Monday, March 31

నీతి కథలు - డాబుసరి వేషాలు

తుంగభద్ర వొడ్డున పెద్ద అడవి. అడవిలో చెప్పలేనన్ని రకరకాల పక్షులు. వసంత ఋతువులో ఆ అడవి అందం చూడాలి! ఇంతా అంతా అనికాదు ఎంతో అందం! అంతకుమించిన ఆనందంతొ పక్షులు కలకలలాడుతూ ఉల్లాసంగా ఉండేవి. ఏటేటా వసంత ఋతువులో అడవి పక్షులన్నీ కలిసి పెద్ద పండగ చేసుకొనేవి. ఆ పండగలోనే తమ కొక 'పెద్ద' ని యెంచుకొనేవి. ఒక పండగకు పక్షులు వరుణుణ్ణి రావలసిందని ఆహ్వానించాయి. మబ్బు గుర్రాల్ని కట్టుకుని గాలిరథం యెక్కి వరుణుడు వచ్చాడు. మబ్బుల్ని చూస్తే చాలు నెమళ్ళు పురివిప్పి నృత్యం చేస్తాయి. [ఇంకా... ]

Saturday, March 29

సాహిత్యం - మాట

ఏ భాషలోనైనా భాష యొక్క శబ్ద స్వరూపంలోను, నిర్మాణంలోను జరిగే మార్పుల వల్ల, పదజాలానికి అర్ధంలో కలిగే మార్పుల వల్ల భాషా పరిణామం జరుగుతూంటుంది. పదజాలానికి అర్ధంలో కలిగే మార్పుల వల్ల అర్ధ విపరిణామం కూడా జరుగుతుంది. పద స్వరూపం మార్పు చెందకుండానే అర్ధ విపరిణామం జరుగవచ్చు. పద స్వరూపం మారినప్పుడు అర్ధం మార్పు చెందాలనే నియమం ఉండదు. తెలుగు భాషా పదజాలంలో ధ్వని అనుకరణ పదాలు, నిష్పన్న రూపాలు, తద్దిత రూపాలు, సమాసాలు, శబ్ద పల్లవాలు, ఆమ్రేడిత రూపాలు, లక్ష్యార్ధ ప్రయోగాలు, జాతీయాలు అనేకార్ధ పదాలు ఉన్నాయి. తెలుగు దేశ చరిత్రలో విజయనగరం, కొండవీడు, నెల్లూరు, అద్దంకి, రాజమహేంద్రవరం, వరంగల్లు, చంద్రగిరి వేరు వేరు కాలాలలో రాజధానులుగా ఉండేవి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - కాండిల్ లైట్ పోటీ

ఎంతమంది పాల్గొనవచ్చు : 4
ఆడే స్థలం : గదిలో
కావలసిన వస్తువులు : కొవ్వొత్తులు 4, అగ్గిపెట్టెలు 4
ఆటగాళ్ళవయస్సు : 6 సంవత్సరాలు
పోటీ సమయం : 2 నిమిషాలు

ఆటగాళ్ళు గదిలో కూర్చోవాలి. అందరిముందు ఒక్కొక్క కొవ్వొత్తి అగ్గిపెట్టెని ఉంచాలి. లీడర్ స్టార్ట్ చెప్పగానే ఆటగాళ్ళు తమ ముందున్న కొవ్వొత్తులను అగ్గిపెట్టెతో వెలిగించాలి. [ఇంకా... ]

Thursday, March 27

పిల్లల పాటలు - కృష్ణ వేణి

బిరబిరా చరచరా ముందునకు సాగేవు
చివరకా మున్నీట మాయమై పోయేవు
పరుగులిక చాలునే ఓ కృష్ణవేణి!
కరుణించవే మమ్ము నిత్యకల్యాణి!

తెలియదటనే నీకు మున్నొక్కనాడు
కలిమిలో పేరొందె మా తెలుగునాడు
తొలగిపోయిన వెనుక ఆ గొప్ప సిరులు,
అలముకొన్నవి తల్లి చీకటుల తెరలు! [ఇంకా... ]

Tuesday, March 25

వంటలు - మైదాపిండితో పాల బూరెలు

కావలసిన వస్తువులు:
మైదాపిండి - 1/2 కిలో.
పంచదార లేక బెల్లం - 400 గ్రా.
నూనె - 1/2 కిలో.
యాలుకలు - 10.
పాలు - సరిపడా.

