ఇటీవల కాలంలో పిల్లల్లో ఊబకాయ సమస్య బాగా కనిపిస్తోంది. మారిన ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి, శీతలపానీయాలు బాగా తీసుకవడం వంటివి లావెక్కడానికి ప్రధాన కారణాలు. భారీ శరీరం వల్ల పిల్లలు వారి వయసుకు మించి కనిపిస్తారు. ఆరోగ్యానికి కూడా ఊబకాయం మంచిది కాదు. పిల్లల్లోని ఈ భారీకాయ సమస్యని ఒక్కసారి తగ్గించడం సాధ్యమయ్యే విషయం కాదు. కింద పేర్కొన్న అంశాలను పరిగణనలో పెట్టుకుని, ఇచ్చిన వ్యాయామాలను క్రమం తప్పకుండా పిల్లల చేత చేయించాలి.
1. పిల్లలు తమ ఫాస్ట్‌ఫుడ్ జీవనశైలిని మార్చుకునేలా ప్రోత్సహించాలి. శారీరకంగా ఉస్తాహంగా ఉండేట్టు వారిని తీర్చిదిద్దాలి. ఆరోగ్యకరమైన అహారాన్ని వాళ్లకి అలవాటు చేయాలి.
2. టీవి ముందర గంటల తరబడి కూర్చోనివ్వద్దు. ఈ అలవాటు వల్లే పిల్లల్లో ఊబకాయ సమస్య ఎక్కువవుతోంది. [ఇంకా... ]