పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుకు 42 కిలోమీటర్ల దూరంలో ఉందీ దివ్యక్షేత్రం. విజయవాడ నుండి ఏలూరు బస్సులోగాని, రైలులోగాని వెళ్ళవచ్చును. మద్రాసు, హౌరా రైలు మార్గంలో ఏలూరు ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు మొదటి స్టాపింగు అవుతుంది. నిరంతరం ఏలూరుకు విజయవాడ నుండి నాన్ స్టాపు బస్సులు గలవు. ఏలూరు నుండి భీమడోలు, తడికలపూడి ద్వారా ద్వారకా తిరుమల చేరవచ్చును.
ఇక్కడ ఒక చిన్న గుట్ట మీద శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. గుట్ట కింద గ్రామాన్ని తిరుపతి అంటారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరునికి చెల్లించాలనుకున్న మొక్కుబడులు కూడా ఒక్కో సమయంలో అంతదూరం వెళ్ళలేని భక్తులు ఇక్కడనే స్వామివారికి మొక్కుబడులు తీర్చుకొంటూంటారు. భక్తులు విశేషంగా వస్తారు. దీనినే చిన్న తిరుపతి అని కూడా అంటుంటారు. ఇక్కడ వివాహ, ఉపనయనాది కార్యక్రమములు, అన్న ప్రాశనలు, వగైరాలు, తలనీలాల మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. [ఇంకా... ]