100కి పైన కండరాలతో మీ పాదం చాల సంక్లిషమై ఉంటుంది. పాదాలు అతి సున్నితమైనవి, నాజూకైనవి. [ ఇంకా...]

పిల్లల పాటలు - కెరటం

రంగురంగుల బొమ్మను
బాలలు ఆడే బొమ్మను
నాట్యము చేసే బొమ్మను
ఎరువు, తెలుపు బొమ్మను [ ఇంకా...]

Saturday, October 20

వంటలు - పెసరపప్పు గంజి

కావలసిన పదార్థాలు:
పెసరపప్పు - 2 గ్లాసులు
పంచదార - ఆరు స్పూన్లు
చిక్కటిపాలు - 4 గ్లాసులు
యాలుకల పొడి - కొద్దిగా

తయారుచేసే విధానం:
పెసరపప్పును కొంచెం నీటిలో బాగా ఉడికించాలి. పప్పు బాగా ఉడికిన తరువాత వేడి చేసిన పాలను పప్పులో పోసి ప్పప్పు, పాలు రెండు బాగా కలిసేలా కలియబెట్టాలి. [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - ఆత్మ గౌరవం

ఎవరైతే కష్టించి పని చేస్తారో, ఙ్ఞానవంతులో, తెలివి కలవారో, నైపుణ్యం కలవారో అటువంటి వారు అన్ని చోట్లా గౌరవింప బడతారని జగమెరిగిన సత్యం. అఙ్ఞానులు, అసమర్ధులు, సోమరిపోతులు, మందబుద్దులు ఎల్లప్పుడూ అవమానాల పాలవుతారు. ఎన్ని సార్లు అవమానించ బడినా, చీత్కరించబడినా, అనేక సార్లు హెచ్చరించబడినా, తాఖీదులందుకొన్నా, తమతప్పులకు చివాట్లు తిన్నా, చివరకు శిక్షించబడినా కూడా కొంతమంది తమకు తాము మెరుగు పరచుకోవడానికి ప్రయత్నించరు. అటువంటి వాళ్ళు బాధపడరు. [ ఇంకా...]

వంటలు - గుమ్మడి చట్నీ

కావలసినవి:
కందిపప్పు - ఒక కప్పు
ఎండుమిర్చి - ఐదు
గుమ్మడి తురుము - అర కప్పు
ధనియాలు, జీలకర్ర - రెండు స్పూన్లు
వెల్లుల్లి - ఒక రెబ్బ
చింతపండు - రెండు రెబ్బలు
నూనె - తగినంత
ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె వేడిచేసి కందిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర గుమ్మడి వేసి వేయించాలి.
[ ఇంకా...]

వంటలు - చురుమురి

కావలసిన పదార్థాలు:
మరమరాలు - 1/4 కిలో
క్యారట్ తురుము - 100 గ్రా
కీర తురుము - 100 గ్రా
ఉప్పు - తగినంత
కారప్పొడి - కొద్దిగా
కొత్తిమీర తురుము - కొద్దిగా
నిమ్మరసం - రెండుస్పూన్లు

తయారుచేసే విధానం:
మరమరాలను ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని దానికి క్యారట్ తురుము, కీరా తురుము, ఉప్పు, కారప్పొడి, కొత్తిమీర తురుము వేసి చక్కగా కలిపి సన్నటి సెగ మీద రెండు, మూడు నిమిషాలు వేయించాలి.
[ ఇంకా...]

ఆధ్యాత్మికం - నిరంతర దైవ చింతన

జైన శాస్త్రములో ఒక చక్కనిగాధ కలదు. పూర్వము శ్రీ రామచంద్రుడు రావణ సంహారానంతరము పట్టాభిషేకము పూర్తి ఆయినపిదప ఆనందముగా రాజ్యమును పరిపాలించుచుండెను. యుద్దమున శ్రీరామునకు సాయమొనర్చిన పలువురు ఆ సమయమున శ్రీ రామచంద్రుని సమీపించి "మహాత్మా యుద్దకాలమున మేము తమకు ఆనేక విధముల తోడ్పడి తమ సేవలొ పాలుపంచుకొంటిమి. మహత్తర పుణ్యమును తద్వారా మేము సముపార్జించుకొనగలిగితిమి. [ ఇంకా...]

