శానయ్య : తలుపేసుకోండి, ఇక్కడున్నట్టు వస్తాను.ఇల్లు పదిలం. ఇంతలో అపసవ్యాలు ఎమి జరగనియ్యవద్దు. డబ్బుకి చాటు రోజులు. నాదగ్గిర బాకీ వసూలు చేసుగోడానికని చెబుతూ కొదరూ నాకోసం రావచ్చు. వాళ్ళతోటి నేను ఊళ్ళోలేననీ, ఎక్కడ కెళ్ళానో ఎప్పుడొస్తానో తెలియదనీ, చెప్పండి. మరికొందరు నా బాకీలు వసూళ్ళు ఇవ్వడానికొస్తారు. వాళ్ళతోటిమాత్రం నేను సరయ్య ఇంట్లో ఉంటానని చెప్పండి. ( అని, కుడివేపుకి నిష్క్రమించబోయేసరికి, సరయ్య వస్తాడు). [ ఇంకా...]