Wednesday, October 8

కవితలు - ఆ నవ్వులో

నిన్నటి దిగులు లేదు
రేపటి బాధ లేదు
ఆ నవ్వు

హిమానీనదం అంత స్వచ్ఛంగా
హిమాలయాలంత అందంగా
ఆ నవ్వు

నిన్నని మరిపిస్తూ
రేపటిని తలపకు రానీకుండా
నేడు నా ముందు నిలచింది సాకారమై [ఇంకా... ]

సంస్కృతి - కూచిపూడి కళాక్షేత్రం

ఈ పేరు వినని తెలుగు కళాకారుడు ఉండడు. కూచిపూడి భాగవతుల ప్రదర్శనలకు నోచుకోని గ్రామం తెలుగునాట లేదు. తమ ప్రదర్శనల ద్వారా విశ్వ విఖ్యాతినొందిన కూచిపూడి గ్రామం కృష్ణా జిల్లాలో మచిలీపట్నంకు 15 మైళ్ళ దూరంలో ఉంది. తన పదాలతో దక్షిణ దేశాన్నంతా సుసంపన్నం చేసిన క్షేత్రయ్య స్వగ్రామమైన మువ్వ గ్రామంలో 500 సంవత్సరాలకు పూర్వమే నాట్య కళకు అంకురార్పణ జరిగినట్లు చారిత్రాకాధారాలున్నాయి.

కూచిపూడి భాగాతుల ప్రదర్శనానికి మూలపురుషుడు సిదేంద్ర యోగి. ఈయన తన నాత్య గీతాభినయాలను కూచిపూడి కళాకారులకు అంకితం చేశాడు. ఆనాటినుంచీ ఈనాటివరకూ కూచిపూడి నాట్య ప్రదర్శనలు, వారి భాగవతాలూ, వంశపారంపర్యంగా ప్రచారం పొందాయి. [ఇంకా... ]

Tuesday, October 7

కధలు - సంభవామి

మూడు చక్రాల బండి... లాగుతూనే ఉన్నాడు బికారి. కడలి పోటుకు ఎరుపెక్కిన ఎర్రనీరెండ బికారిని చుట్టుముట్టి చెమటను ఆవిరుల రూపంలో హరించివేస్తోంది.
లాగుతున్నాడు... ఊపిరిని బిగబెట్టి ఒక చేతిని రిక్షా హాండిల్ బార్ మీద, మరో చేతిని బండికి కట్టిన టైరు పంజామీద...
మనసును, దృష్టిని మమేకం చేసి మరీ లాగుతున్నాడు. మూడు చక్రాల చెక్కరిక్షా... బికారి రెండు కాళ్ళతో కలిపి ఐదు చక్రాలయ్యాయి.
'ఊహు ....' కదలనని మొరాయిస్తోంది.
ఇసుకలో కూరుకుపోయిన రిక్షాబండి... మోటుపల్లి రేవు మోటుగా అన్పిచింది బికారికి.
నానావిధాల తంటాలు పడుతున్నాడు. [ఇంకా... ]

లాలి పాటలు - ఉయ్యాల జంపాల

ఉయ్యాల జంపాలలూగరావమ్మ
వెలలేని బంగారుటూగుటుయ్యాల ||ఉ||
కమలమందున బుట్టి కమలాక్షుని చేపట్టి
కామూని కన్నట్టి కంజదళనేత్రి ||ఉ|| [ఇంకా... ]

పిల్లల ఆటలు - భాషలో తమాషా

ఎంతమంది ఆడవచ్చు : పది మంది
కావలసిన వస్తువులు : పేపర్లు, పెన్సిళ్ళు లేదా పలకలు, బలపాలు
ఆడే స్థలం :గదిలో ఆడవచ్చు
ఆటగాళ్ళ వయస్సు : 7 సం||రాల వయస్సు వాళ్ళు
పోటీ సమయం : 2 నిమిషాలు

ఎటు నుంచి చదివినా ఒకే అక్షరం వచ్చే పదాలు రాయడం ఇక్కడ పోటీ. [ఇంకా... ]

నీతి కధలు - స్వశక్తి

కేశవాపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి రాము, సోము అనే ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరిగాయి. ఇల్లు పెద్దది కావటము వలన అందరూ కలసే ఉన్నారు. రాము పెద్దవాడు. ఉదయమేలేచి పొలము పనికి వెళ్ళి తండ్రికి సాయపడుతూ ఉండేవాడు. సోము సోమరిగా ఉంటూ పగటి పనికి వెళ్ళి కలలు కంటూ కాలక్షేపము చేసేవాడు. ఎవరు చెప్పినా ఏ పని చేయక పడుకొని ఉండేవాడు. కొంతకాలము గడిచింది. ఆ ఊరికి ఒక మెజీషియన్ వచ్చాడు. అనేక విద్యలు ప్రదర్శించాడు. చివరగా ధాన్యమును బంగారముగా మార్చాడు. సోమూకి ఆశ్చర్యము కలిగింది. [ఇంకా... ]

వంటలు - గోధుమపిండితో పూర్ణాలు

కావలసిన వస్తువులు:
గోధుమ పిండి - 1/4 కిలో
పచ్చి శనగపప్పు - 1/4 కిలో
బెల్లం - 1/4 కిలో
పచ్చికొబ్బరి - 1 చిప్ప
యాలుకలు - 10
నూనె - 1/2 కిలో

తయారు చేసే విధానం:

పచ్చి శనగపప్పు రాళ్ళు లేకుండా చేసుకోవాలి. బెల్లం తరగాలి. యాలుకలను పొడి కొట్టుకొని ఉంచుకోవాలి. పచ్చికొబ్బరి తురమాలి. గోధుమ పిండి జల్లించుకోవాలి. పచ్చి శనగపప్పును రెండు గంటలు నానబెట్టి నీళ్ళన్నీ ఒంపేసి కుక్కర్‌లో ఉడక బెట్టాలి. [ఇంకా... ]