Friday, October 19

వంటలు - గుమ్మడి విత్తనాల కర్రీ

కావలసినవి:
గుమ్మడి గింజలు - ఒక కప్పు
కందిపప్పు - 1/2 కప్పు
పచ్చికొబ్బరి తురుం - ఒక కప్పు
గరంమసాల - ఒక చెంచా
ఉప్పు, కారం - రుచికి తగినంత
పెద్ద ఉల్లి - ఒకటి
టమాటాలు - రెండు
పచ్చిమిరపకాయలు - రెండు
కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మీగడ - తగినంత

తయారుచేసే విధానం:
ముందుగా గింజలని ఉడికించాలి, పప్పును ఉడికించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేడిచేసి తాలింపు చేసాక, ఉల్లిపాయ, మిరపకాయలు వేసి వేయించాలి.
[ ఇంకా...]

వంటలు - గుమ్మడి పప్పు

కావలసినవి:
గుమ్మడి ముక్కలు - ఒక కప్పు
బంగళాదుంపలు - రెండు చిన్న ముక్కలు
ఉల్లిగడ్డ - ఒకటి
పచ్చిమిరపకాయలు - రెండు
గరంమసాలా - ఒక చెంచా
పచ్చికొబ్బరి పొడి - ఒక చెంచా
పుదీనా, కొత్తిమీర, కరివేపాకు - తగినంత
నూనె, మీగడ - ఒక చెంచా
కారం, ఉప్పు - రుచికి తగినట్టు
టమాటాలు - రెండు

తయారుచేసే విధానం:
ముందుగా కందిపప్పు, దుంపలు ఉడికించాలి. గుమ్మడి ముక్కలు సన్నగా తరగాలి. ఒక గిన్నెలో నూనెపోసి వేడిచేసి తాలింపు చేయాలి.
[ ఇంకా...]

వంటలు - చలిని తరిమేసే చిరుతిళ్ళు

సాధారణంగా చిరుతిళ్ళు తింటే ఊబకాయం వస్తుందనీ, అవి అనారోగ్యానికి దారి తీస్తాయని అందరూ చెబుతుంటారు. చిరుతిళ్ళు అంటే వాళ్ళ దృష్టిలో వేళా పాళా లేకుండా ఏదిపడితే అది తినెయ్యడం. భోజనం చేసిన వెంటనే ఏదో ఒకటి నోట్లో వేసుకోవడం మనలో చాలామందికి అలవాటే. ఇటువంటి చిరుతిళ్ళు ఆరోగ్యాన్ని హరిస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - కమ్మ్యూనికేషన్ గ్యాప్

సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడం ఒక ఎత్తైతే ఆ నిర్ణయాన్ని సరైన సమయంలో సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. ఒక వ్యక్తి యొక్క ప్రతిభకు అద్దంపట్టేది ఆ వ్యక్తి సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధానం మాత్రమే. అతని నిర్ణయాన్ని విజయపధంవైపు మళ్ళించేది అతని సమయపాలన (టైమింగ్) మాత్రమే. కాబట్టి "టైం ఈజ్ మనీ" అన్నారు పెద్దలు. కానీ "టైం ఈజ్ మనీ". [ ఇంకా...]

Thursday, October 18

మీకు తెలుసా - మోటారు కారు కథ

13వ శతాబ్దంలోనే శాస్త్రజ్ఞులు, కవులు, రచయితలు, పరిశోధకులు ఆటోమొబైల్‌ను గురించి అనేక కలలు కన్నారు. కలలన్నీ నిజాలుగా మార్చడానికి ఆటోమొబైల్‌ రంగంలో శ్రీకారం చుట్టడానికి ఫ్రెంచి మార్గదర్శకుల అపూర్వమైన అభినివేశము, పట్టుదల ముఖ్య కారణం అని చెప్పకతప్పదు. మోటరు కారు రోడ్డుమీద తిరగడానికి మోళికంగా చక్రాలు ముఖ్యమైన, వేగం సాధించాలనే ఉబలాటమే దీని అభివృద్దికి ముఖ్య కారణమైంది. [ ఇంకా...]

