Thursday, December 27
మీకు తెలుసా - కలంకారీ అద్దకాలు
ఆంధ్ర ప్రదేశ్‌లోని ముఖ్యమైన పరిశ్రమలలో అద్దక పరిశ్రమ చాలా పురాతనమైనది. రాష్ట్రమంతటా వివిధ సాంకేతిక విధానాలను ఉపయోగించి స్థానిక సంప్రదాయానుగుణంగా ఇండిగో ప్రాసెస్ లేక రేసిస్టు స్టైల్, మార్డెంట్ లేక డైడ్ స్టైల్, మొదట చెప్పిన టై అండ్ డై స్టైల్ అని మూడు రకాలుగా ఉంది. గుడారాలకు ఉపయోగించే గుడ్డలపై లైనింగులు, గుమ్మాలకు, కిటికీలకు తెరలు, కిషన్ కవరింగులు మొదలైన వాటిపై అద్దకానికి మార్డెంట్ లేక డైడ్ స్టైల్ ఉపయోగిస్తారు. ఇండిగో రేసిస్ట్ స్టైల్‌నే కలంకారీ అద్దకం అంటారు. కలంకారీ అద్దకాలలో అందమైన అద్దకపు చీరలు, పడక దుప్పట్లు, కర్టెన్లు, బల్లగుడ్డలు అనేక అందమైన డిజైన్లలో లభిస్తున్నాయి. [ఇంకా... ]