Wednesday, May 28

నీతి కథలు - విలువైన ఉంగరం

ధనికుడైన వృద్ధుడొకడు తన ఆస్తిని సమభాగాలుగా తన ముగ్గురు కొడుకులకూ పంచి యిచ్చాడు. కాని విలువైన వజ్రపు ఉంగరాన్ని తను వుంచుకున్నాడు. "అలా ఎందుకు చేశావు?" అన్న ప్రశ్నకు అతను ఇలా జవాబిచ్చాడు. "ఆఖరుకు నాకు మిగిలిన ఈ వజ్రపు ఉంగరాన్ని విభజించడం సాధ్యం కాని పని. కనుక నా ముగ్గురు కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదో నేను కనుగొన్నాకనే ఈ వజ్రపు ఉంగరం వాడికి దక్కుతుంది". అతని ముగ్గురు కొడుకులూ మూడు త్రోవలలో వెళ్ళారు. కాలం అతి వేగంగా సాగిపోయింది. అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది. ముగ్గురు అన్నదమ్ములూ తండ్రి యింటికి మరలి వచ్చారు. [ఇంకా... ]

Monday, May 26

నీతి కథలు - ఎద్దు పాలు

ఒకరోజు రాజుగారికి ఎద్దుపాలు త్రాగాలని అనిపించింది. 'ఎద్దుపాలా!?' అదేమంత పెద్ద కోరిక ఎవరైనా భటులకు చెప్తే వాళ్ళుతీసుకుని వస్తారు కదా! అని మీరు అనవచ్చు. నిజమే కాని ఎద్దులు పాలు ఇవ్వవు కదా! ఆ విషయం రాజుగారికి తెలుసు అయినా కూడా బీర్బల్ ఏం చేస్తాడోనని బీర్బల్‌ను ఆ విధమైన కోరిక కోరాడు రాజుగారు. ఇప్పుడు అర్ధం అయ్యింది కదా! అక్బర్ చక్రవర్తికి ఎంత విచిత్రమైన కోరిక కలిగిందో సరే! వెంటనే బీర్బల్‌ను పిలిపించాడు. తనకు ఎద్దుపాలు త్రాగాలని ఉందని చెప్పాడు. [ఇంకా... ]

Friday, May 23

నీతి కథలు - బ్రహ్మ పుట్టినరోజు పండుగే 'ఉగాది'

మనం మన కుటుంబసభ్యుల యొక్క మాపెద్దల, గురువుల మనావతార పురుషుల యొక్క పుట్టినరోజు పండుగలను ఘనంగా జరుపుకుంటూ ఏ ఏటికాయేడు కలుపుకుంటూ వారి వారి వయస్సులను లెక్కించుకొంటున్నాము. అట్లాగే భారతదేశమందలి చాతుర్వర్ణ్యముల వారు ఈ స్రుష్టికర్యైన బ్రహ్మదేవుని పుట్టిన రీజగు చైత్రశుధ్ధపాడ్యమిని పరంపరగా జరుపుకొంటూ ఏ సంవత్సరమునకు ఆసంవత్సరం కలుపుకుంటూ నాటి నుండి నేటి వరకూ ' శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యహ బ్రాహ్మణహా ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే...' మొదలుగా సంకల్పమును చెప్పుకొనుచూ లేక చెప్పించుకొనుచూ లెకించుకొంటున్నాము. [ఇంకా... ]

Thursday, May 22

విజ్ఞానం - బ్యాంక్

బ్యాంకులలో మనం డబ్బు దాచి పెట్టుకోవటానికి రెండు విధానాలు ఉంటాయి
సేవింగ్ అకౌంట్
కరెంట్ అకౌంట్
కరెంట్ అకౌంట్ ఇది ఎక్కువగా వ్యాపారస్తులు ఉపయోగిస్తుంటారు అంటే ఎప్పటికప్పుడు డబ్బువేస్తూ ఉంటారు అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటారు.
బ్యాంకులలో మనం డబ్బు దాచి పెట్టుకోవటానికి సేవింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. అది ఉంటే మనము ఆ బ్యాంకులో డబ్బు దాచి పెట్టుకోవచ్చు. [ఇంకా... ]

నీతి కథలు - చిలుక తెలివి

వ్యాపారి ఒకడు రామచిలుకను తెచ్చి పంజరంలో పెట్టాడు. స్వేచ్చగా ఉండే చిలుకకు పంజరంలో వుండటం జైలు శిక్షగా అనిపించింది. ఎలాగయినా సరే ఈ చెరనుండి బయటపడాలని అది నిశ్చయించుకొన్నది. ఆలోచించగా ఆలోచించగా దానికొక ఉపాయం తట్టింది. అది వ్యాపారిని పిలచి నన్నిలా పంజరంలో పెడితే నీకేంటీ లాభం? నన్నొదిలి పెడితే నీకు ఆణిముత్యాలాంటి మూడు నిజాలు చెబుతాను అంది. వ్యాపారి నవ్వి ఊరుకొన్నాడు. మళ్ళీ చిలుకే అంది. మొదటినిజం చెబుతాను అదినీకు నచ్చితే నన్ను డాబాపైకి తీసుకొని వెళ్ళవచ్చు. రెండవ నిజం చెబుతాను. అదికూడా నచ్చితే కొబ్బరిచెట్టుమీద కూర్చోవడనికి నాకు అనుమతి ఇవ్వాలి. [ఇంకా... ]

Wednesday, May 21

పిల్లల పాటలు - దేశభక్తి

దేశమును ప్రేమించుమన్నా - మంచి అన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టి పెట్టోయ్ - గట్టిమేలు తలపెట్టోయ్!
పాడి పంటలు పొంగిపొర్లే - దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలదోయ్ - కండ కలవాడేను మనిషోయ్!
ఈసురోమని మనుషులుంటే - దేశమేగతి బాగుపడునోయ్
జల్దుకోని కళలెల్ల నేర్చుకు - దేశి సరుకులు నించవోయ్
అన్ని దేశల్ క్రమ్మవలె నోయి - దేశి సరుకుల నమ్మవలెపోయి
డబ్బుతేలేనట్టి నరులకు - కీర్తి సంపదలబ్బవోయ్! [ఇంకా... ]

Tuesday, May 20

నీతి కథలు - మంచి స్నేహితుడెవరు?

