భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది హైకోర్టులపై నియంత్రణాధికారం కల్గిఉన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. ఇందులో 26 మంది జడ్జీలు ఉంటారు ప్రధాన న్యాయ మూర్తితో కలిపి. ఈ కోర్టులలో
. భారత ప్రభుత్వానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను,
లేక
. భారత ప్రభుత్వం, ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఒక వైపు ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నప్పుడు వాటి మధ్య తగాదాలను... [ఇంకా... ]
Monday, October 5
Saturday, October 3
నీతి కథలు - దొంగపిల్లి
భాగీరధీ నది ఒడ్డన పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో 'జరధ్గవము' నే ముసలి గ్రద్ద ఉండేది. ఆ గ్రద్దకు కళ్ళు కనిపించవు, అందుకని ఆ చెట్టు మీద ఉండే పక్షులు తమకు తెచ్చుకున్న ఆహారంలో ఆ గ్రద్దకు కొంత పెట్టేవి. ఆ గ్రద్ద, పక్షులు బయటకు వెళ్ళినపుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెప్పి నిద్ర పుచ్చేది. ఒక రోజు 'దీర్ఘకర్ణము' అనే పేరుగల పిల్లి పక్షుల పిల్లల్ని తినటానికి ఆ చెట్టు పైకి చేరింది. ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరిచాయి. ఆ అరుపులు విన్న జరధ్గవము తొర్రలోంచి బయటకు వచ్చి 'ఎవరక్కడ...?' అంటూ కోపంగా అరిచింది. ఆ అరుపుకు పిల్లి పై ప్రాణాలు పైనే పోయాయి. తప్పించుకోవటానికి దానికి... [ఇంకా... ]
Friday, October 2
భరతమాత బిడ్డలు - మహత్మా గాంధీ
పేరు : మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( మహాత్మా గాంధీ )
తండ్రి పేరు : కరంచంద్ గాంధీ
తల్లి పేరు : పుత్లీబాయి
పుట్టిన తేది : 2-10-1869
పుట్టిన ప్రదేశం : పోరుబందర్
చదివిన ప్రదేశం : లండన్
చదువు : లాయర్
గొప్పదనం : శాంతియుతంగా అనేక సత్యాగ్రహాలు చేసి ఆంధ్ర దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు
స్వర్గస్తుడైన తేది : 31-1-1948
మహాత్మా గాంధీ గుజరాత్ లోని ఖయిత్వాద్ ప్రాంతంలోని పోరుబందర్ లో కరంచంద్ గాంధీ, పుత్లీబాయి దంపతులకు 1869వ సంవత్సరం అక్టోబర్ 2న జన్మించాడు. నీతి నిజాయితీలకు కట్టుబడిన కుటుంబంలో జన్మించిన గాంధీ చిన్నతనం నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరుగుతూ, తల్లి దండ్రుల యెడల గురువుల యెడల ఎంతో వినయ విధేయతలతో ఉంటూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. మోహన్ దాస్ కి పన్నెండవ సంవత్సరంలోనే కస్తుర్భాతో వివాహమయింది. అంత చిన్నతనంలో పెళ్ళిచేసుకోవటం అతనికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల మాట జవదాటలేక అంగీకరించాడు.వివాహ కారణంగా గాంధీ చదువు ఒక ఏడాది వృధా అయింది... [ఇంకా... ]

Thursday, October 1
సాహిత్యం : భాష - ఉత్పత్తి
మానవ జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనం. తనలో సంఘర్షణలను రేకెత్తిస్తున్న భావాలను, తన కష్ట సుఖాలను సాటి మానవుడితో పంచుకోవడానికి ఆది మానవుడు సంజ్ఞలు (Gestures) చేసేవాడు. వాటి ద్వారా ఒకరినొకరు సమాచారాన్ని పరస్పరం వ్యక్తపరుచుకునేవారు. ముఖ వికాసం వలన సుఖాన్ని, ముఖ వికారం వలన దుఃఖాన్ని బహిర్గతం చేసుకునేవారు. అట్లేగాక కొన్ని ధ్వనుల ద్వారా కూడా అంతరంగాన్ని వెల్లడించుకునేవారు. అంటే అభిప్రాయాన్ని వ్యక్తపరచే ఒక సాధనం భాష అన్నమాట. అవయవాల సహాయంతో భావాన్ని తెలియజేసే మాటల సముదాయాన్ని కూడా భాష అనవచ్చు. కొన్ని సందర్భాలలో ఉచ్ఛారణ లేకుండానే అవయవాల కదలికల ద్వారా... [ఇంకా... ]
Wednesday, September 30
అందరికోసం - ప్రవాసాంధ్రులు
తెలుగు సైటు పేరు ----- సైటు అడ్రస్
హిందూ సమాజ టెంపుల్ -- www.hindusamajtemple.org
శ్రీ మీనాక్షి టెంపుల్ సొసైటి -- www.meenakshi.org
క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటి -- www.theuscats.org
బోస్టన్ తెలుగు అసోసియేషన్ -- www.tagb.org
ట్రీ స్టేట్ తెలుగు అసోసియేషన్ -- www.telugu.org
ఇండియన్ అంబసీ ఆఫ్ కువైట్ -- www.indembkwt.org... [ఇంకా... ]

