Saturday, January 9

పర్యాటకం - రామేశ్వరం

భారతీయులలో ఆస్తికులైనవారందరికీ కాశీ తరువాత దానితో సమానమైన పవిత్రక్షేత్రం రామేశ్వరమే. రామేశ్వరం తమిళనాడు రాష్ట్రం తూర్పు అంచున ఉన్న బంగాళాఖాతం ఒడ్డున ఉంది. చెన్నై నుంచి సరాసరి రామేశ్వరం వెళ్ళే రైళ్ళు రెండు ఉన్నాయి. ఇందులో ఒకటి తిరువాయూర్‌‌ వెళతాయి. అంతేకాక తమిళనాడులోని కొన్ని ఊళ్ళనుంచి... [ఇంకా... ]

Thursday, January 7

అక్షరాలు - మహా ప్రాణ అక్షరాలు

మహా ప్రాణ అక్షరాలు అంటే హల్లులలోని ఒత్తులు ఉన్న అక్షరాలు.
ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ
వాటి మీద పదాలు
శంఖము, ఖడ్గము, ఖలుడు, ముఖం, న ఖం... [ఇంకా... ]

Wednesday, January 6

కాలచక్రం - నెలలు

1. చైత్రము
2. వైశాఖము
3. జేష్టము
4. ఆషాఢము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వీజము... [ఇంకా... ]

కాలచక్రం - పక్షాలు

పదిహేను రోజులు ఒక పక్షం
అమావాస్య వెళ్లిన దగ్గరి నుంచి పౌర్ణమి వచ్చే వరకు శుక్ల పక్షం లేక శుద్ద పక్షం అని... [ఇంకా... ]

కాలచక్రం - వారాలు

ఆదివారము, Sunday
సోమవారము, Monday
మంగళవారము, Tuesday
బుధవారము, Wednesday... [ఇంకా... ]

Tuesday, January 5

పిల్లల పాటలు - జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం...

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
అర్జునుడు తిన్న అరటి పండ్లరిగి
భీముడు తిన్న పిండివంటలరిగి
గణపతి తిన్న ఖజ్జాలరిగి... [ఇంకా... ]

Friday, January 1

వంటలు - స్వీట్‌ కార్న్‌ సూప్

కావలసిన వస్తువులు:
మొక్కజొన్న గింజలు - 1 కప్పు (పచ్చివి).
క్యారెట్‌ - 1.
బీన్స్‌ - ‌గుప్పెడు.
కార్న్‌ఫ్లోర్‌ - పావు కప్పు.
ఉప్పు - తగినంత... [ఇంకా... ]

Tuesday, December 29

వ్యక్తిత్వ వికాసం - ఇలా... హాయిగా...

పొద్దున లేచిందగ్గర్నుంచి ఎన్నో పనులు... మరెన్నో ఆందోళనలు. పాఠాలు, పరీక్షలు, స్నేహితులతో పోటీ. అవన్నీ మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉండాలంటే హయిగా సేదదీరడమే ముందు. మరి మీ గది అందుకు అనుకూలంగా ఉందా?
. మీ గది గోడలకు లేతరంగు వేయించుకోండి.
. కిటికీలు, ద్వారానికి పలుచటి నెట్‌లాంటి కర్టెన్లు వేయండి. అవి పగటి వెలుగుని లోనికి రానిస్తాయి.
. మీకిష్టమైన ఆహ్లదకరమైన పరిమళం గదంతా పరుచుకునేలా... [ఇంకా... ]

Monday, December 28

పండుగలు - ముక్కోటి ఏకాదశి

ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి పవిత్రమైనది. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది.
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం|
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం||
అట్టి సుమధుర మూర్తిని ఈ 'ఏకాదశి' రోజున వేయికనులతో వీక్షించి సేవించి తరంచి పోవాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు కనుక ఇది వైకుంఠ ఏకాదశిగా "ముక్కోటి ఏకాదశి" గా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇట్టి పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అవుతుంది.
ప్రముఖ దేవాలయాలలో (తిరుపతి, భద్రాచలం మున్నగు వైష్ణవ) పుణ్యక్షేత్రాలలో... [ఇంకా... ]

Thursday, December 24

పండుగలు - క్రిస్‌మస్ - డిసెంబర్ 25

క్రిస్‌మస్ క్రైస్తవులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను భారత దేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని దేశాలలోను జరుపుకుంటారు. ఇది యేసుక్రీస్తు పుట్టిన రోజు పండుగ. ప్రతి సంవత్సరం డిసెంబరు 25వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.
యేసుక్రీస్తు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది. ఆ కాలంలో అంటే రెండు వేల సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో లెక్కవేయించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరు ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబరు 25 తేదీలోగా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు.
అప్పుడు ' నజరేతు ' అనే పట్టణంలో మేరీ, జోసఫ్ అనే వాళ్ళు... [ఇంకా... ]

వంటలు - బ్రెడ్ పుడ్డింగ్

కావలసిన వస్తువులు:
బ్రెడ్ ముక్కలు - 8.
గ్రుడ్లు - 2.
పంచదార - 1/2 కప్పు.
కిస్ మిస్ - 1/2 కప్పు.
పాలు - ఒకటిన్నర కప్పు (1.5).
వెన్న - ఒకటిన్నర స్పూను... [ఇంకా... ]

Wednesday, December 23

పిల్లల పాటలు - వానల్లు కురవాలి - వానదేవుడా!

