ఆత్మార్పణకు,స్వచ్చతకు నిలయం కానప్పుడు స్త్రీకి విలువ లేదు.హక్కులకు వాస్తవమైన మూలాధారం-కర్తవ్య నిర్వహణం.మనం మన కర్తవ్య నిర్వహణ చేసినట్లయితే హక్కులు పొందేందుకు ఎంతో దూరంలో ఉండము.మన విధులు నిర్వర్తించకుండా హక్కుల కోసం పరుగెత్తినట్లయితే అవి మనల్ని దాటి పోతాయి.మనం ఎంతగా వాటిని వెంబడిస్తే అవి అంత త్వరితంగా ఎగిరిపోతాయి.
మీరు పుస్తకాలు పఠించవచ్చు.కానీ అవి మిమ్మల్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేవు.మీలోని ఉత్తమత్వాన్ని బయటికి తేవటమే నిజమైన విద్య అనిపించుకుంటుంది.మానవత్వం అనే పుస్తకం కంటే వేరొక ఉత్తమ గ్రంధం ఏమి ఉంటుంది.ప్రపంచం ఆధిపత్యం వహించిన పటిష్టవంతమైన శక్తి-ప్రేమ.మరియు అది వినయం గల కల్పనా రూపము.ప్రేమ ఎక్కడ ఉంటుందో,దేవుడు కూడా అక్కడే ఉంటాడు. [ఇంకా... ]
Monday, December 31
చిన్నపిల్లల కోసం - మంచి అలవాట్లు
మనిషికి మాటే అలంకారం.
మాట వెండి, మౌనం బంగారం.
గురువుల మాట వినాలి.
పరనింద పనికిరాదు.
తొందరపడి ఏ పనీ చేయరాదు.
ఆటలాడుచోట, అలుక పూనరాదు.
మంచిని మించిన గుణం లేదు.
ఆడిన మాట తప్పరాదు.
పెద్దలను గౌరవించాలి. [ఇంకా... ]
మాట వెండి, మౌనం బంగారం.
గురువుల మాట వినాలి.
పరనింద పనికిరాదు.
తొందరపడి ఏ పనీ చేయరాదు.
ఆటలాడుచోట, అలుక పూనరాదు.
మంచిని మించిన గుణం లేదు.
ఆడిన మాట తప్పరాదు.
పెద్దలను గౌరవించాలి. [ఇంకా... ]
మీకు తెలుసా - వింత అలవాట్లు
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. అంటే ఒకరి గుణం మరొకరికి ఉండదు. ఒకరికి నచ్చిన వంటకం మరొకరికి నచ్చదు. మరి కొందరిలో ఏదో ఓ వింత గుణం కనిపిస్తుంది. అది ఎదుటి వారికి విచిత్రంగా అనిపిస్తుంటుంది. అయినా వారు తమ అలవాట్లు మానుకోడానికి ఏమాత్రం ఇష్టపడరు. కొందరికి మాట్లాడుతూ అనవసరంగా నవ్వడం, మరికొందరికి ఊరికే ఉమ్ముతుండడం అలవాట్లుగా ఉంటే మరికొందరికి ఊరికే జుట్టు సవరించుకొవడంలాంటి అలవాట్లు ఉంటాయి. ఇంతవరకైతే పరవాలేదు. ఈ అలవాట్లు విపరీత ధోరణికొస్తేనే ప్రమాదం. [ఇంకా... ]
Saturday, December 29
మీకు తెలుసా - ఫొటోగ్రఫీ
ఆంగ్లంలో ఫొటోగ్రఫీ అనే మాటకు 'వెలుతురుతో రాయడం' అనే రెండు గ్రీకు పదాలు మూలమయ్యాయి. చాయా చిత్రానికి రెండు ప్రక్రియలు ఉన్నాయి. మొదటిది ప్రతిబింబాన్ని ఉత్పన్నం చేయడం, రెండవ ప్రక్రియలో ప్రతిబింబాన్ని నమోదు చేయడం. ఈ మొదటి ప్రక్రియ అనేక శతాబ్దాలకు ముందే అంటే ఈ చాయా చిత్ర గ్రహణాన్ని కనుగొనడానికి పూర్వమే మానవాళికి తెలిసింది. 1000, 1267 సం. ప్రాంతంలో అరబ్, ఖగోళ శాస్త్రవేత్తలు సూర్య గ్రహణాన్ని చూడడానికి కెమెరా ఆబ్‌స్క్యూరా అనే విచిత్రమైన ప్రభావాన్ని వాడుకున్నారు. నెమ్మదిగా ఈ కెమెరా ఆబ్‌స్క్యూరా సహాయంతో విభిన్న రీతులలో చిత్రలేఖకులు ప్రతిబింబాన్ని కల్పించుకోసాగారు. కాంతి సూక్ష్మగ్రాహక ద్రవ్యాలు కూడా ఫొటోగ్రఫీని కనుగొనడానికి ముఖ్యాధారమయ్యాయి. [ఇంకా... ]
నీతి కథలు - దేశసేవ
శౌరికి చిన్నతనం నుంచి దేశసేవ చేయాలని కోరిక, వాడు కూడలి దగ్గర పిల్లలకు దేశసేవ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. 'స్వయంగా సంపాదించే మార్గం చూసుకో! నాతో పొలం పనులకు రా!' అంటూ వాడిని కోప్పడేవాడు తండ్రి.. అయితే శౌరికి తండ్రి స్వార్థపరుడిలా కనిపించాడు. ప్రతివాడు దేశం గురించి కూడా ఆలోచించాలి! స్వార్థం మానుకోవాలి! అనేవాడు. కొందరు ఊరి పెద్దలు 'ఇక్కడి మూర్ఖులకు నీ ఉపన్యాసాలు అర్థంకావు'. రాజధానికి వెళ్ళి రాజుగారిని కలుసుకో! అక్కడ నీ శ్రమకి గుర్తింపు లభిస్తుంది! అన్నారు. [ఇంకా... ]
పర్యాటకం - పవిత్ర త్రివేణి సంగమం ప్రయాగ
నదీ నగరికతకు పెట్టింది పేరు భారతదేశం."నది" అంటేనే భారతీయుల్లో ఒక గొప్ప భక్తిభావం ఉంది. అలాంటిది మూడు నదులు సంగమించే త్రివేణి సంగమానికి ఉండే పవిత్రత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరాలు, అధ్యాత్మిక క్షేత్రాలలో అలాంటి విశిష్ట వేడుకలు వచ్చినప్పుడు ఇంక లక్షలాది మంది ఆనందానికి అవధులు ఉండవు. పరమ పవిత్రమైన ప్రయాగ పేరు చెబితే తనువు, మనసు పులకించిపో తాయి. [ఇంకా... ]
Friday, December 28
అందరికోసం - హాస్య సంపద
మాష్టారు: వెయ్యిలోనుండి ఒకటి తీస్తే ఎంత సుశీలా ?