తయారుచేసే విధానం:
మైదా పిండిని శుభ్రంగా జల్లించుకోవాలి. పాలల్లో పంచదార లేక బెల్లాన్ని నాననివ్వాలి. మైదాపిండిని కలపాలి. అట్లపిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి. యాలకుల పొడి కూడా వేసి కలపాలి. [ఇంకా... ]

Friday, March 21

నీతి కథలు - జ్ఞానోదయం

వేసవి సెలవులు ముగియగానే తిరిగి పాఠశాలలు తెరిచారు. పాత కొత్త విద్యార్థులతో పాఠశాల కళకళలాడసాగింది. ఐదో తరగతి చదువుతూ పాఠశాలకు డుమ్మా కొట్టిన అనిల్ పుస్తకాల సంచిని తగిలించుకొని తన చిట్టి తమ్ముడిని వెంట బెట్టుకొని పాఠశాలలోకి అడుగుపెట్టాడు.
అనిల్‌ని చూడగానే ఆనందంగా సత్యం మాస్టారు బాబూ! అనిల్ ప్రభుత్వ ఉత్తర్వులమేరకు వేసవిలో పాఠశాల పెట్టి నీలాంటి బడి మానేసిన పిల్లలకు పాఠాలు చెప్పడం మేలే అయ్యింది. [ఇంకా... ]

Thursday, March 20

నీతి కథలు - కుక్క బుద్ధి - చీమ సుద్దు

అదొక ఖాళీ ప్రదేశం. వీధిలో రెండు ఇళ్ళ మధ్యన ఉంది. ఆ వీధి వారందరికీ ఆ ఖాళీ స్థలం ఓ చెత్త కుండీలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ స్థలానికి యజమాని ఒక నల్లకుక్క! ఆ నల్ల కుక్క, చుట్టు ప్రక్కల ఇళ్ళ వారు, తిని పారవేసిన విస్తరాకులలోని మెతుకులు తింటూ, ఆ దొడ్డిలో నలుమూలలా తిరుగుతూ ఉంటుంది. ఏ మూల ఏ చప్పుడైనా ఉలిక్కి పడి చూస్తూ!కోపంగా గుర్రుపెడుతుంది ఆ కుక్క. ఎప్పుడైనా మరో కుక్క ఆ స్థలంలోకి వచ్చిందంటే దాని మీద పడి, రక్కి, కరిచి ఆ కుక్కను అవతలకు తరిమివేస్తుంది. [ఇంకా... ]

Tuesday, March 18

శతకాలు -శ్రీ నరసింహ శతకము

సీ|| నరసింహ! నీ దివ్యనామ మంత్రము చేత
దురితజాలము లెల్లఁదోలవచ్చు,
నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత
బలువైన రోగముల్ బాపవచ్చు,
నరసింహ! నీ దివ్యనామమంత్రము చేత
రిపు సంఘముల సంహరింపవచ్చు,
నరసింహ! నీ దివ్య నామమంత్రము చేత
దండహస్తుని బంట్లఁ దఱుమవచ్చు. [ఇంకా... ]

నీతి కథలు - ఎప్పుడో చదువుకున్న చందమామ కథ

అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో సౌరభూడు (అసలు కథలో పేరు గుర్తు లేదు ప్రస్తుతానికి సౌరభుడు అని అనుకుందాం) అందరితో పాటే వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. కానీ అప్పుడప్పుడూ ఆశువుగా కవిత్వం చెప్పేవాడు. విన్న నలుగురూ బాగుంది, బాగుంది అనేవారు. అలా మొదలై ప్రతి రోజూ మద్యాహ్నం భోజనం వేళ ఇతను కవిత్వం చెప్పడం తోటి వారంతా చేరి బాగు బాగు అనడం ఓ దినచర్యలా మారిపొయింది. [ఇంకా... ]