వానల్లు కురవాలి - వానదేవుడా
వానల్లు కురవాలి - వానదేవుడా
వరిచేలు పండాలి - వానదేవుడా
నల్లని మేఘాలు - వానదేవుడా
చల్లగా కురవాలి - వానదేవుడా... [ఇంకా... ]

Tuesday, December 22

భరతమాత బిడ్డలు - శ్రీనివాస రామానుజం

పేరు : శ్రీనివాస రామానుజన్.
తండ్రి పేరు : శ్రీనివాస అయ్యంగార్.
తల్లి పేరు : కోమలత్తమ్మాళ్.
పుట్టిన తేది : 22-12-1887.
పుట్టిన ప్రదేశం : తమిళనాడులోని ' ఈ రోడ్ ' లో జన్మించెను.
చదివిన ప్రదేశం : కుంభకోణం.
చదువు : డిగ్రీ.
గొప్పదనం : 15 ఏళ్ళప్పుడే జార్జ్ స్కూచ్‌సిడ్జ్‌కార్ రూపొందించిన 6000 గణిత సిద్దాంతాలను తులనాత్మకంగా పరిశీలించారు... [ఇంకా... ]

Monday, December 21

పర్యాటకం - లక్షద్వీప్‌

ఇంతకు ముందు లక్షదీవులు, మినికాయ్‌, అమీన్‌ దీవులు అని పిలువబడే మూడు గుంపుల దీవులను కలిపి ఇప్పుడు లక్షద్వీపాలు అని పిలుస్తున్నారు. ఇవి కేరళరాష్ట్ర పడమటి తీరం నుంచి సుమారు రెండు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఇవి మెత్తం 27 దీవులు. ఇందులో కేవలం పదింటిలోనే జనావాసం ఉంది. ఇందులో... [ఇంకా... ]

Thursday, December 17

వంటలు - చపాతీ చాట్

కావలసిన వస్తువులు:

చపాతీలు - మూడు.
నూనె - వేయించటానికి సరిపడా.
మీఠా చట్నీ - అరకప్పు.
పెరుగు - పెద్దకప్పు.
కారం - అర చెంచా.
జీలకర్ర పొడి - ఒక చెంచా... [ఇంకా... ]

Wednesday, December 16

ఎందుకు, ఏమిటి, ఎలా... - టీ-షర్ట్స్

రంగు రంగుల టీషర్ట్స్ వేసుకొని షోగ్గా తిరగాలని మనందరికీ చాలా సరదా. మామూలు చొక్కాల కన్నా టీ-షర్ట్స్ చాలా ఫ్యాషన్‌గా ఉంటాయి. సౌకర్యంగా ఉంటాయి. మరి ఇవి ఎలా తయారయ్యాయి? అని తెలుసుకోవాలనుందా, అయితే ఇది చదవాల్సిందే.

టీ షర్ట్ గురించి తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధకాలానికి వెళ్ళాలి. అప్పట్లో యూరోపియన్లు టీ-షర్ట్స్ వంటి లోదుస్తులను ధరించి యుద్ధం చేస్తుంటే అమెరికన్లు మాత్రం దళసరి యూనిఫాంలు ధరించి యుద్ధం చేసేవారు. కాని యూరోపియన్లు హాయిగా ఉంటే అమెరికన్లు చెమటలు కక్కుతూ ఉండేవారు. దాంతో కొన్నాళ్ళకు అమెరికన్లు కూడా టీ-షర్ట్స్ వైపే మొగ్గు చూపారు. దాంతో ఒక్కసారిగా... [ఇంకా... ]

Tuesday, December 15

తెలుగు బిడ్డలు - పొట్టి శ్రీరాములు

పేరు : పొట్టి శ్రీరాములు.
తండ్రి పేరు : గురవయ్య.
తల్లి పేరు : శ్రీమతి మహాలక్ష్మమ్మ.
పుట్టిన తేది : 1901.
పుట్టిన ప్రదేశం : మద్రాసు.
చదివిన ప్రదేశం : నెల్లూరు... [ఇంకా... ]

Saturday, December 12

జానపద గీతాలు - కాకరచెట్టు మేకల్ మేసే సై కోడలా

మామ : కాకరచెట్టు మేకల్ మేసే సై కోడలా... నీవు
పోకడెక్కడ పోయినావె సై కోడలా
కోడలు : మాపున చెప్పిన మాటలకు మామయ్యలో... నేను
మల్లెమొగ్గలేరబోతి మామయ్యలో
మామ : మల్లెమొగ్గలేరలేదు సై కోడలా... నీవు... [ఇంకా... ]