చాలాకాలం క్రిందట మంచితెలివితేటలు, వివేకం ఉన్నఒకరాజు ఉండేవాడు. అతడి పేరుప్రతిష్టలు ఇతరరాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును, పారితోషికంపొందేదుకూతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమతెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు. తాను తయారుచేసిన మూడుబొమ్మలనుకూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. [ఇంకా... ]

Monday, May 19

కవులు - మంగళంపల్లి శ్రీహరి ప్రసాద్, హైదరాబాద్.

1. పేరు : మంగళంపల్లి శ్రీహరి ప్రసాద్
చిరునామా : హైదరాబాద్. ఆంధ్ర ప్రదేశ్
ఈ మెయిల్ : msamyati@yahoo.com
కవితలు : స్వర్గం, సుఖం
కవి గురించి : తెలుగు కవితలు వ్రాయడంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. [ఇంకా... ]

నీతి కథలు - రాజగురువు తెలివి

ఒకప్పుడు విజయభట్ అనే రాజగురువు వుండేవాడు. ఆ ఆస్థానంలో పన్నెండు అగ్రహారాలు వుండేవి. అందులో సురేంధ్రనగర్ అగ్రహారంలో భట్ నివసించేవాడు. ఆస్థానమంతా అర్జున్ సింగ్, సాబర్ సింగ్, అనబడే అన్నదమ్ముల ఆధీనంలో వుండేది. ఇందులో అర్జున్ సింగ్ యోగ్యుడు, బుద్దిమంతుడు, ఈ విషయం రాజగురువు భట్‌కు బాగా తెలుసు. కొన్నాళ్ళకు ఆ అన్నదమ్ములు విడిపోవాలని నిశ్చయించుకొన్నారు. అయితే సురేంధ్రనగర్ అగ్రహారం కోసం ఇద్దరూ వాదులాడుకోవడం ప్రారంభించారు. ఈ విషయం రాజగురువుదాకా వెళ్ళింది. ఆయన ఆ అన్నదమ్ముల వద్దకు వచ్చాడు. వారు గురువును చూచి ఎంతో గౌరవంగా పిలిచారు. తమ సమస్యను తీర్చ వలసిందిగా కోరారు. అప్పుడు రాజగురువు వారికొక కధ చెప్పాడు. [ఇంకా... ]

Saturday, May 17

కవులు - వడలి రాధాకృష్ణ, చీరాల.

పేరు : వడలి రాధాకృష్ణ
తల్లిదండ్రులు : వడలి వెంకట సుబ్బారావు, సూరమ్మ
వయస్సు : 44 సం||లు
విద్యార్హతలు : ఎం.ఎ. పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్, ఎం.బి.ఎ. ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ (బిట్స్ పిలాని)
ఉద్యోగం : ఐటిసి లిమిటెడ్ - ఐయల్‌టీడి డివిజన్, చీరాలలో ఉద్యోగం[ఇంకా... ]

పిల్లల ఆటలు - అక్షరంతో సృష్టి

ఎంతమంది ఆడవచ్చు : ఆరుగురు
కావలసిన వస్తువులు : పెన్ను, పేపరు
ఆడే స్థలం : ఆరు బయట, గదిలోగాని
పోటీ సమయం : 10 నిమిషాలు
ఆటగాళ్ళ వయస్సు : 8 సం|| నుండి 10 సం||లలోపు
ఒకే అక్షరంతో ఏర్పడే పదాలు కనుగొనడం
'రం' అక్షరంతో
1) అంగుళీయకం
2) భూగర్భంలో రహస్య మార్గం [ఇంకా... ]

Friday, May 16

నీతి కథలు - మేకపోతు గాంభీర్యం

అనగనగా ఒక మేక దాని యజమానికి ఆ మేక అంటే ఎంతో ఇష్టం. ఆ మేకకు కృష్ణుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు ఆ యజమాని. ఒక రోజు . . . మిగతా మేకలతో కలిసి కృష్ణుడుని కూడా అడవికి మేతకు తీసుకుని వెళ్లాడు. కృష్ణుడు మేకల మందతో కలిసి అడవిలో బాగా ఆడుకుంది. కడుపునిండా గడ్డి, ఆకులు అలములు తిన్నది. ఆ రోజు దానికి చాలా ఆనందంగా ఉంది. ఉరుకులు పరుగులు పెడుతూ అడవి అంతా తిరిగిన ఆ మేకపిల్ల అందరికన్నా ముందు వెళ్లాలన్న ఉత్సాహంతో మందనుంచి తప్పిపోయింది. [ఇంకా... ]

Monday, April 28

వంటలు - పాన్ కేక్స్ (క్రిస్మస్ కేకులు)

కావలసిన వస్తువులు:
కరిగించిన వెన్న - 100 గ్రా.
పంచదార పొడి - 1/2 కప్పు.
ఆరంజ్ రసం - సగం పండు.
పైనాపిల్ ముక్కలు - 1 కప్పు (సన్నగా తరిగినవి).
మైదాపిండి - 2కప్పులు.
జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు - 2 చెంచాలు.
మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ - 100 గ్రా.

