పూర్వం ఒక గొప్ప చక్రవర్తి రాజ్యం పాలిస్తూ ఉండేవాడు. ఆ చక్రవర్తికి సుప్రసిద్ధుడైన మంత్రి పుంగవుడు ఉండే వాడు. అతడు మంచి కుశాగ్రబుద్ది గల ప్రజ్ఞావంతుడు. సమర్ధుడు. రాజ్యపాలనకు సంబందించిన అన్ని విషయాలలోను ఎప్పటికప్పుడు చక్రవర్తికి తగిన సలహాలను ఇస్తుండేవాడు. దూరదృష్టితో వివేకవంతమైన ఆ సలహాలను చక్రవర్తి జవదాటకుండా పాటిస్తూ ఉండేవాడు. ఆ మంత్రిగారి సహాయం, సలహాలు లేకపోతే రాజ్యపాలన కుంటుపడిపోతుందనే అభిప్రాయం చక్రవర్తికి కలిగింది. [ ఇంకా...]