ఎంతమంది ఆడవచ్చు : ఎంతమంది అయినా.
ఆడే స్థలం : గదిలో గాని, ఆరుబయట గాని.
కావలసిన వస్తువులు : 15 వస్తువులు, పేపరు ప్లేట్లు, కర్చీఫ్‌లు.
ఆటగాళ్ల వయస్సు : ఏ వయసు వారైనా.
ఈ గేమ్‌కి మొదట 10 మంది 15 వస్తువులను రెండు చొప్పున తీసుకోవాలి. ఒక్కొక్క పేపర్ ప్లేట్‌లో ఒక్కొక్క వస్తువు చొప్పున పెట్టి టేబుల్ మీద పెట్టి ఎరేంజ్ చేసి వాటిమీద కర్చీఫ్ కప్పి ఉంచాలి. ఇప్పుడు అన్ని వస్తువులు రెండింటిలో ఒకటి ప్లేట్స్‌లో ఉన్నాయి. మిగిలిన వాటిని ఒక బౌల్‌లో వేసి ప్రక్కన చైర్‌లో పెట్టండి. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచి టేబుల్ దగ్గర నుంచోమనండి. వారిని కర్చీఫ్స్‌ని తీసి అన్ని వస్తువులను ఒక్కసారి చూపించి మళ్ళీ యధావిధిగా కర్చీఫ్స్ కప్పేయండి. వారు చేయవలసినది బౌల్‌లో ఒక వస్తువు తీసుకొని ఏ ప్లేటులో అయితే ఆ వస్తువు ఉందో గుర్తుంచుకొని ఆ ప్లేట్‌లో కర్చీఫ్ మీద పెట్టాలి. [ఇంకా... ]