తయారు చేసే విధానం:
పంచదార పొడిని ఆరంజ్ రసంలో కలిపి, వెన్న, పిండి కూడా చేర్చి పిండిని కొంచం జారుగా కలుపుకోవాలి.[ఇంకా... ]

పిల్లల ఆటలు - అష్ట చెమ్మ

ఎంతమంది ఆడవచ్చు : ఇద్దరు లేదా నలుగురు లేదా, రెండు జంటలు ఎదురెదురుగా కూర్చొని ఆడతారు.
గవ్వలు గాని, చింతపిక్కలు గాని, అరగదీసి గాని పిక్కలను కుదిపించి ఆడాలి. పిక్కలను సమయోచితంగా కదుపుతూ, ఎదుటి వ్యక్తి పిక్కలను చంపుతూ ముందుకు దూసుకుపోవటం విజేతలక్షణం.[ఇంకా... ]

Friday, April 25

నీతి కథలు - తెచ్చిపెట్టుకొన్న తిప్పలు

గోవిందప్ప కోనేట్లో కోటి రకాల కప్పలు ఉన్నాయి. బావురు కప్పలు, పచ్చ కప్పలు, వాన కప్పలు, గోండ్రు కప్పలు, చిరు కప్పలు ఇలా ఎన్నెన్నో రకాలు. అవన్నీ కలిసిమెలిసి బ్రతుకుతున్నాయి. ఎండా, వానా తేడా లేకుండా ఎరపొరుపులు రాకుండా ఎల్లకాలం చల్లగా జీవిస్తున్నాయి. చీకూచింతా లేకుండా హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి.
కోనేటికి నాలుగు వైపులా రాతిమెట్లున్నాయి. సాయంత్రమయ్యే సరికి నగరంలో వాళ్ళంతా మెట్ల మీదకి చేరుకునేవాళ్ళు వెన్నెల రాత్రిళ్ళలో ఆ మెట్ల మీదే గడిపేవాళ్ళు. వాళ్ళు చేసే చర్చలు, వాదనలు కప్పలు వింటూ వుండేవి. రానురాను మనుషుల పద్ధతులన్నీ కప్పలకు అంటుకున్నాయి. కొంత కాలానికి కప్పలు సరికొత్త విషయం ఒకటి తెలిసింది. మనుషులు తమను పాలించడానికి ఒక 'రాజు' ని ఎన్నుకున్నారట![ఇంకా... ]

Thursday, April 24

భరతమాత ముద్దు బిడ్డలు - కందుకూరి వీరేశలింగం

పేరు : కందుకూరి వీరేశలింగం
తండ్రి పేరు : (తెలియదు)
తల్లి పేరు : (తెలియదు)
పుట్టిన తేది : 16-4-1848
పుట్టిన ప్రదేశం : రాజమండ్రి
చదివిన ప్రదేశం : రాజమండ్రి
చదువు : (తెలియదు)
గొప్పదనం : బాల్యవివాహాలను అరికట్టి, వితంతువుల పునర్వివాహలను ప్రోత్సహించారు.
స్వర్గస్తుడైన తేది : 27-5-1919

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ సాంఘీక సంస్కర్త కందుకూరి వీరేశలింగం. 1848 ఏప్రిల్ 16 న రాజమండ్రిలో ఒక సంపన్న కుటుంబంలో ఇతడు జన్మించెను. పాఠశాలలో చాలా చురుకుగా ఉండేవాడు. ఇతడు నాలుగోతరగతి చదువుతుండగా, ఉత్తమ విద్యార్ధి ఎవరు ఆనే ప్రస్తావన వచ్చినప్పుడు, విద్యార్ధుల్లో చాలా మంది ఇతని పేరును సూచించారు.[ఇంకా... ]

Wednesday, April 23

నీతి కథలు - పాలు ముట్టని పిల్లి

విజయనగరములో నివసించుచున్న ప్రజలకు ఎలుకల బాధ భరించరానిదైనది. ప్రభుత్వము ప్రజలను పిల్లులను పెంచమని ప్రోత్సహించినిది. రాయలవారు ప్రభుత్వోద్యోగులకు పిల్లులను ఉచితంగా యిప్పించారు. పిల్లులను పెంచుటకు పాలు అవసరము. కావున ఒక్కొక్క ఆవును కూడా యిప్పించినారు.
ప్రభుత్వోద్యోగులతోపాటు కవులకు, పండితులకు కూడా ఒక్కొక్క పిల్లిని, ఒక్కొక్క ఆవును యిచ్చినారు. అందరితోపాటు రామకృష్ణ కవికి కూడా ఒక పిల్లిని, ఒక ఆవును ఇచ్చినారు. రామకృష్ణుడు పిల్లిని సరిగా పెంచలేదు.[ఇంకా... ]

Monday, April 21

చిట్కాలు - బట్టలకు సంబంధించినవి

మగవారి కోటు, ప్యాంటు గుండీలు సన్నటి నైలాన్ దారంతో కుడితే చాలా కాలం తెగకుండా ఉంటాయి.
మీ పిల్లల వైట్ సాక్స్ బ్రౌన్ గా తయారయ్యాయా? నీటిలో రెండు లెమన్ స్లయిసెస్ వేసి ఆ నీటిలో ఈ సాక్సును వేసి నీటిలో బాయిల్ చేసి ఆ పైన ఉతకండి చాలు సాక్స్ తెల్లగా మెరిసిపోతాయి.
లెదర్ సోఫా పైన పిల్లలు క్రేయాన్స్ తో గీస్తే, వంటసోడా ఉప్పు కాస్త నీరు కలిపి పేస్టులా చేసి ఈ పేస్టుతో రుద్దితే మరక తొలగిపోతుంది.
సిల్క్ బట్టలు నీడలోనే ఆరవేయాలి.[ఇంకా... ]