సుశీల:'మూడు సున్నాలు సార్'.
డాక్టర్:
మావారికి పిచ్చికుక్క కరిచింది. మీరు వెంటనే రావాలి.
ఆంది తాయారు కంగారుగా.
మీరేం గాభరా పడకండి నేవచ్చేదాకా మంచం మీదే
పడుకోబెట్టండి అన్నాడు డాక్టర్.
చీ--చీ-- పిచ్చికుక్కని మంచం మీదెలా పడుకోబెడతాం ఆంది తాయారు. [ఇంకా... ]
సుశీల:'మూడు సున్నాలు సార్'.
డాక్టర్:
మావారికి పిచ్చికుక్క కరిచింది. మీరు వెంటనే రావాలి.
ఆంది తాయారు కంగారుగా.
మీరేం గాభరా పడకండి నేవచ్చేదాకా మంచం మీదే
పడుకోబెట్టండి అన్నాడు డాక్టర్.
చీ--చీ-- పిచ్చికుక్కని మంచం మీదెలా పడుకోబెడతాం ఆంది తాయారు. [ఇంకా... ]
వ్యక్తిత్వ వికాసం - సంకల్ప శక్తి
ఒట్టు పెట్టటంలోనూ, క్షణమైనా గడవకముందే ఆ ఒట్టును తీసి గట్టుమీద పెట్టడం లోనూ మనం గొప్ప ప్రావిణ్యాన్ని సాధిచాం!! ఒట్టు పెట్టటం సులభమే కానీ దానిని నిలబెట్టుకోవడం చాలా కష్టం. భీష్ముడికి ఉన్నటువంటి సంకల్పశక్తి మనకు కావాలి. ఆయని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిఙ్ఞ చేసి, దానిని శ్రద్దతో ఆచరించి చూపాడు. బలహీనమైన మనస్సు ఉండేవాల్లు ఏదోవక సాకు చెప్పడానికి చూస్తారు. మనస్సు చంచలమైనది, స్వాభావికంగా అశాంతిగా ఉంటుంది. ఎప్పుడూ ఊగిసలాడుతూ క్షణానికి ఒక ఆలోచన చేస్తుంది. [ఇంకా... ]
మీకు తెలుసా - చీర కథ
చీర అంటే వస్త్రము. వాడుకలో స్త్రీలు మాత్రం కట్టుకునే బట్టకు పర్యాయపదంగా చీర వాడబడుతూంది. చరిత్రకు పూర్వం ఇండస్ వేలీ ప్రాతపు స్త్రీలు ప్రత్తి నూలుతో నేయబడిన బట్టలు ధరించేవారు. ప్రత్తి మరియు పట్టుబట్టల గురించి వేదాలలోను, రామాయణ, మహాభారత కథలలోనూ కూడా చెప్పబడింది. చంద్రగుప్తుని కాలంలో పాటలీపుత్రానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీసు భారత స్త్రీలు ధరించిన వస్త్రాలను గురించి "బంగారు జరీతో విలువైన రాళ్ళు పొదగబడినవి" అని వ్రాశాడు. ప్రాచీన కాలపు చిత్రాలలోను, రాతి విగ్రహాలలోను పలచని చీర మడతలు సూచించబడ్డాయి. [ఇంకా... ]
Thursday, December 27
మీకు తెలుసా - కలంకారీ అద్దకాలు
ఆంధ్ర ప్రదేశ్‌లోని ముఖ్యమైన పరిశ్రమలలో అద్దక పరిశ్రమ చాలా పురాతనమైనది. రాష్ట్రమంతటా వివిధ సాంకేతిక విధానాలను ఉపయోగించి స్థానిక సంప్రదాయానుగుణంగా ఇండిగో ప్రాసెస్ లేక రేసిస్టు స్టైల్, మార్డెంట్ లేక డైడ్ స్టైల్, మొదట చెప్పిన టై అండ్ డై స్టైల్ అని మూడు రకాలుగా ఉంది. గుడారాలకు ఉపయోగించే గుడ్డలపై లైనింగులు, గుమ్మాలకు, కిటికీలకు తెరలు, కిషన్ కవరింగులు మొదలైన వాటిపై అద్దకానికి మార్డెంట్ లేక డైడ్ స్టైల్ ఉపయోగిస్తారు. ఇండిగో రేసిస్ట్ స్టైల్‌నే కలంకారీ అద్దకం అంటారు. కలంకారీ అద్దకాలలో అందమైన అద్దకపు చీరలు, పడక దుప్పట్లు, కర్టెన్లు, బల్లగుడ్డలు అనేక అందమైన డిజైన్లలో లభిస్తున్నాయి. [ఇంకా... ]
సాహిత్యం - ప్రాచీన విద్య
ఆధునిక విద్యాలయాలు ఉన్నత చదువులకంటే ఉన్నతోద్యాగాల దిశగా మాత్రమే విద్య బోధిస్తున్న విషయం తేటతెల్లమైనదే. ముఖ్యంగా టెక్నికల్ విద్య ఈనాడు చూపిస్తున్న ప్రభావానికి ప్రభావితం కాని విద్యార్ధి లేడు. టెక్నికల్ విద్య మాత్రమే తెలివైన విద్య అనే భావన విద్యా వ్యవస్థలో వేళ్ళూనుకుపోవడంతో విద్యార్ధులు ఆ విద్యపట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. తల్లితండ్రులు కూడా తమ బిడ్డలను ఈ విద్యలపట్లే ఆసక్తి పెరిగేట్లు చిన్నతనంనుంచే బోధిస్తున్నారు. టెక్నికల్ విద్య ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు తెచ్చుకోవచ్చనే ఆశ వారిని ఈ విద్యపట్ల ఆసక్తిని పెంపొందింపజేస్తోంది. [ఇంకా... ]
పిల్లల ఆటలు - గెస్ ది లాస్ట్ నెంబర్
ఎంతమంది ఆడవచ్చు : ఆరుగురు.
కావలసిన వస్తువు : న్యూస్ పేపర్లు (ఇంగ్లీషు).
పోటి సమయం : అవసరాన్ని బట్టి.
ఆటగాళ్ల వయస్సు : 6 నుండి 8 సం|| రాల మధ్య .
పిల్లలు దూరం నుంచి వాహనాలను చూసి దాని రిజిస్ట్రేషన్ నంబర్ చివర అంకె సరి సంఖ్యో, బేసి సంఖ్యో చెప్పగలగాలి. [ఇంకా... ]
కావలసిన వస్తువు : న్యూస్ పేపర్లు (ఇంగ్లీషు).
పోటి సమయం : అవసరాన్ని బట్టి.
