Monday, August 31

సాహిత్యం - సాహిత్యం అంటే

సమాజము యొక్క ప్రతిబంబమే సాహిత్యం. వర్తమాన సమాజంలోని జీవన పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, ఇంకా ఆయా సమాజాలను ప్రభావితం చేసే అనేక ఇతర అంశాల ఛాయాచిత్రమే సాహిత్యం. పురాతన సమాజాలను అధ్యయనం చేయడం అధునాతన సమాజాల ఆవిర్భావానికి హేతువులాంటిది. సమాజ అధ్యయనం సాహిత్యం ద్వారా సులువు కాబట్టి సాహిత్య అధ్యయనాన్ని సమాజంలోని ప్రతి వ్యక్తీ అలవాటు చేసుకోవాలి. సాహిత్యం మన సంస్కృతి పట్ల మన బాధ్యతను మనకు గుర్తుచేస్తుంది. మన సంప్రదాయంలోని మాధుర్యాన్ని మనకు తెలియజేస్తుంది. మనలో సంస్కారాన్ని కలిగిస్తుంది. ఈవిధంగా సమాజానికి హితం చేస్తుంది కాబట్టే అది సాహిత్యం అయ్యింది... [ఇంకా... ]

Saturday, August 29

తెలుగు - తెలుగు సంవత్సరాలు

ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పతి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభావ, తారణ, పార్ధివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరీధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల... [ఇంకా... ]

Friday, August 28

పుణ్యక్షేత్రాలు - యాదగిరి గుట్ట

విజయవాడ - హైదరాబాదు రైలు మార్గంలో రాయగిర్ స్టేషనుకు సుమారు 7కి.మీ. దూరంలో వుంది. స్టేషను నుండి బస్సులు, టాంగాబండ్లు చాలా వున్నాయి. ఇది యాదగిరికొండ మీద నున్న శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రము. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రధానమైన యాత్రాస్ధలం.
ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 315 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకోవచ్చు. కాని కొండమీదికి నేరుగా బస్సులు కూడా ఉన్నాయి. తిరుమల - తిరుపతి, శ్రీశైలంలలో మాదిరిగా కొండమీద అనేక సత్రాలున్నాయి. [ఇంకా... ]

Thursday, August 27

వంటలు - కాకరకాయ కూర

కావలసిన వస్తువులు:
కాకరకాయలు - 1 కిలో.
నూనె - 150 గ్రా||.
మినపప్పు - 25 గ్రా||.
శనగపప్పు - 25 గ్రా||.
ఎండుమిర్చి - 25.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం :
కాకరకాయ గర్భాన కాస్త లోతుగానూ, విడిగానూ గాట్లు పెట్టి వుడికించి వార్చి వుంచాలి. ఒట్టిమూకుట్లో మినప్పప్పు , శనగపప్పు, ఎండుమిర్చి వేయించి సరిపడా ఉప్పు, కారం కొట్టాలి. [ఇంకా... ]