నీతి కథలు - ఏ గుళ్ళో పెళ్ళి

పరంధామయ్య గారికి ఏడుగురు కుమార్తెలు. ఆరుగురికి వివాహాలు పూర్తి చేశాడు. కాని ఏడవకుమార్తె వివాహము గురించి సంబంధాల కోసము తెగ ప్రయత్నము చేశాడు. ఎక్కడా సరియైన సంబంధము దొరకలేదు. ఒక రోజున పరంధామయ్య పట్నంలో ఉన్న చిన్నప్పటి బాల్యస్నేహితుని ఇంటికి వెళ్ళాడు. ఆయనకు, పరంధామయ్యగారికి దూరపు చుట్టరికం కూడా వుంది. ఆయనే ఒక సంబంధం గురించి చెప్పి వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. ఆ సంబంధము పరంధామయ్య గారికి నచ్చింది. పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు.[ఇంకా... ]

Thursday, April 17

నీతి కథలు - ప్రాణం తీసిన గొప్ప

అది ఒక పెద్ద చెట్టు. దాని మొదలు దగ్గర కొన్ని రకాల రెక్కల పురుగులు చేరి, కబుర్లాడు కొంటున్నాయి. ఆ కబుర్లు పెరిగి పెరిగి, చివరికి మనలో ఎవరుగొప్ప? అనే వివాదానికి వచ్చింది!

ఆ పురుగులలో ఒక రెక్కల చీమ గబగబా ముందుకు వచ్చి చూడండి! నేను నేలమీద పాకగలను, గాలిలో ఎగరగలను 'నేనే గొప్ప' అంటూ అటూ ఇటూ తిరిగింది చరచరా! అది చూసి ఒక చీకురు పురుగు తన పెద్ద రెక్కలను ఆడిస్తూ చూడండి నా రెక్కలు ఎంత పెద్దవో, మీలో ఇంతంత పెద్ద రెక్కలు ఎవరికీ లేవు 'నేనే గొప్ప' అంది గర్వంగా, తన రెక్కలను చూసుకొంటూ, చూపిస్తూనూ! [ఇంకా... ]

Tuesday, April 8

పిల్లల ఆటలు - చెయిన్ కట్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా ఆడవచ్చు.

ఈ ఆటలో లీడర్ ఉండాలి. లీడర్ ముందుగా చిన్న చిన్న తెల్ల కాగితాలపై రకరకాల పనులు రాసి మడత పెట్టాలి. అంటే ఒక దాంట్లో పాట పాడాలి, రెండవ దాంట్లో పకపకానవ్వాలి, వరుసగా కుంటుకుంటూ రావాలి, బ్రహ్మానందం లాగా మాట్లాడాలి., బాలకృష్ణ లాగా డైలాగ్ లు చెప్పాలి అని రాయాలన్నమాట. కూర్చున్న పిల్లలందరికి తలొకటి ఇచ్చి అవి విప్పి లోపల ఉన్నది చెప్పి వరుసగా అవి చేయ్యాలని చెప్పాలి.
[ఇంకా... ]

Saturday, April 5

వంటలు - ఉగాది పచ్చడి

కావలసిన వస్తువులు:
మామిడి కాయ - ఒకటి(చిన్నది)
వేప పూత - కొంచెం
సన్నవి కొబ్బరి ముక్కలు - కొన్ని
చింతపండు - 100గ్రా
బెల్లం - 100గ్రా

తయారు చేసే విధానం :
ముందుగా చింతపండుని 1 గంట సేపు నానబెట్టి ఈనెలు రాకుండా పేస్టు తీసుకోవాలి. తరువాత వేప పూతని శుభ్రంగా పుల్లలు లేకుండా తీసుకోవాలి. మామిడి కాయని చిన్న ముక్కలుగా తరగాలి. [ఇంకా... ]

పండుగలు - ఉగాది

'బ్రహ్మ ప్రళయం' పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని 'బ్రహ్మకల్పం' అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయమును 'ఉగాది' అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ 'ఉగాది' పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభ మవడం వల్ల ఆరోజునుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.
ఈ పండగ ప్రత్యేకత 'ఉగాది పచ్చడి.' ఈ పచ్చడిలో చేరే పదార్ధాలలో వేప పువ్వు ముఖ్యమైనది. బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి ముక్కలు, కొన్ని ప్రాంతాలలో అరటిపళ్ళ గుజ్జు కూడా చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఈ చక్కని లోకం

ఎంత చక్కనిది ఈ లోకం
ఎందుకోయి ఇంకొక లోకం

కళ కళ లాడే సూర్యుడు, చంద్రుడు
మిల మిల మెఱసే చుక్కల గుంపులు
తళ తళ లాడే మెఱపు తీవలూ
కావటోయి అవి మనకోసం?

