Saturday, October 24

పిల్లల పాటలు - జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం...

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

అర్జునుడు తిన్న అరటి పండ్లరిగి

భీముడు తిన్న పిండివంటలరిగి

గణపతి తిన్న ఖజ్జాలరిగి... [ఇంకా... ]

Friday, October 23

న్యాయ వ్యవస్థ - హైకోర్ట్

రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నది హైకోర్టు. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒకే హైకోర్టు ఉండేటట్లు పార్లమెంటు చట్టం చేయవచ్చు. మొత్తం భారతదేశంలో 21 హైకోర్టు‌లు ఉన్నాయి. ఒక్కొక్క హైకోర్టు‌లో ఒక్కొక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. ఈ న్యాయమూర్తిని ప్రెసిడెంట్ నియమిస్తాడు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి... [ఇంకా... ]

Thursday, October 22

పండుగలు - సుబ్రహ్మణ్య షష్ఠి

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము!

పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల... [ఇంకా... ]

Wednesday, October 21

సాహిత్యం - తెలుగు సాహిత్యంలో పేరడీ

పేరడీ అంటే అనుకరణ. అనుకరణ చెయ్యని ప్రాణి ఈ సృష్టిలో ఉండదు. శిశువు పుట్టినది మొదలు తన పరిసరాలను గ్రహిస్తూ అనుకరిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులను అనుకరిస్తూ ఎదుగుతుంది. అనుకరణకు సాధ్యంకాని రంగం ఈ సృష్టిలో లేదు. కళా రంగంలో ఈ అనుకరణ సర్వసామాన్యంగా ఉంటుంది. ఒక కళాకారుడు సృష్టించిన కళాభినయం తరువాతి తరాలకు అనుకరణయోగ్యంగా ఉంటుంది. ఆ కళాకారుని చాతుర్యాన్ని అనుసరిస్తూ అనేక ఇతర కళాభినయాలు ఆవిష్కరణకు నోచుకుంటాయి. తాము అనుకరించే కళాభినయం కూడా దేనికో ఒకదానికి అనుకరణ కాక మానదు. అదే ఈ సృష్టిలోని వైచిత్ర్యం. అనుకరణ అనేక రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా ఆదర్శ అనుకరణ ఒకటి. ఇందులో... [ఇంకా... ]

Tuesday, October 20

వ్యాయామ శిక్షణ - మెడనొప్పి తగ్గించే మకరాసనం

మకరం అంటే మొసలి. నీటిలోని మొసలి రూపంలోనే ఈ ఆసనం ఉంటుంది కనుక, దీనికి 'మకరాసనం ' అని పేరు వచ్చింది. దీనికే 'నిరాలంబాసనం ' అనే పేరుంది. బోర్లా పడుకుని భుజంగ ఆసనం వేయాలి. రెండు చేతులనూ చుబుకం కింద ఆనించి బుగ్గలను వొత్తుతూ ఉంచాలి. రెండు మోచేతులనూ జోడించి నేల పైన ఉంచాలి. శ్వాసను సామాన్యంగా పీలుస్తూ, కళ్లు మూసుకుని, మెడ మీద మనసును... [ఇంకా... ]

Monday, October 19

భరతమాత బిడ్డలు - అనిబిసెంట్

పేరు - అనిబిసెంట్
తండ్రి పేరు - (తెలియదు)
తల్లి పేరు - (తెలియదు)
పుట్టిన తేది - 1-10-1847
పుట్టిన ప్రదేశం - లండన్
చదివిన ప్రదేశం - లండన్
చదువు - 1977
గొప్పదనం - స్వాతంత్ర్యం తీసుకురావటానికి మన దేశ నాయకులతో చేతులు కలిపి, ఒక భారతీయ మహిళ కంటే ఎక్కువగా కృషి చేసింది. ' న్యూ ఇండియా ' అనే ఆంగ్ల పత్రికను స్థాపించి, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ' కామన్ వీల్ ' అనే వారపత్రిక నడుపుతూ ' హోం రూల్ లీగ్ ' ఉద్యమాన్ని లేవదీసింది. బాలగంగాధర్ తిలక్, జిన్నా, మోతీలాల్ నెహ్రూ వంటి మహానాయకులు ఆ లీగ్‌ను సమర్ధిస్తూ అందులో చేరారు. 1917లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు వార్షిక సమావేశానికి అధ్యక్షతవహించి... [ఇంకా... ]

Wednesday, October 14

వ్యక్తిత్వ వికాసం - ఇతరులతో సంభాషించే విధానం ఎలా ఉండాలి?