Wednesday, December 9

అక్షరాలు - సంయుక్త అక్షరాలు

ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలు
తర్కము (ర + క = ర్క)
ఆసక్తి (కి + త = క్తి)
పద్యము (ద + య = ద్య)
అశ్వము (శ + వ = శ్వ)
కట్నము (ట + న = ట్న)
కాశ్మీరు (శీ + మ = శ్మీ)
భగవద్గీత (దీ + గ = ద్గీ )
హర్షము (ర + ష = ర్ష )... [ఇంకా... ]

Tuesday, December 8

కాలచక్రం - నక్షత్రాలు

నక్షత్రాలు ఇరువై ఏడు
1. అశ్విని
2. భరణి
3. కృత్తిక
4. రోహిణి
5. మృగశిర
6. ఆర్ద్ర... [ఇంకా... ]

Saturday, December 5

వ్యాయామ శిక్షణ - అధిక బరువుకు కారణాలేమిటి?

. అవసరానికి మించి ఆహారం ద్వారా కేలరీలు తీసుకోవడం, రుచులు మీద మక్కువ చంపుకోలేక పోవటం.
అనియమిత జీవనం, అంతు లేని శ్రమ, మనం సృష్టించిన డబ్బు కోసం మనమే పరుగులు తీయడం, క్షణమొక రూపాయిగా మార్చడానికి తపన పడే మన సహజమైన బుద్ధిది ఇంకొక తప్పు.
. ఎటువంటి శారీరక శ్రమ దైనందిన జీవనంలో లేకపోవడం ఆకాశమే హద్దుగా సాగుతున్న మానవ మేథస్సు సృష్టించిన ఓ అందమైన ఉత్పాతం ఇది.
. వ్యాయామాలు చేయకపోవడం - బద్దకం దీనికి కారణం.
. జన్యు సంబధిత లోపాలు - కర్మ సిద్ధంతాన్ని విశ్వసించినా, లేకున్నా... [ఇంకా... ]

Wednesday, December 2

వంటలు - చిక్కుడుకాయ టమోటా కూర

కావలసిన వస్తువులు:
చిక్కుడు కాయలు : 1/2 కిలో.
ఉల్లిపాయలు : 2.
టమోటాలు : 2.
నూనె : 6 స్పూన్లు.
ఉప్పు, కారం, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2... [ఇంకా... ]

Tuesday, December 1

పర్యాటకం - వేసవి ప్రయాణికులకు పర్యాటక ప్రణాళిక

నాలుగు ప్రాంతాలకు తిరిగితేనే లోకం తీరు తెలుస్తుంది. మనుషుల పోకడలు అవగతమౌతాయి. జీవితపు వైవిధ్యం అనుభవలోకి వస్తుంది. రోజులు కొత్తగా వెలుగుతాయి. విలక్షణ అనుభవాలు వినూత్న అనుభూతుల్ని అందిస్తాయి. అందుకే పర్యటించాలి .కొత్త ప్రాంతాలలోకి ప్రవహించాలి. మామూలు రోజుల్లో ఏదో ఒక హడావిడి వుంటూనే వుంటుంది. జీవిక కోసం పరుగులు తీయక తప్పదు. పిల్లల్ని పరుగు తీయించక తప్పదు. కానీ కాస్త తీరికగా పర్యటించడానికి అనువైన సమయం వేసవి సెలవుల సందర్భం. దసరా సెలవుల్లో, సంక్రాంతి సెలవుల్లోనూ సమయం వుంటుంది. కానీ పరిక్షలు పూర్తయి ఖాళీగా ఉండేది వేసవి సెలవుల్లోనే. అందుకే వేసవిలో విహారం మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. ప్రతి ఏటా కనీసం రెండుసార్లు పర్యటించి రావాలి. లేదంటే... [ఇంకా... ]

Monday, November 30

నృత్యం - జానపద నృత్యాలు

అసంఖ్యాక జాతులతోనూ పతిస్థితులతోనూ కూడి ఉన్న భారతదేశం అనేక శతాబ్దాలుగా రకరకాల జానపద నృత్యాలకు నిలయంగా ఉంది. భారతదేశంలోని నేటి శాస్త్రీయ నృత్య విధానాలు చాలా కట్టుబాట్లకు లోబడి ఉండటంతోపాటు ఎంతో నాజూకుతనాన్ని చూపుతున్నది. ఆటవికుల గూడెములోనూ కర్షకుల కుటీరాలలోనూ నేటికి తమ పాటవాన్ని కోల్పోకుండా బ్రతికి ఉన్న సామాన్య ప్రజా నృత్యాలనుండి మన శాస్త్రీయ నృత్యాలు పుట్టాయి. భారతీయ జానపద నృత్యాలలో నిరాడంబరమైన సరళత ఉంది. వాటి సరళత వెనుక మహత్తర కళాభావాలు రెండు ఉన్నాయి. సహజమైన భావగాంభీర్యం, విస్పష్టమైన వ్యక్తీకరణ ఉన్నాయి. జానపద నృత్యానికి, దానినుండి ప్రధానంగా ఉధ్భవించిన శాస్త్రీయ నృత్యానికి ఉన్న భేదం రీతిలోనే. జానపద నృత్యంలో కళారీతిని ప్రయత్నం పూర్వకంగా తెచ్చుకోవటం అంటూ ఉండదు. ఇందుచేతనే జానపద నృత్యంలో చిరకాలం నుంచి వస్తున్న ప్రబలమైన సంప్రదాయాలు ఉన్నప్పటికీ అది స్వయం ప్రేరణతో... [ఇంకా... ]