Tuesday, September 29
మీకు తెలుసా - కాలగణనం
ప్రాచీన శాస్త్రవేత్తల కాలగణనం:
1 క్రాంతి = 1 సెకెండులోని 34,000లో భాగం
1 త్రుటి = 1 సెకెండులో 300వ వంతు
1 త్రుటి = 1 లవము, లేశము
2 లవములు = 1 క్షణం
30 క్షణములు = 1 విపలం
60 విపలములు = 1 పలం... [ఇంకా... ]
1 క్రాంతి = 1 సెకెండులోని 34,000లో భాగం
1 త్రుటి = 1 సెకెండులో 300వ వంతు
1 త్రుటి = 1 లవము, లేశము
2 లవములు = 1 క్షణం
30 క్షణములు = 1 విపలం
60 విపలములు = 1 పలం... [ఇంకా... ]
Saturday, September 26
వంటలు : వంకాయ - జీడిపప్పు కూర
కావలసిన వస్తువులు:
వంకాయలు - పావు కేజీ
జీడిపప్పు - పావు కేజీ
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
పోపు సామగ్రి :
ఎండుమిర్చి - 4
ఆవాలు - అర టీ స్పూన్
మినప పప్పు - ఒక టీ స్పూన్
జీలకర్ర - పావు టీ స్పూన్
జీలకర్ర - పావు టీ స్పూన్
శనగపప్పు - ఒక టీ స్పూన్... [ఇంకా... ]
వంకాయలు - పావు కేజీ
జీడిపప్పు - పావు కేజీ
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
పోపు సామగ్రి :
ఎండుమిర్చి - 4
ఆవాలు - అర టీ స్పూన్
మినప పప్పు - ఒక టీ స్పూన్
జీలకర్ర - పావు టీ స్పూన్
జీలకర్ర - పావు టీ స్పూన్
శనగపప్పు - ఒక టీ స్పూన్... [ఇంకా... ]
Friday, September 25
ఎందుకు, ఏమిటి, ఎలా ... - రాడార్
రాడార్ అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది, దానిని ఎందుకు ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రాడార్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. రాడార్ మన చుట్టూ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. విమానాల ఉనికిని గమనిస్తూ అవి క్షేమంగా దిగడానికి, ఎయిర్ లైన్స్ వాళ్ళు నిర్లక్ష్యంగా నడిపే వాహనాల వేగాన్ని కనిపెట్టడానికి పోలీసులు, గ్రహాల మ్యాప్‌లు రూపొందించడానికి, ఉపగ్రహాల స్థితిగతులు తెలుసుకోవడానికి అంతరిక్ష పరిశోధకులు, శత్రువాహనాల జాడను కనిపెట్టడానికి... [ఇంకా... ]
Thursday, September 24
జానపద గీతాలు - మొక్కజొన్న తోటలో
మొక్కజొన్న తోటలో...
సుక్కలన్ని కొండమీద - సోకుజేసుకునే వేళ
పంటబోది వరిమడితో - పకపక నవ్వే వేళ
సల్లగాలి తోటకంత - సక్కలగిల్లి పెట్టువేళ
మొక్కజొన్న తోటలో - ముసిరిన సీకట్లలో
మంచెకాడ కలుసుకో, - మరువకు మామయ్య... [ఇంకా... ]
సుక్కలన్ని కొండమీద - సోకుజేసుకునే వేళ
పంటబోది వరిమడితో - పకపక నవ్వే వేళ
సల్లగాలి తోటకంత - సక్కలగిల్లి పెట్టువేళ
మొక్కజొన్న తోటలో - ముసిరిన సీకట్లలో
మంచెకాడ కలుసుకో, - మరువకు మామయ్య... [ఇంకా... ]
Wednesday, September 23
పండుగలు - దేవీ నవరాత్రులు
ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.
దుర్గాష్టమి
దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయితి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే?... [ఇంకా... ]
దుర్గాష్టమి
దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయితి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే?... [ఇంకా... ]
Tuesday, September 22
పిల్లల ఆటలు - డిటెక్టివ్ ఆట
ఎంతమంది ఆడవచ్చు : 10 మంది
కావలసిన వస్తువు : టవల్
ఆడే స్థలం : గదిలోగాని, ఆరుబయట గాని
ఆటగాళ్ల వయస్సు : 5 నుండి 7 సం|| రాల మధ్య
పోటి సమయం : ప్రతి ఆటగాడికి 5 సెకన్లు
ఆటగాళ్లందరూ కూర్చోవాలి అందరూ పంటలు వేశాక దొంగ అయిన బాలుడు/బాలిక లీడర్ కళ్లు మూస్తాడు. ఈలోగా... [ఇంకా... ]

Saturday, September 19
భక్తి సుధ - శ్రీ అష్టాదశ శక్తి పీఠ స్తోత్రము
1. లంకాయం శంకరీ దేవీ, కామాక్షీ కాంచికాపురే |
ప్రద్యుమ్నే శృంగళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే |
2. అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా |
కొల్హాపురే మహాలక్ష్మీ, మహూర్యే ఏకవీరికా... [ఇంకా…]
ప్రద్యుమ్నే శృంగళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే |
2. అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా |
కొల్హాపురే మహాలక్ష్మీ, మహూర్యే ఏకవీరికా... [ఇంకా…]
Thursday, September 17
సౌందర్య పోషణ - అవాంఛిత రోమాలు తొలగించండిలా!
కొంత మంది మహిళలకు గడ్డం మీద, పైపెదవిపైన, నుదిటిపైన, బుగ్గలపైన, కనుబొమ్మలు ద్వారా శాశ్వతంగాను, తాత్కాలికంగాను తొలగించవచ్చు.
. చేతులు, కాళ్ళపై వుండే రోమాలను వాక్స్, రోమహారి క్రీములు, రేజర్స్ ఉపయోగించి నిర్మూలించాలి.
. పొత్తికడుపు, గుండెలపైన, మెడకింద... [ఇంకా…]
. చేతులు, కాళ్ళపై వుండే రోమాలను వాక్స్, రోమహారి క్రీములు, రేజర్స్ ఉపయోగించి నిర్మూలించాలి.
. పొత్తికడుపు, గుండెలపైన, మెడకింద... [ఇంకా…]
సౌందర్య పోషణ - గోళ్ళకు
అందమైన, ఆరోగ్యమైన గోళ్ళు చేతులకు ఎంతో అందాన్నిస్తాయి. గోళ్ళ సంరక్షణకు కొన్ని టిప్స్ తెలుసుకుందాము.
. గాఢమైన రంగులను గోళ్ళకు వేస్తే గోళ్ళు పొట్టిగా కనిపిస్తాయి. దీనికి పరిష్కారం, గోరుకు ఒక పక్క నిలువు గీతను తెల్లగా పెయింట్ చేయకుండా వదిలేయడం.
. గోళ్ళ ఆరోగ్యానికి కూడా నిమ్మకాయ మేలు చేస్తుంది. నిమ్మ తొక్కలతో గోళ్ళు రుద్దితే గోళ్ళు అందంగానూ, పుచ్చిపోకుండా ఉంటాయి.
. గోళ్ళ చుట్టూ ఉన్న చర్మంపై క్యూటికల్ ఆయిల్‌ని పూయాలి. ఊడిన గోళ్ళని క్యూటికల్ కటర్స్‌తో... [ఇంకా…]