Monday, March 17

సాహిత్యం - తెలుగు సామెతల్లో స్త్రీ

సామెత సమానార్ధం కలది. చెప్పదలుచుకున్న మాటకు పర్యాయపదంగా మరోమాట చెప్పడం. సామెతలు నిత్యజీవితంలో జన వ్యవహారంలో వినవచ్చునటువంటి సర్వసాధారణమైన వాక్యాలు. వ్యక్తి జీవితంలోనూ, సంఘ జీవితంలోనూ అనుభవంచేత గోచరమగు సత్యాలు సామెతలందు ఇమిడివుంటాయి. సామెత అను పదంలో సామ్యము అంటే పోలిక ఉండుటచే సామెతలు అలంకారములకు ఆయువుపట్టులాంటివి. యతిప్రాసలకు ప్రాణంవంటివి. అనిర్వచనీయమైన గుణమేదో సామెతల్లో ఇమిడియుండుటచే కాలక్రమేణా దేశంలో ఆనోటా ఈనోటా పడి నలిగి ఎక్కువ వాడుకలోకి వచ్చాయి. [ఇంకా... ]

Saturday, March 15

పిల్లల పాటలు - ఎందుకురా?

ఎండలు కాసేదెందుకురా?
మబ్బులు పట్టేటందుకురా.
మబ్బులు పట్టేదెందుకురా?
వానలు కురిసేటందుకురా.
వానలు కురిసేదెందుకురా?
చెరువులు నిండేటందుకురా.
చెరువులు నిండేదెందుకురా? [ఇంకా... ]

Friday, March 14

నీతి కథలు - ఇది నిజం

ఓ ఊరిలో ఇద్దరు మిత్రులున్నారట వారిద్దరూ ఎప్పుడూ ఏదో విషయంగా వారు వాదులాడుకుంటూనే ఉంటారట. ఆ ఊరి వాళ్ళకు వీరి గోల తెలిసినా, క్రొత్తగా ఆ ఊరు వచ్చిన ఆసామికి వీరి గోల తలనొప్పిగా అనిపించి మిత్రులంటే ఏకమాటగా, ఏకత్వంగా, శాంతియుతంగా ఉండాలే కానీ, అయినదానికీ, కానిదానికీ కీచులాడుకునే వాళ్ళు అసలు మిత్రులెలా అవుతారు. అని అనుకొని ఆ విషయమే వారిని సూటిగా అడుగుతూ "మొగుడూ పెళ్ళాల మైత్రి ఎలాంటిదో గాఢ మైత్రి బంధం కూడా అంతే, అంటే భార్య కోపిస్తే భర్త సర్దుకుపోవాలి, భర్త కోపిస్తే భార్య తగ్గాలి. [ఇంకా... ]

Thursday, March 13

నీతి కథలు - తప్పింపతరమా

సింగడి పేరు చెబితే పసిపిల్లలు కూడా ఏడుపు మానేస్తారు. సింగడి పేరు చెబితే పాములు కూడా పడగలు వాలుస్తాయి. సింగడి పేరు చెబితే సింహాలు కూడా తోకలు ముడుస్తాయి. సిరిపురం సింగడంటే గజదొంగలు కూడా తలలూపుతూ కిటికీలతో సహా మూసుకుంటారు. సింగడికి సిబ్బంది లేదు. తోటి దొంగలు లేరు. అతని సైన్యం అంతా అతనొక్కడే. చాలా తెలివితేటలుగా దొంగతనాలు చేస్తాడు. వేషాలు మార్చడం, భాషలు మార్చడంలో సింగడికి సింగడే సాటి. పగలంతా సందుకో వేషంలో తిరుగుతూ తను దొంగతనం చేయ్యాలనుకున్న యింట అనుపాన్లు, గుట్లు గ్రహిస్తాడు. నాలుగయిదు రోజులు ఆ ఇంటి వాళ్ళు తన వేషాన్ని మర్చిపోయేంత వరకూ మౌనంగా ఉండిపోతాడు. [ఇంకా... ]

Wednesday, March 12

భరతమాత బిడ్డలు - సి.వి. రామన్

శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి. రామన్)
పేరు :శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి. రామన్)
తండ్రి పేరు :(తెలియదు)
తల్లి పేరు : పార్వతి అమ్మాళ్
పుట్టిన తేది : 7-11-1888
పుట్టిన ప్రదేశం : తమిళనాడులోని తిరుచినాపల్లి
చదివిన ప్రదేశం : లండన్
చదువు : ఐసియస్
గొప్పదనం : కాంతి పరిక్షేపనం గురించి పరిశోధనచేసి అందులో విజయంసాధించారు. ఈయనకు బ్రిటీషువారు నైట్‌హుడ్ అనే బిరుదునిచ్చింది. భారత ప్రభుత్వం నోబెల్ బహుమతిని అందజేసింది.
స్వర్గస్తుడైన తేది : 20-11-1970
భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్). [ఇంకా... ]

