పావన గంగాతీరంలో గంగకు ఉపనదులైన వరుణ - అసి నదుల మధ్య ఒద్దికగా అమరియున్న, అమరధామమే బెనారస్, లేక వారణాశి లేక కాశి. "అంతర్ నేత్రాలు తెరిచే వారణాశి 4000 సంవత్సరాల నాటిది". హైందవ సంస్కృతి ప్రచారంలో, వైజ్ఞానికంగాను, చారిత్రకంగాను అనాది నుండి పేరెన్నిక గన్న పట్టణం, కాశీ మహా పుణ్యక్షేత్రము. ఉత్తరప్రదశ్‌లో ఉన్నది. గంగానదికి ఆవలివైపు బెనారస్, వారణాశి అని, ఈవలివైపు కాశి అని పిలువబడుచున్నది. వరుణ ఘట్టమునకు వాసి ఘట్టమునకు మధ్యనున్నది గనుక, దానికి వారణాశి అని పేరు వచ్చినది.
కాశ్యాంతు మరణాన్ముక్తి అను ఆర్యోక్తి ఉన్నది. కాశీలో మరణిస్తే ముక్తి తప్పక లభిస్తుంది అని దీని అర్ధము. ఎటు చూచినా అయిదు క్రోసులున్న ఈ పట్టణంలో, ఏజీవి మరణించినా ఆ సమయమున కుడిచెవి పైకి ఉంటుంది. ఈశ్వరుడు తారక మంత్రోపదేశము చేసి మోక్షము ప్రసాదిస్తాడు. [ఇంకా... ]