'ఓంస్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవునే శరణమయ్యప్ప!' అంటూ అయ్యప్ప భక్తులు భగవంతుని శరణుకోరే విధానాన్నే శరణు ఘోష అని వ్యవహరిస్తారు. అడవులలో కొండలలో నడచి వెళ్ళే స్వాములకు (భక్తులకు) శరణు ఘోష రక్ష. యాత్రచేసే బృందం అందరూ ఒక్కసారి స్వామివారి శరణు ఘోష చెప్పి అడవిని దద్దరిల్లజేస్తారు. [ ఇంకా...]
Wednesday, October 10
Tuesday, October 9
ఆహార పోషణ - అమ్మలాంటి నిమ్మ
- రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.
- నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, జీర్ణశక్తిబాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది.
- కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా పళ్ళు తోముకుంటే పలువర మెరవడమే కాకుండా, చిగుళ్ళవ్యాధులు ఉన్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. [ ఇంకా...]
పర్యాటకం - బాహుబలి
రెండు కొండల మధ్య ప్రకృతి సిద్దంగా ఏర్పడిన సరోవరమే "బెళగొళ" కన్నడంలో బెళ్ళి అంటే తెల్లని అని, గొళ అంటే నీటిగుండం అని అర్థం. జైన సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయులైన వారిని శ్రమణులు అంటారు.అలాంటి శ్రమణులు చాలామంది ధ్యానంలో శేషజీవితం గడిపి నిర్వాణం పొందడానికి ఈ కొండలలో, పరిసర ప్రాంతాలలో నివసించారు. [ ఇంకా...]
ఆధ్యాత్మికం - విగ్రహారాధన
విగ్రహారాధనను కొంతమంది ప్రముఖులే ఖండించారు. అంటే విగ్రహారాధన పనికిరాదనా దాని అర్ధం. కాదు ఎందుకంటే పెద్దలు పెట్టిన ఏ పద్దతి, శాస్త్రం తప్పు కాదు. అందులో ఏదో అర్ధం నిగూఢంగా దాగి ఉంటుంది. దానిని గ్రహించి మనం దాని ప్రయోజనాన్ని ఉపయోగించుకోవాలి. అంతేకాని 'తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు ' అన్న వ్యక్తుల మాటలు పట్టించుకోరాదు. [ ఇంకా...]
Monday, October 8
ఆహార పోషణ - తులసి టీ
ఇంటి పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చని పెద్దలు చెబుతారు.ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. దీంట్లో ఉండే ఔషధ విలువలు అలాంటివి మరి. ఆరోగ్య పరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో తులసిని ఆరోగ్యప్రదాయినిగా కొనియాడారు. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలుగా ఉంటుంది. [ ఇంకా...]
ఆధ్యాత్మికం - గురూచిష్టం
నిర్గుణుడు, నిరాకారుడు అయిన భగవంతునికి ఎలాంటి రూపము, గుణములు లేవు కనుక ఆయన మన ఇంద్రియాలకు, మనస్సుకూ గోచరించడు. అన్ని ఆరాధనలకంటే నిర్గుణోపాసనే అత్యుత్తమమైనదని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అయితే ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వారికి మాత్రమే అది సాధ్యం, సామాన్య మానవులకు సగుణోపాసనే అతి సులువైన మార్గం. [ ఇంకా...]
పర్యాటకం - కూర్గ్
దేశంలో పేరన్నిక గన్న హిల్ స్టేషన్‌లలో కూర్గ్ ఒకటి. కళ్లను, మనసును మైమరిపించే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఇది స్వర్గధామం. కర్ణాటకలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రం మైసూర్‌కు ఇది 100 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1170 అడుగుల ఎత్తున గల కూర్గ్ కోడగు జిల్లా కేంద్రం. ప్రతి సంవత్సరం అక్టోబరు నుండి మార్చి నెలాకరు దాకా కూర్గ్‌ను సందర్శించడానికి అనువైన కాలంగా చెబుతారు. [ ఇంకా...]
Saturday, October 6
ఆధ్యాత్మికం - మహాకాళి
"అర్థేందు మకుటాం దేవీం వందే వారిధి సంభవాం
అంతర్‌జ్వాలా స్వరూపాం తాం జగచ్చైతన్య విగ్రహాం"
ఈ స్తోత్రం ముగురమ్మలను, వారికంటే ఆతీతమైన ఆద్యాశక్తిని ప్రస్తుతిస్తున్నది. భక్తులకు దర్శనం ఇచ్చే మూర్తిమత్త్వము, ధ్యానంలో గోచరించే తత్త్వస్ఫూర్తి, యోగ దీప్తిలో కలిగే అద్భుతానుభవం.. సర్వాతీత గుణాతీతయైన పరాంబా లక్షణము... అనీ దీనిలో స్పష్టంగా వర్ణింపబడ్డాయి. దశ మహావిద్యలు ఆమె శక్తి యొక్క ఒక్కొక్క ఆవిష్కార స్థానం. [ ఇంకా...]
