తెలుగు నేర్చుకోవాలనుకునేవారు వాడుక భాషలోని కొన్ని పదాల అర్ధాలను తెలుసుకోవడం అవసరమని భావిస్తూ మనం నిత్యం మట్లాడే కొన్ని పదాల వివరణలను ఇప్పుడు ఇస్తున్నాం. ఈ మాటలు ఏ సందర్భంలో అనాలో తెలిసినప్పటికీ గమ్మత్తైన ఈ పదాలు అసలు ఎలా పుట్టాయో తెలుసుకోవడం విఙాఞనదాయకంగానూ, వినోదాత్మకంగానూ ఉంటుంది. తెలుగు భాషకు మాత్రమే సొత్తైన ఈ పదాలను, పదబంధాలను జాతీయాలు అంటారు. మీక్కూడా తెలీకుండా అలవోకగా మీరు అనే ఈ జాతీయాల వివరణలోకి ఇప్పుడు వెళ్దాం.
జాతీయం అంటే?
ఒక జాతి ప్రజ ఒకభావాన్ని ప్రకటించడంలో వ్యక్తం చేసే భాషాపరమైన విలక్షణత. దీన్నే పలుకుబడి అని కూడా అంటారు. "ఓరంతపొద్దు, ఓడలు బండ్లు బండ్లోడలు, గుండెరాయి చేసుకొను, చెవిలో ఇల్లుగట్టుకొనె పోరు, కాలికి... [ఇంకా... ]