మనం ఎవరితో మాట్లాడినా మాట్లాడే తీరు ముఖ్యం. మాట్లేడే తీరులో సభ్యత, సంస్కారం బయటపడతాయి. వ్యక్తిత్వం వెల్లడవుతుంది. అందుకే నోరు మంచిదయితే వూరు మంచిదవుతుందని పెద్దలంటారు. మాటలతో అందరి ప్రశంసలు పొందాలంటే కొన్ని సూచనలు పాటించాలి.
. సంభాషణను మొట్టమొదట చమత్కారంగా ప్రారంభించడానికి తగిన ప్రావిణ్యత, నైపుణ్యం సంపాదించాలి.
. సంభాషణ ప్రారంభించిన తర్వాత చిన్న చిన్న వ్యాఖ్యానాలతో హాస్య ధోరణిలో సంభాషణ కొనసాగిస్తూ ఉండాలి. దానివల్ల వ్యక్తిగత ప్రమేయం లేకుండా సంభాషణ సాఫీగా సాగిపోతుంది.
. ఆత్మీయులతో మాట్లాడినా, అపరిచితులతో మాట్లాడినా ఎదుటివాళ్ళ ముఖాన్ని అప్పుడప్పుడు పరిశీలిస్తూ వుండాలి. ఇందువల్ల మనం చెప్పేది జాగ్రత్తగా వింటున్నారా లేదా అని గమనించగలుగుతాం.
. వింటున్నారనుకుంటే మనం సంభాషణ సాగించాలి. లేదా ఎదుటి వాళ్ళ ఆసక్తిని కనిపెట్టి... [ఇంకా... ]

Monday, October 12

ఎందుకు, ఏమిటి, ఎలా ... - భూమధ్యరేఖ వద్ద వేడి ఎక్కువ ఎందుకు?

భూమికి సూర్యుడి నుండి కాంతి, ఉష్ణశక్తులు లభిస్తాయి. భూమిపై ఉష్ణం అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. కొన్ని చోట్ల ఎక్కువ వేడిగా ఉంటే కొన్ని చోట్ల తక్కువ వేడి ఉంటుంది. భూమి గోళాకారంలో ఉండి, ధ్రువాల వద్ద కొంత మేరకు బల్లపరుపుగా ఉంటుంది. సూర్యకిరణాలు భూమిపై వివిధ ప్రదేశాలలో వివిధ కోణాలలో పడుతూ ఉంటాయి. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడితే, దానికి ఉత్తర దక్షిణ దిశల్లో భూమధ్య రేఖ వద్ద వేడి ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ వేడి తక్కువగా ఉంటుంది... [ఇంకా... ]

Saturday, October 10

వ్యాకరణం - వ్యాకరణం ఉపోద్ఘాతం

ఏ భాషలోనైనా అంతర్గతంగా ఉన్న లక్షణాలను సూత్రీకరించి వ్రాసిన గ్రంధం వ్యాకరణ గ్రంధమవుతుంది. శబ్ద శాస్త్రమే వ్యాకరణం. ఆ భాషలో లక్షణాలే ఆ భాషకు వ్యాకరణం అవుతుంది. వ్యవహారంలో మాట్లాడుకునే భాషకు కూడా వ్యాకరణం ఉంటుంది. వ్యావహారికంగా దేశ కాల పాత్రలనుబట్టి వచ్చే మార్పులు ఆ భాష వ్యాకరణంలో మార్పులు తీసుకొస్తాయి. ఎప్పటికప్పుడు వీటి నుండి వ్యాకరణ సూత్రాలకు కూడా మార్పులు చేసుకుంటుండాలి. కాబట్టి ఆయా కాలాలలో శిష్ట వ్యవహారాలన్నింటినీ ఆధారం చేసుకుని వ్యాకరణ సూత్రాలని సరిదిద్దుకుంటూండడం సంప్రదాయకం అయింది... [ఇంకా... ]

Thursday, October 8

వంటలు - బిసిబేళాబాత్

కావలసిన వస్తువులు:
లేతవంకాయలు - 200గ్రాములు.
గోరుచిక్కుళ్లు - 50గ్రాములు.
బంగాళాదుంపలు - 100గ్రాములు.
క్యారెట్ - రెండు దుంపలు.
మునక్కాయలు - 6.
చింతపండు - 25గ్రాములు.
కందిపప్పు - 100గ్రాములు.
బియ్యం - 1కిలో.
రిఫైండ్ ఆయిల్ - 100గ్రాములు... [ఇంకా... ]

Tuesday, October 6

పండుగలు - అట్లతద్దె

ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ బహుళ తదియనాడు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ "చంద్రోదయ ఉమావ్రతం - అట్లతద్ది" స్త్రీలకు చక్కని ఆనందాన్ని జీవితంలో చక్కని విచిత్రానుభూతులను కలిగిస్తూ ఉంటుంది. ఈ పండుగలో ఒక విశేషం ఉన్నది. కొన్ని వ్రతాలైతే వివాహితులైన స్త్రీలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ, ఈ పండుగ పిన్నలు, పెద్దలు కూడా కలిసి వయోభేదం లేకుండా ఆచరిస్తారు. పిల్లలతోబాటు తల్లులు కూడా 20 సం|| వెనకకి పోయి బాల్యజీవితంలోకి వెళ్ళి ఆనందం పొందుతారు. ఇక మూడుకాళ్ల ముదుసలి అయిన బామ్మగారు కూడా! వారి ఆటలాడుకుంటున్న వారినందరని తన దగ్గరకు రప్పించుకుని అమ్మాయిలూ... చూచారా... నా చిన్నప్పుడూ! అంటూ, వారి చిన్ననాటి జ్ఞాపకాలు, అనుభవాలు .. అంటూ ఉంటారు. అటువంటి వృద్ధులలో నవయవ్వనం తొణికిసలాడేది ఈ పండుగలోనే. ఇట్టి ఆటపాటలు కనువిందుచెయ్యాలి అంటే పల్లెసీమలే పట్టుకొమ్మలు... [ఇంకా... ]