అంతర్‌జ్వాలా స్వరూపాం తాం జగచ్చైతన్య విగ్రహాం"
ఈ స్తోత్రం ముగురమ్మలను, వారికంటే ఆతీతమైన ఆద్యాశక్తిని ప్రస్తుతిస్తున్నది. భక్తులకు దర్శనం ఇచ్చే మూర్తిమత్త్వము, ధ్యానంలో గోచరించే తత్త్వస్ఫూర్తి, యోగ దీప్తిలో కలిగే అద్భుతానుభవం.. సర్వాతీత గుణాతీతయైన పరాంబా లక్షణము... అనీ దీనిలో స్పష్టంగా వర్ణింపబడ్డాయి. దశ మహావిద్యలు ఆమె శక్తి యొక్క ఒక్కొక్క ఆవిష్కార స్థానం. [ ఇంకా...]
ఆధ్యాత్మికం - కాబాగృహం
ఇస్లామ్ ధార్మిక భవనానికి అతి ముఖ్యమైన మూలస్తంభం హజ్. మనిషి మనస్సును దుర్నడతల నుండి కట్టడి చేసేందుకు, ప్రక్షాళన చేసేందుకు నిర్ణయింపబడ్డ అతి ముఖ్య ఆరాధనయే హజ్. ఇస్లాం లోని వేరువేరు ఆరాధనలన్నింటికీ ప్రాణం ఈ హజ్. వివిధ ఆరాధనలన్నీ హజ్ అనే ఈ చట్రంలో బిగించ బడ్డాయి. ఇవన్నీ సరియైన రీతిలో అమలు చేసినప్పుడే హజ్ పరమార్థం సఫలీకృతమవుతుంది. [ ఇంకా...]
ఆహార పోషణ - సామర్ధ్యాన్ని పెంచే సరైన ఆహారం
జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి వల్ల గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఈ రోజుల్లో వంధ్యత్వ సమస్యలు తలెత్తుతున్నాయి.ఆడవాళ్లలో హార్మోన్ల అసమతుల్యత, అండం విడుదలకు సంధించిన సమస్యలు,శరీర బరువులో తేడాలు, అధిక శారీరక శ్రమ, ఒత్తిడి, ధైరాయిడ్ వ్యాధులు సంతానలేమికి దారి తీస్తున్నాయి. [ ఇంకా...]
పర్యాటకం - జైసల్మేర్
"తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు"-అన్న సూక్తిని తలపించేలా, ఒకనాటి భారతీయ కళాకారుల నిర్మాణ చాతుర్యానికి నిలువెత్తు ప్రతీకగా రాజస్థాన్‌లోని జైసల్మేర్ దేశంలోని ప్రధాన పర్యాటక కేంధ్రాలలో ఒకటైంది. అక్కడి "సోనార్ ఖిల్లా"నే జైసల్మేర్ కోట"గా పిలుస్తున్నారు. ప్రపంచంలోని ఏకైక "సజీవ కోట"ఇదే. ప్రసిద్ధ థార్ ఎడారిలోని మరుభూమిలో నిర్మితమైన సుందర పట్టణమే జైసల్మేర్. [ ఇంకా...]
Friday, October 5
ఆహార పోషణ - నీటి పండు
- ఆఫ్రికా దేశంలోని కలహారి ఎడారి ప్రాంతంనుంచి పుచ్చకాయ ప్రపంచదేశాలకు చేరిందని చరిత్రకారులు భావిస్తున్నారు.
- ఐదువేల సంవత్సరాల క్రితం ఈజిప్టులో పుచ్చకాయను పండించినట్టు ఆధారాలున్నాయి. ప్రస్తుతం చైనా దేశం ప్రపంచంలో అత్యధికంగా పుచ్చ కాయను పండిస్తోంది.
- దీంట్లో 92 శాతం నీరు ఉండడం వల్ల దీన్ని వాటర్ మిలన్ అని అంటారు. [ ఇంకా...]
ఆధ్యాత్మికం - స్తుతి వైభవం
"మీరు శ్రమలో ఉంటే ప్రార్థించండి, సంతోషంలో ఉంటే కీర్తనలు పాడండి" అని యాకోబు తన పత్రికలో రాశాడు. దేవుడిని ఎప్పుడు స్తుతించగలం? మనకు ఎలాంటి సమస్యలు, కష్టాలు, భాధలు లేనప్పుడు మాత్రమే ఆరాధించగలం.ఈ మూడు మన జీవితాలతో పెనవేసుకొని మనతో నడిచేవే. మరి దేవుడిని ఆరాధించలేమా?నిజం చెప్పాలంటే వీటిలో నుంచే మనం దేవుడిని స్తుతించగలం.ఒక వ్యక్తి తనకున్న సమస్యను బట్టే దేవుడికి దగ్గర కాగలడు. [ ఇంకా...]
పర్యాటకం - మహాబలి పురం
భారతీయ ప్రాచీన శిల్పకళా నైపుణ్యాన్ని, నాటి పల్లవ రాజుల ఘనమైన చారిత్రక సంపదను తరతరాలుగా పర్యాటక లోకానికి పంచిపెడుతున్న గొప్ప గోపురాల సముద్ర తీర పట్టణమే మహాబలిపురం. బంగాళాఖాతపు నీలి అలల సవ్వడుల నుండి రాతి కట్టడపు విశేషాల దాకా ఇక్కడ చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. మహాబలిపురం డాన్స్ ఫెస్టివల్‌గా పిలిచే వార్షిక వేడుకకు అంతర్జాతీయంగా ఖ్యాతి ఉంది. [ ఇంకా...]
