Friday, November 16

పిల్లల పాటలు - బడి గంట మోగింది

బడి గంటదిగో బడి గంటదిగో
గణగణమోగెను బడిగంటదిగో
పలకా బలపం చేతను పట్టి
పుస్తకాల సంచి మూపునబెట్టి
పరుగున పోవాలి బడికి
వడిగా పోవాలి బడికి [ ఇంకా
...]

నీతి కథలు - శ్రధ్ధ లోపించిన పూజ

ఒక ఊరిలో ఒక ధనికుడు నివసించుచుండెను. అతనికి ఆస్తిపాస్తులు కొల్లలుగా గలవు. వ్యాపారము, వ్యవసాయము రెండింటియందును అతడు ధనమును బాగుగా గడించి శ్రీమంతుడయ్యను.
రెండు మూడు పెద్ద భవనములు కూడ అతనికి కలవు. అతని ఇంటిలో ఎందరో పరిచారికులు, సేద్యగాళ్ళు, గుమస్తాలు పనిచేయుచుందురు. ఒకనాడా ధనికునకు సత్యనారాయణవ్రతము చేయవలెనని సంకల్పము కలిగినది. [ ఇంకా...]

కాలచక్రం - కాలగణనం

ప్రాచీన శాస్త్రవేత్తల కాలగణనం
1 క్రాంతి = 1 సెకెండులోని 34,000లో భాగం
1 త్రుటి = 1 సెకెండులో 300వ వంతు
1 త్రుటి = 1 లవము, లేశము
2 లవములు = 1 క్షణం
30 క్షణములు = 1 విపలం
60 విపలములు = 1 పలం
60 పలములు = 1 చడి (సుమారు 24 నిమిషాలు) [ ఇంకా
...]

Thursday, November 15

వంటలు - బ్రెడ్ పకోడి

కావలసిన వస్తువులు:
శనగపిండి - 1 కప్పు.
జొన్నపిండి - 1 కప్పు.
బఠాణీ పిండి - అర కప్పు.
మజ్జిగ - 1 కప్పు.
బ్రెడ్ - 6 స్లైసులు.
ఉల్లి (తురుము) - 3 పాయలు.
మిర్చి, అల్లం పేస్టు - 2 టీ స్పూనులు.
కొత్తిమీర - 1 కట్ట.
ఉప్పు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.

తయారు చేసే విధానం :
గిన్నెలో శనగపిండి, జొన్నపిండి, ఉల్లి తురుము, అల్లం, మిర్చి పేస్టు, బఠాణీ పిండి, ఉప్పుల మిశ్రమాన్ని సరిపడినన్ని నీళ్ళతో కలిపి జారుగా చేసుకోవాలి. [ ఇంకా
...]

వంటలు - స్వీట్ కార్న్ పుడ్డింగ్

కావలసిన వస్తువులు:
కండెన్స్‌డ్ మిల్క్ - 1/4 టిన్.
బేకింగ్ పౌడర్ - 1 స్పూను.
మైదా - 150 గ్రా.
సోడా బై కార్బనైటు - 1/4 స్పూను.
వెన్న - 5 స్పూన్లు.
పాలు - 1 కప్పు .
వెనీలా ఎస్సెన్సు - 1/2 స్పూను.
పసుపు మిఠాయిరంగు - 1/4 స్పూను.

తయారు చేసే విధానం:
ముందుగా వెన్న కరిగించి, కండెన్స్‌డ్ మిల్క్, ఎస్సెన్సు, పసుపు మిఠాయి రంగు కలిపి బాగా గిలక్కొట్టాలి. [ ఇంకా
...]

పిల్లల పాటలు - అందరం సోదరులం

మతమన్నది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరమూ మానవులం అందరమూ సోదరులం [ ఇంకా
...]

Wednesday, November 14

పిల్లల పాటలు - బుజ్జి మేక

బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెల్తివీ?
రాజు గారి తోటలోన మేత కెల్తినీ.
రాజు గారి తోటలోన ఏమి చూస్తివీ?
రాణి గారి పూలచెట్ల సొగసు చూస్తినీ!
పూలచెట్లు చూసి నీవు ఊరకుంటివా?
నోరూరగా పూల చెట్లు మేసివస్తినీ. [ ఇంకా
...]

