Wednesday, March 4

ఆధ్యాత్మికం - భక్తులను సదా రక్షించే శ్రీ సాయినాధుడు

ఈ భూమిపై ధర్మాచరణకు తీవ్ర విఘాతం కలిగినప్పుడు, ఆధర్మం అవధులు దాటి చెలరేగినప్పుడు, దుష్టశిక్షణ శిష్టరక్షణ, ధర్మసంస్థాపనలను తన సంకల్పంగా చేసుకొని ప్రతీయుగంలోను అవతరిస్తానని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో వివరించాడు. ఆప్రకారంగానే వివిధ యుగాలలో, వివిధ అవతారాలలో, రూపాలలో ఆ పరమాత్మ దివి నుండి భువికి తిరిగివచ్చి తన అవతార కార్యం చేసాడు. అట్లా అవతరించిన పుణ్యపురుషులు, సాధుసత్పురుషులలోకెల్లా అగ్రగణ్యుడు, మహిమాన్విత శక్తివంతుడు, రాజాధిరాజా, యోగులందరికీ సామ్రాట్ వంటివారు. మన సమర్ధ సద్గురువు శ్రీసాయినాధులు. ఈ పవిత్ర భారతావనిలో పంతొమ్మిదవ శతాబ్ధంలో అవతరించి, ఒక పాడుబడిన మశీదును తన నివాసంగా చేసుకోని అనేక లీలలను గావించి, లక్షలాది మందికి జ్ఞానమార్గం చూపించి వారికి చివరికంతా తోడు నీడగా నిలిచిన పరిశుద్ధ పరబ్రహ్మ అవతారం శ్రీసాయి. మనసా, వాచా, కర్మణా తనకు సర్వస్వం శరణాగతి ఒనరించిన భక్తుల లలాట లిఖితాన్ని సైతం తిరగ వ్రాసి వారికి ఇహపరాలను ప్రసాదించిన విశిష్ట గురుదేవులు శ్రీసాయినాధులు. అటువంటి శ్రీసాయి చేసిన కొన్ని లీలలను ఇప్పుడు స్మరించుకుందాం! [ఇంకా... ]