ఆటగాళ్ల వయస్సు : 6 నుండి 8 సం|| రాల మధ్య .
పిల్లలు దూరం నుంచి వాహనాలను చూసి దాని రిజిస్ట్రేషన్ నంబర్ చివర అంకె సరి సంఖ్యో, బేసి సంఖ్యో చెప్పగలగాలి. [ఇంకా... ]
Wednesday, December 26
సాహిత్యం - తిట్టు కవిత్వం
లలిత కళలలో అత్యంత విశిష్టమైనది కవిత్వం. ఇది అనేక విధాలుగా రంజింపజేస్తుంది. ఆశుకవిత్వం, చిత్ర కవిత్వం, మధుర కవిత్వం, విస్తర కవిత్వం, శాస్త్ర కవిత్వం, తిట్టు కవిత్వం అను అనేక రూపాల్లో కవిత్వం చెప్పబడుతున్నది. వీటిలో తిట్టు కవిత్వం యొక్క స్థానం ప్రత్యేకమైనది. ఆదికవి వాల్మీకి వాక్కు నుంచి ఆవిర్భవించిన మొట్టమొదటి కవిత్వం తిట్టు కవిత్వం కవిత్వమంటే ఆశ్చర్యం కలగకమానదు.
"మానిషాద ప్రతిష్ఠాం త్వ, మగమ శ్శాశ్వతీ స్సమా:
యత్క్రౌచ మిథునా దేక, మవధీ: కామ మోహితం" [ఇంకా... ]
"మానిషాద ప్రతిష్ఠాం త్వ, మగమ శ్శాశ్వతీ స్సమా:
యత్క్రౌచ మిథునా దేక, మవధీ: కామ మోహితం" [ఇంకా... ]
నీతి కథలు - అనుభవించని ఐశ్వర్యం
కనకయ్య వొట్టి లోభి, ఎంతో ఐశ్వర్యం వుంది. అయినా తను తినేవాడు గాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. కనకయ్య పీనాసి అని అందరికీ తెలుసు. అయినా ఊరిలోని వారు - ఏ కొంచెమైనా సహాయం చేయక పోతాడా? అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు. సహాయం చేయమని కోరేవారు. కాని కనకయ్య వాళ్ళకు, ఏవేవో సాకులు చెప్పి పంపించేసే వాడు. గడ్డి పరక అంత సాయం కూడా చేసేవాడు గాదు. [ఇంకా...]
సంస్కృతి, సంప్రదాయాలు - పురాణాలు & ఇతిహాసాలు
"పురాపినవం పురాణం" అన్నారు. అంటే ఎంత ప్రాచీనమైనదైనా కొత్తగా అనిపిస్తుందని దీని భావన. పురాణాలలో భారతీయ ఆత్మ ఉందంటారు. వేద ధర్మాలను ప్రచారం చేయడానికే పురాణాలు వెలువడ్డాయి.
రాణాలు ప్రాచీన విజ్ఞాన సంపుటాలు. ప్రప్రంచం పుట్టుక దగ్గర్నుంచి ప్రపంచంలో మానవుడు నడుచుకోవలసిన విధానందాకా ఎన్నెన్నో విషయాలను పురాణాలు మనకు వివరిస్తాయి. చరిత్ర, భౌగోళికం, పౌర విజ్ఞానం...ఒక్కటేమిటి? ప్రపంచంలో ఎన్ని విభాగాల విజ్ఞానముందో అన్నీ పురాణాలలో కనిపిస్తాయి. ఇక కథలైతే...భారతీయ సాహిత్యంలోని ప్రాచీన గ్రంధాలన్నిటికీ పురాణ గాధలే ఆధారం. [ఇంకా... ]
రాణాలు ప్రాచీన విజ్ఞాన సంపుటాలు. ప్రప్రంచం పుట్టుక దగ్గర్నుంచి ప్రపంచంలో మానవుడు నడుచుకోవలసిన విధానందాకా ఎన్నెన్నో విషయాలను పురాణాలు మనకు వివరిస్తాయి. చరిత్ర, భౌగోళికం, పౌర విజ్ఞానం...ఒక్కటేమిటి? ప్రపంచంలో ఎన్ని విభాగాల విజ్ఞానముందో అన్నీ పురాణాలలో కనిపిస్తాయి. ఇక కథలైతే...భారతీయ సాహిత్యంలోని ప్రాచీన గ్రంధాలన్నిటికీ పురాణ గాధలే ఆధారం. [ఇంకా... ]
Monday, December 24
నాటికలు - కిడ్నాప్
{తెర తీయగానే విశాలమైన హాల్ ఉంటుంది. హాల్ మధ్యలో 4 కుర్చీలు, వాటి ముందు ఒక టీపాయ్, దాని మీద కొన్ని పత్రికలు, న్యూస్ పేపర్లు ఉంటాయి. రూంకి ఒక మూల స్టూల్ మీద మంచి నీళ్ళ కూజా ఉంటుంది. హాలుకి కుడి, ఎడమ ద్వారాలుంటాయిధ్ : (కుడి వైపు ద్వారం నుండి నీరసంగా ప్రవేశిస్తాడు. అతని మొహం అలసటగా, బాధగా ఉంటుంది. నీరసంగా వచ్చి ఒక చెయిర్‌లో కూర్చుంటాడు. జేబులోనుంచి కర్చీఫ్ తీసి మొహం తుడుచుకుంటాడు. సెల్ ఫోన్ తీసి ఏదో నంబర్ నొక్కుతాడు.) ఏంటీ, కనిపించలేదా? వాళ్ళ ఇంటికి రాలేదా? ఆ..ఆ.. సరే! సరే! (ఫోన్ జేబులో పెట్టుకుని బాధగా తల పట్టుకుంటాడు) [ఇంకా... ]
వంటలు - నిమ్మ ఉప్పుతో షర్బత్
కావలసిన వస్తువులు:
నిమ్మ ఉప్పు, పంచదార - 2 కప్పులు.
నీరు - 3/4 కప్పు.
మిఠాయి రంగు - 1 స్పూను.
ఎస్సెన్సు (ఏవైన) - 1 స్పూను.
తయారు చేసే విధానం:
ముందుగా 2 కప్పుల పంచదారకు ముప్పావు కప్పు నీరు పోసి తీగ పాకం పట్టాలి. టీ స్పూను నిమ్మ ఉప్పు వేరే గిన్నెలో నీళ్ళు కలిపి, లేతపాకంలో పోసి రెండు మూడు సార్లు కలియబెట్టి దించాలి. [ఇంకా... ]
నిమ్మ ఉప్పు, పంచదార - 2 కప్పులు.
నీరు - 3/4 కప్పు.
మిఠాయి రంగు - 1 స్పూను.