సంస్కృతి - రామాయణం ముఖ్యాంశాలు
రామాయణము మహాకావ్యము. ఇందులో 24,000 శ్లోకాలు సంస్కృత భాషలో వాల్మీకి మహర్షిచే రచించబడ్డాయి. ఇందులో సీతారాముల పవిత్ర చరిత్ర, కొడుకు తండ్రిని ఏవిధంగా గౌరవించాలీ, సోదురులు ఒకరిపట్ల మరొకరు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి, మిత్రుల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి, రాజు ప్రజలనెలా పాలించాలి మొదలైన వివరాలుంటాయి. [ ఇంకా...]
అందరి కోసం - ఉత్తరాంధ్ర విశ్వేశ్వరుడు
శ్రీముఖలింగేశ్వరుని దేవాలయం శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో ఉంది. ఈ గ్రామం మామిడి తోటలు, శోభాయమానంగా అగుపించే కొబ్బరి తోటలకు ఆలవాలం. దేవాలయ పరిసరాలలో ఉన్నంతసేపూ భగవంతునిపై భక్తిప్రవత్తులతోపాటు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. 'శ్రీముఖలింగం ' పేరులోనే చక్కని అర్ధం ఉంది. "పరమేశ్వరుడు లింగంలో కనిపించుట" అని దీని అర్ధం. [ ఇంకా...]
Thursday, October 4
సంస్కృతి - మహాభారతం ముఖ్యాంశాలు
మహాభారతం ఒక ఉద్గ్రంధం. ఇది ధర్మశాస్త్రం. అంతేకాక ఇది చారిత్రక గ్రంధం కూడా. కాబట్టే ఆనాటి సామాజిక, రాజకీయ లక్షణాలు ఈ గ్రంధంలో లిఖించబడ్డాయి. సర్వ లక్షణ సమన్వితమైన మహాభారతాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించినవారే. అందులోని పాత్రల స్వభావాలను ఆకళింపుచేసుకున్నవారే. ఆ ధర్మశాస్త్రాన్నీ అనుసరించేవారే. లౌకికములు, అలౌకికములు అగు విషయములెన్నో ఇందులో చెప్పబడ్డాయి. [ ఇంకా...]
సంస్కృతి - భాగవతం ముఖ్యాంశాలు
శ్రీకృష్ణుని నిర్యాణమనంతరం కలి ప్రవేశించిన కాలమది. బదరికాశ్రమమంలో వ్యాకులచిత్తుడై ఉన్నాడు వ్యాస మహర్షి. నారాయణ మంత్రాలాపాన చేసుకుంటూ ఆశ్రమానికొచ్చిన నారద మహర్షి వ్యాసుడు వ్యధాభరితుడై ఉండటాన్ని గమనించి ధర్మాన్ని నిలబెట్టిన శ్రీ కృష్ణ భగవానుని లీలా వర్ణన గావించమని, భాగవత పఠనం, స్మరణం ముక్తి మార్గమనీ, దాన్ని రచిస్తే అది అతని మనో వ్యాకులతను పోగొట్టడమేగాక ప్రజల్లో భక్తి భావన పెంపొందుతుందనీ ఉపదేశించడంతో వ్యాసుడు భాగవత రచనకు పూనుకున్నాడు. [ ఇంకా...]
అందరి కోసం - బృహదీశ్వరాలయం
తమిళనాడు దేవాలయాలకు ప్రసిద్ధి. ఆ దేవాలయాల్లో బృహదీశ్వరాలయం పెద్దది, ప్రముఖమైనది. ఈ ఆలయాన్ని మొదటి రాజ రాజ చోళుడు (క్రీ.శ985-1014) నిర్మించాడు. ఈ ఆలయం దక్షిణాదిన దేఎవాలయ విమాన నిర్మాణానికి, తమిళ శిల్ప కళా నైపుణ్యానికి పరాకాష్టగా చెప్పవచ్చు. ద్రవిడుల నిర్మాణాల విమానాల్లో అతి పెద్దది. అప్పట్లో ఈ ఆలయాన్ని మొదటి రాజరాజ చోళుని పేరున రాజరాజేశ్వరాలయంగా పిలిచేవారు. కాలక్రమాన తరువాతి రాజుల పాలన కాలంలో పలు మార్పులు చెంది నేడు బృహదీశ్వరాలయంగా పేరుగాంచింది. [ ఇంకా...]
నీతి కథలు - మంచి మిత్రుడు (పావురం - ఎలుక)
పూర్వం గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆకాశమును తాకుచున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి. ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న 'లఘుపతనక' అనే కాకి నిద్రలేస్తూనే కిందకు చూచింది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది. [ ఇంకా...]
Wednesday, October 3
వంటలు - వాంగీ బాత్
కావలసిన వస్తువులు:
వంకాయలు - 1/2 కిలో.
ఉల్లిపాయలు - 1/4 కిలో.
పచ్చి మిరపకాయలు - 4.
బియ్యం - 1/2 కిలో (2 డబ్బాలు).
నూనె - వేయించటానికి సరిపడినంత ( 200 గ్రా.).
ఉప్పు - తగినంత.
వంకాయలు - 1/2 కిలో.
ఉల్లిపాయలు - 1/4 కిలో.
పచ్చి మిరపకాయలు - 4.
బియ్యం - 1/2 కిలో (2 డబ్బాలు).
నూనె - వేయించటానికి సరిపడినంత ( 200 గ్రా.).
ఉప్పు - తగినంత.
మసాలా కారం తయారు చేయడానికి కావలసినవి:
పచ్చి పప్పు - 50 గ్రా.
