Monday, April 28

వంటలు - పాన్ కేక్స్ (క్రిస్మస్ కేకులు)

కావలసిన వస్తువులు:
కరిగించిన వెన్న - 100 గ్రా.
పంచదార పొడి - 1/2 కప్పు.
ఆరంజ్ రసం - సగం పండు.
పైనాపిల్ ముక్కలు - 1 కప్పు (సన్నగా తరిగినవి).
మైదాపిండి - 2కప్పులు.
జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు - 2 చెంచాలు.
మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ - 100 గ్రా.

తయారు చేసే విధానం:
పంచదార పొడిని ఆరంజ్ రసంలో కలిపి, వెన్న, పిండి కూడా చేర్చి పిండిని కొంచం జారుగా కలుపుకోవాలి.[ఇంకా... ]

పిల్లల ఆటలు - అష్ట చెమ్మ

ఎంతమంది ఆడవచ్చు : ఇద్దరు లేదా నలుగురు లేదా, రెండు జంటలు ఎదురెదురుగా కూర్చొని ఆడతారు.
గవ్వలు గాని, చింతపిక్కలు గాని, అరగదీసి గాని పిక్కలను కుదిపించి ఆడాలి. పిక్కలను సమయోచితంగా కదుపుతూ, ఎదుటి వ్యక్తి పిక్కలను చంపుతూ ముందుకు దూసుకుపోవటం విజేతలక్షణం.[ఇంకా... ]

Friday, April 25

నీతి కథలు - తెచ్చిపెట్టుకొన్న తిప్పలు

గోవిందప్ప కోనేట్లో కోటి రకాల కప్పలు ఉన్నాయి. బావురు కప్పలు, పచ్చ కప్పలు, వాన కప్పలు, గోండ్రు కప్పలు, చిరు కప్పలు ఇలా ఎన్నెన్నో రకాలు. అవన్నీ కలిసిమెలిసి బ్రతుకుతున్నాయి. ఎండా, వానా తేడా లేకుండా ఎరపొరుపులు రాకుండా ఎల్లకాలం చల్లగా జీవిస్తున్నాయి. చీకూచింతా లేకుండా హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి.
కోనేటికి నాలుగు వైపులా రాతిమెట్లున్నాయి. సాయంత్రమయ్యే సరికి నగరంలో వాళ్ళంతా మెట్ల మీదకి చేరుకునేవాళ్ళు వెన్నెల రాత్రిళ్ళలో ఆ మెట్ల మీదే గడిపేవాళ్ళు. వాళ్ళు చేసే చర్చలు, వాదనలు కప్పలు వింటూ వుండేవి. రానురాను మనుషుల పద్ధతులన్నీ కప్పలకు అంటుకున్నాయి. కొంత కాలానికి కప్పలు సరికొత్త విషయం ఒకటి తెలిసింది. మనుషులు తమను పాలించడానికి ఒక 'రాజు' ని ఎన్నుకున్నారట![ఇంకా... ]

Thursday, April 24

భరతమాత ముద్దు బిడ్డలు - కందుకూరి వీరేశలింగం

పేరు : కందుకూరి వీరేశలింగం
తండ్రి పేరు : (తెలియదు)
తల్లి పేరు : (తెలియదు)
పుట్టిన తేది : 16-4-1848
పుట్టిన ప్రదేశం : రాజమండ్రి
చదివిన ప్రదేశం : రాజమండ్రి
చదువు : (తెలియదు)
గొప్పదనం : బాల్యవివాహాలను అరికట్టి, వితంతువుల పునర్వివాహలను ప్రోత్సహించారు.
స్వర్గస్తుడైన తేది : 27-5-1919

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ సాంఘీక సంస్కర్త కందుకూరి వీరేశలింగం. 1848 ఏప్రిల్ 16 న రాజమండ్రిలో ఒక సంపన్న కుటుంబంలో ఇతడు జన్మించెను. పాఠశాలలో చాలా చురుకుగా ఉండేవాడు. ఇతడు నాలుగోతరగతి చదువుతుండగా, ఉత్తమ విద్యార్ధి ఎవరు ఆనే ప్రస్తావన వచ్చినప్పుడు, విద్యార్ధుల్లో చాలా మంది ఇతని పేరును సూచించారు.[ఇంకా... ]

