Saturday, October 18
జానపద కళారూపాలు - బుర్రకథలు
మన జానపద కళాసంపదకు లోటులేదు. కావలసినన్ని జానపద కళారూపాలు మనకు ఉన్నాయి. బుర్రకథలు ఎప్పటినుంచీ ప్రచారంలో ఉన్నాయో సరిగా తెలియదు కాని రామాయణ కాలానికే - ఇవి ఉన్నట్టు తెలుస్తూంది. బుఱ్ఱ కథ ఇవి బొబ్బిలి వరస కథలనుండి, జంగం కథలనుండి రాజకీయ ప్రబోధం ప్రధానోద్దేశంగా సుమారు 1942 ప్రాంతాల్లో అవతరించాయని కొందరి అభిప్రాయం. గుంటురు జిల్లా వీటి జన్మస్థలము. తంత్రి మరియు బుర్ర అనే శబ్దాలు కలిసి తంబుర శబ్దం ఏర్పడింది. ఈ తంబురతో చెప్పే కథలు కనుక ఇవి తంబుర కథలై రానురాను ఆ రూపం మారి బుర్రకథలు అనే రూపం ఏర్పడింది. గుమ్మెటలను బుర్రలు అని గుంటూరు జిల్లాలో వ్యవహరిస్తారు కనుక బుర్రలు కొడుతూ చెప్పే కథలు బుర్రకథలు అని రూపం ఏర్పడి ఉండొచ్చని విమర్శకుల అభిప్రాయం. [ఇంకా... ]
కథలు - నింగినీడలు
'అది అంతే' ఒకింత స్వరాన్ని పెంచుతూ అన్నాడు కమలాకరం. సిరిమల్లికి మొదట్లో అర్ధం కాలేదు. చూస్తుంటే అసలు ఆ మనిషే అర్ధం కాకుండా ఉన్నాడు.
'నా చేతిలో ఏముంది చెప్పండి. అన్నింటికీ ఆ పైవాడి మీద భారం వేయడం తప్ప'
'భారాలు, తులాభారాలు సరే, అసలు ఎవరి భారాలు వారికి ఉంటాయ్ కమలాకరం మాటల్లో ఒకింత అసహనం కనిపిస్తోంది.
'దానికి నేను చేసేదేముంది' ఎడం వైపు ఒత్తిగిల్లుతూ అంది సిరిమల్లి.
'ఇవిగో బలానికి ఇంజక్షన్లు, టానిక్‌లు. ఈ పళ్ళు తీసుకుంటే కడుపులో బేబీగ్రోత్ బాగుంటుంది. ఆరోగ్యం బాగా చూసుకోవలసిన భాద్యత నీదే! బ్యాగ్‌ని ప్రక్కనే ఉన్న టీపాయ్ మీద పెడుతూ అంది దాక్షిణ్య.
సిరిమల్లె వాటి వైపు చూసుకుంది. కొంతకాలమైనా తనను గురించి పట్టించుకునే మనుషులు. కానీ అదే మనుషుల్లో కొంత స్వార్థం, అవసరం తాలూకు ఉద్దేశాలు. వారంతా గత తొమ్మిది మాసాలుగా అంతకు ముందు కొన్నినెలలుగా తన ఇంటిచుట్టూ, తన పేదరికం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. [ఇంకా... ]

తెలుగు బిడ్డలు - త్యాగయ్య
పేరు - త్యాగయ్య.
తండ్రి పేరు - రామబ్రహ్మం.
తల్లి పేరు - సీతమ్మ.
పుట్టిన తేది - 4-5-1767.
పుట్టిన ప్రదేశం - తిరువారూర్.
కాకర్ల త్యాగయ్య 1767వ సంవత్సరం మే నెల నాలుగవ తారీఖున తంజావూరు జిల్లాలోని కావేరీ నదీ తీరంలోని తిరువారూర్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి రామబ్రహ్మం మహాభక్తుడు. తంజావూరును పాలించిన రాజుల అభిమానాన్ని పొందిన రామభక్తుడు. తల్లి సీతమ్మ త్యాగయ్యను ఎంతో ప్రేమతో తన కీర్తనలలో 'సీతమ్మ మాయమ్మ... శ్రీరాముడు మాతండ్రి' అని గానం చేశాడు. తన ఆరాధ్య దైవాలైన సీతారాముల పేర్లు తన తల్లిదండ్రుల పేర్లు కావటం అతనికి ఎంతో ఆనందం కలిగించింది. తల్లి పేరును కొంతమంది రచయితలు శాంతమ్మగా రాశారు, కానీ అది నిజంకాదు. ఆయన రచించిన 'ప్రహ్లాద భక్తి విజయం' అనే రూపకంలో తండ్రిపై ప్రేమతో తండ్రి రామబ్రహ్మం గురించి ప్రస్తావించాడు. [ఇంకా... ]

వ్రతములు - అట్లతద్దె
ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
ఒక రాచ చిన్నది తోడి చెలికత్తెలతో కలసి అట్ల తద్దె నోమును నోచుటకు వుపవాసముండెను, మూడు జాములు దాటు సరికి రాచ బిడ్డ సుకుమారి యగుటచే శోషవచ్చి పడిపోయెను. అంతట నామె అన్నలు వచ్చి ఆమె అట్లు పడి పోవుటకు కారణమును తల్లి వలన గ్రహించిరి, వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చు వరకు నుండ లేదని అనుకొని ఒక చింతచెట్టు కొమ్మకు అద్దము కట్టి దానికి యెదుట అరికె కుప్పకు అగ్గిని పెట్టి చెల్లిని లేపి "అడుగో చంద్రుడు వచ్చెను. భోజనమును చేయు" మనిరి. అద్దములో నిప్పు చూచి చంద్రుడే వచ్చెననుకొని, ఆమె భోజనము జేసెను. [ఇంకా... ]

లాలి పాటలు - పవళింపు పాట
పవళింప వేంచేయు సమయము స్వామీ ||ప||
పసిడి పాదుకలూని పడతి సీత కేలూని ||ప||
రసిక జనుల గొల్వ రత్న పాదుకలూని
వసియింప వేంచేయి సమయము స్వామీ ||ప||
ముసిముసి నగవుల మోహనకారుడై
ముదమున వేంచేయు సమయము స్వామీ ||ప||
దశరధాత్మజుడిదె దయతోడ నరసింహ
దాసుని ప్రార్ధన సకలము చేకొని ||ప|| [ఇంకా... ]