సాయి మినపప్పు - 50 గ్రా.
ధనియాలు - 50 గ్రా.
ఎండు మిరపకాయలు - 6.
పచ్చి పప్పు - 50 గ్రా.
సాయి మినపప్పు - 50 గ్రా.
ధనియాలు - 50 గ్రా.
ఎండు మిరపకాయలు - 6.
తయారు చేసే విధానం:
ముందుగా మసాలా కారం తయారు చేయటం చూద్దాం:
పచ్చిపప్పు, ధనియాలు, సాయి మినపప్పు, ఎండుమిరపకాయలు తీసుకొని బాండిలో ఒక స్పూను నూనె వేసి వీటిని దోరగా వేయించాలి. [ ఇంకా...]
వంటలు - బేసన్ లడ్డు
కావలసిన వస్తువులు:
శనగపిండి - 600 గ్రా.
నెయ్యి - 500 గ్రా.
పంచదార - 300 గ్రా.
యాలుకలపొడి - 10 గ్రా.
శనగపిండి - 600 గ్రా.
నెయ్యి - 500 గ్రా.
పంచదార - 300 గ్రా.
యాలుకలపొడి - 10 గ్రా.
తయారుచేసే విధానం:
శనగపిండి, నెయ్యి మిశ్రమాన్ని చక్కగా కలిపి సన్నటి సెగపై దోరగా వేయించి పెట్టుకోవాలి. [ ఇంకా...]
పిల్లల పాటలు - బడాయి పిల్లి...
బడాయి పిల్లి లడాయికెళ్ళి
ఎలుకను చంపి ఏనుగె అంది
పులినే తానని పొంగిన పిల్లి
కుక్కను చూసి ఒక్కటే పరుగు [ ఇంకా...]
ఎలుకను చంపి ఏనుగె అంది
పులినే తానని పొంగిన పిల్లి
కుక్కను చూసి ఒక్కటే పరుగు [ ఇంకా...]
Tuesday, October 2
భక్తి గీతాలు - విశ్వరూపమిదివో
కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
పండిన వృక్షములే కల్పతరువులు
నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు
మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము [ ఇంకా...]
పండిన వృక్షములే కల్పతరువులు
నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు
మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము [ ఇంకా...]
నీతి కథలు - గురువును మించిన శిష్యుడు
ఆ రోజు సోమవారం. సూరిబాబు ఎంతో ఉత్సాహంగా బడికి బయలుదేరాడు. దారిలో స్నేహితులు కలిశారు. మాటల సందర్భంలో ఆదివారం నాడు తాము ఎలా గడిపామో ఒక్కొక్కరు సంతోషంగా చెప్పడం ప్రారంభించారు. నిఖిల్ తాను తన అభిమాన హీరో సినిమా చూశానన్నాడు. చంద్రం తానెంతో ఇష్టపడే క్రికెట్ ఆడినట్లు చెప్పాడు. లోకేష్ తాను గీసిన డ్రాయింగ్ గురించి వర్ణించాడు. [ ఇంకా...]
Monday, October 1
పిల్లల పాటలు - రింగు రింగు బిళ్ళ
రింగు రింగు బిళ్ళ - రూపాయి దండ
దండ కాదురా! - తామర మొగ్గ
మొగ్గ కాదురా! - మోదుగ నీడ
నీడ కాదురా! - నిమ్మల బావి [ ఇంకా...]
దండ కాదురా! - తామర మొగ్గ
మొగ్గ కాదురా! - మోదుగ నీడ
నీడ కాదురా! - నిమ్మల బావి [ ఇంకా...]
Saturday, September 29
వంటలు - సేమ్యా పాయసం
కావలసిన వస్తువులు:
పాలు - ఒక లీటరు.
సేమ్యా - ఒక కప్పు.
సన్నటి సగ్గు బియ్యం - అర కప్పు.
పంచదార - సరిపడినంత.
యాలుకల పొడి - రెండు టీ స్పూన్లు.
పచ్చి కోవా - 50 గ్రాములు.
బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్‌లు - కావలసినన్ని.
నెయ్యి - ఆరు టీ స్పూన్లు.
పాలు - ఒక లీటరు.
సేమ్యా - ఒక కప్పు.
సన్నటి సగ్గు బియ్యం - అర కప్పు.
పంచదార - సరిపడినంత.
యాలుకల పొడి - రెండు టీ స్పూన్లు.
పచ్చి కోవా - 50 గ్రాములు.
బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్‌లు - కావలసినన్ని.
నెయ్యి - ఆరు టీ స్పూన్లు.
తయారు చేసే విధానం:
మూకుడులో రెండు స్పూన్ల నెయ్యి వేసి కాగిన తర్వాత దాంట్లో బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్‌లు దోరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఆ మూకుడులో మరో రెండు స్పూన్ల నెయ్యి వేసి సేమ్యాను దోరగా వేయించాలి. [ ఇంకా...]
Friday, September 28
వంటలు - సోయా పన్నీర్ పఫ్
కావలసిన వస్తువులు:
సోయా పన్నీర్ - 100 గ్రా.
పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర - సరిపడినంత.
కర్న్ ఫ్లోర్ - 10 గ్రా.
ఉప్పు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
తయారు చేసే విధానం:
ముందుగా పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు మిశ్రమాన్ని రుబ్బుకోవాలి. [ ఇంకా...]
