వంటలో సమయాన్ని, ఇంధనాన్ని, ఖర్చును ఆదాచేసే మైక్రోవవ్‌ను ఆధునిక సాధనంగా చెప్పవచ్చు. మైక్రోవేవ్ మీద వంట వండుకోవడమో, లేక మైక్రోవేవ్ మీద వంటను చేసుకుంటే బాగుండును అనుకోవడం తప్ప దాని గురించి మరేమీ తెలియకపోవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్ ప్రయోజనాలు, సాంకేతిక వివరాలు ఇవి.
మైక్రోవేవ్ ఓవెన్‌లో ముఖ్యంగా వాట్‌ల వ్యవస్థ, నియంత్రణ ప్యానెల్, పవర్ లెవల్స్ ఉంటాయి. 350 ఆపైన వాట్‌లను ఉపయోగించి వీటిని తయారుచేస్తారు. అయితే చాలా వరకు ప్రామాణికంగా 700 వాట్‌లను ఉపయోగిస్తారు. అలాగే చాలా వరకు టి.విల్లో వచ్చే వంట కార్యక్రమాలు, పత్రికలు, మ్యాగజైన్లలో రాసే ప్రత్యేక వంటకాలను ఎక్కువగా ఈ 700 వాట్‌ల ఓవెన్ లోనే ప్రయోగించి చేసి చూస్తారు. మార్కెట్‌లో 700 వాట్‌ల ఓవెన్‌ను కొన్నవారికి వంటల పుస్తకాన్ని బహుమతిగా కూడా ఇస్తుంటారు. ఎవరైనా 700 వాట్‌లకు పైన ఉన్న ఓవెన్ ఎంచుకోవడం దూరదృష్టితో చేసే పని. లేదా చాలా తక్కువ వంట చేసే వారు మాత్రం తమకు తగ్గ వ్యాట్‌తో ఓవెన్‌ను ఎంపికచేసుకోవచ్చు. [ఇంకా... ]