Tuesday, November 13

వంటలు - మజ్జిగ పులుసు

కావలసిన వస్తువులు:
పెరుగు - 2 కప్పులు.
శనగ పిండి - 1 స్పూను.
ధనియాలు - 1/4 టీ స్పూను.
మెంతులు - 1/4 టీ స్పూను.
ఎండు మిర్చి - 6.
వెల్లుల్లి - 10 పాయలు.
ఆవాలు - 1/2 టీ స్పూను.
కరివేపాకు - 1 రెమ్మ.
పసుపు - 1/2 టీ స్పూను.
పచ్చి మిర్చి - 5.
ఉల్లిపాయ - సగం.
సొరకాయ, వంకాయ, క్యారట్, గుమ్మడి, బెండ - 100 గ్రా.
రెఫైండ్ ఆయిల్ - కొద్దిగా.

తయారు చేసే విధానం:
పెరుగును బాగా గిలకొట్టాలి. శనగపిండిని కొన్ని నీళ్ళతో కలిపి వరుసగా కలపాలి. [ ఇంకా
...]

పిల్లల పాటలు - వారాలు - బాలుడు

ఆదివారం పుట్టిన బాలుడు - అద్భుతంగా చదువుతాడు
సోమవారం పుట్టిన బాలుడు - సత్యమునే పలుకుతాడు
మంగళవారం పుట్టిన బాలుడు - మంచి పనులు చేస్తాడు
బుధవారం పుట్టిన బాలుడు - బుద్దిమంతుడై ఉంటాడు [ ఇంకా...]

నీతి కథలు - నిద్రమత్తు

ఒక గ్రామములో రాము, రవి అనే యువకులుండేవారు. రాము ఉదయాన్నేలేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వెళ్ళేవాడు. రవి మాత్రము ఆలస్యముగా నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వెళ్ళేవాడు. రాము ఎంత చెప్పినా రవి ఉదయము నిద్రలేచేవాడుకాడు. వీళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వలన మేనమామ ఇంట్లో ఉంటున్నారు. మేనమామ భార్య రమ చాలా తెలివైనది. [ ఇంకా...]

Saturday, November 10

వంటలు - లైం షర్బత్

కావలసిన వస్తువులు:
నిమ్మరసం - 1 గ్లాసు.
పంచదార - 4 గ్లాసులు.
నీళ్ళు - 1/2 గ్లాసు.
ఉప్పు - 1 టీ స్పూన్.


తయరుచేసే విధానం:
ముందుగా మంచి రసం ఉన్న నిమ్మకాయాలు తీసుకొని, కడిగి, శుభ్రపరచి, రసం తీసి, గింజలు రాకుండా వడకట్టాలి. పంచదారలో అర గ్లాసు నీళ్ళు పోసి, తీగపాకం వచ్చేంతవరకు ఉడికనివ్వాలి. [ ఇంకా...]

వంటలు - ద్రాక్ష రసం

కావలసిన వస్తువులు:
ద్రాక్షపండ్లు - 1 కిలో.
నీళ్లు - 2 కప్పులు.
చక్కెర - తగినంత (సుమారుగా కప్పు).
బ్లాక్‌సాల్ట్ - అర టీ స్పూను.


తయారు చేసే విధానం :
కడిగిన ద్రాక్షపండ్లని మిక్సీలోగానీ జ్యూసర్‌లోగానీ వేసి నీళ్లు, చక్కెర పోసి గ్రైండ్ చేయాలి. [ ఇంకా...]

పిల్లల పాటలు - కోయిలొచ్చింది 

కోయిలొచ్చిందమ్మ
కోయి లొచ్చింది.
చలి వదలి పోగానే
సాగి వచ్చింది.
గున్న మామిడిపైని
కొలువు తీర్చింది. [ ఇంకా
...]

Thursday, November 8

వంటలు - క్యారెట్ జామ్

కావలసిన వస్తువులు:
క్యారెట్ - 250గ్రా.
పంచదార - 350 గ్రా.
నిమ్మరసం - 1 చెంచా.
నీళ్ళు - 1కప్పు.

