Thursday, December 24

పండుగలు - క్రిస్‌మస్ - డిసెంబర్ 25

క్రిస్‌మస్ క్రైస్తవులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను భారత దేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని దేశాలలోను జరుపుకుంటారు. ఇది యేసుక్రీస్తు పుట్టిన రోజు పండుగ. ప్రతి సంవత్సరం డిసెంబరు 25వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.
యేసుక్రీస్తు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది. ఆ కాలంలో అంటే రెండు వేల సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో లెక్కవేయించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరు ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబరు 25 తేదీలోగా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు.
అప్పుడు ' నజరేతు ' అనే పట్టణంలో మేరీ, జోసఫ్ అనే వాళ్ళు... [ఇంకా... ]