వంటలు - ఈస్టర్ కేక్

కావలసిన పదార్థాలు :
మైదాపిండి - 200 గ్రాములు
పంచదారపొడి - 200 గ్రాములు
నెయ్యి - 200 గ్రాములు
గుడ్లు - నాలుగు
బేకింగ్ పౌడర్ - 1 టేబుల్ స్పూన్
వెనీల టేబుల్ - 1 టేబుల్ స్పూన్
ఐసింగ్ కోసం..
వెన్న 100 గ్రాములు, ఐసింగ్ సుగర్ 200 గ్రాములు

తయారీవిధానం:
మైదాపిండి జల్లించండి. ఈ పిండిని ఓ గిన్నెలోని తీసుకుని అందులో గుడ్లు, పంచదార, వెన్న, బేకింగ్ పౌడర్, ఎసెన్స్ వేయండి. వీటన్నింటినీ చేత్తో కానీ.. ఎలక్ట్రిక్ బీటర్‌తో కానీ బాగా కలపండి. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - వరాహవాతరం

శ్రీ మహావిష్ణువు జలప్రళయంలో మునిగిపోయిన భూమిని ఉధ్ధరించటానికి వరాహరూపాన్ని దాల్చాడు. ఒకసారి మనువు వినయంతో చేతులు జోడించి పితృదేవులైన బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. "ఓ పితృవర్యా! సమస్త ప్రాణుల సృష్టికర్త మీరే, మేము ఏపనులు చేసి మిమ్ములను సేవించగలమో సెలవీయండి" అన్నాడు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు "కుమారా! నీకు శుభమగుగాక! నీమాటలతో సంతృప్తి చెందాను నీవు నాఆఙ్ఞతో ఆత్మసమర్పణం చేసుకున్నావు. [ ఇంకా...]

వంటలు - మాంగో ఖీర్

కావలసినవి:
తియ్య మామిడి గుజ్జు
చక్కెర పాకం
కొబ్బరి పాలు
ఎండు ద్రాక్ష - తగినన్ని

చేసే విధానం:
తియ్య మామిడి గుజ్జు తీసి వడగట్టండి. తరువాత దీన్ని ఒక స్టైన్‌లెస్ పాత్రలో పోసి, దానితో సమానమైన నీటిని కలపండి. [ ఇంకా...]

Wednesday, October 17

వంటలు - పులావ్

కావలసినవి:
బసుమతి బియ్యం - 3 కప్పులు
మామిడి పండ్ల రసం - 1కిలో
పాలు - 1 లీటర్
జున్ను - 1 కప్పు
చక్కెర - 2 కప్పులు
నెయ్యి - 3 చెంచాలు
రోజ్‌వాటర్ - 2 నిండు చెంచాలు
కుంకుమ పువ్వు - 11/2 చెంచా
బాదంకాయలు - 25
ఏలకకాయలు - 10
లవంగాలు - 6
దాల్చిన చెక్కలు - 4
ఉప్పు - చిటికెడు

చేసే విధానం:
పాలను, మామిడి రసాన్ని కలిపి రెండు సమభాగాలుగా ఉడికించండి. మూడు సార్లు బియ్యాన్ని కడిగి శుభ్రం చేసి వడబోయాలి. [ ఇంకా
...]

వంటలు - బర్ఫీ

కావలసినవి:
కొబ్బరి - ఒక కప్పు
మామిడి పండు రసం - ఒక కప్పు
నెయ్యి - ఒక చెంచాడు
పాలు - ఒక కప్పు
చక్కెర - ఒక చెంచాడు

చేసే విధానం:
మిక్సర్లో చూర్ణమయిన ఒక పూర్తి కప్పు కొబ్బరిని తీసుకోండి. [ ఇంకా
...]

