Thursday, December 27

సాహిత్యం - ప్రాచీన విద్య

ఆధునిక విద్యాలయాలు ఉన్నత చదువులకంటే ఉన్నతోద్యాగాల దిశగా మాత్రమే విద్య బోధిస్తున్న విషయం తేటతెల్లమైనదే. ముఖ్యంగా టెక్నికల్ విద్య ఈనాడు చూపిస్తున్న ప్రభావానికి ప్రభావితం కాని విద్యార్ధి లేడు. టెక్నికల్ విద్య మాత్రమే తెలివైన విద్య అనే భావన విద్యా వ్యవస్థలో వేళ్ళూనుకుపోవడంతో విద్యార్ధులు ఆ విద్యపట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. తల్లితండ్రులు కూడా తమ బిడ్డలను ఈ విద్యలపట్లే ఆసక్తి పెరిగేట్లు చిన్నతనంనుంచే బోధిస్తున్నారు. టెక్నికల్ విద్య ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు తెచ్చుకోవచ్చనే ఆశ వారిని ఈ విద్యపట్ల ఆసక్తిని పెంపొందింపజేస్తోంది. [ఇంకా... ]