తయారు చేసే విధానం :
క్యారెట్లను కడిగి, చెక్కుతీసుకుని తురుముకోవాలి. తురుముకు నీళ్ళు చేర్చి స్టౌమీద పెట్టి మెత్తగా ఉడికించాలి. ఉడికిన తురుముకు పంచదార చేర్చి నీళ్ళన్నీ ఇంకిపోయేవరకూ స్టౌమీద ఉంచాలి. [ ఇంకా...]

Wednesday, November 7

వంటలు - బ్లాక్ వండర్

కావలసిన వస్తువులు:
నేరేడు పండ్ల రసం - ఒక కప్పు.
రాగిపిండి - 1/2 కప్పు.
ఖర్జూరపళ్ళు - 6.
రోజ్ వాటర్ - 1 కప్పు.
ఫైవ్ స్టార్ చాక్లేట్ - 1.

తయారు చేసే విధానం:
ముందుగా నేరేడు పళ్ళను కడిగి నీటిలో వేసి పిసికి గింజలను తీసి ఒక కప్పు రసాన్ని తీసుకోవాలి. [ ఇంకా...]

వంటలు - బటర్ బర్ఫీ

కావలసిన వస్తువులు:
బటర్ - 3 కిలోలు.
చక్కెర - 2 కిలోలు.
అమూల్ మిల్క్ పౌడర్ - 1 కిలో.
గ్లూకోజ్ పౌడర్ - 100 గ్రా.
ఐస్‌క్రీం పౌడర్ - 1 టీ స్పూను.
మైదా - 100 గ్రా.

తయారు చేసే విధానం:
బటర్, మిల్క్ పౌడర్, మైదాలను మిశ్రమం చేసుకోవాలి. గిన్నెలో చక్కెరకు తగినన్ని నీళ్ళుపోసి సన్నని సెగపై తీగపాకం పట్టి బటర్, మైదా మిశ్రమాన్ని, ఐస్‌క్రీం పౌడర్, గ్లూకోజ్ పౌడర్ వరుసగా వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. [ ఇంకా
...]

పిల్లల పాటలు - చిట్టీ చిట్టీ చెల్లమ్మా

చిట్టీ చిట్టీ చెల్లెమ్మా!
పలకాబలపం తేవమ్మా!
అక్షరాలు నేర్వమ్మా
చదువు బాగా చదువమ్మా
తెలివిని బాగా పెంచమ్మా
ఇంటికి పేరు తేవమ్మా [ ఇంకా
...]

Tuesday, November 6

నీతి కథలు - నాన్నా పులి వచ్చే

ఒక ఊరిలో సోమయ్య అనే పల్లెటూరి రైతు ఉన్నాడు. అతనికి పొలం ఉంది. గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో ఒక రోజు మందని తోలుకొని వెళుతూ తన కొడుకు రంగడుని కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు.మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు. సరే అన్నాడు రంగడు. 'ఇక్కడ అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది జాగ్రతా అని హెచ్చరించి, 'ఒక వేళ పులి వస్తే కేకలు వేయమని చెప్పి తాను పొలంలోని కూలీలతో పనులు చేయించటంలో నిమగ్నమయ్యాడు సోమయ్య. [ ఇంకా...]

వంటలు - మిల్క్ మైసూర్‌ పాక్

కావలసిన వస్తువులు:
చక్కెర - 1 కిలో.
నెయ్యి - 1 కిలో.
మిల్క్‌పౌడర్ (అమూల్) - 250 గ్రా.
మైదా - 250 గ్రా.
యాలుకల పొడి - 1 టీ స్పూను.
నీళ్లు - అర లీటరు.

తయారు చేసే విధానం:
మిల్క్ పౌడర్‌లో 150 గ్రాముల నెయ్యి వేసి మిశ్రమాన్ని కలిపి ఉంచుకోవాలి. వేరొక గిన్నెలో పంచదార, నీళ్లు కలిపి తీసుకుని సన్నని సెగపై తీగపాకం పట్టి మిల్క్ పౌడర్ ముద్ద, మైదా వరుసగా వేసి కలపాలి. [ ఇంకా...]