Thursday, November 26

విజ్ఞానం - న్యాయ వ్యవస్థ

1. సుప్రీం కోర్ట్
2. హైకోర్ట్
3. సబార్డినేట్ కోర్ట్
4. మేజిస్ట్రేట్ కోర్ట్
5. ఫ్యామిలీ కోర్ట్
6. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్
భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది హైకోర్టులపై నియంత్రణాధికారం కల్గిఉన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను... [ఇంకా... ]

Tuesday, November 24

సౌందర్య పోషణ - ఆకర్షించే గలగల గాజులు

. చేతులకు ధగధగమని మెరిసే బంగారు గాజులు ఎన్ని వున్నా వాటి మధ్యలో మట్టిగాజులు వేసుకుంటేనే వాటికి మరింత నిగారింపు వస్తుంది.
. పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు రెండు చేతులకూ రంగురంగుల మట్టిగాజులు వేసుకుంటే మహిళల చేతులు కళకళలాడుతూ ఆకర్షణీయంగా వుంటాయి.
. చిన్నపిల్లలకైతే మట్టి, పింగాణీతో చేసిన గాజులు వేయడం కన్నా ప్లాస్టిక్, రబ్బరు, మెటల్, బంగారంతో చేసిన గాజులే భద్రంగానూ, చూడముచ్చటగానూ వుంటాయి.
. చిన్నపిల్లలకు సన్నటి గాజులు నాలుగైదు వేయడంకన్నా... [ఇంకా... ]

Monday, November 23

సాహిత్యం - జాతీయాలు

తెలుగు నేర్చుకోవాలనుకునేవారు వాడుక భాషలోని కొన్ని పదాల అర్ధాలను తెలుసుకోవడం అవసరమని భావిస్తూ మనం నిత్యం మట్లాడే కొన్ని పదాల వివరణలను ఇప్పుడు ఇస్తున్నాం. ఈ మాటలు ఏ సందర్భంలో అనాలో తెలిసినప్పటికీ గమ్మత్తైన ఈ పదాలు అసలు ఎలా పుట్టాయో తెలుసుకోవడం విఙాఞనదాయకంగానూ, వినోదాత్మకంగానూ ఉంటుంది. తెలుగు భాషకు మాత్రమే సొత్తైన ఈ పదాలను, పదబంధాలను జాతీయాలు అంటారు. మీక్కూడా తెలీకుండా అలవోకగా మీరు అనే ఈ జాతీయాల వివరణలోకి ఇప్పుడు వెళ్దాం.
జాతీయం అంటే?
ఒక జాతి ప్రజ ఒకభావాన్ని ప్రకటించడంలో వ్యక్తం చేసే భాషాపరమైన విలక్షణత. దీన్నే పలుకుబడి అని కూడా అంటారు. "ఓరంతపొద్దు, ఓడలు బండ్లు బండ్లోడలు, గుండెరాయి చేసుకొను, చెవిలో ఇల్లుగట్టుకొనె పోరు, కాలికి... [ఇంకా... ]

Saturday, November 21

జానపద కళారూపాలు - ఉపోద్ఘాతం

తెలుగు నాటక రంగం ఆవిర్భవించి నూరేళ్ళు దాటింది.ఈ నూరేళ్ళుగా వినోదాన్ని నాటకాలనుండి పొందుతున్నాం. సినిమా రాకముందూ, సినిమా వచ్చాకా కూడా సగటు మానవుడి దృష్టి నుంచి నాటక రంగం ఏనాడూ దూరం కాలేదు. ప్రజల అంతరాంతరాల్లో నాటుకు పోయిన ఈ జీవ కళ ఆవిర్భవించకముందు అంటే వంద సంవత్సరాలకు పూర్వం మానవుడు విజ్ఞానం, వినోదాలకోసం ఏం చేసేవాడు? అని ప్రశ్న ఉదయిస్తే దానికి సమాధానం ఎవరో కొద్ది మంది దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ కొద్దిమంది కూడా మేధావులేమీ కాదు. సామాన్య మానవులు మాత్రమే వాళ్ళు. ఆ సామాన్య మానవులు కూడా గ్రామీణ నేపధ్యం కలవారు లేక గ్రామీణ సంప్రదాయం పట్ల అభిమానం కలవారు మాత్రమే. వారిని పలకరిస్తే... [ఇంకా... ]