వంటలు - బాంబే హల్వా
కావలసిన వస్తువులు:
మైదాపిండి - ఒక కప్పు
శనగపిండి, చెక్కెర - ఒక కప్పు
పసుపురంగు ఫుడ్ కలర్ - అర టీ స్పూన్
నెయ్యి - ఒకటిన్నర కప్పులు
జీడిపప్పులు, బాదం ముక్కలు - రెండు టీ స్పూన్లు
తయారు చేసే విధానం :
మైదాపిండిని ముందురోజు రాత్రే నీటిలో గట్టిగా కలిపిఉంచాలి. శనగపిండిని సువాసన వచ్చేవరకూ వేయించాలి. అడుగు మందంగా వుండే పాత్రలో చెక్కర వేసి నీరుపోసి తీగపాకం... [ఇంకా…]

Tuesday, September 15
సౌందర్య పోషణ - ఆకర్షించే గలగల గాజులు
. చేతులకు ధగధగమని మెరిసే బంగారు గాజులు ఎన్ని వున్నా వాటి మధ్యలో మట్టిగాజులు వేసుకుంటేనే వాటికి మరింత నిగారింపు వస్తుంది.
. పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు రెండు చేతులకూ రంగురంగుల మట్టిగాజులు వేసుకుంటే మహిళల చేతులు కళకళలాడుతూ ఆకర్షణీయంగా వుంటాయి.
. చిన్నపిల్లలకైతే మట్టి, పింగాణీతో చేసిన గాజులు వేయడం కన్నా ప్లాస్టిక్, రబ్బరు, మెటల్, బంగారంతో చేసిన గాజులే భద్రంగానూ, చూడముచ్చటగానూ వుంటాయి.
. చిన్నపిల్లలకు సన్నటి గాజులు నాలుగైదు వేయడంకన్నా వెడల్పుగా వుండే సింగిల్ గాజు వేస్తేనే... [ఇంకా…]

Monday, September 14
వ్యక్తిత్వ వికాసం - విజయ సాధనకు సప్త శాసనాలు
విజయానికి సూత్రాలు ఎవరూ విక్రయించలేరు.జీవితంలో విజయ శిఖరాగ్రం చేరుకున్న వ్యక్తుల జీవితాలనుంచి నేర్చుకున్న పాఠాలనుంచి కొన్ని సూచనలను మనం తీసుకోవాలని వివేకం ప్రబోధిస్తున్నది. అసంఖ్యాకమైన విజయవంతమైన జీవితాలను గురించి తీవ్రంగానూ మరియు చిత్తశుద్ధితోనూ అధ్యయనం చేసి,శాస్త్రీయ దృష్టితో పరిశీలించినప్పుడు,కొన్ని ప్రాధమిక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని "విజయానికి శాసనాలు" అని విశ్వాసనీయంగా అంగీకరించవచ్చు. ప్రస్తుతం ఏడు ప్రధాన విజయ శాసనాలను గురించి తెలుసుకుందాం.
సరైన గమ్యస్థానం నిర్ణయించుకోవాలి
సరైన గమ్యస్థానం అభ్యుదయేచ్ఛను ఉదయింపజేస్తుంది. అత్యధికులైన విజేతలకు సరైన గమ్యస్థానాలు... [ఇంకా…]
సరైన గమ్యస్థానం నిర్ణయించుకోవాలి
సరైన గమ్యస్థానం అభ్యుదయేచ్ఛను ఉదయింపజేస్తుంది. అత్యధికులైన విజేతలకు సరైన గమ్యస్థానాలు... [ఇంకా…]
Saturday, September 12
నీతికధలు - పరమానందయ్య శిష్యులు చేసిన శొంఠి వైద్యం
ఒక గ్రామంలో రామయ్య అనే వ్యాపారస్థుడు వున్నాడు. అతనికి పరమానందయ్యగారంటే ఎంతో భక్తి. పరమానందయ్యగారి తండ్రి, తాతల కాలం నుండి కుటుంబ గురువులు. అందువల్ల ఆయన పరమానందయ్యగారిని దైవసమానంగా భావిస్తున్నాడు. ఆయన మాట వేద వాక్యంగా భావించి పాటిస్తాడు. అప్పుడప్పుడూ ఆయన పరమానందయ్యగారి వద్దకు వచ్చి తృణమో పణమో యిచ్చి వెళుతూ వుంటాడు.
రామయ్య తన గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు. కిరాణా దుకాణం, బట్టల దుకాణం నడిపేవాడు. అనేక అబద్దాలు ఆడి, మోసాలు చేసి విశేష ధనం, భూమి సంపాదించాడు. కానీ భార్యా పిల్లలు దక్కలేదు. నా అనే దిక్కులేక, గ్రామస్థులతో, సరిపడక మనసు బాగులేనప్పుడూ, ఏదయినా అనారోగ్యం వచ్చినప్పుడూ పరమానందయ్యగారి వద్దకు వెళ్ళి, రెండురోజులు ఉండి పోతుండేవాడు.
ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి... [ఇంకా…]