వంటలు - వెజిటబుల్ కట్‌లెట్

కావలసిన వస్తువులు:
క్యారెట్ (సన్నగా తరిగి) - 100 గ్రా.
బీన్స్ (సన్నగా తరిగి) - 100 గ్రా.
కాలిఫ్లవర్ (సన్నగా) - 100 గ్రా.
ఆలూ గుజ్జు - 200 గ్రా.
మిర్చిపొడి, ఉప్పు, ఉల్లిపాయలు - సరిపడినంత.
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 5 గ్రా.
పసుపు - అర టీ స్పూను.
చాట్ మసాలా - 1 టీ స్పూను.
జీరా పొడి - అర టీ స్పూను.
బ్రెడ్‌ పౌడర్ - సరిపడినంత.
మైదా - 50 గ్రా.
గుడ్లు - 2.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.

తయారుచేసే విధానం:
కడాయిలో ఆయిల్ వేడిచేసి తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి దోరగా వేయించాలి. [ ఇంకా...]

పిల్లల పాటలు - బడిపిల్లలం

పిల్లలం బడిపిల్లలం
తెల్లని మల్లెలపూవులం
బాగుగ ఆటలు ఆడెదం
చక్కగా చదువులు చదివెదం [ ఇంకా
...]

Monday, November 5

నీతి కథలు - అతి పండితుడు

వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యపాలన చేస్తుంటే బోధిసత్వుడు వైశ్యకులంలో పుట్టాడు. అతనికి పండితుడని పేరు పెట్టారు. అతను పెద్దవాడయ్యాక మరో వర్తకుడితో కలిసి వ్యాపారం చెయ్యసాగారు. ఆ వ్యాపారి పేరు అతిపండితుడు. వాళ్ళిద్దరూ పై వూళ్ళు వెళ్ళి వ్యాపారం చేసి లాభంతో తిరిగి వచ్చారు. లాభం పంచుకునే సమయంలో ' నాకు రెండువంతులు రావాలి ' అన్నాడు అతి పండితుడు. [ ఇంకా...]

పిల్లల పాటలు - తెల్లవారక ముందె

తెల్లవారక ముందె నిదుర లేవాలి
తెల్లగా మీ పండ్లు తోము కోవాలి
చలియనక గిలియనక స్నానాలు చేయాలి
చలువ బట్టలు తీసి వేసుకోవాలి [ ఇంకా
...]

వంటలు - బూంది

కావలసిన వస్తువులు:
శనగపిండి - 1/2 కిలో.
వేరుశనగగింజలు - 1/4 కిలో.
కారం - తగినంత.
ఉప్పు - తగినంత.
కరివేపాకు - 2 కట్టలు.
నూనె - 1/2 కిలో.

తయారు చేసే విధానం:
శనగపిండిని జారుగా కలుపుకోవాలి. బాండీలో నూనెపోసి కాగిన తరువాత బూందీ గరిటతో బూంది దుయ్యాలి. [ ఇంకా...]

వంటలు - రవ్వ పుడ్డింగ్

కావలసిన వస్తువులు:
బొంబాయి రవ్వ - 1/2 కప్పు.
పాలు - ఒకటిన్నర కప్పు (1 1/2).
యాలుకలు - 4.
జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్.

తయారు చేసే విధానం:
ముందుగా పాలు ఒక గిన్నెలో పోసి బాగా మరగ బెట్టాలి. తీసుకున్న పాలు సగం వరకు వచ్చేటట్లు కాచాలి.
[ ఇంకా...]

Saturday, November 3

కాలచక్రం - క్యాలండర్ కథ

మానవ జీవితంలోని ప్రతి ముఖ్య ఘట్టానికీ ఓ కారణముంటుంది. అనేక ఘట్టాల ఆ సమాహారంలో లెక్కలేనన్ని వింతలు, విశేషాలు. కొన్ని వింతలు తాత్కాలికమైనవైతే, మరికొన్ని శాశ్వతమైనవి. శాశ్వతమైన ఆ వింతే .... మనిషి నిద్ర లేచినప్పటినుంచీ, పడుకునేవరకు, పుట్టిన నాటినుంచి, గిట్టే వరకు తోడు-నీడై, మార్గదర్శై, ఘడియ ఘడియకూ ఆధారభూతమైన కేలెండెర్ ఆవిష్కరణ. [ ఇంకా...]