సోయా పన్నీర్ - 100 గ్రా.
పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర - సరిపడినంత.
కర్న్ ఫ్లోర్ - 10 గ్రా.
ఉప్పు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
తయారు చేసే విధానం:
ముందుగా పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు మిశ్రమాన్ని రుబ్బుకోవాలి. [ ఇంకా...]
నాటికలు - "కుక్కపిల్ల దొరికింది"
[పరిశుభ్రంగా అలంకరించబడిన ఒకగది, ఒకమూల టెలిఫోను ఉన్నది. గోడకు ఎదురుగా పటాలూ, కాలెండర్లూ వున్నై. కాలెండరుకు దిగువగా "కుక్క ఉన్నది జాగ్రత్త!" అనే బోర్డు వ్రేలాడుతున్నది. తెర లేచేసరికి స్టేజిమీద మనుషులెవరూ లేరు. కాసేపటికి టెలిఫోన్ మ్రోగింది. ఇంట్లోంచి నౌకరు "సీను" అనే కుర్రాడు వచ్చాడు. వచ్చి ఫోనుతీసి]
సీను : ఎవరండీ ఆఁ...అయ్యా, లేరండి...అవునండి...అయ్యగారు లేరు...తెలీదండి...తెలీదండి ఏదీ తెలీదండి... (కాసేపు విని కుక్కపిల్లకు అన్నంపెట్టే ఒకగిన్నె ఒకమూలవుంటే వెళ్ళి దానికేసి దీనంగా చూస్తూన్నాడు. [ ఇంకా...]
సీను : ఎవరండీ ఆఁ...అయ్యా, లేరండి...అవునండి...అయ్యగారు లేరు...తెలీదండి...తెలీదండి ఏదీ తెలీదండి... (కాసేపు విని కుక్కపిల్లకు అన్నంపెట్టే ఒకగిన్నె ఒకమూలవుంటే వెళ్ళి దానికేసి దీనంగా చూస్తూన్నాడు. [ ఇంకా...]
సంస్కృతి - దేవదాసి నృత్యాలు
తమ జీవిత సర్వస్వాన్నీ దేవునికే అంకితం చేసి ఆ ఐక్యమునకై తహతహలాడేవారే దేవదాసీలు. స్వామి సన్నిధిలో బలిపీఠంపై నృత్యం చేయడానికి అధికార ముద్రల్ని పొందిన వారే నిజమైన దేవదాసీలు. వీరు ఆంధ్ర దేశంలో నృత్య కళను పోషించి అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వీరు దేవాలయాల నృత్య మండపాలలో, దేవుని సన్నిధానంలో శైవ, వైష్ణవ సంప్రదాయాలను అనుసరించి ఆరాధనా నృత్యాలు, అష్టదిక్పాలికల నృత్యాలు, కేళికా ప్రదర్శనలు, కలాపాలూ మొదలైన నృత్యాలను ప్రదర్శించేవారు. ఈ సంప్రదాయాన్ని నట్టువ మేళ సంప్రదాయం అంటారు. [ ఇంకా...]
Thursday, September 27
వనితల కోసం - మామిడి పండ్లతో పసందైన పదార్ధాలు
ఋతువులో ప్రతి గృహిణి మామిడితో ఊరగాయ తయారు చేస్తుంది. మామిడి కాయలతో చేసే మరికొన్ని వంటకాలను ఇక్కడ అందిస్తున్నాము. ఇవి చల్లగా, రుచికరంగా ఉంటాయి.
మాంగో ఖీర్: తియ్య మామిడి గుజ్జు తీసి వడగట్టండి. తరువాత దీన్ని ఒక స్టైన్‌లెస్ పాత్రలో పోసి, దానితో సమానమైన నీటిని కలపండి. అతి నెమ్మదిగా ఉడక బెట్టండి. దీనికి చక్కెర పాకం కలుపుతూ బాగా కదపండి. అది గట్టిపడగానే, కొబ్బరి పాలు చేర్చి మరోసారి కాగపెట్టండి. స్టవ్ నుంచి తీసి ద్రాక్ష వంటి ఎండిన పండ్లను దీనితో కలపండి. [ ఇంకా...]
మాంగో ఖీర్: తియ్య మామిడి గుజ్జు తీసి వడగట్టండి. తరువాత దీన్ని ఒక స్టైన్‌లెస్ పాత్రలో పోసి, దానితో సమానమైన నీటిని కలపండి. అతి నెమ్మదిగా ఉడక బెట్టండి. దీనికి చక్కెర పాకం కలుపుతూ బాగా కదపండి. అది గట్టిపడగానే, కొబ్బరి పాలు చేర్చి మరోసారి కాగపెట్టండి. స్టవ్ నుంచి తీసి ద్రాక్ష వంటి ఎండిన పండ్లను దీనితో కలపండి. [ ఇంకా...]
విజ్ఞానం - వ్యకిత్వ వికాసం
వ్యక్తిత్వం మనిషికి ఆభరణం లాంటిది. వ్యక్తిత్వం లేకపోతే మనిషి ఇతరులపై ఆధారపడవలసి వుంటుంది. ఇతరులపై ఆధారపడ్డప్పుడు మనిషికి గౌరవం వుండదు. గౌరవం లేని వ్యక్తి జీవితం దుఃఖమయమవుతుంది. దుఃఖం మనిషిని జీవితాంతం మానసికంగాను, శారీరకంగానూ కృంగదీస్తుంది. [ ఇంకా...]