Friday, September 11
భక్తి గీతాలు - అలమేలుమంగనీ వభినవరూపము
అలమేలుమంగనీ వభినవరూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ
గరుడాచలాధీశు ఘనవక్షముననుండి
పరమానంద సంభిరతవై
నెరతనములు జూపి నిరంతరమునాథుని
హరుషింపగ జేసి తిగదమ్మ... [ఇంకా…]
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ
గరుడాచలాధీశు ఘనవక్షముననుండి
పరమానంద సంభిరతవై
నెరతనములు జూపి నిరంతరమునాథుని
హరుషింపగ జేసి తిగదమ్మ... [ఇంకా…]
Thursday, September 10
సాహిత్యం - మన గ్రంధాలయాలు
జిల్లాలో మొత్తం 92 గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో 65 శాఖా, 27 గ్రామీణ గ్రంథాలయాలు. వీటిలో ప్రస్తుతం 52 శాఖా, 13 గ్రామీణ గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. మొత్తం గ్రంథాలయాల్లో 18 సొంతభవనాల్లో, 17 అద్దె భవనాల్లో నడుస్తున్నవి.
అందులో కొన్ని గ్రంథాలయాలు
1. గీతా లైబ్రరి - చీరాల
2. గౌతమి లైబ్రరి - రాజమండ్రి
3. బ్రౌన్ లైబ్రరి - కడప
4. సారస్వత నికేతనం - వేటపాలెం
5. సిటి సెంట్రల్ లైబ్రరి - హైదరాబాద్ ... [ఇంకా…]
అందులో కొన్ని గ్రంథాలయాలు
1. గీతా లైబ్రరి - చీరాల
2. గౌతమి లైబ్రరి - రాజమండ్రి
3. బ్రౌన్ లైబ్రరి - కడప
4. సారస్వత నికేతనం - వేటపాలెం
5. సిటి సెంట్రల్ లైబ్రరి - హైదరాబాద్ ... [ఇంకా…]
Wednesday, September 9
ఆధ్యాత్మికం - పవిత్రగ్రంధాలు
మానవుని జీవితం మీద పవిత్ర గ్రంధాల ప్రభావం ఎంతైనా ఉంది. సామాజిక వ్యవస్థను తీర్చిదిద్ది, క్రమబద్ధం చేసేవి పవిత్ర గ్రంధాలు. కాబట్టి ప్రతి మతంలోనూ ఈ గ్రంధాలకు పవిత్రత, గౌరవం ఉంది.
నిత్య సత్యాలను ప్రకటించేవి వేదాలు. ప్రజల యొక్క ధార్మిక తత్వాన్నీ, సాంస్కృతిక సంపదను వెల్లడి చేసేవి వేదాలు. ప్రతి మతానికీ ఆ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంధాలు ఉన్నాయి. ఆయా పవిత్ర గ్రంధాలను అనుసరించే ఆయా మతాలు నిరూపించబడుతున్నాయి. మన ప్రాచీన ఋషులు ఎంతో శ్రద్ధగా వేద రచన చేశారు. వేద రహస్యాలు దేవతలు చెప్పగా ఋషులు విని పఠించినవి... [ఇంకా…]

Tuesday, September 8
సంగీతం - సంగీత వాయిద్యాలు
ఆర్యులు మన దేశానికి రావడం మాత్రం మన దేశ చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం. క్రీస్తుకు పూర్వం రెండు వేల అయిదు వందల సంవత్సరాల క్రితం వచ్చిందని చెప్పుకునే ఆర్యుల వేద సాంప్రదాయం మన దేశాన్ని, అతః పూర్వ సాంప్రదాయాల్ని ఎంతగానే మార్చివేసిందని చెప్పాలి. అంతకు క్రితముండిన ఈ దేశపు ప్రజల జీవన విధానాలు, సాహిత్యం, మతం, కళలు అన్నీ గూడా వేద ప్రభావితాలై ఎంతో ఔన్నత్యాన్ని, నాగరికతని పుంజుకున్నాయి. వేద సంహితలన్నీ మానవ జీవన విధానాల వర్ణనలే. ఉదాహరణకు మన సంగీతం ఋగ్వేద, సామవేద జనితమని చెపుతారు. నిజం కూడ అలాగే కనిపిస్తుంది. సామవేద పఠనాన్ని సామగానమన్నారు... [ఇంకా... ]
Monday, September 7
భారతమాత బిడ్డలు - శ్రీనివాస రామానుజం
పేరు - శ్రీనివాస రామానుజం.
తండ్రి పేరు - శ్రీనివాస అయ్యంగార్.
తల్లి పేరు - కోమలత్తమ్మాళ్.
పుట్టిన తేది - 22-12-1887.
పుట్టిన ప్రదేశం - తమిళనాడులోని ' ఈ రోడ్ ' లో జన్మించెను.
చదివిన ప్రదేశం - కుంభకోణం.
చదువు - డిగ్రీ.
గొప్పదనం - 15 ఏళ్ళప్పుడే జార్జ్ స్కూచ్‌సిడ్జ్‌కార్ రూపొందించిన 6000 గణిత సిద్దాంతాలను తులనాత్మకంగా పరిశీలించారు.
స్వర్గస్తుడైన తేది - 26-4-1920.
శ్రీనివాస రామానుజం 1887 డిసెంబరు 22న తమిళనాడులోని 'ఈ రోడ్' లో జన్మించెను. తండ్రి శ్రీనివాస అయ్యంగార్ కుంభకోణంలోని ఒక బట్టల కొట్టులో గుమస్తాగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూండే వాడు. పేద కుటుంబమైనా తమ అవసరాలకు చాలినంత డబ్బు లేకపోయినా ఆయన ఏనాడూ ఒకరిని చేయిచాచి అర్థించక, తమకున్న దాంతోనే తృప్తిపడి, ఉన్న రోజు తిని, లేని రోజు పస్తుండి, ఎంతో ఆత్మగౌరవంతో బతికేవాడు. [ఇంకా... ]