ఎస్సెన్సు (ఏవైన) - 1 స్పూను.
తయారు చేసే విధానం:
ముందుగా 2 కప్పుల పంచదారకు ముప్పావు కప్పు నీరు పోసి తీగ పాకం పట్టాలి. టీ స్పూను నిమ్మ ఉప్పు వేరే గిన్నెలో నీళ్ళు కలిపి, లేతపాకంలో పోసి రెండు మూడు సార్లు కలియబెట్టి దించాలి. [ఇంకా... ]
సాహిత్యం - నీతి పద్యాలు
తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
తవిలి మృగ తృష్ణ లో నీరు త్రావ వచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు!
చెలిమియు, పగయును, తెలివియు
కలకయు, ధర్మంబు, పాపగతియును, పెంపున్
తులువతనంబును వచ్చును
పలుకుబడిన కాన, పొసగ పలుకగ వలయున్! [ఇంకా... ]
తవిలి మృగ తృష్ణ లో నీరు త్రావ వచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు!
చెలిమియు, పగయును, తెలివియు
కలకయు, ధర్మంబు, పాపగతియును, పెంపున్
తులువతనంబును వచ్చును
పలుకుబడిన కాన, పొసగ పలుకగ వలయున్! [ఇంకా... ]
Saturday, December 22
వంటలు - కొబ్బరి పాయసం
కావలసిన వస్తువులు:
కొబ్బరికాయ - ఒకటి.
బియ్యం - ఒక కప్పు.
పంచదార లేదా బెల్లం తురుము - రెండు కప్పులు.
యాలకులు - పది.
జీడిపప్పు - పది.
కిస్‌మిస్ - పది.
నెయ్యి - రెండు స్పూన్లు.
తయారు చేసే విధానం :
బియ్యం కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి. తరవాత కొబ్బరితో కలిపి మెత్తగా పలుచగా దోసెల పిండిలా రుబ్బాలి. [ఇంకా... ]
కొబ్బరికాయ - ఒకటి.
బియ్యం - ఒక కప్పు.
పంచదార లేదా బెల్లం తురుము - రెండు కప్పులు.
యాలకులు - పది.
జీడిపప్పు - పది.
కిస్‌మిస్ - పది.
నెయ్యి - రెండు స్పూన్లు.
తయారు చేసే విధానం :
బియ్యం కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి. తరవాత కొబ్బరితో కలిపి మెత్తగా పలుచగా దోసెల పిండిలా రుబ్బాలి. [ఇంకా... ]
నీతి కథలు - పిశాచాలు చేసిన సహాయము
అనగనగా అవంతీపురం సమీపములో గల గ్రామములో ఒక ముసలి అవ్వ, మనుమడు ఉన్నారు. అవ్వ అమాయకురాలు. ఇరుగు పొరుగు అవ్వకి మాయమాటలు చెప్పి ఉప్పు, పప్పు తీసుకువెళ్ళేవారు. అవ్వను సుఖపెడదామంటే అవ్వచేసే పనికి మనుమడికి కోపం వచ్చేది. పై పెచ్చు గుట్టుగా సంసారము చేయాలని తెలియదు అనేది. ఒక రోజున అవ్వ ఇల్లు ఊడుస్తూ ఉంటే చిన్న తాళము చెవి దొరికింది. అది తన మనుమడి పెట్టెదని తీసి పెట్టె తాళము తీసి పెట్టెలోపల డబ్బు చూసి అందరిని పిలిచి చెప్పింది. [ఇంకా... ]
వంటలు - క్యాప్సికమ్ బజ్జి
కావలసిన వస్తువులు:
కాప్సికమ్ - అర కేజి.
నూనె - పావు కేజి.
శనగపిండి - పావు కేజి.
మిరప్పొడి - ఒక స్పూను.
జీలకర్ర - ఒక స్పూను.
వంటసోడా - చిటికెడు.
ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం :
కాప్సికమ్‌లను కడిగిన తర్వాత చాకు తీసుకుని ఒక్కొక్క దాన్ని నాలుగైదు ముక్కలుగా నిలువుగా తరుక్కోవాలి. [ఇంకా... ]
కాప్సికమ్ - అర కేజి.
నూనె - పావు కేజి.
శనగపిండి - పావు కేజి.
మిరప్పొడి - ఒక స్పూను.
జీలకర్ర - ఒక స్పూను.
వంటసోడా - చిటికెడు.
ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం :
కాప్సికమ్‌లను కడిగిన తర్వాత చాకు తీసుకుని ఒక్కొక్క దాన్ని నాలుగైదు ముక్కలుగా నిలువుగా తరుక్కోవాలి. [ఇంకా... ]
పొడుపు కథలు - అ నుంచి అః వరకు
అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటిపువ్వులు, అన్ని పువ్వుల్లో రెండేకాయలు?
ఆకాశం, చుక్కలు, సూర్యుడు
అందరాని వస్త్రంపై అన్నీ వడియాలు
నక్షత్రాలు
అంద చందాల వాడు రోజుకో ఆకారం చివరికి నిరాకారం లేదా నిండు సున్న
చందమామ
అక్కడిక్కడబండి, అంతరాలబండి మద్దూరి సంతలో మాయమైన బండి.
సూర్యుడు
అక్కాచెల్లెలి అనుబంధం - ఇరుగూ పొరుగూ సంబంధం దగ్గర వున్నా చేరువ కాలేరు.
కళ్ళు [ఇంకా... ]
ఆకాశం, చుక్కలు, సూర్యుడు
అందరాని వస్త్రంపై అన్నీ వడియాలు
నక్షత్రాలు
అంద చందాల వాడు రోజుకో ఆకారం చివరికి నిరాకారం లేదా నిండు సున్న
చందమామ
అక్కడిక్కడబండి, అంతరాలబండి మద్దూరి సంతలో మాయమైన బండి.
సూర్యుడు
అక్కాచెల్లెలి అనుబంధం - ఇరుగూ పొరుగూ సంబంధం దగ్గర వున్నా చేరువ కాలేరు.
కళ్ళు [ఇంకా... ]
Friday, December 21
వంటలు - ఎగ్ పరోటా
కావలసిన వస్తువులు:
గుడ్లు - 2.
ఉల్లిపాయ సన్నగా తరిగినది - 1.
టమోటా - 1.
పరోటా - 2.
మిర్చిపొడి - సరిపడినంత.
ఉప్పు - సరిపడినంత.
జీరా - సరిపడినంత.
మిరియాల పొడి - అర టీ స్పూను.
ధనియాల పొడి - అర టీ స్పూను.
పసుపు - పావు టీ స్పూను.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
కొత్తిమీర తురుము - 1 రెమ్మ.
తయారు చేసే విధానం:
కడాయిలో నూనె వేడి చేసి జీరా, ఉల్లిపాయలు, టమోటాలు వరుసగా వేసి వేగనివ్వాలి. [ ఇంకా...]
