Saturday, December 29
మీకు తెలుసా - ఫొటోగ్రఫీ
ఆంగ్లంలో ఫొటోగ్రఫీ అనే మాటకు 'వెలుతురుతో రాయడం' అనే రెండు గ్రీకు పదాలు మూలమయ్యాయి. చాయా చిత్రానికి రెండు ప్రక్రియలు ఉన్నాయి. మొదటిది ప్రతిబింబాన్ని ఉత్పన్నం చేయడం, రెండవ ప్రక్రియలో ప్రతిబింబాన్ని నమోదు చేయడం. ఈ మొదటి ప్రక్రియ అనేక శతాబ్దాలకు ముందే అంటే ఈ చాయా చిత్ర గ్రహణాన్ని కనుగొనడానికి పూర్వమే మానవాళికి తెలిసింది. 1000, 1267 సం. ప్రాంతంలో అరబ్, ఖగోళ శాస్త్రవేత్తలు సూర్య గ్రహణాన్ని చూడడానికి కెమెరా ఆబ్‌స్క్యూరా అనే విచిత్రమైన ప్రభావాన్ని వాడుకున్నారు. నెమ్మదిగా ఈ కెమెరా ఆబ్‌స్క్యూరా సహాయంతో విభిన్న రీతులలో చిత్రలేఖకులు ప్రతిబింబాన్ని కల్పించుకోసాగారు. కాంతి సూక్ష్మగ్రాహక ద్రవ్యాలు కూడా ఫొటోగ్రఫీని కనుగొనడానికి ముఖ్యాధారమయ్యాయి. [ఇంకా... ]