Friday, October 17
జానపద గీతాలు - మొక్కజొన్న తోటలో
సుక్కలన్ని కొండమీద - సోకుజేసుకునే వేళ,
పంటబోది వరమడితో - పకపక నవ్వే వేళ,
సల్లగాలి తోటకంత - సక్కలగిల్లి పెట్టువేళ,
మొక్కజొన్న తోటలో - ముసిరిన సీకట్లలో,
మంచెకాడ కలుసుకో, - మరువకు మామయ్య,
చీకటి మిణుగురు జోతుల - చిటిల చిల్లులడక మునే,
సుద్దులరాగాలు చెవుల - నిద్దరతీయక మునుపే,
ఆకాశపుటొడిని తోట - ఆవలింత గొనక మునే,
పొద్దువాలుగంటనే - పుంతదారి వెంటనే,
సద్దుమణగనిచ్చిరా - ముద్దులమామయ్య! [ఇంకా... ]

మీకు తెలుసా - కాగితం కథ
క్రీ.పూ. 3500 సంవత్సరం ప్రాంతంలో పురాతన ప్రపంచంలో రాయడం కోసం వాడబడిన వస్తువు "పేపిరస్" అనే పదం నుండి "పేపర్" వచ్చింది. ప్రాచీన ఈజిప్టులోని ప్రజలు రాయడానికి ఒక కాడ నుండి ఈ పేపిరస్ తయారుచేయబడేది. దృఢత్వానికీ, ఎడారిలోని పొడిగాలికీ అనువైన పేపిరస్ పైన నమోదైన పాత రికార్డులు యింకా లభిస్తున్నాయి. వాటి వల్ల మనం గత నాగరికతల గురించి చక్కగా తెలుసుకోగలుగుతున్నాము. పురాతన కాలంలో గొర్రె లేక మేక తోలునుండి తయారుచేసిన తోలు కాగితం కూడా రాయడానికి ఉపకరించేది. తోలు కాగితంగానీ రాసే పేపరస్‌గానీ ఖరీదైనవి. చాలా తరచుగా తక్కువ ఖరీదైన చిన్న మైనపు పలకలకు అవి భర్తీ చేయవడ్డాయి. చాలాసార్లు శుభ్రంగా గీకివేసి మళ్ళీ రాతకు వాడుకునేలాగ జంతువుల తోళ్ళు ఉపకరించాయి. [ఇంకా... ]
వంటలు - ఉప్పిడి పిండి
కావలసిన వస్తువులు:
పాలు - 5 లీటర్లు.
చక్కెర - 600 గ్రా.
కేసరి (కుంకుమపువ్వు) - 3 గ్రా.
బాదంపప్పు - 100 గ్రా.
తయారు చేసే విధానం :
పాలు బాగా చిక్కబడేంతవరకు సన్నని సెగపై మరిగించి, ఆపై ట్రేలో పోయాలి. ఫ్యాను గాలికింద ఆరబెట్టి కోవ సిద్ధంచేసుకోవాలి. కోవా గట్టిపడ్డ తర్వాత కొద్దిగా తీసుకుని దానిలో కుంకుమపువ్వు వేసి కొంచెం వేడిపాలు పోయాలి. [ఇంకా... ]

ముఖ్యమైన ఘట్టాలు - బారసాల
బారసాల అంటే
దీనిని అసలు బాల సారె అంటారు. అది వాడుకలోకి వచ్చే సరికి బారసాల అయినది. అసలు బారసాల అంటే పేరు పెట్టటం లేదా నామకరణం చేయటం అని అర్థం.
ఎందుకు చేస్తారు
పుట్టిన బాబుకో లేదా పాపకో పేరు పెట్టటానికి చేస్తారు.
ఎప్పుడు చేస్తారు
పుట్టిన 11 వ రోజు నుండి 27 వ రోజు లోపల చేస్తారు. ఈ రోజులలో 11, 21, 27 రోజులలో చాలా మంది చేస్తారు, అలానే బేసి సంఖ్యలు వచ్చే ఏ రోజైనా చేసుకోవచ్చు. ఈ రోజులలో చేసేటట్లైతే మంచి రోజులు చూసుకో నవసరం లేదు. అప్పుడు కుదరక పోతే పాపో, బాబో పుట్టిన 3 నెలల్లో చేస్తారు కానీ వీలుంటే నెలలోపల చేస్తేనే మంచిది.
ఎవరు చేస్తారు
అమ్మాయి పుట్టింటి వాళ్ళు చేస్తారు. [ఇంకా... ]

ఇతిహాసాలు - కంసుడు
కంసుడు ఉగ్రసేనుని కుమారుడు. రాక్షసాంశచే పుట్టుటవలన క్షత్రియుడైనా నిర్ధాక్షిణ్యము, కఠినత్వం, దుర్మార్గం మొదలైన అంశములు బంధించి మధురా నగరానికి రాజయినాడు. జరాసంధుడు తన కుమారులైన ఆస్తి పాస్తిలను ఇతనికిచ్చి వివాహం జరిపించాడు. శిశుపాల దంత వక్ర్తులు, రుక్మి మొదలైన వారు ఈతని మిత్రులు. తన సోదరిని వసుదేవునికిచ్చి వైభవంగా వివాహము జరిపించి బావతో నగరంలోకి వస్తున్నాడు. ఆనందంగా రధం నడుపుతూ, మార్గమధ్యంలో ఆకాశవాణి మెరుపులా మెరుస్తూ "ఈనీ చెల్లెలు దేవకీ గర్భవాసాన జన్మించిన 8వ శిశువు వలన నీకు మరణం తప్పదు" అని హెచ్చరించెను. ఆ హెచ్చరిక వింటూనే ఆవేశంతో రధం నుండి కిందకు దూకి చెల్లెలిని క్రిందకీడ్చి కత్తితో ఆమెను నరకబోయెను. కానీ వసుదేవుడు "బావా! శాంతించు! ఈమె గర్భమునందు జన్మించిన ఎనిమిదవ శిశువు వల్లనే గదా! నీకు ప్రాణగండము! ఈమె ఏమిచేసింది? స్త్రీని, అబలను, పైగా నీ చెల్లెలిని చంపటం భావ్యంకాదు విడువు" అంటూ బ్రతిమిలాడెను. [ఇంకా... ]
Thursday, October 16
వ్యక్తిత్వ వికాసం - విద్యార్థుల అద్భుత ఙ్ఞాపకశక్తికి 35 టెక్నిక్‌లు
విద్యార్థుల అద్భుత ఙ్ఞాపకశక్తికి 35 టెక్నిక్‌లు
1. మీ ఙ్ఞాపకశక్తి మీద అంచలమైన నమ్మకం, ఆశావహ దృక్పథం.
2. ఙ్ఞాపకశక్తి పెంపొందించాలంటే ఇంట్లో పరిస్థితులు సజావుగా ఉండాలి.
3. ఙ్ఞాపకశక్తి వృద్ధి కోసం పరిశీలన, ఆలోచన అవసరం.
4. మీకు సులభంగా అర్థమయ్యే పాఠ్యపుస్తకాలనే ఎన్నుకోండి.
5. సరైన ఙ్ఞాపకశక్తి కోసం చక్కటి ఆహారం.
6. ఒక చిన్న ధ్యానపు టెక్నిక్ ద్వారా ఙ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం.
7. ఇంగ్లీషు అక్షరాలను అన్వయించి ఫార్ములాలని, లెక్కలను కనుగొనుట.
8. లింకు పద్థతి ద్వారా జ్ఞాపకం వుంచుకోవడం (Acronym method).
9. ఫార్ములాలని గుర్తు పెట్టుకోవడం.
10. ఇంగ్లీషులో పదాలను గుర్తు పెట్టుకోవడం. [ఇంకా... ]