పర్యాటకం - మధుర

మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించిన నేల మధుర. మువ్వగోపాలుని మృదుపద మంజీరాలు ఘల్లు ఘల్లున నడయాడిన "బృందావనమే" అది. అక్కడ అణువణువునా వినిపించే కృష్ణనామ స్మరణ భక్తుల హృదయాలను పులకింపజేస్తుంది. పరమ పవిత్రమైన ఆ పట్టణంలోని ప్రతి వీథిలోనూ కృష్ణుడు కొలువుదీరి ఉన్నాడనడానికి అక్కడి అనేక ఆలయాలే నిదర్శనం. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - పూర్ణ పురుషుడు

బుద్ధ భగవానుని సమకాలికుడైన మహావీరుడు - బుద్ధుని మహా పరిత్యాగం, బుద్ధుని తపస్సు, మానవాళిపట్ల బుద్ధుని ప్రేమను పదే పదే గుర్తుకు తెస్తాడు. బీహార్‌లోని పాట్నాకు సమీపంలోగల ఒక పట్టణంలో మహావీరుడు 599 బిసిలో జన్మించాడు. అతని తండ్రి ఒక ప్రముఖుడు. వజ్జీ రాజ్యధిపతి అయిన చేతకుని కుమార్తి ప్రియకరణి లేక త్రిశల - మహావీరుని తల్లి. బాల్యదశలో మహావీరుడు పాఠశాలకు పంపబడ్డాడు. పాఠశాలలో అధ్యాపకుల అవసరం అతనికి లేదని వివేకాన్ని అతడు మనస్సులోనే నెలకొల్పుకున్నాడు. [ఇంకా...]

Tuesday, October 16

నీతికథలు - తల్లి ప్రేమ

తల్లి ప్రేమ సాటిలేనిది. దక్షిణ భారతంలోని ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు. తల్లి వృద్ధాప్యం వల్ల కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు. అదృష్టవశాత్తూ ఇద్దరూ భాగ్యవంతులే కాకుండా తల్లి మంచి ఆరోగ్యంతోనే ఉండడం జరిగింది.
ఒక రోజు కుమారుడు తల్లితో తాను ఆమెను వదలి వెళ్ళేందుకు నిర్ణయించుకుని, మరోచోట గృహం ఏర్పర్చుకున్నానని చెప్పాడు. తాము విడిపోయేలోగా లెక్కలన్నీ తేల్చుకునే అభిలాషను కూడా తెలియచేశాడు. [ ఇంకా...]

నాటికలు - వద్దంటే పెళ్ళి

శానయ్య : తలుపేసుకోండి, ఇక్కడున్నట్టు వస్తాను.ఇల్లు పదిలం. ఇంతలో అపసవ్యాలు ఎమి జరగనియ్యవద్దు. డబ్బుకి చాటు రోజులు. నాదగ్గిర బాకీ వసూలు చేసుగోడానికని చెబుతూ కొదరూ నాకోసం రావచ్చు. వాళ్ళతోటి నేను ఊళ్ళోలేననీ, ఎక్కడ కెళ్ళానో ఎప్పుడొస్తానో తెలియదనీ, చెప్పండి. మరికొందరు నా బాకీలు వసూళ్ళు ఇవ్వడానికొస్తారు. వాళ్ళతోటిమాత్రం నేను సరయ్య ఇంట్లో ఉంటానని చెప్పండి. ( అని, కుడివేపుకి నిష్క్రమించబోయేసరికి, సరయ్య వస్తాడు). [ ఇంకా...]

పండుగలు - అంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం

మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు" అంటూ తెలుగు నేలను తల్లిగా కీర్తించిన శంకరంబాడి సుందరాచారి, "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా" అంటూ తెలుగు తేజాన్ని ఉద్వేగంతో గొంతెత్తిన వేములపల్లి శ్రీకృష్ణ, తెలుగు తల్లి సాంస్కృతిక దర్పాన్ని తమ రచనల ద్వారా తెలియజెప్పిన అనేక వేల యువ సాహితీ కుసుమాల కల్పవృక్షం ఆంధ్ర ప్రదేశ్. ఈ వృక్షానికి సాహితీ సుమాలే కాదు సంప్రదాయ సిద్ధాంతాలు కూడ వాడని పువ్వులై విరబూస్తుంటాయి. [ ఇంకా...]