Wednesday, April 23

నీతి కథలు - పాలు ముట్టని పిల్లి

విజయనగరములో నివసించుచున్న ప్రజలకు ఎలుకల బాధ భరించరానిదైనది. ప్రభుత్వము ప్రజలను పిల్లులను పెంచమని ప్రోత్సహించినిది. రాయలవారు ప్రభుత్వోద్యోగులకు పిల్లులను ఉచితంగా యిప్పించారు. పిల్లులను పెంచుటకు పాలు అవసరము. కావున ఒక్కొక్క ఆవును కూడా యిప్పించినారు.
ప్రభుత్వోద్యోగులతోపాటు కవులకు, పండితులకు కూడా ఒక్కొక్క పిల్లిని, ఒక్కొక్క ఆవును యిచ్చినారు. అందరితోపాటు రామకృష్ణ కవికి కూడా ఒక పిల్లిని, ఒక ఆవును ఇచ్చినారు. రామకృష్ణుడు పిల్లిని సరిగా పెంచలేదు.[ఇంకా... ]

Monday, April 21

చిట్కాలు - బట్టలకు సంబంధించినవి

మగవారి కోటు, ప్యాంటు గుండీలు సన్నటి నైలాన్ దారంతో కుడితే చాలా కాలం తెగకుండా ఉంటాయి.
మీ పిల్లల వైట్ సాక్స్ బ్రౌన్ గా తయారయ్యాయా? నీటిలో రెండు లెమన్ స్లయిసెస్ వేసి ఆ నీటిలో ఈ సాక్సును వేసి నీటిలో బాయిల్ చేసి ఆ పైన ఉతకండి చాలు సాక్స్ తెల్లగా మెరిసిపోతాయి.
లెదర్ సోఫా పైన పిల్లలు క్రేయాన్స్ తో గీస్తే, వంటసోడా ఉప్పు కాస్త నీరు కలిపి పేస్టులా చేసి ఈ పేస్టుతో రుద్దితే మరక తొలగిపోతుంది.
సిల్క్ బట్టలు నీడలోనే ఆరవేయాలి.[ఇంకా... ]

నీతి కథలు - ఏ గుళ్ళో పెళ్ళి

పరంధామయ్య గారికి ఏడుగురు కుమార్తెలు. ఆరుగురికి వివాహాలు పూర్తి చేశాడు. కాని ఏడవకుమార్తె వివాహము గురించి సంబంధాల కోసము తెగ ప్రయత్నము చేశాడు. ఎక్కడా సరియైన సంబంధము దొరకలేదు. ఒక రోజున పరంధామయ్య పట్నంలో ఉన్న చిన్నప్పటి బాల్యస్నేహితుని ఇంటికి వెళ్ళాడు. ఆయనకు, పరంధామయ్యగారికి దూరపు చుట్టరికం కూడా వుంది. ఆయనే ఒక సంబంధం గురించి చెప్పి వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. ఆ సంబంధము పరంధామయ్య గారికి నచ్చింది. పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు.[ఇంకా... ]

Thursday, April 17

నీతి కథలు - ప్రాణం తీసిన గొప్ప

అది ఒక పెద్ద చెట్టు. దాని మొదలు దగ్గర కొన్ని రకాల రెక్కల పురుగులు చేరి, కబుర్లాడు కొంటున్నాయి. ఆ కబుర్లు పెరిగి పెరిగి, చివరికి మనలో ఎవరుగొప్ప? అనే వివాదానికి వచ్చింది!

ఆ పురుగులలో ఒక రెక్కల చీమ గబగబా ముందుకు వచ్చి చూడండి! నేను నేలమీద పాకగలను, గాలిలో ఎగరగలను 'నేనే గొప్ప' అంటూ అటూ ఇటూ తిరిగింది చరచరా! అది చూసి ఒక చీకురు పురుగు తన పెద్ద రెక్కలను ఆడిస్తూ చూడండి నా రెక్కలు ఎంత పెద్దవో, మీలో ఇంతంత పెద్ద రెక్కలు ఎవరికీ లేవు 'నేనే గొప్ప' అంది గర్వంగా, తన రెక్కలను చూసుకొంటూ, చూపిస్తూనూ! [ఇంకా... ]

Tuesday, April 8

పిల్లల ఆటలు - చెయిన్ కట్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా ఆడవచ్చు.

ఈ ఆటలో లీడర్ ఉండాలి. లీడర్ ముందుగా చిన్న చిన్న తెల్ల కాగితాలపై రకరకాల పనులు రాసి మడత పెట్టాలి. అంటే ఒక దాంట్లో పాట పాడాలి, రెండవ దాంట్లో పకపకానవ్వాలి, వరుసగా కుంటుకుంటూ రావాలి, బ్రహ్మానందం లాగా మాట్లాడాలి., బాలకృష్ణ లాగా డైలాగ్ లు చెప్పాలి అని రాయాలన్నమాట. కూర్చున్న పిల్లలందరికి తలొకటి ఇచ్చి అవి విప్పి లోపల ఉన్నది చెప్పి వరుసగా అవి చేయ్యాలని చెప్పాలి.
[ఇంకా... ]