Monday, October 5

న్యాయ వ్యవస్థ - సుప్రీం కోర్ట్

భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది హైకోర్టులపై నియంత్రణాధికారం కల్గిఉన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. ఇందులో 26 మంది జడ్జీలు ఉంటారు ప్రధాన న్యాయ మూర్తితో కలిపి. ఈ కోర్టులలో
. భారత ప్రభుత్వానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను,
లేక
. భారత ప్రభుత్వం, ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఒక వైపు ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నప్పుడు వాటి మధ్య తగాదాలను... [ఇంకా... ]

Saturday, October 3

నీతి కథలు - దొంగపిల్లి

భాగీరధీ నది ఒడ్డన పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో 'జరధ్గవము' నే ముసలి గ్రద్ద ఉండేది. ఆ గ్రద్దకు కళ్ళు కనిపించవు, అందుకని ఆ చెట్టు మీద ఉండే పక్షులు తమకు తెచ్చుకున్న ఆహారంలో ఆ గ్రద్దకు కొంత పెట్టేవి. ఆ గ్రద్ద, పక్షులు బయటకు వెళ్ళినపుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెప్పి నిద్ర పుచ్చేది. ఒక రోజు 'దీర్ఘకర్ణము' అనే పేరుగల పిల్లి పక్షుల పిల్లల్ని తినటానికి ఆ చెట్టు పైకి చేరింది. ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరిచాయి. ఆ అరుపులు విన్న జరధ్గవము తొర్రలోంచి బయటకు వచ్చి 'ఎవరక్కడ...?' అంటూ కోపంగా అరిచింది. ఆ అరుపుకు పిల్లి పై ప్రాణాలు పైనే పోయాయి. తప్పించుకోవటానికి దానికి... [ఇంకా... ]

Friday, October 2

భరతమాత బిడ్డలు - మహత్మా గాంధీ

పేరు : మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( మహాత్మా గాంధీ )
తండ్రి పేరు : కరంచంద్ గాంధీ
తల్లి పేరు : పుత్లీబాయి
పుట్టిన తేది : 2-10-1869
పుట్టిన ప్రదేశం : పోరుబందర్
చదివిన ప్రదేశం : లండన్
చదువు : లాయర్
గొప్పదనం : శాంతియుతంగా అనేక సత్యాగ్రహాలు చేసి ఆంధ్ర దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు
స్వర్గస్తుడైన తేది : 31-1-1948
మహాత్మా గాంధీ గుజరాత్ లోని ఖయిత్వాద్ ప్రాంతంలోని పోరుబందర్ లో కరంచంద్ గాంధీ, పుత్లీబాయి దంపతులకు 1869వ సంవత్సరం అక్టోబర్ 2న జన్మించాడు. నీతి నిజాయితీలకు కట్టుబడిన కుటుంబంలో జన్మించిన గాంధీ చిన్నతనం నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరుగుతూ, తల్లి దండ్రుల యెడల గురువుల యెడల ఎంతో వినయ విధేయతలతో ఉంటూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. మోహన్ దాస్ కి పన్నెండవ సంవత్సరంలోనే కస్తుర్భాతో వివాహమయింది. అంత చిన్నతనంలో పెళ్ళిచేసుకోవటం అతనికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల మాట జవదాటలేక అంగీకరించాడు.వివాహ కారణంగా గాంధీ చదువు ఒక ఏడాది వృధా అయింది... [ఇంకా... ]

Thursday, October 1

సాహిత్యం : భాష - ఉత్పత్తి

మానవ జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనం. తనలో సంఘర్షణలను రేకెత్తిస్తున్న భావాలను, తన కష్ట సుఖాలను సాటి మానవుడితో పంచుకోవడానికి ఆది మానవుడు సంజ్ఞలు (Gestures) చేసేవాడు. వాటి ద్వారా ఒకరినొకరు సమాచారాన్ని పరస్పరం వ్యక్తపరుచుకునేవారు. ముఖ వికాసం వలన సుఖాన్ని, ముఖ వికారం వలన దుఃఖాన్ని బహిర్గతం చేసుకునేవారు. అట్లేగాక కొన్ని ధ్వనుల ద్వారా కూడా అంతరంగాన్ని వెల్లడించుకునేవారు. అంటే అభిప్రాయాన్ని వ్యక్తపరచే ఒక సాధనం భాష అన్నమాట. అవయవాల సహాయంతో భావాన్ని తెలియజేసే మాటల సముదాయాన్ని కూడా భాష అనవచ్చు. కొన్ని సందర్భాలలో ఉచ్ఛారణ లేకుండానే అవయవాల కదలికల ద్వారా... [ఇంకా... ]