కవితలు - తేనెకన్న మధురం మన తెలుగు
తేనెకన్న మధురం రా, తెలుగు ఆ
తెలుగుదనం మా కంటి వెలుగు
తెలుగుగడ్డ పోతుగడ్డ ఎంత పచ్చన, మా
తెలుగు గుండెలో స్నేహము ఎంతను!
మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లన, మన
తరతరాల కథను పాడు గుండె ఝల్లన [ఇంకా... ]
తెలుగుదనం మా కంటి వెలుగు
తెలుగుగడ్డ పోతుగడ్డ ఎంత పచ్చన, మా
తెలుగు గుండెలో స్నేహము ఎంతను!
మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లన, మన
తరతరాల కథను పాడు గుండె ఝల్లన [ఇంకా... ]
భక్తి సుధ - శ్రీ దశావతార స్తుతి
1. వేదోధారవిచారమతే ! సోమకదానవసమ్హరణ!
మీనాకారశరీర! నమో భక్తంతే పరిపాలయ మాం.
నామస్మరణా ధన్యోపాయం న హిపశ్యామో భవతరణే !
రామ ! హరే ! కృష్ణ ! హరే తవ నామ పదామి సదా నృహరే !
2. మంథాచలధారణ హేతో దేవాసుర పరిపాల విభో
కూర్మాకార శరీరా నమో భక్తం తే పరిపాలయమాం.
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
3. భూచోరక హర పుణ్యమతే క్రీడోధ్ధఋతభూ
క్రోడాకార శరీర నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామే భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే [ఇంకా... ]

పిల్లల ఆటలు - పదంతో పదం గేమ్
ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
కావలసిన వస్తువులు : పేపరు, పెన్ను.
ఆడే స్థలం : హాలు లాంటి ప్రదేశంలో
ఈ గేమ్‌కి ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. గేమ్ ఏమిటంటే మనం తెలుగులో రెండు ఇంగ్లీషు పదాల అర్థం వచ్చేటట్లు సెంటెన్స్ ఇస్తే గేమ్ ఆడేవారు ఆ రెండు ఇంగ్లీషు పదాలను వ్రాయాలి సుమా. అది కూడా హోస్ట్ ఇచ్చే సెంటెన్స్‌లోని రెండు ఇంగ్లీషు పదాలు ఒక దాంట్లో ఒకటి ఉంటాయి. అదే పదంలో పదం. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా - కరాటే
పూర్వం చదువుల్లో యుద్ద విద్యలు కూడా ఒక భాగంగా ఉండేవి. కేవలం టెక్స్ట్ బుక్కులను బట్టీ కొట్టడమే కాకుండా, శరీర ధారుఢ్యం పెంచుకోవడానికి, శత్రువు నుంచి కాపాడుకోవడానికి కూడా యుద్ద విద్యలు అక్కరకొచ్చేవి. కర్రసాము, కత్తిసాము, మల్లయుద్దము, విలువిద్య... ఇవన్నీ మన యుద్దవిద్యలు, అయితే కాలక్రమంలో ఈ 'కరాటే' విద్య మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. నిరాయుధంగా శత్రువు ఎదిరించడంలో కరాటే మించింది లేదు. 'కరాటే' అనే మాటకు అర్థమే 'ఖాళీ చేతులు' అని అర్థం. [ఇంకా... ]
Wednesday, October 15
వ్రతములు - ధైర్యలక్ష్మి నోము
ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
ఒక బ్రాహ్మణస్త్రీకి అయిదుగురు తమ్ములుండిరి. ఆ తమ్ముల పెండ్లినాటికి ఆమె భర్తకు ప్రాణముమీదికి వచ్చెడిది. అందుచే నామె పెండ్లికి వెళ్ళెడిది కాదు. ఆ విధముగా నలుగురు పెండ్లిండ్లు అయినవి అయిదవ తమ్ముని పెండ్లి కూడా జరుగుచున్నది. అప్పుడుకూడా యెప్పటి వలెనే ఆమె భర్తకు ప్రాణముమీదికి వచ్చెను. [ఇంకా... ]

ఆధ్యాత్మికం - దైవాలు నైవేద్యాలు
మనము పూజించే దైవాలు - అర్పించే నైవేద్యాలు
మనము సకల దేవతారాధనలు చేస్తున్నాము. ఇష్టదైవాల్ని ఎన్నుకోవడం ఆయా భక్తుల అనుభూతులపై, మహిమలపై ఆధారపడి ఉంటుంది. అష్టోత్తర సహస్రనామ అర్చనలు, షోడశోపచార పూజలు చేసిన తర్వాత ఇష్టదైవాలకు అవసర నైవేద్యం, మహానైవేద్యం, తాంబూల సమర్పణ, హారతి (నీరాజనం) మంత్రపుష్పం, తీర్ధస్వీకారం, ఫలశ్రుతి అనంతరం పూజ సమాప్తమగును. ఐతే సకల దేవతా పూజా విధనం గురించి తెలుసుకుని, నైవేద్యాల వివరణలోకి వెళ్దాం.
సకల దేవతా పూజా విధానము
శ్రీ గురుభ్యోనమహా గురువులందరూ సన్నిహితులుగా నున్నట్లు భావించి వారికి నమస్కరించి "హరిహ్ ఓం" అని దేవుని ధ్యానించాలి. పూజకుముందు రాగిగ్లాసులో నీరు, రాగి ఉద్దరిణె, రాగి పళ్ళెము, తీర్ధపాత్ర, పుష్పములు, గంధము, ఘంట, అక్షతలు, పంచామృతము, గోక్షీరము నైవేద్యానికి పటికబెల్లము, ద్రాక్షగానీ, పండ్లుగానీ, వండిన మహానైవేద్యము, దీపములు, ధూపము, హారతి కర్పూరము అన్నీ ముందుగా సిధ్ధంగా ఉంచుకొనవలెను. [ఇంకా... ]