సంస్కృతి - తప్పెట గుళ్ళు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రచారంలో ఉన్న జానపద కళారూపమిది. ఇది సంప్రదాయ నృత్యం.వర్షాలు పడక పశుగ్రాసం కష్టమైనప్పుడు దైవానుగ్రహంకోసం గొల్ల కులస్తులుఈ నృత్యం చేస్తారు. తప్పెటలను గుండెలకు వ్రేలాడగట్టుకుని వాటిని వాయిస్తూ నృత్యం చేస్తారు. ఇది జానపద సంగీత నాట్య దృశ్య రూపకం. [ ఇంకా...]

Friday, November 2

సాహిత్యం - జానపదగేయం

మానవుడు పుట్టిన పిదప పాడిన మొట్టమొదటి పాట జానపదమే. జనసామాన్యంలోనుంచి పుట్టుకొచ్చిన పాట కాబట్టి జనావళిలో ఆ పాటకు అధిక ప్రాధ్యానత ఉండడం సహజం. ఇతర ఏ సాహిత్యంతో పోల్చి చూసినా జానపద గేయమే జనం పాటగా వెలుగొందుతుంది. భాష పుట్టకముందునుంచి ఈ పాట ఉంది. జానపదం అంటే పల్లెటూరు. కావడానికి పల్లెటూరి పాటలైనా నాగరికత పూర్తిగా వెల్లివిరియని కాలంలోని ఆవాస ప్రాంతాలన్నీ జానపదాలే కాబట్టి ఈ సాహిత్యం నేడు సకల జన సాహిత్యమయ్యింది. [ ఇంకా...]

Wednesday, October 31

పండుగలు - ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం

"మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు" అంటూ తెలుగు నేలను తల్లిగా కీర్తించిన శంకరంబాడి సుందరాచారి, "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా" అంటూ తెలుగు తేజాన్ని ఉద్వేగంతో గొంతెత్తిన వేములపల్లి శ్రీకృష్ణ, తెలుగు తల్లి సాంస్కృతిక దర్పాన్ని తమ రచనల ద్వారా తెలియజెప్పిన అనేక వేల యువ సాహితీ కుసుమాల కల్పవృక్షం ఆంధ్ర ప్రదేశ్. [ ఇంకా...]

పిల్లల ఆటలు - ఏడు పెంకులు

ఎంతమంది ఆడవచ్చు : 12 మంది ఆడవచ్చు.
ఈ ఆటలో రెండు గ్రూపులు ఉండాలి. ఒక్కో గ్రూప్ లో ఆరుగురు చొప్పున రెండు గ్రూపులలో పన్నెండు మంది ఆడాలి. ఇద్దరు లీడర్లు తమ రెండు గ్రూపులకు కావలసిన వారిని కోరుకుంటారు. తరువాత 7 పెంకులను నేల మీద ఒక దాని మీద ఒకటి పేరుస్తారు. అటు వైపు ఒక గ్రూపు, ఇటు వైపు ఒక గ్రూపు నిలబడతారు. అచ్చు వేసి ముందుగా నెగ్గిన వారు బంతితో ఆ ఏడు పెంకులను కొడతారు.
[ ఇంకా...]

వంటలు - మైదా కారా (మైదా చిప్స్)

కావలసిన వస్తువులు:
మైదా - 700 గ్రా.
జీలకర్ర - 20 గ్రా.
డాల్డా - 100 గ్రా.
సోడా - చిటికెడు.
ఉప్పు, మిర్చిపొడి - సరిపడినంత.
జీలకర్ర పొడి - సరిపడినంత.
కరివేపాకు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
డాల్డా - 100 గ్రా.

తయారు చేసే విధానం :
గిన్నెలో మైదా, జీలకర్ర, ఉప్పు, సోడా, డాల్డా వరుసగా వేసి సరిపడినన్ని నీళ్లతో మిశ్రమాన్ని బాగా కలిపి పెద్ద సైజు వుండలు చేసుకోవాలి. [ ఇంకా
...]

