Tuesday, March 17
పుణ్య క్షేత్రాలు - హరిద్వార్
భారతదేశంలో అతి పవిత్రస్థలాల్లో ఒకటిగా పేర్కొనబడింది. శివాలిక్ పర్వత పాదాలవద్ద పావనగంగా కుడివైపు తీరంలో అమరియున్న పుణ్యస్థలం. సప్తమోక్షదాయక పురాణాల్లో ఒకటి. దీనినే మాయాపురి, గంగాద్వారం అనే నామంతరాలతో పిలుస్తారు. శైవులు హరద్వారమనీ, వైష్ణవులు హరిద్వారమనీ, వైష్ణవులు హరిద్వారమనీ, భక్తిమేర పిలుచుకొంటూ ఉంటారు. మొత్తం మీద హిందువులకు అతి పవిత్రస్థలం-ముఖ్య యాత్రాస్థలం. సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో గొప్ప సుందర నగరంగా ప్రశస్తిని పొందింది. మహామహుడైన కపిలస్థాన్ పురాతన ప్రసిద్ది. ఒకప్పుడు ఎంతో విశాలమై మైళ్ళ పొడవున వ్యాపించియున్న మహా పట్టణంగా కీర్తించబడి ఉన్నది. ఈ విషయ అబుల్‌ఫజల్ తన గ్రంధములో వ్రాసారు. ఈయన అక్బరు కాలంలో ఈ పట్టణ సందర్శనం చేశారు. [ఇంకా... ]