వంటలు - మునగాకు చట్నీ

కావలసినవి :
మునగాకులు : కప్పు
నూనె : 2 టీస్పూన్లు
ఎండుమిర్చి : 6
సెనగపప్పు : టేబుల్ స్పూను
మినపప్పు : టేబుల్ స్పూను
చింతపండు : నిమ్మకాయంత (నీళ్ళల్లో నానబెట్టాలి)
ఉప్పు : ముప్పావు టీస్పూను
కొబ్బరి తురుము : 2టేబుల్ స్పూన్లు
ఆవాలు : అర టీస్పూను
ఇంగువ : చిటికెడు

తయారుచేసే విధానం:

పాన్లో టీస్పూను నూనె వేసి వేడిచేయాలి. ఎండుమిర్చి, సెనగపప్పు వేయించి తీయాలి. [ ఇంకా...]

వంటలు - రాజ్‌కప్స్

కావలసినవి( కప్స్ కోసం ):
మైదా - ఒకటిన్నరకప్పు
మెత్తగా రుబ్బిన బఠాణీలు -సగం కప్పు
ఉప్పు - సగం చెంచా
నూనె - రెండుచెంచాలు వేపడానికి సరిపడా నూనె
నింపడానికి
ఉడకబెట్టి ముక్కల్లా కోసిన బంగాళదుంపలు - ఆరు
ఉడకబెట్టిన శనగలు - రెండు చెంచాలు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు
ఉడకబెట్టిన బఠాణీలు - ఆరు చెంచాలు
చాట్ మసాలా - ఒక చెంచా
చిలికిన పెరుగు - ఒక కప్పు
కారం - సగం చెంచా
వేయించిన జీలకర్ర పొడి - ఒక చెంచా
ఉప్పు - తగినంత
పైన అలంకరించడానికి సన్న కారప్పూస, కొత్తిమీర కొద్దిగా, పుదీన పచ్చడి అల్లం పచ్చడి.

తయారుచేసే విధానం:
మైదాపిండిలో రుబ్బిన బఠాణీ, ఉప్పు, నూనె కొద్దిగా నీరువేసి మెత్తగా కలపాలి. [ ఇంకా...]

Monday, October 15

వంటలు - మాంగో ఐస్‌క్రీం

కావలసినవి పదార్ధాలు :
మామిడి పండ్లు - 1 కిలో
చక్కెర - 5 చెంచాలు
పాలు - 11/2 లీటర్లు
మీగడ - 4 ఔన్సులు
రోజ్ వాటర్ - ఒక ఔన్స్
తయారు చేసే విధానం:
మామిడి పండ్లను తోలు ఒలిచి, గుజ్జును ఒక మిక్సర్లో వేసుకోండి. [ ఇంకా
...]

ఆధ్యాత్మికం - రామ శబ్దము

బ్రహ్మదేవుడు 'నారాయణ' శబ్దం లోని రెండవ అక్షరమైన 'రా'ను నమశ్శివాయ శబ్దములోని రెండవ అక్షరమైన 'మ ' ను తీసుకొని రామ అను శబ్దమును సృష్టించి, సరస్వతీదేవికి చెప్పాడు. ఈ రామనామము మహా మహిమాన్వితమైనదనీ, రామనామం ఉఛ్ఛరిస్తే ఎంతో ఫలితం కలుగుతుందనీ, ముక్తిదాయకమని చెప్పాడు. ప్రక్కనే కుమారుడైన నారదుడు ఉన్నాడు. [ ఇంకా...]