హాస్య కధలు - కంప్లయింట్
తిరుగుదామా, వద్దా అనుకుంటూ బద్ధకంగా కాలాన్ని చూపిస్తున్న రిస్టు వాచీకేసి చిరాగా చూశాడు మూర్తి. చేతినుంచి కసిగా లాగి, దాన్ని గట్టిగా నాలుగుసార్లు విదిలించాడు. ఇంక బాగుండదన్నట్లు మొహమాటంగా అడుగులేయసాగింది సెకన్ల ముల్లు. ఇంక ఆ వాచీని నమ్ముకోవడం అనవసరమనే నిర్ణయానికొచ్చి విచారణాలయానికి చేరి "ఎక్స్యూజ్ మీ" అన్నాడు. కునికుపాట్లు పడుతున్న ఆమె ఉలిక్కిపడి "యస్" అని వెంటనే "కాకినాడకు పోయే సెమి లగ్జరి ఎక్స్‌ప్రెస్ ఒంటిగంటకు ఒకటో నంబరు ప్లాట్‌ఫాం మీదకి వస్తుంది" అని వెంటనే కళ్ళు మూసేసుకుంది. ఏమీ అడక్కుండానే ఠక్కున సమాధానం చెప్పేసి చప్పున నిద్రలోకి జారుకున్న ఆమెకేసి ఓ క్షణం అయోమయంగా చూశాడు మూర్తి. మళ్ళీ "ఎక్స్యూజ్ మీ మేడం" అన్నాడు. [ఇంకా... ]
గృహాలంకరణ - లోగిలి అందాన్నిచ్చే అలంకరణ
మీ ఇంట్లో మీ బెడ్‌రూం ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ పిల్లల రూమ్ ఎలా అలంకరిస్తే వారు సంతోషంగా ఉంటారు ఆలోచించండి.
1. మీ డ్రాయంగ్ రూమ్‌లో కళాకాంతులు తెచ్చే ఇత్తడి ఫర్నిచర్, ఉడ్ ఫర్నిచర్‌ను అమర్చండి. సోఫాలు, మంచి కళాత్మకమైన పెయింటింగ్స్, చక్కటి క్రోటన్ మొక్కలు, ప్లవర్ వాజ్‌లు ఏవిధంగా ఉంటే మీ పక్కింటివారికి అసూయ కలుగుతుందో అలా అమర్చండి.
2. మీ హాలులో ఏవిధమైన సిటింగ్ ఏర్పాట్లు ఉంటే బావుంటుందో చూపండి. ఏ మ్యూజిక్ సిస్టం, టివి., వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్ సిస్టం, సోఫాల దగ్గర నేలమీద సుతిమెత్తని తివాచీలు ఎలా ఏర్పాటుచేస్తే అందంగా ఉంటుందో చూడండి.
3. మీ ఇంటికి వచ్చిన అతిధులకు మీరు గోడలకు అమర్చిన పెయింటింగ్స్ చూసి విస్మయపడేలా ఉండాలి. వాటిని ఎక్కడ కొన్నారు అని అడిగి, మాకు కూడా ఇటువంటివి కొనిపెట్టండి అనేలా ఉండాలి. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - మహత్మా గాంధీ
పేరు : మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( మహాత్మా గాంధీ )
తండ్రి పేరు : కరంచంద్ గాంధీ
తల్లి పేరు : పుత్లీబాయి
పుట్టిన తేది : 2-10-1869
పుట్టిన ప్రదేశం : పోరుబందర్
చదివిన ప్రదేశం : లండన్
చదువు : లాయర్
గొప్పదనం : శాంతియుతంగా అనేక సత్యాగ్రహాలు చేసి ఆంధ్ర దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు
స్వర్గస్తుడైన తేది : 31-1-1948
మహాత్మా గాంధీ గుజరాత్ లోని ఖయిత్వాద్ ప్రాంతంలోని పోరుబందర్ లో కరంచంద్ గాంధీ, పుత్లీబాయి దంపతులకు 1869వ సంవత్సరం అక్టోబర్ 2న జన్మించాడు. నీతి నిజాయితీలకు కట్టుబడిన కుటుంబంలో జన్మించిన గాంధీ చిన్నతనం నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరుగుతూ, తల్లి దండ్రుల యెడల గురువుల యెడల ఎంతో వినయ విధేయతలతో ఉంటూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. మోహన్ దాస్ కి పన్నెండవ సంవత్సరంలోనే కస్తుర్భాతో వివాహమయింది. [ఇంకా... ]

Tuesday, October 14
సైన్స్ - రక్తము
18 మరియు 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి సగటున 45 కి.గ్రా.లు భారంతూగే ప్రతీ ఆరోగ్యవంతమైన వ్యక్తి పురుషుడు మూడేసి మాసాలకొకసారి, స్త్రీ నాల్గేసి మాసాల కొకసారి నిర్భయంగా రక్తదానం చేయవచ్చు. మన శరీరంలో 4.5 మొదలు 5.5 లీటర్లు రక్తం ప్రవహిస్తుంది. దీంట్లో ప్రతీసారీ 10 శాతం అంటే (450-550సిసి) రక్తం దానం చేయవచ్చు.
దానం చేసిన రక్తంలో ద్రవరూపమైన పదార్ధాలు శరీరంలో 10 లేక 12 గంటలలో ఉండే కణాలు మాత్రం 4 మొదలు 14 రోజులలో భర్తీ అవుతాయి. ఈ కాలవధిలో దీనివల్ల శరీరానికి ఎటువంటి బాధ కలుగదు. రక్తదానం చేసిన తరువాత ఒక రోజు అధికంగా నీరు తాగమంటారు. రక్తదానం వల్ల మీ ఆయువు క్షీణించదు. ఇతర బాధలు ఉండవు. [ఇంకా... ]