గుడ్లు - 2.
ఉల్లిపాయ సన్నగా తరిగినది - 1.
టమోటా - 1.
పరోటా - 2.
మిర్చిపొడి - సరిపడినంత.
ఉప్పు - సరిపడినంత.
జీరా - సరిపడినంత.
మిరియాల పొడి - అర టీ స్పూను.
ధనియాల పొడి - అర టీ స్పూను.
పసుపు - పావు టీ స్పూను.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
కొత్తిమీర తురుము - 1 రెమ్మ.
తయారు చేసే విధానం:
కడాయిలో నూనె వేడి చేసి జీరా, ఉల్లిపాయలు, టమోటాలు వరుసగా వేసి వేగనివ్వాలి. [ ఇంకా...]
వంటలు - పొట్లకాయ పెరుగుపచ్చడి
కావలసిన వస్తువులు:
పొట్లకాయ (మీడియం సైజు) - 1.
పెరుగు - 100 గ్రా.
పచ్చిమిర్చి - 7.
కందిపప్పు - 1 టీ స్పూను.
మినపప్పు - 1 టీ స్పూను.
చింతపండు - కొద్దిగా.
ఉప్పు - సరిపడినంత.
పసుపు - అర టీ స్పూను.
జీలకర్ర - అర టీ స్పూను.
వెల్లుల్లి - 4 రెమ్మలు.
రిఫైండ్ ఆయిల్ - కొద్దిగా.
పోపు దినుసులు - కొద్దిగా.
తయారు చేసే విధానం :
పచ్చిమిర్చి, కందిపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిలను కళాయిలో దోరగా వేయించి చింతపండుతో సహా మిక్సీ వేయాలి. [ ఇంకా...]
పొట్లకాయ (మీడియం సైజు) - 1.
పెరుగు - 100 గ్రా.
పచ్చిమిర్చి - 7.
కందిపప్పు - 1 టీ స్పూను.
మినపప్పు - 1 టీ స్పూను.
చింతపండు - కొద్దిగా.
ఉప్పు - సరిపడినంత.
పసుపు - అర టీ స్పూను.
జీలకర్ర - అర టీ స్పూను.
వెల్లుల్లి - 4 రెమ్మలు.
రిఫైండ్ ఆయిల్ - కొద్దిగా.
పోపు దినుసులు - కొద్దిగా.
తయారు చేసే విధానం :
పచ్చిమిర్చి, కందిపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిలను కళాయిలో దోరగా వేయించి చింతపండుతో సహా మిక్సీ వేయాలి. [ ఇంకా...]
నీతి కథలు - తగని గర్వం
చీమలు దూరని చిట్టడవిలో ఓ సింహం ఉంటూ ఉండేది. సహజంగానే బలపరాక్రమాలున్న జంతువు. మంటకు గాలి తోడైనట్లు సింహానికి అంతులేని అహంకారము ఉంది. అడవిలో బ్రతికే తదితర మృగాలన్నిటి చేతా అడ్డమైన చాకిరీ చేయించేది. సింహం ఆడిందే ఆట, పాడిందే పాట. ఇలా ఉండగా చిట్టడవికి చెప్పలేనంత కరువొచ్చింది. ఆ కరువుకి తట్టుకోలేక మృగాలన్నీ తలో దోవా పారిపోయాయి. మృగాలకి రాజయితే మాత్రం సింహానికి తిండితిప్పలు ఎక్కడివి? బెట్టుగా అక్కడే కొన్నాళ్ళ పాటు నీల్గుతూ ఉంది. కాని, అది ఆఖరికి కాకులు దూరని కారడవికి ప్రయాణమై వెళ్ళింది. [ ఇంకా...]
పర్యాటకం - సెవెన్ వండర్స్ - గ్రేట్ వాల్ ఆఫ్ చైనా
ప్రపంచ వ్యాప్తంగా శుభదినంగా భావించిన 07-07-07 నాడు ఏడు ప్రపంచ వింతలను అనధికారికంగా ప్రకటించారు. ఓటింగ్ ద్వారా జరిగిన ఎంపికలో పాతవాటిలో ఉన్న మన 'వాహ్ తాజ్ 'తో పాటు 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ', రోమన్ కలోసియంకు మళ్ళీ స్థానం దక్కింది. ఈ కొత్త ఏడు వింతలు ఇలా ఉన్నాయి.
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా
పెట్రా(జోర్డాన్)
ద స్టాట్యూ ఆఫ్ క్రైస్ట్ రిడీమర్(బ్రెజిల్) [ ఇంకా...]
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా
పెట్రా(జోర్డాన్)
ద స్టాట్యూ ఆఫ్ క్రైస్ట్ రిడీమర్(బ్రెజిల్) [ ఇంకా...]
Thursday, November 29
మీకు తెలుసా - గడ్డం - గత వైభవం
ప్రాచీన కాలపు బాబిలోన్‌లో గడ్డాలకు గొప్ప గౌరవం ఉండేది. నిజం చెప్పాలంటే అన్ని ప్రమాణాలూ గడ్డం సాక్షిగా జరిగేవి. మనిషి గడ్డాన్ని పట్టుకోవడం అన్నది క్రీ.పూ. 2వ సహస్రాబ్దిలో సన్నిహిత స్నేహానికి గుర్తుగా పరిగణింపబడేది. గడ్డాన్ని పట్టుకొని లాగడం అన్నది మొరటైన పనిగా మాత్రం కాదు అతి అవమానకరమైన పనిగా గుర్తింపబడేది. కొంతమంది గడ్డాన్ని వివేకపు చిహ్నంగా పరిగణిస్తారు. ప్రాచీన కాలపు ఈజిప్టువారి సంఘంలో గడ్డం ఒక హోదాను సూచించేది. గడ్డం ఎంత పొడవుగా ఉంటే వారు అంత గొప్ప హోదాకలవారిగా గుర్తింపబడేవారు. [ ఇంకా...]
Wednesday, November 28
నీతి కథలు - తగిన శాస్తి
అనగనగా ఒక పెద్ద అడవి వుండేది. ఆ అడవిలో ఒక గుర్రం, గేదె వుండేవి. అవి పక్క పక్కనే మేస్తుండేవి. ఒకే సెలయేటిలో నీళ్ళూ కూడా తాగేవి. కానీ వాటికి ఏనాడు పడేదికాదు. ఎప్పుడూ పోట్లాడుకునేవి. . నేను గొప్పంటే నేను గొప్పని బడాయిలు పోయేవి. ఎప్పటిలానే ఒక రోజు ఆ రెండూ పోట్లాడుకున్నాయి. కోపం ఆపుకోలేని గేదె తన కొమ్ములతో గుర్రాన్ని బాగా పొడిచింది. [ ఇంకా...]