Saturday, September 5
వనితల కోసం - ముద్దుగారే
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకి సుతుడు ||ముద్దుగారే||
అంత నింత గొల్లెతల అరచేత మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చబూ
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ||ముద్దుగారే||... [ఇంకా... ]
తిద్దరాని మహిమల దేవకి సుతుడు ||ముద్దుగారే||
అంత నింత గొల్లెతల అరచేత మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చబూ
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ||ముద్దుగారే||... [ఇంకా... ]
Thursday, September 3
విజ్ఞానం - కంప్యూటర్
నేటి ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్‌లేని జీవనాన్ని ఊహించుకోవడానికి కష్టమేమో. నేడు కంప్యూటర్ ప్రవేశించని రంగమంటూ లేదు. ఇంతటి అద్భుతమైన సాధనాన్ని కనిపెట్టిన మానవుడే నేడు దాని సహాయం లేకుండా నిమిషం కూడా గడవని స్థితికి చేరుకున్నాడంటే దీని శక్తిని మనం అంచనా వేయగలమా? ఇంతవరకూ మానవుడు ఆవిష్కరించిన మరే యంత్రము కంప్యూటర్ చూపినంత ప్రభావాన్ని చూపలేదంటే దీని ప్రాముఖ్యత ఎంత ఉన్నదో మనకు అర్థమవుతోంది, ఉదయం నిద్రలేవగానే చూసే న్యూస్‌పేపరు నుండి విద్యాలయాలు, ఆఫీసులు, పోస్టాఫీసు, రైల్వేస్టేషను ఎక్కడికి వెళ్ళినా మనకు తెలియకుండానే మన పనులు అన్ని కంప్యూటర్ ద్వారా జరుగుచున్నాయి. మన అవసరాలకు ఉపయోగపడుచున్న కంప్యూటర్ గురించి, 'కంప్యూటర్ అంటే ఏమిటి?' కంప్యూటర్ ఎలా పని చేస్తుంది? ఏ విధమైన అవసరాలకు కంప్యూటరును ఉపయోగించుకోవచ్చు మొదలగు విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
కంప్యూటర్ అంటే ఏమిటి?... [ఇంకా... ]
కంప్యూటర్ అంటే ఏమిటి?... [ఇంకా... ]
Wednesday, September 2
అందరికోసం - ఫౌంటెన్ పెన్
మనకు ఏది వ్రాయాలన్న మనం ఉపయోగించేది మొదట పెన్ను. కాని మనకు ఆ పెన్ను గురించి వివరాలు ఏమి తెలయవు కనుక ఇప్పుడు ఆ పెన్ను ఎలా పుట్టినదో, అసలు ఎవరు కనుగొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇవ్వాళ మనం క్లాస్‌రూంలో పెన్ను పట్టుకొని టకటకా నోట్స్ రాసుకుంటున్నాంగానీ ఇలా పెన్నును ఈ షేప్‌లో చూడడం వెనుక బోలెడంత కథ ఉంది. భారతదేశంలో పెన్ను, పేపరు రానంత వరకూ రాతకోతలన్నీ తాటాకుల మీద, ఘంటంతో సాగేవి. ఆ తర్వాత సిరాలో ముంచి రాసే పెన్నులు వచ్చాయి. అయితే నాలుగు పదాలు రాయగానే మళ్ళీ పెన్నును సిరాలో ముంచి రాయాల్సి వచ్చేది... [ఇంకా... ]

Tuesday, September 1
వంటలు - జంతికలు (పప్పులతో...)
కావలసినవి:
కందిపప్పు - ఒక గ్లాసు.
మినపప్పు - ఒక గ్లాసు.
పెసరపప్పు - ఒకగ్లాసు.
బియ్యం - 5 గ్లాసులు ( కావలంటే కొంచెం తగ్గించుకోవచ్చు).
నువ్వులు - 25 గ్రాములు నూనె - తగినంత.
కారం - తగినంత.
చేసే విధానం:
పప్పులను దోరగా వేగించి పెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా వేగించాలి. వీటన్నిటి కలిపి మరలో పిండి పట్టించాలి. దానిలో నువ్వులు, నాలుగు స్పూన్ల మరిగించిన నూనె, తగినంత ఉప్పు, కారం, నీరు పోసి కలిపిన ముద్దను జంతికల గొట్టంలో పెట్టి కాగుతున్న నూనెలో జంతికలు వేసి వేగాక ... [ఇంకా... ]

Monday, August 31
సాహిత్యం - సాహిత్యం అంటే
సమాజము యొక్క ప్రతిబంబమే సాహిత్యం. వర్తమాన సమాజంలోని జీవన పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, ఇంకా ఆయా సమాజాలను ప్రభావితం చేసే అనేక ఇతర అంశాల ఛాయాచిత్రమే సాహిత్యం. పురాతన సమాజాలను అధ్యయనం చేయడం అధునాతన సమాజాల ఆవిర్భావానికి హేతువులాంటిది. సమాజ అధ్యయనం సాహిత్యం ద్వారా సులువు కాబట్టి సాహిత్య అధ్యయనాన్ని సమాజంలోని ప్రతి వ్యక్తీ అలవాటు చేసుకోవాలి. సాహిత్యం మన సంస్కృతి పట్ల మన బాధ్యతను మనకు గుర్తుచేస్తుంది. మన సంప్రదాయంలోని మాధుర్యాన్ని మనకు తెలియజేస్తుంది. మనలో సంస్కారాన్ని కలిగిస్తుంది. ఈవిధంగా సమాజానికి హితం చేస్తుంది కాబట్టే అది సాహిత్యం అయ్యింది... [ఇంకా... ]
Saturday, August 29
తెలుగు - తెలుగు సంవత్సరాలు
ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పతి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభావ, తారణ, పార్ధివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల... [ఇంకా... ]
Friday, August 28
పుణ్యక్షేత్రాలు - యాదగిరి గుట్ట
విజయవాడ - హైదరాబాదు రైలు మార్గంలో రాయగిర్ స్టేషనుకు సుమారు 7కి.మీ. దూరంలో వుంది. స్టేషను నుండి బస్సులు, టాంగాబండ్లు చాలా వున్నాయి. ఇది యాదగిరికొండ మీద నున్న శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రము. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రధానమైన యాత్రాస్ధలం.
ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 315 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకోవచ్చు. కాని కొండమీదికి నేరుగా బస్సులు కూడా ఉన్నాయి. తిరుమల - తిరుపతి, శ్రీశైలంలలో మాదిరిగా కొండమీద అనేక సత్రాలున్నాయి. [ఇంకా... ]
ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 315 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకోవచ్చు. కాని కొండమీదికి నేరుగా బస్సులు కూడా ఉన్నాయి. తిరుమల - తిరుపతి, శ్రీశైలంలలో మాదిరిగా కొండమీద అనేక సత్రాలున్నాయి. [ఇంకా... ]
Thursday, August 27
వంటలు - కాకరకాయ కూర
కావలసిన వస్తువులు:
కాకరకాయలు - 1 కిలో.
నూనె - 150 గ్రా||.
మినపప్పు - 25 గ్రా||.
శనగపప్పు - 25 గ్రా||.
ఎండుమిర్చి - 25.
ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం :
కాకరకాయ గర్భాన కాస్త లోతుగానూ, విడిగానూ గాట్లు పెట్టి వుడికించి వార్చి వుంచాలి. ఒట్టిమూకుట్లో మినప్పప్పు , శనగపప్పు, ఎండుమిర్చి వేయించి సరిపడా ఉప్పు, కారం కొట్టాలి. [ఇంకా... ]