పుణ్యక్షేత్రాలు - ద్రాక్షారామం
భీమేశ్వర స్వామి లింగము స్ఫటిక లింగము. సుమారు 15 అడుగుల పైగా ఎత్తుంటుంది. అభిషేకాదులు చేయటానికి పైన రెండవ అంతస్తునుంచి చేయవలసిందే. పంచారామాల్లో ఒకటిగాను, జ్యోతిర్లింగాల్లో ఆఖరిదిగాను చెప్పబడే ఈ శైవక్షేత్రం చాల మహిమమాన్వితమైనదని చెప్పకోవచ్చు. 12వ శతాబ్దం చివరన వేములవాడ భీమకవి స్వామి నారాధించి వాక్శుద్ధి కలిగిన వాడయ్యాడని ప్రతీతి. 15వ శతాబ్దంలోని ప్రౌఢ కవి మల్లన, రుక్మాంగద చరిత్రమును, కవిసార్వభౌముడు, ఆంధ్ర నైషధకర్త శ్రీ నాధుడు తన భీమేశ్వర పురాణమును, మరి యింకా మల్లి ఖార్జున పండితుడు, సూరన కవి మొదలగు ప్రాచీన కవులెందరో స్వామి మహత్యమును వేనోళ్ళ ప్రశంసించటం జరిగింది. [ఇంకా... ]
పిల్లల ఆటలు - గాలిపటాలు
కావలసిన వస్తువులు : రంగు కాగితాలు, జిగురు, చీపురుపుల్లలు, గాలిపటాలకు వాడే దారం ఇవన్ని పచారి షాపులో అమ్ముతారు.
రంగురంగుల కాగితాలను చతురస్త్రాకారంగా చేసి వాటిని ఒక సూత్రం ప్రకారం కట్టాలి. అప్పుడే ఈ గాలి పటాలు చక్కగా ఎగురుతాయి. వీటికి తోకలు కూడా ఉంటాయి. ఆటగాళ్ళంతా ఈ గాలి పటాలకు దారాలను కట్టి గాల్లో ఎగురవేస్తారు. ఎవరు ఎక్కువ దూరం ఎగుర వేస్తారో వారు గెలిచినట్లు. [ఇంకా... ]

వంటలు - కందులతో కచోరీలు
కావలసిన వస్తువులు:
పచ్చికంది గింజలు - ఒక కప్పు.
గోధుమపిండి - ఒక కప్పు.
మైదాపిండి - ఒక కప్పు.
బంగాళదుంప - ఒకటి.
పచ్చిమిరపకాయలు - నాలుగు.
కారంపొడి - అర టీ స్పూను.
కొత్తిమీర తరుగు - పావు కప్పు.
నెయ్యి లేక డాల్డా - ఒక టీ స్పూను.
ఉప్పు - సరిపడినంత.
తయారు చేసే విధానం :
ముందుగా గోధుమపిండి, మైదా పిండిలలో నెయ్యి లేక డాల్డా, తగినంత ఉప్పు వేసి పూరీల పిండిలా కలిపి పెట్టుకోవాలి. [ఇంకా... ]

వ్యక్తిత్వ వికాసం - వివేకానందుడు
1893 సెప్టెంబర్ 11వ తేది - పశ్చిమ దేశాలతో ముఖ్యంగా అమెరికాతో ఇండియా యొక్క సాంస్కృతిక బంధంలో ఒక కొత్త ఘట్టానికి ప్రారంభ చిహ్నంగా నిలుస్తుంది. ఆరోజు చికాగో (అమెరికా)లోని పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్‌లో జరిగిన సమావేశానికి ప్రపంచమంతటి నుండీ ఖ్యాతినొందిన ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో 30 సంవత్సరాల వయసుగల భారతీయుడు శ్రీరామకృష్ణుని శిష్యుడు అయిన స్వామి వివేకానంద ఉన్నారు. పసుపు రంగు దుస్తులు ధరించిన వివేకానంద తన పేరుతోసహా అన్ని భౌతిక సంపదలను పరిత్యజించారు. కేవలం సన్యాసి చిహ్నాలు, భగవద్గీత మరియు థామస్ ఏ. కెంపిస్ రచించిన "ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్" అనే రెండు గ్ర్రంధాలు తప్ప స్వంతమనేదేదీ లేకుండా సర్వం విసర్జించారు. [ఇంకా... ]
Monday, October 13
జానపద గీతాలు - బావా! బావా! పన్నీరు
బావా! బావా! పన్నీరు బావను పట్టుకు తన్నేరు
మూడు గుద్దులు గుద్దేరు
మూలన మంచం వేసేరు
ముంతెడు గంజి యిచ్చేరు
బావా! బావా! పన్నీరు బావను పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు వీశెడు గంధం పూసేరు
చావిడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు [ఇంకా... ]
మూడు గుద్దులు గుద్దేరు
మూలన మంచం వేసేరు
ముంతెడు గంజి యిచ్చేరు
బావా! బావా! పన్నీరు బావను పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు వీశెడు గంధం పూసేరు
చావిడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు [ఇంకా... ]
పెద్దల ఆటలు - వైకుంఠ పాళి
ఎంతమంది ఆడవచ్చు : ఇద్దరు
కావలసిన వస్తువులు : పరమపద సోపానం ఇది జనరల్ షాపులో లభిస్తుంది, చింతపిక్కలుగాని, గవ్వలుగాని
పరమపద సోపానం ఈ చార్టు నిండా గడులుంటాయి. పాములు, నిచ్చెనలు ఉంటాయి. ఆటగాళ్ళకు సంబంధించిన పిక్క పాము గళ్ళలోకి వేళ్తే చనిపోయి, ఆ పాములు ఏ గదిలోకి జారివుందో ఆ గడికి దిగిపోతుంది. [ఇంకా... ]

ఆధ్యాత్మికం - పంచభూత లింగాలు
పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.
పృథ్విలింగం: ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.
ఆకాశలింగం: ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. [ఇంకా... ]

లాలి పాటలు - రామా లాలీ
రామా లాలీ మేఘశ్యామా లాలీ
తామరసనయన దశరథతనయా లాలీ ||రా||
అబ్జవదన ఆటలాడి అలసినావురా నీ
బొజ్జలో పాలరుగగానే నిదురబోవరా ||రా||
అద్దాల తొట్టెలో నేమో అనుమానించేవూ
ముద్దులపాపలున్నారని మురిసి చూచేవూ ||రా|| [ఇంకా... ]
తామరసనయన దశరథతనయా లాలీ ||రా||
అబ్జవదన ఆటలాడి అలసినావురా నీ
బొజ్జలో పాలరుగగానే నిదురబోవరా ||రా||
అద్దాల తొట్టెలో నేమో అనుమానించేవూ
ముద్దులపాపలున్నారని మురిసి చూచేవూ ||రా|| [ఇంకా... ]
పిల్లల ఆటలు - డైలాగ్స్ గేమ్
ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
కావలసిన వస్తువులు : పేపరు, పెన్ను.
ఆడే స్థలం : ఎక్కడైనా.
ఈ గేమ్‌కి అన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గేమ్‌కి తెల్లపేపర్ మీద సినిమాలలో ఊతపదంలా వాడే పదము లేదా సెంటెన్స్ రాయాలి. ఆ వాక్యాన్ని ఎవరు ఉపయోగించారో ఏ సినిమాలోదో వ్రాయమనాలి. [ఇంకా... ]