మీకుతెలుసా - గుండుసూదుల కథ
నీళ్ళు గడ్డ కట్టే చలికాలపు బాధ ఎక్కువనప్పుడు వెచ్చటి గుడ్డలతో శరీరాన్ని కప్పుకునే ఆవశ్యకత మనిషికి పెరిగింది. తాను కప్పుకుంటున్న చర్మాలను ఒకటిగా జతచేయడానికి ఒక వస్తువును కనుగొనాల్సి వచ్చింది. అప్పుడు మనిషి వదునైన ముల్లును కనుగొన్నాడు. నిన్న మొన్నటిదాకా జిప్సీలు నూనెలో ఉడికించి గట్టిపడిన ముళ్ళను సూదులుగా వాడుతూ వచ్చారు. ఉత్తర అమెరికాకు చెందిన కొంతమంది రెడ్ ఇండియన్లు తేనె మిడుతల ముళ్ళను జత చేసేందుకు వాడేవారు. [ ఇంకా...]
సాహిత్యం - మహాత్ముని పలుకులు
- ఆత్మార్పణకు,స్వచ్చతకు నిలయం కానప్పుడు స్త్రీకి విలువ లేదు.
- హక్కులకు వాస్తవమైన మూలాధారం-కర్తవ్య నిర్వహణం.మనం మన కర్తవ్య నిర్వహణ చేసినట్లయితే హక్కులు పొందేందుకు ఎంతో దూరంలో ఉండము.మన విధులు నిర్వర్తించకుండా హక్కుల కోసం పరుగెత్తినట్లయితే అవి మనల్ని దాటి పోతాయి.మనం ఎంతగా వాటిని వెంబడిస్తే అవి అంత త్వరితంగా ఎగిరిపోతాయి. [ ఇంకా...]
Wednesday, September 26
నీతికథలు - పరివర్తన
పూర్వం ఒకప్పుడు సత్యధర్మి అనే రాజు పాలిస్తూండేవాడు. పేరుకు తగినట్టుగా ఆ రాజు మిక్కిలి ఔదార్యవంతుడు. న్యాయశీలుడు. మంచి దైర్యశాలి. ఎప్పుడూ తన రాజ్యంలో ప్రజల అవసరాలను తీర్చి వారి సుఖసౌఖ్యాలను పాటుపడుతూండేవాడు. ప్రజలకు ఎటువంటి అపాయం రాకుండా రక్షిస్తూండేవాడు. వారివారి తాహతులకు తగినట్లుగా సహాయం చేస్తూ ప్రజలకు ఉత్సాహం కలిగించేవాడు. [ ఇంకా...]
విజ్ఞానం - నిత్యజీవితం ఒక కళ
పుట్టిన క్షణం మొదలు మరణించేదాక సుఖదుఖాలతో దుర్ఘటమైన మన జీవితం అనేక సంక్షోభాలతో, సందిగ్ధాలతో, పోరాటాలతో, ఆరటాలతో, కష్ట పరంపరతో కూడి ఉంటుంది. జీవిత కళ అద్భుతమైన ఖళ. ఒక్ ముఖ్యమైన కళ. రాజకీయ వ్యవస్థకంటే, వార్తా ప్రసారాలకంటే బ్రహ్మాండమైన వ్యవస్థ. [ ఇంకా...]
అందరి కోసం - పర్యాటక ప్రణాలిక
నాలుగు ప్రాంతాలకు తిరిగితేనే లోకం తీరు తెలుస్తుంది. మనుషుల పోకడలు అవగతమౌతాయి. జీవితపు వైవిధ్యం అనుభవలోకి వస్తుంది. రోజులు కొత్తగా వెలుగుతాయి. విలక్షణ అనుభవాలు వినూత్న అనుభూతుల్ని అందిస్తాయి. అందుకే పర్యటించాలి .కొత్త ప్రాంతాలలోకి ప్రవహించాలి. మామూలు రోజుల్లో ఏదో ఒక హడావిడి వుంటూనే వుంటుంది. జీవిక కోసం పరుగులు తీయక తప్పదు. [ ఇంకా...]
ఆధ్యాత్మికం - తులసీదాస్
మొగల్ చక్రవర్తి అక్బర్ పరిపాలనా కాలంలో (16వ శతాబ్ది) తులసిదాస్ నామధేయం గల ఒక పుణ్యపురుషుడు.ఇట్టా జిల్లా (ప్రసుతం ఉత్తరప్రదేశ్‌లో ఉంది) అలీగంజ్ పరగణాకు చెందిన సోరోన్ గ్రామ వాస్తవ్యుడు - ప్రస్తుతం రాజపూర్ నెలకొన్న జమునా నదీ తీరంలోని అరణ్య ప్రాంతానికి వచ్చినట్లు సంప్రదాయ సిద్దంగా చెప్పబడుతున్నది. తులసీదాస్ రాజపూర్ స్థాపించి, ఒక దేవాలయాన్ని నిర్మించి,అనేకమంది అనుచరుల్ని ఆకర్షించాడు. [ ఇంకా...]
