చెప్పులే కదా! అనో లేకపోతే స్టయిల్ గా కనిపించాయనో ఎలాపడితే అలా పాదరక్షలను కొనకూడదు. వాటిని కొనడానికి ఒక టైం ఉంటుందని తెలుసా మీకు. అలాగే చెప్పులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే -
రెండు పాదాలు ఒకే సైజులో ఉండవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొత్త చెప్పులు, షూ, శాండల్ ఏవి కొంటున్నా రెండు పాదాలకు వేసుకుని సైజు చూసుకోవాలి. వేసుకున్నప్పుడు కొంచెం అసౌకర్యంగా అనిపిస్తే కొన్నాళ్లు వేసుకుంటే సాగుతాయిలే అని తీసుకోవద్దు. బ్రాండ్ సైజుల బట్టి కొనొద్దు. స్టయిల్ ను బట్టి సైజులు మారుతుంటాయి. అందుకని పాదరక్షలు కొనే ప్రతిసారి రెండు పాదాలకు వేసుకుని గమనించి కొనుక్కోవాలి. కాలి వెనుక భాగం షూలో సరిగా కూర్చోవాలి. అలా ఉంటే కాలి వేళ్లను సులువుగా కదిలించొచ్చు. [ఇంకా... ]