Friday, October 10
లాలి పాటలు - చిట్టిపాప
చిన్ని మా అమ్మాయి శ్రీ ముఖము చూసి
సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెఱుచు
పందిట్లో అమ్మాయి పాకుతూ వుంటే
పనసపండని జనులు పరుగులెత్తేరు
దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటే
దోసపండని జనులు దోసిలొగ్గేరు [ఇంకా... ]
సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెఱుచు
పందిట్లో అమ్మాయి పాకుతూ వుంటే
పనసపండని జనులు పరుగులెత్తేరు
దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటే
దోసపండని జనులు దోసిలొగ్గేరు [ఇంకా... ]
తెలుగు బిడ్డలు - సరోజినీ నాయుడు
పేరు : సరోజినీ నాయుడు.
తండ్రి పేరు : అఘోరనాధ ఛటోపాధ్యాయ.
తల్లి పేరు : శ్రీమతి వరద సుందరీదేవీ.
పుట్టిన తేది : 1879 వ సంవత్సరంలో జన్మించెను.
పుట్టిన ప్రదేశం : హైదరాబాద్.
చదివిన ప్రదేశం : ఇటలీ, స్విట్జర్లాండ్.
చదువు : మెట్రిక్యులేషన్.
గొప్పదనం : ఈమె భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనటమేగాక, స్రీ విమోచన కోసమూ, అస్పృశ్యతా నివారణ కోసమూ కృషి చేశారు.
స్వర్గస్తురాలైన తేది : 2-3-1949.
రచించిన రచనలు : 'గోల్డెన్ త్రెషోల్డు', 'బర్డ్సు ఆఫ్ టైం', 'ఫెదరర్ ఆఫ్ ది డాన్'.
హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో సభల్లోనూ, సమావేశాల్లోనూ ప్రసంగాలు ఇచ్చి ప్రజల్లో సహజీవనం చేసిన మహనీయ మహిళ సరోజినీ నాయుడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనిన ఆధునిక భారతదేశ ప్రముఖ స్త్రీలలో ఈమె ఒకరు. [ఇంకా... ]

వ్రతములు - ఉండ్రాళ్ళతద్దె
ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
ఒక ఊరిలో స్త్రీలందరు భాద్రపద బహుళ తదియనాడు వుండ్రాళ్ళ తద్దె నోమును నోచు కొనుచుండిరి. అప్పుడావూరి రాజు గారి వేశ్య కూడా నోము నోచు కొనెదనని రాజుతో చెప్పెను. రాజు "నీకు కావలసిన వస్తువులేవో చెప్పు" మనెను. ఆభోగముది చమత్కారముగ తనకు ఆకూ, గీకూ, కోకా, గీకా, కూరా, గీరా కావలయునని చెప్పెను. అదియెంతపని యని రాజు వాటిని తెచ్చుటకు నౌకరులనుబంపెను. వారన్నింటిని తెచ్చిరిగాని 'గీ'యను పేరుతో నున్న వాటిని తేలేక పోయిరి. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఇంతింత దీపం
ఇంతింత దీపమ్ము ఇల్లెల్ల వెలుగు
మాడంత దీపమ్ము మేడలకు వెలుగు
గోరంత దీపమ్ము కొండంత వెలుగు
గోపాలకృష్ణయ్య గోకులము వెలుగు [ఇంకా... ]
మాడంత దీపమ్ము మేడలకు వెలుగు
గోరంత దీపమ్ము కొండంత వెలుగు
గోపాలకృష్ణయ్య గోకులము వెలుగు [ఇంకా... ]
మీకు తెలుసా - రుద్రాక్ష
ఆధ్యాత్మికతతో, ప్రేమపూరకమైన భక్తితో, భక్తి వైరాగ్యంతో నిండిపోయుండే భారతీయుడి హృదయానికీ, రుద్రాక్షకూ అవినాభావ సంబంధం ఉంది. ఈ సంబంధం భక్తుడికీ, భగవంతునికీ ఉన్న సంబంధంవంటిది. రుద్రాక్షను భగవంతునికి ప్రతిరూపంగా భావించే సంప్రదాయం ఆది కాలంనుండీ మనకు వస్తూనే ఉంది. ఇది కేవలం సంప్రదాయంగానే కాక అనేక విశ్వాసాలకు ప్రతిరూపంగా కూడా ఉండడంతో కుల మత ప్రమేయం లేకుండా వీటిని భారతీయులు ధరిస్తుంటారు. ఇవి అత్యంత శక్తివంతమైనవనీ, వీటిని ధరిస్తే ఎటువంటి చెడు ప్రభావం తమపై పడదనే భావన ఉండడంతో వీటికి గిరాకీ ఎక్కువ. చాలా అరుదుగా లభించే రుద్రాక్షలంటే ఎవరైనా ఆరాటపడుతూనే వుంటారు. [ఇంకా... ]
Thursday, October 9
సంగీతం - జయదేవుడు
12వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి జయదేవుడు. పశ్చిమ బెంగాలుకు చెందిన బిర్‌భూం జిల్లాలోని అడ్‌జై నదీ తీరంపైన వెలసిన ఒక చిన్న గ్రామమ్మైన కౌండుభి (అప్పట్లో దీన్ని కెండుబిల్వ అని పిలిచేవారు)లో జయదేవుడు జన్మించాడు. "గీత గోవిందం" అనే తన ఉతృష్టమైన సంస్కృత కావ్యాన్ని జయదేవుడు ఈ కెండులి గ్రామంలోనే వ్రాసాడు. అప్పట్లో గౌడ్‌గా పిలువబడే బెంగాలును కళల సాహిత్యాభిమానులైన సేన రాజులు పాలించేవారు. గౌడ్ రాజ్యాన్ని పాలించిన ఆఖరి గొప్ప హిందూ రాజు లక్ష్మణసేన (క్రీ.శ.1178-1205) కొలువులొ వెలసిన మాణిక్యాలలో ఒక మణిగా జయదేవుడు ఉండేవాడు. [ఇంకా... ]
జానపద గీతాలు - చల్ మోహనరంగా...
నీకు నీవారు లేరు నాకూ నా వారు లేరు
ఏటి ఒడ్డున ఇల్లు కడదము పదరా చల్ మోహనరంగా
నీకు నాకు జోడు కలసెను గదరా
మల్లె తోటలోన మంచినీళ్ళ బావికాడ
ఉంగరాలు మరచి వస్తిని కదరా || చల్ || [ఇంకా... ]
ఏటి ఒడ్డున ఇల్లు కడదము పదరా చల్ మోహనరంగా
నీకు నాకు జోడు కలసెను గదరా
మల్లె తోటలోన మంచినీళ్ళ బావికాడ
ఉంగరాలు మరచి వస్తిని కదరా || చల్ || [ఇంకా... ]
నీతి కథలు - ఎత్తుకు పై ఎత్తు
ఒక ఊరిలో ఒక వర్తకుడున్నాడు. అతడు గొప్ప జిత్తుల మారి. అతనొక నాడు మరొక వూరి సంతకు బయలుదేరాడు. దారిలో అతను చాలా విచారంగా వున్నాడు. అతని విచారానికి కారణం ఆనాడు తనింకా లాభసాటి పని ఏదీ చెయ్యలేదు అన్న ఆలోచనే. ఎలాగో లాభం దారిలోనే సంపాదించాలనే దురాలోచన ప్రారంభమయిందతనికి. ఇంతలో దారిలో ఒక మనిషి తారసపడినాడు. ఆ రైతు మరొక గ్రామం నుండి షావుకారు వెళుతున్న గ్రామానికే సంతపని మీద వెళుతున్నాడు. అతన్ని చూడగానే షావుకారికి పల్లెటూరి రైతు అంటే బైతు అని షావుకారు నమ్మకం. ఆ నమ్మకంతో సునాయాసమైన లాభం సంపాదించడానికి షావుకారు బ్రహ్మాండమైన ఎత్తువేశాడు. రైతుని చూసి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. రైతు సంతకు వెడుతున్నానని జవాబు చెప్పాడు. [ఇంకా... ]
పిల్లల పాటలు - ఆటలంటే మాకిష్టం...
ఆటలంటే మాకిష్టం - పాటలంటే మాకిష్టం
ఆటల కన్నా పాటల కన్నా - అల్లరి పనులే మాకిష్టం
సినిమాలంటే మాకిష్టం - మిఠాయిలంటే మాకిష్టం
సినిమా కన్నా మిఠాయి కన్నా - షికార్లు కొట్టుట మాకిష్టం
పిట్టలంటే మాకిష్టం - పువ్వులంటే మాకిష్టం
పిట్టల కన్నా పువ్వుల కన్నా - చెట్లు ఎక్కడం మాకిష్టం [ఇంకా... ]