Tuesday, September 25
ఆహార పోషణ - పెరుగు ప్రయోజనాలు
వేసవి కాలంలో ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తినడంవల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపులో మంట తగ్గుతుంది. మెదడుకి చల్లదనాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యాభివృద్ధికి పెరుగును మించిన వస్తువు మరొకటి లేదు. పెరుగున ఎక్కువగా వాడుతూండటం చేత పంజాబీలు అంత దిట్టంగా, బలంగా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారాలలో పెరుగు చాలా ముఖ్యమైనది. దీనిలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. [ ఇంకా...]
సంస్కృతి - పీర్ల పండుగ
పీర్ అంటే మహాత్ముడు అని అర్ధం. మొహరం పండగనే పీర్ల పండగ అంటారు. హసన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్ధం ముస్లింలు జరుపుకునే కార్యక్రమమే పీర్ల పండగ. ధర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా హస్తాకృతి కలిగిన రూపాలను తయారుచేసి, వాటిని అలంకరించి, ఊరేగించి, పూజించేవాటిని పీర్లు అని పిలుస్తారు. [ ఇంకా...]
ఆహార పోషణ - చింతలు తీర్చే చింత
చింత ఆఫ్రికా దేశానికి చెందిన వృక్షం.
ఇది ఇప్పుడు ఉష్ణ ప్రదేశాలలో అనేక చోట్ల ప్రవృద్ధి పొందుతూంది. వృక్ష శాస్త్రంలో దీన్ని టామరిండస్ ఇండీకా అంటారు. తెలుగులో చింత, కన్నడంలో హుళి, తమిళంలో పుళి, హిందీలో ఇంలి, మరాటీలో చించి, సంస్కృతంలో తింత్రిణీ అని వివిధ పేర్లతో ఇది పిలవబడుతుంది. [ ఇంకా...]
ఇది ఇప్పుడు ఉష్ణ ప్రదేశాలలో అనేక చోట్ల ప్రవృద్ధి పొందుతూంది. వృక్ష శాస్త్రంలో దీన్ని టామరిండస్ ఇండీకా అంటారు. తెలుగులో చింత, కన్నడంలో హుళి, తమిళంలో పుళి, హిందీలో ఇంలి, మరాటీలో చించి, సంస్కృతంలో తింత్రిణీ అని వివిధ పేర్లతో ఇది పిలవబడుతుంది. [ ఇంకా...]
Monday, September 24
నృత్యం - అభినయం
మానవుడు ఒక పనిని నిర్వర్తించడానికి ముందు ఉచ్చ్వాస నిస్వాసాలు, చేష్ట లేక కదలిక ముఖ్యం. కదలిక మానవుని సజీవ లక్షణం. కదలిక లేనప్పుడు మానవునికి, చెట్లు చేమలకి భేదం కనిపించదు. అభినయం, నాట్యం రెండూ ప్రాధమిక దశలో చేష్ట ప్రాతిపదికగా ఏర్పడినవే. ఇది రానురాను ఒక కళగా రూపొందింది. ఈనాటి అభినయ కళకుగానీ, నాట్య కళకుగానీ ఆదిమ దశలో మానవ శరీరావయవాల వివిధ చేష్టలు, విన్యాసాలు ముఖ్యాధారం. [ ఇంకా...]
మీకు తెలుసా - చీమ
ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. వాటి గొప్పతనం అలాంటివి.ఒకే పుట్టలో కొద్దీ కలిసి ఉండడమే కాదు. వాటి పని అవి క్రమం తప్పక చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి కూడా. చీమలు పుట్టుకొచ్చింది కందిరీగల నుంచే అంటే నమ్ముతారా? ఇవి సుమారు 10 కోట్ల ఏళ్ళ కిందట కందిరీగలతో విడిపోయి, ప్రత్యేక జీవులుగా రూపొందాయి. [ ఇంకా...]
సంస్కృతి - హరికథ
ఈ కళా రూపంలో ఒకే కథకుడు దాదాపు మూడు గంటలకుపైగా గానం చేస్తాడు. ఆకర్షణీయమైన ఆహార్యంతో ప్రేక్షకులకు విసుగు కలగకుండా చేతిలో చిరతలతో ఆయన చేసే కథా కాలక్షేపం వేదాంత సహితంగా ఉంటుంది. సంపూర్ణ రామాయణం, సంపూర్ణ భారతం, భాగవతం వంటి అనేక ఆధ్యాత్మిక సంబధిత పురాణేతిహాసాలలొనై కథలను అత్యంత రమణీయంగా ఆలపిస్తూ, భక్తి సూత్రాలను ఉపదేశిస్తూ వీరు చేసే గానం ప్రజలను ముక్తి మార్గంపట్ల పయనించేటట్లు చేస్తుంది. [ ఇంకా...]
Saturday, September 22
మీకుతెలుసా - వయసుతో పని ఏముంది
ఏ వయసుకా ముచ్చట అన్నారు పెద్దలు. అంటే ఏ వయసుకైనా ముచ్చట్లు ఉంటాయన్నది అందరూ ఒప్పుకుంటున్న విషయం అన్నమాట. మరి ఆ ముచ్చట్లు ఎలా ఉండాలి? చిన్న వయసువాళ్ళకైతే ఆటలు, పాటలు, అల్లరి. మధ్య వయస్కులకు ఆటలు, పాటలు, కబుర్లు. వృద్ధులకు కూడా ఆటలుంటాయి, పాటలుంటాయి, వాటితోపాటు వారు తలచుకుంటే అనేక రకాలైన ముచ్చట్లుంటాయి. వయసుకు తగ్గ ముచ్చట్లు అనేది ఉద్యోగం-సద్యోగాలకీ, పెళ్ళి పేరంటాలకీ సంబంధించినవని మన పెద్దోళ్ళ భావన. [ ఇంకా...]
