మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత విశేషాలు ఏమిటో సమీక్షగా తెలుసుకుందాం! వీటిలోను అనేక విభిన్న గాధలు కానవసన్నాయి.
ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట... [ఇంకా... ]