వంటలు - ఎర్ర క్యాప్సికం దోసె
కావలసిన వస్తువులు:
ఎర్ర క్యాప్సికం (సన్నగా తరగినవి) - ఒకటి.
వెన్న - అరకప్పు.
కోడిగుడ్లు (తెల్లసొన మాత్రమే తీసుకోవాలి) - రెండు.
మొక్కజొన్నపిండి - పావుకప్పు.
మిరియాల పొడి - అరస్పూను.
ఉప్పు - తగినంత.
ఉల్లిపాయలు (సన్నగా తరగినవి) - ఒకటి.
ఉల్లికాడలు (వీటిని పొడుగ్గా నిలువుగా కోసుకోవాలి)- ఎనిమిది.
తయారు చేసే విధానం:
క్యాప్సికం ముక్కలు, కొద్దిగా వెన్న, కోడిగుడ్ల సొన, మొక్కజొన్న పిండి, మిరియాలు పొడి, ఉల్లిపాయల తరుగు, కొద్దిగా ఉప్పు అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని మిశ్రమం చేసుకోవాలి. [ఇంకా... ]

Wednesday, October 8
వ్యక్తిత్వ వికాసం - సమయ పాలన (టైమ్ మేనేజ్‌మెంట్)
ఏ మనిషికైన తాను అనుకున్న దానిని సాధించటానికి ముఖ్యంగా కావాలసినది సమయ పాలన. లోకంలో ఏ మనిషికైన రోజుకు ఉండేది 24 గంటలే. ఎటొచ్చీ ఆ 24 గంటలు సమర్థవంతంగా నిర్వహించుకోవడమే 'టైమ్ మేనేజ్‌మెంట్' అంటారు. ఒక సారి సమయాన్ని పోగొట్టుకుంటే అంటే వృధా చేసుకుంటే మళ్ళీ మనం దానిని ఎప్పటికీ పొందలేము. అందుకే అలాంటి సమయాన్ని ఎంత సమర్థవంతంగా ప్లాన్ వేసుకోవాలో, తద్వారా మన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ మనిషికైనా విజయం వరించాలి అంటే ప్లానింగ్ అవసరం. ప్లానింగ్ లేని మనిషి గమ్యం అగమ్యగోచరంలా ఉంటుంది. ఒక క్రమ పద్దతిలో ప్లాన్ వేసుకుంటే జీవితం నందనభరితం అవుతుంది. కొద్ది పాటి ప్లానింగ్‌తో జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవచ్చునో తెలుసుకుందాం. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా - స్వెటర్లు
చలికాలం రాగానే మూలనపడి వున్న స్వెటర్లను వెతుక్కొని మరీ వేసుకుంటాం. అవి ఎందుకు మనం వాడుతున్నాము, ఎలా తయారయ్యాయి అనేది మనం తెలుసుకుందాము.
ఆదిమానవుడు ఆధునికుడై కనిపెట్టినా అల్లిక సూదుల ద్వారా ఉన్ని వస్త్రాలను అల్లడం అతడు చాలా కాలం పాటు నేర్చుకోలేదు. మొదట ఈ పనిని మొదలెట్టింది అరబ్బులు. వాళ్ళే రాగితో అల్లిక సూదులను తయారు చేసి వాటితో సాక్సులు అల్లడం మొదలెట్టారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఈజిప్టు నుంచి యూరప్‌కు ఉలెన్ సాక్సులు చేరాయి. అక్కడి నుంచి యూరప్ అంతా ఉన్ని వస్త్రాల అల్లిక మొదలయ్యింది. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - రవీంద్రనాథ్ ఠాగూర్
పేరు : రవీంద్రనాధ్ ఠాగూర్
తండ్రి పేరు : దేవేంద్రనాధ్ ఠాగూర్
తల్లి పేరు : శ్రీమతి శారదాదేవి
పుట్టిన తేది : 7-5-161
గొప్పదనం : దేశభక్తి గేయాల ద్వారా తెల్లదొరల పాలన అంతమొందించడానికి కారకుడయ్యారు. "ఈనాటి మన జాతీయగీతం "జనగణమణ" ఆయన కలం నుంచి వచ్చింది."
మంచి అలవాట్లు అలవరచుకొని, పేరు ప్రతిష్టలను ఆర్జించిన ప్రముఖులలో ఒకరు రవీంద్రనాధ్ ఠాగూర్. వారు ఎన్నుకున్న బాట "కవిత్వం" తన దేశభక్తి గేయాల ద్వారా తెల్లదొరల పాలన అంతమొందించడానికి కారకుడయ్యారు. "ఈనాటి మన జాతీయగీతం "జనగణమణ" ఆయన కలం నుంచి వచ్చింది." [ఇంకా... ]

