టీవి కొంటే కారు బహుమతి అంటూ షోరూములు తాయిలాలతో ఊరిస్తుంటాయ్. శబ్ధం ఎక్కువైతే దృశ్య నాణ్యత తక్కువ అవుతుందనీ, పిక్చర్ ఫర్వాలేదంటే సౌండ్ నాసిరకంగా ఉంటుందన్న అపోహలు సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. ఫీచర్లతో పాటే కొండెక్కే ధరలు. అయోమయంలో ముంచెత్తే సేల్స్‌మెన్‌ల మాటలు కలర్ టీవీ కొనాలని షోరూములకెళ్లే సగటు మధ్య తరగతి వ్యక్తి పరిస్ధితి ఇదే.
అయోమయాల నుంచి బయటపడి సరసమైన ధరకు సరైన టీవీని ఎంచుకోవాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే. కలర్ టీవీలు అయిదు విభిన్న రకాల్లో లభ్యం అవుతున్నాయి. ప్రాధమిక మోడల్, ఫ్లాట్ స్క్రీన్, ప్రొజెక్షన్, ప్లాస్మా, ఎల్‌సీడీ. నిన్న మొన్నటి వరకూ పద్నాలుగు అంగుళాల కలర్ టీవీలదే రాజ్యం. ఆ తర్వాత 20 అంగుళాల టీవీలను కొనేవారి సంఖ్య పెరిగింది. [ఇంకా... ]