భక్తి గీతాలు -పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీనామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే
ఇరువుగ నిసుకలోన బొరలినయుడుత భక్తికి
కరుణించి ప్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి పలుకే [ ఇంకా
...]

పిల్లల పాటలు - తూ తూ తూనీగా

తూతూ తూతూ తూనీగా
ఎగురలేము నీలాగా.
నీవు తిరుగు తున్నావంటే
వాన మాకు వచ్చే మాటే.
నీ రెక్కల అమరికలోనే
నీ కబ్బును నేరుపు తానే. [ ఇంకా
...]

Tuesday, October 30

నీతి కథలు - మొక్కలకు నీళ్ళు తోడిన దొంగలు

ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావులలోను, పంపుల్లోను నీళ్ళు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్ళు బాగా లోపలికి వెళ్ళిపొయాయి.
తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రానది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్ళు బాగా లోపలికి పోయాయి.
[ ఇంకా...]

ఆధ్యాత్మికం - ఆత్మ సౌందర్యము

సుందరమైన వస్తువు ఆనందమును గొల్పును, చక్కని పుష్పము జనులకు ఆహ్లాదమును గలుగజేయును. అట్లే సుంధర భవనము, సుందర చిత్రము, సుందర దేహము జనుల హృదయ సీమలందు ఆనందము యొక్క సంచారమునకు హేతుభూతములగుచున్నవి.
A Thing of beauty is a joy forever అను ఆంగ్లసూక్తి ఈ భావమునే స్పష్టీకరించుచున్నది. "సుందర పదార్ధము పరమానందమును గలిగజేయు" నని ఆ వాక్యముయొక్క అర్ధము.
[ ఇంకా...]

వంటలు - గోరుచిక్కుడుకాయ కూర

కావలసిన వస్తువులు:
గోరుచిక్కుడు ముక్కలు : 2 కప్పులు
తాజా పెరుగు : కప్పు (గిలకొట్టాలి)
ధనియాల పొడి : టేబుల్ స్పూను
కారం : 2 టీస్పూన్లు
సెనగపిండి : 2 టీస్పూన్లు
జీలకర్ర : టీస్పూను
ఆవాలు : అర టీస్పూను
ఇంగువ : పావు టీస్పూను
కరివేపాకు : 2 రెబ్బలు
నూనె : 2 టెబుల్ స్పూనులు
ఉప్పు : తగినంత

తయారుచేసే విధానం:
గోరుచిక్కుడు కాయలను ఈనెలుతీసి చిన్నముక్కలుగా కోయాలి. ముక్కలను కుక్కరులో రెండు వుజిల్స్ వచ్చేంతవరకు ఉడికించి నీళ్ళు వంచాలి. [ ఇంకా...]

సాహిత్యం - వాడుక బాష

ప్రజలు తమ నిత్య జీవితంలో మట్లాడుకునే భాష వాడుక భాష.
సనాతన భావాలను సమర్ధిస్తూ గ్రాంధిక భాషలో రచనలు చేయడమేగాక బిచ్చగాడితో సైతం గ్రాంధిక భాషలోనే మట్లాడేవారు కొక్కొండ వెంకటరత్నం (1842-1915)గారు. ఇంట్లో భార్యతో కూడా గ్రాంధికంలోనే సంభాషించేవారు.
వాడుక భాషలో గ్రంధ రచన సాగాలని గురజాడ పిలుపునిచ్చారు. [ ఇంకా...]

వంటలు - బంగాళదుంప చక్రాలు

కావలసిన పదార్థాలు :
పెద్దసైజు బంగాళదుంపలు - నాలుగు
నూనె లేదా నెయ్యి - వేయించడానికి సరిపడినంత
ఉడకబెట్టిన బఠాణీలు - రెండు కప్పులు ( మెత్తగా రుబ్బినవి )
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - ఒక చెంచా
పచ్చిమిరపకాయలు - రెండు ( సన్నగా తరగాలి )
జీలకర్ర - ఒక చెంచా
నూనె - ఒక చెంచా
గరం మసాలా - సగంచెంచా
ఉప్పు - తగినంత

తయారుచేసేవిధానం:
మొదట బంగాళదుంపల పొట్టు తీసి అడ్డంగా రెండు సమభాగాలుగా కట్‌చేసు కోవాలి. [ ఇంకా...]

