Tuesday, April 7

ఎందుకు, ఏమిటి, ఎలా ... - చాటింగ్

సాయంకాలాలు ఏమీ ఉబుసుపోక పల్లె జనాలంతా వేపచెట్టు కిందకు చేరినట్లు, నెట్ పక్షులన్నీ చాట్‌రూమ్‌ల్లోకి చేరతాయి. దేశవిదేశాల్లోని వ్యక్తులందరితోనూ సంభాషిస్తూ, వారి మనోభావాలను పంచుకోవడానికి వీలు కల్పించే మెసెంజర్‌లు ఎంత మంచివో అంత చెడ్డవి. దూరమైపోయిన ఒకనాటి స్నేహితుడు/స్నేహితురాలితో కాస్త ఎక్కువ సేపు మనసు విప్పి మాట్లాడుకోవడానికి చాటింగ్ కంటే అనుకూలమైనది ఏదీ లేదు. కానీ చాట్‌రూంల రూటే వేరు. అపరిచిత వ్యక్తులతో పరిచయం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆ పరిచయాలు కొంతమందికి తమ కెరీర్‌ను మలుచుకోవడానికి పనికివచ్చాయి. మరికొంతమందికి టైంవేస్ట్ మాత్రమే చేశాయి. ఇంకొంతమందికి చేదు అనుభవాలు మిగిల్చాయి. సేఫ్‌గా చాటింగ్ చేయడానికి ఎంఎస్ఎన్, యాహూ సర్వీసుల వాళ్లు ఈ కింది టిప్స్ చెబుతున్నారు... [ఇంకా... ]

వంటలు - అరటికాయ కూర

కావలసిన వస్తువులు:
అరటి కాయలు : 4.
ఉల్లిపాయలు : 2.
పచ్చిమిర్చి : 4.
అల్లం : చిన్న ముక్క.
నూనె : 4 స్పూన్లు.
ఆవాలు : 1/2 స్పూను.
ఉప్పు, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
జీలకర్ర : 1 స్పూను.

తయారుచేసే విధానం:
అరటికాయలను చెక్కు తీయకుండా 3 ముక్కలుగా కోసి ఉప్పు వేసి నీళ్ళలో ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత పై చెక్కు తీసి ఒక పళ్ళెంలో పొడిపొడిగా చేసి పెట్టుకోవాలి. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - అదనపు ఆహారం

తల్లిపాలు - శిశువు పెరుగుదల, అభివృద్దికి సహజమైన, అసమానమైన ఆహారం. ఇవి ఎన్నో విశిష్టతలు కలిగినప్పటికీ శిశువుకు 4 నుండి 6 నెలల వయసు వచ్చాక వారు పెరుగుతున్న అవసరాలు తీర్చలేవు. తల్లిపాలపైననే పూర్తిగా ఆధారపడే శిశువు క్రమంగా పెద్దలు తీసుకొనే ఆహారానికి మారే దశను 'వీనింగ్' అంటారు.

మనం భుజించే ఆహారంవల్ల పిల్లల కడుపునిండినా అందులో పోషక విలువలు తక్కువ. శిశువుకు గల ప్రత్యేక అవసరాలదృష్ట్యా మన ఆహారంలోనే కొన్ని మార్పులు, చేర్పులు చేసినట్లైతే అది శిశువు అవసరాలను తీర్చగలుగుతుంది. [ఇంకా... ]

పిల్లల పాటలు - ఎంతోమంది పనివాళ్ళు...

ఎంతోమంది పనివాళ్ళు - ఎంతో మంచి పనివాళ్ళు
మడకను దున్నే మాదన్నా - కొడవలి పట్టిన కొండమ్మా
గుడ్డలు నేసే గురవయ్యా - బట్టలు ఉతికే బాలమ్మా || ఎంతోమంది ||

కుండలు చేసే కుమరయ్యా - కొలిమిని ఊదే కోనయ్యా
చెప్పులు కుట్టే చెన్నయ్యా - దుస్తులు కుట్టే మస్తానూ || ఎంతోమంది || [ఇంకా... ]

Monday, April 6

వంటలు - వాలెంటైన్ చాక్లెట్

కావలసిన వస్తువులు:
పాలపొడి - అరకప్పు.
కండెన్స్‌డ్ మిల్క్ - రెండుటేబుల్ స్పూన్లు.
ఐసింగ్ షుగర్, కోకోపొడి, తాజా వెన్న - ఒక్కోస్పూను చొప్పున.
అంజూర్(బేకరీల్లో లభిస్తాయి) తరుగు - ఒక పెద్దస్పూను.
బాదంపప్పులు - గుప్పెడు.