Thursday, November 19

వ్యక్తిత్వ వికాసం - అతివ - ఆత్మవిశ్వాసం

అతివల్లో ఆత్మవిశ్వాసం పెరగాలంటే ముందుగా వాళ్ళని వారు విశ్వసించాలి. ఆత్మ విశ్వాసం పెరగాలంటే అందుకు అనేక బలాలు దోహదం చెయ్యాలి. ముందుగా వారిలో ఆలోచనా జ్ఞానం పెంపొందాలి. స్వతంత్రంగా ఆలోచించడం అలవరుచుకోవాలి. అందుకు కొన్ని సూచనలు పాటించాలి... మిమ్మల్ని గురించి మీరు బాగా తెలుసుకోండి. మీ సంపదలను లెక్కవేయండి. మీ ఇల్లు, మీ కుటుంబం, స్నేహితులు, మీ సక్రమ ఆలోచనలు, భగవంతునితో మీకున్న విశ్వాసం మొదలైన వాటిని... [ఇంకా... ]

Wednesday, November 18

జానపద గీతాలు - చల్ మోహనరంగా...

నీకు నీవారు లేరు నాకూ నా వారు లేరు
ఏటి ఒడ్డున ఇల్లు కడదము పదరా చల్ మోహనరంగా
నీకు నాకు జోడు కలసెను గదరా
మల్లె తోటలోన మంచినీళ్ళ బావికాడ
ఉంగరాలు మరచి వస్తిని కదరా || చల్ ||... [ఇంకా... ]

Tuesday, November 17

ఆహార పోషణ - ఏ విటమిన్ ఎక్కడ దొరుకుతుంది?

నీటిలో కరిగే విటమిన్లు
విటమిన్--రసాయనిక నామము------లభించే పదార్ధాలు------ నూన్యత వలన కలిగే వ్యాధులు
బి 1--- ధయామిన్--- గోధుమ వంటి ధాన్యాలు, వేరుశనగ...--- బెరి బెరి, ఆకలి మందగించటం
బి 2--- రైబోఫ్లేవిన్--- పాలు, గుడ్లు, కాలేయము....--- నోటిపూత, నోటి మూలల్లో పగలటం
బి 6--- పైరిడాక్సిన్--- పాలు, కాలేయము, మాంసము...--- రక్తహీనత, ఉద్వేగము, నాడి మండలంలో... [ఇంకా... ]

Monday, November 16

నీతి కథలు - పేదరాశి పెద్దమ్మ కథ

అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉందట. పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచి మనువులు చూసింది. తను దాచుకున్నవి తలోకాస్త ఇచ్చి వేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కదా! కనుక ఒక్కో కూతురి ఇంట మూడు మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పు పని లేదు. హాయిగా గడచిపోతూంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒక రోజు రెండవ కూతురు ఇంటికి బయలు దేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో... [ఇంకా... ]

Thursday, November 12

వంటలు - బందర్ హల్వా

కావలసిన వస్తువులు:
గోధుమపిండి - 1 కిలో.
జీడిపప్పు - 100 గ్రా.
బెల్లం - 1 కిలో.
నెయ్యి - 700 గ్రా.
యాలుకల పొడి - 30 గ్రా.
రెడ్ కలర్ - చిటికెడు.
చాక్లెట్ కలర్ - చిటికెడు.

తయారు చేసే విధానం :
గోధుమపిండిని సరిపడినన్ని నీళ్ళతో ముద్దలా చేసి ఒక గిన్నెలో... [ఇంకా... ]

Wednesday, November 11

భరతమాత బిడ్డలు - మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌

మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్ భారత స్వాతంత్ర్యం కోసం పరితపించిన వ్యక్తిగా, మత ప్రాతిపదికన భారతదేశం విడిపోవటాన్ని వ్యతిరేకించిన నిజమైన భారతీయునిగా, స్వాతంత్ర్యానంతర భారతదేశంలో సాహిత్యం, విద్యా వికాసాలకొరకు కృషి చేసిన వ్యక్తిగా, దేశభక్తికి మతాలు అడ్డురావని నిరూపించిన వ్యక్తి మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్.

సౌదీ అరేబియా దేశంలోని 'మక్కా' లో 1888 సంవత్సరంలో భారతీయ వ్యక్తి, అరబ్ యువతిల సంతానంగా మౌలానా అబుల్ కలామ్‌ జన్మించారు. మహమ్మదీయ సాంప్రదాయ పద్దతిలో విద్యాభ్యాసం జరిపినప్పటికి మౌలానా రహస్యంగా... [ఇంకా... ]

Monday, November 2

భక్తి సుధ - శ్రీ శివపంచాక్షరీ స్తోత్రమ్

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ|
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ|
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ|
తస్మై మకారాయ నమశ్శివాయ|
మందాకీని సలిల చందన చర్చితాయ|
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ|
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ|
తస్మై మకారాయ మకారాయ నమశ్శివాయ|... [ఇంకా... ]

Saturday, October 24

పిల్లల పాటలు - జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం...

