Monday, November 30

నృత్యం - జానపద నృత్యాలు

అసంఖ్యాక జాతులతోనూ పతిస్థితులతోనూ కూడి ఉన్న భారతదేశం అనేక శతాబ్దాలుగా రకరకాల జానపద నృత్యాలకు నిలయంగా ఉంది. భారతదేశంలోని నేటి శాస్త్రీయ నృత్య విధానాలు చాలా కట్టుబాట్లకు లోబడి ఉండటంతోపాటు ఎంతో నాజూకుతనాన్ని చూపుతున్నది. ఆటవికుల గూడెములోనూ కర్షకుల కుటీరాలలోనూ నేటికి తమ పాటవాన్ని కోల్పోకుండా బ్రతికి ఉన్న సామాన్య ప్రజా నృత్యాలనుండి మన శాస్త్రీయ నృత్యాలు పుట్టాయి. భారతీయ జానపద నృత్యాలలో నిరాడంబరమైన సరళత ఉంది. వాటి సరళత వెనుక మహత్తర కళాభావాలు రెండు ఉన్నాయి. సహజమైన భావగాంభీర్యం, విస్పష్టమైన వ్యక్తీకరణ ఉన్నాయి. జానపద నృత్యానికి, దానినుండి ప్రధానంగా ఉధ్భవించిన శాస్త్రీయ నృత్యానికి ఉన్న భేదం రీతిలోనే. జానపద నృత్యంలో కళారీతిని ప్రయత్నం పూర్వకంగా తెచ్చుకోవటం అంటూ ఉండదు. ఇందుచేతనే జానపద నృత్యంలో చిరకాలం నుంచి వస్తున్న ప్రబలమైన సంప్రదాయాలు ఉన్నప్పటికీ అది స్వయం ప్రేరణతో... [ఇంకా... ]