మనం ఎవరితో మాట్లాడినా మాట్లాడే తీరు ముఖ్యం. మాట్లేడే తీరులో సభ్యత, సంస్కారం బయటపడతాయి. వ్యక్తిత్వం వెల్లడవుతుంది. అందుకే నోరు మంచిదయితే వూరు మంచిదవుతుందని పెద్దలంటారు. మాటలతో అందరి ప్రశంసలు పొందాలంటే కొన్ని సూచనలు పాటించాలి.
. సంభాషణను మొట్టమొదట చమత్కారంగా ప్రారంభించడానికి తగిన ప్రావిణ్యత, నైపుణ్యం సంపాదించాలి.
. సంభాషణ ప్రారంభించిన తర్వాత చిన్న చిన్న వ్యాఖ్యానాలతో హాస్య ధోరణిలో సంభాషణ కొనసాగిస్తూ ఉండాలి. దానివల్ల వ్యక్తిగత ప్రమేయం లేకుండా సంభాషణ సాఫీగా సాగిపోతుంది.
. ఆత్మీయులతో మాట్లాడినా, అపరిచితులతో మాట్లాడినా ఎదుటివాళ్ళ ముఖాన్ని అప్పుడప్పుడు పరిశీలిస్తూ వుండాలి. ఇందువల్ల మనం చెప్పేది జాగ్రత్తగా వింటున్నారా లేదా అని గమనించగలుగుతాం.
. వింటున్నారనుకుంటే మనం సంభాషణ సాగించాలి. లేదా ఎదుటి వాళ్ళ ఆసక్తిని కనిపెట్టి... [ఇంకా... ]