వంటలు - బఠాణీ బోండా

కావలసిన పదార్థాలు:
బంగాళదుంపలు - రెండు కప్పులు( మెత్తగా ఉడికించి చిదమాలి )
బోండాల మధ్యలో పెట్టడానికి ఉడకబెట్టిన బఠాణీలు - ఒక కప్పు
నూనె - ఒక చెంచా
తరిగిన అల్లం ముక్కలు - ఒక చెంచా
కారం - సగం చెంచా
ధనియాల పొడి - ఒక చెంచా
గరం మసాలా - సగం చెంచా
సన్నగా తరిగిన కొత్తిమీర - ఒక చెంచా
ఉప్పు - రుచికి తగినంత
బోండాల పైకి
శనగపిండి - సగం కప్పు
కారం - సగం చెంచా
వాము - సగంచెంచా
సోడా - చిటికిడు
నునె - వేయించడానికి సరిపడినంత
ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం:
ఉడకబెట్టి చిదిమిన బంగాళ దుంపలకు కొద్దిగా ఉప్పుకలిపి పక్కన పెట్టుకోండి. [ ఇంకా...]

Saturday, October 13

నీతి కథలు - చీమ యుక్తి

అది ఒక పెద్ద చీమల బారు. పప్పు బద్దలను నోట కరుచుకొని, ఆ చీమలు వాటి కలుగులోకి పోతున్నాయి. చీమలు పట్టుకొని వస్తున్న ఆ పప్పులను చూడగానే ఓ తొండకు నోరు వూరింది. మెల్లిగా చీమల బారు పక్కగా చేరి చీమల నోట్లో వున్న పప్పు బద్దలను లాగుకొని తినడం మొదలు పెట్టింది. చీమలకు భయం వేసి, చెల్లా చెదురుగా తిరుగుతున్నాయి కంగారుగా! చీమల నాయకురాలు పెద్ద కండ చీమ, చీమల కంగారు చూసింది. గబగబా చీమల దగ్గరకు వచ్చి వాటికి సంజ్ఞ చేసి, దగ్గరలో వున్న ఓ కలుగు దగ్గరకు వెళ్ళి కూర్చుంది. [ఇంకా... ]

Friday, October 12

పండుగలు - రంజాన్

పవిత్రతే పరమపదసోపానంగా ముస్లిం సోదరులు భావించే మాసం రంజాన్. రంజాన్ మాసంలో పసిపిల్లలనుంచి పెద్దవారి వరకు హృదయాలు పవిత్ర భావనతో నిండిపోతాయి. మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు దైవం పంపిన పరమ పవిత్రమైన "ఖురాన్" గ్రంధం అవతరించిన మాసమిది. అందుకే ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. [ ఇంకా...]

నీతి కథలు - పారిన పథకం

గౌరీపురంలో వుండే సూరమ్మకు గయ్యాళితనము, ధనాశ ఒక పాలు ఎక్కువగానూ, పొదుపరితనము, సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగానూ వుండేవి. ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్ళు చిన్నవాళ్ళుగా వుండగానే భర్తపోగా, ఉన్న ఆస్తినే కర్పూరంలా కరిగిస్తూ వాళ్ళను పెంచుకొచ్చింది. ఈ మధ్యనే కూతురు లక్ష్మికి పెళ్ళి చేసింది. ఇక పెళ్ళికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - దివ్యప్రార్ధన

నిజ క్రైస్తవునికి ప్రతిదినం ప్రార్థనే ఊపిరి. ఒక భక్తుడు "నేను ఉదయం పూట ప్రార్థించని దినమున తల గొరిగించుకున్న సంసోను వలె ఉంటాను అన్నాడు. పరి.పౌలు మనము సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతికే నిమిత్తం - అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం, రాజులు, అధికారులకోసం విజ్ఞాపనలు, ప్రార్థనలు యాచనలను, కృతజ్ఞతా స్తుతులను చేయవలెను;(1.తిమోతి-2:1,2) అని రాసెను. ఈ భూగోళము పాపంతో భారమైనను ఇంకనూ వేడితో దహించకుండా ఉండడానికి పరిశుద్దుల ప్రార్థనలే కారణం. [ ఇంకా...]

పిల్లల పాటలు - చక్కిలిగింత పాట

ఇల్లు అలికీ - ముగ్గూ వేసి
పీటవేసి - ఆకువేసి
పప్పువేసి - పాయసం వేసి
అన్నంపెట్టి - అప్పచ్చీ పెట్టి
పాలు పెట్టీ - పెరుగు వేసి
కూరవేసి - చారు వేసి [ ఇంకా
...]