Monday, October 29

వంటలు - మామిడి హల్వా

కావలసినవి:
మామిడి పళ్ళరసం - 8 కప్పులు
చక్కెర - 1 కిలో
పాలు - 4 పైంట్ల
నెయ్యి - 1 కిలో
బాదంకాయల తునకలు - 1/2 కప్పు
ఎండు ద్రాక్ష - తగినన్ని

చేసే విధానం:
ఒక పెద్ద బాణలిలో మామిడిరసం, చక్కెర, పాలు వేడిచేయండి. మధ్యస్థమైన వేడిలో వీటిని బాగా కలియతిప్పుతూ ఉండండి. [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - సమస్యను మించిన పరిష్కారం

పూర్వం ఒక గొప్ప చక్రవర్తి రాజ్యం పాలిస్తూ ఉండేవాడు. ఆ చక్రవర్తికి సుప్రసిద్ధుడైన మంత్రి పుంగవుడు ఉండే వాడు. అతడు మంచి కుశాగ్రబుద్ది గల ప్రజ్ఞావంతుడు. సమర్ధుడు. రాజ్యపాలనకు సంబందించిన అన్ని విషయాలలోను ఎప్పటికప్పుడు చక్రవర్తికి తగిన సలహాలను ఇస్తుండేవాడు. దూరదృష్టితో వివేకవంతమైన ఆ సలహాలను చక్రవర్తి జవదాటకుండా పాటిస్తూ ఉండేవాడు. ఆ మంత్రిగారి సహాయం, సలహాలు లేకపోతే రాజ్యపాలన కుంటుపడిపోతుందనే అభిప్రాయం చక్రవర్తికి కలిగింది. [ ఇంకా...]

పండుగలు - కార్తీక మాసము

భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - మనశ్శాంతి

మొదట మనస్సన నెట్టిదో విచారించిన తరువాత దాన్ని శాంతిపఱచు మార్గమునన్వేషింపవచ్చును. మనస్సనునది భగవదంశము. అది ప్రపంచవికారము నొందినపుడు మనస్సని, నిర్వికార స్థితినొందినపుడు ఆత్మయని పిలువబడును. సృష్టి స్థితిలయములు మనసులోనే యున్నవి. సుఖదు:ఖములు మంచి చెడ్డలు దానివల్లనే ఏర్పడుచున్నది. ఒక్క మాటలో చెప్పవలయునన్న సర్వము మనసే. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - భాగవతం వింటే బాగవుతాం

శ్రీ కృష్ణాష్టకం
1.వసుదేవసుతం దేవం - కంసచాణూరమర్ధనం
దేవకీపరమానందం - కృష్ణం వందే జగద్గురుం.
2.అతసీపుష్పసంకాశ - హారనూ పురశోభితం
రత్నకంకణకేయూరం - కృష్ణం వందే జగద్గురుం. [ ఇంకా...]

Saturday, October 27

పండుగలు - మొహర్రం

కాలం తనపని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. అది ఎవరికోసం ఆగదు.అంతులేని నిరంతర కాలప్రవాహంలో మలుపులే కానీ మజిలీలు లేవు.కాలగమనంలో ఎన్నో కేలండర్‌లు మారుతూనే ఉంటాయి.ఎన్నెన్నో సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.ఈ కాల ప్రవాహంలో నూతన సంవత్సరాలు వస్తూనే ఉంటాయి.కనుమరుగు అవుతూనే ఉంటాయి. [ ఇంకా...]

ఆహార పోషణ - పండ్లతో ఆరోగ్యం

  • ప్రతిరోజు కమలాపండు రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • బొప్పాయి పండును క్రమతప్పకుండా ప్రతిరోజూ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడాన్ని ఆరికడుతుంది.
  • జ్వరంవల్ల దాహం తీరికపోతే దానిమ్మరసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  • మధుమేహవ్యాధిగ్రస్తులకు నేరేడుపండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. [ ఇంకా...]