ఆహార పోషణ - చక్కెర వ్యాధి-చేదు నిజాలు
ఎబెర్స్ పేపిరస్ (ఈజిప్టు, 1500 బి.సి.)లో చక్కెర వ్యాధి అనే మాట వాడబడింది. మన దేశపు సుప్రసిద్ధ వైద్యుడు శుశ్రుతుడు క్రీ.పూ. 400లో ఈ వ్యాధిని తేనె మూత్రంగా అభివర్ణించాడు. క్రీ.శ. ఆరంభమైన మొదటి శతాభ్దంలోనే ఈ వ్యాధి రోం, చైనా, జపాను భాషా గ్రంధాలలో నమోదై ఉంది. డయాబెటిస్ అన్న పదాన్ని తొలుత గ్రీకులు వాడారు. ఈ పదం నీళ్ళ ద్వారా విసర్జనం అన్న అర్ధాన్ని ఇస్తుంది. మూత్రాన్ని వేడిచేసి పరీక్షించి, ఆవిరి చేసి డాక్టర్ విల్లిస్ 1674లో అందులో జిగటలాంటి పదార్ధం ఉందని కనుగొన్నాడు. ఆ ఉన్న వస్తువు చక్కెరే. కానీ అప్పట్లో ఇంగ్లాండు వారికి చక్కెర విషయం తెలియదు. [ ఇంకా...]
విజ్ఞానం - కల్తీలను కనిపెట్టండి
ఆహార వస్తువులను కల్తీ చేయడం నేరం. కల్తీ పదార్ధాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఖనిజ తైలంతో కల్తీ చేసిన ఆవ నూనును ఉపయోగించిన వ్యక్తికి కంటిదృష్టి పోవచ్చు లేక గుండె జబ్బు రావచ్చు. సున్నితమైన రంపపు పొట్టుతో కల్తీ చేసిన మిరపకాయల పొడి తిన్న వారికి ఆరోగ్యం చెడిపోతుంది. [ ఇంకా...]
నాటికలు - తెలుగు నాటక రంగం చరిత్ర
కావ్యాంత నాటకం" అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే అన్ని కావ్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకమని అర్ధం. కవిత్వం, వ్యాసం, కథ... ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను స్పృశించిన తరువాత మాత్రమే నాటకాన్ని రచించాలని ఆయన తెలిపాడు. అప్పుడు మాత్రమే నాటక రచనకు నిండుదనం చేకూరుతుందని ఆయన భావన. [ ఇంకా...]
Tuesday, November 27
వ్యక్తిత్వ వికాసం - కల్పనా శక్తి (క్రియేటివిటీ)ని పెంచడమెలా?
మంచి ఆలోచనలు, కల్పనలు కేవలం పిల్లలకూ, రచయితలకూ, కళాకారులకే సొంతం కాదు. నిజం చెప్పాలంటే ఆలోచన, కల్పన అన్నది ప్రతి ఒక్కరి మేధాసంపత్తిపై ఆధారపడివుంటుంది. ఈ కల్పనాశక్తిని మనం మనకు అనుకూలమైన విధంగా, లాభాన్ని తెచ్చేవిధంగా మలచుకోవచ్చు. తన కల్పనాశక్తి ఆధారంగా పేరుప్రఖ్యాతులు గడించిన సోమర్సెట్ మాం ఒకసారి "కల్పనాశక్తి కసరత్తువల్ల అధికమవుతుంది. అందరూ అనుకుల్లట్లు కాకుండా యువకులలోకంటే అనుభవజ్ఞులైన వారిలోనే శక్తివంతమైన కల్పనలు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి" అన్నాడు. [ ఇంకా...]
Monday, November 26
వంటలు - చిక్కుడుకాయ కూర
కావలసిన వస్తువులు:
చిక్కుడు కాయలు : 1/2 కిలో.
నూనె : 6 స్పూన్లు.
ఉప్పు, కారం, పసుపు : తగినంత.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
ఆవాలు : 1/2 స్పూను.
పచ్చిమిర్చి : 4.
జీలకర్ర : 1 స్పూను.
చిక్కుడు కాయలు : 1/2 కిలో.
నూనె : 6 స్పూన్లు.
ఉప్పు, కారం, పసుపు : తగినంత.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
ఆవాలు : 1/2 స్పూను.
పచ్చిమిర్చి : 4.
జీలకర్ర : 1 స్పూను.
తయారుచేసే విధానం:
చిక్కుడు కాయలు కడిగి ఈనలు తీసివేసి ముక్కలు చేసి పెట్టుకోవాలి, పొయ్యి మీద గిన్నె పెట్టి తాలింపు వేసి ఈ చిక్కుడు ముక్కలు వేసి, కారం, ఉప్పు వేసి కొంచం నీళ్ళు పోసి మగ్గే వరకు ఉంచి దించాలి. [ ఇంకా...]
మీకు తెలుసా - నోబెల్ బహుమతి నేపథ్య కథ
స్వీడెన్‌కు చెందిన నోబెల్ బహుమతి గురించి ప్రపంచమంతటికీ తెలుసు. 1833లో స్టాక్‌హోంలో జన్మించి, 1896 డిసెంబెర్ 10న శాన్‌రెమోలో మరణించిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాను అనుసరించి "ది నోబెల్ ఫౌండేషన్" స్థాపించబడింది. 1895లో నవంబర్ 27న వ్రాసిన వీలునామా ద్వారా ఆల్ఫ్రెడ్ నోబెల్ తన యావదాస్తిని 30 మిలియన్ క్రోనార్‌లకు మించినది (19.40 క్రోనార్లకు ఒక స్టెర్లింగ్ సమానం) ఒక నిధికి చట్టపూర్వకంగా వ్రాసి ఇచ్చారు. ఈ నిధిపై వచ్చే వడ్డీని అంతకుముందు సంవత్సరాలలో మానవాళికి అత్యంత ఉపయోగకరమైన సేవలందించిన వారికి ప్రతి సంవత్సరం చెల్లించాలని ఆ శాసనంలో వ్రాశారు. [ ఇంకా...]
విజ్ఞానం - మనోదక్షతకు మార్గాలు
తమ శక్తి సామర్ధ్యాలను పెంపొందించుకునేందుకు క్రీడాకారులు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. శారీరకంగా ఎంతో దృఢంగా తయారవుతూ మరిన్ని ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. ప్రతి మనిషీ ఏ రంగంలో ఉనా మానసికంగా కూడా అటువంటి శక్తి సామర్ధ్యాలను సంపాదించుకోవచ్చు. మానసికి శక్తి సామర్ధ్యాలను విస్తృతపరుచుకుంటే సావధానత పెరుగుతుంది. దానివల్ల కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే చతురత ఏర్పడుతుంది. అంతేకాకుండా ఒక ఉన్నతిని సాధించవచ్చు. అనేకమైన లాభాలను పొందవచ్చు. [ ఇంకా...]