Saturday, April 5

వంటలు - ఉగాది పచ్చడి

కావలసిన వస్తువులు:
మామిడి కాయ - ఒకటి(చిన్నది)
వేప పూత - కొంచెం
సన్నవి కొబ్బరి ముక్కలు - కొన్ని
చింతపండు - 100గ్రా
బెల్లం - 100గ్రా

తయారు చేసే విధానం :
ముందుగా చింతపండుని 1 గంట సేపు నానబెట్టి ఈనెలు రాకుండా పేస్టు తీసుకోవాలి. తరువాత వేప పూతని శుభ్రంగా పుల్లలు లేకుండా తీసుకోవాలి. మామిడి కాయని చిన్న ముక్కలుగా తరగాలి. [ఇంకా... ]

పండుగలు - ఉగాది

'బ్రహ్మ ప్రళయం' పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని 'బ్రహ్మకల్పం' అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయమును 'ఉగాది' అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ 'ఉగాది' పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభ మవడం వల్ల ఆరోజునుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.
ఈ పండగ ప్రత్యేకత 'ఉగాది పచ్చడి.' ఈ పచ్చడిలో చేరే పదార్ధాలలో వేప పువ్వు ముఖ్యమైనది. బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి ముక్కలు, కొన్ని ప్రాంతాలలో అరటిపళ్ళ గుజ్జు కూడా చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఈ చక్కని లోకం

ఎంత చక్కనిది ఈ లోకం
ఎందుకోయి ఇంకొక లోకం

కళ కళ లాడే సూర్యుడు, చంద్రుడు
మిల మిల మెఱసే చుక్కల గుంపులు
తళ తళ లాడే మెఱపు తీవలూ
కావటోయి అవి మనకోసం?

జలజల పాఱే ఏఱులు, నదులూ
తెలితెలి నురువుల సంద్రపు టలలూ
నవ నవ లాడే పచ్చని కోనలు
లేవటోయి అవి మనకోసం? [ఇంకా... ]

Friday, April 4

పిల్లల పేర్లు - య నుంచి ఱ వరకు

య నుంచి ఱ వరకు

యక్షణ, యక్షిణి, యమున, యల్లమ్మ, యవ్వని, యశస్విని, యశోద, యశోధర, యశ్వంత, యాగ్నిక, యాఘ్న, యాదగిరమ్మ, యాదమ్మ, యామిని, యామినీపుష్ప, యువతి, యువరాణి, యోగకుసుమ, యోగప్రియ, యోగమల్లిక, యోగలక్ష్మి, యోగవల్లి, యోగానందిత, యోగిత, యోగిని, యోగేశ్వరి. [ఇంకా... ]

Wednesday, April 2

సంస్కృతి, సంప్రదాయాలు - వ్రతములు

వ్రతములు
మన వైదిక సంస్కృతి మానవాళికి సాంప్రదాయాలను తెలియజేస్తూ సాధించవలసిన అంతిమ లక్ష్యం కోసం విధానాలను ఏర్పరిచాయి. మన యొక్క అంతిమ లక్ష్యం సత్యమును తెలుసుకొనుటమే. ఆ సత్యమును తెలుసుకొనుటకు వ్రతము యొక్క ఆవశ్యకతను గురించి ఈ శ్లోకంలో తెలియజేయబడినది.

శ్లోకం:
వ్రతేన దీక్షా మాప్నోతి దీక్షామాప్నోతి దక్షిణాం
దక్షిణాం శ్రద్ధా మాప్నోతి శ్రద్దయా సత్య మాప్యతే
వ్రతము వలన దీక్ష, దీక్ష వలన దక్షిణ, దక్షిణ వలన శ్రద్ధ, శ్రద్ధ వలన సత్యం లభిస్తుంది. కనుక మనము విధిగా వ్రతాలను ఆచరించాలి
వ్రతమనగా నియమిత సమయంలో నిర్దేశించిన కార్యమును ఆచరించుట. [ఇంకా... ]

Tuesday, April 1

అందరికోసం - హాస్య సంపద

టునాట్‌ఫోర్
ఏ మోయ్ టునాట్‌ఫోర్! టోపీ లేకుండా స్టేషన్‌కి ఎందుకొచ్చావు అడిగారు యస్.ఐ. ఇంటి నుండి టోపీతోనే బయలుదేరాను సార్! కానీ దారిలో ఎవడో కొట్టేశాడు సార్.

రేషన్ కార్డు
మీ వంటికి బియ్యం, పంచదార, గోధుమ,నూక, బియ్యం పడవు కాబట్టి.... అని డాక్టర్ చెపుతుండగా!
పేషంట్ : నా రేషన్ కార్డు మాత్రం చస్తే యివ్వను. [ఇంకా... ]