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

అర్జునుడు తిన్న అరటి పండ్లరిగి

భీముడు తిన్న పిండివంటలరిగి

గణపతి తిన్న ఖజ్జాలరిగి... [ఇంకా... ]

Friday, October 23

న్యాయ వ్యవస్థ - హైకోర్ట్

రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నది హైకోర్టు. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒకే హైకోర్టు ఉండేటట్లు పార్లమెంటు చట్టం చేయవచ్చు. మొత్తం భారతదేశంలో 21 హైకోర్టు‌లు ఉన్నాయి. ఒక్కొక్క హైకోర్టు‌లో ఒక్కొక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. ఈ న్యాయమూర్తిని ప్రెసిడెంట్ నియమిస్తాడు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి... [ఇంకా... ]

Thursday, October 22

పండుగలు - సుబ్రహ్మణ్య షష్ఠి

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము!

పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల... [ఇంకా... ]

Wednesday, October 21

సాహిత్యం - తెలుగు సాహిత్యంలో పేరడీ

పేరడీ అంటే అనుకరణ. అనుకరణ చెయ్యని ప్రాణి ఈ సృష్టిలో ఉండదు. శిశువు పుట్టినది మొదలు తన పరిసరాలను గ్రహిస్తూ అనుకరిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులను అనుకరిస్తూ ఎదుగుతుంది. అనుకరణకు సాధ్యంకాని రంగం ఈ సృష్టిలో లేదు. కళా రంగంలో ఈ అనుకరణ సర్వసామాన్యంగా ఉంటుంది. ఒక కళాకారుడు సృష్టించిన కళాభినయం తరువాతి తరాలకు అనుకరణయోగ్యంగా ఉంటుంది. ఆ కళాకారుని చాతుర్యాన్ని అనుసరిస్తూ అనేక ఇతర కళాభినయాలు ఆవిష్కరణకు నోచుకుంటాయి. తాము అనుకరించే కళాభినయం కూడా దేనికో ఒకదానికి అనుకరణ కాక మానదు. అదే ఈ సృష్టిలోని వైచిత్ర్యం. అనుకరణ అనేక రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా ఆదర్శ అనుకరణ ఒకటి. ఇందులో... [ఇంకా... ]

Tuesday, October 20

వ్యాయామ శిక్షణ - మెడనొప్పి తగ్గించే మకరాసనం

మకరం అంటే మొసలి. నీటిలోని మొసలి రూపంలోనే ఈ ఆసనం ఉంటుంది కనుక, దీనికి 'మకరాసనం ' అని పేరు వచ్చింది. దీనికే 'నిరాలంబాసనం ' అనే పేరుంది. బోర్లా పడుకుని భుజంగ ఆసనం వేయాలి. రెండు చేతులనూ చుబుకం కింద ఆనించి బుగ్గలను వొత్తుతూ ఉంచాలి. రెండు మోచేతులనూ జోడించి నేల పైన ఉంచాలి. శ్వాసను సామాన్యంగా పీలుస్తూ, కళ్లు మూసుకుని, మెడ మీద మనసును... [ఇంకా... ]

Monday, October 19

భరతమాత బిడ్డలు - అనిబిసెంట్

పేరు - అనిబిసెంట్
తండ్రి పేరు - (తెలియదు)
తల్లి పేరు - (తెలియదు)
పుట్టిన తేది - 1-10-1847
పుట్టిన ప్రదేశం - లండన్
చదివిన ప్రదేశం - లండన్
చదువు - 1977
గొప్పదనం - స్వాతంత్ర్యం తీసుకురావటానికి మన దేశ నాయకులతో చేతులు కలిపి, ఒక భారతీయ మహిళ కంటే ఎక్కువగా కృషి చేసింది. ' న్యూ ఇండియా ' అనే ఆంగ్ల పత్రికను స్థాపించి, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ' కామన్ వీల్ ' అనే వారపత్రిక నడుపుతూ ' హోం రూల్ లీగ్ ' ఉద్యమాన్ని లేవదీసింది. బాలగంగాధర్ తిలక్, జిన్నా, మోతీలాల్ నెహ్రూ వంటి మహానాయకులు ఆ లీగ్‌ను సమర్ధిస్తూ అందులో చేరారు. 1917లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు వార్షిక సమావేశానికి అధ్యక్షతవహించి... [ఇంకా... ]

Wednesday, October 14

వ్యక్తిత్వ వికాసం - ఇతరులతో సంభాషించే విధానం ఎలా ఉండాలి?