మీకుతెలుసా - సున్నా కథ

మంకందరికీ సున్నా తెలుసు. ఇది ఒకటికన్నా ముందు వస్తుంది. ఈ సున్నాను కనుగొనడం గణితశాస్త్రం మొత్తం మీద విప్లవాత్మక మైన మార్పు తెచ్చింది. సున్నా అనే భావన బాబిలోనియాలాంటి పలు పురాతన నాగరికతలలో కనిపించినప్పటికీ, మనం ఇవాళ ఉపయోగిస్తున్న చిహ్నం ఆ తరువాతి కాలం వరకు కనుగొనబడినది.
మద్య ఆసియా-భారత దేశాల మధ్య వర్తక వాణిజ్యా సంబంధాలు మనదేశానికి 'సున్నా' ను పరిచయం చేశాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
[ ఇంకా...]

ముఖ్యమైన ఘట్టాలు - అన్నప్రాసన

అన్నప్రాశమమంటే పుట్టిన శిశువుకు మొట్టమొదటిసరి అన్నం ముట్టించడం. ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయి.
అన్నప్రాశన చేయు విధానం: పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది మాసములందైనను వర్షాంతమందైనను, శుక్లపక్షమునందు శుక్రుడు ఆకాశమందు పరిశుద్ధుడై ప్రకాశించుచున్నపుడు నవాన్నప్రాశనము చేయవలెనని ఋషులచే చెప్పబడింనది(ముహూర్త దర్పణం).
[ ఇంకా...]

Friday, October 26

వ్రతములు - శ్రీ వైభవ లక్ష్మి వ్రతము

క్షీర సముద్రరాజతనయా, శ్రీ లక్ష్మీ, హరివల్లభ, విద్యాలక్ష్మి, రమా, వైభవలక్ష్మీ, సాంప్రదాయినీ, శ్రీ చక్ర విలసిని, యోగమాత, ప్రకృతి స్వరూపిణీ, జగద్రక్షిణీ అని అనేక నామములతో విరాజిల్లుతున్న శ్రీలక్ష్మిదేవి యైక్క పూజాకధను తెలుసుకుందాము.
వేదములలో లక్ష్మిదేవి యెక్క స్తవన రూపమును అనుసరించి సూక్తములు వివరించబడినవి.లక్ష్మిదేవి యైక్క స్వరూపాన్ని అధర్వణవేదం చాలా చక్కగా తెలియజేయుచున్నది.అదే అధర్వణ వేదమునందు ఫలములను నిర్దేశించే లక్ష్మీ హృదయము ఉపదేశించ బడినది. [ ఇంకా
...]

ఆధ్యాత్మికం - దేహమే దేవాలయం

"దేహమే దేవాలయం జీవుడే దేవుడు" అనే వేద ప్రమాణానుసారం, సృష్టిలో ఉండే ప్రతి జీవి దేహం ఒక దేవాలయమే. ప్రతి జీవి కూడా పరబ్రహ్మమే. అయితే ఇక్కడ మానవులు మినహా ఇతర ప్రాణులకు ఈ విషయం అనుభవంలోకి రాలేదు ఎందుకంటే వాటికి పుట్టుకతోనే విచక్షణాజ్ఞానం లేకుండా పుడతాయి, అదే బలహీనతను ఆసరా చేసుకొని మానవుడు ఇతర జీవుల పట్ల తనకున్న విచక్షణా జ్ఞాన్ని ఉపయోగించుకొని తన స్వార్ధం కోసం తన వశంలోకి తెచ్చుకొని ప్రయోజనాన్ని పొందుతున్నాడు. [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - విజయానికి దశ సోపానాలు

"Struggle for the existence and survival & the fittest" అని చార్లెస్ డార్విన్ పేర్కొన్నట్లు ప్రస్తుతము ప్రపంచమంతా పోటీమయమైపోయినది. ఇది 'పులి-జింక ' ఉదంతం వలె ఉంటుంది. 'జింక ' వేగంగా పరిగెత్తటం నేర్చుకొంటేనే మనగల్గుతుంది. లేదా పులి నోటికి ఆహారమౌతుంది. అయితే 'పులి ' జింక కంటే వేగంగా పరిగెత్తటం నేర్చుకోవాలి. లేదా జింక నోటికందకుండా పారిపోతుంది. [ ఇంకా...]