Saturday, September 4

పండుగలు - ఉపాధ్యాయ దినోత్సవం

నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి

ఐనా ఆదియుగంనుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి

జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు

సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు

అతడు... ఉపాధ్యాయుడు - సృష్టి స్థితి లయల నిర్దేశకుడు !

పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠశాలకూ, పాఠ్య బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయుడికీ సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టకూడదు. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలేదు. బ్రతుకుతెరువుకోసం పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది. అనిర్వచనీయమైనది. ఆయన తరగతిలో చెప్పే ప్రతి పాఠమూ ఒక సూక్తి వంటిది. [ఇంకా... ]