నాటికలు - బాబోయ్ కవి
అంజి: (బస్కీలు తీస్తూ) : 95, 96, 97, 98, 99, 100 ...(అని బస్కీలు తీసి, అక్కణ్ణుంచి లేచి, రూంకి ఒక మూల పడేసున్న స్కిప్పింగ్ రోప్‌ని తీసుకుని కాసేపు స్కిప్పింగ్ చేసి, తాడుని దూరంగా విసిరేసి, చైర్ మీద ఆరేసున్న టవల్‌ని తీసుకుని మొహం తుడుచుకుని, క్రింద చాప మీద పడుకున్న మూర్తిని నిద్ర లేపుతూ) మూర్తీ! లేరా! (తట్టి) రేయ్ మూర్తీ! నిద్ర లేవరా! టైం ఎనిమిది దాటింది లే! లే! [ ఇంకా...]
Saturday, November 24
నీతి కథలు - అబద్దం తెచ్చిన అనర్థం
జగన్నాధం, శారదాదేవి దంపతుల ఏకైక కుమారుడు వాసు. వాసు కొంటెకుర్రవాడు. అల్లరి చిల్లర పనులు చేస్తే స్కూలుకి డుమ్మాలు కొట్టేవాడు.తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసేవికావు. ఒకరోజు వాసు స్కూలుకి ఎగనామంబెట్టి ఒక సైకిలు అద్దెకు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. అనుకోకుండా సైకిలు ఒక రాయికి గుద్దుకొని సైకిలు కిందపడి వాసుకి సైకిలు బ్రేక్స్ గుచ్చుకొని రక్తం కారుతుంది. [ ఇంకా...]
అందరి కోసం - అంత్యాక్షరికి ఉపయోగపడే పల్లవులు
రామచిలకమ్మా కొమ్మల్లో దాగిపోకమ్మా వాన చినుకమ్మ మబ్బులో ఆగిపోకమ్మా
చెంతే ఉన్న సొంతం కాని పాలరాతి బొమ్మా ఏంచేయాలే జంటే ఉన్న బ్రహ్మచారి జన్మ
చెప్పమ్మా చిన్నారి, చూపమ్మా నాదారి రామచిలకమ్మా. [ ఇంకా...]
చెంతే ఉన్న సొంతం కాని పాలరాతి బొమ్మా ఏంచేయాలే జంటే ఉన్న బ్రహ్మచారి జన్మ
చెప్పమ్మా చిన్నారి, చూపమ్మా నాదారి రామచిలకమ్మా. [ ఇంకా...]
వ్యక్తిత్వ వికాసం - మృత్యువుకు భయపడవద్దు
ఒక చెట్టునుంచి రాలే ఆకు మృత్యువుకి భయపడుతుందా? ఒక పక్షి మృత్యువుకు భయపడుతూ జీవిస్తుందని అనుకుంటున్నావా? మృత్యువు ఎప్పుడు వస్తే అప్పుడు దానిని అది కలుసుకుంటుంది. అంతేగాని మృత్యువును గురించి ఆందోళన చెందదు. కీటకాలను పట్టుకు తింటూ, గూళ్ళు నిర్మించుకుంటూ, పాటలు పాడుకుంటూ, నిశ్చింతగా జీవించడానికి కుతూహలపడుతుంది. [ ఇంకా...]
మీకు తెలుసా - దువ్వెన కథ
దువ్వెన జటిలమైన యంత్ర పరికరం కాకపోయినప్పటికీ అది ఏమిటో మనిషికి తెలియని రోజులు ఉండేవి. పురాతన ఈజిప్టులోని మనుషులు తమ కేశాలను మందు నీరు, తైలాలు, సుగంధ్ వస్తువులతో జాగ్రత్తగా సంస్కరించుకునేవారు. వారి జుట్టుని ఒక రకమైన ముళ్ళతో ఉన్న పుల్లలతోను, చేపల అస్థిపంజరాలతో దువ్వుకునేవారు. [ ఇంకా...]
Friday, November 23
పిల్లల ఆటల సూచిక - సెన్సిబుల్ గేమ్
ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
ఆడే స్థలం : గదిలో, ఆరుబయట ఆడవచ్చు.
కావలసిన వస్తువులు : కాఫీ పొడి, రెండు రకాల పళ్ళముక్కలు , టీ పొడి, మట్టి, సబ్బుబిళ్ళ, ఇంకు, నిమ్మ ఆకులు, ప్లాస్టిక్, చెక్క , ఈకలు, పెన్ను, ఏనుగు బొమ్మ, కళ్ళజోడు.
ఆటగాళ్ల వయస్సు : 6 సం రాల నుండి.
ఈ ఆట ఆడటానికి మనిషి కుండే సెన్సెస్-రుచి , వాసన, స్పర్శ లని ఉపయోగించాలి . ఆటలో పాల్గొనేవారి కళ్ళకి గంతలు కట్టాలి. [ ఇంకా...]
ఆడే స్థలం : గదిలో, ఆరుబయట ఆడవచ్చు.
కావలసిన వస్తువులు : కాఫీ పొడి, రెండు రకాల పళ్ళముక్కలు , టీ పొడి, మట్టి, సబ్బుబిళ్ళ, ఇంకు, నిమ్మ ఆకులు, ప్లాస్టిక్, చెక్క , ఈకలు, పెన్ను, ఏనుగు బొమ్మ, కళ్ళజోడు.
ఆటగాళ్ల వయస్సు : 6 సం రాల నుండి.
ఈ ఆట ఆడటానికి మనిషి కుండే సెన్సెస్-రుచి , వాసన, స్పర్శ లని ఉపయోగించాలి . ఆటలో పాల్గొనేవారి కళ్ళకి గంతలు కట్టాలి. [ ఇంకా...]
ఆధ్యాత్మికం - సన్మార్గ జీవితం
మన మనస్సు, మాట, ప్రవర్తన నిష్కల్మషంగా ఉండాలంటే ఒకటే మార్గం. ఎప్పుడూ సదాలోచనలతో, సత్కార్యాలు చేస్తూండాలి. సమర్ధ రామదాసు, తులసీదాసు, అప్పయ్య దీక్షితారు, తాయుమానపర్, పట్టినత్తార్ మొదలైన భక్తులు, తేవారం మొదలైన వాటిని రచించిన అందరూ భగవంతుని భక్తులుగా ఉంటూ మనసులోగానీ, చేతల్లోగానీ, ప్రవర్తనలోగానీ ఏనాడూ ఎట్టి పాపం ఆచరించలేదు. [ ఇంకా...]