మనం ఎవరితో మాట్లాడినా మాట్లాడే తీరు ముఖ్యం. మాట్లేడే తీరులో సభ్యత, సంస్కారం బయటపడతాయి. వ్యక్తిత్వం వెల్లడవుతుంది. అందుకే నోరు మంచిదయితే వూరు మంచిదవుతుందని పెద్దలంటారు. మాటలతో అందరి ప్రశంసలు పొందాలంటే కొన్ని సూచనలు పాటించాలి.
. సంభాషణను మొట్టమొదట చమత్కారంగా ప్రారంభించడానికి తగిన ప్రావిణ్యత, నైపుణ్యం సంపాదించాలి.
. సంభాషణ ప్రారంభించిన తర్వాత చిన్న చిన్న వ్యాఖ్యానాలతో హాస్య ధోరణిలో సంభాషణ కొనసాగిస్తూ ఉండాలి. దానివల్ల వ్యక్తిగత ప్రమేయం లేకుండా సంభాషణ సాఫీగా సాగిపోతుంది.
. ఆత్మీయులతో మాట్లాడినా, అపరిచితులతో మాట్లాడినా ఎదుటివాళ్ళ ముఖాన్ని అప్పుడప్పుడు పరిశీలిస్తూ వుండాలి. ఇందువల్ల మనం చెప్పేది జాగ్రత్తగా వింటున్నారా లేదా అని గమనించగలుగుతాం.
. వింటున్నారనుకుంటే మనం సంభాషణ సాగించాలి. లేదా ఎదుటి వాళ్ళ ఆసక్తిని కనిపెట్టి... [ఇంకా... ]

Monday, October 12

ఎందుకు, ఏమిటి, ఎలా ... - భూమధ్యరేఖ వద్ద వేడి ఎక్కువ ఎందుకు?

భూమికి సూర్యుడి నుండి కాంతి, ఉష్ణశక్తులు లభిస్తాయి. భూమిపై ఉష్ణం అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. కొన్ని చోట్ల ఎక్కువ వేడిగా ఉంటే కొన్ని చోట్ల తక్కువ వేడి ఉంటుంది. భూమి గోళాకారంలో ఉండి, ధ్రువాల వద్ద కొంత మేరకు బల్లపరుపుగా ఉంటుంది. సూర్యకిరణాలు భూమిపై వివిధ ప్రదేశాలలో వివిధ కోణాలలో పడుతూ ఉంటాయి. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడితే, దానికి ఉత్తర దక్షిణ దిశల్లో భూమధ్య రేఖ వద్ద వేడి ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ వేడి తక్కువగా ఉంటుంది... [ఇంకా... ]

Saturday, October 10

వ్యాకరణం - వ్యాకరణం ఉపోద్ఘాతం

ఏ భాషలోనైనా అంతర్గతంగా ఉన్న లక్షణాలను సూత్రీకరించి వ్రాసిన గ్రంధం వ్యాకరణ గ్రంధమవుతుంది. శబ్ద శాస్త్రమే వ్యాకరణం. ఆ భాషలో లక్షణాలే ఆ భాషకు వ్యాకరణం అవుతుంది. వ్యవహారంలో మాట్లాడుకునే భాషకు కూడా వ్యాకరణం ఉంటుంది. వ్యావహారికంగా దేశ కాల పాత్రలనుబట్టి వచ్చే మార్పులు ఆ భాష వ్యాకరణంలో మార్పులు తీసుకొస్తాయి. ఎప్పటికప్పుడు వీటి నుండి వ్యాకరణ సూత్రాలకు కూడా మార్పులు చేసుకుంటుండాలి. కాబట్టి ఆయా కాలాలలో శిష్ట వ్యవహారాలన్నింటినీ ఆధారం చేసుకుని వ్యాకరణ సూత్రాలని సరిదిద్దుకుంటూండడం సంప్రదాయకం అయింది... [ఇంకా... ]

Thursday, October 8

వంటలు - బిసిబేళాబాత్

కావలసిన వస్తువులు:
లేతవంకాయలు - 200గ్రాములు.
గోరుచిక్కుళ్లు - 50గ్రాములు.
బంగాళాదుంపలు - 100గ్రాములు.
క్యారెట్ - రెండు దుంపలు.
మునక్కాయలు - 6.
చింతపండు - 25గ్రాములు.
కందిపప్పు - 100గ్రాములు.
బియ్యం - 1కిలో.
రిఫైండ్ ఆయిల్ - 100గ్రాములు... [ఇంకా... ]

Tuesday, October 6

పండుగలు - అట్లతద్దె

ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ బహుళ తదియనాడు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ "చంద్రోదయ ఉమావ్రతం - అట్లతద్ది" స్త్రీలకు చక్కని ఆనందాన్ని జీవితంలో చక్కని విచిత్రానుభూతులను కలిగిస్తూ ఉంటుంది. ఈ పండుగలో ఒక విశేషం ఉన్నది. కొన్ని వ్రతాలైతే వివాహితులైన స్త్రీలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ, ఈ పండుగ పిన్నలు, పెద్దలు కూడా కలిసి వయోభేదం లేకుండా ఆచరిస్తారు. పిల్లలతోబాటు తల్లులు కూడా 20 సం|| వెనకకి పోయి బాల్యజీవితంలోకి వెళ్ళి ఆనందం పొందుతారు. ఇక మూడుకాళ్ల ముదుసలి అయిన బామ్మగారు కూడా! వారి ఆటలాడుకుంటున్న వారినందరని తన దగ్గరకు రప్పించుకుని అమ్మాయిలూ... చూచారా... నా చిన్నప్పుడూ! అంటూ, వారి చిన్ననాటి జ్ఞాపకాలు, అనుభవాలు .. అంటూ ఉంటారు. అటువంటి వృద్ధులలో నవయవ్వనం తొణికిసలాడేది ఈ పండుగలోనే. ఇట్టి ఆటపాటలు కనువిందుచెయ్యాలి అంటే పల్లెసీమలే పట్టుకొమ్మలు... [ఇంకా... ]