తయారుచేసేవిధానం:
ఓ వెడల్పాటి గాజు బౌల్ తీసుకుని అందులో పాలపొడి, కోకోపౌడర్, వెన్న, ఐసింగ్ షుగర్ అన్నీవేసి పాలుపోసి చక్కగా గట్టిగా చపాతీల పిండిలా కలపండి. ఆ మిశ్రమానికి అంజూర్ తరుగును చేర్చండి. ఇప్పుడు వెడల్పాటి గాజుట్రే తీసుకుని దానికి కాస్త వెన్నరాసి... అందులో ఈ మిశ్రమాన్ని సమంగా సర్ధండి. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - టీవి (టెలివిజను)

టీవి కొంటే కారు బహుమతి అంటూ షోరూములు తాయిలాలతో ఊరిస్తుంటాయ్. శబ్ధం ఎక్కువైతే దృశ్య నాణ్యత తక్కువ అవుతుందనీ, పిక్చర్ ఫర్వాలేదంటే సౌండ్ నాసిరకంగా ఉంటుందన్న అపోహలు సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. ఫీచర్లతో పాటే కొండెక్కే ధరలు. అయోమయంలో ముంచెత్తే సేల్స్‌మెన్‌ల మాటలు కలర్ టీవీ కొనాలని షోరూములకెళ్లే సగటు మధ్య తరగతి వ్యక్తి పరిస్ధితి ఇదే.

అయోమయాల నుంచి బయటపడి సరసమైన ధరకు సరైన టీవీని ఎంచుకోవాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే. కలర్ టీవీలు అయిదు విభిన్న రకాల్లో లభ్యం అవుతున్నాయి. ప్రాధమిక మోడల్, ఫ్లాట్ స్క్రీన్, ప్రొజెక్షన్, ప్లాస్మా, ఎల్‌సీడీ. నిన్న మొన్నటి వరకూ పద్నాలుగు అంగుళాల కలర్ టీవీలదే రాజ్యం. ఆ తర్వాత 20 అంగుళాల టీవీలను కొనేవారి సంఖ్య పెరిగింది. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - లాల్ బహదూర్ శాస్త్రి

పేరు : లాల్ బహదూర్ శాస్త్రి.
తండ్రి పేరు : శారదాప్రసాద్ రాయ్.
పుట్టిన తేది : 2-10-1904.
పుట్టిన ప్రదేశం : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో జన్మించారు.
చదివిన ప్రదేశం : మొగల్ సరాయ్.
గొప్పదనం : బ్రిటీషు వారిని ఎదిరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో సత్యాగ్రహలు చేశాడు.
స్వర్గస్థుడైన తేది : 1966 వ సంవత్సరంలో స్వర్గస్థుడైనారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న జన్మించారు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్ బహదూర్ ను చూసుకొని ఆ తల్లిదండ్రులెంతో మురిసిపోయారు. [ఇంకా... ]

సౌందర్య పోషణ - పాదాలకు

. అర టీస్పూన్ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

. అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.

. కాలేజీలకు స్కర్టులు వేసుకునే వారికి మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్ లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - ఖాళీల పూరింపు 

చిన్న పిల్లకు ఖాళీలను పూరించటమంటే చాలా ఇష్టం అందుకని చిన్న పిల్లల ఆటలో ఈ ఖాళీల పూరింపును కూడా చేర్చాము. ఈ ఆటలో కనీసం నలుగురు పిల్లలు పాల్గొనవచ్చు. పిల్లల్లో ఒక్కొక్కరికి ఒక అక్షరానికి సంబంధించిన పదాలు ఇవ్వాలి. ఆటగాళ్ళు ఎ, బి, సి, డి లనుకుంటే వాళ్ళకు ఇచ్చిన ఖాళీల పూరింపు ఇట్లా ఉంటుంది.

ఉదా: Team A వారు గ (అక్షరం) మీదపూరించవలెను.
ప్రశ్న: - డి - రం.
జవాబు: గడియారం.

