Friday, December 28

మీకు తెలుసా - చీర కథ

చీర అంటే వస్త్రము. వాడుకలో స్త్రీలు మాత్రం కట్టుకునే బట్టకు పర్యాయపదంగా చీర వాడబడుతూంది. చరిత్రకు పూర్వం ఇండస్ వేలీ ప్రాతపు స్త్రీలు ప్రత్తి నూలుతో నేయబడిన బట్టలు ధరించేవారు. ప్రత్తి మరియు పట్టుబట్టల గురించి వేదాలలోను, రామాయణ, మహాభారత కథలలోనూ కూడా చెప్పబడింది. చంద్రగుప్తుని కాలంలో పాటలీపుత్రానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీసు భారత స్త్రీలు ధరించిన వస్త్రాలను గురించి "బంగారు జరీతో విలువైన రాళ్ళు పొదగబడినవి" అని వ్రాశాడు. ప్రాచీన కాలపు చిత్రాలలోను, రాతి విగ్రహాలలోను పలచని చీర మడతలు సూచించబడ్డాయి. [ఇంకా... ]