Thursday, November 22
స్త్రీల పాటలు - సీతాదేవి పెండ్లి పాట
సీతాకళ్యాణ మహోత్సవ సమయము చూతము రారెచెలీ
రాతి నాతిగ చేసి ఘోరాసుర వర్గమునెల్ల దునిమి
భూమిజచేకొని జనకసుత ప్రఖ్యాతిగ వరించినాడట ...సీతా...
బంగారు మంటపాంతరమున నవరత్న శృంగార పీఠమందు
రంగుగ చేమంతి విరుల రంగుదండలు కాంతివైనుప్పొంగి
తొంగిచూచుటకు రఘుపుంగవుండు వేంచేసి వేడిన ...సీతా... [ ఇంకా...]
రాతి నాతిగ చేసి ఘోరాసుర వర్గమునెల్ల దునిమి
భూమిజచేకొని జనకసుత ప్రఖ్యాతిగ వరించినాడట ...సీతా...
బంగారు మంటపాంతరమున నవరత్న శృంగార పీఠమందు
రంగుగ చేమంతి విరుల రంగుదండలు కాంతివైనుప్పొంగి
తొంగిచూచుటకు రఘుపుంగవుండు వేంచేసి వేడిన ...సీతా... [ ఇంకా...]
వ్యక్తిత్వ వికాసం - వృద్ధ తరంగం - విశేషాలు
60 లేదా 60 సంవత్సరాలకు మించిన వ్యక్తులను ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం వారు వయసుమళ్ళిన వారిగా భావిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి 10 మందిలో ఒక వ్యక్తి 60 లేదా అంతకు మించిన వయసు కలిగివున్నారు. 2050 నాటికి మన జనాభాలోని 27 శాతం, 80 లేక అంతకుమించిన వారితో కూడివుంటుంది. వయసు మళ్ళిన వారిలో అధిక సంఖ్యాకులు ఆడవారు. 80 అంతకు మించి వయసున్న వారికో ఆడవారి శాతం 65. [ ఇంకా...]
మీకు తెలుసా - స్టెతస్కోప్
వైద్యులు గుండె, ఊపిరితిత్తులు, ఉదరం లాంటి అవయవాల చప్పుడు విని పరీక్షించడానికి వాడే స్టెతస్కోప్ ఒక పరికరం. దానిని రెని థియోఫిల్ హయసింత్ లేనెక్ అనే ఫ్రెంచ్ వైద్యుడు 1819లో కనుగొన్నాడు. 1781 నుండి 1826 వరకు జీవించిన లేనెక్ ప్రతిభాశాలియైన కల్పనాచరుతుడే కాక అనుభవశాలియైన వైద్యుడు కూడా. 1816లో అతను ఒక యువతిని పరీక్షించసాగాడు. [ ఇంకా...]
Wednesday, November 21
మీకు తెలుసా - కాఫీ
కాఫీ మొక్క గింజల నుండి తయారుచేయబడే వేడి పానీయం. కాఫీ దాక్షిణాత్యులకు అత్యంత ప్రియమైన పానీయం. మొత్తం ప్రపంచంలో కాఫీని అతి ఎక్కువగా వాడే దేశాలలో ఒకటిగా మన దేశం గుర్తింపబడుతోంది. ప్రాధమికంగా ఇది పాశ్చాత్యుల పానీయం. గ్రీన్ కాఫీ అన్నది ఒక ప్రత్యేక రకము. దీన్ని చాలామంది అమెరికన్లు ఇష్టపడతారు. 13వ శతాబ్దంలో కాఫీ గింజల నుండీ రుచికరమైన పానీయాన్ని అరబ్బులు తొలిసారిగా తయారుచేశారు. [ ఇంకా...]
విజ్ఞానం - ప్రణాళిక
మన రోజువారీ కార్యకలాపాలలో ప్రణాళిక అన్నది చాలా ముఖ్యమైనది. దీనికి మొదటి స్థానం ఇవ్వాలి. మనం చాలా ముందుగానే ప్రణాళికను తయారుచేసుకోవాలి. ముఖ్యంగా మన కోరికలను, లక్ష్యాలను సాధించాలనుకున్నప్పుడు బాగా ముందుగానే ప్రణాళికను తయారుచేసుకోవాలి. మన భవిష్యత్తును తీర్చిదెద్దుకోవడానికి ప్రణాళిక అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. [ ఇంకా...]
Tuesday, November 20
ఆధ్యాత్మికం - గురునానక్
గొప్ప సంఘసంస్కర్తగా, మత గురువుగా ప్రసిద్ధిని పొందిన గురునానక్ 15వ శతాబ్దానికి చెందిన అతి విశిష్టమైన వ్యక్తి. ఇతడు పవిత్రతనూ, న్యాయాన్నీ, మంచితనం, భగవత్ ప్రేమలాంటి విషయాలను గురించి ప్రజలకు ఉపదేశం ఇచ్చాడు. లాహోర్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న నగరం)కు సమీపంలో ఉన్న తల్వండి రాయె భోయిలోని ఖత్రీల కుటుంబంలో గురునానక్ 1469 ఏప్రిల్ 15వ తారీఖున పౌర్ణమి రోజున జన్మించాడు. [ ఇంకా...]
విజ్ఞానం - వ్యక్తిత్వ వికాసం
వ్యక్తిత్వం మనిషికి ఆభరణం లాంటిది. వ్యక్తిత్వం లేకపోతే మనిషి ఇతరులపై ఆధారపడవలసి వుంటుంది. ఇతరులపై ఆధారపడ్డప్పుడు మనిషికి గౌరవం వుండదు. గౌరవం లేని వ్యక్తి జీవితం దుఃఖమయమవుతుంది. దుఃఖం మనిషిని జీవితాంతం మానసికంగాను, శారీరకంగానూ కృంగదీస్తుంది. అందువల్ల వ్యక్తిత్వానికి అంత ప్రాముఖ్యత వుంది మరి. ప్రతి మనిషి తనదంటూ ఒక విశిష్టమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. వ్యక్తిత్వం వల్లనే మానవుడు మహనీయుడు కాగలడు. [ ఇంకా...]
సంగీతం - ముత్తుస్వామి దీక్షితర్
కర్ణాతక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితర్ 1775లో పుట్టాడు. రామ స్వామి దీక్షితర్, సుబ్బలక్ష్మి అంబాళ్ పుణ్యదంపతుల సంతానంగా వీరు పుట్టారు. భక్తిశ్రద్ధలుగల వ్యక్తి గుణగణాలను తన బాల్యంలోనే ఇతడు ప్రదర్శించాడు. తన తండ్రి వద్ద తెలుగు, సంస్కృతంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఈయన అభ్యసించాడు. [ ఇంకా...]
Subscribe to:
Posts (Atom)