కవితలు - ఆ నవ్వులో
నిన్నటి దిగులు లేదు
రేపటి బాధ లేదు
ఆ నవ్వు
హిమానీనదం అంత స్వచ్ఛంగా
హిమాలయాలంత అందంగా
ఆ నవ్వు
నిన్నని మరిపిస్తూ
రేపటిని తలపకు రానీకుండా
నేడు నా ముందు నిలచింది సాకారమై [ఇంకా... ]
రేపటి బాధ లేదు
ఆ నవ్వు
హిమానీనదం అంత స్వచ్ఛంగా
హిమాలయాలంత అందంగా
ఆ నవ్వు
నిన్నని మరిపిస్తూ
రేపటిని తలపకు రానీకుండా
నేడు నా ముందు నిలచింది సాకారమై [ఇంకా... ]
సంస్కృతి - కూచిపూడి కళాక్షేత్రం
ఈ పేరు వినని తెలుగు కళాకారుడు ఉండడు. కూచిపూడి భాగవతుల ప్రదర్శనలకు నోచుకోని గ్రామం తెలుగునాట లేదు. తమ ప్రదర్శనల ద్వారా విశ్వ విఖ్యాతినొందిన కూచిపూడి గ్రామం కృష్ణా జిల్లాలో మచిలీపట్నంకు 15 మైళ్ళ దూరంలో ఉంది. తన పదాలతో దక్షిణ దేశాన్నంతా సుసంపన్నం చేసిన క్షేత్రయ్య స్వగ్రామమైన మువ్వ గ్రామంలో 500 సంవత్సరాలకు పూర్వమే నాట్య కళకు అంకురార్పణ జరిగినట్లు చారిత్రాకాధారాలున్నాయి.
కూచిపూడి భాగాతుల ప్రదర్శనానికి మూలపురుషుడు సిదేంద్ర యోగి. ఈయన తన నాత్య గీతాభినయాలను కూచిపూడి కళాకారులకు అంకితం చేశాడు. ఆనాటినుంచీ ఈనాటివరకూ కూచిపూడి నాట్య ప్రదర్శనలు, వారి భాగవతాలూ, వంశపారంపర్యంగా ప్రచారం పొందాయి. [ఇంకా... ]

Tuesday, October 7
కధలు - సంభవామి
మూడు చక్రాల బండి... లాగుతూనే ఉన్నాడు బికారి. కడలి పోటుకు ఎరుపెక్కిన ఎర్రనీరెండ బికారిని చుట్టుముట్టి చెమటను ఆవిరుల రూపంలో హరించివేస్తోంది.
లాగుతున్నాడు... ఊపిరిని బిగబెట్టి ఒక చేతిని రిక్షా హాండిల్ బార్ మీద, మరో చేతిని బండికి కట్టిన టైరు పంజామీద...
మనసును, దృష్టిని మమేకం చేసి మరీ లాగుతున్నాడు. మూడు చక్రాల చెక్కరిక్షా... బికారి రెండు కాళ్ళతో కలిపి ఐదు చక్రాలయ్యాయి.
'ఊహు ....' కదలనని మొరాయిస్తోంది.
ఇసుకలో కూరుకుపోయిన రిక్షాబండి... మోటుపల్లి రేవు మోటుగా అన్పిచింది బికారికి.
నానావిధాల తంటాలు పడుతున్నాడు. [ఇంకా... ]

లాలి పాటలు - ఉయ్యాల జంపాల
ఉయ్యాల జంపాలలూగరావమ్మ
వెలలేని బంగారుటూగుటుయ్యాల ||ఉ||
కమలమందున బుట్టి కమలాక్షుని చేపట్టి
కామూని కన్నట్టి కంజదళనేత్రి ||ఉ|| [ఇంకా... ]
వెలలేని బంగారుటూగుటుయ్యాల ||ఉ||
కమలమందున బుట్టి కమలాక్షుని చేపట్టి
కామూని కన్నట్టి కంజదళనేత్రి ||ఉ|| [ఇంకా... ]
పిల్లల ఆటలు - భాషలో తమాషా
ఎంతమంది ఆడవచ్చు : పది మంది
కావలసిన వస్తువులు : పేపర్లు, పెన్సిళ్ళు లేదా పలకలు, బలపాలు
ఆడే స్థలం :గదిలో ఆడవచ్చు
ఆటగాళ్ళ వయస్సు : 7 సం||రాల వయస్సు వాళ్ళు
పోటీ సమయం : 2 నిమిషాలు
ఎటు నుంచి చదివినా ఒకే అక్షరం వచ్చే పదాలు రాయడం ఇక్కడ పోటీ. [ఇంకా... ]

నీతి కధలు - స్వశక్తి
కేశవాపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి రాము, సోము అనే ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరిగాయి. ఇల్లు పెద్దది కావటము వలన అందరూ కలసే ఉన్నారు. రాము పెద్దవాడు. ఉదయమేలేచి పొలము పనికి వెళ్ళి తండ్రికి సాయపడుతూ ఉండేవాడు. సోము సోమరిగా ఉంటూ పగటి పనికి వెళ్ళి కలలు కంటూ కాలక్షేపము చేసేవాడు. ఎవరు చెప్పినా ఏ పని చేయక పడుకొని ఉండేవాడు. కొంతకాలము గడిచింది. ఆ ఊరికి ఒక మెజీషియన్ వచ్చాడు. అనేక విద్యలు ప్రదర్శించాడు. చివరగా ధాన్యమును బంగారముగా మార్చాడు. సోమూకి ఆశ్చర్యము కలిగింది. [ఇంకా... ]
వంటలు - గోధుమపిండితో పూర్ణాలు
కావలసిన వస్తువులు:
గోధుమ పిండి - 1/4 కిలో
పచ్చి శనగపప్పు - 1/4 కిలో
బెల్లం - 1/4 కిలో
పచ్చికొబ్బరి - 1 చిప్ప
యాలుకలు - 10
నూనె - 1/2 కిలో
తయారు చేసే విధానం:
పచ్చి శనగపప్పు రాళ్ళు లేకుండా చేసుకోవాలి. బెల్లం తరగాలి. యాలుకలను పొడి కొట్టుకొని ఉంచుకోవాలి. పచ్చికొబ్బరి తురమాలి. గోధుమ పిండి జల్లించుకోవాలి. పచ్చి శనగపప్పును రెండు గంటలు నానబెట్టి నీళ్ళన్నీ ఒంపేసి కుక్కర్‌లో ఉడక బెట్టాలి. [ఇంకా... ]

Subscribe to:
Posts (Atom)