ఎవరు సరిగ్గా ఖాళీలు పూరిస్తే వారు విజేత. [ఇంకా... ]

Friday, April 3

వ్యాయామ శిక్షణ - సమూహ (గ్రూప్) వ్యాయామం

మనలో చాలా మందికి పనులు వాయిదా వేయడం అలవాటే. తమకు తాము ప్రేరణ కలిగించుకుని తీసుకున్న నిర్ణయాన్ని చివర వరకు కొనసాగించగల శక్తి అందరికీ ఉండదు. వ్యాయామం చేయడంలోనూ మీది అదే తీరైతే గ్రూప్ వ్యాయామమే మీకు తగినది.

. పరస్పరం మాట్లాడుకుంటూ ఉండటంవల్ల ఒకరి నుంచి మరొకరు ప్రేరణ పొందుతారు. అందరూ కలిసి వ్యాయామానికి సంబంధించిన ఒక్కో అంశం గురించి చర్చించుకుంటూ ఉండటం వల్ల తేలికగా అనుసరించగలుగుతారు.

. రోజూ వ్యాయామం చేసేటప్పుడు పోటీపడి అందరితో సమానంగా చేయగలుగుతారు. త్వరగా నేర్చుకొనే అవకాశమూ ఉంది. మనకు తెలియకుండానే పక్కవారి కన్నా బాగా చేయాలన్న పట్టుదల వచ్చేస్తుంది. [ఇంకా... ]

వంటలు - గుమ్మడి వరుగు (చిప్స్)

కావలసిన వస్తువులు:

బూడిద గుమ్మడికాయ, పసుపు, ఉప్పు.

తయారుచేసే విధానం:

మొదట బూడిదగుమ్మడికాయను చెక్కుతో పాటే బాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఈ తరిగిన ముక్కలన్నిటినీ ఉప్పు, పసుపు వేసి జాడిలో పెట్టుకుని ఒక రోజంతా నాననివ్వాలి. మరుసటి రోజు గట్టిగా మూతపెట్టి కావలసినప్పుడు నూనెలో దోరగా వేగించుకొని కొద్దిగా ఉప్పు కారం చల్లుకోవాలి. [ఇంకా... ]

భక్తి గీతాలు - శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి

శివాదుర్గ కాళి ప్రియ చంద్ర మౌళి
సరోజాలతోనే పూజచేతు ఆ...

గులాబీలతోనే పూజసేతు "శి"
శంభుని రాణి చల్లని చూపు

భక్తావాళి భాధలు బాపు
ప్రార్ధింతుము రేపూ మాపు

గ్రహ బాధలు రూపు మాపు
స్తుతింతును రోజు రోజు

వెన్నెల కాంతులు మాపై నిలుపు
వికసించే నీ ముఖ బింబం [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - శ్రీ కాళ హస్తి

తిరుపతికి తూర్పున సువర్ణముఖి నది ఒడ్డున గల కొండల మధ్య అమరివున్నది శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం.
నామ సార్ధకత:
శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ ప్రాంతంలో స్వయం భూలింగముగా వెలసిన శివలింగం పై మూడున్నూ అర్చించి భక్తి నిరూపణలో పోటాపోటీగా సంచరించి చివరికి మోక్షమును పొందాయని ఒక కథ. కనుకనే ఈ స్వామి శ్రీ కాళ హస్తీశ్వరుడనేది సార్ధకనామంగా వున్నదని ప్రతీతి. మరో విశేషం ఏమిటంటే భక్తకన్నప్ప చరిత్ర కూడా ఇచ్చోటనే జరిగి భక్తిలోని గొప్పదనాన్ని చాటిన దివ్య ప్రదేశంగా పేరొందింది. ఈ స్వామి మహత్యాన్ని ఉగ్గడిస్తూ శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరైన మధురకవి దూర్జటి శ్రీ కాళ హస్తీశ్వర శతకంగా రూపొందించి ధన్యతను పొందాడు, చిరస్మరణీయుడైనాడు. [ఇంకా... ]

