Tuesday, March 31
పుణ్య క్షేత్రాలు - శ్రీరంగపట్నం
మైసూరుకు 12 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశం టిప్పుసుల్తాను ప్రాసాదంలో అత్యంత చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నది. కావేరినది రెండు పాయల మధ్యన ఉన్న దివిలాంటి దానిలో అమరియున్నది. మహిమాన్విత కావేరి పట్టణం చుట్టూ ప్రవహిస్తున్నది. టిప్పుసుల్తాన్ వారి కోట వేసవి మకాము యిక్కడ వున్నదంటారు. గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్లుగా పురాణ ప్రశస్తి వుంది. క్రీ.శ 894 సంవత్సరంలో శ్రీ తిరుమలనాయుడు రంగనాధుని ఆలయం నిర్మించి రంగపురంగా వెలయింపచేశాడు. శ్రీరంగపట్నం 1120లో విష్ణువర్ణనుని సోదరులు ఉదయాదిత్యుడు కట్టించాడని ప్రతీతి. 1495 శ్రీరంగపట్నం విజయనగర రాజుల ఆధీనంలోకి వచ్చి, 1610లో మైసూరు రాజు ఒడయారు చేసుకున్నారు. తరువాత మహమ్మదీయులైన హైదర్ ఆలీ, టిప్పు సుల్తానుల కాలంలో వారి ఆధీనంలో ఉండి తరువాత 1799 లో బ్రిటీషు వారి హస్తగతమయింది. ఇక్కడ మూఖ్యంగా చూడదగినవి- 'టిప్పుసుల్తాన్ వారి వేసవి విశ్రాంతి భవనం, చిత్రకళ అందంగా పొందుపరచబడి వుంది. హైదర్ ఆలీ, ఆయన్ భార్య సమాధులున్నాయి. [ఇంకా... ]