Tuesday, April 7
ఎందుకు, ఏమిటి, ఎలా ... - చాటింగ్
సాయంకాలాలు ఏమీ ఉబుసుపోక పల్లె జనాలంతా వేపచెట్టు కిందకు చేరినట్లు, నెట్ పక్షులన్నీ చాట్‌రూమ్‌ల్లోకి చేరతాయి. దేశవిదేశాల్లోని వ్యక్తులందరితోనూ సంభాషిస్తూ, వారి మనోభావాలను పంచుకోవడానికి వీలు కల్పించే మెసెంజర్‌లు ఎంత మంచివో అంత చెడ్డవి. దూరమైపోయిన ఒకనాటి స్నేహితుడు/స్నేహితురాలితో కాస్త ఎక్కువ సేపు మనసు విప్పి మాట్లాడుకోవడానికి చాటింగ్ కంటే అనుకూలమైనది ఏదీ లేదు. కానీ చాట్‌రూంల రూటే వేరు. అపరిచిత వ్యక్తులతో పరిచయం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆ పరిచయాలు కొంతమందికి తమ కెరీర్‌ను మలుచుకోవడానికి పనికివచ్చాయి. మరికొంతమందికి టైంవేస్ట్ మాత్రమే చేశాయి. ఇంకొంతమందికి చేదు అనుభవాలు మిగిల్చాయి. సేఫ్‌గా చాటింగ్ చేయడానికి ఎంఎస్ఎన్, యాహూ సర్వీసుల వాళ్లు ఈ కింది టిప్స్ చెబుతున్నారు... [ఇంకా... ]
వంటలు - అరటికాయ కూర
కావలసిన వస్తువులు:
అరటి కాయలు : 4.
ఉల్లిపాయలు : 2.
పచ్చిమిర్చి : 4.
అల్లం : చిన్న ముక్క.
నూనె : 4 స్పూన్లు.
ఆవాలు : 1/2 స్పూను.
ఉప్పు, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
జీలకర్ర : 1 స్పూను.
తయారుచేసే విధానం:
అరటికాయలను చెక్కు తీయకుండా 3 ముక్కలుగా కోసి ఉప్పు వేసి నీళ్ళలో ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత పై చెక్కు తీసి ఒక పళ్ళెంలో పొడిపొడిగా చేసి పెట్టుకోవాలి. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - అదనపు ఆహారం
తల్లిపాలు - శిశువు పెరుగుదల, అభివృద్దికి సహజమైన, అసమానమైన ఆహారం. ఇవి ఎన్నో విశిష్టతలు కలిగినప్పటికీ శిశువుకు 4 నుండి 6 నెలల వయసు వచ్చాక వారు పెరుగుతున్న అవసరాలు తీర్చలేవు. తల్లిపాలపైననే పూర్తిగా ఆధారపడే శిశువు క్రమంగా పెద్దలు తీసుకొనే ఆహారానికి మారే దశను 'వీనింగ్' అంటారు.
మనం భుజించే ఆహారంవల్ల పిల్లల కడుపునిండినా అందులో పోషక విలువలు తక్కువ. శిశువుకు గల ప్రత్యేక అవసరాలదృష్ట్యా మన ఆహారంలోనే కొన్ని మార్పులు, చేర్పులు చేసినట్లైతే అది శిశువు అవసరాలను తీర్చగలుగుతుంది. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఎంతోమంది పనివాళ్ళు...
ఎంతోమంది పనివాళ్ళు - ఎంతో మంచి పనివాళ్ళు
మడకను దున్నే మాదన్నా - కొడవలి పట్టిన కొండమ్మా
గుడ్డలు నేసే గురవయ్యా - బట్టలు ఉతికే బాలమ్మా || ఎంతోమంది ||
కుండలు చేసే కుమరయ్యా - కొలిమిని ఊదే కోనయ్యా
చెప్పులు కుట్టే చెన్నయ్యా - దుస్తులు కుట్టే మస్తానూ || ఎంతోమంది || [ఇంకా... ]

Monday, April 6
వంటలు - వాలెంటైన్ చాక్లెట్
కావలసిన వస్తువులు:
పాలపొడి - అరకప్పు.
కండెన్స్‌డ్ మిల్క్ - రెండుటేబుల్ స్పూన్లు.
ఐసింగ్ షుగర్, కోకోపొడి, తాజా వెన్న - ఒక్కోస్పూను చొప్పున.
అంజూర్(బేకరీల్లో లభిస్తాయి) తరుగు - ఒక పెద్దస్పూను.
బాదంపప్పులు - గుప్పెడు.
తయారుచేసేవిధానం:
ఓ వెడల్పాటి గాజు బౌల్ తీసుకుని అందులో పాలపొడి, కోకోపౌడర్, వెన్న, ఐసింగ్ షుగర్ అన్నీవేసి పాలుపోసి చక్కగా గట్టిగా చపాతీల పిండిలా కలపండి. ఆ మిశ్రమానికి అంజూర్ తరుగును చేర్చండి. ఇప్పుడు వెడల్పాటి గాజుట్రే తీసుకుని దానికి కాస్త వెన్నరాసి... అందులో ఈ మిశ్రమాన్ని సమంగా సర్ధండి. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - టీవి (టెలివిజను)
టీవి కొంటే కారు బహుమతి అంటూ షోరూములు తాయిలాలతో ఊరిస్తుంటాయ్. శబ్ధం ఎక్కువైతే దృశ్య నాణ్యత తక్కువ అవుతుందనీ, పిక్చర్ ఫర్వాలేదంటే సౌండ్ నాసిరకంగా ఉంటుందన్న అపోహలు సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. ఫీచర్లతో పాటే కొండెక్కే ధరలు. అయోమయంలో ముంచెత్తే సేల్స్‌మెన్‌ల మాటలు కలర్ టీవీ కొనాలని షోరూములకెళ్లే సగటు మధ్య తరగతి వ్యక్తి పరిస్ధితి ఇదే.
అయోమయాల నుంచి బయటపడి సరసమైన ధరకు సరైన టీవీని ఎంచుకోవాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే. కలర్ టీవీలు అయిదు విభిన్న రకాల్లో లభ్యం అవుతున్నాయి. ప్రాధమిక మోడల్, ఫ్లాట్ స్క్రీన్, ప్రొజెక్షన్, ప్లాస్మా, ఎల్‌సీడీ. నిన్న మొన్నటి వరకూ పద్నాలుగు అంగుళాల కలర్ టీవీలదే రాజ్యం. ఆ తర్వాత 20 అంగుళాల టీవీలను కొనేవారి సంఖ్య పెరిగింది. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - లాల్ బహదూర్ శాస్త్రి
పేరు : లాల్ బహదూర్ శాస్త్రి.
తండ్రి పేరు : శారదాప్రసాద్ రాయ్.
పుట్టిన తేది : 2-10-1904.
పుట్టిన ప్రదేశం : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో జన్మించారు.
చదివిన ప్రదేశం : మొగల్ సరాయ్.
గొప్పదనం : బ్రిటీషు వారిని ఎదిరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో సత్యాగ్రహలు చేశాడు.
స్వర్గస్థుడైన తేది : 1966 వ సంవత్సరంలో స్వర్గస్థుడైనారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న జన్మించారు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్ బహదూర్ ను చూసుకొని ఆ తల్లిదండ్రులెంతో మురిసిపోయారు. [ఇంకా... ]

