Thursday, February 19
పుణ్య క్షేత్రాలు - పెదకాకాని
కాకానిలో సాంబశివాలయము మహా మహిమాన్వితమై యున్నది. ఈ స్వామి వారి ప్రతిభ అనేక రకాలు. ప్రతి ఆదివారం భక్తులు తండోపతండాలుగా వచ్చి మొక్కుబడులు చెల్లించుకొంటూ ఉంటారు. ఇక్కడ సత్రాలున్నాయి. అన్ని వస్తువులూ దొరకుతాయి ప్రభలు, బండ్లు గట్టుకొనివచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. వివాహ ఉపనయనాదులు నిర్వహించుకుంటూ స్వామి దయకు పాత్రులవుతారు. వ్యాధిగ్రస్తులు, సంతానహీనులు అక్కడనే వుండి ఆలయంచుట్టూ ప్రదక్షిణలు చేసి వారికోర్కెలను సాఫల్యం చేసికొంటూ ఉంటారు. ఇక్కడకు దగ్గరలోనే నంబూరు స్టేషన్ కెదురుగా రేడియో బ్రాడ్ కాస్టింగ్ స్టేషను, హేమలతా టెక్స్‌టైల్సు మిల్లు ఉన్నాయి. [ఇంకా... ]