Monday, October 5

న్యాయ వ్యవస్థ - సుప్రీం కోర్ట్

భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది హైకోర్టులపై నియంత్రణాధికారం కల్గిఉన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. ఇందులో 26 మంది జడ్జీలు ఉంటారు ప్రధాన న్యాయ మూర్తితో కలిపి. ఈ కోర్టులలో
. భారత ప్రభుత్వానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను,
లేక
. భారత ప్రభుత్వం, ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఒక వైపు ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నప్పుడు వాటి మధ్య తగాదాలను... [ఇంకా... ]

Saturday, October 3

నీతి కథలు - దొంగపిల్లి

భాగీరధీ నది ఒడ్డన పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో 'జరధ్గవము' నే ముసలి గ్రద్ద ఉండేది. ఆ గ్రద్దకు కళ్ళు కనిపించవు, అందుకని ఆ చెట్టు మీద ఉండే పక్షులు తమకు తెచ్చుకున్న ఆహారంలో ఆ గ్రద్దకు కొంత పెట్టేవి. ఆ గ్రద్ద, పక్షులు బయటకు వెళ్ళినపుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెప్పి నిద్ర పుచ్చేది. ఒక రోజు 'దీర్ఘకర్ణము' అనే పేరుగల పిల్లి పక్షుల పిల్లల్ని తినటానికి ఆ చెట్టు పైకి చేరింది. ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరిచాయి. ఆ అరుపులు విన్న జరధ్గవము తొర్రలోంచి బయటకు వచ్చి 'ఎవరక్కడ...?' అంటూ కోపంగా అరిచింది. ఆ అరుపుకు పిల్లి పై ప్రాణాలు పైనే పోయాయి. తప్పించుకోవటానికి దానికి... [ఇంకా... ]

Friday, October 2

భరతమాత బిడ్డలు - మహత్మా గాంధీ

పేరు : మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( మహాత్మా గాంధీ )
తండ్రి పేరు : కరంచంద్ గాంధీ
తల్లి పేరు : పుత్లీబాయి
పుట్టిన తేది : 2-10-1869
పుట్టిన ప్రదేశం : పోరుబందర్
చదివిన ప్రదేశం : లండన్
చదువు : లాయర్
గొప్పదనం : శాంతియుతంగా అనేక సత్యాగ్రహాలు చేసి ఆంధ్ర దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు
స్వర్గస్తుడైన తేది : 31-1-1948
మహాత్మా గాంధీ గుజరాత్ లోని ఖయిత్వాద్ ప్రాంతంలోని పోరుబందర్ లో కరంచంద్ గాంధీ, పుత్లీబాయి దంపతులకు 1869వ సంవత్సరం అక్టోబర్ 2న జన్మించాడు. నీతి నిజాయితీలకు కట్టుబడిన కుటుంబంలో జన్మించిన గాంధీ చిన్నతనం నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరుగుతూ, తల్లి దండ్రుల యెడల గురువుల యెడల ఎంతో వినయ విధేయతలతో ఉంటూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. మోహన్ దాస్ కి పన్నెండవ సంవత్సరంలోనే కస్తుర్భాతో వివాహమయింది. అంత చిన్నతనంలో పెళ్ళిచేసుకోవటం అతనికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల మాట జవదాటలేక అంగీకరించాడు.వివాహ కారణంగా గాంధీ చదువు ఒక ఏడాది వృధా అయింది... [ఇంకా... ]

Thursday, October 1

సాహిత్యం : భాష - ఉత్పత్తి

మానవ జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనం. తనలో సంఘర్షణలను రేకెత్తిస్తున్న భావాలను, తన కష్ట సుఖాలను సాటి మానవుడితో పంచుకోవడానికి ఆది మానవుడు సంజ్ఞలు (Gestures) చేసేవాడు. వాటి ద్వారా ఒకరినొకరు సమాచారాన్ని పరస్పరం వ్యక్తపరుచుకునేవారు. ముఖ వికాసం వలన సుఖాన్ని, ముఖ వికారం వలన దుఃఖాన్ని బహిర్గతం చేసుకునేవారు. అట్లేగాక కొన్ని ధ్వనుల ద్వారా కూడా అంతరంగాన్ని వెల్లడించుకునేవారు. అంటే అభిప్రాయాన్ని వ్యక్తపరచే ఒక సాధనం భాష అన్నమాట. అవయవాల సహాయంతో భావాన్ని తెలియజేసే మాటల సముదాయాన్ని కూడా భాష అనవచ్చు. కొన్ని సందర్భాలలో ఉచ్ఛారణ లేకుండానే అవయవాల కదలికల ద్వారా... [ఇంకా... ]