జలజల పాఱే ఏఱులు, నదులూ
తెలితెలి నురువుల సంద్రపు టలలూ
నవ నవ లాడే పచ్చని కోనలు
లేవటోయి అవి మనకోసం? [ఇంకా... ]

Friday, April 4

పిల్లల పేర్లు - య నుంచి ఱ వరకు

య నుంచి ఱ వరకు

యక్షణ, యక్షిణి, యమున, యల్లమ్మ, యవ్వని, యశస్విని, యశోద, యశోధర, యశ్వంత, యాగ్నిక, యాఘ్న, యాదగిరమ్మ, యాదమ్మ, యామిని, యామినీపుష్ప, యువతి, యువరాణి, యోగకుసుమ, యోగప్రియ, యోగమల్లిక, యోగలక్ష్మి, యోగవల్లి, యోగానందిత, యోగిత, యోగిని, యోగేశ్వరి. [ఇంకా... ]

Wednesday, April 2

సంస్కృతి, సంప్రదాయాలు - వ్రతములు

వ్రతములు
మన వైదిక సంస్కృతి మానవాళికి సాంప్రదాయాలను తెలియజేస్తూ సాధించవలసిన అంతిమ లక్ష్యం కోసం విధానాలను ఏర్పరిచాయి. మన యొక్క అంతిమ లక్ష్యం సత్యమును తెలుసుకొనుటమే. ఆ సత్యమును తెలుసుకొనుటకు వ్రతము యొక్క ఆవశ్యకతను గురించి ఈ శ్లోకంలో తెలియజేయబడినది.

శ్లోకం:
వ్రతేన దీక్షా మాప్నోతి దీక్షామాప్నోతి దక్షిణాం
దక్షిణాం శ్రద్ధా మాప్నోతి శ్రద్దయా సత్య మాప్యతే
వ్రతము వలన దీక్ష, దీక్ష వలన దక్షిణ, దక్షిణ వలన శ్రద్ధ, శ్రద్ధ వలన సత్యం లభిస్తుంది. కనుక మనము విధిగా వ్రతాలను ఆచరించాలి
వ్రతమనగా నియమిత సమయంలో నిర్దేశించిన కార్యమును ఆచరించుట. [ఇంకా... ]

Tuesday, April 1

అందరికోసం - హాస్య సంపద

టునాట్‌ఫోర్
ఏ మోయ్ టునాట్‌ఫోర్! టోపీ లేకుండా స్టేషన్‌కి ఎందుకొచ్చావు అడిగారు యస్.ఐ. ఇంటి నుండి టోపీతోనే బయలుదేరాను సార్! కానీ దారిలో ఎవడో కొట్టేశాడు సార్.

రేషన్ కార్డు
మీ వంటికి బియ్యం, పంచదార, గోధుమ,నూక, బియ్యం పడవు కాబట్టి.... అని డాక్టర్ చెపుతుండగా!
పేషంట్ : నా రేషన్ కార్డు మాత్రం చస్తే యివ్వను. [ఇంకా... ]

Monday, March 31

నీతి కథలు - డాబుసరి వేషాలు

తుంగభద్ర వొడ్డున పెద్ద అడవి. అడవిలో చెప్పలేనన్ని రకరకాల పక్షులు. వసంత ఋతువులో ఆ అడవి అందం చూడాలి! ఇంతా అంతా అనికాదు ఎంతో అందం! అంతకుమించిన ఆనందంతొ పక్షులు కలకలలాడుతూ ఉల్లాసంగా ఉండేవి. ఏటేటా వసంత ఋతువులో అడవి పక్షులన్నీ కలిసి పెద్ద పండగ చేసుకొనేవి. ఆ పండగలోనే తమ కొక 'పెద్ద' ని యెంచుకొనేవి. ఒక పండగకు పక్షులు వరుణుణ్ణి రావలసిందని ఆహ్వానించాయి. మబ్బు గుర్రాల్ని కట్టుకుని గాలిరథం యెక్కి వరుణుడు వచ్చాడు. మబ్బుల్ని చూస్తే చాలు నెమళ్ళు పురివిప్పి నృత్యం చేస్తాయి. [ఇంకా... ]

Saturday, March 29

సాహిత్యం - మాట

ఏ భాషలోనైనా భాష యొక్క శబ్ద స్వరూపంలోను, నిర్మాణంలోను జరిగే మార్పుల వల్ల, పదజాలానికి అర్ధంలో కలిగే మార్పుల వల్ల భాషా పరిణామం జరుగుతూంటుంది. పదజాలానికి అర్ధంలో కలిగే మార్పుల వల్ల అర్ధ విపరిణామం కూడా జరుగుతుంది. పద స్వరూపం మార్పు చెందకుండానే అర్ధ విపరిణామం జరుగవచ్చు. పద స్వరూపం మారినప్పుడు అర్ధం మార్పు చెందాలనే నియమం ఉండదు. తెలుగు భాషా పదజాలంలో ధ్వని అనుకరణ పదాలు, నిష్పన్న రూపాలు, తద్దిత రూపాలు, సమాసాలు, శబ్ద పల్లవాలు, ఆమ్రేడిత రూపాలు, లక్ష్యార్ధ ప్రయోగాలు, జాతీయాలు అనేకార్ధ పదాలు ఉన్నాయి. తెలుగు దేశ చరిత్రలో విజయనగరం, కొండవీడు, నెల్లూరు, అద్దంకి, రాజమహేంద్రవరం, వరంగల్లు, చంద్రగిరి వేరు వేరు కాలాలలో రాజధానులుగా ఉండేవి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - కాండిల్ లైట్ పోటీ

ఎంతమంది పాల్గొనవచ్చు : 4
ఆడే స్థలం : గదిలో
కావలసిన వస్తువులు : కొవ్వొత్తులు 4, అగ్గిపెట్టెలు 4
ఆటగాళ్ళవయస్సు : 6 సంవత్సరాలు
పోటీ సమయం : 2 నిమిషాలు

ఆటగాళ్ళు గదిలో కూర్చోవాలి. అందరిముందు ఒక్కొక్క కొవ్వొత్తి అగ్గిపెట్టెని ఉంచాలి. లీడర్ స్టార్ట్ చెప్పగానే ఆటగాళ్ళు తమ ముందున్న కొవ్వొత్తులను అగ్గిపెట్టెతో వెలిగించాలి. [ఇంకా... ]

Thursday, March 27

పిల్లల పాటలు - కృష్ణ వేణి

బిరబిరా చరచరా ముందునకు సాగేవు
చివరకా మున్నీట మాయమై పోయేవు
పరుగులిక చాలునే ఓ కృష్ణవేణి!
కరుణించవే మమ్ము నిత్యకల్యాణి!

