Saturday, November 21

జానపద కళారూపాలు - ఉపోద్ఘాతం

తెలుగు నాటక రంగం ఆవిర్భవించి నూరేళ్ళు దాటింది.ఈ నూరేళ్ళుగా వినోదాన్ని నాటకాలనుండి పొందుతున్నాం. సినిమా రాకముందూ, సినిమా వచ్చాకా కూడా సగటు మానవుడి దృష్టి నుంచి నాటక రంగం ఏనాడూ దూరం కాలేదు. ప్రజల అంతరాంతరాల్లో నాటుకు పోయిన ఈ జీవ కళ ఆవిర్భవించకముందు అంటే వంద సంవత్సరాలకు పూర్వం మానవుడు విజ్ఞానం, వినోదాలకోసం ఏం చేసేవాడు? అని ప్రశ్న ఉదయిస్తే దానికి సమాధానం ఎవరో కొద్ది మంది దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ కొద్దిమంది కూడా మేధావులేమీ కాదు. సామాన్య మానవులు మాత్రమే వాళ్ళు. ఆ సామాన్య మానవులు కూడా గ్రామీణ నేపధ్యం కలవారు లేక గ్రామీణ సంప్రదాయం పట్ల అభిమానం కలవారు మాత్రమే. వారిని పలకరిస్తే... [ఇంకా... ]