Friday, September 21
ఆధ్యాత్మికం - మీరాబాయి
మీరాబాయి 1498 లో రాజస్థాన్‌లో మెర్బా పట్టణంలో రాధోర్స్ రాజవంశంలో జన్మించింది. ఈమె తండ్రి రావు రతన్‌సింగ్ గొప్ప వైష్ణవ భక్తుడు. వీరు నివసించే ఇంటికి సమీపంలో ఒక విష్ణు దేవాలయం ఉండేది. మీరాబాయి తన తల్లిదండ్రులతో తరచు ఈ విష్ణుదేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తూండేది. అక్కడ విష్ణువుని స్తుతించే స్తోత్రాలు, కీర్తనలు మిరాబాయి మనస్సులో పూర్తిగా నాటుకున్నాయి. [ ఇంకా...]
సంస్కృతి - పేరిణి
పేరిణి శివతాండవం వీర నాట్యశైలికి చెందింది. ఈ సంప్రదాయం శైవ మతానికి సంబంధించింది. పేరిణికి సంబంధించిన ప్రస్తావన పాల్కురికి సోమనాధుని పందితారాధ్య చరిత్రలోనూ, శ్రీనాధుని కాశీఖండం, భీమఖండంలోనూ వర్ణించబడింది. కాకతి గణపతి చక్రవర్తికి సేనా నాయకుడైన జయప సేనాని 1253-54లో రచించిన నృత్యరత్నావళిలో పేరిణి గురించి వర్ణించాడు. [ ఇంకా...]
ఆహార పోషణ - ఆయుర్వేదం
ఆయుర్వేదం అతి ప్రాచీనమైన భారతీయ వైద్య విధానం. ఆంగ్లేయుల పరిపాలన ఫలితంగా దేశంలో అల్లోపతి బాగా ప్రబలి ఆయుర్వేదానికి గల గౌరవం, ప్రసిద్ధి క్షీణించిపోయాయి. కానీ, ఈనాటికీ ఈ వైద్య విధానం పట్ల అపార నమ్మకంగల వారు ఎందరో ఉన్నారు.
ఆయుర్వేదం అనగా "ఆయుర్వేత్తీతి ఆయుర్వేద:" ఆయ్యుర్దాయమును తెలుసుకొనునది ఆయుర్వేదము. ఇది వేదములందలి ఒక భాగం.మానవునికి సామాన్యంగా శరీరంలో త్రిదోషముల వృద్ధి, క్షయము వలన ఆరోగ్యము చెది రోగాలు సంభవిస్తాయి. [ ఇంకా...]
ఆయుర్వేదం అనగా "ఆయుర్వేత్తీతి ఆయుర్వేద:" ఆయ్యుర్దాయమును తెలుసుకొనునది ఆయుర్వేదము. ఇది వేదములందలి ఒక భాగం.మానవునికి సామాన్యంగా శరీరంలో త్రిదోషముల వృద్ధి, క్షయము వలన ఆరోగ్యము చెది రోగాలు సంభవిస్తాయి. [ ఇంకా...]
Thursday, September 20
సైకాలజీ - అసూయ-అనారోగ్యం
అసూయ అన్నది ఎంత మోతాదులో ఉన్నా అది విషంలా పనిచేస్తుంది. అంతేకాదు అది మన మానసిక అరోగ్యంపై దెబ్బతీస్తుంది. దయాగుణం మనకు రెండింతల ఆశీర్వచనాలను అందజేస్తుంది. కాని అసూయ గుణం మనకు రెండింతల హానిని కలిగిస్తుంది.
మన నిజజీవితంలోనూ, పుస్తకాలలోనూ అసూయ వల్ల గలిగే నష్టాలను చూస్తూనే ఉన్నాము. తొలుత ఇది అతి చిన్న భావనగా మొలకెత్తుతుంది. ఆ తరువాత ఇది పెరుగుతూ వస్తుంది. ఆ కారణంగా మనం చెప్పలేనన్ని కష్టాలకు గురి అవుతుంటాము. [ ఇంకా...]
మన నిజజీవితంలోనూ, పుస్తకాలలోనూ అసూయ వల్ల గలిగే నష్టాలను చూస్తూనే ఉన్నాము. తొలుత ఇది అతి చిన్న భావనగా మొలకెత్తుతుంది. ఆ తరువాత ఇది పెరుగుతూ వస్తుంది. ఆ కారణంగా మనం చెప్పలేనన్ని కష్టాలకు గురి అవుతుంటాము. [ ఇంకా...]
ఆధ్యాత్మికం - కబీరు
కబీరు 15 వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ విప్లవాత్మక యోగి. ఆధ్యాత్మిక సిద్ధ పురుషుడు, ఆనాడు తీవ్ర మత వైషమ్యాల వల్ల, పరస్పర విరోధాల వల్ల హిందూ, మహమ్మదీయుల మధ్య ఏర్పడిన అగాథానికి గొప్ప సేతువు వంటి కబీరు ఉపదేశాలు రెండు మతాల సామరస్యానికి అధికంగా సహకరించాయి అనడంలో సందేహం లేదు. [ ఇంకా...]
Subscribe to:
Posts (Atom)