ఆధ్యాత్మికం - బిల్వాష్టకం

1. త్రిదళం త్రిగుణాకారం - త్రినేత్రంచ త్రియాయుధం!
త్రిజన్మ పాపసమ్హారం - ఏకబిల్వం శివార్పణం.
2. త్రిశాఖై ర్భిల్వపత్రైశ్చ - హ్యచ్చిద్రైతహ కోమలై శ్శుభై:!
శివపూజాం కరిష్యామి - ఏకబిల్వం శివార్పణం. [ ఇంకా
...]

Thursday, October 11

ఆహార పోషణ - ఆకులో ఏముంది?

  • పప్పు, కూర, పులుసు, బజ్జీలు, పాలక్ పన్నీర్...రకరకాలుగా తినే పాలకూరల్లో అమినోయాసిడ్స్, ఐరన్, విటమిన్ ఎ, మెగ్నీషియం, సల్ఫర్, పోటాషియం, పోలిక్ యాసిడ్ పుష్కలం. ఒక్కమాటలో చెప్పమంటే
  • టమిన్లూ లభిస్తాయందులోపరిమళభరిత పుదీనాలోనూ విటమిన్లకు, ఖనిజలవణలకు కొదవేమీలేదు. ఐరన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - భద్రాచల రామదాసు

'అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ' అని చూపిస్తూ భద్రాచల వైభవాన్ని, సౌందర్యాన్ని వేనోళ్ళ పొగడుతూ అక్కడ రామచంద్రమూర్తి లక్షణునితో కూడి స్వర్ణప్రాకారాలతో గోపురాలతో విలసిల్లే దేవాలయంలో కొలువై భూలోక వైకుంఠంగా భద్రగిరిని శోభింపజేస్తున్నాడని, అక్కడ వెల్లువలై ప్రవహించే పవిత్రమైన గౌతమిలో స్నానంచేసి శ్రీరాముని కళ్లారా చూసి తరించమంటూ, స్థావర జంగమ రూపాలతో మన కళ్ళకు కనిపించేదంతా రామమయం అని, అంతరంగంలో ఆత్మారాముడు అనంతరూపుడై వింతలు సలుపుతున్నాడు అని, భద్రాచలంలో నెలకొన్న శ్రీరామచంద్రుని సృష్టిలో అంతటా చూచి, ఆ మహాత్ముని కొనియాడి, తరించడమే ముక్తిమార్గమని బోధించే 'అంతా రామమయం బీజగమంతా రామమయం ' అనే కీర్తనలు వినని వారుండరు. [ ఇంకా...]

Wednesday, October 10

పిల్లలపాటలు - మా మంచి అమ్మ

మా అమ్మ చెప్పేది మా మంచి మాటలు
మా అమ్మ పాడేవి ఇంపైన పాటలు
మా అమ్మ చేతివి కమ్మనీ వంటలు
మా అమ్మ తినిపించు గోరుముద్దలు [ ఇంకా
...]

పర్యాటకం - వన్యలోకం

అక్కడికి వెళితే నిజంగానే ప్రకృతి ఒడిలో ఉన్నట్లే. చుట్టూ ఆకుపచ్చని గడ్డి మైదానాలు, అగాధాల వంటి లోయలు, నీలాకాశం, ఎత్తయిన కొండలు, వాటిపైన చిక్కటి దుప్పటిలాంటి వనం, దానినిండా దట్టమైన ఫల ,పూల ఫృక్షాలు, చ ల్ల గాలి, ఆ వాతావరణం మనసును వశపరచుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అది ప్రసిద్దిగాంచిన బి.ఆర్.కొండల మాటున ఉన్న ప్రముఖ అభయారణ్యం, బి.ఆర్.కొండలు, అక్కడి అరణ్యం ఒకప్పుడు అడవిదొంగ వీరప్పన్ రహస్య స్థావరాలుగా ఉండేవి. కాబట్టి పర్యాటకుల పెద్దగా అటుకేసి దృష్టి సారించలేదు. [ ఇంకా...]