నీతి కథలు - దురాశే దుఃఖమునకు మూలము

గోవిందయ్య అనే వ్యాపారస్తుడు అతి పిసినారి. ఏదయినా సరే బేరమాడటంలో అవతలి వ్యక్తికి విసుగు తెప్పించి తను లాభపడాలని కోరుకునే మస్తత్వము గల వ్యక్తి. ఒక దినమున అరణ్యమార్గము గుండా పట్నము వెళ్తున్నాడు. తనతోపాటు ఎవరూ లేరు. అతనిని చూస్తే వర్తకులుగాని, సాటివారుగానీ, హడలెత్తేవారు. అరణ్యమార్గములో పోతూవుండగా చెట్టు పొద సమీపములో బక్కచిక్కిన శరీరముతో వున్న ఋషి పడి వున్నాడు. అతను 'దాహం... దాహం' అని వినీ వినపడనట్లుగ అంటుంటే గోవిందయ్య వెళ్ళి తన వద్దగల మంచినీళ్ళు మునీశ్వరుని నోట్లో పోశాడు. కళ్ళు తెరిచి ముని "చివరి ఘడియల్లో నాకు దాహార్తిని తీర్చినావు. నీ మేలు మరవను. నాకు ఇది చివరి నిమిషం. నిమిషంలో మృత్యువు నన్ను సమీపించనుంది. వెంటనే అదైనా వరము కోరుకో... నేను ప్రసాదించగలను" అన్నాడు.[ఇంకా... ]

Thursday, April 2

లాలి పాటలు - చందమామ రావే - జాబిల్లి రావే!

చందమామ రావే - జాబిల్లి రావే!
బండిమీద రావే - బంతి పూలు తేవే
పల్లకిలో రావే - పంచదార తేవే
సైకిలెక్కిరావే - చాక్లెట్లు తేవే

పడవమీద రావే - పట్టు తేనె తేవే
మారుతిలో రావే - మంచి బుక్సు తేవే
పెందలాడే రావే - పాలు పెరుగు తేవే [ఇంకా... ]

వంటలు - చిక్కుళ్ళ వేపుడు

కావలసిన వస్తువులు:
పెద్దగింజలుండే చిక్కుళ్ళు - 250.
నూనె - 50.
కారం - అరచెంచాడు.
లవంగపొడి - చిటికెడు.
కర్వేపాకు - 2 రెబ్బలు.
ఎండుమిర్చి - 1.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం :
చిక్కుళ్ళు వుడకేసి, ఒక పొంగురాగానే దింపి వార్చేయాలి. [ఇంకా... ]

పండుగలు - శ్రీరామనవమి

దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధమై చైత్రశుద్ద దశమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం 'శ్రీరామనవమి' గా విశేషంగా జరుపుకుంటాం.

'రామ' యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న 'ఆ శ్రీరాముని' కనుగొనుచుండవలెను.

ఒకసారి పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - చెప్పులు

చెప్పులే కదా! అనో లేకపోతే స్టయిల్ గా కనిపించాయనో ఎలాపడితే అలా పాదరక్షలను కొనకూడదు. వాటిని కొనడానికి ఒక టైం ఉంటుందని తెలుసా మీకు. అలాగే చెప్పులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే -

రెండు పాదాలు ఒకే సైజులో ఉండవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొత్త చెప్పులు, షూ, శాండల్ ఏవి కొంటున్నా రెండు పాదాలకు వేసుకుని సైజు చూసుకోవాలి. వేసుకున్నప్పుడు కొంచెం అసౌకర్యంగా అనిపిస్తే కొన్నాళ్లు వేసుకుంటే సాగుతాయిలే అని తీసుకోవద్దు. బ్రాండ్ సైజుల బట్టి కొనొద్దు. స్టయిల్ ను బట్టి సైజులు మారుతుంటాయి. అందుకని పాదరక్షలు కొనే ప్రతిసారి రెండు పాదాలకు వేసుకుని గమనించి కొనుక్కోవాలి. కాలి వెనుక భాగం షూలో సరిగా కూర్చోవాలి. అలా ఉంటే కాలి వేళ్లను సులువుగా కదిలించొచ్చు. [ఇంకా... ]

పిల్లల ఆటలు - తాబేలు రేసు

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
ఆడే స్థలం : గదిలో, ఆరుబయట ఆడవచ్చు.
కావలసిన వస్తువులు : చాక్ పీస్ , ప్లాస్టిక్ తాడు.
ఆటగాళ్ల వయస్సు : 7 సం|| రాల నుండి.

ఆటగాళ్ళందర్ని మోకాళ్ళు, అరచేతులమీద నించోబెట్టాలి. 'స్టార్ట్' చెప్పగానే అంతా ఫినిషింగ్ లైన్ దగ్గరకి (ఇది చాక్ పీస్ తో గీయవచ్చు, లేదా నేలమీద ప్లాస్టిక్ తాడు ఉంచవచ్చు.) ఎంత నెమ్మదిగా సాధ్యం అయితే అంత నెమ్మదిగా వెళ్ళాలి. [ఇంకా... ]