Friday, March 7

వంటలు - వెన్న ఉండలు

కావలసిన వస్తువులు:
బియ్యంపిండి - అర కిలో.
నూనె - అర లీటరు.
నువ్వులు - 100 గ్రా.
వాము - 2-3 చెంచాలు.
ఉప్పు - సరిపడినంత.
కారం - సరిపడినంత.

తయారుచేసే విధానం :
వాము నూరుకోవాలి. నీళ్ళు మరిగించి అందులో ఉప్పు కారాలు జీలకర్ర, వాము వెయ్యాలి. [ఇంకా... ]

Thursday, March 6

వంటలు - పెసర ఆవకాయ

కావలసిన వస్తువులు:
పుల్లమామిడి కాయలు : 8.
పెసరపప్పు : 1/4 కిలో.
నువ్వుల నూనె : 1/2 కిలో.
కారం : 1/4 కిలో.
ఉప్పు : 1/4 కిలో.
మెంతులు : 1 టీ స్పూను.
ఆవాలు : 1 టీ స్పూను..
ఇంగువ : చిటికెడు.
పసుపు : చిటికెడు.

తయారుచేసే విధానం:
మామిడి కాయలను శుభ్రంగా కడిగి టెంకతో సహా ముక్కలుగా కోసి పొడిగుడ్డతో తుడిచి ఉంచుకోవాలి. పెసరపప్పుని ఓ బాణలిలో వేయించి మెత్తగా పొడి చేయాలి. పొడిగా ఉన్న పాత్ర తీసుకొని అందులో ముక్కలు, పొడి, ఉప్పు, కారం, పసుపు, పావుకిలో నూనె వేసి బాగా కలపాలి. [ఇంకా... ]

పండుగలు - మహాశివరాత్రి

మనకు సాధారణంగా ప్రతినెల కృష్ణచతుర్దశి రోజున 'శివరాత్రి' వస్తూనే ఉంటుంది. దానిని 'మాసశివరాత్రి' గా భావించి శివానుగ్రహం పొందుటకు ఆ రోజు ఈశ్వరునకు విశేష పూజలు చేయిస్తూ ఉంటారు. అందులో అత్యంత విశిష్టమైనది, మాఘ బహుళ చతుర్ధశినాడు వచ్చేది 'మహాశివరాత్రి' పర్వదినం. ఇది శివపార్వతులకు ఎంతో ప్రీతికరమైనది.శివాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమశ్శివాయ|| (శివపంచాక్షరీ స్తోత్రం)
ఇట్టి మహేశ్వరుడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సర్వవ్యాపకుడు. సర్వాంతర్యామియై ఈ చరాచర ప్రపంచం అంతట వ్యాపించి ఈ సహజ లక్షణాలతో ఆయన నిరాకారుడయ్యాడు. [ఇంకా... ]

Wednesday, March 5

నీతి కథలు - స్వామీజీ - సొమ్ములు

ఆ మండలంలో అదే పెద్ద ఊరు. పూర్తిగా పట్టణం అనలేం, అలాగని పల్లెటూరు కాదు. మధ్యస్తంగా ఉంటుంది. ఆ ఊరిలో హైస్కూలు ఉంది, లైబ్రరీ ఉంది, రెండు మూడు ఆఫీసులూ వున్నాయి. భాస్కర్ పంచాయితీ ఆఫీసు గుమస్తా. ఆయన దగ్గర తెలుసుకోదగ్గ విశేషాలేమీ లేవు గానీ, అతని భార్య శారద గురించి మాత్రం వివరంగానే చెప్పుకోవాలి. మంచి భక్తిగలది. ముఖ్యమైన దేవాలయాల్లో నిత్యం పూజలు, అభిషేకాలు చేయిస్తూ వుంటుంది. పిల్లలలో ఎవరికి జబ్బు చేసినా తాను ఉపవాసాలుంటుంది. ప్రతి శుక్రవారం పేదలకు పైసలు పంచుతుంది. [ఇంకా... ]