సౌందర్య పోషణ - పాదాలకు
. అర టీస్పూన్ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
. అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.
. కాలేజీలకు స్కర్టులు వేసుకునే వారికి మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్ లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - ఖాళీల పూరింపు
చిన్న పిల్లకు ఖాళీలను పూరించటమంటే చాలా ఇష్టం అందుకని చిన్న పిల్లల ఆటలో ఈ ఖాళీల పూరింపును కూడా చేర్చాము. ఈ ఆటలో కనీసం నలుగురు పిల్లలు పాల్గొనవచ్చు. పిల్లల్లో ఒక్కొక్కరికి ఒక అక్షరానికి సంబంధించిన పదాలు ఇవ్వాలి. ఆటగాళ్ళు ఎ, బి, సి, డి లనుకుంటే వాళ్ళకు ఇచ్చిన ఖాళీల పూరింపు ఇట్లా ఉంటుంది.
ఉదా: Team A వారు గ (అక్షరం) మీదపూరించవలెను.
ప్రశ్న: - డి - రం.
జవాబు: గడియారం.
ఎవరు సరిగ్గా ఖాళీలు పూరిస్తే వారు విజేత. [ఇంకా... ]
ఉదా: Team A వారు గ (అక్షరం) మీదపూరించవలెను.
ప్రశ్న: - డి - రం.
జవాబు: గడియారం.
ఎవరు సరిగ్గా ఖాళీలు పూరిస్తే వారు విజేత. [ఇంకా... ]
Friday, April 3
వ్యాయామ శిక్షణ - సమూహ (గ్రూప్) వ్యాయామం
మనలో చాలా మందికి పనులు వాయిదా వేయడం అలవాటే. తమకు తాము ప్రేరణ కలిగించుకుని తీసుకున్న నిర్ణయాన్ని చివర వరకు కొనసాగించగల శక్తి అందరికీ ఉండదు. వ్యాయామం చేయడంలోనూ మీది అదే తీరైతే గ్రూప్ వ్యాయామమే మీకు తగినది.
. పరస్పరం మాట్లాడుకుంటూ ఉండటంవల్ల ఒకరి నుంచి మరొకరు ప్రేరణ పొందుతారు. అందరూ కలిసి వ్యాయామానికి సంబంధించిన ఒక్కో అంశం గురించి చర్చించుకుంటూ ఉండటం వల్ల తేలికగా అనుసరించగలుగుతారు.
. రోజూ వ్యాయామం చేసేటప్పుడు పోటీపడి అందరితో సమానంగా చేయగలుగుతారు. త్వరగా నేర్చుకొనే అవకాశమూ ఉంది. మనకు తెలియకుండానే పక్కవారి కన్నా బాగా చేయాలన్న పట్టుదల వచ్చేస్తుంది. [ఇంకా... ]

వంటలు - గుమ్మడి వరుగు (చిప్స్)
కావలసిన వస్తువులు:
బూడిద గుమ్మడికాయ, పసుపు, ఉప్పు.
తయారుచేసే విధానం:
మొదట బూడిదగుమ్మడికాయను చెక్కుతో పాటే బాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఈ తరిగిన ముక్కలన్నిటినీ ఉప్పు, పసుపు వేసి జాడిలో పెట్టుకుని ఒక రోజంతా నాననివ్వాలి. మరుసటి రోజు గట్టిగా మూతపెట్టి కావలసినప్పుడు నూనెలో దోరగా వేగించుకొని కొద్దిగా ఉప్పు కారం చల్లుకోవాలి. [ఇంకా... ]

భక్తి గీతాలు - శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి
శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి
సరోజాలతోనే పూజచేతు ఆ...
గులాబీలతోనే పూజసేతు "శి"
శంభుని రాణి చల్లని చూపు
భక్తావాళి భాధలు బాపు
ప్రార్ధింతుము రేపూ మాపు
గ్రహ బాధలు రూపు మాపు
స్తుతింతును రోజు రోజు
వెన్నెల కాంతులు మాపై నిలుపు
వికసించే నీ ముఖ బింబం [ఇంకా... ]
సరోజాలతోనే పూజచేతు ఆ...
గులాబీలతోనే పూజసేతు "శి"
శంభుని రాణి చల్లని చూపు
భక్తావాళి భాధలు బాపు
ప్రార్ధింతుము రేపూ మాపు
గ్రహ బాధలు రూపు మాపు
స్తుతింతును రోజు రోజు
వెన్నెల కాంతులు మాపై నిలుపు
వికసించే నీ ముఖ బింబం [ఇంకా... ]
పుణ్య క్షేత్రాలు - శ్రీ కాళ హస్తి
తిరుపతికి తూర్పున సువర్ణముఖి నది ఒడ్డున గల కొండల మధ్య అమరివున్నది శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం.
నామ సార్ధకత:
శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ ప్రాంతంలో స్వయం భూలింగముగా వెలసిన శివలింగం పై మూడున్నూ అర్చించి భక్తి నిరూపణలో పోటాపోటీగా సంచరించి చివరికి మోక్షమును పొందాయని ఒక కథ. కనుకనే ఈ స్వామి శ్రీ కాళ హస్తీశ్వరుడనేది సార్ధకనామంగా వున్నదని ప్రతీతి. మరో విశేషం ఏమిటంటే భక్తకన్నప్ప చరిత్ర కూడా ఇచ్చోటనే జరిగి భక్తిలోని గొప్పదనాన్ని చాటిన దివ్య ప్రదేశంగా పేరొందింది. ఈ స్వామి మహత్యాన్ని ఉగ్గడిస్తూ శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరైన మధురకవి దూర్జటి శ్రీ కాళ హస్తీశ్వర శతకంగా రూపొందించి ధన్యతను పొందాడు, చిరస్మరణీయుడైనాడు. [ఇంకా... ]