తెలియదటనే నీకు మున్నొక్కనాడు
కలిమిలో పేరొందె మా తెలుగునాడు
తొలగిపోయిన వెనుక ఆ గొప్ప సిరులు,
అలముకొన్నవి తల్లి చీకటుల తెరలు! [ఇంకా... ]

Tuesday, March 25

వంటలు - మైదాపిండితో పాల బూరెలు

కావలసిన వస్తువులు:
మైదాపిండి - 1/2 కిలో.
పంచదార లేక బెల్లం - 400 గ్రా.
నూనె - 1/2 కిలో.
యాలుకలు - 10.
పాలు - సరిపడా.

తయారుచేసే విధానం:
మైదా పిండిని శుభ్రంగా జల్లించుకోవాలి. పాలల్లో పంచదార లేక బెల్లాన్ని నాననివ్వాలి. మైదాపిండిని కలపాలి. అట్లపిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి. యాలకుల పొడి కూడా వేసి కలపాలి. [ఇంకా... ]

Friday, March 21

నీతి కథలు - జ్ఞానోదయం

వేసవి సెలవులు ముగియగానే తిరిగి పాఠశాలలు తెరిచారు. పాత కొత్త విద్యార్థులతో పాఠశాల కళకళలాడసాగింది. ఐదో తరగతి చదువుతూ పాఠశాలకు డుమ్మా కొట్టిన అనిల్ పుస్తకాల సంచిని తగిలించుకొని తన చిట్టి తమ్ముడిని వెంట బెట్టుకొని పాఠశాలలోకి అడుగుపెట్టాడు.
అనిల్‌ని చూడగానే ఆనందంగా సత్యం మాస్టారు బాబూ! అనిల్ ప్రభుత్వ ఉత్తర్వులమేరకు వేసవిలో పాఠశాల పెట్టి నీలాంటి బడి మానేసిన పిల్లలకు పాఠాలు చెప్పడం మేలే అయ్యింది. [ఇంకా... ]

Thursday, March 20

నీతి కథలు - కుక్క బుద్ధి - చీమ సుద్దు

అదొక ఖాళీ ప్రదేశం. వీధిలో రెండు ఇళ్ళ మధ్యన ఉంది. ఆ వీధి వారందరికీ ఆ ఖాళీ స్థలం ఓ చెత్త కుండీలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ స్థలానికి యజమాని ఒక నల్లకుక్క! ఆ నల్ల కుక్క, చుట్టు ప్రక్కల ఇళ్ళ వారు, తిని పారవేసిన విస్తరాకులలోని మెతుకులు తింటూ, ఆ దొడ్డిలో నలుమూలలా తిరుగుతూ ఉంటుంది. ఏ మూల ఏ చప్పుడైనా ఉలిక్కి పడి చూస్తూ!కోపంగా గుర్రుపెడుతుంది ఆ కుక్క. ఎప్పుడైనా మరో కుక్క ఆ స్థలంలోకి వచ్చిందంటే దాని మీద పడి, రక్కి, కరిచి ఆ కుక్కను అవతలకు తరిమివేస్తుంది. [ఇంకా... ]

Tuesday, March 18

శతకాలు -శ్రీ నరసింహ శతకము

సీ|| నరసింహ! నీ దివ్యనామ మంత్రము చేత
దురితజాలము లెల్లఁదోలవచ్చు,
నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత
బలువైన రోగముల్ బాపవచ్చు,
నరసింహ! నీ దివ్యనామమంత్రము చేత
రిపు సంఘముల సంహరింపవచ్చు,
నరసింహ! నీ దివ్య నామమంత్రము చేత
దండహస్తుని బంట్లఁ దఱుమవచ్చు. [ఇంకా... ]

నీతి కథలు - ఎప్పుడో చదువుకున్న చందమామ కథ

అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో సౌరభూడు (అసలు కథలో పేరు గుర్తు లేదు ప్రస్తుతానికి సౌరభుడు అని అనుకుందాం) అందరితో పాటే వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. కానీ అప్పుడప్పుడూ ఆశువుగా కవిత్వం చెప్పేవాడు. విన్న నలుగురూ బాగుంది, బాగుంది అనేవారు. అలా మొదలై ప్రతి రోజూ మద్యాహ్నం భోజనం వేళ ఇతను కవిత్వం చెప్పడం తోటి వారంతా చేరి బాగు బాగు అనడం ఓ దినచర్యలా మారిపొయింది. [ఇంకా... ]

Monday, March 17

సాహిత్యం - తెలుగు సామెతల్లో స్త్రీ

సామెత సమానార్ధం కలది. చెప్పదలుచుకున్న మాటకు పర్యాయపదంగా మరోమాట చెప్పడం. సామెతలు నిత్యజీవితంలో జన వ్యవహారంలో వినవచ్చునటువంటి సర్వసాధారణమైన వాక్యాలు. వ్యక్తి జీవితంలోనూ, సంఘ జీవితంలోనూ అనుభవంచేత గోచరమగు సత్యాలు సామెతలందు ఇమిడివుంటాయి. సామెత అను పదంలో సామ్యము అంటే పోలిక ఉండుటచే సామెతలు అలంకారములకు ఆయువుపట్టులాంటివి. యతిప్రాసలకు ప్రాణంవంటివి. అనిర్వచనీయమైన గుణమేదో సామెతల్లో ఇమిడియుండుటచే కాలక్రమేణా దేశంలో ఆనోటా ఈనోటా పడి నలిగి ఎక్కువ వాడుకలోకి వచ్చాయి. [ఇంకా... ]

Saturday, March 15

పిల్లల పాటలు - ఎందుకురా?