నీతి కథలు - దురాశే దుఃఖమునకు మూలము
గోవిందయ్య అనే వ్యాపారస్తుడు అతి పిసినారి. ఏదయినా సరే బేరమాడటంలో అవతలి వ్యక్తికి విసుగు తెప్పించి తను లాభపడాలని కోరుకునే మస్తత్వము గల వ్యక్తి. ఒక దినమున అరణ్యమార్గము గుండా పట్నము వెళ్తున్నాడు. తనతోపాటు ఎవరూ లేరు. అతనిని చూస్తే వర్తకులుగాని, సాటివారుగానీ, హడలెత్తేవారు. అరణ్యమార్గములో పోతూవుండగా చెట్టు పొద సమీపములో బక్కచిక్కిన శరీరముతో వున్న ఋషి పడి వున్నాడు. అతను 'దాహం... దాహం' అని వినీ వినపడనట్లుగ అంటుంటే గోవిందయ్య వెళ్ళి తన వద్దగల మంచినీళ్ళు మునీశ్వరుని నోట్లో పోశాడు. కళ్ళు తెరిచి ముని "చివరి ఘడియల్లో నాకు దాహార్తిని తీర్చినావు. నీ మేలు మరవను. నాకు ఇది చివరి నిమిషం. నిమిషంలో మృత్యువు నన్ను సమీపించనుంది. వెంటనే అదైనా వరము కోరుకో... నేను ప్రసాదించగలను" అన్నాడు.[ఇంకా... ]
Thursday, April 2
లాలి పాటలు - చందమామ రావే - జాబిల్లి రావే!
చందమామ రావే - జాబిల్లి రావే!
బండిమీద రావే - బంతి పూలు తేవే
పల్లకిలో రావే - పంచదార తేవే
సైకిలెక్కిరావే - చాక్లెట్లు తేవే
పడవమీద రావే - పట్టు తేనె తేవే
మారుతిలో రావే - మంచి బుక్సు తేవే
పెందలాడే రావే - పాలు పెరుగు తేవే [ఇంకా... ]
బండిమీద రావే - బంతి పూలు తేవే
పల్లకిలో రావే - పంచదార తేవే
సైకిలెక్కిరావే - చాక్లెట్లు తేవే
పడవమీద రావే - పట్టు తేనె తేవే
మారుతిలో రావే - మంచి బుక్సు తేవే
పెందలాడే రావే - పాలు పెరుగు తేవే [ఇంకా... ]
వంటలు - చిక్కుళ్ళ వేపుడు
కావలసిన వస్తువులు:
పెద్దగింజలుండే చిక్కుళ్ళు - 250.
నూనె - 50.
కారం - అరచెంచాడు.
లవంగపొడి - చిటికెడు.
కర్వేపాకు - 2 రెబ్బలు.
ఎండుమిర్చి - 1.
ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం :
చిక్కుళ్ళు వుడకేసి, ఒక పొంగురాగానే దింపి వార్చేయాలి. [ఇంకా... ]

పండుగలు - శ్రీరామనవమి
దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధమై చైత్రశుద్ద దశమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం 'శ్రీరామనవమి' గా విశేషంగా జరుపుకుంటాం.
'రామ' యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న 'ఆ శ్రీరాముని' కనుగొనుచుండవలెను.
ఒకసారి పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - చెప్పులు
చెప్పులే కదా! అనో లేకపోతే స్టయిల్ గా కనిపించాయనో ఎలాపడితే అలా పాదరక్షలను కొనకూడదు. వాటిని కొనడానికి ఒక టైం ఉంటుందని తెలుసా మీకు. అలాగే చెప్పులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే -
రెండు పాదాలు ఒకే సైజులో ఉండవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొత్త చెప్పులు, షూ, శాండల్ ఏవి కొంటున్నా రెండు పాదాలకు వేసుకుని సైజు చూసుకోవాలి. వేసుకున్నప్పుడు కొంచెం అసౌకర్యంగా అనిపిస్తే కొన్నాళ్లు వేసుకుంటే సాగుతాయిలే అని తీసుకోవద్దు. బ్రాండ్ సైజుల బట్టి కొనొద్దు. స్టయిల్ ను బట్టి సైజులు మారుతుంటాయి. అందుకని పాదరక్షలు కొనే ప్రతిసారి రెండు పాదాలకు వేసుకుని గమనించి కొనుక్కోవాలి. కాలి వెనుక భాగం షూలో సరిగా కూర్చోవాలి. అలా ఉంటే కాలి వేళ్లను సులువుగా కదిలించొచ్చు. [ఇంకా... ]

పిల్లల ఆటలు - తాబేలు రేసు
ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
ఆడే స్థలం : గదిలో, ఆరుబయట ఆడవచ్చు.
కావలసిన వస్తువులు : చాక్ పీస్ , ప్లాస్టిక్ తాడు.
ఆటగాళ్ల వయస్సు : 7 సం|| రాల నుండి.
ఆటగాళ్ళందర్ని మోకాళ్ళు, అరచేతులమీద నించోబెట్టాలి. 'స్టార్ట్' చెప్పగానే అంతా ఫినిషింగ్ లైన్ దగ్గరకి (ఇది చాక్ పీస్ తో గీయవచ్చు, లేదా నేలమీద ప్లాస్టిక్ తాడు ఉంచవచ్చు.) ఎంత నెమ్మదిగా సాధ్యం అయితే అంత నెమ్మదిగా వెళ్ళాలి. [ఇంకా... ]

Subscribe to:
Posts (Atom)