ఎండలు కాసేదెందుకురా?
మబ్బులు పట్టేటందుకురా.
మబ్బులు పట్టేదెందుకురా?
వానలు కురిసేటందుకురా.
వానలు కురిసేదెందుకురా?
చెరువులు నిండేటందుకురా.
చెరువులు నిండేదెందుకురా? [ఇంకా... ]

Friday, March 14

నీతి కథలు - ఇది నిజం

ఓ ఊరిలో ఇద్దరు మిత్రులున్నారట వారిద్దరూ ఎప్పుడూ ఏదో విషయంగా వారు వాదులాడుకుంటూనే ఉంటారట. ఆ ఊరి వాళ్ళకు వీరి గోల తెలిసినా, క్రొత్తగా ఆ ఊరు వచ్చిన ఆసామికి వీరి గోల తలనొప్పిగా అనిపించి మిత్రులంటే ఏకమాటగా, ఏకత్వంగా, శాంతియుతంగా ఉండాలే కానీ, అయినదానికీ, కానిదానికీ కీచులాడుకునే వాళ్ళు అసలు మిత్రులెలా అవుతారు. అని అనుకొని ఆ విషయమే వారిని సూటిగా అడుగుతూ "మొగుడూ పెళ్ళాల మైత్రి ఎలాంటిదో గాఢ మైత్రి బంధం కూడా అంతే, అంటే భార్య కోపిస్తే భర్త సర్దుకుపోవాలి, భర్త కోపిస్తే భార్య తగ్గాలి. [ఇంకా... ]

Thursday, March 13

నీతి కథలు - తప్పింపతరమా

సింగడి పేరు చెబితే పసిపిల్లలు కూడా ఏడుపు మానేస్తారు. సింగడి పేరు చెబితే పాములు కూడా పడగలు వాలుస్తాయి. సింగడి పేరు చెబితే సింహాలు కూడా తోకలు ముడుస్తాయి. సిరిపురం సింగడంటే గజదొంగలు కూడా తలలూపుతూ కిటికీలతో సహా మూసుకుంటారు. సింగడికి సిబ్బంది లేదు. తోటి దొంగలు లేరు. అతని సైన్యం అంతా అతనొక్కడే. చాలా తెలివితేటలుగా దొంగతనాలు చేస్తాడు. వేషాలు మార్చడం, భాషలు మార్చడంలో సింగడికి సింగడే సాటి. పగలంతా సందుకో వేషంలో తిరుగుతూ తను దొంగతనం చేయ్యాలనుకున్న యింట అనుపాన్లు, గుట్లు గ్రహిస్తాడు. నాలుగయిదు రోజులు ఆ ఇంటి వాళ్ళు తన వేషాన్ని మర్చిపోయేంత వరకూ మౌనంగా ఉండిపోతాడు. [ఇంకా... ]

Wednesday, March 12

భరతమాత బిడ్డలు - సి.వి. రామన్

శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి. రామన్)
పేరు :శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి. రామన్)
తండ్రి పేరు :(తెలియదు)
తల్లి పేరు : పార్వతి అమ్మాళ్
పుట్టిన తేది : 7-11-1888
పుట్టిన ప్రదేశం : తమిళనాడులోని తిరుచినాపల్లి
చదివిన ప్రదేశం : లండన్
చదువు : ఐసియస్
గొప్పదనం : కాంతి పరిక్షేపనం గురించి పరిశోధనచేసి అందులో విజయంసాధించారు. ఈయనకు బ్రిటీషువారు నైట్‌హుడ్ అనే బిరుదునిచ్చింది. భారత ప్రభుత్వం నోబెల్ బహుమతిని అందజేసింది.
స్వర్గస్తుడైన తేది : 20-11-1970
భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్). [ఇంకా... ]

Friday, March 7

వంటలు - వెన్న ఉండలు

కావలసిన వస్తువులు:
బియ్యంపిండి - అర కిలో.
నూనె - అర లీటరు.
నువ్వులు - 100 గ్రా.
వాము - 2-3 చెంచాలు.
ఉప్పు - సరిపడినంత.
కారం - సరిపడినంత.

తయారుచేసే విధానం :
వాము నూరుకోవాలి. నీళ్ళు మరిగించి అందులో ఉప్పు కారాలు జీలకర్ర, వాము వెయ్యాలి. [ఇంకా... ]

Thursday, March 6

వంటలు - పెసర ఆవకాయ

కావలసిన వస్తువులు:
పుల్లమామిడి కాయలు : 8.
పెసరపప్పు : 1/4 కిలో.
నువ్వుల నూనె : 1/2 కిలో.
కారం : 1/4 కిలో.
ఉప్పు : 1/4 కిలో.
మెంతులు : 1 టీ స్పూను.
ఆవాలు : 1 టీ స్పూను..
ఇంగువ : చిటికెడు.
పసుపు : చిటికెడు.

తయారుచేసే విధానం:
మామిడి కాయలను శుభ్రంగా కడిగి టెంకతో సహా ముక్కలుగా కోసి పొడిగుడ్డతో తుడిచి ఉంచుకోవాలి. పెసరపప్పుని ఓ బాణలిలో వేయించి మెత్తగా పొడి చేయాలి. పొడిగా ఉన్న పాత్ర తీసుకొని అందులో ముక్కలు, పొడి, ఉప్పు, కారం, పసుపు, పావుకిలో నూనె వేసి బాగా కలపాలి. [ఇంకా... ]